Saturday, July 31, 2010

ఎవర్ని బలిపశువు చేయాలి....తెలంగాణా ఉప ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్స్

తెలంగాణా ఉప ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ తమ ఘోర ఓటమికి ఎవర్ని కారకులుగా చేయాలా అని కాంగ్రెస్ పార్టీలో ఆరోపనా ఆట మొదలయ్యింది. తెలంగాణా ప్రజలలో ప్రత్యేక తెలంగాణా పై ఎటువంటి అభిప్రాయం ఉన్నది, ఎంత సానుభూతి ఉన్నది అనే విషయాన్ని లోతుగా తెలుసుకోకుండా ఉప ఎన్నికలలో పోటీ చేయాలనే విషయాన్ని, పోటీ చేయ వలసిన అభ్యర్ధులను ఎన్నుకునే విషయం లోనూ అవసర పడింది ఎవరు అనేదానిమీద కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

తెలంగాణా ప్రజలు ఇచ్హిన షాక్ నుండి ఇంకా తేరుకోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అసలు కారణం ఏమైయుంటుందా అనే విషయం గురించి ఆరా తీస్తున్నారట. ఈ ఓటమి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో విస్త్రుత మైనమార్పులు తీసుకొస్తుందని కాంగ్రెస్ పార్టీలోని కొందరు అభిప్రాయపడుతున్నారట.

ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెశిడెంట్ డి.శ్రీనివాస్ గారిని తప్పు పట్టడం ఖచితమైనా, ఆయన్ను దాటి ఇంకాలోతుగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఈ ఉప ఎన్నికలలో పోటీ చేయాలా, వద్దా అనే విషయంలో ఆంద్ర రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలను పర్యవేక్షణ చేస్తున్న కేంద్ర మంత్రి వీరప్ప మౌయిలీ గారు 12 స్థానాలలో 3 స్థానాలు కాంగ్రెస్ ఖచ్హితంగా గెలుచుకుంటుందని చెప్పి సోనియా గాంధీ ని ఓప్పించేరని కాంగ్రెస్ లోని కొందరు చెబుతున్నారు.

కానీ తెలంగాణా కు చెందిన కాంగ్రెస్ ఎం.పీ లు మాత్రం ప్రత్యేక తెలంగాణా కోసం రాజీనామాలు చేసిన వారి మీద కాంగ్రెస్ పార్టీ పోటీచేయడం మంచిది కాదని, ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకూడదని, ఎందుకంటే, ప్రత్యేక తెలంగాణా కోసం తమ పదవులను రాజీనామా చేసిన వారి మీద పోటీ చేస్తే, కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకమనే అభిప్రాయం ప్రజలలో ఏర్పడుతుందని చెప్పేరట.

కాంగ్రెస్ పార్టీ గనక తెలంగాణా ఉప ఎన్నికలో పోటీ చేయకుండా ఉండుంటే తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేసేది కాదు. కాంగ్రెస్ రంగంలోకి దిగేరనే, తప్పని పరిస్తితులలో వారు కూడా పోటీ చేయవలసివచ్హిందట. టి.ఆర్.ఎస్ పార్టీ వరు గెలవడం కన్నా, వారు వారి ప్రత్యర్ధులపై అధికమైన ఓట్లతో గెలవడమే రెండు పార్టీలవారినీ ఎక్కువగా కలవరపరుస్తోందట.

కాంగ్రెస్ పార్టీ మరియూ తెలుగుదేశం పార్టీ ఈ ఉప ఎన్నికలలో పోటీ చేసుండకపోతే పరిస్తితులు వేరుగా ఉండేవి. కానీ ఇప్పుడు టి.ఆర్.ఎస్ అధినేత కె.సి.ఆర్ గారు తెలంగాణాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరియూ తెలుగుదేశం పార్టీ వారి మీద ఎక్కువ ఒత్తిడి తీసుకువస్తారని ఇరు పార్టీల లోని కొందరు అభిప్రాయపడుతున్నారట.

ఈ ఉప ఎన్నికలో ఎక్కువగా నష్ట పోయింది తెలుగుదేశం పార్టీయే. 12 స్థానాలలోనూ డిపాజిట్లు కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలు పెద్ద గుణ పాఠం నేర్పిందని రాజకీయ నిపుణులు అంటున్నారు.

Friday, July 30, 2010

నకిలీ వెబ్ సైట్లను ఆపే ప్రయత్నంలో WWW

సైబర్ నేరస్తులు నకిలీ వెబ్ సైట్లను ఉపయోగించి ప్రజలను వైరస్ మూలంగానో లేక వారి వ్యక్తిగత సమాచారాలని దొంగలించి మోసగించకుండా ఉండేందుకు అంతర్జాలంలో ముఖ్యమైన మార్పులు తీసుకురావడానికి అంతర్జాలాన్ని మెరుగు పరిచేరు.

అంతర్జాల అడ్రెస్ లను నిర్వాహం చేస్తున్న ఏజెన్సీ, ఆన్ లైన్ సెక్యూరిటీ ని అందిస్తున్న వెరిసైన్ (VeriSign) తోనూ మరియూ అమెరికా వారి డిపార్ట్ మెంట్ ఆఫ్ కామర్స్ వారితో కలిసి చట్టపరమైన, నిజాయతీగా ఉండే వెబ్ సైట్లకు ఎంక్రిప్ట్ (ENCRYPTED) చేయబడ్డ గుర్తును వెబ్ సైట్లలో ఉంచుతారట.

"ఇది అన్ని రకాలుగా చరిత్రాత్మక మార్పు" అని లాస్ వేగాస్ లో జరిగిన బ్లాక్ హాట్ కంప్యూటర్ సెక్యూరిటీ సదస్సులో ఐ.సి.ఏ.ఎన్.ఎన్ (ICANN) చీఫ్ ఎక్సిక్యూటివ్ రాడ్ బెక్స్ టాం ఈ విషయాన్ని అందరికీ తెలిపేరు. అంతర్జాలంలో ఈ రక్షణ మార్పు కంప్యూటర్ వాడుకునే ప్రతి ఒక్కరికీ, అంటే మనందరికీ ఉపయోగ పడుతుందని తెలిపేరు.

ది డొమైన్ నేం సిస్టం సెక్యూరిటీ ఎక్స్ టెన్షన్ డి.ఎన్.ఎస్.ఎస్.ఈ.సి (The Domain Name System Security Extension….DNSSEC) వారు ప్రతి వెబ్ సైటుకూ రహశ్యంగా గుర్తింపు కోడ్ ను అమరుస్తారు. ఈ డొమైన్ నేం సిస్టం లోనే ప్రపంచంలోని అన్ని అంతర్జాల అడ్రెస్ లు రిజిస్టర్ చేస్తారు మరియూ ఇక్కడి నుండే ప్రపంచములోని కంప్యూటర్లతో ఒకరికొకరు మాట్లాడుకునేటట్లు చేస్తారు(ఉదాహరణకు:...ఈ మైల్స్ ఒక ఐ.పి అడ్రెస్ నుండి ఇంకో ఐ.పి అడ్రెస్ కు వెళ్లటం).

"ఇప్పుడు కంప్యూటర్లలో వాడకంలో ఉన్న అప్లికేషన్లో చిన్న మార్పులు చేసి వెబ్ సైట్ల యొక్క గుర్తింపులను తెలుసుకోవచ్హు" ఒకప్పుడు కంప్యూటర్ హాకర్ గా ఉండి, ఇప్పుడు కంప్యూటర్ స్పెషలిష్ట్ గా ఉంటున్న డాన్ కిమిన్స్ కీ తెలిపేరు..

"ఉదాహరణకు, గూగుల్ లేక బింగ్ వారి వెబ్ బ్రౌసింగ్ సాఫ్ట్ వేర్ తో మీరు ఓపెన్ చేసే మీ బ్యాంక్ పేజీ నిజమైనదా కాదా తెలుసుకోవచ్హు. తమకు వచ్హిన బ్యాంక్ ఈ మైల్స్ నిజంగానే బ్యాంక్ నుండి వచ్హినదా లేక నకిలీదా అని తెలుసుకోవచ్హు" అని కిమిన్స్ కీ తెలిపేరు.

"రెండు సంవత్సరాల క్రితం అంతర్జాలంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ వెబ్ సైట్లకు ఎంక్రిప్ట్ గుర్తు ఇవ్వాలని కిమిన్స్ కీ తెలిపేరు. ఆయన తెలిపిన విధంగానే మార్పులు తీసుకు వచ్హేము. 18 సంవత్సరాలుగా నకిలీ వెబ్ సైట్లని ఎలా ఆపాలా అనే విషయం పై అంతర్జాల ఇంజనీర్స్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఏదో ఒక విధంగా వారి పనులకు అంతరాయం కలుగుతునే ఉంది. నకిలీ వెబ్ సైట్లను ఎలా అపలో ఇప్పటికి తెలుసుకున్నం" అని బెక్ స్టాం తెలిపేరు.

"ఇప్పుడు చేయదలచుకున్న మార్పు, వెబ్ ఎంక్రిప్ట్ గుర్తును అమలుచేయడానికి కొంత టైము పడుతుంది. ఎందుకంటే, ఇప్పుడు ప్రతి దేశమూ వారికి ప్రత్యేక అంతర్జాల అడ్రెస్ లు కావాలని అడుగుతున్నారు" కిమిన్స్ కీ తెలిపేరు.

Thursday, July 29, 2010

సంగీత వైద్యముతో కోమా నుండి బయటపడ్డ 6 ఏళ్ళ పాప

ఒక ప్రమాదం వలన కోమాలోకి వెళ్లిపోయిన 6 సంవత్సారల రాధిక అనే పాప కోమాలో నుండి బయటకు వస్తుందని కేరళా రాష్ట్రంలోని ఆలపుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు కలలో కూడా అనుకోలేదట. కానీ ఈ చిన్నారి 2 నెలలలోనే కోమాలోనుండి బయటపడటం అక్కడి డాక్టర్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కారణం, మందులతో ఎటువంటి కదలికలూ లేని ఆ చిన్నారి సంగీత వైద్యంతో పుర్తిగా కోమాలోనుండి బయటకొచ్హింది.

"నేను ఇంకా నమ్మకలేక పోతున్నాను" అంటున్నారు ఆ ప్రబుత్వ ఆసుపత్రి పిల్లల చికిత్సా వైద్యా రంగ హెడ్ డా.గిరిజా మోహన్. మందుల వలన గుణం కనిపించనందువలన ఈ పిల్లకు సంగీత వైద్యం చేద్దామన్న ఆలోచన ఈ డాక్టర్ కే కలిగింది.

రాధిక మే నెల 30 వ తారీఖున స్ప్రుహ కోల్పోయిన పరిస్తితులలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాబడింది. అప్పటికే కోమాలో ఉన్నదని తెలుసుకున్న డాక్టర్లు దానికి చికిత్స మోదలపెడుతూ ఆ పిల్ల కు వెంటీలేటర్స్ పెట్టేరు. 2-3 రోజులు వెంటీలేటర్స్ తో ఊపిరి పీల్చుకున్న రాధిక 4 రోజు స్వయంగా తానే ఊపిరి పీల్చుకోగలిగింది. కానీ కోమా స్థితి నుండి బయటకు రాలేదు. అన్ని రకాలుగా ప్రయత్నం చేసేరు. ఆ ప్రయత్నాలు పనిచేయలేదు. ఆ చిన్నారి అలా మంచం మీద ఒక బొమ్మలా పడుకోనుంది.

నరాల రీహబిలిటేషన్ చేసి చూద్దామనే అలోచన డా.గిరిజా మోహన్ కు వచ్హింది. వెంటనే అంతర్జాలంలో దాని గురించి వెతికింది. సంగీత వైద్యం గురించిన ఆర్టికల్స్ మరియూ లిటరేచర్ దొరికింది. సంగీత వైద్యం నరాల రీహాబిలిటేషన్ కి బాగా పనిచేస్తొందని చదివిన డా.గిరిజా మోహన్ సంగీత వైద్యంతో రాధికకు చికిత్స చేయాలని నిర్ణయించుకుని, కర్ణాటక సంగీతంతో పాడబడిన కొన్ని మెలోడీ పాటలనూ, రాధికకు ఇష్టమైన క్రిష్ణుని మీద ఒక పాట నూ(ఒక మళయాలం సినిమాలోని పాట)రికార్డ్ చేసి ఒక హేడ్ ఫోన్ మూలంగా రోజంతా ఆ పాటలను రాధిక వినేటట్లు చేసింది. ఒక వారం రోజుల తరువాత రాధికలో చలనం వచ్హింది. కదలికలు మొదలైనాయి. అందరూ ఆశ్చర్య పోయేరు. మరో వారం రోజుల తరువాత కళ్లు తెరిచి అందరినీ చూడటం, తన వారందరినీ గుర్తుపట్టడం చేసింది. హెడ్ ఫోన్ లు తీసేసి చిన్న స్పీకర్లతో పాటలను వినిపించేరు. ఇప్పుడు రాధిక పూర్తిగా కోమాలో నుండి బయట పడటమే కాకుండా అడుగులు వేస్తోంది, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతోంది.

