Monday, July 26, 2010

"మాత్రలు మాత్రమే చికిత్సకు సరిపోదు"ఇప్పుడు భారతదేశ డాక్టర్లు కూడా ఆల్టర్నేటివ్ చికిత్స ను ఉపయోగించుకుంటున్నారు

ఒకప్పుడు ప్రపంచంలోని ఆంగ్ల వైద్య చికిత్సా రంగానికి చెందిన డాక్టర్లే కాకుండా భారతదేశం లొ ఉన్న ఆంగ్ల వైద్యా చికిత్సా రంగంలోని డాక్టర్లు కూడా యోగా మరియూ ఇతర రకాల చికిత్సల గురించి, చికిత్సా విధానం గురించి అసలు మాటలే అనవసరమని తీసిపారేసేరు.

యోగా దీర్ఘకాల వ్యాధుల నివారణకు, తగ్గింపుకు బాగా ఉపయోగపడటమే కాకుండా మనిషి యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగు పరచి, బలపరుస్తుందని తెలుసుకున్న పశ్చిమ దేశ డాక్టర్లు ఈ చికిత్సా విధానాన్ని తమ ఆంగ్ల చికిత్సా విధానంతో కలిపి ఉపయోగిస్తూ రోగులకు దానివలన కలిగే లాభాలను అందించడమే కాకుండా యోగా చికిత్స మూలంగా డబ్బు కూడా సంపాదించుకుంటున్నారు. కానీ భారతదేశంలో ఉన్న ఆంగ్ల వైద్యా చికిత్సా రంగంలోని వారు మాత్రం యోగా చికిత్సా విధానం గురించి మౌనంగా ఉంటున్నారు.

కొన్ని రోజుల క్రితం చెన్నైలో 1976 నుండి యోగా మూలంగా చికిత్సను అందిస్తున్న క్రిష్ణమాచార్యా యోగా మందిరం వారు "సైనర్జీస్ ఇన్ హీలింగ్.....ఎన్ ఇంటెగ్రేటివ్ అప్రోచ్ ఆఫ్ మోడరన్ మెడిసిన్ అండ్ యోగా" (SYNERGIES IN HEALING…… AN INTEGRATIVE APPROACH OF MODERN MEDICINE AND YOGA) అనే అంశంపై ఒక సదస్సును ఏర్పాటు చెసేరు. ఈ సదస్సుకు భారతదేశంలో పేరు ప్రఖ్యాతలున్న ఆంగ్ల వైద్యా నిపుణులు, శస్త్ర చికిత్సా నిపుణులు పాల్గొన్నారు. వీరంతా యోగా చికిత్సా విధానాన్ని ఒక మంచి చికిత్సా విధానంగా ఒప్పుకోవడమే కాకుండా ఆ చికిత్సా విధానం ఎంత అవసరమో, దాని వలన కలిగే లాభాలు ఎంత గొప్పవో (ఆంగ్ల చికిత్సా విధానంలోని మాత్రలూ, శస్త్ర చికిత్స తో పాటు) ఆధారాలతో వివరించుకున్నారు.

మొరార్జీదేసాయ్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యోగా డైరెక్టర్ డా.ఈశ్వర్ బశవ రెడ్డీ గారు మాట్లాడుతూ యోగా చికిత్సా విధానంలో ఉన్న ఆశనాల గురించి, వాటి వలన కలిగే లాభాల గురించి తెలియపరిచేరు.

"మాత్రలు మాత్రమే చికిత్సకు సరిపోదు". ఇలా తెలిపింది ఎవరో కాదు.అపోలో హాస్పిటల్లో న్యూరో సర్జన్ గానూ, "ఎపిక్ సెంటర్" (ఎపిలెప్సీ చికిత్సా మరియూ పరిశోధనా సెంటర్) డైరెక్టర్ గానూ ఉంటున్న డా. ప్రితికాచారీ గారు. "నేను రోగినా? అవును రోగినే, చికిత్స తీసుకోవాలి" అనే మనోధైర్యాన్ని ప్రతి రోగి కలిగి ఉండాలి.అద్యాత్మికం తోనూ చికిత్స పొంద వచ్హు అనే మానసిక అంగీకారం వారిలో కలగాలి. ఇది కలగాలంటే యోగా చికిత్స చాలా ఉపయోగ పడుతుంది. అప్పుడు మాత్రలూ, శస్త్ర చికిత్సలూ ఇంకా బాగా ఉపయోగ పడతాయి" అని తెలిపేరు. దీనికి రూపకల్పనగా ఒక చిత్ర పఠాన్ని చూపించి వివరించేరు.

పాండిచేరీలో ఉన్న "యోగా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్" యొక్క అంతర్జాతీయ విభాగం చైర్మాన్ డా.ఆనంద బాలయోగి భవనాని గారు మాట్లాడుతూ "మెదడు, శరీరం భార్యా భర్తల లాంటివి. ఒకరికొకరు నచ్హకపోయినా, సింగిల్ బెడ్రూం అపార్ట్ మెంట్లో తప్పనిసరిగా నివసించేవారి లాగానే, ఇవి గూడా మనలో నివసిస్తాయి. యోగా ఈ రెండింటినీ కలుపుతుంది. శరీరంలో ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. దాని వలన మనం చాలా ఆరొగ్యంగా ఉండగలుగుతాము" అన్నారు.

గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియూ శస్త్ర చికిత్సా నిపుణులు డా. జె.ఎస్.రాజ్ కుమార్ గారు ఆంగ్ల చికిత్సా విధానం మరియూ యోగా చికిత్సా విధానాన్ని కలిపి ఎంతమందికి చికిత్స చేయబడిందో, వారందరిలో ఆరోగ్యం ఎలా మామూలు పరిస్తితులకు వచ్హిందో ఆధారాలతో చూపేరు. అన్ని రకాల వ్యాధులకూ ఈ రెండు చికిత్సలూ కలిపి చికిత్స చేస్తే ఎంత ఉపయోగమో తెలియపరిచేరు.

ఇంకా వివరాలకు www.kym.org కి వెళ్లండి.

No comments:

Post a Comment