Thursday, August 26, 2010

స్పాం (SPAM) ఈమైల్స్ ఎక్కువగా ఎక్కడ నుండి వస్తున్నాయో తెలుసుకోండి

స్పాం ఈమైల్స్ ఎక్కువగా పంపబడే దేశాలలో భారతదేశం 2 వ స్థానం వహిస్తోందని, జూలై నెలలో ప్రపంచ వ్యాప్తంగా వచ్హిన జంక్ ఈమైల్స్ లో 12.55 శాతం భారతదేశం నుండి పంపబడ్డాయని ట్రెండ్ మైక్రో వారు జరిపిన ఒక స్టడీలో తెలిసింది.

స్పాం ఈమైల్స్ పంపబడే దేశాలలో అమెరికా మొదటి స్థానం వహిస్తూ "కింగ్ ఆఫ్ స్పాం" గా చెప్పబడుతోంది. జూలై నెలలో ప్రపంచ వ్యాప్తంగా వచ్హిన జంక్ ఈమైల్స్ లో 25 శాతం అమెరికా నుండి వచ్హినవేనట. 12 శాతం తో బ్రిజిల్ 3 వ స్థానం లో ఉన్నది.

గత 2 నెలలుగా స్పాం ఈమైల్స్ ఏ ఏ దేశాల నుండి వస్తున్నాయోనని చేసిన స్టడీలో అంతకు ముందులాగానే అమెరికా, ఇండియా మరియూ బ్రిజిల్ ముఖ్య స్థానాలు వహిస్తున్నాయని తెలుసుకున్నారు.

జూలై నెలలో భారతదేశం నుండి వచ్హిన స్పాం ఈమైల్స్ సంఖ్య అంతకు ముందు నెలల కంటే తక్కువుగా ఉన్నదట. కానీ అమెరికా మరియూ బ్రిజిల్ దేశాల నుండి పంపబడ్డ స్పాం ఈమైల్స్ సంఖ్య పెరిగిందట.

యూసర్ అకౌంట్ ఇన్ ఫర్మేషన్ మరియూ క్రెడిట్ కార్డ్ వివరాలను తెలుసుకునే స్పాం ఈమైల్స్ వలన సైబర్ క్రిమినల్స్ ఎక్కువ లాభం పొందుతున్నారట. అత్యధికంగా ప్రజలు వాడుతున్న సోషియల్ నెట్ వర్క్ సైట్లను, సెర్చ్ ఇంజెన్ లింక్ లనూ మరియూ రీ డైరెక్ట్ లింక్ లను సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా వాడుతున్నారని ట్రెండ్ మైక్రో భారతదేశ మేనేజర్ అమిత్ నాద్ గారు తెలిపేరు.

11.3 శాతం తో ఇంగ్లాండ్ 4 స్థానం, 8.66 శాతం తో జెర్మనీ 5 వ స్థానం వహిస్తున్నాయి.

సైబర్ నేరాలకు మాటి మాటికీ చైనా దేశాన్నే తప్పుపడుతున్నా, ఆ దేశం ఈ స్టడీ లిస్ట్ లో లేకపోవటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

సైబర్ క్రిమినల్స్ తమ క్రిమినల్ పనులకు వాడుకునే కంపెనీ పేర్లలో హ్చ్.ఎస్.బి.సి. బ్యాంక్ పేరు ఎక్కువగా ఉందట.

ఇకపోతే, 7.71 శాతం తో వియత్నాం 6 వ స్థానం, 6.71 శాతం తో ఫ్రాన్స్ దేశం 7 వ స్థానం, 6.09 శాతం తో కొరియా 8 వ స్థానం, 5.46 శాతం తో ఇటలీ 9 వ స్థానం మరియూ 5.13 శాతం తో రుమేనియా 10 వ స్థానం వహిస్తున్నాయి.

5 comments:

  1. ఈ విషయంలోనైనా అమెరికా తర్వాతి స్థానం మనదే ఐనందుకు సంతోషిద్దాం. స్పాం వలన నష్టాలు గురించి చెప్తారా. నాకూ ఎక్కువగా వస్తున్నాయి. మహీగ్రాఫిక్స్ మహేష్ గారిని కామెంట్లలో వచ్చే స్పాం కామెంట్లగురించి అడిగితే రెండు మూడుసార్లు ప్రివ్యూ చేసినా కామెంట్స్ అలా వస్తాయి. పర్వాలేదన్నారు. దీనిగురించి చెప్తారా?

    ReplyDelete
  2. కెక్యూబ్ గారికి,

    స్పాం ఈమైల్స్ రావడాన్ని పూర్తిగా నివారించలేరు. స్పాం ఈమైల్స్ ను ఓపెన్ చేయకుండా డిలేట్ చెసేయండి. ఫొరంస్ లో వచ్హే ఈమైల్స్ ను పట్టించుకోకండి. వాటినికూడా డిలేట్ చేసేయండి. ఇంతకంటే ఇంకో మంచి మార్గంలేదు.

    మీకోసం.

    ReplyDelete
  3. >> సైబర్ నేరాలకు మాటి మాటికీ చైనా దేశాన్నే తప్పుపడుతున్నా, ఆ దేశం ఈ స్టడీ లిస్ట్ లో లేకపోవటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

    China was on top of spamming countries before 2008. Even today, most of chinese Net space is blacklisted by email services.

    On similar lines, USA is on top because it owns great chunk of usable Net Space..

    ఇండియా నుంచి వొచ్చే స్పాం మెయిల్స్ చాల వరకు బోట్-నెట్ల నుంచి వోచేవే..
    Pirated Windows machines are major contributors. Many people in India do no patch their windows boxes with latest security updates..or even dont bother about viruses, trojans etc..Many infected computers are part of HUGE network called botnet...smallest of botnets would have around 10,000 computers..biggest span in millions...They ALL spam at a time...and the result is obvious :-)

    Also, just to add... 90% of emails are spam actually...but users never see most of it in their mail boxes...

    ReplyDelete
  4. చైతు గారికి,

    Thank you for providing such informative information.

    మీకోసం.

    ReplyDelete
  5. ధన్యవాదాలు సార్. నాకంతగా వీటిపై పరిజ్నాణం లేదు. ఓన్లీ టైపింగ్ ఇన్ బ్లాగ్ మాత్రమే తెలుసు..

    ReplyDelete