"బ్రైన్... ఎ జర్నల్ ఆఫ్ న్యూరాలజీ" అనే ఒక బ్రిటన్ పత్రిక పక్షవాతం వచ్హిన రోగుల మీద సంగీత వైద్యం ఎలా పనిచేసిందో, వారిలో ఎలా మాటలను తెప్పించిందో మరియూ ఎలా కదలికలను మెరుగు పరిచిందో వివరంగా ప్రచురించింది.చెన్నైలో ఉన్న నరాల శస్త్ర చికిత్సా నిపుణులు డా.ప్రీతికా చారి కూడా సంగీత వైద్యంతో ఎంతోమంది రోగులలో మంచి మార్పు వచ్హిందని తెలిపేరు. వీటిని చదివిన నాకు రాధికకు సంగీత వైద్యం చేస్తే గుణం కనబడుతుందనే నమ్మకం వచ్హింది. ప్రయత్నించేను. ప్రయత్నం ఫలించింది. సంగీత వైద్యం మీద సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. కానీ చాలామంది పెద్ద పెద్ద డాక్టర్లు సంగీతంతో వైద్యం చేసి రోగులను గుణపరిచినట్లు చదివేను. ఇప్పుడు నేనే చూసేను. సైన్స్ ఈ సంగీత వైద్యం మీద రీసెర్చ్ చేయాలనేది నా కోరిక" అన్నరు డా.గిరిజా మోహన్.

బ్లాగ్ టపాలో అవదూరు విషయాలు రాస్తే దానికి మేము బాధ్యులు కాము....గూగుల్

ఎవరైనా తమ బ్లాగు టపాలో అవదూరు విషయాలు రాస్తే గూగుల్ కంపెనీదే తప్పా? అవదూరు విషయాలను ప్రచురించిన గూగుల్ కంపెనీ మీద క్రిమినల్ చట్టం క్రింద చర్యలు తీసుకోవచ్హా? ఈ విషయం ఇప్పుడు ముంబై హైకోర్ట్ లో విచారణ కు వచ్చింది.

"బ్లాగు టపాలలొ వచ్హే అవదూరు విషయాలకు మేము బాధ్యులం కాము" అని గూగుల్ ఇండియా మాజీ ఉద్యోగి, తనకు కోర్ట్ నుండి వచ్హిన "హాజరు ఉత్తరవు" కు ప్రత్యుత్తర సమాధానంలో తెలిపేరు.

కోర్టులో వచ్హే సోమవారం నాడు వాదనకు తీసుకోవలసిన ఈ కేసును, ఇప్పుడు వచ్హే గురువారం నాడు వాదనకు తీసుకుంటున్నారు.

ఒక నిమిషానికి సుమారు 3,00,000 పదాలను బ్లాగులోకి తీసుకునే అతి పెద్ద సెర్చ్ ఇంజెన్ గూగుల్. బ్లాగులో ప్రచురించబడే అవదూరు వాక్యాలకూ,వ్యాసాలకూ, విషయాలకూ ఎవరు నేరస్తులు.....బ్లాగర్.కాం ను అందిస్తున్న గూగుల్ కంపెనీనా లేక ప్రచురణ వాక్యాలనూ,వ్యాసాలనూ,విషయాలనూ తమ బ్లాగు టపాకి అందిస్తున్న బ్లాగర్ దా(ముఖ్యంగా బ్లాగర్ తామెవరో తెలియజేయనప్పుడు) అనే విషయం గురించి వాదనలు జరగబోతున్నాయి.

“ఇండియాలో ఉన్న గూగుల్ కంపెనీ గాని, అమెరికాలో ఉన్న ప్రధాన గూగుల్ కంపెనీ గానీ బ్లాగు టపాలో ప్రచురించ బడ్డ అవదూరు సమాచారానికి ఎటువంటి బాధ్యత లేదు. ఎందుకంటే గూగుల్ ఒక సర్వీస్ కంపెనీ. టపా రాసుకోవటానికి బ్లాగులో చోటు ఇవ్వటంవరకే మా పని. బ్లాగు టపాలోని సమాచారంతో మాకు ఎటువంటి సంబంధమూ లేదు” అని గూగుల్ కంపెనీ చెబుతోంది.

2005 నుండి 2007 వరకు గూగుల్ ఇండియాలో బ్లాగ్ ప్రచురణ డివిషన్లో హెడ్ గా పనిచేసేరు కె.సుందర రామన్. ఆయన పనిచేస్తునప్పుడు 2006 లో ఒక బ్లాగ్ లో అవదూరు వాక్యాలతో ఒక టపా వెలువడింది. ఆ టపాను చూసిన ఒక సీనియర్ పత్రికా విలేకరి ఆ బ్లాగు లోని టపాను ఖండిస్తూ ఆ టపాను తీసివేయవలసిందిగానూ మరియూ ఆ బ్లాగును ఇకమీదట ప్రచురించ కూడదని గూగుల్ ఇండియా పై దావా వేసేరు. దావాకి హాజరు కావాలని కొర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో గూగుల్ కంపెనీ తరఫున ఎవరూ హాజరు కాలేదు. అందుకని కోర్టు 2008 లో ఎక పక్షంగా తీర్పునిస్తూ ఆ బ్లాగు లో టపాలను ప్రచురించకూడదని ఉత్తర్వు జారీ చేసింది. ఈ లోపు ఇంకో కోర్టులో 2007 లో బ్లాగర్ మీద మరియూ గూగుల్ కంపెని మీద క్రిమినల్ పరువునష్టం దావావేసేరు. ఈ దావుకు హాజరు కావాలని సుందర రామన్ కు కోర్టు ఉత్తర్వు జారీ చేసింది. అప్పటికే సుందర రామన్ గూగుల్ కంపనీని వదిలి వెళ్లిపోయేరు. అందువలన కోర్టు ఉత్తర్వులను అందుకోలేకపోయేనని తెలిపేరు. ఇప్పుడు ఆయన మీద కోర్టు నాన్ బైలబల్ అరెస్టు ఉత్తర్వు జారీ చేసింది.

నాకు బ్లాగు లో వెసే టపాలను తీసేసే అధికారం గానీ, టపాలోని వాక్యాలను మార్చే అధికారం గానీ లేదు. నాకే కాదు గూగుల్ కంపెనీలో ఎవరికీ టపా లోపలికి వెళ్లే అవకాశం ఇవ్వలేదు. కోర్టు చెబితే ఆ టపాని గాని, ఆ బ్లాగును గానీ కంపెనీ వారు తీసేస్తారు అని సుందర రామన్ చెప్పేరు.

Wednesday, July 28, 2010

ఇప్పుడు తింటున్న కూరగాయలు ఆరోగ్యానికి మంచి చేస్తున్నాయా?

మనం భోజనంలో కూరగాయలను ఎక్కువగా చేర్చుకోవాలనీ, ఎక్కువగా కూరగాయలను తింటే అది మన ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. ఈ రోజు ప్రతి వైద్యుడూ తమ వద్దకు వచ్హే ప్రతి రోగికీ మొట్టమొదట చెప్పే ఆరోగ్య సూత్రం ఇదే. కానీ మనం ఇప్పుడు తింటున్న కూరగాయలు తాజావి గానూ, ఆరోగ్యానికి మంచి చేసేవిగానూ ఉన్నయ్యా?

"లేవు" అంటున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి దినేష్ త్రివేది గారు. కూరగాయలు తాజావిగా కనిపించడానికీ,అవి త్వరగా పంటకు వచ్హి మార్కెట్లకు చేరిపోవాలనీ రైతులు రసాయన పదార్ధాలను యధేచ్హగా వాడుతున్నారు. ఈ రసాయనాల వలన మనిషి ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మంచి ఆరొగ్యం కొరకు కూరగాయలను తినడం చాలా అవసరం. కానీ రసాయనాలతో పండించిన కూరగాయలను తింటే నరాల బలహీనత, వంధ్యత్వం మరియూ నరాలకు సంబంధించిన అనేక రకాల వ్యాధులు వస్తాయి" అని ఆయన తెలిపేరు.

"కూరగాయలు త్వరగానూ, ఎక్కువగానూ పండాలని రైతులు పంటకు హార్మోన్ మందులు వాడుతున్నారు. ఈ హార్మోన్ మందుల వలన సరిచేయలేని ఆరోగ్య సమస్యలు వస్తాయని పరిశోధకులు నిరూపించేరు. "ఆక్సీటోసిన్" అనే ఇంజెక్షన్ మందును చెట్లకు వాడుతున్నారు.మొదట్లో ఈ మందును గర్భిణీ స్త్రీలకు నొప్పులు రావడానికి వాడేవారు. ఈ ఇంజెక్షన్ వలన సమస్యలు వస్తున్నాయని తెలుసుకున్న తరువాత ఈ మందును మనుష్యులకు వాడకూడదని నిషేధించేరు"

“ఈ మందును జంతువులకు మాత్రమే వాడాలి. మెడికల్ షాపులలోనే అమ్మాలి. కానీ, ఈ మందును అనీ షాపులలోనూ అమ్ముతున్నారు. ఈ విషయం ప్రతి జిల్లాలో ఉన్న ఆరోగ్య శాఖ అధికారులకు తెలుసు. ఈ మందు ను గుమ్మడి కాయ, పుచ్హకాయ, వంకాయ, సొరకాయ మరియూ దోసకాయ పంటలకు ఉపయోగిస్తున్నారు. ఈ ఒక్క మందే కాకుండా కాపర్ సల్ఫేట్ మరియూ కాల్షియం కార్బైడ్ లను కూడా వాడుతున్నారు. వీటి వలన కళ్ళ వ్యాధులూ, ఊపిరితిత్తుల(దగ్గు,ఆయసం) వ్యాధులూ మరియూ చర్మ వ్యాధులూ వస్తాయి"

కాబట్టి, పంట ఉత్పత్తికోసం ఇలాంటి రసాయనాలను వాడుతున్న రైతులను వెంటనే గుర్తించి వారిని కఠినంగా శిక్చించవలసిందిగా ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ కె. సుజాతా రావ్ గారికి ఒక లేక రాసేరు.

64 సంవత్సరాల తరువాత హీరోషీమా,నాగసాకి నగరాలు ఎలా ఉన్నాయో చూడండి.....ఫోటోలు

1945 లో, 64 సంవత్సరాలకు ముందు హిరోషీమా,నాగసాకి నగరాల మీద ఆటంబాంబ్ వెయబడి సర్వనాశనం అయ్యిందని మనందరికీ తెలుసు. కానీ ఈ 64 సంవత్సరాలలో ఆ నగరాలలోని ప్రజల పురోభివ్రుద్ది గురించి మనందరికీ తెలిసింది చాలా తక్కువ. ఇప్పుడు హిరోషీమా,నాగసాకి నగరాలను చూస్తే కళ్ళకు విందునిచ్హేవిగానూ, అద్భుతంగానూ ఉన్నది. ఇవిగో ఆ నగరాల ఫొటోలు.

1945 లో2009 లో

Tuesday, July 27, 2010

తమిళనాడు ప్రభుత్వం, కరుణానిధి కుటుంబం, మారన్ సహోదరులూ నా మీద పగబట్టేరు......ఐ.ఏ.ఎస్ అధికారి

తమిళనాడు ప్రభుత్వంచే సస్పెండ్ చేయబడ్డ ఐ.ఏ. ఎస్ అధికారి శ్రీ ఉమాశంకర్, తమిళనాడు ప్రభుత్వం తనని సస్పెండ్ చేయడానికి చెప్పిన కారణం (ఈయన దొంగ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇచ్హి ప్రభుత్వాన్ని మోసం చేసి ఐ.ఏ.ఎస్ పదవి సంపాదించుకున్నాడని తమిళనాడు ప్రభుత్వం ఈయన్ను సస్పెండ్ చేసింది) సరికాదని, తనని ఐ.ఏ.ఎస్ కు ఎన్నొకోవడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన సర్టిఫికేట్ లన్నీ తనిఖీ చేసే తనకు ఐ.ఏ.ఏస్ పదవి ఇచ్హిందని, తాను కరుణానిధీ కుటుంబానికి అనిగి మెనగి నడుచుకోలేదనే కారణం చేతనే తనను సస్పెండ్ చేసిందని నేషనల్ SC/ST కమీషన్ తో మొరపెట్టుకున్నారు.

ఉమాశంకర్ ను పదవి నుండి సస్పెండ్ చేసే ముందు ఆయన తమిళనాడు స్మాల్ సేవింగ్స్ శాఖ కు కమీషనర్ గా ఉన్నారు. "నేను నిజాయితీగా, విశ్వాసంగా పనిచేస్తున్నందున నన్ను ప్రభుత్వం మాటిమాటికీ ట్రాన్స్ ఫర్ చేసింది. ప్రజల మంచి కోసం పనిచేయడం వారికి నచ్హలేదు" అని ఉమాశంకర్ తెలిపేరు.

"నన్ను ఆల్ ఇండియా సర్వీస్ యాక్ట్ క్రింద, పబ్లిక్ సర్వీస్ ఎంక్వయరీ యాక్ట్ క్రింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ క్రింద నా మీద చర్యలు తీసుకోవడానికి మాత్రమే తమిళనాడు ప్రభుత్వానికి అధికారం ఉన్నది. నేను దొంగ సర్టిఫికేట్ ఇచ్హేనని మాత్రం నా మీద చర్య తీసుకునే హక్కు వారికి లేదు. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి నేను దొంగ సర్టిఫికేట్ ఇచ్హి పదవి సంపాదించుకున్నాని నా మీద ఎఫ్.ఐ.ఆర్. వేయ వలసిందిగా పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారు" అని చెప్పేరు.

