Friday, August 27, 2010

సినిమాలు నేరాలకు దారి చూపుతున్నాయనే మాట ఆ రోజుది...సినిమా వారినే నేరాలు చేయిస్తోందనేది ఈ రోజు మాట

విధి తో ఆడుకోవటమంటే సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టటమే. ఏ పరిశ్రమలో నైనా కష్టపడితే పైకి వస్తామనే నమ్మకం ఉంటుంది. కానీ సినీ పరిశ్రమలో మాత్రం ఎంత కష్టపడ్డా అద్రుష్టం లేకపోతే పైకి రాలేరు. ఇది నిజమని ఈ మధ్య మరియూ ఇంతకు ముందు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, విధితో పోరాడలేక ఓడిపోయిన సినీ పరిశ్రమలోని కొందరు నేరాలు చేసి పట్టుబడటం మరోసారి నిరూపించింది. ఈ పరిశ్రమ మీద మోజు, ఆశ కలిగియున్న వారికి ఇది కనువిప్పు కావాలి.

తెలుగు సినీ పరిశ్రమలో 1800 మంది నిర్మాతలుగా రిజిస్టర్ చేసుకోనుంటే అందులో కేవలం 100 మంది మాత్రమే నిర్మాతలుగా రానించబడ్డారని ఒక ప్రముక దిన పత్రిక తెలిపింది. అంటే ఈ పరిశ్రమలోకి అడుగు పెట్టిన వారిలో 5 శాతం మాత్రమే విజయం సాధించేరు. బహుశ మరే పరిశ్రమలోనూ విజయం సాధించిన వారి శాతం ఇంత తక్కువగా ఉండదు.

సినీ పరిశ్రమకు చెందిన వారు నేరాలకు దిగుతున్నారని ఈ మధ్య ఒక నేరంలో ఖైదు చేయబడ్డ నిర్మాత జువ్వల రాజు, నటీమణులు సైరా భానూ మరియూ జ్యోతి సినీ పరిశ్రమలో పైకి రాలేకపోవడమే వారు నేరం చేయడానికి కారణమని చెబుతున్నారు.

ఇంతకు ముందు మత్తు పదార్ధాలు అమ్ముతున్నారని "యువత" సినిమా నిర్మాత హేమంత్ రామక్రిష్ణ మరియూ నిర్మాత కె.వి. రావ్ పట్టుబడ్డారు. "జల్లు" సినిమా డైరెక్టర్ రగునాద్ రెడ్డి దొంగతనం నేరం క్రింద పట్టుబడ్డారు. ఈయన దొంగతనం చేసి తప్పించుకునేందుకు బిల్డింగ్ పై నుండి క్రిందకు దూకేరని, అలా దూకినందు వలన ఆయన కాలు విరిగిందని చెప్పేరు.

ఇలాంటి కధలు ఎన్నో ఉన్నాయి.ఒక నిర్మాత (ఈయన ఒక పార్టీ ఎం.ఎల్.ఏ కూడా) హుసేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మరి కొందరు నిర్మాతలు అప్పులకు భయపడి పరారీలో ఉన్నారట.

పాత రోజుల్లో లాగా లక్షలతో సినిమాలు తీయలేరు. దానికి ఇప్పుడు కోట్లు కావలసి యుంది. ఇది పూర్తిగా అర్ధం చేసుకోకుండా తమ దగ్గరున్న డబ్బే కాకుండా అప్పులు కూడా చేసి సినిమాలు తీసి అప్పుల పాలవుతున్నారు. సినిమాలు ఆడక (కొన్ని సినిమాలు రిలీజ్ అవక) సినీ పరిశ్రమలోకి దిగిన నటులూ, నటీమణులు మరియూ సాంకేతిక వర్గం వారు దురద్రుష్ట వంతులవుతున్నారు. రెండు, మూడు సినిమాలు విజయవంతమైనా 4 వ సినిమా ఆడకపోతే విపరీతం గా నష్టపోతున్నారు.

"కొత్తగా పరిశ్రమకు వచ్హిన వారు ఎక్కువగా నష్టపోతున్నారు...విజయం సాధించ లేని వీరిలో కొందరు నేరాలకు దిగుతున్నారు" అని "సెల్" సినిమాను 50 లక్షలు పెట్టి తీసి 50 శాతం నష్టపోయిన బ్యాంక్ ఉద్యోగి వెంకటనారాయణ తెలిపేరు........బయట పడిన వారు చాలా తక్కువ .........బయట పడని వారు చాలా ఎక్కువట.

1 comment:

  1. బ్యాంక్ ఉద్యోగి సినిమా తీశాడంటున్నారు కదా. ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగులు సైడ్ బిజినెస్ లు చెయ్యడానికి ఒప్పుకోవు. ప్రైవేట్ సంస్థలు ఒప్పుకున్నా సెలవు పెట్టి సైడ్ బిజినెస్ లు చెయ్యడానికి ఒప్పుకోవు. సినిమా నిర్మాతలు సెట్టింగ్స్ లాంటివి చూడడానికి సెలవులు పెట్టే పని ఉంటుంది. ఆ సెట్టింగ్స్ దర్శకుడు చేసినా నిర్మాత వచ్చి చూస్తాడు. సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. సినిమా థియేటర్ల నిర్వాహణ సరిగా ఉందా అంటే అదీ లేదు. టికెట్ల ధరలు పెంచెయ్యడం, టాయిలెట్లు సరిగా శుభ్రం చెయ్యకపోవడం, ప్రముఖ హీరోల సినిమాలు ఆడితే టికెట్లని బ్లాక్ లోకి విడుదల చెయ్యడం లాంటివి. థియేటర్లలోని టాయిలెట్లు వాడితే లేని రోగాలు వస్తాయని భయం. డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్ కి వెళ్లి లేని రోగాలు తెచ్చుకోవాలా, ఓ పైరసీ సిడి కొని ఇంట్లో సినిమా చూసుకుంటే పోలేదా అనుకుంటారు. నేను పైరసీ సిడిలు కొనలేదు కానీ పాత సినిమాల సిడిలు పెట్టి ఇంటిలో చూసుకుంటాను.

    ReplyDelete