Tuesday, August 31, 2010

57 అంతస్తుల భవనాన్ని ఎటువంటి భద్రత లేకుండా ఎక్కిన నిజమైన స్పైడర్ మాన్ (SPIDERMAN).....వీడియో

48 సంవత్సరాల వయసున్న, ఫ్రాన్స్ దేశానికి చెందిన స్కైస్క్రాపర్ ఆస్ట్రేలియా దేశంలో ఉన్న సిడ్నీ నగరంలోని 57 అంతస్తుల బిల్డింగ్ ను ఎటువంటి భద్రత లేకుండా స్పైడర్ మాన్ లాగా ఎక్కేరు.

ఆలియన్ రాబర్ట్ అన్న పేరున్న ఈయన్ను స్పైడర్ మాన్ అనే పిలుస్తారట. ఈ బిల్డింగ్ ను 20 నిమిషాలలో ఎక్కిన ఈయన్ను పై అంతస్తు చేరుకున్నప్పుడు పోలీసులు ఖైదు చేసేరు.

క్రింద నుండి ఈయన బిల్డింగ్ ఎక్కుతుంటే ప్రజలు భయంతోనూ, ఆశ్చర్యంతోనూ కళ్ళార్పకుండా చూసేరట....ఈయన ఇంతకు ముందు ఇటువంటి సాహసాలు చాలా సార్లు చేసేరట.గంగా నది స్నానం వ్యాధులను తగ్గిస్తుంది...ముఖ్యంగా డయబిటీస్ (DIABETIS) పేషెంట్ల కు వచ్హే ఇన్ ఫెక్షన్ లకు మంచిది

గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు పోయి పుణ్యం వస్తుందని అంటారు. ఇప్పుడు ఒక భారతీయ శాస్త్రవేత్త గంగా నది నీరు డయబిటీస్ వ్యాధి ఉన్న వారికి వచ్హే ఇన్ ఫెక్షన్లు ( INFECTION) తగ్గిస్తుందని సైంటిఫికల్ గా నిరూపించేరు.

గంగా నది నీటిలో "బాక్టీరియో ఫేజ్" (BACTERIOPHAGES) అనే ఒక వైరస్ ఉన్నదట. ఈ వైరస్, వ్యాధులను కలిగించే మిగిలిన బాక్టీరియాలను, వాటి లోనికి వెళ్ళి వాటిని చంపుతుందట.

డయబిటీస్ వ్యాధి ఉన్న వారికి బాక్టీరియాల వలన వచ్హే ఇన్ ఫెక్షన్ లను తగ్గించటం కష్టమౌతోంది. ఈ ఇన్ ఫెక్షన్ లను తగ్గించటానికి మామూలు యాన్ టీ-బయాటిక్స్ పూర్తిగా పనిచేయటం లేదు. కారణం, డయబిటిక్స్ పేషెంట్లలో ఇన్ ఫెక్టివ్ బాక్టీరియాలు యాన్ టీ-బయాటిక్స్ ను ఎదుర్కోనే శక్తిని పొందుతున్నాయి. యాన్ టీ-బయాటిక్స్ ను ఎదుర్కునే ఈ బాక్టీరియాలను కూడా చంప గలిగే శక్తి బాక్టీరియో ఫేజ్ కు ఉన్నదని తన పరిశోధనలలో తెలుసుకున్నారు భారతీయ శాస్త్రవేత్త రాజూ సునగర్.

గుల్బర్గా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పూర్తి చేసుకుని, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో శాస్త్రవేత్త గా ఉంటున్న రాజూ సునగర్ తన 4 ఏళ్ళ పరిశోధనలో బాక్టీరియో ఫేజ్ వైద్యంతో శక్తి కలిగిన, యాన్ టీ-బయాటిక్స్ ను ఎదుర్కొన గలిగిన స్టఫిలో కోకస్ అవురస్ (STAPHYLOCOCCUS AUREUS) బాక్టీరియాను అంతంచేయవచ్హని నిరూపించేరు.

ఈయన చేసిన పరిశోధన "బాక్టీరియో ఫేజ్ తెరాఫీ ఫర్ స్టఫిలో కోకస్ అవురస్ ఇన్ ఫెక్షన్ ఇన్ డయబిటిక్ మైస్ మోడల్"(Bacteriophage Therapy for Staphylococcus Aureus Infections in Daibetic Mice Model) ను అంతర్జాతీయ మైక్రో బయాలజీ రీసెర్చ్ జర్నల్ (International Journal Research in Microbiology) అంగీకరించింది.

ఒక్క డయబిటీస్ పేషెంట్లలోనే కాకుండా, మరే ఇతర పేషెంట్లలో నైనా దీర్గ కాల ఇన్ ఫెక్షన్ లను (యాన్ టీ-బయాటిక్ రెసిస్టన్స్ బాక్టిరియాను) ఈ బాక్టీరియో ఫేజ్ ఒక కోర్స్ ట్రీట్మెంట్ తో వైద్యం చేసి తగ్గించవచ్హని ఆయన తెలిపేరు.

గంగా నది నీటిలో బాక్టీరియో ఫేజ్ అనే వైరస్ ఉండటం వలనే ఆ నది నీరు పవిత్రతను కలిగి ఉన్నదని ఇది వరకే తెలుసుకున్నారు. ఇప్పుడు దానిని సైంటిఫికల్ గా నిరూపించేరు డా.రాజూ సునగర్.

Monday, August 30, 2010

మ్యాచ్ ఫిక్సింగ్...పాకిస్థాన్ క్రికెటర్లు డబ్బు తీసుకుంటున్న వీడియో

క్రికెట్ క్రీడను జూదం క్రీడగా మార్చాలనుకున్న పాకిస్థాన్ క్రికెటర్లు రెడ్ హాండడ్ గా సాక్చ్యాధారాలతో పట్టుబడ్డారు. ఈ సారి ఐ.సి.సి బరిలోకి దిగి పాకిస్థాన్ ను అంతర్జాతీయ క్రికెట్ రంగానికి దూరంగా ఉంచుతుందని అనుకుంటున్నారు.

పాకిస్థాన్ క్రికెటర్ల ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆ దేశ ప్రజలనూ, మాజీ పాకిస్థాన్ క్రికెటర్లనూ షాక్ లో పడేసింది.


జీతభత్యాలు 300 శాతం పెరిగినా కోటీశ్వరులైన ఎం.పి లు ఆనందంగా లేరుట

తమ ఆస్తుల వివరాలలో చాలా మంది ఎం.పి.లు తమకు కోట్ల ఆస్తి ఉన్నదని తామే తెలియపరిచినా కేంద్ర ప్రభుత్వం వారికి 300 శాతం జీతం మరియూ దారాళంగా భత్యాలు పెంచింది. అయినా వారు ఆనందంగా లేరుట. తాము ప్రజా ప్రతినిధులుగా చేస్తున్న పనులకు ఇప్పుడు పెంచిన జీతం చాలా తక్కువగా ఉన్నదని చెబుతున్నారుట.

ఇప్పటి లోక్ సభలో మొత్తమున్న 543 ఎం.పి లలో 315 మంది కోటీశ్వరులని నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) మరియూ ఏ.డి.ఆర్ (ADR) తమ రిపోర్ట్ లో తెలిపింది. ఈ 315 మంది కోటీశ్వరులలో 275 మంది మగ ఎం.పి.లు మిగిలిన 40 ఎం.పి. లు ఆడవారు.

2004 లోక్ సభ లో 156 మంది కోటీశ్వర ఎం.పి లు ఉంటే, ఇప్పుడు 315 మంది ఉన్నారు. అలాగే 2004 లోక్ సభ ఎం.పి ల యావరేజ్ ఆస్తి 0.86 కోట్లు అయితే ఇప్పటి లోక్ సభ ఎం.పి ల యావరేజ్ ఆస్తి 5.33 కోట్లు.

2004 లోనూ 2009 లోనూ లోక్ సభ కు ఎన్నికైన ఎం.పి ల ఆస్తి 289 శాతం గా పెరిగింది.

183 మంది యున్న రాజ్య సభ ఎం.పీ లలో 54 శాతం ఎం.పీ లు మిలియనర్స్ అని NEW-ADR తెలిపింది.

ఎం.పి ల పెన్షెన్ ను నెలకు 8,000 నుండి 20,000 గా పెంచేరు. ఈ పెరిగిన పెన్షన్ పాత ఎం.పి లకు కూడా వర్తిస్తుంది. 15 వ లోక్ సభ మొదలు పెట్టినప్పటినుండి ఈ పెంచిన పెన్షెన్ ఇస్తారు కాబట్టి 15 వ లోక్ సభ మొదలుపెట్టినప్పటి నుండి ఇవ్వవలసిన డబ్బు 118 కోట్లు గా లెక్కవేసేరు.

లెఫ్ట్ పార్టీ లు తప్ప మిగిలిన పార్టీ లు ఎవరూ ఎం.పి ల జీతభత్యాల పెంపుదలని వ్యతిరేకించలేదు.

ఇన్ స్యూరన్స్ కు తగినట్లు డాక్టర్లు బిల్లులు వేస్తున్నారా? అవసరం లేక పోయినా టెస్ట్ లు చేస్తున్నారా?

ఇన్ స్యూరన్స్ చేసుకోవడం చాలా మంచిదని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న వైద్యాలకు కూడా వేలు ఖర్చు పెట్టవలసి వస్తున్నది. కానీ చాలా మంది పేషెంట్లు చెప్పటమేమిటంటే మనకున్న ఇన్ స్యూరన్స్ కు తగినట్లు హాస్పిటల్ వారు అవసరమున్నా లేక పోయినా టెస్టు లూ, శస్త్ర చికిత్సలూ చేస్తున్నారని చెబుతున్నారు.

ఈ మధ్య ఒక రిటైర్డ్ ఆవిడ మొకాళ్ల నొప్పులతో భాద పడుతూ ఒక హాస్పిటల్ కు వెళ్ళిందట. ఆ హాస్పిటల్ డాక్టర్లు ఆవిడ్ని అడిగిన మొదటి ప్రశ్న "మీకు ఇన్ స్యూరన్స్ ఉన్నదా?". ఆమె ఉన్నదని చెప్పిన వెంటనే అమెతో "మీరు ఒక శస్త్ర చికిత్స చేసుకోవాలి...దానికి 1 లక్ష రూపాయలు కర్చౌతుంది" అన్నారట. ఆలోచించుకుని వస్తానన్న ఆవిడ మరుసటి రోజు మరో డాక్టర్ ను కలిసిందట. "దీనికి శస్త్ర చికిత్స అవసరం లేదు. మందులు వాడితే చాలు" అన్నారట.

మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న ఒకతను కడుపునొప్పితో హాస్పిటల్ కు వెడితే "ఎండో స్కోపీ" చేయాలని చెప్పేరట. అతను వేరే డాక్టర్ ను కలిస్తే ఆయన అరుగుదలకి మందులిచ్హేరట. ఆ మందులు వాడిన అతను ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటున్నాడట.

హాస్పిటల్ కు వెడితే అడిగే మొదటి ప్రశ్న "మీకు ఇన్ స్యూరన్స్ ఉన్నదా...మీరు ఎక్కడ పనిచేస్తున్నారు". ఈ రెండింటినీ ఆధారం చేసుకుని దానికి తగినట్లు వైద్యం చేస్తున్నారు అని చాలా మంది చెబుతున్నారు.

"మా నాన్న గారికి అంజియోప్లాస్టీ చేయవలసి వచ్హింది. ఒక పెద్ద హాస్పిటల్ కు తీసుకు వెళ్లేను. మాకు ఇన్ స్యూరన్స్ ఉన్నదని తెలుసుకుని ఖరీదైన ప్యాకేజ్ తీసుకోమన్నారు. ఆ ఇన్ స్యూరన్స్ డబ్బును తీసుకోవటానికి ఆంజియోప్లాస్టీ అయిన తరువాత ఆయనకు చాలా టెస్ట్ లు చేసేరు. "ఆపరేషన్ తరువాత ఈ టెస్ట్ లు అవసరంలేదు. కానీ మీరు తీసుకున్న ప్యాకేజ్ లో ఇవన్ని ఉన్నాయి" అని అక్కడున్న మరో డాక్టర్ చెప్పేరు" అని ఐ.టీ కంపెనీలో పనిచేసే మరొకతను చెప్పేరు.

"జ్వరం గా ఉన్నదని ఒక హాస్పిటల్ కు వెళ్లేను. నా బ్లడ్ లో ప్లాట్లెట్ కౌంట్ తక్కువగా ఉన్నదని, నాకు డెంగ్ జ్వరమని చెప్పి హాస్పిటల్లో చేర్చుకున్నారు. కానీ ఆ రోజంతా ఏ డాక్టరూ నన్ను చూడలేదు. నేను మరుసటి రోజు మరో డాక్టర్ ను కలిసేను. ఆయన నాకు వైరల్ ఫీవర్ అని చెప్పేరు" మరో పేషంట్ తెలిపేరు.

వీరు చెప్పిన దానిని ఒక హాస్పిటల్ డాక్టర్ ఖండించేరు. "మాకు పేషంట్ లు చాలా ముఖ్యం. హాస్పిటల్లో అడ్మిట్ చేసుకునే ముందు ఇన్ స్యూరన్సా....డబ్బ అని అడగటం మాకు అలవాటు. అంతే గానీ మేము ఇన్ స్యూరన్స్ కి తగినట్లు వైద్యం చేస్తున్నామని అనడంలో అర్ధంలేదు" అన్నారు.

"డాక్టర్లు అలా ఎప్పుడూ చేయరు. ఎందుకంటే వారు పేషెంట్లకు చేసే అన్ని చికిత్సలకూ రిపోర్ట్లు ఉంటాయి. ఇన్ స్యూరన్స్ కంపెనీ వారు అన్ని విధాలా మా బిల్లులను, చికిత్స రిపోర్ట్ లనూ తనిఖీ చేస్తారు" అని మరో హాస్పిటల్ చీఫ్ డాక్టర్ చెప్పేరు.

ఏది నిజం అనే సమస్యలో ఉన్నారు పేషంట్లు.

Sunday, August 29, 2010

Saturday, August 28, 2010

డిజిటల్ డ్రగ్స్ (i-dosing) కు అలవాటుపడుతున్న యువత

ఈ రోజుల్లో చాలామంది మానసిక ఉల్లాసం కోసం మూడ్ ఆల్టర్ డ్రగ్స్ ను చట్ట విరుద్దంగానో లేక డాక్టర్ల సలహామేరనో వాడుతున్నారు. కానీ ఒక కొత్త ధోరణి వలన ఈ పరిస్తితి మారేటట్లు కనబడుతోంది. ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటు వంటి యువతను ఆకట్టుకుని, లొంగదీసుకునే ఐ-డోసింగ్ (i-dosing) అనే సంగీతం ప్రశిద్దికెక్కుతోంది. ఈ సంగీతాన్ని డిజిటల్ డ్రుగ్ లేక సైకో ఆక్టివ్ సౌండ్స్ (డిజిటల్ గా మార్పు చేయబడ్డ సంగీతం) అంటారు. ఈ డిజిటల్ డ్రగ్స్ వింటే అది వినే వారిలో బ్రైన్ వేవ్స్ ను మార్చి వారికి ఉల్లాసం కలుగజేస్తుందట.

ఐ-డోసింగ్ వాడుతున్నవారు, ఈ సంగీతం వింటుంటే చాలా ఆనందం కలిగిస్తోందని, మత్తుమందు మాత్రల కన్నా మరియూ పిల్చే మత్తుమందుల కన్నా ఇది ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోందని చెబుతున్నారు.

విదేశాలలో ఉన్న యువతీ యువకులు ఇప్పటికే ఐ-డోసింగ్ కు అలవాటు పడ్డారుట. ఈ సోనిక్ బ్రైన్ వేవ్ ఎంటర్ టైన్ మెంట్ ఎప్పుడు భారతదేశం వస్తుందా అని ఇక్కడి యువత ఆత్రుతతో ఎదురుచూస్తున్నారట.

"నేను మొట్టమొదట ఈ సైకో ఆక్టివ్ శబ్ధాలను ఒక స్నేహితుని మూలంగా తెలుసుకున్నాను. ఆ స్నేహితుడు ఒక రీసెర్చ్ సైంటిస్ట్. ఐ-డోసింగ్ ఇంకా భారతదేశానికి రాలేదు. సైకో ఆక్టివ్ శబ్ధాలను బైనెరల్ బీట్స్ తో అమరుస్తున్నారు. దీని మీద అమెరికాలోనూ, ఆస్త్రేలియా లోనూ రీసెర్చ్ జరుగుతోంది. అసలు ఈ శబ్ధాలను స్లీప్ సైకిల్ ప్రాబ్లెంస్ మరియూ లెర్నింగ్ డిసబిలిటీ ఉన్నవారికోసం ఒక వైద్య మందుగా రూపొందించేరు...కానీ ఈ శబ్ధాలను(సంగీతాన్ని) కంప్యూటర్ల మూలంగానూ, ఐ-పోడ్ ల మూలంగానూ ప్రజలు వింటున్నారు" అని ఒక డాక్టర్ చెప్పేరు.

"భారతదేశం అద్యాత్మికతను నమ్మే దేశం. ట్రాన్స్ మూలంగానూ, సంగీతం మూలం గానూ ఒకరికి రిలాక్సేషన్ దొరుకుతోందంటే సంగీత శబ్ధాలను మార్పుచేసి వస్తున్న ఐ-డోసింగ్ ను భారతీయులు ఖచ్హితంగా ఆహ్వానిస్తారు...కానీ ఇది ఏ మోతాదులో వాడుకోవాలో తెలిపినా ఈ ఐ-డోసింగ్ ను మానసిక ఉల్లసం కోసం వాడుకునే వారు ఎక్కువౌతారు" ఒక సైకాలజిస్ట్ తెలిపేరు.