"నేను మారన్ సహోదరుల పైన మరియూ కేంద్రమంత్రి, కరుణానిధి గారి కొడుకు అలగిరి మీద వారు ఈ.ఎల్.టీ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అనే కంపెనీ మూలంగా అవినీతికి పాల్పడ్డారని, కాబట్టి వారి మీద క్రిమినల్ చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించేను. అందుకని నా మీద పగబట్టి ఏదో ఒక రకంగా నా మీద చర్య తీసుకోవాలని చూస్తున్నారు"

"నేను ఎల్కాట్ (ELCOT) లో పనిచేసేటప్పుడు తమ ఆల్వార్‌పేట ఆఫీసుకు రమ్మని కరుణానిధి భార్య శ్రీమతి రాజాత్తి అమ్మాల్ పిలిచేరు. ఆ రోజు నేను ఆవిడను కలవనని చెప్పి ఉండాలి. బాగుండదని, మర్యాద కోసం కలిసేను. బెస్తవారి కోసం 45,000 వైర్ లెస్ సెట్లు కొనవలసి ఉంది. ఆ ఆర్డర్ ను తమకు తెలిసినవారికి ఇమ్మని అడిగింది. అలా నేను ఇవ్వను, టెండర్లు పిలిచే ఇస్తాను అని చెప్పేను. ఆ తరువాత నన్ను ఎల్కాట్ నుండి ట్రాన్స్ ఫర్ చేసేరు"

"తమిళనాడు ప్రభుత్వ కేబుల్ టీవీ కార్పోరేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు, సుమంగలి కేబుల్ టెలివిషన్ మూలంగా మారన్ సహోదరలు చేస్తున్న అన్యాయం సహించలేక వారి మీద క్రిమినల్ చట్టం క్రింద చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి సలహా ఇచ్హేను. ఇవన్ని మనసులో ఉంచుకుని నామీద పగ తీర్చుకుంటున్నారు. వీరి వలన నా ప్రాణానికే ముప్పు ఉన్నందున నాకు రక్షణ కలిపించాలి. ఇంతేకాక, నన్ను పదవిలోకి తీసుకున్న తరువాత కేంద్ర ప్రభుత్వ సంస్తలలొ, తమిళనాడు బయట పొస్టింగ్ చేయండి" అని తన మొరలో తెలిపేరు.

జయలలిత ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రభుత్వ రంగంలో జరిగిన ఎన్నో అవినీతి పనులను బయటపెట్టిన ఘనత ఈయనకున్నది. ప్రభుత్వము మరియూ ప్రజలచే ప్రశంసలందు కున్నారు.

Monday, July 26, 2010

సోహ్రోబుద్దీన్ కేసులో వై.ఎస్.ఆర్ ప్రబుత్వాన్ని ఎందుకు విచారించలేదు?.....బి.జె.పి.

గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడీ గారి ముఖ్య సన్నిహితుడు అమిత్ షా ను సోహ్రోబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో ఖైదు చేసిన మరుసటి రోజు " ఈ కేసులో వై.ఎస్.ఆర్ ప్రభుత్వాన్ని సి.బి.ఐ. ఎందుకు ప్రశ్నించలేదు" అని బి.జె.పీ పార్టీ కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.

"ఈ కేసులో సి.బి.ఐ వారు బి.జె.పీ ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని, కాంగ్రెస్ ను తప్పించాలని చూస్తున్నారు. అందుకనే ఆ రోజు వై.ఎస్. రాజశేఖర రెడ్డి నేత్రుత్వంలో ఆంద్ర రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సోహ్రోబుద్దీన్ ఖైదు చేయబడ్డ విషయంలోనూ, ఎన్ కౌంటర్ విషయంలోనూ గుజరాత్ ప్రభుత్వం లాగానే సరిసమాన చర్యలు తీసుకున్నా సి.బి.ఐ కాంగ్రెస్ ను తమ విచారణలో నుండి తీసేసింది" అని బి.జె.పీ పార్టీ ప్రెశిడెంట్ గద్కరీ గారు అన్నారు.

గుజరాత్ పోలీసులు సోహ్రోబుద్దీన్ తో ఉన్న 7 గురి ఆంద్రా పోలీసులని గుర్తించలేక పోయేరు. సుప్రీంకోర్ట్ సి.బి.ఐ. కి ఈ కేసును విచారించవలసినిదిగా ఉత్తర్వుచేయడానికి ఇది కూడా ఒక కారణం. కానీ సి.బీ.ఐ. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గానీ, ఆ రాష్ట్ర పోలీసు అధికారులని గానీ విచారణ చేయక పోవడం ఒకటే చాలు సి.బీ.ఐ. కాంగ్రెస్ చెప్పిందే చేస్తోందనడానికి ఒక నిదర్శనం అని ఆయన అన్నారు.

"బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రాష్ట్రంలోని ఓట్ల కోసమే సోహ్రోబుద్దీన్ ఎన్ కౌంటర్ విషయాన్ని వారికి ఉపయోగపడేలా చేసుకుంటున్నారు. కానీ మేము చట్టపరంగానూ, రాజకీయ పరంగానూ గుజరాత్ మాజీ మంత్రి అమిత్ షా కోసం పోరాడతాము"

"మా పార్టీ మీద మోపబడిన ఈ దొంగ కేసును చట్టరీత్యా ఎదుర్కొంటూ, ఈ విషయాన్ని ప్రజలముందుకు తీసుకువెల్లి సి.బీ.ఐ. అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది నిరూపిస్తాము"

"యూ.పి.ఏ ప్రభుత్వం అన్ని రంగాలలోనూ ఓటమి వహించింది. ఆ ఓటమిని కప్పిపుచ్హుకోవటానికీ మరియూ రాజకీయ లబ్ధి కోసమే సోహ్రోబుద్దీన్ కేసును ఉపయోగించుకుంటోంది"

"యూ.పీ.ఏ పరిపాలన క్రిమినల్స్ కూ, టెర్రరిస్ట్ లకూ జైల్లల్లో బిరియానీ పెడుతూ, వారిని ప్రభుత్వ అతిధులుగా చూస్తోంది. క్రిమినల్స్ కోసం, టెర్రరిస్టు ల కోసం దేశ భక్తితో ప్రాణ త్యాగానికైనా సిద్దపడుతున్న పోలీసులనీ, ప్రభుత్వ అధికారులనూ క్రిమినల్స్ గా చూస్తోంది"

"అమిత్ షా మీద దొంగ కేసును జోడించి యూ.పీ.ఏ ప్రభుత్వం తమ ప్రతి పక్ష పార్టీల మీద రాజకీయ యుద్దం కొనసాగిస్తోంది" అని ఆయన అన్నారు.

"మాత్రలు మాత్రమే చికిత్సకు సరిపోదు"ఇప్పుడు భారతదేశ డాక్టర్లు కూడా ఆల్టర్నేటివ్ చికిత్స ను ఉపయోగించుకుంటున్నారు

ఒకప్పుడు ప్రపంచంలోని ఆంగ్ల వైద్య చికిత్సా రంగానికి చెందిన డాక్టర్లే కాకుండా భారతదేశం లొ ఉన్న ఆంగ్ల వైద్యా చికిత్సా రంగంలోని డాక్టర్లు కూడా యోగా మరియూ ఇతర రకాల చికిత్సల గురించి, చికిత్సా విధానం గురించి అసలు మాటలే అనవసరమని తీసిపారేసేరు.

యోగా దీర్ఘకాల వ్యాధుల నివారణకు, తగ్గింపుకు బాగా ఉపయోగపడటమే కాకుండా మనిషి యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగు పరచి, బలపరుస్తుందని తెలుసుకున్న పశ్చిమ దేశ డాక్టర్లు ఈ చికిత్సా విధానాన్ని తమ ఆంగ్ల చికిత్సా విధానంతో కలిపి ఉపయోగిస్తూ రోగులకు దానివలన కలిగే లాభాలను అందించడమే కాకుండా యోగా చికిత్స మూలంగా డబ్బు కూడా సంపాదించుకుంటున్నారు. కానీ భారతదేశంలో ఉన్న ఆంగ్ల వైద్యా చికిత్సా రంగంలోని వారు మాత్రం యోగా చికిత్సా విధానం గురించి మౌనంగా ఉంటున్నారు.

కొన్ని రోజుల క్రితం చెన్నైలో 1976 నుండి యోగా మూలంగా చికిత్సను అందిస్తున్న క్రిష్ణమాచార్యా యోగా మందిరం వారు "సైనర్జీస్ ఇన్ హీలింగ్.....ఎన్ ఇంటెగ్రేటివ్ అప్రోచ్ ఆఫ్ మోడరన్ మెడిసిన్ అండ్ యోగా" (SYNERGIES IN HEALING…… AN INTEGRATIVE APPROACH OF MODERN MEDICINE AND YOGA) అనే అంశంపై ఒక సదస్సును ఏర్పాటు చెసేరు. ఈ సదస్సుకు భారతదేశంలో పేరు ప్రఖ్యాతలున్న ఆంగ్ల వైద్యా నిపుణులు, శస్త్ర చికిత్సా నిపుణులు పాల్గొన్నారు. వీరంతా యోగా చికిత్సా విధానాన్ని ఒక మంచి చికిత్సా విధానంగా ఒప్పుకోవడమే కాకుండా ఆ చికిత్సా విధానం ఎంత అవసరమో, దాని వలన కలిగే లాభాలు ఎంత గొప్పవో (ఆంగ్ల చికిత్సా విధానంలోని మాత్రలూ, శస్త్ర చికిత్స తో పాటు) ఆధారాలతో వివరించుకున్నారు.

మొరార్జీదేసాయ్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యోగా డైరెక్టర్ డా.ఈశ్వర్ బశవ రెడ్డీ గారు మాట్లాడుతూ యోగా చికిత్సా విధానంలో ఉన్న ఆశనాల గురించి, వాటి వలన కలిగే లాభాల గురించి తెలియపరిచేరు.

"మాత్రలు మాత్రమే చికిత్సకు సరిపోదు". ఇలా తెలిపింది ఎవరో కాదు.అపోలో హాస్పిటల్లో న్యూరో సర్జన్ గానూ, "ఎపిక్ సెంటర్" (ఎపిలెప్సీ చికిత్సా మరియూ పరిశోధనా సెంటర్) డైరెక్టర్ గానూ ఉంటున్న డా. ప్రితికాచారీ గారు. "నేను రోగినా? అవును రోగినే, చికిత్స తీసుకోవాలి" అనే మనోధైర్యాన్ని ప్రతి రోగి కలిగి ఉండాలి.అద్యాత్మికం తోనూ చికిత్స పొంద వచ్హు అనే మానసిక అంగీకారం వారిలో కలగాలి. ఇది కలగాలంటే యోగా చికిత్స చాలా ఉపయోగ పడుతుంది. అప్పుడు మాత్రలూ, శస్త్ర చికిత్సలూ ఇంకా బాగా ఉపయోగ పడతాయి" అని తెలిపేరు. దీనికి రూపకల్పనగా ఒక చిత్ర పఠాన్ని చూపించి వివరించేరు.

పాండిచేరీలో ఉన్న "యోగా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్" యొక్క అంతర్జాతీయ విభాగం చైర్మాన్ డా.ఆనంద బాలయోగి భవనాని గారు మాట్లాడుతూ "మెదడు, శరీరం భార్యా భర్తల లాంటివి. ఒకరికొకరు నచ్హకపోయినా, సింగిల్ బెడ్రూం అపార్ట్ మెంట్లో తప్పనిసరిగా నివసించేవారి లాగానే, ఇవి గూడా మనలో నివసిస్తాయి. యోగా ఈ రెండింటినీ కలుపుతుంది. శరీరంలో ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. దాని వలన మనం చాలా ఆరొగ్యంగా ఉండగలుగుతాము" అన్నారు.

గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియూ శస్త్ర చికిత్సా నిపుణులు డా. జె.ఎస్.రాజ్ కుమార్ గారు ఆంగ్ల చికిత్సా విధానం మరియూ యోగా చికిత్సా విధానాన్ని కలిపి ఎంతమందికి చికిత్స చేయబడిందో, వారందరిలో ఆరోగ్యం ఎలా మామూలు పరిస్తితులకు వచ్హిందో ఆధారాలతో చూపేరు. అన్ని రకాల వ్యాధులకూ ఈ రెండు చికిత్సలూ కలిపి చికిత్స చేస్తే ఎంత ఉపయోగమో తెలియపరిచేరు.

ఇంకా వివరాలకు www.kym.org కి వెళ్లండి.

Sunday, July 25, 2010

గత 2 సంవత్సరాలలో చిరుతిండికి 94 లక్షలు ఖర్చు చేసిన భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ

కేంద్రలో ఉన్న భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత రెండు సంవత్సరాలకీ చిరుతిండి కీ, మినరల్ వాటర్ బాటిల్స్ కు సుమారు 94 లక్షల రూపాయలుకు పైన ఖర్చు పెట్టిందట. భారత ప్రధాన మంత్రి ఆఫీసు శాఖ ఇదే దానికి ఖర్చు చేసిన దాని కంటే ఇది 8 రెట్లు ఎక్కువట.

భారత ప్రధాన మంత్రి ఆఫీసు శాఖ 2008-2009, 2009-2010 కి కలిపి సుమారు 11.77 లక్షలు చిరుతిండ్లకు ఖర్చు పెట్టిందని ఆర్.టీ.ఐ యాక్ట్ క్రింద పెట్టిన ఒక పిటీషన్ కు సమాధానం క్రింద ఈ విషయాన్ని తెలియపరిచేరు.

హిసార్ కు చెందిన ఆర్.టీ.ఐ ఆక్టివిస్ట్ రమేష్ వర్మ "రైట్ టు ఇన్ ఫర్మేషన్" యాక్ట్ క్రింద ప్రతి మంత్రిత్వ శాఖలోనూ చిరుతిండికీ, మినరల్ వాటర్ బాటిల్స్ కూ గత 2 సంవత్సరాలలో ఎంతెంత ఖర్చు పెట్టేరో తెలియజేయవలసినదిగా ఆర్.టీ.ఐ పిట్టీషన్ పెట్టేరు.

ఆరోగ్య శాఖా మంత్రి వర్గం తమ సమధానంలో 2008-2009 లో 49.45 లక్షలు, 2009-2010 లో 44.62 లక్షలు చిరుతిండికీ మరియూ మినరల్ వాటర్ బాటిల్స్ కు ఖర్చు పెట్టేమని తెలియజేసేరు.

