Thursday, July 29, 2010

సంగీత వైద్యముతో కోమా నుండి బయటపడ్డ 6 ఏళ్ళ పాప

ఒక ప్రమాదం వలన కోమాలోకి వెళ్లిపోయిన 6 సంవత్సారల రాధిక అనే పాప కోమాలో నుండి బయటకు వస్తుందని కేరళా రాష్ట్రంలోని ఆలపుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు కలలో కూడా అనుకోలేదట. కానీ ఈ చిన్నారి 2 నెలలలోనే కోమాలోనుండి బయటపడటం అక్కడి డాక్టర్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కారణం, మందులతో ఎటువంటి కదలికలూ లేని ఆ చిన్నారి సంగీత వైద్యంతో పుర్తిగా కోమాలోనుండి బయటకొచ్హింది.

"నేను ఇంకా నమ్మకలేక పోతున్నాను" అంటున్నారు ఆ ప్రబుత్వ ఆసుపత్రి పిల్లల చికిత్సా వైద్యా రంగ హెడ్ డా.గిరిజా మోహన్. మందుల వలన గుణం కనిపించనందువలన ఈ పిల్లకు సంగీత వైద్యం చేద్దామన్న ఆలోచన ఈ డాక్టర్ కే కలిగింది.

రాధిక మే నెల 30 వ తారీఖున స్ప్రుహ కోల్పోయిన పరిస్తితులలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాబడింది. అప్పటికే కోమాలో ఉన్నదని తెలుసుకున్న డాక్టర్లు దానికి చికిత్స మోదలపెడుతూ ఆ పిల్ల కు వెంటీలేటర్స్ పెట్టేరు. 2-3 రోజులు వెంటీలేటర్స్ తో ఊపిరి పీల్చుకున్న రాధిక 4 రోజు స్వయంగా తానే ఊపిరి పీల్చుకోగలిగింది. కానీ కోమా స్థితి నుండి బయటకు రాలేదు. అన్ని రకాలుగా ప్రయత్నం చేసేరు. ఆ ప్రయత్నాలు పనిచేయలేదు. ఆ చిన్నారి అలా మంచం మీద ఒక బొమ్మలా పడుకోనుంది.

నరాల రీహబిలిటేషన్ చేసి చూద్దామనే అలోచన డా.గిరిజా మోహన్ కు వచ్హింది. వెంటనే అంతర్జాలంలో దాని గురించి వెతికింది. సంగీత వైద్యం గురించిన ఆర్టికల్స్ మరియూ లిటరేచర్ దొరికింది. సంగీత వైద్యం నరాల రీహాబిలిటేషన్ కి బాగా పనిచేస్తొందని చదివిన డా.గిరిజా మోహన్ సంగీత వైద్యంతో రాధికకు చికిత్స చేయాలని నిర్ణయించుకుని, కర్ణాటక సంగీతంతో పాడబడిన కొన్ని మెలోడీ పాటలనూ, రాధికకు ఇష్టమైన క్రిష్ణుని మీద ఒక పాట నూ(ఒక మళయాలం సినిమాలోని పాట)రికార్డ్ చేసి ఒక హేడ్ ఫోన్ మూలంగా రోజంతా ఆ పాటలను రాధిక వినేటట్లు చేసింది. ఒక వారం రోజుల తరువాత రాధికలో చలనం వచ్హింది. కదలికలు మొదలైనాయి. అందరూ ఆశ్చర్య పోయేరు. మరో వారం రోజుల తరువాత కళ్లు తెరిచి అందరినీ చూడటం, తన వారందరినీ గుర్తుపట్టడం చేసింది. హెడ్ ఫోన్ లు తీసేసి చిన్న స్పీకర్లతో పాటలను వినిపించేరు. ఇప్పుడు రాధిక పూర్తిగా కోమాలో నుండి బయట పడటమే కాకుండా అడుగులు వేస్తోంది, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతోంది.

"బ్రైన్... ఎ జర్నల్ ఆఫ్ న్యూరాలజీ" అనే ఒక బ్రిటన్ పత్రిక పక్షవాతం వచ్హిన రోగుల మీద సంగీత వైద్యం ఎలా పనిచేసిందో, వారిలో ఎలా మాటలను తెప్పించిందో మరియూ ఎలా కదలికలను మెరుగు పరిచిందో వివరంగా ప్రచురించింది.చెన్నైలో ఉన్న నరాల శస్త్ర చికిత్సా నిపుణులు డా.ప్రీతికా చారి కూడా సంగీత వైద్యంతో ఎంతోమంది రోగులలో మంచి మార్పు వచ్హిందని తెలిపేరు. వీటిని చదివిన నాకు రాధికకు సంగీత వైద్యం చేస్తే గుణం కనబడుతుందనే నమ్మకం వచ్హింది. ప్రయత్నించేను. ప్రయత్నం ఫలించింది. సంగీత వైద్యం మీద సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. కానీ చాలామంది పెద్ద పెద్ద డాక్టర్లు సంగీతంతో వైద్యం చేసి రోగులను గుణపరిచినట్లు చదివేను. ఇప్పుడు నేనే చూసేను. సైన్స్ ఈ సంగీత వైద్యం మీద రీసెర్చ్ చేయాలనేది నా కోరిక" అన్నరు డా.గిరిజా మోహన్.

1 comment:

  1. pleas give me the link to this particular post, including the Chennai doctor.

    ReplyDelete