"ఈ ఐ-డోసింగ్ సంగీతాన్ని నేను విన్నాను.ఇది సైకీ డెలిక్ సంగీతం లాగా ఉన్నది. ఇది వింటే రిలాక్సేషన్ దొరుకుతుంది" అన్నారు....ఐ-డోసింగ్ మానసిక వ్యాధులకు మందుగా వాడాలి కదా, మరి ఈ ఐ-డోసింగ్ ను తప్పు గా ఉపయోగించరా? అని అడిగినప్పుడు "వాడతారు. డబ్బుకోసం దీనిని వ్యాపారంగా మారుస్తారు.నైట్ క్లబ్ లలోనూ, పార్టీలలోనూ వాడే అవకాసం ఉంది. దీనిని వ్యసనాలకు వాడకుండా అరికట్టాలి" అన్నారు.

"మెదడులో ఉన్న ఆల్ఫా, బీటా, గమ్మా, మరియూ సీటా తరంగాలు మారడం వలన మనుష్యులలో మానసిక ఒత్తిడి కలుగుతుంది. ఈ ఐ-డోసింగ్ సంగీత శబ్ధాలు ఆ తరంగాల లో మార్పు తీసుకు వస్తుంది. అందువలన మనిషిలో ఒత్తిడి తగ్గి ప్రసాంతత ఏర్పడుతుంది" అని మరో సైకాలజిస్ట్ తెలిపేరు.

అంతర్జాలం లో అప్లోడ్ చెయ గలిగిన ఈ ఐ-డోసింగ్ సంగీతాన్ని తప్పుగా వాడుకోవటాన్ని అరికట్టాలంటే, ఈ సంగీతాన్ని అందిచ దలుచుకున్న వెబ్ సైట్లకు కట్టుదిట్టాలు పెట్టాలి.

చిరంజీవి కాంగ్రెస్ తో చేతులు కలపటానికి సిద్దమౌతున్నారా?

చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ, రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే సమయం ఎంతో దూరం లేదని తెలుస్తోంది.

కడప ఎం.పి జగన్మోహన్ రెడ్డీ ఏ కారణం వలనైనా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే, ప్రజా రాజ్యం పార్టీ ని ప్రభుత్వంలో కలుపుకోవటానికి కాంగ్రెస్ సిద్దంగా ఉందని చెబుతున్నారు.

ముఖ్య మంత్రి రోశయ్య గారు రాష్ట్ర మంత్రి వర్గాన్ని ఈ సారి విస్తరణ చేసేటప్పుడు ప్రజా రాజ్యం పార్టీని మంత్రి వర్గంలో కలుపుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వచ్హే నెల, అంటే సెప్టంబర్ నెలలో మంత్రివర్గ విస్తారణ జరుగుతుందని చెబుతున్నారు.

ప్రజా రాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కలవడానికి తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదని ఇంతకు ముందు పలు సార్లు ఏదో ఒక రకంగా తెలియపరిచేరు.

గురువారం నాడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డి.శ్రీనివాస్ గారు చిరంజీవి గారిని పొగడుతూ మాట్లాడిన మాటలు ప్రజా రాజ్యం పార్టీ ని కాంగ్రెస్ పార్టీ కి మరింత దగ్గర చేయడానికే నని అనుకుంటున్నారు.

ప్రజా రాజ్యం పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కి మద్దత్తు నిస్తే, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర శాసన సభలో కావలసిన మెజారటీ లభిస్తుంది. ప్రజా రాజ్యం పార్టీ మద్దత్తు తీసుకోవటం లో తప్పేమీలేదు.... ఈ విషయంగా చిరంజీవి గారితో మాట్లాడుతున్నామని రాష్ట్ర పి.సి.సి. చీఫ్ తెలిపేరు.

Friday, August 27, 2010

సినిమాలు నేరాలకు దారి చూపుతున్నాయనే మాట ఆ రోజుది...సినిమా వారినే నేరాలు చేయిస్తోందనేది ఈ రోజు మాట

విధి తో ఆడుకోవటమంటే సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టటమే. ఏ పరిశ్రమలో నైనా కష్టపడితే పైకి వస్తామనే నమ్మకం ఉంటుంది. కానీ సినీ పరిశ్రమలో మాత్రం ఎంత కష్టపడ్డా అద్రుష్టం లేకపోతే పైకి రాలేరు. ఇది నిజమని ఈ మధ్య మరియూ ఇంతకు ముందు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, విధితో పోరాడలేక ఓడిపోయిన సినీ పరిశ్రమలోని కొందరు నేరాలు చేసి పట్టుబడటం మరోసారి నిరూపించింది. ఈ పరిశ్రమ మీద మోజు, ఆశ కలిగియున్న వారికి ఇది కనువిప్పు కావాలి.

తెలుగు సినీ పరిశ్రమలో 1800 మంది నిర్మాతలుగా రిజిస్టర్ చేసుకోనుంటే అందులో కేవలం 100 మంది మాత్రమే నిర్మాతలుగా రానించబడ్డారని ఒక ప్రముక దిన పత్రిక తెలిపింది. అంటే ఈ పరిశ్రమలోకి అడుగు పెట్టిన వారిలో 5 శాతం మాత్రమే విజయం సాధించేరు. బహుశ మరే పరిశ్రమలోనూ విజయం సాధించిన వారి శాతం ఇంత తక్కువగా ఉండదు.

సినీ పరిశ్రమకు చెందిన వారు నేరాలకు దిగుతున్నారని ఈ మధ్య ఒక నేరంలో ఖైదు చేయబడ్డ నిర్మాత జువ్వల రాజు, నటీమణులు సైరా భానూ మరియూ జ్యోతి సినీ పరిశ్రమలో పైకి రాలేకపోవడమే వారు నేరం చేయడానికి కారణమని చెబుతున్నారు.

ఇంతకు ముందు మత్తు పదార్ధాలు అమ్ముతున్నారని "యువత" సినిమా నిర్మాత హేమంత్ రామక్రిష్ణ మరియూ నిర్మాత కె.వి. రావ్ పట్టుబడ్డారు. "జల్లు" సినిమా డైరెక్టర్ రగునాద్ రెడ్డి దొంగతనం నేరం క్రింద పట్టుబడ్డారు. ఈయన దొంగతనం చేసి తప్పించుకునేందుకు బిల్డింగ్ పై నుండి క్రిందకు దూకేరని, అలా దూకినందు వలన ఆయన కాలు విరిగిందని చెప్పేరు.

ఇలాంటి కధలు ఎన్నో ఉన్నాయి.ఒక నిర్మాత (ఈయన ఒక పార్టీ ఎం.ఎల్.ఏ కూడా) హుసేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మరి కొందరు నిర్మాతలు అప్పులకు భయపడి పరారీలో ఉన్నారట.

పాత రోజుల్లో లాగా లక్షలతో సినిమాలు తీయలేరు. దానికి ఇప్పుడు కోట్లు కావలసి యుంది. ఇది పూర్తిగా అర్ధం చేసుకోకుండా తమ దగ్గరున్న డబ్బే కాకుండా అప్పులు కూడా చేసి సినిమాలు తీసి అప్పుల పాలవుతున్నారు. సినిమాలు ఆడక (కొన్ని సినిమాలు రిలీజ్ అవక) సినీ పరిశ్రమలోకి దిగిన నటులూ, నటీమణులు మరియూ సాంకేతిక వర్గం వారు దురద్రుష్ట వంతులవుతున్నారు. రెండు, మూడు సినిమాలు విజయవంతమైనా 4 వ సినిమా ఆడకపోతే విపరీతం గా నష్టపోతున్నారు.

"కొత్తగా పరిశ్రమకు వచ్హిన వారు ఎక్కువగా నష్టపోతున్నారు...విజయం సాధించ లేని వీరిలో కొందరు నేరాలకు దిగుతున్నారు" అని "సెల్" సినిమాను 50 లక్షలు పెట్టి తీసి 50 శాతం నష్టపోయిన బ్యాంక్ ఉద్యోగి వెంకటనారాయణ తెలిపేరు........బయట పడిన వారు చాలా తక్కువ .........బయట పడని వారు చాలా ఎక్కువట.

Thursday, August 26, 2010

"రియో డి జనేరియో" (RIO DE JANERIO) లో 2016 ఒలింపిక్స్ కోసం కట్ట దలుచుకున్న ఒలింపిక్ టవర్ యొక్క అద్భుత ఫొటోలు………ENGINEERING EXCELLENCEఫొటోలొ కనబడుతున్న నిటారైన బిల్డింగ్ ను కోటన్ డుబా (COTONDUBA) దీవి లో కట్టబోతారట.

ఇది ఒలింపిక్ క్రీడలను పరిశీలించడానికే కాకుండా విమానాలలోనూ, ఓడలలోనూ ఒలింపిక్స్ కు వచ్హేవారిని ఆహ్వానించడానికి కూడా ఉపయోగిస్తారట.

ఈ బిల్డింగ్ పూర్తిగా సూరరస్మి తో విద్యుత్ ను పొందుతుందట. బిల్డింగ్ కు కరెంట్ వసతే కాకుండా, బిల్డింగ్ పై నుండి క్రిందకు పారే నీటి ని సరఫరా చేస్తుందట (ఫొటోలో చూపినట్లు).
ఈ టవర్లో హోటల్, ఆడిటోరియం, మాల్స్ ఉంటాయి. సందర్శకులను టవర్ పైకి తీసుకు వెళ్లడానికి లిఫ్ట్ లు కలిగి ఉంటాయి. బిల్డింగ్ పైన బంగీ జంప్ కోసం ఒక ప్రత్యేక ప్లాట్ ఫారం ఏర్పాటుచేస్తారట
స్పాం (SPAM) ఈమైల్స్ ఎక్కువగా ఎక్కడ నుండి వస్తున్నాయో తెలుసుకోండి

స్పాం ఈమైల్స్ ఎక్కువగా పంపబడే దేశాలలో భారతదేశం 2 వ స్థానం వహిస్తోందని, జూలై నెలలో ప్రపంచ వ్యాప్తంగా వచ్హిన జంక్ ఈమైల్స్ లో 12.55 శాతం భారతదేశం నుండి పంపబడ్డాయని ట్రెండ్ మైక్రో వారు జరిపిన ఒక స్టడీలో తెలిసింది.

స్పాం ఈమైల్స్ పంపబడే దేశాలలో అమెరికా మొదటి స్థానం వహిస్తూ "కింగ్ ఆఫ్ స్పాం" గా చెప్పబడుతోంది. జూలై నెలలో ప్రపంచ వ్యాప్తంగా వచ్హిన జంక్ ఈమైల్స్ లో 25 శాతం అమెరికా నుండి వచ్హినవేనట. 12 శాతం తో బ్రిజిల్ 3 వ స్థానం లో ఉన్నది.

గత 2 నెలలుగా స్పాం ఈమైల్స్ ఏ ఏ దేశాల నుండి వస్తున్నాయోనని చేసిన స్టడీలో అంతకు ముందులాగానే అమెరికా, ఇండియా మరియూ బ్రిజిల్ ముఖ్య స్థానాలు వహిస్తున్నాయని తెలుసుకున్నారు.

జూలై నెలలో భారతదేశం నుండి వచ్హిన స్పాం ఈమైల్స్ సంఖ్య అంతకు ముందు నెలల కంటే తక్కువుగా ఉన్నదట. కానీ అమెరికా మరియూ బ్రిజిల్ దేశాల నుండి పంపబడ్డ స్పాం ఈమైల్స్ సంఖ్య పెరిగిందట.

యూసర్ అకౌంట్ ఇన్ ఫర్మేషన్ మరియూ క్రెడిట్ కార్డ్ వివరాలను తెలుసుకునే స్పాం ఈమైల్స్ వలన సైబర్ క్రిమినల్స్ ఎక్కువ లాభం పొందుతున్నారట. అత్యధికంగా ప్రజలు వాడుతున్న సోషియల్ నెట్ వర్క్ సైట్లను, సెర్చ్ ఇంజెన్ లింక్ లనూ మరియూ రీ డైరెక్ట్ లింక్ లను సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా వాడుతున్నారని ట్రెండ్ మైక్రో భారతదేశ మేనేజర్ అమిత్ నాద్ గారు తెలిపేరు.

11.3 శాతం తో ఇంగ్లాండ్ 4 స్థానం, 8.66 శాతం తో జెర్మనీ 5 వ స్థానం వహిస్తున్నాయి.

సైబర్ నేరాలకు మాటి మాటికీ చైనా దేశాన్నే తప్పుపడుతున్నా, ఆ దేశం ఈ స్టడీ లిస్ట్ లో లేకపోవటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

సైబర్ క్రిమినల్స్ తమ క్రిమినల్ పనులకు వాడుకునే కంపెనీ పేర్లలో హ్చ్.ఎస్.బి.సి. బ్యాంక్ పేరు ఎక్కువగా ఉందట.

ఇకపోతే, 7.71 శాతం తో వియత్నాం 6 వ స్థానం, 6.71 శాతం తో ఫ్రాన్స్ దేశం 7 వ స్థానం, 6.09 శాతం తో కొరియా 8 వ స్థానం, 5.46 శాతం తో ఇటలీ 9 వ స్థానం మరియూ 5.13 శాతం తో రుమేనియా 10 వ స్థానం వహిస్తున్నాయి.

ఫిలిపైన్స్ రాజధాని మనీలాలో హైజాక్ చేయబడ్డ బస్సును పోలీసులు విడిపించే వీడియో

ఫిలిపైన్స్ రాజధాని మనీలాలో హైజాక్ చేయబడ్డ బస్సును పోలీసులు విడిపించే వీడియో

Wednesday, August 25, 2010

ప్రపంచ చెస్ చాంపియన్ జాతీయత పై సందేహం....భారతదేశానికే అవమానం

విశ్వనాదన్ ఆనంద్ తో పాటు ఒక వీదేశీయ మేధావికి కూడా గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయాలని నిర్ణయించేరంటే, గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడానికి జాతీయతతో పనిలేదని తెలుస్తోంది. అటువంటప్పుడు విశ్వనాదన్ ఆనంద్ జాతీయతను తనిఖీ చేయవలసిన అవసరమేమొచ్హిందో? విశ్వనాదన్ ఆనంద్ ఏ దేశస్తుడని చిన్న పిల్లలను అడిగినా తడుముకోకుండా "భారతీయుడు" అని చెప్తారే...మరి కేంద్ర మానవ వనరుల శాఖలో పనిచేస్తున్న అధికారులకు విశ్వనాదన్ ఆనంద్ ఏ దేశస్తుడో తెలియదా?

విశ్వనాదన్ ఆనంద్ సాధించిన విజయాలకు గుర్తింపుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వారు ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్హి గౌరవించాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని ఏప్రిల్ 15 వ తారీఖున కేంద్ర మానవ వనరుల అభివ్రుద్ది శాఖకు తెలియపరిచేరు. విశ్వనాదన్ ఆనంద్ కొన్నేళ్ళుగా స్పైన్ దేశంలో నివసిస్తూ ఆ దేశ పౌరసత్వం కలిగి ఉండటంతో ఆయన జాతీయతను స్పష్టం చేయమని అడిగేరు. విశ్వనాదన్ ఆనంద్ భారత జాతీయత కలిగి ఉన్నారని ఒక లేఖను పంపిస్తూ, అధారంగా ఆయన పాస్ పోర్ట్ మరియూ ఇతర వివరాలను జత పరిచి ఆ లేఖను కేంద్రానికి ఆగస్ట్ 5 వ తారీఖున పంపించేరు. దీనికి కేంద్ర మానవ వనరుల అభివ్రుద్ది శాఖ నుండి ఎటువంటి సమాధానమూ రాలేదు.

హైదరాబాద్ లో జరగబోతున్న అంతర్జాతీయ గణిత సమ్మేళనం లో పాల్గొని, అక్కడ ఏర్పాటు చేసిన 40 మందితో ఒకేసారి చెస్ గేం ఆడదలుచుకుని అక్కడకు చేరుకున్న విశ్వనాదన్ ఆనంద్ కు విశ్వవిద్యాలయ అధికారులు ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయలేకపోతున్నామని, దానికి కారణాలనూ ఆయనకు తెలియపరిచేరు.

విశ్వనాదన్ ఆనంద్ ఈ విషయం తెలుసుకుని కలత చెందినా, తన కలతను పక్కకు నెట్టి, అక్కడకొచ్హిన 40 మందితోనూ చేస్ గేం ఆడి 39 మంది మీద గెలిచి, ఒక చిన్నారి తో డ్రా చేసేరు. కేంద్ర ప్రభుత్వం తనను అవమాన పరిచినా, తనలోని ఆత్మవిశ్వాసాన్ని జారవిడువలేదని ఈ గేం లో ఆయన ఆడిన విధానం తెలుపుతోంది.

మానవ వనరుల అభివ్రుద్ది శాఖ మంత్రి కపిల్ సిబల్ గారు విషయం తెలుసుకుని విశ్వనాదన్ ఆనంద్ కు స్వయానా క్షమాపన చెప్పుకుని ఈ రోజు గౌరవ డాక్టరేట్ అందుకోవచ్హని తెలిపేరు. కానీ విశ్వనాదన్ ఆనంద్ దీనికి ఒప్పుకోలేదు.

భారతదేశంలోనే అతి పెద్ద బిరుదైన పద్మ విభూషన్ ను అందుకున్న విశ్వనాదన్ ఆనంద్ కు ఇలాంటి అవమానం జరిగి ఉండకూడదు. ఇది ఆయనకే కాదు,మనందరికీ కూడా అవమాన కర విషయమే. "కేంద్రం లో కూర్చున్న అధికార యంత్రాంగంలో చాలామంది అవినీతికి పేరుమోసినవారు కదా....తన జాతీయతను నిరూపించుకో మన్నప్పుడు విశ్వనాదన్ ఆనంద్ దగ్గర నుండి ఏదో వస్తుందని ఎదురుచూసి ఉంటారు" అని ఒకరు ఒక పత్రికలో ఈ న్యూస్ తెలుసుకుని ఇచ్హిన కమెంట్ చూసి వారంతా సిగ్గుపడాలి.