రూరల్ డెవెలప్మెంట్ శాఖ వారు 41.42 లక్షలు ఖర్చు పెట్టేరట.

వాటర్ రిసోర్సర్స్ వారు 20.73 లక్షలు ఖర్చు పెట్టేరట.

పెట్రోలియం శాఖ వారు 19.5 లక్షలు ఖర్చు పెట్టగా, కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ మరియూ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వారు మినరల్ వాటర్ కోసం 35,000 వేల రూపాయలు, చిరుతిండికి 14 లక్షలు ఖర్చు పెట్టేమని తెలిపేరు.

6 మంత్రిత్వ శాఖలు తమ మీటింగ్ లలో చిరుతిండికీ, మినరల్ వాటర్ బాటిల్స్ కూ ఖర్చు పెట్టింది కలిపితే సుమారు 2 కోట్ల 25 లక్షల రూపాయలన్నమాట. కేంద్ర ప్రభుత్వంలో మరెన్నో మంత్రిత్వ శాఖలున్నాయి. ఇదికాక, మన దేశంలోని రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు చాలా ఉన్నాయి. ఈ మంత్రిత్వ శాఖలన్నింటిలోనూ చిరుతిండికి, మినరల్ వాటర్ బాటిల్స్ కూ ఎంత ఖర్చు పెడుతున్నారో లెక్క వేస్తే ఎన్నికోట్ల రూపాయలు దాటుతుందో ........

Saturday, July 24, 2010

"లైఫ్ ఇన్ ఎ డే" (LIF IN A DAY) వీడియో తీయండి----అంతర్జాతీయ సినిమాగా చేసుకోండి....వివరాలు

మీ జీవితంలోని ఒక రోజుని సినిమా చరిత్రగా చేసుకోండి.

ఈ రోజు మీరు ఏమేమి చేస్తున్నారో వీడియోలో చిత్రీకరించండి. "లైఫ్ ఇన్ ఎ డే" లో పాల్గొనండి...."భూమి మీద ఒక రోజు" అనే పరిశోధన కోసం కేవిన్ మెక్ డోనాల్డ్ (Kevin Macdonald) దర్శకత్వం వహిస్తూ, రైడ్లీ స్కాట్ (Ridley Scott) నిర్మాతగా సినిమాను తాయరు చేసింది మీరుగా అవుతుంది.

మీరు ఎలా వీడియో తీయాలి, విడియో ఏ అంశాల తో ఉండాలి మరియూ మరికొన్ని వివరాలు ఈ క్రింది వీడియోలో చూసి తెలుసుకోండి.
మీరు తీసిన వీడియోని ఎవరికి, ఎలా అందించాలో ఈ క్రింది అడ్రెస్ లో కి వెళ్ళి తెలుసుకోండి.

http://www.youtube.com/lifeinaday?feature=ticker

మీ వీడియోలను అందిచవలసిన ఆఖరు తేధీ ఈ నెల 31........ప్రయత్నించండి.........ప్రయత్నం ఎప్పుడూ వ్రుధా కాదు అని నమ్మే వ్యక్తులలో నేనూ ఒకడిని.

గుడ్ లక్.

Friday, July 23, 2010

చెన్నై శ్ర్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారి "ప్రతిభా పురస్కార్" అవార్డ్ కార్యక్రమం......ఆహ్వానం

చెన్నై నగరంలోని శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారు ఇండియన్ సివిల్ సర్వీసస్ లో ప్రతిభ ను చూపించిన తెలుగు వారికీ మరియూ ఎమినంట్ తెలుగు పెర్సొనాలటీస్ కి 25/07/2010 న ప్రతిభా పురస్కార బహుమతులనిచ్హి గౌరవించ దలుచుకున్నారు.

దీనికోసం చెన్నై మ్యూసిక్ అకాడమీ లో వేదికను ఏర్పాటు చేసేరు. ఈ కార్యక్రమానికి కేంద్ర మానవ వనరులశాఖ సహాయమంత్రి గౌ. దగ్గుబాటి పురంధేశ్వరి గారు విచ్హేయనున్నారు. ఈ కార్యక్రమానికి చెన్నైలో ఉన్న తెలుగు భాషాభిమానులందరినీ ఆహ్వానిస్తున్నము. ఈ టపా చూసిని మీరు చెన్నై నగరవాసులైతే తప్పక ఈ కార్యక్రమానికి విచ్హేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాను. ఒక వేల మీరు చెన్నై వాసులు కాకపోతే, మీకు తెలిసున్న వారు చెన్నైలో ఉన్నట్లైతే వారికి తెలియపరచవలసిందిగా కోరుతున్నాను.

కార్యక్రమ వివరాలు:
వేదిక ....మ్యూసిక్ అకడమీ(MUSIC ACADEMY)
168, టీ.టీ.కే రోడ్, (168, T.T.K.ROAD)
మైలాపూర్(MYLAPORE)
చెన్నై..600 004(CHENNAI…..600 004)
తారీఖు……25/07/10 (ఆదివారం) (DATE: 25/07/10…..SUNDAY)
సమయం...5.00 P.M.
ముఖ్య అతిది......శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఎం.పి.,MINISTER OF STATE FOR HUMAN RESOURCES, GOVT. OF INDIA

గౌరవ అతిధులు:
శ్రీ కె.వి.ఎస్. మూర్తి ఐ.పి.ఎస్.
శ్రీమతి ఎం.షీలా ప్రియా ఐ.ఏ.ఎస్.
డా.పి.రామమోహనరావ్ ఐ.ఏ.ఎస్.
శ్రీ మువ్వా చంద్రశేఖర్ ఐ.పి.ఎస్..Dy. COMMISSIONER OF POLICE, BANGALORE CITY


స్వాగత ఉపన్యాసం:
శ్రీ బేతిరెడ్డి శ్రీనివాస్., FOUNDER-PRESIDENT, SRI KALASUDHA,CHENNAI.

తెలుగు భాషాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం.

చిలకలపూడి సత్యనారాయణ.
మెంబర్.
శ్రీ కళాసుధ అసోసియేషన్.
చెన్నై.
ఫోన్.....9884354555

వ్యాపార ప్రకటన కోసం గాడిదను ప్యారాచ్యూట్ లో ఎగరేసిన అన్యాయం...వీడియో

దక్షిణ రష్యాలో కొంతమంది తమ వ్యాపార ప్రకటన కోసం సముద్రపు ఒడ్డు నుండి ఒక గాడిదను ప్యారాచ్యూట్ తో ఆకాశం లో ఎగరవేసేరు. ఎగురుతున్న గాడిద అరుపులు విని, ఆ ఎగురుతున్న గాడిద అరుపులు విని బీచ్ కు వచ్హిన వారు అరుస్తూ గాడిదను కిందకి దింపమని అడిగేరుట. పిల్లలైతే ఏడుపు మొదలెట్టేరట. అరగంటసేపు గాలిలో ఎగిరిన గాడిద సముద్రపు నీటిలో పడిపోయిందట. ఈ విషయం తెలుసుకున్న జంతు రక్షణ సిబ్బంది వీరి మీద కేసు పెట్టేరట.

ప్రక్రుతి అద్భుతాలతో నిండిపోయిన ప్రపంచం.....3

ఎర్రటి అలలు


ఈ ఫోటోలో మీరు చూస్తున్నది ఎర్రటి సముద్రపు అలలు. ఈ ఎర్రటి అలలను "అల్గాల్ బ్లూంస్" (Algal blooms) అని అంటారట. అల్గే అంటే నీటి పాచి(మామూలుగా మనం నీటి పాచిని పచ్హ రంగులోనే చూసుంటాము). ఎర్ర పాచి అక్కడక్కడా సముద్రంలో ఏర్పడుతుందట. కొన్నిసార్లు ఈ ఎర్ర పాచి నీటిలో కలిసిపోయి సముద్రపు నీటిని కొంతమేరకు ఎర్ర రంగుతో నిపేస్తుంది. ఆ ఎరుపు రంగు నెత్తురి ఎరుపులా కనబడుతుందట.

ఈ ఎర్ర పాచి అంతగా హానికరం కాకపోయినా, ఒక్కొక్కసారి విషపూరితంగా ఉంటుందట. దీని వలన చేపలు, పక్షులు మరియూ నీటి జంతువులు చనిపోయే అవకాసం ఉన్నదట.

Thursday, July 22, 2010

తంజావూర్ గుడి సహస్రాబ్ద వుత్సవములో పాల్గొంటే రాజకీయాలకు మంచిది కాదా?

ప్రజలందరూ తంజావూర్ పెద్ద గుడి యొక్క సహస్రాబ్ద (వెయ్యి సంవత్సరముల)వుత్సవాలు ఎప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నారు.

వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గా పేరు గాంచిన ఈ గుడి కట్టి వెయ్యి సంవత్సరాలు పూర్తి అయిన సందర్భముగా జరుపవలసిన సహస్రాబ్ద వుత్సవాలను ఈ సంవత్సరం జరపాలి. కానీ గుడి అధికారులు వుత్సవాన్ని ఒక సంవత్సరానికి వాయిదా వేస్తున్నామని తెలిపేరు.

ఈ సంవత్సరం సెప్టంబర్ నెలలో జరుపవలసిన సహస్రాబ్ద వుత్సవాలను 2011 కు వాయిదా వేస్తున్నట్లు, వుత్సవాలను మహారాజు రాజ రాజ చోళుని పుట్టినరోజు వేడుకలతో కలిపి చేయాలని నిర్ణయించుకున్నట్లు అధికార యంత్రాంగం తెలియపరచింది. "సత్య వియా" అని పిలువబడే రాజ రాజ చోళుని పుట్టిన రోజు పండుగను ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో జరుపుతారు.

సహస్రాబ్ద వుత్సవాలను నిర్వహించేందుకు ఒక హై లెవల్ కమిటీ ని ప్రబుత్వం ఏర్పరచింది. వుత్సవాన్ని ఎంత గొప్పగా నిర్వహించాలో ప్రభుత్వం చెప్పలేదు కానీ ఈ కమిటీ వుత్సవ వేడుకలను ఎలా జరపాలో ఒక ప్రణాళికను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

వుత్సవాలను వాయిదా వేయటం గురించి అక్కడి ప్రజలు వేరే విధంగా చెబుతున్నారు. తంజావూర్ పెద్ద గుడిలో జరిగే ఏ వుత్సవమైనా, ఆ వుత్సవానికి హాజరైన రాజకీయనాయకులకూ మరియూ ఆ రాజకీయ పార్టీకి మంచిది కాదని భావించే సహస్రాబ్ద వుత్సవాలను వాయిదా వేసేరని చెబుతున్నారు. అందులోనూ ఎన్నికలకు ముందు చోళులు కట్టిన స్మారక కట్టడాలను రాజకీయనాయకులు సందర్సిస్తే, అది ఆ రాజకీయ నాయకునికీ, ఆ రాజకీయ నాయకుని పార్టీకీ కీడు తీసుకు వస్తుందని నమ్ముతున్నారు. తమిళనాడులో 2011 మే నెలలోపు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అందుకనే ఈ సంవత్సరం జరగవలసిన వుత్సవాలను 2011 సెప్టంబర్ కు వాయిదా వేసేరని చెబుతున్నారు.

ఈ గుడి వుత్సవాలలో(సత్య వియా) పాల్గొన్న తరువాతే మాజీ తమిళనాడు ముఖ్య మంత్రి ఎం.జీ.ఆర్. మరియూ మాజీ భారత ప్రధాణి ఇందిరా గాంధీ అకాల మరణానికి గురైయ్యేరు. 1995 లో ఈ గుడికి జరిగిన కుంభాభిషేకంలో జరిగిన తొక్కిసలాటలో 45 భక్తులు మరణించేరు. అందుకనే ఈ వాయిదా అని చెప్పుకుంటున్నారు.

ఈ గుడి కట్టి వెయ్యి సంవత్సరాలు పూర్తి అవడమే కాకుండా మరో 7 నెలలు గడిచి పోయింది. సహస్రాబ్ది వుత్సవాలను ఈ సంవత్సరలో జరిపితేనే అది అందరికీ మంచిదని పేరు తెలుపని ఒక ఇతిహాసకర్త తెలిపేరు.

Wednesday, July 21, 2010

"రక్ష కవచం" ను కనిబెట్టినాయన భారత రైల్వే శాఖ పని తీరుపై వేదన

కొంకన్ రైల్వే కార్పోరెషన్ మాజీ మెనేజింగ్ డైరెక్టర్ రాజారాం బొజ్జీ గారు కనిపెట్టి, అభివ్రుద్ది చేసిన ఆంటీ కొల్యూషన్ డివైస్ (Anti-collision Divice…ACD) ను భారత రైల్వే శాఖ పూర్తిగా ఉపయోగించుకుని ఉండుంటే కలకత్తాలో ఉత్తరబంగా ఎక్స్ ప్రెస్స్ రైలు మరియూ వనంచల్ ఎక్స్ ప్రెస్స్ రైలు ఢీ కొనేవి కావు, ఆ ప్రమాదంలో చనిపోయిన 60 మంది కాపాడబడి ఉండేవారు.

ఒక ప్రముక దిన పత్రికకు పంపిన జాబులో "కష్టపడి పనిచేసినదంతా వ్రుధా అయిపోయింది" అంటూ తన వేదనను వ్యక్తం చేసిన రాజారాం బొజ్జీ "రైల్వే శాఖ వారు చాలా తెలివిగల వారు. నేను తయారు చేసిన ఏ.సీ.డీ యొక్క హక్కులను నా దగ్గర నుండి తీసుకుని, నా పరికరాన్ని చంపేయడమే కాకుండా, రైళ్ళలో పయనిస్తున్న ఎంతోమందిని చంపేస్తున్నారు" అని రాసేరు.

