Saturday, August 28, 2010

చిరంజీవి కాంగ్రెస్ తో చేతులు కలపటానికి సిద్దమౌతున్నారా?

చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ, రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే సమయం ఎంతో దూరం లేదని తెలుస్తోంది.

కడప ఎం.పి జగన్మోహన్ రెడ్డీ ఏ కారణం వలనైనా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే, ప్రజా రాజ్యం పార్టీ ని ప్రభుత్వంలో కలుపుకోవటానికి కాంగ్రెస్ సిద్దంగా ఉందని చెబుతున్నారు.

ముఖ్య మంత్రి రోశయ్య గారు రాష్ట్ర మంత్రి వర్గాన్ని ఈ సారి విస్తరణ చేసేటప్పుడు ప్రజా రాజ్యం పార్టీని మంత్రి వర్గంలో కలుపుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వచ్హే నెల, అంటే సెప్టంబర్ నెలలో మంత్రివర్గ విస్తారణ జరుగుతుందని చెబుతున్నారు.

ప్రజా రాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కలవడానికి తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదని ఇంతకు ముందు పలు సార్లు ఏదో ఒక రకంగా తెలియపరిచేరు.

గురువారం నాడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డి.శ్రీనివాస్ గారు చిరంజీవి గారిని పొగడుతూ మాట్లాడిన మాటలు ప్రజా రాజ్యం పార్టీ ని కాంగ్రెస్ పార్టీ కి మరింత దగ్గర చేయడానికే నని అనుకుంటున్నారు.

ప్రజా రాజ్యం పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కి మద్దత్తు నిస్తే, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర శాసన సభలో కావలసిన మెజారటీ లభిస్తుంది. ప్రజా రాజ్యం పార్టీ మద్దత్తు తీసుకోవటం లో తప్పేమీలేదు.... ఈ విషయంగా చిరంజీవి గారితో మాట్లాడుతున్నామని రాష్ట్ర పి.సి.సి. చీఫ్ తెలిపేరు.

1 comment:

  1. ఇంకా అనుమానమా.జేండా పీకేసి కాంగ్రెస్ లోకి దూకడానికి చిరంజీవి, కలుపుకోవడానికి వీళ్ళు రెడీ.ముహూర్తం కుదరాల్సి ఉంది.అంతే.

    ReplyDelete