విదేశీయ ఉద్యోగస్తులు(ముఖ్యంగా భారతీయులు)గూగుల్,మైక్రోసాఫ్ట్ కంపెనీలు అభివ్రుద్దికి చాలా సహాయపడ్డారు

"దేశము లోని పేరుమోసిన టెక్నాలజీ కంపీనీ లైన గూగుల్, అమెజాన్, ఆపిల్, సిస్ కో, ఆరకల్, మైక్రోసాఫ్ట్ మరియూ మరెన్నో కంపనీలు ఈ రోజు అతి పెద్ద వాణిజ్య సంస్థలుగా ఉన్నాయంటే దానికి కారణం విదేశీయ ఉద్యోగస్తుల సహాయమే. అందులోనూ ముఖ్యంగా భారతీయు ఉద్యోగస్తుల సహాయమే" అని అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది.

అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ పెర్సోనల్(AMERICAN COUNCIL OF INTERNATIONAL PERSONNEL……ACIP) మరియూ అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వారు కలిపి ఇచ్హిన ఒక ప్రకటనలో పై విధముగా తెలిపేరు. అమెరికన్ కంపనీలకు కావలసిన, నైపుణ్యం గల ఉద్యోగస్తులను వెతికి (వారు ప్రపంచములో ఎక్కడున్నా),వారికి శిక్చణ ఇచ్హి, వారిని తమ దేశానికి తీసుకు వెళ్ళటం కొరకు ఏర్పరచబడినదే ఈ ACIP.

విదేశీ ఉద్యోగస్తుల ఎన్నికను తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్న అమెరికన్ ప్రభుత్వం H1-B, L1వీసాలు ఇవ్వటానికి కట్టుదిట్టాలను చేపడుతోంది. దీనికి అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పటికప్పుడు తమ అభ్యంతరాన్ని తెలుపుతూ వస్తోంది. ఈ మధ్య వారు విడుదల చేసిన ప్రకటనలో విదేశీ ఉద్యోగస్తుల అవసరం అమెరికా యొక్క అభివ్రుద్దికి, అమెరికన్ కంపెనీలకూ ఎంతైనా ఉన్నదని, ఆ కారణాలను వివరిస్తూ ప్రకటన విడుదల చేసింది.

H1-B వీసా మీద 1999 లో గూగుల్ కంపెనీలో పనికి చేరిన భారతీయుడు క్రిష్ణ భరత్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్లో ఫ్.డ్ పుచ్హుకున్నారు.DEC సిస్టంస్ రీసెర్చ్ మరియూ గూగుల్ కంపెనీలలో ఇతను పనిచేసిన పనులకు ఎన్నో "పేటెంట్" లు తీసుకున్నారు. సెర్చ్ ఇంజెన్ టెక్నాలజీ అభివ్రుద్దిలో ఈయన అతి ముఖ్యమైన కారకులు. ప్రపంచ వ్యాప్తంగా 4500 కు పైగా ఆంగ్ల వార్తా వెబ్ సైట్లను కలిగియున్న "గూగుల్ న్యూస్" ను స్రుష్టించినది ఈయనే అని గూగుల్ కంపెనీ వైస్ ప్రెశిడెంట్ (ఆపరేషన్స్) లాస్ జ్లో బాక్ తెలిపేరు.

టర్కీ దేశస్తుడైన ఆర్కుట్ బయాకోక్టన్ 2002 లో H1-B వీసాతో ఆమెరికాలో ఉద్యోగం చేస్తూ ఒక సోషియల్ నెట్ వర్క్ ను అభివ్రుద్ది చేసేరు. దీనినే గూగుల్ వారు కొనుక్కుని అతని పేరు మీదే "ఆర్కుట్" గా అంతర్జాలములో ఉంచేరు.

హంగేరీ దేశస్తుడైన చార్లెస్ సిమోనీ మైక్రోసాఫ్ట్ వారి "వర్డ్" మరియూ "ఎక్సెల్" ను అభివ్రుద్ది చేయటం లో ముఖ్య పాత్ర వహించేడు.

IBM మరియూ INTEL కంపెనీ వారు తీసుకున్న "పేటెంట్" ల లో భారతీయుల మరియూ చైనా దేశీయుల షేర్ 30 శాతం దాకా ఉంటుందని, అది ప్రతి సంవత్సరమూ పెరుగుతోందని కాబట్టి విదేశీ ఉద్యోగస్తుల రాకకు అంతరాయం కలిగించ వద్దని ప్రభుత్వానికి సలహా ఇచ్హేరు.

Tuesday, August 24, 2010

మహాద్భుతాలు (MIRACLES) జరుగుతూనే ఉంటాయనడానికి ఇది ఒక నిదర్శనం

చిలి దేశంలో ఒక బంగారు మరియూ రాగి గనిలో పనిచేస్తున్న 33 మంది కార్మీకులు గని చెరియలు విరిగి పడిపోవడంతో వారు తయారు చేసిన దారి పూర్తిగా పూడ్చుకునిపోయి ఆ గని లోపల ఇరుక్కుపోయేరు. వీరిని కాపడలేరని తెలుసుకున్న చిలి దేశ ప్రజలు శోకంలో మునిగిపోయేరు.

వీరిని కాపాడాలంటే గనిలో ఇంకో సొరంగం తవ్వాలి. అందులోనూ సుమారు 2300 అడుగుల లోతుకు తవ్వాలి. దీనికి చాలా సమయం పట్టవచ్హు. అంతవరకు అక్కడ చిక్కుకుపోయిన కార్మీకులు ప్రాణాలతో ఉంటారనే నమ్మకం లేదు.

మొదట చిక్కుకుపోయిన కార్మీకులు ఎలా ఉన్నారో నని చూడటానికి పూడుకు పోయిన మార్గంలో ఒక బోర్ వేసి రంద్రాన్ని తవ్వటం మొదలుపెట్టేరు. 17 రోజులు తవ్విన తరువాత ఆ బోర్ 2300 అడుగులు క్రిందకు వెల్లింది. బోరు మూలంగా పంపిన తాడు వేగంగా ఊగటంతో తాడును పైకి లాగేరు. తాడు తో పాటు ఒక కాగితం వచ్హింది. "మేమంతా క్షేమంగా ఉన్నాము" ఉన్నాము అని పెద్ద అక్షరాలతో రాసిన ఆ సందేసం తో ఒక్కసారిగా అందరూ మొదట ఆశ్చర్యపోయినా తరువాత సంతోషం పట్టలేకపోయేరు. చిక్కుకుపోయిన అందరూ 17 రోజులుగా బ్రతికే ఉన్నారనే విషయం అక్కడి మీడియా వారు ప్రచారన చేయటంతో చిలిదేశ ప్రజలలో శోకం పోయి ఉస్చాహం వచ్హింది.

ఆదివారం నాడు ఆ రంద్రం మూలంగా ఒక కెమేరాను పంపేరు. చిక్కుకుపోయిన కార్మీకులు తమ సంతోషమైన మొహాలను కెమేరాలో చూపించేరు. అందరూ వారిని చూడగలిగేరు. కార్మీకుల కుటుంబీకులు ఆనందపడ్డారు. కాపాడబడతామనే సంతోషం కార్మీకులలో కనబడినా వారందరూ అతి నీరసంగా, చొక్కాలు లేకుండా చెమటతో కనబడ్డారు. అక్కడ 32-36 డిగ్రీల(సెల్సియస్) వేడి ఉందట. తాగడానికి చిన్న నీటి ట్యాంక్ ఉందట. ఆ నీటిని తాగుతూ, ఆ వేడిని తట్టుకుంటూ, అక్కడున్న గాలిని పీల్చుకుంటూ 17 రోజులు బ్రతికున్నారంటే అది ఒక మహాద్భుతమే......ITS A MIRACLE.

వీరందరినీ బయటకు తీసుకు రావటానికి కనీసం 4 నెలలు పడుతుందట. ఎందుకంటే అత్యంత పటిష్టమైన రాతి పొరలను చీలుస్తూ కనీసం 30 అంగులాల రంద్రాన్ని 2500 అడుగుల (4.5 మైళ్ళు) లోతుకు తవ్వి ఒక్కొక్కరినీ బయటకు తీసుకురావాలి.

ఈ 4 నెలలోనూ ఇప్పుడు తవ్విన బోర్ మార్గాన్నే వారికి మందులూ, ఆహారపానీయాలూ అందజేస్తారట. ఈలోపు చిక్కుకున్న ఆ కార్మీకులకు ఇంకే ప్రమాదము జరగకూడదని చిలిదేశ ప్రజలు వేడుకుంటున్నారు. చిక్కుకున్న కార్మీకులందరూ కాపడబడాలని ఆసిస్తున్నాను.

Monday, August 23, 2010

పాకిస్తాన్ లో వరద....వీడియో

పాకిస్తాన్ వరదలలో కొన్నివందల మంది ప్రాణాలు కోల్పోయేరు. వేలాది ప్రజలు నివాసాలను కోల్పోయేరు. వరద భాదితుల సహాయార్ధం భారతదేశంతో పాటు పలు దేశాలు తమ వంతు సహాయాన్ని అందించేయి. ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశ సహాయాన్ని మొదట్లో తిరస్కరించినా అమెరికా ఒత్తిడితో సహాయాన్ని అందుకుంది.

Sunday, August 22, 2010

భారతదేశంలోనే డబ్బు గల రాజకీయ పార్టీలలో మాయావతి యొక్క బి.ఎస్.పి కి 2 వ స్థానం

దలితుల అభివ్రుద్ది కొరకు పాటుపడే పార్టీగా మొదలుపెట్ట బడిన బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పుడు భారతదేశంలోనే డబ్బు గల రాజకీయ పార్టీలలో రెండవ స్థానం వహిస్తోంది. భారత ఆదాయపు పన్ను శాఖ వారి దగ్గరున్న రాజకీయ పార్టీల ఆస్తుల వివరాల సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో మాత్రమే అధికారం లో ఉన్న బి.ఎస్.పి 2009-2010 కి ఆదాయపు పన్ను శాఖ కు సమర్పించిన ఆస్తి వివరాలలో తమ పార్టీకి 258 కోట్ల రూపాయల విలువగల ఆస్తులు ఉన్నాయని తెలిపింది. 1947 నుండి 2010 వరకు అటు కేంద్రం లోనూ, రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2009-2010 కి తమ ఆస్తి వివరాలను 611 కోట్ల రూపాయలుగా తెలియపరచింది.

2002-2003 లో 116 ఎం.పి లు కలిగి, కొన్ని సంవత్సరాలు కేంద్రం లోనూ, కొన్ని రాష్ట్రాలలోనూ అధికారం లో ఉన్న బి.జె.పి 2009-2010 కి తమ ఆస్తులను 260 కోట్లుగా తెలిపింది. మాయావతి యొక్క బి.ఎస్.పి పార్టీ 21 ఎం.పి లను కలిగి యుండి, ఇంతవరకు రెండవ స్థానం వహిస్తూ వస్తున్న బి.జె.పి ని 3 వ స్థానానికి నెట్టింది. ఉత్తరప్రదేశ్ లో బి.ఎస్.పి కి ప్రతిపక్ష పార్టీగా ఉంటున్న సమాజ్ వాద పార్టీ తమ ఆస్తి వివరాలను 177 కోట్లుగా తెలిపి 4 వ స్థానం వహిస్తోంది.

ఈ వివరాలను ఆదాయపు పన్ను శాఖ లో భాగ మైన ఏ.డి.ఆర్...అసోషియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫాంస్(ADR…..ASSOCIATION FOR DEMOCRATIC REFORMS) వారు తమ దగ్గరున్న రాజకీయ పార్టీల యొక్క ఆస్తి వివరాలను విశ్లేషణ చేసి తయారు చేసిన ఒక రిపోర్ట్ లో తెలిపేరు.

ఈ విశ్లేషణ లో రాష్ట్రీయ పార్టీలైన తెలుగు దేశం, డి.ఎం.కే మరియూ అన్నా డి.ఎం.కే పార్టీల ఆస్తుల వివరాలను తెలుపలేదు.

ఈ మధ్య జరిగిన రాజ్య సభ ఎన్నికలలో కొందరు ఎం.పి లు డబ్బు తీసుకుని ఓటు వేసేరని వచ్హిన వార్తలలో నిజమున్నదని ఈ విశ్లేషణ వలన తెలుస్తోందని ఏ.డి.ఆర్ జాతీయ కో-ఆర్డినేటర్ అనిల్ బైర్వాల్ తెలిపేరు.

8 సంవత్సరాలలో బి.ఎస్.పి పార్టీ సంపాదించుకున్న ఆస్తి మన దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీ 8 సంవత్సరాల వ్యవధిలో సంపాదించుకోలేదు. 2002 లో బి.ఎస్.పి పార్టీ యొక్క ఆస్తి 11 కోట్లు, 2006-2007 లో ఆ పార్టీ ఆస్తి 69 కోట్లు, ఆ మరుసటి సంవత్సరం ఆ పార్టీ ఆస్తి 118 కోట్లు, 2009-2010 లో ఆ పార్టీ ఆస్తి 285 కోట్లు.

రాజకీయ పార్టీల లోనే పేద పార్టీగా సి.పి.ఐ పార్టీ ఉంటోంది.

Friday, August 20, 2010

9 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేక బాధ పడుతున్న గ్రామం!

2001 లో ఈ గ్రామంలో ఉన్న కరెంట్ ట్రాన్స్ ఫార్మర్లో సాంకేతిక లోపం ఏర్పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ ట్రాన్స్ ఫార్మర్లో ఏర్పడిన లోపాన్ని సరిచేయలేదు. అందువలన కరెంట్ సరఫరాకు కావలసిన పరికరాలున్నా, విద్యుత్ సరఫరా లేక గత 9 సంవత్సరాలుగా ఆ గ్రామ ప్రజలు అవస్త పడుతున్నారు.

పిప్రియా సింగిపూర్ అనే ఈ గ్రామం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిభిట్ జిల్లాలో ఉన్నది. ఈ గ్రమం ఫిలిభిట్ పార్లమెంటరీ నియోజకవర్గం లో వస్తుంది. ఈ నియోజకవర్గం నుండే బి.జె.పి ఎం.పి వరుణ్ గాంధి లోక్ సభకు ఎన్నుకోబడ్డారు.

పవర్ కార్పోరేషన్ లో పనిచేస్తున్న ఒక ఇంజనీర్ తనకు ఈ విషయం తెలుసని చెబుతున్నా, కార్పరేషన్ అధికారులు మాత్రం మాకేమీ తెలియదని(అసలు విషయమే తెలీదని) అంటున్నారు. కరెంట్ సరఫరా కు కావలసిన పరికరాలన్నీ ఉన్నా ఈ గ్రామంలో నివసిస్తున్న 700 మంది ప్రజలు గత 9 సంవత్సరాలుగా కరెంట్ లేకుండానే బ్రతుకుతున్నారు.

ట్రాన్స్ ఫార్మర్ ని రిపేర్ చేసి కరెంట్ సరఫరా చేయడానికి ఎంత కాలం పడుతుంది? ఖచ్హితంగా ఇంతకాలం అంటే 9 ఏళ్ళు పట్టదు. "కానీ ఇదే నిజం" అంటున్నారు ఆ గ్రామ పెద్ద రజీత్ కౌర్.

"మనిషికి కావలసిన కనీస వసతులైన కరెంట్, నీరు, రోడ్డు లను పట్టించుకోని ఈ ప్రభుత్వం ప్రజలక కోసం ఎలా పనిచేస్తున్నదో మా గ్రామంలోని ప్రజలను చూస్తే అందరికీ అర్ధమౌతుంది. ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేస్తున్నారో, ఎంత నిర్లక్ష్యం గా ఉంటున్నారో తెలుస్తుంది" అన్నారు.

జిల్లా అధికారులకు ఈ విషయం చెబితే ఆశ్చర్య పోయేరట. కానీ పవర్ కార్పోరేషన్ అధికారి ఒకరు తనకు ఈ విషయం ఎప్పుడో తెలుసని చెబుతున్నారు.

ఆ జిల్లాకు పవర్ కార్పోరేషన్ ఓం ప్రకాష్ అనే ఒక ఇంజనీర్ ను నియమించింది. ఈయనే ఈ గ్రామ కరెంట్ ఇబ్బందులను పర్యవేక్చించేది. ఈయన్ను అడిగితే "ఈ విషయం నాకు ఇదివరకే తెలుసు....మా స్టాఫ్ దీని గురించే పనిచేస్తోంది" అని చెప్పేరు.

1980 లో ఈ గ్రామానికి కరెంట్ సప్లై వచ్హింది.ఈ గ్రామంలోని వారందరూ పేద కార్మీకులు. వారిని అడిగితే "మేము అనేక రకమైన పోరాటాలు జరిపేము...చాలా సార్లు పవర్ కార్పరేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసేము. జిల్లా అధికారులనూ, పవర్ కార్పోరేషన్ అధికారులనూ స్వయంగా కలిసేము. కానీ ఎటువంటి ప్రయోజనమూ లేదు" అని చెప్పేరు.

ట్రాన్స్ ఫార్మర్ ఉండి కూడా కరెంట్ లేకుండా బ్రతుకుతున్నారంటే చాలా ఆశ్చర్యముగా ఉంది. నేను అధికారులతో మాట్లాడి వెంటనే చర్య తీసుకోమని చెబుతాను" అని జిల్లా మెజిస్ట్రేట్ తెలిపేరు.

ఎం.పి జీతాలు పెరిగేయని అందరికీ తెలుసు...వారు పార్లమెంట్లో ఎంత కష్ట పడుతున్నారో కూడా తెలుసుకుందాం

ఎం.పి ల నెల జీతం రూ.16,000/- నుండి రూ.50,000/- కి పెంచేరు. ఇది వారి పాత జీతం కంటే 300 శాతం ఎక్కువ. అయినా వారు సంతోషం గా లేరు. ఎందుకంటే, ఇది పార్లమెంట్ కమిటీ రెకమెండ్ చేసిన 80,001 కంటే తక్కువగా ఉంది కాబట్టి. అందువలన చాలా మంది ఎం.పి లు పార్లమెంట్ కమిటీ రెకమెండ్ చేసిన జీతమే కావాలని గొడవ చేస్తూ లోక్ సభ పనులకు అంతరాయం కలిగించేరు.