ఆట్రీలాబ్ అనే ఒక రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ కంపెనీని అమెరికాలోనూ, హైదరాబాద్ లోనూ మొదలుపెట్టిన ఈయన "భారతదేశం లో పని చేసి అభివ్రుద్ది చెందాలనుకోవడం నిరాశనే మిగిలిస్తుందని తెలుసుకున్నాను" అన్నారు.

ఐ.ఐ.టీ లో చదువుకున్న రాజారాం బొజ్జీ తను కనుగొన్న పరికరాల హక్కులను అమెరికాలోనూ, భారతదేశంలోనూ రిజిస్టర్ చేసేరు. ఆయన కనుగొన్న అతి ముఖ్యమైన పరికరాలు రైల్వే టెక్నాలజీలకు సంబంధించినవి. ప్రపంచంలో మొట్టమొదటి అత్యున్నత ఆంటీ కొల్యూషన్ డివైస్ నెట్ వర్క్ "రక్ష కవచ్" (భారత రైల్వే శాఖ దీనిని 2500 కిలో మీటర్ల వరకు ఉపయోగిస్తోంది), "స్కై బస్ మెట్రో" ( ఈ పరికరాన్ని 1989 లో ఇటలీ లోని బోలగ్నా విశ్వవిద్యాలయానికి ఇచ్హేరు) మరియూ మరో 17 పరికరాల హక్కులను ఈయన కొంకన్ రైల్వేలో పనిచేసేటప్పుడు భారత రైల్వే శాఖకు అందించేరు.

ఆయన కనుగొన్న ఏ.సి.డీ రేడియో ఫ్రీక్వెన్సీ(RFID) మరియూ గ్లోబల్ పొషీషనింగ్ సిస్టం (GPS) తో ఉపగ్రహాల సహాయంతో పనిచేస్తుంది. దీనిని రైలులో అమర్చితే 3 కిలోమీటర్ల దూరం వరకు అదే రైలు పట్టాల మీద మరో రైలు గనుక ఉంటే ఈ పరికరం దానిని గమనించి ఆటోమేటిక్ గా ఈ రైలుకు బ్రేకులు బిగించి రైలును ఆపుతుంది. అప్పుడు, ధోషులెవరైనా సరే రైళ్ళు మాత్రం ఢీ కొనవు, ప్రాణ నష్టం జరగదు.

రాజారాం బొజ్జీ భారత రైల్వే శాఖపై వ్యక్త పరిచిన వేదన సమంజసమే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎన్నో రైలు ప్రమాదలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేరు. 2500 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే ఉపయోగిస్తూ (కొంకన్ రైల్వే రూట్లలో కొన్ని రైళ్ళలోనూ మరియూ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రూట్లలో కొన్ని రైళ్లలో) 2006 లో రైల్వే శాఖ ఈ పరికరాన్ని 2013 లోపు భారతదేశం పూర్తిగా ఉపయోగిస్తామని తెలిపేరు. కానీ ఉపయోగించలేదు. ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్లో ఈ పరికరాన్ని ఉపయోగిస్తామని చెబుతారు కానీ ఎందుకు ఉపయోగించటంలేదు తెలియదు.

రైలు ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రమాదానికి కారణాలు వెదుకుతూ, ఆ కారణాన్ని ఎవరి మీదో తోస్తూ నష్ట పరిహారం క్రింద కోట్లు ఖర్చు చేయడం కంటే ఆ ఖర్చుతో రాజారాం బొజ్జీ కనుగొన్న పరికరాన్ని ప్రతి రైలులోనూ అమర్చి ప్రాణ నష్టాన్ని ఆపవచ్హు కదా.

రష్యా గూఢాచారిణి తన జీవిత కధను 2,50,000 డాలర్లకు అమ్మదలచుకుంది

ఈ మధ్య అమెరికా ప్రభుత్వముచే అమెరికాలో ఖైదు చేయబడి రష్యాకు తిరిగి పంపబడ్డ రష్యా గూఢాచారిణి అన్నా చాప్మాన్ తన గూఢాచర్య అనుభవాలను బయటపెట్టటానికి 2,50,000 డాలర్లకు రహశ్య ఒప్పందం చేసుకున్నట్లు, ఆ డబ్బును తన స్నేహితురాలి పేరుతో స్విస్ బ్యాంక్ లో వేయమని చెప్పినట్లు తెలిసింది.

తాను అమెరికాలోకి ఎలా జొరబడింది, అక్కడి అమెరికన్ సొసైటీలో ఎలా ఇమిడిపోయి ఎలా తన గూఢాచార పనులను నిర్వహించింది అనే పూర్తి విషయాలను పుస్తక ప్రచురన కర్తలకు చెబితే డబ్బు చేసుకో వచ్హునని, ఆ డబ్బుతో తన మిగిలిన జీవితాన్ని గడపవచ్హునని నిర్ణయించుకుని లండన్‌లో ఉంటున్న తన స్నేహితురాలితో చెప్పి ఆమెను మీడియావారిని గానీ లేక పుస్తక ప్రచురన సంస్తలను కలవమని చెప్పింది.

రష్యాలోనూ, అమెరికాలోనూ గూఢాచారులుగా పని చేసినవారు తమ అనుభవాలను అమ్ముకుని డబ్బుచేసుకోకూడదనే చట్టాలు ఉండటంతో లండన్‌లో ఉన్న తన స్నేహితురాలి మూలంగా తన అనుభవాలని అమ్ముకోవటానికి పూనుకుందట.

"అమెరికా ప్రభుత్వం ఈమెను రష్యా దేశ గూఢాచారిణిగా గుర్తించి, ఖైదు చేసి, రష్యాకు తిరిగి పంపించేరు. కనుక ఇమెకు ఇంక మీదట రష్యా ప్రభుత్వం జీతం ఇవ్వదు. అమెరికా నుండి వచ్హేసింది కనుక అక్కడ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక చేయలేదు. ఇక మీదట ఎటువంటి సంపాదన ఉండదు కాబట్టి జీవించడం కోసం ఆమె తన గూఢాచార అనుభవాలను అమ్ముకుని డబ్బు చేసుకోవాలనుకంటోంది" అని ఆమెకు సన్నిహితంగా ఉంటున్న ఒకరు తెలిపేరట.

ఈమెతో పాటూ మరో 9 మంది రష్యన్లను గూఢాచారులుగా గ్రహించి అమెరికా ప్రభుత్వం వారందరినీ ఖైదు చేసి, రష్యాతో స్వాప్ అగ్రీమెంట్ చేసుకోనుండటం వలన వారందరినీ రష్యాకు తిరిగి పంపించేరు.

తమ దేశానికి తిరిగి వస్తూ ఈ గూఢాచారులందరూ తమ అనుభవాలను బయటపెట్టి దానితో డబ్బు సంపాదించుకోమని, అలా సంపాదించుకున్నా ఆ డబ్బును అమెరికా ప్రభుత్వానికి ఇచ్హేస్తామని అమెరికన్ ప్రభుత్వ ఒప్పందాలలో సంతకాలు చేసేరట.
"ఆమె జీవించడానికి డబ్బు కావాలి. ఆమెకు జీతం రాదు. ఎటువంటి సంపాదనా ఉండదు. డబ్బు సంపాదించుకోవటానికి తన అనుభవాలను అమ్ముకోవడం తప్ప ఆమెకు ఇంకో మార్గం లేదు. ఒప్పందం ప్రకారం ఆమె తన అనుభవాలను తానే కధగా రాసి అమ్ముకుని డబ్బు చేసుకోకూడదు. కానీ తన అనుభవాలను ఎవరితోనైనా చెప్పుకోవచ్హు. దానికి ఎటువంటి అడ్డంకులూ లేవు. అందుకని, తన అనుభవాలను తన స్నేహితురాలికి చెప్పి ఆమె మూలంగా డబ్బు సంపాదించుకోవాలనుకుంది" అని ఆమె లాయర్ తెలిపేరు.

రెండు రకాల ఆదర్శం చూపించిన చంద్రబాబు నాయుడు

తమిళనాడులో, ముఖ్యంగా ఉత్తర తమిళనాడు ప్రజలు ఆంద్ర రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ఆందోళనలను క్షుణ్ణంగా గమనిస్తున్నారు. మహారాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కు జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నా, ఆయన అంతర్ రాష్ట్ర నదీ జలాల సమస్యలో రెండు రకాల ఆదర్శాన్ని చూపుతున్నారని భావిస్తున్నారు.

బబ్లీ డాం ను చూడటానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు ని మరియూ అతని పరివారాన్నీ మాహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, అరెస్ట్ ను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ఆంద్రరాష్ట్ర బంద్ కు పిలుపునిచ్హేరు. చిత్తూరు జిల్లాలో ముఖ్యం గా చంద్రబాబు ను ఎంపిక చేసి పంపిన కుప్పం లో బంద్ పూర్తిగా జరిగింది.

ఈ జిల్లా ప్రజలే తమిళనాడు కు దగ్గరా గా ఉన్న గనేష్ పురంలో పాలార్ నదిమీద డాం కట్టడానికి మద్దత్తు నిచ్హేరు. చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు 32 చెక్ డాం లు పాలార్ నది మీద కట్టేరు.

పాలార్ నది మీద డాములు కడితే, తమిళనాడు కు నీరు రాదని ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న తమిళ ప్రజలు పోరాటం జరిపితే, వారి పోరాటంలోని న్యాయాన్ని తోసిపుచ్హి "నా నియోజక వర్గం లోని ప్రజలే నాకు ముఖ్యం" అని ఒక్క మాటలో చెప్పేరు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు.

తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో పాలార్ నదిలో డాం కట్టడం పై నిరసన తెలుపుతూ, దాని వలన క్రిష్ణగిరి, సేలం మరియూ ధర్మపురి జిల్లాలకు న్యాయంగా ఇవ్వ వలసిన నీరు రాదని తెలుపుతూ ఒక పిటీషన్ వేసేరు. అంతర్ రాష్ట్ర సమస్య కాబట్టి చట్ట ప్రకారం న్యాయం అడగాలని నిర్ణయించుకున్నారు. తమిళనాడులోని కొన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని తమ రాజకీయ లబ్ధి కోసం పోరాటాలు చేస్తామని చెబితే వారిని తమిళనాడు పోలీసులే అడ్డుకున్నారు.

పాలార్ నది జలాల విషయంలో ఒక ఆదర్శం, గొదావరీ నదీ జలా విషయంలో మరో ఆదర్శమా? అని అనుకుంటున్నారు.

బబ్లీ నియోజకవర్గ ప్రజలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ను ఎన్నుకున్నారు. ఆ నాడు చంద్రబాబు నాయుడు తన నియోజక వర్గానికి ఏమి చేసేరో, అదే అశోక్ చవాన్ ఈ రోజు చేసేరు.

చంద్రబాబు ను మహారాష్ట్రాకు పోకుండా ఆంద్ర రాష్ట్ర ప్రబుత్వమే అడ్డుకోనుంటే, ఆయనకు ఈ రోజు ఇలా అవమానం జరిగేది కాదు.

అంతర్ రాష్ట్ర సమస్యల పై సం యమనం పాటించాల్సిన అవసరం రాజకీయనాయకులందరికీ ఉన్నది.

Tuesday, July 20, 2010

నోబుల్ శాంతి బహుమతికి ప్రతిపాదన చేయబడుతున్న శ్రీ శ్రీ రవిశంకర్ గారికి కళంకం తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా?

అధ్యాత్మిక గురువులకు ఏదో ఒక విధముగా కళంకం తీసుకువస్తే, దానితో డబ్బుచేసుకోవచ్హునని కొంతమంది తాపత్రయ పడుతున్నారా?

పేరు ప్రఖ్యాతులున్న అధ్యాత్మిక గురువుల మీద ఎటువంటి కళంకం వేసినా అది ఒక పెద్ద వార్తగా మారి, కళంకం వేసినవారికీ మరియూ ఆ వార్తను ప్రచారం చేసేవారికీ డబ్బే కాకుండా పేరు, ఖ్యాతి వస్తుందనే విషయం చాలా మంది తెలుసుకున్నారు. ఎందుకంటే అధ్యాత్మిక గురువులకు మన దేశంలోనే కాక, విదీశీయాలలో కూడా అనుచరలుంటారని వారికి తెలుసు.

అధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే ఆశ్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఏన్నో బ్రాంచ్‌లున్నాయి. కొద్దిరోజుల క్రితం ఈయన బెంగళూర్ లో కొంత భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారనే వివాదంలో చిక్కు కున్నారు. కాని ఆయన భూమిని ఆక్రమించుకున్నారని ఎవరూ నిరూపించలేకపోయేరు.

ఈ వివాదం ఎలా వచ్హిందంటే, జూన్ 30 వ తారీఖున శ్రీ శ్రీ రవిశంకర్ గారికి 42 కోట్ల రూపాయలు ఇవ్వవలసినదిగా బెదిరింపు ఫోన్ వచ్హింది. మళ్ళీ మళ్ళీ అదేలాగా ఫోన్ లు రావడంతో ఆయన ఈ విషయాన్ని పోలీసులకు తెలియపరిచేరు.

అగ్ని శ్రీధర్ అనే ఒక రౌడీ షీటర్ దగ్గర నుండి ఆ ఫోన్ వచ్హిందని పోలీస్ విచారణలో తెలిసింది. ఈ రౌడీ షీటర్ తాను ఒక సంఘ సేవకుడినని చెప్పుకుంటూ ఆస్తి తగాదాలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఉంటాడట. ఇతను ఒక పత్రికను ప్రచురిస్తాడట. దానికి రాజకీయనాయకుల మద్దత్తు ఉన్నదట.