పెరిగిన జీతం తో పాటు ఎం.పి లకు పార్లమెంట్ కు హాజరైన ప్రతి ఒక రోజుకూ రూ.1,000/- డైలీ అలవన్స్, నెలకి రూ.20,000/- నియోజకవర్గ అలవన్స్ మరియూ మరో 20,000/- రూపాయలు ఆఫీస్ అలవన్స్ గా ఇస్తున్నారు.ఇంతకు ముందుకంటే ఇది రెండింతలు ఎక్కువ.

ఇది కాక కన్వేయన్స్ అలవన్స్ ను 1 లక్ష నుండి 4 లక్ష లకు పెంచేరు. ఎం.పి ల భార్యలు తమ నియోజక వర్గం నుండి డిల్లీకి రావటానికి రైల్లో ఉచిత ప్రయాణం మరియూ సంవత్సరానికి 8 ఉచిత విమాన టికెట్లు కూడా ఇస్తున్నారు.

ఇవి తెలుసుకున్న మనం, ఎం.పి లు పార్లమెంట్లో ఎంత కష్ట పడుతున్నారో కూడా తెలుసుకుందాం.

కొంత మంది ఎం.పి లు పార్లమెంట్ ను చాలా తేలికగా తీసుకుంటున్నారు. కొంత మంది పార్లమెంట్ ను సీరియస్ గా తీసుకుంటున్నారని 15 వ లోక్ సభ ఎం.పి ల పనితీరును గురించి పి.ఆర్.ఏస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వారు ఒక రిపోర్ట్ లో తెలిపేరు.

ఈ రిపోర్ట్ ప్రకారం ఎల్.కే.అద్వానీ, ససీ తరూర్ మరియూ మరో 8 మంది ఎం.పి లు ఇప్పటి వరకు జరిగిన పార్లమెంట్ సమావేసాలకు 100 శాతం హాజరయ్యేరు. వీరికి విరుద్దంగా ఇద్దరు ఎం.పి లు, బలిరాం కష్యాప్(బి.జె.పి) మరియూ కామేశ్వర్ బైతా(జార్కంద్ ముక్తి మోర్చా) పార్లమెంట్ సమావేసాలకు 2 శాతం వరకే హాజరయ్యేరు. అయితే మొత్త ఎం.పి.ల హాజరు శాతం గౌరవనీయమైన 78 శాతం గా ఉన్నదట. మొత్తమున్న 480 ఎం.పి లలో 168 మంది ఎం.పి లు పార్లమెంట్ రిజిస్టర్ లో సంతకం చేయనవసరం లేదట. వీరి హాజర్ శాతం 75 కంటే తక్కువగా ఉంది.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ములాయం సింగ్ యాదవ్, అకిలేష్ యాదవ్, ఎల్.కే.అద్వానీ, లాలు ప్రశాద్ యాదవ్ మరియూ మరో 82 ఎం.పి లు ఇంతవరకు జరిగిన పార్లమెంట్ సమావేసాలలో ఒక్క ప్రశ్న కూడా అడగలేదట. అయితే సివ సేనా ఎం.పి ఆనందరావ్ అడుసి 354 ప్రశ్నలు అడిగేరట. ప్రశ్నలు అడిగితేనే వివాదాలు జరిగి దాని మూలంగా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్హు. వీరిలాంటివారి మరో కొందరున్నారు. వీరిలాంటి వారి వలనే పార్లమెంట్ ఘనత కాపాడబడుతోందని ఆ రిపోర్ట్ తెలియపరచింది.

మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం....దేముని ఫోటోలు

వరలక్ష్మి వ్రతం....దేముని ఫోటోలు
Thursday, August 19, 2010

ఈ రోజు స్పైన్ లో జరిగిన బుల్ (BULL) ఫైటింగ్ లో 10 మీటర్ల ఎత్తు ఎగిరి ప్రేక్షకులలో కి దూసుకు వెళ్ళిన ఎద్దు....వీడియో

స్పైన్ దేశం లో బుల్ ఫైటింగ్లు జరుప కూడదని పోరాటాలు జరుగుతున్నాయి. ఈ దేశం లోని కొన్ని నగరాలలో ఈ బుల్ ఫైట్ ను నిషేదించేరు. కానీ కొన్ని నగరాలలో ఇంకా జరుపుతున్నారు. ఈ రోజు జరిగిన బుల్ ఫైట్ షోలో ఒక ఎద్దు 10 మీటర్ల ఎత్తు ఎగిరి ప్రేక్షకులలోకి దూసుకు వెళ్ళి 40 మందిని గాయ పరిచింది. అనుకోని ఈ సంఘటన నుండి అక్కడి ప్రజలు ఇంకా తేరుకోలేదు.

కాంగ్రెస్ నాయకత్వం జగన్ కు "చెక్" పెట్టాలని ప్రయత్నిస్తోందా?

వై.ఎస్.ఆర్ కుటుంబం లో విభజన తీసుకువచ్హి, తద్వార పార్టీ నాయకత్వ ఉత్తర్వులను దిక్కరిస్తున్న కడప ఎం.పి జగన్ మోహన్ రెడ్డి ని అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నం చేస్తోందా?...ఎందుకంటే, నెల రోజుల క్రితం వై.ఎస్.ఆర్ సోదరడు వివేకానంద రెడ్డి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ కి రాసిన లేఖ ను ఇప్పుడు బయట పెట్టేరు.

తన లేఖలో వివేకానంద రెడ్డి, తాను ఇప్పటి దాకా కాంగ్రెస్ పార్టీకి నిజాయతీగా ఉన్నానని, ఇకమీదట కూడా నిజాయతీగానే ఉంటానని స్పష్టంగా తెలిపేరు. ఇంతే కాక, అదే లేఖలో తన సోదరుడు వై.ఎస్.ఆర్ కూడా తన తుది శ్వాస వరకు కాంగ్రెస్ నాయకత్వానికి నిజాయతీగానే ఉన్నారని తెలిపేరు.

ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కి తన సోదరుడు ప్రెసిడెంట్ కాక పోయినా, తన సోదరున్ని కాంగ్రెస్ నాయకత్వం ముఖ్య మంత్రి పదవికి ఆయన్ను ఎన్నుకుని ప్రోశ్చహించిన విషయాన్ని తాను మరచిపోలేనని తెలిపేరు. ప్రతిపక్చ పార్టీలు తన సోదరున్ని రాజకీయంగా దెబ్బతీయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ నాయకత్వం ఆయనకు పక్కబలంగా ఉండి మద్దత్తు ఇచ్హినదానిని కూడా తాను మరచిపోలేదని తెలిపేరు. అదేలాగా సోనియా గాంధీ తమ కుటుంబం పై ఉంచిన నమ్మకాన్ని తన జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపేరు.

2004 ఎన్నికల తరువాత, వివేకానంద రెడ్డి గెలుచుకున్న కడప ఎం.పి సీటును జగన్ కోసం వదిలివేయమని ఆయన మీద ఒత్తిడి వచ్హింది. తప్పని పరిస్థితులలో వివేకానంద రెడ్డి కడప సీటును వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ సోనియా గాంధీ అడ్డుపడ్డారు. వివేకానంద రెడ్డి ని తప్పుకోవద్దని చెప్పేరు. 2009 లో జగన్ కడప సీటును దక్కించుకున్నారు. వివేకానంద రెడ్డి ని లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ఎన్నుకున్నారు.

జూలై 17 వ తారీఖున రాసిన లేఖను, ప్రకాసం జిల్లా నుండి జగన్ మొదలుపెట్టబోయే ఓదార్పు యాత్రలో ఎం.ఎల్.ఏ లు పాల్గొనడాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం జరుగుతున్న సమయంలో బయటపెట్టటం రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలను కొంచం కలవర పరిచింది. జగన్ కు అతని కుటుంబం నుండే "చెక్" పెట్టాలని కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తోందని అనుకుంటున్నారు.

మీడియా వారితో మాట్లాడుతూ "నేను సోనియా గాంధీ కుటుంబానికి నిజాయితీగా ఉంటున్నానంటే దానికి అర్ధం నేను మాత్రమే నని కాదు. వై.ఎస్.ఆర్ కుటుంబీకులందరూ అని అర్ధం. జగన్ కి కూడా సోనియా గాంధీ మద్దత్తు దొరుకుతుందని ఆసిస్తున్నాను" అని చెప్పేరు.

జగన్ కు కాంగ్రెస్ నాయకత్వం మద్దత్తు నివ్వాలని ఈ లేఖను బయటపెట్టేరా లేక జగన్ కి తన కుటుంబీకులే మద్దత్తు నివ్వటంలేదని కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ లు తెలుసుకుంటారాని బయటపెట్టేరా? ఈ లేఖను బయటపెట్టం వలన కాంగ్రెస్ నాయకత్వానికే ఎక్కువ లాభం ఉందంటున్నారు.

Wednesday, August 18, 2010

బెస్ట్ రోబో డాన్స్.....వీడియో

రోబో....సాంకేతిక సంగ్రహం మరియూ అద్భుత ఫోటోలుసాంకేతిక సంగ్రహం:
చోటు....చెన్నై 2010.
పని:....మనిషి లాంటి రోబో ను తయారు చేయడం.
పేరు....చిట్టి.
ఉపయోగం:...సమాజానికి సహాయపడటానికి.
తయారు చేయు కాలం:...10 సంవత్సరాలు.
అమరిక:...వేగం ఒక టెర్రా h2, మెమొరీ ఒక ZETABYTE, ప్రాససర్ పెంటియం అల్ట్రా కోర్ మెలీనియా V2, FHP 450 మోటార్.
వైఖరి:...తయారుచేయబడ్డ మనిషి. డాన్స్ ఆడగలడు, పాడ గలడు, పోట్లాడగలడు. నీరు నిప్పు ఏమీచేయలేదు. మనిషి ఏమేమి చేయగలడో అందులో చాలావరకు చెయగలడు. కరెంట్ తో పనిచేస్తాడు. ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాడు. అబద్దం ఆడడు.
చురుకైన మెమొరీ గల చిట్టి టెలిఫోన్ డైరెక్టరీ ని ఒక సారి తిరగేస్తే అందులోని నెంబర్లను ఇట్టే గుర్తు పెట్టుకుంటాడు. కానీ చిట్టి కి మనుష్యులలో కలిగే ఎమోషన్స్ అర్ధం కావు.
డా.వసి చిట్టీ లో కూడా మనిషికి కలిగేలా ఏమోషన్స్ కలగాలని చిట్టి ని మెరుగు పరుస్తాడు. మెరుగు పరచ బడ్డ చిట్టి లో కలిగిన మొదటి ఎమోషన్ "ప్రేమ".
చిట్టి లో పుట్టిన ప్రేమ చిట్టి ని సమాజానికి ఉపయోగపడేలా చేసిందా? లేక తనని తయారు చేసిన డాక్టర్ వసి ని రూపుమాపిందా? రోబో సినిమా చూసి తెలుసుకోండి.


Tuesday, August 17, 2010

H1-B వీసాలు ఇవ్వటంలో స్వతంత్రం మరియూ కొత్త పద్దతులూ అవలంబించాలి గానీ నియమాలు ఉండకూడదు....అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్

అమెరికన్ కాంగ్రెస్ మరియూ ఒబామా ప్రభుత్వం నైపుణ్యం గల ప్రొఫెషెనల్స్ ని విదేశాల నుండి (ముఖ్యముగా భారదేశం నుండి) తీసుకునే విషయం గురించి మాటి మాటికీ రహశ్య చర్చలు జరపటం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చేస్తున్నదని, దీని వలన ప్రపంచ వ్యాపార రంగంలో అమెరికా పోటీ పడటం బలహీనపడటమే కాకుండా అది అమెరికా యొక్క ఆర్ధీక పరిస్థితిని దెబ్బ తీసే అవకాశం ఉన్నదని అమెరికాలోని పెద్ద వ్యాపార సంస్థల సంఘం అమెరికన్ ప్రభుత్వాన్ని హెచ్హరించింది.

H1-B వీసాల మీద అమెరికన్ ప్రభుత్వం వేస్తున్న కట్టుదిట్టాల మీద తీవ్రంగా స్పంధిస్తూ "H1-B వీసాల మీద పాలసీ ఎలా ఉండాలంటే, ఆ వీసాలు ఇవ్వడంలో పూర్తి స్వతంత్రమూ మరియూ కొత్త విధానాలూ పాటించాలి గానీ కట్టుదిట్టాలు పెట్టకూడదు" అని అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కొత్తగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

"H1-B వీసాలు ఇచ్హే విధానంలో విశాల భావం చూపి ఇప్పుడున్న 85,000 మందికి మాత్రమే అనే సంఖ్యను రద్దుచేసి, ఇంకా అధికంగా ఇవ్వటమో లేక ఎంత మంది విదేశీ ప్రొఫెషెనల్స్ కావాలో వ్యాపార సంస్థలకే వదిలివేయటం చేయాలి" అని ఆ ప్రకటనలో సూచించేరు.

"ఇలా H1-B వీసాల విషయం లో ఓపెన్ గా ఉంటే అది అమెరికాను బలపరుస్తుంది"

3 మిల్లియన్ల చిన్న మరియూ పెద్ద వ్యాపార సంస్థలు మెంబర్ గా ఉంటున్న అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క అపెక్స్ బాడీ తరచుగా మాట్లాడే మాట "స్వతంత్రతే ఉత్తమమైనది కానీ కట్టుదిట్టాలు ఉత్తమం కాదు" అనే మాటను గుర్తు చేసింది.

"రీగైనింగ్ అమెరికాస్ కాంపెటీటివ్ అడ్వాంటేజ్: మేకింగ్ అవర్ ఇమిగ్రేషన్ సిస్టం వర్క్" అనే పేరుతో ఒక సమాచార నివేదికను విడుదల చేస్తూ భారతీయ ఐ.టీ కంపెనీలు అమెరికా ప్రభుత్వం H1-B వీసా చార్జ్ ను పెంచటం గురించి వెలిబుచ్హిన అభిప్రాయాలను సమర్దించేరు.

భారత ఐ.టీ కంపెనీలు H1-B వీసాలను దుర్వినియోగం చేస్తూ నైపుణ్యమే లేని ఉద్యోగస్తులతో అమెరికా ఉద్యోగ రంగాన్ని నింపేస్తోందనే "ఊహాత్మక" వర్ణను పూర్తిగా తోసిపుచ్హమని అడిగింది. అధికార లెక్కల ప్రకారం 2006 నుండి 2009 వరకు భారత ఐ.టీ కంపెనీల H1-B వీసాల సంఖ్య 70 సాతం తగ్గిపోయిందని, అందులోనూ 2009 లెక్క ప్రకారం H1-B వీసా తో అమెరికాలో పనిచేస్తున్న వారి భారతీయుల సంఖ్య, అమెరికా ఉద్యోగస్తుల సంఖ్యలో 0.003 శాతమే నని గుర్తు చేసింది.

భారతీయ సంస్థలు అమెరికాలో పనిచేస్తున్న తమ ఉద్యోగస్తులకు "గ్రీన్ కార్డ్" ప్రాసస్ చేయడం లేదు. దీని వలన H1-B వీసాల మీద పనిచేస్తున్న వారు తిరిగి అమెరికా వెళ్ళిపోయే ప్రమాదమున్నదని, దీని వలన అమెరికాకు పెద్ద నష్టం ఏర్పడుతుందనే భయాన్ని వెలిబుచ్హిన వారినుద్దేసించి "భారత ఉద్యోగస్తుల సంఖ్యను లెక్క వేస్తే, అది చాలా తక్కువ శాతం. కనుక దాని గురించి భయపడాల్సిన పనిలేదు" అని తెలిపింది.

AFL-CIO ( అమెరికాలోని అతి పెద్ద లాబర్ అఫిలియేట్) మూలం గా తమ నివేదికను సమర్పించి, తమ వాదనను తెలియపరుస్తారని ఒక ప్రముక దిన పత్రిక తెలిపింది.

Monday, August 16, 2010

అగ్ని రైన్ బో (FIRE RAINBOW)………ప్రక్రుతి అద్భుతాలతో నిండిపోయిన ప్రపంచం...5

సర్కం హారిజాంటల్ ఫైర్ రైన్ బో ( CIRCUMHORIZONTAL FIRE RAINBOW) చాలా అరుదుగా కనబడుతుంది. మంచు గడ్డలు కలిగియున్న మబ్బులను సూర్యకిరణాలు తాకినప్పుడు అక్కడ ఏర్పడే రైన్ బో క్రింద నుండి చూస్తే అగ్ని మేఘాల లాగా ముందు నీల రంగులోనూ, అంచులలో ఎరుపు రంగు( నిప్పు రంగు) తో కనబడుతుందట. చూడటానికి ఆకాసంలో మంటలు ఏర్పడినాయేమో అనిపిస్తుందట.

చూడటానికి అద్భుతంగా ఉండే ఈ అగ్ని రైన్ బో కనబడటం చాలా అరుదట. అందువలన ఇలాంటి ఫోటోలు కూడా అరుదుగానే ఉన్నాయట. అలాంటి అరుదైన ఫోటోనే ఇది.Friday, August 13, 2010

అతి వేగంగా రెండు చేతులతో ఒకేసారి బొమ్మలు(డ్రాయింగ్)వీసే ప్రతిభ....వీడియో

అతి వేగంగా రెండు చేతులతో ఒకేసారి బొమ్మలు(డ్రాయింగ్)వేయడాన్ని ఈ వీడియోలో చూడండి.

Thursday, August 12, 2010

వేగంగా అభివ్రుద్ది చెందుతున్న భారత వైద్య రంగాన్ని దెబ్బతీయాలనే "సూపర్ బగ్" ప్రచారం

"మంచి వైద్యం కోసం ప్రపంచం లోని నలుమూలల నుండి శస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి విదేశీయులు తమదేశాలను కాదని భారతదేశానికి వస్తున్నారు. దీని వలన భారత వైద్య రంగం వేగంగా అభివ్రుద్ది చెందుతోంది. వైద్య రంగంలో ఎనలేని ప్రతిభ కలిగిన దేశాలైన అమెరికా మరియూ బ్రిటన్ నుండి కూడా ప్రజలు భారతదేశానికి వచ్హి చికిత్స పొందటం సహించలేని పశ్చిమ దేశాలు భారతదేశ వైద్య రంగాన్ని దెబ్బ తీయాలనే ఈ "సూపర్ బగ్" ప్రచారం"

అందులోనూ ఈ "సూపర్ బగ్" వైరస్ కు భారత రాజధాని డిల్లీ పేరుపెట్టడం (MDS-1...న్యూ డిల్లీ మెట్టల్లో బీటా లాక్టమేస్) భారదేశంలోని డాక్టర్లను ఆశ్చర్య పరిచింది. యూరోపియన్ మరియూ 2 పెద్ద పశ్చిమ దేశాల కంపెనీలు (వెల్ కం ట్రస్ట్ మరియూ వైత్) ఈ పరిశోధనకు ధన సహాయం చేయటం భారత డాక్టర్ల అనుమానాలను బలపరిచింది.

"ప్రపంచంలోని అనేక పెద్ద వ్యాధులు అమెరికాలోనూ మరియూ యూరప్లోనూ మొదలైనట్లు రికార్డులు తెలియపరుస్తున్నాయి. వాటి గురించి ఎవరూ ప్రచారం చేయలేదేం? ఆ దేశాలకు వైద్య కోసం వెళ్ల వద్దని చెప్పలేదేం?" భారత ఆరోగ్య శాఖ లోని అధికారి అడిగేరు.

"జూలై 2009 లో ఈ "సూపర్ బగ్" క్రిమి గురించి బ్రిటీష్ వైద్య రంగం తెలుసుకుంది. దీని గురించి పరిశోధన మొదలుపెట్టింది. వారి రిపోర్ట్ ప్రకారం ఈ "సూపర్ బుగ్" క్రిమి ఇస్రేల్, అమెరికా, గ్రీస్ మరియూ స్కాట్లాండ్ దేశాల వాతావరనంలో కూడా ఉన్నాయని తెలుసుకున్నారు. అలాంటి క్రిమిలు ప్రపంచంలో పలుచోట్ల ఉండవచ్హు. ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణం చెసే వారి వలన ఈ క్రిమి అన్ని చోట్లకూ వ్యాపించి ఉండవచ్హు. కానీ భారతదేశ శస్త్ర చికిత్సా కేంద్రాలలో నుండే ఈ క్రిమి వ్యాపిస్తోందని చెప్పటం చాలా తప్పు" మరో అధికారి అన్నారు.

కొత్త రకం ఆంటీ బయాటిక్స్ ను తయారుచేసి వాటిని అమ్ముకోవాలనే ఈ "సూపర్ బగ్" ప్రచారం అని కొంతమంది డాక్టర్లు చెబుతున్నారు.

"ఇది ఆరంభం మాత్రమే. మరికొన్ని రోజులలో "మరి కొన్ని "సూపర్ బగ్ క్రిములు" "సూపర్ వైరస్" లూ భారతదేశంలో నుండి వస్తున్నాయని చెబుతారు.........అంతర్జాతీయ వైద్య రంగంతో పోటీ పడుతున్న మన వైద్య రంగాన్ని దెబ్బతీయటానికి" అని నారాయణ హ్రుదయాలయా చైర్మాన్ డా. దేవి షెట్టీ అన్నారు. ఆంటీ బయాటిక్స్ ను ఎదుర్కోనే క్రిములు మనదేశంలో కంటే కెనడా లోనూ మరియూ యూరప్ లోనూ ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.

"పశ్చిమ దేశాలలో భారతదేశ వైద్య రంగపై జరుగుతున్న తప్పుడు ప్రచారం వలన వైద్యం కోసం మనదేశానికి వచ్హే విదేశీయుల సంఖ్య తగ్గుతుంది. ఇది మన వైద్య రంగాన్ని దెబ్బ తీస్తుంది. దీనితో పాటు మందుల కంపెనీలకు వారు కొత్త కొత్త గా తయారు చేస్తున్న ఆంటీ బయాటిక్స్ ను భారతదేశంలోనే కాకా ప్రపంచ వ్యాప్తం గా అమ్ముకోవచ్హు. అందుకే ఈ ప్రచారం" అని మనిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డా.సుదర్సన్ బల్లాల్ అన్నారు.

"బ్రిటన్ వారు చెబుతున్న "సూపర్ బగ్" ఒక పెద్ద "సూపర్ బ్లఫ్" అని చెబుతూ "ఈ విషయం గురించి ఆలోచించడానికి భారత ఆరోగ్య శాఖ ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది" అని ఆరోగ్య శాఖా అధికారి తెలిపేరు.

దుబాయ్ డాన్సింగ్ ఫౌంటన్....వీడియో

అద్భుతమైన ఈ వీడియోని ఫుల్ స్క్రీన్ లో చూడండి

ఆశ్రమాల మీద పగ తీర్చుకోవాలని వారిని మోసంచేసేను...పట్టుబడ్డ ఇంజనీర్

ఓక ఆశ్రమంలోని స్వాముల వారి వలన మోసపోయి, ఆ బాధతో మంచాన పడి చనిపోయిన తన తండ్రి యొక్క చావుకు కారణమైన స్వాముల వారిపైనా, అలాగే వారిని నమ్ముకుని వారి దగ్గరకు వస్తున్న అమాయక ప్రజలను మోసం చేస్తున్న స్వాముల పైనా మరియూ ఆశ్రమాల పైనా పగ తీర్చుకోవాలని, అంతర్జాలం మూలంగా 8 ఆశ్రమాలను 6 లక్షల రూపాయలదాకా మోసం చేసిన ఇంజనీర్ ను పోలీసులు పట్టుకున్నారు.

ఆశ్రమాలనూ,స్వాములనూ మోసం చేసి సంపాదించిన డబ్బును రాబిన్ హుడ్ లాగా పేదవారికోసం ఖర్చు పెట్టేడు ఈ ఇంజనీర్.

చెన్నై మైలాపూర్ లో ఉన్న శ్రీ రమణ కేంద్ర ఆశ్రమం వారు, తమ ఆశ్రమానికి ఉచితంగా కార్లను డొనేట్ చేస్తానని వచ్హిన ఈ మైల్లో మోసం ఉన్నదని గ్రహించి, ఆ ఈమైల్ విషయాన్ని పోలీసులకు తెలిపేరు.

పోలీసుల విచారనలో ఆ ఈమైల్ ఆంద్ర రాష్ట్రానికి చెందిన ఏలూరు నుండి వచ్హిందని తెలుసుకుని, ఏలూరు వెళ్లి ఆ ఈమైల్ ను పంపిన 39 సంవత్సరాల ఆర్.ప్రకాష్ అనే అతన్ని అరెస్ట్ చేసేరు.

"ప్రకాష్ తమిళనాడులోని మధురై కు చెందిన వాడు. తన ఇంజనీరింగ్ డిప్లమో ముగించిన తరువాత 19991 లో హోసూర్ లోని ఒక కార్ల కంపెనీలో పనిచేసేడు. అదే కంపెనీలో అతని తండ్రి రాజగోపాలన్ కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పనిచేస్తూ, అన్నా యూనివర్సిటీలో తన భ్.ఏ ముగించిన ప్రకాష్ అదే కంపెనీలో 2003 వరకు పనిచేసేడు. అతని తండ్రి రాజగోపాలన్ రిటైర్ అయ్యేరు. రిటైర్మెంట్ బెనిఫిట్ క్రింద ఆయనకు 3.5 లక్షలు ఇచ్హేరు"

"కుటుంభంలో సమస్యలు రావడం వలన రాజగోపాలన్ మరియూ అతని అన్నదమ్ములు నడుపుతున్న బట్టల కొట్టుకు డబ్బు సమస్య వచ్హింది. కుటుంభ సమస్యలు తీరడానికీ మరియూ తన అన్నదమ్ములలో సమైఖ్యత రావటానికీ ఏదైనా పరిహారం చెప్పమని ఆయన ఒక ఆశ్రమానికి వెళ్లి అక్కడున్న స్వాముల వారిని అడిగేరు. ఆ స్వాముల వారు రాజగోపాలన్ దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకుని ఏవో పరిహార పూజలు చేయించేరు. ఫలితం లేదు. కుటుంభ సమస్యలతో పాటూ, ఆశ్రమం వలన 2 లక్షలు నష్టపోయేననే భాధతో రాజగోపాల్ మంచం పట్టేడు. నెలరోజుల తరువాత ఆయన చనిపోయేడు. ఆ తరువత నెల ఆయన భార్య కూడా చనిపోయింది"

"అనాధగా నిలబడ్డ ప్రకాష్ లో నిరుస్చాహం చోటుచేసుకుంది.ఆశ్రమాల మీద, స్వాముల వారి మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. దొంగ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేడు. ఈ లోపు ప్రకాష్ ఏలూరుకు చెందిన ఒక వితంతువును కలిసేడు. ఆమె చెప్పిన విషయం విని ఆమె మీద జాలితో ఆమెను పెళ్ళిచేసుకుని ఏలూరులో సెట్టిల్ అయ్యేడు. ఏలూరు నుండి తన పని మొదలుపెట్టేడు"

“ఆశ్రమాలకు కార్లు డొనేట్ చేస్తానని ఈమైల్స్ పంపించేడు. సుమారు 100 ఆశ్రమాలకు పంపేడు. అందులో కొన్ని ఆశ్రమాలు ఆశపడి డొనేట్ చేయమని అడిగేరు. ఇన్స్యూరన్స్, రోడ్ టాక్స్ మరియూ ఏలూరు నుండి కారు తీసుకురావటానికీ 25,000/- నుండి 50,000/- రూపాయల దాకా ఖర్చు అవుతుందని, ఆ ఖర్చును మాత్రం ఆశ్రమం వారే పెట్టుకోవాలని, దానికి ఇష్టమైన వారు ఆ డబ్బును తన బ్యాంక్ అకౌంట్లో జమ చేయమని ఈ మైల్ చేసేడు. ప్రకాష్ అడిగినట్లే కొన్ని ఆశ్రమాలు డబ్బు జమ చేసినై"

అందులో ఒక ఆశ్రమం నిజంగానే అనాధ పిల్లల కొరకు ఆశ్రమం నడుపుతోందని తెలుసుకున్న ప్రకాష్ ఆ ఆశ్రమం పంపిన డబ్బును వారికి తిరిగి ఇచ్హేస్తూ దానితో పాటు మరి కొంత డబ్బును డొనేషన్ గా పంపేడు. అంతే కాక కొంత మంది పేదవారికి స్కూల్ ఫీజులు, మరి కొంతమంది పేద వారికి వైద్యానికి డబ్బు సహాయం చేసేడు" అని ప్రకాష్ ను విచారించిన ADCP సుధాకర్ గారు ఒక ప్రముక దిన పత్రికకు ప్రకాష్ కేసు వివరాలను అందిస్తూ "అతను పేదలకు సహాయం చేసినా, అతను మోసం చేసింది చట్ట రీత్యా తప్పు. ప్రకాష్ ని ఈ రోజు కోర్ట్ లో హాజరు పరుస్తున్నాం" అని తెలిపేరు.

Wednesday, August 11, 2010

భార్య సాహసం....భర్త విడుదల

ధైర్యం గల ఒక స్త్రీ కీకారణ్య అడవిలోకి ఒక్కతిగా వెళ్ళి డెకాయట్స్ చే అపహరించుకు పోబడ్డ తన భర్తను కాపాడుకున్నది.

మధ్యప్రదేశ్ లో ఉన్న చాంబల్ వాలీ అడవులలో ఉంటున్న కొంతమంది డెకాయట్స్ డబ్బుకోసం ఆగస్ట్ 6 వ తారీఖున అజీత్ సింగ్ అనే ఆయన్ను ఆగ్రా నుండి తిరిగి వస్తుండగా ఎత్తుకుపోయేరు. ఈయన్ను ఎత్తుకుపోయిన భీమా గ్యాంగ్ కు చెందినవారు, ఆ తరువాత ఈయనను కొంత డబ్బుకు ముఖియా గ్యాంగ్ వారికి అమ్మేరు. ముఖియా గ్యాంగ్ వారు ఈయన భార్య సావిత్రీ గురియా కు ఫోన్ చేసి వాళ్ళు అడిగినంత డబ్బు (వారు ఎంత డబ్బు అడిగేరనేది తెలుపలేదు)ఇస్తే ఆమె భర్తను విడిచిపెడతామని లేకపోతే చంపేస్తామని బెదిరించేరు.

అజిత్ సింగ్ ఒక కాలేజీ లెక్చరర్. గ్రేటర్ నొయిడా లో ఉన్న BSF సొసైటీ కాలనీలో కాపురముంటున్నారు.

తన దగ్గర అంత డబ్బులేదని, తమ కుటుంబ ఆర్ధీక పరిస్తితి బాగలేదని, తాము సాదారణ మధ్య తరగతి వారమని కనుక తన దగ్గరున్న కొంత డబ్బు, నగలు తీసుకుని తన భర్తను వదిలిపెట్టమని సావిత్రీ డెకాయట్స్ తో ఫోన్లో ప్రాధేయ పడింది. ఆమె ఏడుపుకు కరిగిపోని ఆ డెకాయట్స్ ఆమె ప్రాధేయతను వినక ఆమెతో వారు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆమె భర్తను చంపేస్తామని, దానికి ఒక గడువు పెట్టి ఆ లోపు డబ్బు పోగుచేసుకోమని బెదిరించేరు.

తన భర్తను విడిపించుకునే దారి తెలియక సావిత్రి విషయాన్ని తన తమ్ముడికి తెలియపరచి, తన భర్తను కాపాడుకోవటానికి తానే స్వయంగా అడవిలోకి వెళ్ళాలని నిర్ణయించు కున్నది. వెంటనే తనదగ్గరున్న కొంత డబ్బునూ, తన నగలనూ ఒక మూటగా కట్టుకుని చాంబల్ వాలీ అడవిలో తన భర్త ఎక్కడుంటాడో, అక్కడికి ఎటువైపుగా వెళ్ళాలో కూడా తెలియని పరిస్తితులలో చాంబల్ అడవిలోకి తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది సావిత్రీ గురియా.

కీకారణ్యమైన చాంబల్ అడవిలో నుండి బయట ప్రపంచాన్ని కాంటాక్ట్ చెయటానికి ఆమె దగ్గర ఒక సెల్ ఫోన్ మాత్రమే ఉన్నది. ఆ సెల్ ఫోన్లో సిగ్నల్ కూడా లేదట. అయినా ధైర్యంగా ఆ దట్టమైన అడవిలో నడవ సాగింది. 8 గంటల నడక తరువాత అనుకోకుండా ఆ డెకాయట్స్ సావిత్రీకి ఎదురయ్యేరు. ఇలాంటిది జరుగుతుందని ఎదురుచూడని ఆ డెకాయట్స్ ఆమె ను చూసి ఆశ్చర్య పోయేరు. దట్టమైన, భయంకరమైన డెకాయట్స్ ఉండే చాంబల్ వాలీకి ఆమె ఒంటరిగా రావటం వారిని ఆలోచింపచేసింది.

ఆమె కధను పూర్తిగా విన్న డెకాయట్స్, భర్త కోసం తన ఫ్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్దపడి, ధైర్యసాహసాలతో అడవిలోకి రావటం చూసి, ఆమె ధైర్యాన్నీ మెచ్హుకుని ఆమెకు రూ.5,100/- బహుమతిగా ఇచ్హి, భర్త పై ఆమె చూపిన ప్రేమకు తల వొగ్గి ఆమె కాళ్ళకు నమస్కరించి ఆమె భర్తను విడిచిపెట్టి ఆమెకు అప్పగించేరు.

భర్తతో తిరిగి వచ్హిన సావిత్రీ గురియా ను కలవడానికి పత్రికా విలేఖర్లు ఆమె ఇంటికి వచ్హినప్పుడు "నాకు డెకాయట్స్ మీద కోపం లేదు. నా భర్త నా దగ్గరకు తిరిగి వచ్హేరు. అంతే చాలు. వారు డెకాయట్స్ గా మారడానికి వారికి ఏవో కారణాలున్నాయి. అవి నాకు అనవసరం" అని చెప్పింది.

ప్రాణాలు తీసే డెకాయట్స్ దగ్గర నుండి భర్తను కాపాడుకొచ్హిన ఈ సావిత్రీ గురియాను కలియుగ సావిత్రి అని అక్కడి ప్రజలు ఈమెను పొగడుతున్నారు...నిజమే.

Tuesday, August 10, 2010

చికాగో(అమెరికా)లోని స్వామి నారాయణ గుడి...ఫొటోలు మరియూ వీడియో

చికాగో(అమెరికా)లోని స్వామి నారాయణ గుడి...ఫొటోలు
చికాగో(అమెరికా)లోని స్వామి నారాయణ గుడి...వీడియో

1000 సంవత్సరాల తరువాత మాస్కో(రష్యా)లో విపరీతమైన ఎండలు,వడగాల్పులూ...నగరాన్ని వదిలి వెడుతున్న ప్రజలు(వీడియో)

రష్యాలోని మాస్కో నగరంలో వీస్తున్న వడగాల్పులకు, నగరాన్ని చుట్టుకున్న అడవి మంటల పొగకూ చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నందున మాస్కో నగరంలోని మార్చురీలలో చోటులేకుండా పోతోందట.