పోలీసులు ఈ రౌడీ షీటర్ ను విచారణ చేసినప్పుడు "నేను డబ్బులిమ్మని బెదిరించలేదు. నా స్నేహితుని భూమిని ఆయన ఆక్రమించేరు. ఆ భూమిని కాళీ చేయమన్నాను. ఆయన ఆశ్రమంలో వ్యభిచారం జరుగుతోంది. మత్తు పధార్దాలు వాడుతున్నారు" అని చెప్పేడు.

పోయిన వారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం ముందు కొంతమంది పోరాటం చేసేరు. అప్పుడు అసిస్టంట్ కమీషనర్ బి.హెచ్. సిద్దప్ప ఏ.ఓ.ఎల్ భూమిని ఆక్రమించిందని చెప్పేరు. కానీ ఆ తరువాత "నేను ఏమీ చెప్పలేదు. పోరాటంలో పాల్గొన్నవారు ఎవరో అలా చెప్పేరు" అని ఆయన తెలిపేరు.

అధ్యాత్మిక ఆశ్రమాలు నడిపే గురువులకు డబ్బు ఇవ్వవలసినదిగా బెదిరింపు ఫోన్లు రావడం కొత్త కాదు. స్వామి నిత్యానందా అశ్లీల వీడియోను లెనిన్ కరుపన్నన్ విడుదల చేయడానికి ముందు, స్వామి నిత్యానందా కు కూడా బెదిరింపు ఫోన్లు వచ్హినట్లు చెబుతున్నారు.

శ్రీ శ్రీ రవిశంకర్ గారి మీద ఫిర్యాదు వచ్హిన సమయం చాలామందిలో ఆయన మీద కళంకం తేవాలనే ఆయన మీద ఫిర్యాదు చేసేరనే అనుమానం కలిగించింది. ఎందుకంటే శ్రీ శ్రీ రవిశంకర్ గారి పేరుని నోబుల్ శాంతి బహుమతికి ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న ఆయన అనుచరులు ప్రతిపాదన చేస్తున్నారట. ఈ సమయంలో ఆయన మీద ఫిర్యాదు రావటం చాలా మందికి ఆశ్చర్యంగా ఉందట.

2022 లో జరుపబోయే ప్రపంచ ఫుట్ బాల్ మ్యాచ్‌లకు కొతార్ లో రెడీ అవుతున్న స్టేడియాల ఫొటోలు

2022 లో జరుపబోయే ప్రపంచ ఫుట్ బాల్ మ్యాచ్‌లకు కొతార్(QATAR) లో రెడీ అవుతున్న స్టేడియాల ఫొటోలు


2022 లో జరుపబోయే ప్రపంచ ఫుట్ బాల్ మ్యాచ్‌లకు కొతార్ లో రెడీ అవుతున్న స్టేడియాల ఫొటోలు

Monday, July 19, 2010

ఇండియా,అమెరికా,ఇంగ్లాండ్ లొని ప్రధాన భవనాల వాస్తు ప్రభావం ఎలా ఉన్నదో తెలుసుకోండి(PART-2)

వైట్ హౌస్(అమెరికా):...కొన్ని సంవత్సరాలుగా ఈ వైట్ హౌస్ ప్రపంచ రాజకీయ ధుమారాలకు కేంద్రంగా ఉంటున్నది. ముఖ్యంగా జార్జ్. డబ్ల్యూ బుష్ అధికారంలో ఉన్నప్పుడు. ఈ దేశం కొద్దికాలంగా దురద్రుష్టమైన సంఘటనలతో కష్ట పడుతోంది. కారణం వ్యతిరేక శక్తుల సంఘర్షన చాలా ఎక్కువగా ఉన్నది. మాన్ హట్టన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క ట్విన్ టవర్స్ దాడికి గురైనై. కారణం ట్విన్ టవర్స్ రెండూ ఒకే ఎత్తులో కట్టబడలేదు. అందువలన వ్యతిరేక శక్తి ఒక టవర్ లో నుండి ఇంకొక టవర్ కు పయనించింది.

వైట్ హౌస్ యొక్క అతి పెద్ద లాభం ఏమిటంటే, ఆ భవనం యొక్క తెలుపు రంగు. తెలుపు ఎప్పుడూ పురోగత శక్తినే ఇస్తుంది. రక్షణ సమస్యల కారణాలవలన మనం వైట్ హౌస్ గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోతున్నాము. అయినా, భవనాన్ని నిలయంగా చేసుకున్నవారు, ఆ భవనం యొక్క ఉత్తర ముఖ ద్వారాన్ని ఉపయోగిస్తే వారికి మంచి జరుగుతుంది.

ఆ భవనానికి ముందు ఉన్న రెండు స్థంభాల వలన ఎటువంటి ఉపయోగంలేదు. ఎందుకంటే ఈ రెండు స్థంభాలకూ మధ్య ఉన్న దూరం పురోగత శక్తిని లోనికి పోనిచ్హేంతగా లేదు. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతున్నారు. కొంతమంది ఫెంగ్ ష్యూ ని నమ్ముతున్నారు.

మాజీ బ్రిటీష్ ప్రధాన మంత్రి టోనీ బ్లైర్ నెం:10 డోవింగ్ స్ట్రీట్ లోని తమ నివాసంలో వాస్తు ప్రకారం మార్పులు చేసుకున్నారని అందరికీ తెలుసు.

బకింగ్ హాం ప్యాలస్:... బ్రిటీష్ వారు ప్రపంచంలోని ఎన్నో దేశాలను వందలకొలది సంవత్సరాలు పరిపాలించేరు. బకింగ్ హాం ప్యాలస్ లో ఉన్న అతి ఉన్నత పరిపాలకుల వారి వలనే ఇది సాధ్యమైందని అందరూ చెబుతున్నా ఆ భవనంలో ఉన్నవారికి అంత పురోగతినిచ్హింది వాస్తు శాస్త్రమే.

బకింగ్ హాం ప్యాలస్ కి నార్త్ ఈస్ట్ లో ఒక నది ఉన్నది. వాస్తు శాస్త్రం ప్రకారం నార్త్ ఈస్ట్ లో రోడ్డు గానీ, నది గానీ ఉంటే ఆ నివాస భవనంలోని వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది.

ఇండియా,అమెరికా,ఇంగ్లాండ్ లొని ప్రధాన భవనాల వాస్తు ప్రభావం ఎలా ఉన్నదో తెలుసుకోండి(PART-1)

"వాస్తు ప్రభావం ఇళ్లకు, వ్యాపార భవనాలకే కాకుండా ప్రతి దేశం యొక్క భాగ్యానికి కూడా ఉంటుంది" అని వాస్తు శాస్త్ర నిపుణులైన వినాయక్ హ్చ్ షా గారు ఒక వ్యాసంలో తెలిపేరు. ఆయన రాసిన వ్యాసంలోని ముఖ్య అంశాలను మీకు అందజేస్తున్నాను.

దేశాల యొక్క భాగ్యం గురించి తెలుసుకోవాలంటే ఆ యా దేశాలను పరిపాలిస్తున్న (ఎం.పీ లు) పరిపాలనా యంత్రాంగం ఆలోచనలకు కూడే చోటు (నివాసం, భవనం) యొక్క వాస్తు గురించి అలోచించాలి. యుద్దాలూ, అంతర్ కలహాలు తో సతమతమౌతున్న దేశాలను తీసుకుంటే, అ దేశాల యొక్క ప్రధాన భవనాల నిర్మాణంలో ఏదో ఒక వాస్తు లోపం ఉంటుంది.

ఎలాగైతే మన ఇళ్ళల్లో వాస్తు దోషాలను నివారించుకుని ప్రశాంతతను తెచ్హుకుంటామో అలాగే దేశాలుకూడా వాస్తు దోషాలను పోగొట్టుకుని ప్రశాంతంగానూ, భాగ్యంగాను ఉండవచ్హు.

భారత పార్లమెంట్:.... ఈ భవన నిర్మాణం చాలా అద్భుతమైనదని అందరికీ తెలుసు. లోక్ సభ మరియూ రాజ్య సభ అనే రెండు పరిపాలనా యంత్రాంగాలను చొటుచేసుకున్న ఈ భవనంలో వాస్తు దోషాలున్నాయని 8 సంవత్సరాల క్రితమే ఒక వాస్తు శాస్త్ర నిపుణుడు చెప్పేరు. ఈ భవన నిర్మాణం గుండ్రంగా ఉండటమే అసలైన వాస్తు లోపం. వాస్తు శాస్త్రం ప్రకారం గుండ్రంగా ఉండే చోటు నుండి వ్యతిరేక శక్తుల ప్రభావం ఎక్కువుగా వస్తుంది. అంతేకాక భవనం లోనికి వెళ్లే మార్గం, తిరిగి వచ్హే మార్గం స్థిరంగా లేవు. ఈ భవనాన్ని ఒక ముక్కోణపు ఆకార స్తలంలో కట్టేరు. ఇది అశుభాన్ని సూచిస్తుంది. ఇలాంటి దోషాలుండటం వలనే మన పరిపాలనా యంత్రాంగంలో విరసం, అసమ్మతి ఎక్కువగా ఉన్నది.

డిసెంబర్ 13, 2001 న మన పార్లమెంట్ మీద తీవ్రవాదులు దాడి చేయటానికి ముందు పార్లమెంట్ భవనానికి నార్త్ ఈస్ట్ లో ఉన్న రోడ్డును ముసేసేరు. నార్త్ ఈస్ట్ నుండే పురోగమ శక్తి వస్తుంది.

వ్యతిరేక శక్తుల ప్రభావాన్ని పోగొట్టాలంటే పర్లమెంట్ లో పరిపాలక రాజ్యాంగ వ్యక్తులు కూర్చునే ముక్కోణపు ఆకారాన్ని మార్చాలి. ఆ ఆకారాన్ని మారుస్తేనే చాలా వరకు వాస్తు దోష నివారణ జరుగుతుంది. పురోగమ శక్తి వస్తుంది. దీనివలన విరసం, అసమ్మతి తగ్గి శాంతియుత వాతావరణం చోటుచేసుకుంటుంది.

పెంటగన్(అమెరికా):.... వాస్తు శాస్త్రం ప్రకారం పెంటగన్,హెక్సగన్ మరియూ ఆక్టోగన్ ఆకారాలు పురోగతికి అనుకూలమైనవికావు. పెంటగన్ భవన ఆకారాన్ని తీసుకుంటే చాలా వరకు ముక్కోణపు ఆకారంలోనే ఉంటుంది. ఇలా ఉంటే అగ్ని ప్రమాదాలకూ, అగ్నికి సంబందిత ప్రమాదాలకూ దారితీస్తుంది. ఇక్కడ మనం 9/11 న అమెరికాలో జరిగిన దాడిని గుర్తుకు తెచ్హుకోవాలి. ఎందుకంటే ముఖ్య నిర్ణయాలు తీసుకునే చోటు యొక్క భవన నిర్మాణం వాడియైన అంచులు కలిగినదిగా ఉండకూడదు. వాడి అంచులు కలిగిన భవనంలో కూర్చుని తీసుకునే నిర్ణయాలు ఘర్షణకు దారి తీస్తాయి. పెంటగన్ భవనం యొక్క ముఖ్యమైన మధ్య భాగం, భవనం లోని దక్షిణ దిక్కులో ఉన్నది. దీనివలన అన్యోన్యత దొరకదు.

పెంటగన్ లేక హెక్సగన్ లాంటి ఆకారాలు గల భవనాలకు దోషం పోవాలంటే భవనం చుట్టూ చదురపు ఆకారంలో గోడ కట్టాలి. ఇలా చేయలేని పక్షంలో ఈ భవనంలో కూర్చునేవారు ముక్కోణపు ఆకారంలో కూర్చోవాలి.

ఇండియా,అమెరికా,ఇంగ్లాండ్ లొని ప్రధాన భవనాల వాస్తు ప్రభావం ఎలా ఉన్నదో తెలుసుకోండి(PART-2) టపాలో వైట్ హౌస్ మరియూ ఇంగ్లాండ్ బకింగ్ హాం ప్యాలెస్ ల నిర్మాణం ఎలా ఉన్నయో తెలుసుకుందాం.

Saturday, July 17, 2010

చైనా లో కనబడ్డ U.F.O యోక్క మరో 2 వీడియోలు

చైనాలో కనబడ్డ U.F.O ను వీడియో తీసేరు……..అందరినీ ఆశ్చర్యపరిచిన ఆ వీడియోని చూడండి

హాంగ్జోయూ (Hangzhou) నగరంలో ఉన్న క్షియోషాన్ (Xiaoshan) విమానాశ్రయాన్ని రెండు రోజుల క్రిందట రాత్రి 9 తరువాత ఒక గంటసేపు మూసేసేరు(దీనివలన గంటల తరబడి విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది). కారణం ఆకాశంలో ఏదో తిరుగుతున్నందున.

విమానాశ్రయ అధికారులు అదేమిటో చెప్పలేదు. కానీ కిషాన్ హువా అనే చైనా ప్రబుత్వ న్యూస్ ఏజెన్సీ తెలిపిన దాని ప్రకారం గాలిలో ఎగురుతున్న ఏదో అంతుపట్టని ఒక వస్తువు ను చూడటం వలన జరిగిందని తెలిపింది.

విమానాశ్రయ రాడార్ లో ఏదో ఒక ఆబ్జెక్ట్ కనబడిందని షింగాయ్ దినపత్రిక తెలిపింది.

"ఆకాశంలో తళుక్కు మంటున్న వెలుగు కనబడింది. కొద్దిసేపట్లో మాయమయ్యింది" అని ఒక ప్రయాణీకుడు చెప్పినట్లు తెలిపిందని ఇంతకు ముందు టపాలో రాసేను.