తట్టుకోలేనంత ఎండనూ, వేడినీ మరియూ వడగాల్పులనూ ఇంతగా చూడటం ఈ 1000 సంవత్సరాలో ఇదే మొదటిసారిట. ఈ ఎండ వేడికి మాస్కో నగరం చుట్టూ ఉన్న దట్టమైన అడవులు తగలబడటంతో అందులోనుండి వెలువడతున్న పొగ మాస్కో నగరాన్ని చుట్టుముట్టడంతో గాలిలో కార్బన్ మొనో ఆక్సైడ్ ఎక్కువై గాలిలో ప్రాణ (ఆక్సిజెన్)వాయువు తక్కువవటంతో చాలామంది ఆరోగ్య సమస్యల్తో చనిపోతున్నారట.

రోజూ ఎండ తాకిడి 100 డిగ్రీలు(ఫారెన్ హీట్ లో) ఉండటంతోనూ, నగరంలోని పొగ వలననూ రోజుకు సుమారు 700 మంది దాకా చనిపోతున్నారట.

ఎండ, వడగాలీ ఇంకో వారం రోజుల దాకా ఉంటుందని, అడవులలో ఏర్పడిన మంటల వలన ఏర్పడిన పొగ నగరాన్ని వదలటానికి మరో 10 రోజులు పడుతుందని కాబట్టి నగర ప్రజలు ఇళ్ళల్లో నుండి బయటకు రావద్దని అధికారులు ప్రజలకు చెప్పడంతో ఒక్క ఆదివారం నాడు మాత్రం 1,04,000 మంది నగరం వదిలి వెళ్ళేరట.

మిగిలిన విషయాల గురించి ఈ వీడియో మూలంగా తెలుసుకోండి.


లివ్-ఇన్-రిలేషన్ షిప్(LIVE_IN_RELATIONSHIP) లో ద్రోహం చెసేరనే అభియోగానికి తావులేదు....డిల్లీ హై కోర్ట్

"పెళ్ళి చేసుకోకుండానే దంపతులుగా కాపురం చేసే భాగస్వాములలో ఎవరైనా ఒకరు విడిపోవాలనుకుంటే చట్ట పరిణామాలతో పనిలేకుండా కాపురం నుండి వీడి వెళ్లవచ్హు. అలా వెళ్లిపోయిన వారిమీద మరొకరు ద్రోహం చేసేరనే అభియోగం మోపలేరు" అని డిల్లి హై కోర్ట్ తెలిపింది.

"పెళ్ళి చేసుకోకుండానే దంపతులుగా కాపురం చేయాలనుకునే సిద్దాంతం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కాపురంలోకి అడుగు పెట్టవచ్హు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కాపురం వదిలి వెళ్లవచ్హు అనే బాంధవ సూత్రానికే పరిమితం. ఈ బాంధవము లో ఎటువంటి కట్టుబాట్లూ, చట్ట పరిణామాలూ లేవు" అని జస్టీస్ ఎస్.ఎన్.దింగ్రా తన తీర్పులో చెప్పేరు.

పెళ్ళి కాకుండా తనతో కాపురం చేసి లండన్లో ఉంటున్న లాయర్ అలోక్ కుమార్ ఇప్పుడు తనకు ద్రోహం చేసి మరొక ఆమెను పెళ్ళిచేసుకుంటున్నాడని, అతని మీద కఠిన చర్య తీసుకోవాలని క్రిమినల్ కేసు పిటీషన్ పెట్టింది ఒకామె.

"పెళ్ళి చేసుకోకుండానే దంపతులుగా జీవించే వారిలో ఒకరి మీద ఒకరు ద్రోహం చేసేరనో, అవినీతి గా ఉంటున్నారనో ఫిర్యాదు చేయలేరు. ఎందుకంటే లివ్-ఇన్-రిలేషన్ షిప్ లో పెళ్లైన మొగాడు-పెళ్ళికాని ఆడది లేక పెళ్లైన ఆడది-పెళ్ళికాని మొగాడు ఉండవచ్హు" అని జస్టీస్ తన తీర్పులో తెలిపేరు.

లండన్లో నివసిస్తున్న లాయర్ అలోక్ కుమార్ తన ప్రతివాదనలో తాను ఈమెతో కాపురం చేయడం తన తల్లితండ్రులకు ఇష్టంలేదని, కనుక తాను ఈ కాపురం నుండి విడిపోదలచుకున్నానని, కాబట్టి కోర్టు తనపై మోపబడిన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కొరేరు.

"పెళ్ళి చేసుకోకుండానే కాపురం చేయాలనుకునేది ఇద్దరి మధ్య రాసుకోని ఒక ఒప్పందం. ఈ ఒప్పందాన్ని ప్రతిరోజూ మల్లీ రాసుకున్నట్లే అవుతుంది.ఏ రోజైనా కాపురంచేసే ఇద్దరిలో ఎవరికికైనా కాపురంచేయటం నచ్హకపోతే, వారు ఇంకొకరికి చెప్పకుండా రాసుకోని ఒప్పందాన్ని రద్దుచేసుకుని వెళ్లవచ్హు" .

"పెళ్లి చేసుకోకుండా కాపురం చేయకూడదనుకునే వారు, పెళ్లి అనే కట్టుబడిలోకి వెళ్లి పెళ్ళిచేసుకుని కాపురం చేయాలి. అప్పుడు వారికి బద్రత, చట్ట పరిణామాలు వర్తిస్తాయి" అని తన తీర్పులో తెలుపుతూ లాయర్ అలోక్ కుమార్ మీద పెట్టిన క్రిమినల్ కేస్ FIR ను రద్దు చేస్తూ ఆమె పిటీషన్ ను తోసిపుచ్హేరు.

Monday, August 9, 2010

చంద్రముఖి ప్రేతాత్మ సినిమా వారిని వెంటాడుతోందా?!

ఈ రోజుల్లో కూడా ప్రేతాత్మలు ఉన్నాయని, అవి మనుష్యులను వెంటాడతాయని చెబితే ఎవరూ నమ్మరు. కానీ తెలుగులో చంద్రముఖి సినిమా 2 వ భాగాన్ని(నాగవల్లి)తీస్తున్న సినిమా యూనిట్లోని కొందరు మాత్రం నమ్ముతున్నారు. కారణం ఆ యూనిట్లో పనిచేస్తున్న, ఆరొగ్యవంతుడైన 66 సంవత్సరాల కారు డ్రైవర్ హట్టాత్తుగా మరణించేడు. హార్ట్ అటాక్ వలన చనిపోయేడని డాక్టర్లు తెలిపేరు. డ్రైవర్ హార్ట్ అటాక్ వలనే చనిపోయేడని ఆ సినిమా యూనిట్లోని వారు నమ్ముతున్నా దానికి కారణం చంద్రముఖి ప్రేతాత్మే నని వారు నమ్ముతున్నారు. దీనికీ కారణం ఉన్నదని చెబుతున్నారు.

కన్నడ చంద్రముఖి(ఆప్తమిత్ర)లో చంద్రముఖిగా నటించిన దక్షణ భారతదేశపు గొప్ప నటి సౌందర్య ఆ సినిమా రిలీజ్ అవటానికి నెల రోజుల ముందు చనిపోయింది.

కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ కన్నడ చంద్రముఖి 2 వ భాగం(ఆప్త రక్షక) లో హీరోగా నటించేరు. ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. కానీ ఈ సినిమా పూర్తైన తరువాత ఈయన హార్ట్ అటాక్ వచ్హి చనిపోయేరు.

ఆప్త రక్షక లో నటించిన హిరోయిన్ విమలారామన్ షూటింగ్ సమయంలో తను బస చేసిన హోటల్ రూములో ఒక నీడ కనబడిందని తెలిపి ఆ రోజు నుండి 10 రోజులు జ్వరంతో బాధ పడిందట. అలాగే చంద్రముఖి సినిమాలోని రా..రా పాటని పాడి డాన్స్ చేసిన టీనేజర్స్ కొందరు ట్రాన్స్ లోకి వెళ్లేరని చెబుతున్నారు.

ఈ వదంతులు విన్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రముఖి 2 వ భాగం లో నటించటానికి ఒప్పుకోలేదట. ఇంతే కాకుండా రజినీకాంత్ మైసూర్ మరియూ చెన్నై లో ఉన్న తన గ్రుహలలో చంద్రముఖి ప్రేతాత్మ ప్రభావం పోవటానికి "మ్రుత్యుంజయ" హోమాలు జరిపించేరట. ఇది నిజమేనని చాలామంది చెబుతున్నారు.

ఇప్పుడు కారు డ్రైవర్ చనిపోవటంతో తెలుగులో తీస్తున్న చంద్రముఖి-2(నాగవల్లి)సినిమా యూనిట్ వారు చంద్రముఖి ప్రేతాత్మ తిరుగుతోందని గుస గుస లాడుకుంటున్నారట.

రజినీకాంత్ నటించనని చెప్పటంతో వెంకటేస్ నటించటానికి ఒప్పుకున్నారట. ఆయనతో పాటూ అనుస్కా, పూనం కౌర్, కమిలినీ ముఖర్జీ మరియూ రిచా గంగోపాధ్యాయా నటిస్తున్నారు.

ఇలాంటిదేమీలేదు, ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని కొందరు చెబుతున్నా సినిమా పరిశ్రమలో కొందరు మాత్రం నమ్ముతున్నారట ...దీని వలనే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని కొందరు చెబుతున్నా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాత్రం "అలాంటిదేమీలేదు. వెంకటేస్ నటించ వలసిన సన్నివేసాలన్ని పూర్తి అయ్యింది. 70 శాతం సినిమా పూర్తి అయ్యింది. ఈ సంవత్సరం చివర ఈ సినిమా రిలీజ్ అవుతుంది" అని చెప్పేరు.

ఈయనను సమర్ధిస్తూ ఈ సినిమాలో నటిస్తున్న పూనం కౌర్ "చంద్రముఖి ప్రేతాత్మ తెలుగు వారి పైనా మరియూ కన్నడ వారి పైన మాత్రమే కక్ష తీర్చుకుంటుందా?... మళయాలం(మణిచిత్ర తాయూ) మరియూ హిందీ(భూల్ బుయ్యా) సినిమా వారి మీద తీసుకోదా?....ఇదంతా ఉత్త వదంతి...మా సినిమా యూనిట్లో ఎవరూ దీనిని నమ్మటంలేదు...భయపడటమూలేదు" అని చెప్పేరు.

మిధ్యా ప్రపంచంలో టీనేజర్స్ పెళ్లితో ఆటలు.....తల్లితండ్రులకు బాధలు

ఐ.టీ కంపెనీలో పనిచేస్తున్న ఒక అమ్మాయికి ఆమె తల్లితండ్రులు పెళ్ళిచేయాలని అనుకున్నారు. కానీ అమె విర్చువల్ మ్యారేజ్ సర్వీసస్ అందిస్తున్న ఒక వెబ్ సైట్లో తన 3 వ పెళ్ళికి వరుడ్ని వెతుకుతున్నదని అమె తల్లితండ్రులకు తెలియదు. ఆమె ఇదివరకే ఈ వెబ్ సైట్ మూలంగా ఇద్దర్ని పెళ్ళిచేసుకుని, వారి వేధింపులని భరించలేక వారికి విడాకులు ఇచ్హి ఇప్పుడు 3 వ వరుడ్ని వెతుక్కుంటోందట.

విర్చువల్ మ్యారేజ్ ప్రస్తుతం చాలామంది టీనేజర్స్ లో ఒక వెర్రిగా మారింది. అంతర్జాలములో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న చాలామంది టీనేజర్స్ విర్చువల్ ప్రపంచములో పెళ్ళైనవారే నని ఒక ప్రముక దినపత్రిక తెలిపింది.

విర్చువల్ మ్యారేజ్ లు పశ్చిమ దేశాలలో ఒక ఆటగా మారింది. ఇది అక్కడి తల్లితండ్రులలోనూ, విద్యారంగ నిపుణులలోనూ తీవ్రమైన వివాదాన్ని రేకెత్తింది. ఈ పెళ్ళిల్ల వలన కూడా సామాజిక స్పంధనలు ఏర్పడుతున్నాయట. పశ్చిమ దేశాలలోనే ఈ పెళ్ళిల్లు వివాదాత్మకంగా మారిందంటే మనదేశంలో ఈ పెళ్ళిల్ల వలన సాంప్రదాయలూ, కుటుంబ విలువలూ మరియూ కుటుంభ బంధుత్వాలూ బలహీన పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మనదేశంలో ఉన్నటువంటి టీనేజర్స్ లో చాలా మంది ఈ విర్చువల్ మ్యారేజ్ సర్వీసస్ ను అందిస్తున్న వెబ్ సైట్లలో రిజిస్టర్ చేసుకున్నారని ఒక సర్వే తెలియపరచింది. దీని ప్రక్రియ చాలా సులభం. ఒక యూసర్ నేం మరియూ పాస్ వర్డ్ తో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తరువాత తమ ఇష్టాన్ని మిగిలిన రిజిస్టర్డ్ యూసర్స్ కు ప్రతిపాదించాలి.

ఆ వెబ్ సైట్లలో ఆహ్వానం ఎలా ఉంటుందంటే "మీ స్నేహితులని పెళ్ళిచేసుకోవాలా? రిజిస్టర్ చేసుకోండి...మౌస్ క్లిక్ చేయండి...భార్యాభర్తలు అవండి". పెళ్ళిచేసుకోదలచుకున్నవారు వారి ఫొటోలని మార్చుకో వచ్హు. ఇష్టపడితే "ఎస్" నొక్క వచ్హు. లేకపోతే ఇంకొకరిని వెతుక్కోవచ్హు.

ఇలా ఫొటోలని పంపటంతో, ఆ ఫొటోలని పెట్టుకుని కొంతమంది ఆ ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారట. ఈ ఆడపిల్లలు నిజమైన పెళ్ళిల్లు చేసుకునేటప్పుడు వీటిని చూపించి బ్లాక్ మైల్ చేస్తున్నారట.

ఇందులో ఆశ్చర్య పరిచిన విషయమేమిటంటే ఒక్క మిధ్యా ప్రపంచ పెళ్ళి కూడా నిజమైన పెళ్ళిగా మారలేదుట. అయితే కొందరు మాత్రం మేము నిజ జీవిత భార్యాభర్తల లాగానే బ్రతుకుతున్నామని చెబుతున్నారట.

500 రూపాయలు కడితే మ్యారేజ్ సర్టిఫికేట్లు కూడా అందిస్తున్నాయట ఈ వెబ్ సైట్లు. అయితే ఈ వెబ్ సైట్లు అన్నీ ఈ విర్చువల్ మ్యారేజ్ లను ఒక ఆట క్రిందే తీసుకోవాలని, ఈ పెళ్ళిల్లు చట్టపరం కాదని తెలుపుతున్నా చాలా మంది ఈ పెళ్ళిల్లను సీరియస్ గా తీసుకుంటున్నారట.

"టీనేజ్ లో ఉండే వారికి అంతర్జాలములో చాటింగ్ చేసుకోవటం, విర్చువల్ మ్యారేజ్ లు చేసుకోవటం ఒక చాలెంజ్ గా తీసుకుంటున్నారు. టీనేజ్ లో ఉండే వారికి నిజ జీవితానికీ, మిధ్యా ప్రపంచానికీ తేడా తెలియటం లేదు. కానీ ఇవి వారి మనస్తత్వాన్ని దెబ్బతీస్తాయి. కనుక పెద్దలే జాగ్రత్త పడాలి" అని ఒక సైకాలజిస్ట్ తెలిపేరు.

ఇలాంటి వెబ్ సైట్లను బాన్ చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటే చాలమంది టీనేజర్స్ ని ఈ మిధ్య లో పడకుండా అడ్డుకోవచ్హు.

Saturday, August 7, 2010

తన గుడి పవిత్రతను పాడుచేయాలనుకునే వారిని శ్రీవారే శిక్షిస్తారు.....చంద్రబాబు

తిరుమల తిరుపతి దేవస్థానం ను తప్పనిసరిగా శుభ్ర పరచవలసిన అవసరం ఎంతైనా ఉందనే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రబుత్వానికి ఒత్తిడి ఎక్కువౌతోంది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలను ఎత్తిచూపటాని మరియూ ఆపటానికి చేసే ప్రయత్నంగా మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు నిన్న తిరుపతిలో ఒక మెగా ధర్నాను నిర్వహించి ఆ తరువాత శ్రీవారి దర్శనం కోసం ఏడుకొండలను ఎక్కడం ప్రారంభించేరు.

ప్రపంచంలోనే అత్యధిక ఐశ్వర్యము కలిగిన గుడిగా ప్రశిద్దికెక్కిన తిరుమల గుడిని పాలన చేస్తున్న ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాగాన్ని వెంటనే మార్చాలని, టి.టి.డి బోర్డ్ లో ఆరోపణలు మోపబడిన వారిని వెంటనే తొలగించి వారి స్తానంలో నిజాయతీ పరులనూ మరియూ దేముని మీద నమ్మకమున్నవారిని నియమించాలని ఆయన అడిగేరు.

కొద్ది నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థానం అవినీతి ఆరోపణల కారణాల వలన వార్తలలో చోటుచేసుకుంది. ఇందులో ముఖ్యమైనవి ఆర్జిత సేవా టికెట్లలో జరిగిని మోసం, బంగారు డాలర్లు మాయమవుట, అధికార యంత్రాంగంలో తగువులాట మరియూ సాదారన భక్తులకు అవస్తలు కలిగించే విధముగా టి.టి.డీ అధికారులకు కావలసిన వారికి స్వామి వారి దర్శనానికి ప్రాధాన్యం ఇవ్వటం.

మెగా దర్నాలో కలుసుకోవటానికి చిత్తూరు జిల్లా లోని ప్రజలు చాలామంది వచ్హేరు. వారినుద్దేసించి మాట్లాడుతూ "తిరుమల గుడి యొక్క పవిత్రతను కాపాడటానికి ఒక పోరాటం చేయవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కాంగ్రెస్ పరిపాలన ఒక క్రమ పద్దతితో తిరుమల పవిత్రతను నాశనం చేసింది" అని చంద్రబాబు చెప్పేరు.

ఈ మధ్య కాలంలో తిరుమల గుడిలో జరుగుతున్న అవినీతిని ఎత్తిచూపటానికి పోరాటం చేపట్టిన రాజకీయ నాయకులలో చంద్రబాబు గారి పోరాటం రెండవది. తిరుపతి ఎం.ఎల్.ఏ మరియూ ప్రజారాజ్యం పార్టీ అధినేత దీనికోసం పోరాటం చేస్తూ కాలినడకన ఏడుకొండలను ఎక్కేరు.

"తిరుమల గుడిలో జరుగుతున్నదేది నిజాయతిగా జరగటంలేదు. దేముని మీద నమ్మకంలేని వారిని టి.టి.డీ బోర్డ్ అధికారులుగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సినిమా టికెట్లలాగా దర్శనం టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్మేరు. తిరుమల గుడి నియమ నిబంధనలను ఏ.వీ.ధర్మా రెడ్డి గారికి కావలిసినట్లు మార్చుకున్నారు. నేను రాజకీయ లబ్ధికోసం ఈ పోరాటం చేపట్టలేదు. దేముడు అందరికీ చెందినవాడు. కనుక తిరుమల గుడి యొక్క పవిత్రతను కాపాడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. తన గుడి పవిత్రతను చెడిపేవారిని ఎలా శిక్షించాలో శ్రీవారికి తెలుసు. ఆయన అలాంటివారిని ఇంతకుముందు శిక్షించేరు...రాబోవు కాలంలో కూడా శిక్షిస్తారు" అని ఆయన చెప్పేరు.

Friday, August 6, 2010

సూర్యుని కాంతి వలయం....అద్భుత ఫొటోలు

మామూలుగా సూర్యుని కాంతి వలయాన్ని చూడలేము. అతిపెద్ద, అడ్వాన్సెడ్ టెక్నాలజీ టెలెస్కోప్ తో చూసినా ఈ కాంతి వలయం కనబడదట. ఎందుకంటే సూర్యుని చుట్టూ 20,00,000 సెంటీగ్రేడ్ వేడి ఉండటం వలన, 10,000 సెంటీగ్రేడ్ వాతావరణంతో హైడ్రోజన్ గ్యాస్ ఉండటం వలన కాంతి వలయం కనబడదట.

అయితే పూర్తి సూర్య గ్రహణం రోజున, సూర్యుడిని చంద్రుడు పూర్తిగా అడ్డుకోవటంవలన కాంతి వలయాన్నీ మరియూ గ్యాస్ విడుదలనూ చూడగలరు.

2008 ఆగస్ట్ నెల మంగోలియాలో ఏర్పడిన పూర్తి సూర్య గ్రహణం రోజున తీసిన 38 ఫొటోల కలయికతో ఈ ఫొటోలను రూపొందించేరు. కాంతివలయం నుండి బయటకు వచ్హే హీలియం మరియూ హైడ్రొజన్ గ్యాస్ 8,65,000 మైల్ల వెడల్పు ఉంటుందట. ఇది భూమి వెడల్పు కంటే 100 రెట్లు ఎక్కువట.

సూర్య గ్రహం లోనూ కంపనలు (Solar Quakes) ఏర్పడతాయట. దీనివలన కాంతివలయం నుండి బయటకు వచ్హే గ్యాస్ కొన్ని మిల్లియన్ల మైల్ల దూరం వరకు వస్తుందట. దినినే సోలార్ స్టాం (Solar Storm) అంటారు. 1859 లో అలాంటి సొలార్ స్టాం భూమిని తాకిందట. దీనివలన ఆ రోజుల్లో ఉన్నటువంటి టెలిగ్రాఫ్ వైర్లు కరిగిపోయి చాలా నష్టం ఏర్పడిందట.

అదేలాంటి సోలార్ స్టాం ఇప్పుడోస్తే మన ఎలెక్ట్రిసిటీ గ్రిడ్ లు, ఇంటెర్ నెట్ లైన్లు, ఫోన్లు తోపాటూ మొత్త కమ్యూనికేషన్ సెటిలైట్లు దెబ్బతింటాయట. ఇలాంటి సోలార్ స్టాం 2012 లో భూమిని తాకు తుందని చెబుతున్నారు.

UFO ను ఎదుర్కొన్న సమాచార ఫైల్స్ ను విడుదలచేసిన బ్రిటీష్ ప్రభుత్వం....అసలు విషయం

గురువారం నాడు బ్రిటీష్ ప్రభుత్వం UFO ల గురించిన సమాచార ఫైల్స్ ను(ఇంతవరకు వీటిని రహస్య ఫైల్స్ గా ఉంచేరు) విడుదల చేసింది. ఈ ఫైల్స్ ను మాత్రమే విడుదలచేసుంటే ఈ రోజు ఈ విషయం గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకోనుండరు. ఈ ఫైల్స్ తో పాటూ ఒక ఉత్తరాన్ని కూడా విడుదలచేసేరు. ఆ నాటి బ్రిటీష్ ప్రధాన మంత్రి విన్స్ టన్ చర్చ్ హిల్ UFO గురించిన సమాచారాన్ని కనీసం 50 సంవత్సరాల వరకు రహస్యముగా ఉంచమని చెప్పినట్లు ఎవరో రాసిన ఆ ఉత్తరాన్ని కూడా విడుదల చేసేరు. ఈ ఉత్తరమే ఇప్పుడు అసలు చర్చగా ఉంది.

విన్స్ టన్ చర్చ్ హిల్ రహస్యాలను దాచటంలో ప్రతిభావంతులని చాలామందికి తెలుసు. అందువలన UFO విషయాలని ఆయన దాచమని చెప్పివుండవచ్హునని అందరూ నమ్ముతున్నారు. కానీ ఆ ఉత్తరం అధికార పూర్వముగా గాని లేక ఆయన సంతకము పెట్టినదిగా గానీ లేదు. అలాంటప్పుడు UFO ల గురించిన ఫైల్స్ ను బ్రిటీష్ ప్రభుత్వం ఇప్పుడెందుకు బయటపెట్టింది.

అసలు విషయం

రెండవ ప్రపంచ యుద్దం జరుగుతున్నప్పుడు ఒక బ్రిటీష్ యుద్ద విమాన పైలట్ తాను ఒక UFOను ఎదుర్కున్నానని , ఆ UFO తన విమానాన్ని కొంతదూరం తరుముకుని వచ్హిందని తెలిపేడు. ఆ UFO ఎలా ఉన్నదో గూడా వివరించేడట. ఈ విషయాన్ని కనీసం 50 సంవత్సరాల దాకా బయటకు చెప్పవద్దని, రహస్యముగా ఉంచండని చర్చ్ హిల్ ఉత్తర్వు వేసేరట. కారణం, UFO ల గురించి ప్రజలకు తెలిస్తే భయపడతారనీ మరియూ మతం మీద వారికి నమ్మకం తగ్గిపోతుందని, కాబట్టి రహస్యముగా ఉంచవలసిందని చెప్పేరట.

ఈ ఉత్తరవు జారీచేసినప్పుడు చర్చ్ హిల్ అమెరికాలో అప్పటి అలైడ్ సైనిక దళాల కమాండర్ జెనెరల్ డ్వెట్ ఈసిణోవర్ తో రహస్య చర్చలలో ఉన్నారట. ఆయన అక్కడి నుండే ఉత్తరవును జారిచేసేరట. ఆయన ఆ ఉత్తరువును జారీచేసిన దానిని ఆ రోజు ఆయనకు సెక్యూరిటీ గార్డ్ గా ఉన్న ఒక ఆఫీసర్ విన్నారట. ఆ ఆఫీసర్ ఈ వుత్తరువు విషయాన్ని తనలోనే కొన్ని సంవత్సరాలు దాచుకుని 1973 లో చనిపోతూ తన భార్యకూ, కూతురికీ చెప్పేడట. కూతురు ఈ విషయాన్ని తన కొడుకుతో చెప్పిందట. 1999 లో ఆమె కొడుకు (సెక్యూరిటీ ఆఫీసర్ మనవడు) UFO ల గురించిన పాత రహస్య ఫైల్లను వెదికి తీయవలసిందిగా బ్రిటీష్ అధికారులను కోరేడట. బ్రిటీష్ ప్రభుత్వం ఆ ఫైల్లను ఇప్పుడు విదుదలచేసింది.

ఈ ఫైల్స్ లో ఎక్కడా చర్చ్ హిల్ UFO ల గురించి రహస్యముగా దాచమని ఉత్తర్వు చేసిన అధికార పత్రం లేదట. UFO లను చాలా మంది చూసేమని చెప్పిన విషయాలు, ఎదుర్కొన్నామని విమాన పైలట్లు చెప్పిన విషయాలు మాత్రం ఉన్నాయట. UFO ను చూసేమని చెప్పిన ప్రతిసారీ దాని గురించిన అన్వేషణలో చూసింది UFO కాదని రాసుందట.

ఈ మధ్య చైనాలో కనబడ్డ UFO గురించిన విషయాలనూ, దానికి సంబంధించిన వీడియోని నేను ఇంతకుముందు ఒక టపాలో అందిచేను. ఈ UFO గురించిన అన్వేషణా విషయాలను చైనా ఇంకా బయటకు చెప్పలేదు.

Thursday, August 5, 2010

రాష్ట్ర విభజన విషయంలో ఆత్మహత్యలకు రాజకీయనాయకులే బాధ్యులు.....లగడపాటి

శ్రీక్రిష్ణా కమిటీకి తన నివేదికను అందించిన తరువాత విలేకర్లతో మాట్లాడుతూ "రాష్ట్ర విభజన కోసం తెలంగాణా, రాయలసీమ మరియూ ఆంద్రా ప్రాంతాలలో అమాయక ప్రజలు చేసుకుంటున్న ఆత్మహత్యలకు రాజకీయ పార్టీలూ మరియూ రాజకీయ నాయకులే బాధ్యులు. కాబట్టి ఈ విషయంలో అమాయక ప్రజలను ప్రొశ్చహిస్తున్న రాజకీయ నాయకులను ఖైదు చేయాలి. నేనూ బాధ్యత వహిస్తున్నాను. నన్ను కూడా ఖైదు చేయాలి" అని చెప్పేరు.

"ఈ విషయంలో మొట్టమొదట నన్ను ఖైదు చేయండి" అని చెబుతూ "రాష్ట్రాన్ని ముక్కలు చేయటం వలన ప్రజలకు ఎటువంటి ప్రయోజనమూ లేదు. ప్రయోజన పడేది రాజకీయ నాయకులే. కనుక అమాయక ప్రజలను ఆత్మహత్యలకు ప్రొశ్చహిస్తున్నారని క్రిమినల్ కేసులు పెట్టి రాజకీయ నాయకులను ఖైదు చేయాలి. ఈ విషయంలో పోలీసులు మొట్టమొదట నన్ను ఖైదుచేయవచ్హు" అన్నారు.

"కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపితే నేను రాజకీయాలను వదిలి వెళ్లిపోతాను. ప్రతి రాజకీయ నాయకుడికీ ముఖ్యమంత్రి అవాలనే కోరిక ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక ముఖ్యమంత్రి పదవి కనుక వీరు రాష్ట్రాన్ని విభజన చేయటానికి ప్రయత్నిస్తున్నారు" అని చెప్పేరు.

రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన, అందరికీ తెలిసిన 32 మంది ప్రముఖులను తనవెంట తీసుకు వెళ్ళి శ్రీక్రిష్ణ కమిటీని ఆశ్చర్యపరిచేరు లగడపాటి గారు. ఈ 32 మందిలో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ ఆఫీసర్లూ,ఎకనామిష్ట్ లు,డాక్టర్లు, సోషియల్ ఆక్టివిస్టులు, బిల్డర్స్, మానవ హక్కుల ఆక్టివిస్టులు, ఉద్యోగస్తులూ మరియూ ఇంజనీర్లు ఉన్నారు.

తెలంగాణా ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోది ఎన్.మాధవరావ్ గారు సమైఖ్య ఆంద్రానే సమర్ధించేరు. అలాగే తెలంగాణాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి పి.సివశంకర్ గారు కూడా లగడపాటి గారితో వెళ్లి తమ నివేధికను అందించేరు.

అమెరికాలోని భారతీయులకు భారత దేశంలో ఉద్యోగ అవకాశాలు....US జాబ్ ఫేర్ 2010

భారతదేశం అన్ని రంగాలలోనూ ఎదిగిందని చెప్పటంలో ఎటువంటి అనుమానమూ లేదు.

గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచ ఆర్ధీక రంగంలో భారతదేశం ముఖ్య పాత్ర వహించిందని అందరికీ తెలుసు. అందువలనే పెద్ద పెద్ద విదేశీ కంపెనీలు భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. భారతదేశ యాజమాన్యం ఆసియా మరియూ పసిఫిక్ దేశాలలో ప్రతిభ గల వారిని ఉద్యోగస్తులుగా ఎన్నుకునే విషయంలో అన్ని దేశాలకన్నా అగ్ర స్తానంలో ఉన్నది.

భారతదేశంలోని కంపెనీలు అంతర్జాతీయ కంపెనీలతో పోటీ పడుతున్నాయి. వ్యాపార పెరుగుదలతో అభివ్రుద్ది చెందుతున్న కంపెనీలలో 60 శాతం కంపెనీలు ప్రతిభ గల ఉద్యోగస్తుల కోసం వెదుకుతున్నారు. అధికమైన జీతాలను అందించటంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.

మంచి జీతాలూ మరియూ పెరుగుతున్న ఆర్ధీక పరిస్తితులూ విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులలో ఆశక్తి పెంచుతోందిట. వీరిలో చాలామంది స్వదేశానికి తిరిగి రావటానికి ఇష్టపడుతున్నారట. అలా అమెరికా నుండి తిరిగి రాదలచుకున్న NRI భారతీయులకు భారతదేశంలో ఉద్యోగ అవకాశాలివ్వడం కోసం సైన్.కాం (Shine.com) వారు 2 రోజుల జాబ్ ఫేర్ ను అమెరికాలో రెండుచోట్ల జరుపుతున్నది. న్యూజెర్సీలోనూ మరియూ సంటాకార్లా లోనూ జరుపనున్నారు. భారతదేశంలోని యాజమాన్యులూ, భారతదేశంలో ఉద్యోగం చేయాలనుకునే వారూ ఆ జాబ్ ఫేర్ లో మాట్లాడుకునే అవకాసాన్ని కల్పిస్తున్నారు. ఇలాంటి జాబ్ ఫేర్ లు ప్రపంచ ఆర్ధీక పరిస్తితి బాగున్నప్పుడు జరిపేరు. కానీ ప్రపంచ ఆర్ధీక పరిస్తితి కష్టాలను ఎదుర్కోని మళ్ళీ మెరుగుపడుతున్నప్పుడు జరపటం ఇదే మొదటిసారి.

ఈ జాబ్ ఫేర్ కి సరైన పేరు పెట్టేరు. "ఇండియా కాలింగ్" US JOB FAIR 2010.

ఈ జాబ్ ఫేర్ లో IT, R&D, FINANCE, INFRASTRUCTURE, RETAIL మరియూ BUSINESS DEVELOPMENT లో ఉన్నవారికి మంచి అవకాసాలున్నాయని చెబుతున్నారు.

అమెరికా ఆర్ధీక పరిస్తితి అనుకున్నంతగా మెరుగుపడనందున ఈ జాబ్ ఫేర్ అమెరికాలోని భారతదేశ ఉద్యోగస్తులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నారు.

Amazon, RBS, Cap Gemini, IBM మరియూ Akamai లాంటి పెద్ద కంపెనీలు ఈ జాబ్ ఫేర్ లో పాల్గొంటున్నారట.

ఆగస్ట్ నెల 28 మరియూ 29 వ తారీఖులలో న్యూజెర్సీలో ఉన్న రారీటాన్ సెంటర్ లోనూ, సెప్టంబర్ నెల 3 మరియూ 4 వ తారీఖులలో సంటాక్లారా లో ఉన్న సంటాక్లారా కన్వెన్షన్ సెంటర్లోనూ జరుగుతుందని తెలిపేరు.

Wednesday, August 4, 2010

ప్రత్యేక తెలంగాణా విషయంలో ఆంద్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ విభజన……..?

తెలంగాణా ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవటం మరియూ జగన్ ఓదార్పు యాత్రను ఆపలేకపోవడం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విభజనకు దారితీస్తోంది.

తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ ఎం.పీ లు మరియూ తెలంగాణాకు చెందని ఎం.పీ.లు మంగళవారం రాత్రి వేరు వేరు గా కలుసుకుని వారి కోరికల పై కాంగ్రెస్ హై కమాండ్ తో ఏ రకంగా మాట్లాడాలనే విషయంపై చర్చించుకున్నారు.

రాజ్య సభ ఎం.పి కేశవ రావ్ గారి ఇంటి దగ్గర మరియూ లోక్ సభ ఎం.పి కె.ఎస్ రావ్ గారి ఇంటి దగ్గర ఈ చర్చలు జరిగినై. ప్రత్యేక తెలంగాణా పై,తమ పార్టీ హై కమాండ్ డిసెంబర్-9 న వెనకడుగు వేసినప్పుడు రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ వాతావరణం గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ హై కమాండ్ పై ప్రత్యేక తెలంగాణా గురించి ఒత్తిడి తీసుకు వచ్హే విధముగా తెలంగాణా ఎం.పీ లు తెలంగాణా ప్రజలకు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణా ఇచ్హే విషయంలో వెనకడుగు వేయరని అభయమిచ్హేరు. "మా నాయకురాలు ప్రత్యేక తెలంగాణా ఇచ్హే విషయం లో అంగీకార భావంతో ఉన్నారు...దయచేసి విధ్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోకండి" అని ఎం.పి పొన్నాం ప్రభాకర్ గారు అభ్యర్ధన చేసేరు.