దానిని వీడియో తీసేరు. ఆ వీడియో చూడండి. వీడియో ని పూర్తిగా చూడండి.Friday, July 16, 2010

మనం కలలు ఎందుకు కంటాము

మనం కలలు ఎందుకు కంటామో శాస్త్రవేత్తలు కనుక్కున్నామని చెబుతున్నారు. మనం అనవసరమనుకున్న విషయాలనుండి దూరం కావడం కోసం, మనకు కావలసిన విషయాలను దాచుకోవడం కోసం మరియూ మనకు ఏర్పడిన శారీరక మరియూ మానసిక ఒత్తిడులను అనిచివేయడం కోసమే మనం కలలు కంటున్నామని ఆస్ట్రేలియా కు చెందిన ఒక శాస్త్రవేత్త తెలిపేరు. ఇవన్నీ మనకు తెలియకుండానే జరుగుతుందట.

మరొక సిద్దాంతం ప్రకారం కలలు మన మెదడుని ఆ రోజు ఏమేమి చేసేమో గుర్తుకు తెచ్హుకుని, వాటన్నింటినీ ఒకటిగా జోడీకరించుకుని మనం గుర్తు పెట్టుకునేటట్లు చేయడానికని దక్షణ ఆస్త్రేలియా విశ్వవిద్యాలయంలోని "సెంటర్ ఫర్ స్లీప్ రీసెర్చ్" లో పనిచేస్తున్న ప్రొఫేసర్ డ్రూయూ డాసన్ తెలిపినట్లు డైలీ టెలిగ్రాఫ్ దిన పత్రిక ప్రచురించింది.

మనం ఎవరికైన ఒక కొత్త కష్టమైన పనిని ఇచ్హి, దానిని నేర్చుకోమని చెప్పి వారిని నిద్ర పోనివ్వకుండా పనిచేయించుకుంటే వారి దగ్గర నుండి మనం ఎటువంటి ఆశక్తికరమైన విషయాలనూ తెలుసుకోలేమని కూడా తెలిపేరు.

కలలతో నిద్ర పోయేవారిని మరియూ రాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ ( REM……RAPID EYE MOVEMENT SLEEP) లో ఉన్నవారినీ బాగా నిద్ర పోతున్నారని అనుకుంటాము. కానీ అది తప్పు అంటున్నారు.

కలలు రావడానికి ముందు మంచి నిద్ర పడుతుంది. మంచి నిద్ర పోయేవారు 2 గంటలు నిద్రలోనూ, ఆ తరువాత రెం (REM) లోనూ ఉంటారు. మళ్ళీ 2 గంటలు నిద్రలో ఉంటారు. ఇలా రోజూ జరుగుతూ ఉంటుందని ప్రొఫెసర్ డాసన్ చెప్పేరు.

మనం ఆక్టివ్ గా ఉన్నప్పుడు మన మెదడులోని వేవ్స్(BRAIN WAVES) ఎలా ఉంటాయో, మనం కలలు కంటున్నప్పుడు కూడా మన మెదడు వేవ్స్ అలాగే ఉంటాయట. దీని వలనే మన మెదడు ఎప్పుడూ హెచ్హరికగా ఉంటుందట.

కలలు కంటున్నప్పుడు మనలో కండరాల కదలిక ఉండదుట. దీనివలనే కలలు చెదిరిన వెంటనే కాసేపటి దాకా ఆ కలలో ఉన్నట్లే ఉంటారట. తాము నిద్ర పోతున్న గదిని చూస్తున్నా, వారికి ఆ గదిలో ఉన్నట్లు ఉండదట. అందువలన కొందరు నీరసంగా ఉంటారట.

ప్రపంచ ఎక్స్ పో(WORLD EXPO) 2010 కోసం చైనాలో నిర్మించబడ్డ 2-ఇన్-1 బిల్డింగ్...ఫొటోలు

ఇది నమ్మశక్యంకాని అభివ్రుద్ది. కట్టడ నిర్మాణం కన్నా, పనితనంలోని నేర్పును కనబరుస్తోంది ఈ 2-ఇన్-1 బిల్డింగ్.

"రెన్" అని పిలువబడే ఈ కట్టడంలో 1000 రూములు గల ఒక హోటల్, క్రీడా సెంటర్ మరియూ ప్రపంచ ఎక్స్ పో 2010 కోసం ఒక పెద్ద కాన్ ఫరెన్స్ హాల్ కట్టబడ్డాయి.

2 కట్టడాలుగా ప్రారంభమైనా చివరకు ఒకే కట్టడంగా ముగిస్తుంది. ఒక వైపు నీటిలో నుండి మొదలైతే, మరొకటి నేల మీద నుండి మొదలైంది.
Thursday, July 15, 2010

యూ.ఎఫ్.ఓ (U.F.O) వలన చైనాలో హాంగ్జోయూ విమానాశ్రయాన్ని మూసేరా? (ఫొటో చూడండి)

హాంగ్జోయూ (Hangzhou) నగరంలో ఉన్న క్షియోషాన్ (Xiaoshan) విమానాశ్రయాన్ని అక్కడ పనిచేస్తున్నవారూ మరియూ అక్కడ ఉన్నవారూ ఆకాశంలో ఏదో ఉన్నదని చెప్పటంతో విమానాశ్రయాన్ని మూసేసేరు. కానీ ఆకాశంలో ఏమున్నదనే విషయాన్ని తెలియపరచలేదు.

హాంగ్జోయూ నగరంలో పెద్దగా చూడాల్సిన ప్రదేశాలు ఏమీలేవు. వెస్ట్ లేక్ అనే సరస్సు, పెద్ద పెద్ద బిల్డింగ్లు మరియూ వాహనాల గోల తప్ప అక్కడ చెప్పుకునే విధమైనది ఏమీలేదు. కానీ అక్కడ చెప్పుకో దగ్గ విషయం ఒకటి జరిగింది. అదేమిటంటే హాంగ్జోయూ నగరంలోని క్షియోషాన్ విమానాశ్రయాన్ని రెండు రోజుల క్రిందట రాత్రి 9 తరువాత ఒక గంటసేపు మూసేసేరు(దీనివలన గంటల తరబడి విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది). కారణం ఆకాశంలో ఏదో తిరుగుతున్నందున.

విమానాశ్రయ అధికారులు అదేమిటో చెప్పలేదు. కానీ కిషాన్ హువా అనే చైనా ప్రబుత్వ న్యూస్ ఏజెన్సీ తెలిపిన దాని ప్రకారం గాలిలో ఎగురుతున్న ఏదో అంతుపట్టని ఒక వస్తువు ను చూడటం వలన జరిగిందని తెలిపింది.

ఏం చేయాలో తెలియని పరిస్తితులలో విమానాశ్రయ అధికారులు అక్కడనుండి బయలుదేరవలసిన విమానాలను ఆపేసేరు. అక్కడికి రావలసిన విమానాలను నింగ్బో (Ninjbo) మరియూ ఊక్సీ (Wuxi) నగరాల విమానాశ్రయాలకు మళ్లించేరు.

విమానాశ్రయ రాడార్ లో ఏదో ఒక ఆబ్జెక్ట్ కనబడిందని షింగాయ్ దినపత్రిక తెలిపింది.

"ఆకాశంలో తళుక్కు మంటున్న వెలుగు కనబడింది. కొద్దిసేపట్లో మాయమయ్యింది" అని ఒక ప్రయాణీకుడు చెప్పినట్లు తెలిపింది.

"ఆకాశంలో బంగారు రంగుతో కనబడింది. బంగారు లైట్లు కనబడ్డాయ్. దానికి ఒక తోక కూడా ఉన్నది" అని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అధికారులు మాత్రం అది ఒక విమానమని, సాయంత్రపు ఎండ పడి ఆ కాంతిలో అలా తెలిసిందని చెబుతున్నారు. యూ.ఎఫ్.ఓ మాత్రం కాదని చెబుతున్నారు.

ఒక విమాన కాంతి కోసం విమానాశ్రయాన్నే మూస్తారా? ఇందులో ఇంకేదో ఉన్నది. విమానాశ్రయం మూయడానికి నిజమైన కారణమేమిటో కొద్దిరోజులలో తెలుస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.

Wednesday, July 14, 2010

భారత రూపాయకు రేఖాత్మక సంకేతం ద్రువీకరించినట్లే


భారత రూపాయకు రేఖాత్మక సంకేతం నిర్ణయించడంకోసం ఏర్పాటుచేయబడ్డ జ్యూరీ మన రూపాయకు ఒక రేఖాత్మక సంకేతాన్ని ద్రువీకరించినట్లు తెలుస్తోంది. భారత భాషా అక్షరములతో అంతర్జాతీయ సంకేతాలకు సరితూగే విధంగా ఉన్నటువంటి, డి.ఉదయకుమార్ అనబడే ఐ.ఐ.టి పోస్ట్ గ్రాడ్యువేట్ గీసిన సంకేతక రూపకల్పనను కేంద్ర మంత్రివర్గం అమోదించినట్లు తెలుస్తోంది.

5 గురి దగ్గర నుండి వచ్హిన సంకేతక రూపకల్పనలలో వుదయకుమార్ గీసిన రూపకల్పనను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

ఉదయకుమార్ గీసిన (పై ఫొటోలో ఉన్న) రూపకల్పన సంకేతం భారత ప్రాచీణ భాష దేవంగిరి భాషలోని "రా" (Ra) కు మరియూ రోం భాషా అక్షరం "ఆర్" (R) కు మిశ్రమముగా ఉన్నట్లు, సంకేతంలో ఎక్కడా ఎటువంటి అనవసరమైన కొమ్ములూ లేవని తెలుపుతూ, ఈ సంకేతం మన ఆర్ధీక మంత్రి ప్రణాబ్ ముఖర్జీ గారి ఆలోచనలకు దగ్గరగా ఉన్నట్లు, కాబట్టి దీనిని ద్రువీకరించినట్లు చెబుతున్నారు.

అంతర్జాతీయ ఆర్ధీక రంగంలో భారత డబ్బుకు ఒక విలువ వచ్హింది. కాబట్టి మన డబ్బుకు ఒక గుర్తింపు, సంకేతం అవసరమని ఆర్ధీక మంత్రి ముఖర్జీ గారు తన బడ్జెట్ ప్రశంగంలో తెలిపేరు. ఇప్పుడు ఎన్నుకున్న సంకేతానికి కేంద్ర ఆర్ధీక శాఖ అంగీకారం దొరికిందని చెబుతున్నారు.

భారత డబ్బుకు రేఖాత్మక సంకేతం కావాలని నిర్ణయించుకున్న పిదప, రేఖాత్మక సంకేతం కోసం పోటీ నిర్వహించేరు. పోటీలో గెలుపొందినవారికి రూ.2.50 లక్షలు నగదు బహుమతిగా ప్రకటించేరు. పోటీ కి కావలసిన రూల్స్ కూడా ప్రకటించేరు.

అంతర్జాతీయంగా భారత రూపాయకు విలువ పెరిగింది. అంతర్జాతీయ ఆర్ధీక రంగంలో భారత డబ్బుకు ఒక గుర్తింపు దొరికింది. ఆర్ధీకంగా ఇంకా పైకి ఎదుగుతున్న మన దేశం, తన డబ్బుకు ప్రత్యేక గుర్తు కావాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే, ఇప్పుడున్న రూ. అనే గుర్తును పాకిస్తాన్, నేపాల్ మరియూ శ్రీలంకా దేశాలు కూడా తమ డబ్బుకు ఉపయోగిస్తున్నారు.

వుదయకుమార్ రూపొందించిన సంకేతంలో చాలా అర్ధం ఉన్నది. భార జాతీయ జెండా యొక్క 3 రంగులు, అ జాతీయ జెండాలోని అర్ధం, అశోక చక్రం, మరియూ చిక్కటి 2 గీతలు....భారదేశ ఆర్ధీకం మరియూ ప్రపంచ ఆర్ధీకం బాగుండాలనే సంకేతాలతో నిండినది.

ఒక ప్రముక దిన పత్రిక వుదయకుమార్ ని కలిసి అడిగితే "నాకు ఇంకా ఈ విషయం తెలియదు. మీరు చెప్పేది నిజమని నమ్ముతున్నాను" అని చెప్పేరట.

డిస్నీ లాండ్ లాగా బంగళూర్లో ఇస్కాన్ వారి అంతర్జాతీయ ఉల్లాస వనం....ఫోటోలు మరియూ వీడియో

డిస్నీలాండ్లో దొరికే ఆనందం మరియూ డిస్నీలాండ్ కున్న పేరు లాంటివి మన భారతదేశంలో కూడా రావాలంటే కొద్దికాలం పట్టవచ్హు. ఇస్కాన్ వారు ఇండియా హెరిటేజ్ ఫౌండేషన్ సహాయంతో "క్రిష్ణ లీలా తీం పార్క్" ను బెంగళూర్‌లో నిర్మించబోతున్నారు.

బెంగళూర్‌లోని కనకపురా రోడ్డుకు పక్కగా 28 ఎకరాల స్థలంలో డిస్నీలాండ్లో దొరికే అనుభవం లాంటిదే ఇక్కడ ప్రజలకు దొరకాలని 350 కోట్ల రూపాయల ఖర్చుతో 2 హెరిటేజ్ టవర్స్ ను మరియూ మరో 2 కాంప్లెక్స్ లను కడుతున్నారు.