తెలంగాణా ఎం.పి. లు తమ నాయకురాలితో తెలంగాణా ప్రాంతానికి, తెలంగాణా కు చెందని మంత్రులను తెలంగాణాలో జరిగే పార్టీ మీటింగులకు గానీ, మరింకే విషయానికైనా గాని పంపవద్దని చెబుతారని తెలుస్తోంది. పల్లం రాజు, పురందేశ్వరి మరియూ పనబాక లక్ష్మీ లాంటి మంత్రులు ప్రత్యేక తెలంగాణా ను వ్యతిరేకిస్తున్న ప్రాంతాలకు చెందిన వారు కనుక వారిని పంపవద్దని చెబుతారట.

శ్రీ క్రిష్ణా కమిటీతో సద్దుమణిగిన ప్రత్యేక తెలంగాణా పోరాటాలూ, సమైక్య ఆంద్రా పోరాటాలూ మళ్ళీ తలెత్తే అవకాసాలున్నందున కాంగ్రెస్ హై కమాండ్ సంధిగ్ధంలో పడింది. తెలంగాణా ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారికి ప్రత్యేక తెలంగాణా విషయములో ఇంకేమీ మాట్లాడే వసతి లేదు కాబట్టి ప్రత్యేక తెలంగాణా ఇవ్వమని సోనియా గాంధీ ని కలిసి ఒత్తిడి చేస్తారని తెలుస్తోంది.

జగన్ విషయంలో కూడా కాంగ్రెస్ హై కమాండ్ తికమకలో పడింది. జగన్ ముఖ్య మంత్రి పదవి గురించి మాట్లాడక పోయినా, హై కమాండ్ వద్దన్న ఓదార్పు యాత్రను చేపట్టేరు. ఓదార్పు యాత్రలో కలుసుకోకూడదని చెప్పినా 28 ఎం.ఎల్.ఏ లు జగన్ కు మద్దత్తునిస్తున్నారని తెలిసింది. అంబాటి రాంబాబు ను సస్పెండ్ చేస్తే జగన్ ఓదార్పు యాత్రను ఆపుతారని అనుకున్న హై కమాండ్ కు చుక్కెదురవడంతో ఇరకాటంలో పడింది. ఆంద్ర రాష్ట్రంలో కాంగ్రెస్ హై కమాండ్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు విజయవంతం కావని కాంగ్రెస్ నాయకులలో కొందరు హై కమాండ్ కు ఇదివరకే చెప్పేరని చెబుతున్నారు .

Tuesday, August 3, 2010

ఐట్యూన్స్ (iTunes) లో మొదటి స్థానం వహించి ప్రపంచాన్ని ఊపిన ఎందిరన్ (రోబో) సినిమా పాటలు

మలేషియాలో 3 రోజుల క్రితం బ్రహ్మాండమైన ఫంక్షన్ తో ఆడియో రిలీజ్ చేసుకున్న తమిళ సినిమా ఎందిరన్ (తెలుగులో రోబో) పాటల మ్యూసిక్ ఆల్బం ఐట్యూన్స్ స్టోర్స్ ప్రపంచ మ్యూసిక్ ఆల్బం సెక్షన్ లో మంగళవారం నాడు కొంతసేపటి వరకు మొదటి స్థానం వహించి ఆ తరువాత రెండవ స్థానాన్ని దక్కించుకుంది.

ఒక తమిళ సినిమా మ్యూసిక్ ఆల్బం ఐట్యూన్స్ స్టోర్స్ లో టాప్ 10 ప్రపంచ మ్యూసిక్ ఆల్బంస్ లో చోటుచేసుకోవటం ఇదే మొదటిసారి.


అకడమీ అవార్డ్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ మ్యూసిక్ అందించ బడ్డ ఈ ఎందిరన్ సినిమాలో రజినీ కాంత్ హీరో గానూ, ఐశ్వర్యా రాయ్ బచ్హన్ హీరోయిన్ గానూ నటించేరనేది మీ అందరికీ తెలిసుంటుంది. అమెరికాలోనూ, బ్రిటన్లోనూ ఐట్యూన్స్ స్టోర్స్ లో రెండవ స్థానాని ఈ సినిమా మ్యూసిక్ ఆల్బం నిలబెట్టుకుంది.

ఐట్యూన్స్ వెబ్ సైట్లో చూపిస్తున్న 22 దేశాలలో, 16 దేశాలలో ఐట్యూన్స్ టాప్ 10 వొరల్డ్ మ్యూసిక్ ఆల్బంస్ లో మొదటి స్థానాన్ని ఇంకా ఏ.ఆర్.రెహమాన్ మ్యూసిక్ అందించిన స్లం డాగ్ మిలియనర్స్ సినిమాలోని పాటలే వహిస్తున్నాయి.

ఎందిరన్ సినిమా ఆడియో పాటలలోని సారాంసాన్ని అంతర్జాలములో ప్రచురన చేయటానికి హక్కులు కొనుకున్న తింక్ మ్యూసిక్ ఇండియా వెబ్ సైటు ఇప్పుడు భారతదేశంలోనే ఎక్కువమందిచే చూడబడుతున్న వెబ్ సైట్ గా ఉంటోంది. రోజుకు సుమారు 1,00,000 హిట్స్ వస్తున్నాయట.

ఈ సినిమా పాటల సీడీ లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, ఈ సినిమా ఆడియో సీడీ హక్కులను కూడా కొనుకున్న తింక్ మ్యూసిక్ వారు అత్యధిక సంఖ్యలో ... 2.5 లక్షల సీడీ లను తయారుచేస్తున్నారట. ఇందులో 1.75 లక్షల ఆడియో సీడీలు భారతదేశంలోనే అమ్ముడవుతాయని ఎదురుచూస్తున్నారు.

సన్ పిక్చర్స్ వారు మొదటి సారి స్వయంగా తామే నిర్మిస్తున్న ఈ ఎందిరన్ సినిమా తీయడానికి 110 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేరట.

ఈ సినిమా సెప్టంబర్ నెలలో విడుదలకు సిద్దమౌతోంది.

తల్లితండ్రుల కోరిక తీర్చటానికి వారిని భుజాల మీద ఎత్తుకుని 216 కిలోమీటర్లు నడిచిన యువకుడు

ఆశ్చర్యంగా ఉన్నది కదా? తల్లితండ్రులను అనాధ శరణాలయాలకో లేక ఓల్డ్ ఏజ్ హోంస్ కో పంపుతున్న ఈ కాలంలో ఇలా ఒక యువకుడు. తన తల్లితండ్రుల చిరకాల కోరికను నెరవేర్చటానికి వారిని తన భుజాలపై మోసుకుని 216 కిలో మీటర్ల దూరం నడిచి పుణ్య నది గంగ లో స్నానం చేయించేడు.

అందుకనే 42 సంవత్సరాల వయసున్న, సంజై కుమార్ అని పిలువబడే ఈ యువకుడిని "కలియుగ శ్రావణ కుమార్" అని చెబుతున్నారు ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు.

హిందుస్తాన్ టైంస్ దిన పత్రికకు ఇచ్హిన ఇంటర్వ్యూలో "నా తల్లి తండ్రులు నాకు దేముడితో సమానం. నా జీవితాంతం వారికి సేవ చేసుకుంటాను" అని చెబుతూ "చాలా మంది పిల్లలు "తల్లితండ్రులు" అనే మాటని సరిగ్గా అర్ధం చేసుకోవటంలేదు. వారే మనకి ఈ జన్మ నిచ్హింది. వారి కోరికలను పిల్లలుగా మనం మనకి చేతనైన విధముగా నెరవేర్చాలి" అని చెప్పేరు.

95 సంవత్సరాల వయసున్న అతని తండ్రి లాలారాం మరియూ 80 సంవత్సారల వయసున్న అతని తల్లి సావిత్రీ దేవి తమ కొడుకు తమ కోసం చేసిన సేవ గురించి చెబుతూ ఇలాంటి కొడుకు పుట్టటం తాము చేసుకున్న అద్రుష్టం అంటున్నారు.

పెళ్ళైన మొదటి రోజు నుండి అతని భార్య వెరే కాపురం పెట్టమని అతన్ని ఒత్తిడి చేసిందట. సంజై కుమార్ తన తల్లితండ్రులను వదిలి పెట్టనని ఖచ్హితంగా చెప్పడంతో ఆమె అతని నుండి వేరుబడి ఆమె తల్లితండ్రుల దగ్గర ఉంటోందట.

చిన్నప్పుడు అతని తాతయ్య, అమ్మమ్మ చెప్పిన కధల వలనే సంజై కుమార్ లో తల్లితండ్రుల మీద ప్రేమ, గౌరవం పెరిగిందట. తమ జీవితం ముగిసేలోపల ఒక సారైనా గంగా నదిలో స్నానం చేయాలని కోరికగా ఉందని తమ కోరికను కొడుకు దగ్గర చెప్పేరట. "మిమ్మల్ని నా భుజాల మీద ఎత్తుకునైనా సరే గంగా నదికి తీసుకు వెళ్ళి స్నానం చేయిస్తానని" వారితో అన్నాడట సంజై కుమార్.....ఒక రోజు ప్రొద్దున "మిమ్మల్ని నా భుజాల మీద ఎత్తుకుని గంగా నదికి తీసుకువెళ్ళబోతున్నాను" అని చెప్పేడట.

మేము వద్దని ఎంత బ్రతిమిలాడినా "నా కోరికను నన్ను నెరవేర్చుకోనివ్వండి" అని కాళ్ళ మీద పడి వేడుకున్నడట.

భారీ వర్షాన్నీ, గతుకుల రోడ్డునీ, తన భుజం మీద ఏర్పడ్డ బొప్పినీ లెక్కచేయక 115 కిలోల బరువున్న తల్లితండ్రులను తన భుజం మీద వేసుకుని రోజుకి 25-30 కిలోమీటర్ల దూరం నడిచేడట.....నేషనల్ హై వే 58 (NH 58) మీదున్న గ్రామస్తులు వండి పెట్టిన భొజనాన్ని తినడానికి మాత్రం తల్లితండ్రులను భుజం మీద నుండి దింపేవాడని NH 58 లోని గ్రామస్తులు తెలిపేరు. అలాగే వారు స్నానం చేయడానికి క్రిందకు దింపేవాడట.

డిల్లీలో ఉన్న సీలంపూర్ నుండి గంగా నదికి 216 కిలోమీటర్ల దూరమట. వీరి రాకను ముందే తెలుసుకుంటున్న NH 58 లో ఉన్న గ్రామ ప్రజలు వీరి రాక కోసం ఎదురుచూసి, వారు వచ్హినప్పుడు శ్రావణ మాసం కావటంతో, సంజై కుమార్ తల్లితండ్రుల కాళ్ళకు మొక్కు కుని వారి ఆశీర్వచనాలు తీసుకున్నారట. శ్రావణ మాసం కావటంతో సంజై కుమార్ ను కలియుగ శ్రావణ కుమార్ అని చెప్పుకుంటున్నారు.

Monday, August 2, 2010

అమర్నాథ్లో ఏర్పడే సహజసిద్ధ మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయిందా?

కాష్మీర్ వాలీలో ఘర్షణలు జరుగుతున్నా అమర్ నాధ్ యాత్రకు ఎటువంటి అంతరాయమూ కలుగలేదు. యాత్రీకులు ఎటువంటి ఇబ్బందులూ పడలేదు.

కానీ గత కొద్ది రోజులుగా కష్టపడి 12,729 అడుగుల ఎత్తులో ఉన్న గుహ గుడికి వెళ్లి మంచు గడ్డ శివలింగాన్ని దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులకు మాత్రం నిరాసే మిగిలిందట. అక్కడ మంచు తో తయారయ్యే శివలింగం పూర్తిగా కరిగిపోయిందట.

దీని గురించి అక్కడి అధికారులు నోరు మెదపకపోయినా, అక్కడ నుండి తిరిగి వచ్హిన భక్తులు మాత్రం అక్కడ ఇప్పుడు మంచు గడ్డ శివలింగం లేదు. పూర్తిగా కరిగిపోయిందని చెబుతున్నారు.

భారతదేశంలోని హిమాలయా పర్వతాల్లో వెలసిన అమర్నాథ్ సందర్శనం ఓ అద్భుత అనుభూతిని మనకు సొంతం చేస్తుంది. గడ్డకట్టే మంచులో అమరనాథ్ సందర్శన కోసం చేసే పయనంలో ఓ అందమైన లోకం మన కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. అమరనాథ్ యాత్ర కోసం దేశంలోని అనేకమంది ఎప్పుడా అని ఎదురు చూస్తుంటారు.

జులై నెలలో జరిగే ఈ పర్యటనకోసం దేశ వ్యాప్తంగా అనేకవేలమంది ముందస్తుగానే సిద్ధమవుతారు. హిమాలయాల్లోని అమర్నాథ్లో ఏర్పడే సహజసిద్ధ మంచు శివలింగాన్ని దర్శించడం కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగే ఈ యాత్ర అటు ఆధ్యాత్మికతతోపాటు ఇటు మనలో కాస్త భయాన్ని సైతం రేకెత్తించడం గమనార్హం.

ఎత్తైన పర్వతాలు ఓపక్క, అగాధాలను తలపించే లోయలు మరోపక్క పూర్తిగా నడక మీద ఆధారపడి సాగే ఈ పయనంలో మధ్య మధ్యలో స్థానికులచే ఏర్పాటు చేయబడిన భండారా క్యాంపుల్లో లభించే ఆతిధ్యం మరపురాని అనుభూతిని మిగులుస్తుంది. జమ్ము నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మధ్యలో ఎన్నో మజిలీలను దాటుతూ చివరకు అమర్నాథ్ చేరుకుంటుంది.

సతీసమేతుడైన పరమశివుడు సృష్టి రహస్యాలను తన భార్యకు వివరించడానికి కాలినడకన అమరనాథ్ పరిసరప్రాంతాల్లో విహరించాడని పురాణాలు చెబుతున్నాయి. అలా పరమశివుడు చుట్టిన ప్రదేశాలే అమర్నాథ్ యాత్రా సమయంలో మనకు మజిలీలై ఆకట్టుకుంటుంది.
అమర్నాథ్ యాత్రలో జమ్మూ నుంచి బయలుదేరి పహల్గాం గుండా చందన్వాడి చేరుకోవాలి. ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం దాదాపు 15 కిలోమీటర్లు ఉంటుంది. అనంతరం ఇక్కడినుంచి దాదాపు 12000 అడుగుల ఎత్తులో ఉన్న పిస్సు శిఖరంపైకి చేరుకోవాలి. ఈ శిఖరం పైకి ఎక్కే దారిలో అందమైన జలపాతాలు సుందరంగా కనిపించే ప్రకృతి మనల్ని ఆనంద పరవశుల్ని చేస్తుంది.

ఇక్కడి నుంచి దాదాపు 800 అడుగుల ఎత్తులో ఉన్న షెహనాగ్ ప్రాంతాన్న చేరుకోవాలి. ఇక్కడే అద్భుతమైన షెహనాగ్ సరస్సు ఉంది. ఈ సరస్సు గురించి స్థానికులు గొప్పగా చెబుతుంటారు. దీని తర్వాత దాదాపు 14000 అడుగుల ఎత్తులో ఉన్నమహాగునాస్ శిఖరాన్ని చేరాల్సి ఉంటుంది.

దీని తర్వాత ప్రాతం పంచతరుణి అనే ప్రాంతం. అయిదు నదులు ప్రవహించడం ద్వారా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. దీని తర్వాత ప్రాంతమే అమర్నాథ్ క్షేత్రం. అమర్నాథ్ క్షేత్రానికి చేరే దారిలో అనేక చిన్న చిన్న కొట్లు మనకు అందుబాటులో ఉంటాయి. వీటిలో పూజా సాముగ్రితోపాటు తినుబండారాలు కూడా లభిస్తాయి.

అలాగే అమరనాథ్ గుహకు దగ్గరే ఉన్న అమరావతీ నదిలో స్నానం చేసి మంచు లింగాన్ని దర్శించుకుంటారు. అమర్నాథ్ యాత్రకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చుతోంది. జమ్ములోని బేస్ క్యాంప్లో పేర్లు నమోదు చేసుకున్న వారిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ దర్శనానికి తీసుకుని వెళ్తారు.

ఇంత కష్టపడి దర్శనానికి వెడితే అక్కడ శివలింగం కరిగిపోయుండడం ఆశాభంగమే......అధికారులు యాత్రీకులకు ఈ విషయాన్ని ముందే తెలిపుండాలి.

ప్రక్రుతి అద్భుతాలతో నిండిపోయిన ప్రపంచం....4

ఒక అగ్ని పర్వతం పేలినప్పుడు అందులో నుండి వెలువడే లావా పారుతున్నప్పుడు నిటారుగా ఉండి చల్లబడేటప్పుడు ముడుచుకుపోతుందట. అలా ముడుచుకుపోయిన, చల్లరిన లావాలో కొన్నిరోజుల తరువాత పగుల్లు ఏర్పడుతాయట. అవి కూడా నిటారుగా చలా ముక్కలుగా పగులుతాయట. ఆ పగిలిన ముక్కలు కొండ రాళ్ళను ఒక శిల్పి అలా చెక్కినట్లు ఉంటుందట.
పక్కన మీరు చూస్తున్న ఫోటో ఐర్లాండ్ లోని అగ్ని పర్వతం పేలిన తరువాత అందులో నుండి వెలువడిన లావా చల్లబడిన తరువాత పగుళ్లతో నిటారుగా ఉన్నది.

ఈ లావా ముక్కలను బాసాల్ట్ అంటారట. నిలువుటాకారంలోనే కాకుండా రకరకాల ఆకారాలలో కూడా ఉంటుందట. చూడటానికి ఎవరో శిల్పి కొండను ముక్కల ఆకారంలో చెక్కినట్లు కనబడుతుండటం వలన ప్రక్రుతి అద్భుతాలలో ఒకటిగా చెబుతున్నారు.

Sunday, August 1, 2010

మితృలందరికీ...హాపి ఫ్రెండ్ షిప్ డే…….విడియో పాట

మితృలందరికీ...హాపి ఫ్రెండ్ షిప్ డే……విడియో పాట
మితృలందరికీ...హాపి ఫ్రెండ్ షిప్ డే