భారతీయ సంస్క్రుతిని చాటి చూపించే ఈ ఉల్లాస వనాలు అంతర్జాతీయ సంస్క్రుతిని మరిపించేదిగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ ఉల్లాస వనంలో 2 పెద్ద గోపురాలతో 2 గుడులు, ఒక 4-డి సినిమా హాలు, తోలుబొమ్మలాట వర్క్ షాప్, పిల్లలకు కధలు చెప్పే గదులు ఉంటాయట. ఇంతే కాకుండా ఇక్కడికి వచ్హే ప్రజలను యమునా నదీ తీరానికి తీసుకువెళ్లే అనుభూతి కలిపించే క్రుతిమ నదిని, వ్రిందా వనం లాంటి వనాన్ని, గోవర్ధన కొండల లాంటి కొండలనూ కలిగి ఉంటుందట .

ఈ ఉల్లాస వనానికి వచ్హి వెళ్ళేవారు తమ రాకను మర్చిపోలేనిదిగా చేస్తుందట. అంతే కాక అంతర్జాతీయ ఉల్లాసవనాలలొ అతి పెద్దదిగానూ, ఉల్లాసంగాను ఉన్నదని చెప్పుకునే విధంగా కడతారట.


ఇవిగో ఫొటోలు.ఇదిగో వీడియో.

Tuesday, July 13, 2010

ఆఫ్రికన్ దేశాలలో కంటే మన దేశంలో ఉన్న పేదవారి సంఖ్యే ఎక్కువ!!!

మనదేశం లోని 8 రాష్ట్రాలలో నివసిస్తున్న పేదవారి సంఖ్య ఆఫ్రికా ఖండంలో ఉన్న 26 దేశాలలో నివసిస్తున్న పేదవారి సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నదట.

అతి పేదరికం మనదేశంలోనే ఎక్కువగా ఉన్నదట. బీహార్, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ మరియూ మరో 5 రాష్ట్రాలలో నివసిస్తున్న పేదవారి సంఖ్య ఆఫ్రికా ఖండంలో ఉన్న 26 దేశాలలో నివసిస్తున్న వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నదని "మల్టీ డైమెన్షెనల్ మెషర్స్ ఆఫ్ గ్లోబల్ పావర్టీ ఇండెక్స్" తెలిపింది.

లండన్‌లోని ఆక్స్ ఫోర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవెలెప్మెంట్ ఇన్స్ టిట్యూట్ వారు పేదరికాన్ని ఉత్త డబ్బుతో మాత్రం చూడకూడదని, అన్ని రంగాలలోనూ వెతకాలని దానికొసం మల్టీ డైమెన్షెనల్ పావర్టీ ఇండెక్స్(MULTI DAIMENSIONAL POVERTY INDEX(MPI) ను తయారుచేసి ఆ ఇండెక్స్ మూలం గా లెక్కలు తీస్తే ప్రపంచములో పేదరికంలో నివసిస్తున్న వారి లెక్కని తుల్యంగా తెలుసుకో వచ్హునని యునైటడ్నెషెన్స్ లో ఉన్న పావర్టీ ఎరాడికేషన్ విభాగానికి అందించేరు. ఈ ఎం.పి.ఐ ఇండెక్స్ మూలం గా అతి పేదరికంలో జీవిస్తున్న వారిని తుల్యమైన లెక్కలను తెలుసుకోవచ్హినని, తెలుసుకుని దానికి తగినట్లు పధకం వేసి అతి పేదరికాన్ని అంతం చేయవచ్హునని నిర్ణయించుకుని ఆ ఎం.పీ.ఐ ఇండెక్స్ కు యునైటెడ్నెషెన్స్ సరే నని చెప్పిందట.

ఈ కొత్త ఎం.పి.ఐ ఇండెక్స్ మూలంగా మొదట మెక్సికో నగరంలో అతి పేదరికంలో జీవిస్తున్న వారి సంఖ్య తీసేరట. ఇప్పుడు ఈ ఇండెక్స్ ను చిలి మరియూ కంబోడియా దేశాలు ఒప్పుకున్నాయట. ఎందుకంటే సంపాదన మీద మాత్రమే కాకండా మిగిలిన విషయాలు కూడా కలిపితేనే అతి పేదరికంలో జీవిస్తున్న వారి సంఖ్యను తుల్యంగా గణించవచ్హునని తెలుసుకున్నారు.

ఈ ఎం.పి.ఐ ప్ర్రాజెక్ట్ లో పనిచేసే వారు భారతదేశంలో వారి ఇండెక్స్ ప్రకారం అతి పేదరికంలో జీవిస్తున్న వారి సంఖ్యను బీహార్, చట్టిస్ గర్, జార్కండ్, మద్యప్రదేశ్, ఒరిస్సా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ మరియూ వెస్ట్ బెంగాల్ లో లెక్కలు తీస్తే ఈ 8 రాష్ట్రాలలోనే 421 మిల్లియన్ల మంది అతి పేదరికంలో జీవిస్తున్నారని తెలుసుకుందట. ఆఫ్రికా ఖండంలో ఉన్న 26 అతి పేద దేశాలలో అతి పేదరికంలో నివసిస్తున్నవారి సంఖ్య 410 మిల్లియన్లేనట. అంటే మనదేశం లో అతి పేదరికం లో నివసిస్తున్నవారి సంఖ్య ఆఫ్రికా ఖండంలోని 26 దేశాలలో అతి పేదరికంలో నివసిస్తున్న వారి కంటే ఎక్కువ.

యూనైటడ్ నేషెన్స్ అతి పేదరికాన్ని అంతం చెయాలని పెట్టుకున్న పధకం మొదలుపెట్టి 20 సంవత్సరాలు పూర్తిచేసుకునే సందర్భంగా జరగబోయే కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలియపరుస్తారట.

ఆక్టోబర్ నెలలో ప్రచురించబోతున్న ఈ విషయాన్ని మల్టీ డైమెన్షన్ ఇండెక్స్ వారు లండన్‌లోని ఒక పాలసీ ఫోరంలో తెలియపరిచేరు.

మరి మనకు స్వాతంత్రం వచ్హి 60 సంవత్సరాలకు పైన అయ్యింది. అతి పేదరికాన్ని అంతంచేస్తామని అన్ని రాజకీయ పార్టీలు వాగ్ధానాలపై వాగ్ధానాలు ఇచ్హి ఇన్ని సంవత్సరాలు ప్రజలను పరిపాలిస్తూ వచ్హేరు. అంతే కాకా ఈ మధ్య భారతదేశం ఆర్ధీకంగా అభివ్రుద్ది చెందినట్లు చెబుతున్నారు. ఎం.పి.ఐ వారు తెలుపుతున్న లెక్కలను బట్టి చూస్తే ఏదో ఒక వర్గమే అభివ్రుద్ది చెందుతున్నట్లు, మరో వర్గం ఇంకా అలాగే అతి పేదరికంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Monday, July 12, 2010

కాంగ్రెస్ హై కమాండ్ వేసిని వ్యూహంలో జగన్ చిక్కుకున్నారా?

కేంద్రంలో ఉంటున్న ముఖ్యమైన కాంగ్రెస్ రాజకీయనాయకులలో కొందరు రహస్యంగా బయటపెట్టిన కాంగ్రెస్ హై కమాండ్ వ్యూహం ప్రకారం జగన్ కు "షో కాస్" నోటీస్ ఇచ్హేందుకు సిద్దంగా ఉన్నదని తెలుస్తోంది.

ఓదార్పు యాత్రలో జగన్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, సీనియర్ మంత్రుల మీద మరియూ కాంగ్రెస్ హై కమాండ్ మీద అభియోగం మోపటాన్ని సహించలేక ఇలా నిర్ణయం తీసుకుందని ఒక ప్రముక టీ.వీ చానెల్ ప్రచారం చేయటాన్ని చూసి, రాష్ట్రంలోని మరికొన్ని చిన్న చిన్న టీ.వీ చానెల్స్ కూడా ఈ విషయాన్ని మరింత ప్రచారం చేసినై. కొందరైతే జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించబడతారని కూడా ప్రచారం చేసేరు.

కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ గారు లండన్ నుండి తిరిగి వచ్హిన వెంటనే జగన్ మీద కాంగ్రెస్ హై కమాండ్ "షో కాస్" నోటీస్ ఇవ్వబోతోందని వెలువడిన వార్తలో నిజం లేదని చెప్పినా, చాలామంది మొయిలీ గారు చెప్పినదాన్ని నమ్మటం లేదు.

కేంద్రంలో ఉన్న మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు జగన్ గుంపులో ఉన్నవారిని పరీక్షించటానికే కాంగ్రెస్ హై కమాండ్ ఇలా ప్రకటించిందని చెబుతున్నారు.

ఆదివారం వరకు జగన్ కేంద్రంలోని కాంగ్రెస్స్ నాయకత్వం మీదా, ముఖ్యంగా రాస్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య గారి మీద చేస్తూ వచ్హిన అబ్బియోగాలను, నిన్న, అంటే సోమవారం నాడు తన తూర్పు గోదావరి జిల్లా యాత్రలో వారెవరి గురించీ రాజకీయం గా ఏమీ మాట్లాడలేదు.

జగన్ ఓదార్పు యాత్ర గురించి, యాత్రలో ఆయన కాంగ్రెస్స్ నాయకత్వం పైనా మరియూ నాయకుల పైనా చేసిన అభియోగాల గురించి ఒక రిపోర్ట్ తయారుచేసి తమకు అందించవలసిందిగా మొయిలీ గారికి కాంగ్రెస్ హై కమాండ్ సూచనలిచ్హినట్టు తెలుస్తోంది. జగన్ యాత్ర పై మొయిలీ గారు అందించే రిపోర్ట్ ఆధారంగా కాంగ్రెస్ హై కమాండ్ జగన్ పై ఒక నిర్ణయానికి వస్తుందని తెలుస్తోంది.

తనతో పాటూ 30-40 ఎం.ఎల్.ఎ లు ఉన్నారు, వారంతా రాజకీయంగా తనకు ఏం జరిగినా తనతో ఉంటారని జగన్ అనుకుంటున్నారు. కానీ కంగ్రెస్ హై కామాండ్ లెక్కల ప్రకారం 12 మంది ఎం.ఎల్.ఏ లు మాత్రమే జగన్ వెనుక ఉంటారని కాంగ్రెస్ హై కమాండ్ ఖచ్హితమైన అంచనా వేసుకుందట.

జగన్ తన ఓదార్పు యాత్రలో రాజకీయాలు మాట్లాడతారని కాంగ్రెస్ హై కమాండ్ ముందే ఊహించిందట. అలా ఆయన మాట్లాడిన వెంటనే ఆయన మీద చర్య తీసుకో వచ్హు అనే కాంగ్రెస్ హై కమాండ్ వ్యూహం నిజమైందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కానీ జగన్ కనుక తన ఓదార్పు యాత్ర రాజకీయ బలం కోసం కాదు, నిజంగానే ఓదార్పు యత్రేనని చెప్పినదానికి కట్టుబడి ఉండుంటే కాంగ్రెస్ హై కమాండ్ జగన్ మీద వేసిన వ్యూహం నిజమయ్యేది కాదు.

తూర్పు గోదావరి ఓదార్పు యాత్రలో జగన్ తో కనుక ఎవరైనా కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ లు కలిస్తే కాంగ్రెస్ హై కమాండ్ వ్యూహం లో జగన్ చిక్కుకున్నట్లే. అప్పుడు వెంటనే జగన్ మీద కాంగ్రెస్ హై కమాండ్ చర్య తీసుకుంటుందని చెబుతున్నారు.

డిల్లీలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ ఎం.పీ. లు జగన్ డాక్టర్.వై.ఎస్.ఆర్.గారి వారసుడు మాత్రమే కానీ ఆయన రాజ్యాంగ జీవితానికి వారసడు కాదని గట్టిగా వాదిస్తున్నారట.

డబ్బు కోసం అనవసరమైన శస్త్ర చికిత్సలు చేసే డాక్టర్ల దగ్గర నుండి పేషంట్లను ఎలా కాపాడాలి?

"వైద్యులు డబ్బు కోసం అనవసరమైన శస్త్ర చికిత్సలు చేస్తారా? శరీరంలోని అవయవాలు తొలగిస్తారా? ఇంత యంత్రాంగం ఉండి మీరంతా ఏం పర్యవేక్చిస్తున్నారు" మానవ హక్కుల సంఘం చైర్మాన్ జస్టీస్ బి.సుభాషన్ రెడ్డీ ఆగ్రహం వ్యక్తం చేసేరు.

ఇటీవల గంటా సత్యనారాయణ అనే వ్యక్తి హెర్నియాతో బాధ పడుతూ హైదరాబద్ లోని హిమాయత్ నగర్ లో ఉన్న మహేశ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో జేరితే అతనికి హెర్నియా కాకుండా గాల్ బ్లాడర్ శస్త్ర చికిత్స చేసేరు.

ఇది బయటకు వచ్హిన చాలా కొద్ది కేసులలో ఒకటి. ఇలాంటివి ఆంద్ర రాష్ట్రంలోనే కాక అన్ని రాష్ట్రాలలోనూ జరుగుతోంది. డబ్బు కోసం తమ వైద్య వ్రుత్తిని తమనే నమ్ముకు వచ్హిన పేషెంట్ల పై దుర్వినియోగం చేయడం వైద్య వ్రుత్తికే అవమానం. దీనిని పట్టిచుకోకుండా ఉంటున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీనికి జవాబు చెప్పాలి. ఎందుకంటే క్వాకరీ ని(దొంగ డాక్టర్లను)పూర్తిగా రూపుమాపాలని అంటున్న మెడికల్ కౌన్సిల్ డబ్బు కొసం అనవసరమైన శస్త్ర చికిత్సలు చేసే డాక్టర్లను కూడా రూపుమాపాలి. కానీ వారు ఈ విషయంలో సైలెంట్ గా ఉండటం బాధాకరం.

ఇలా ఎన్నో సార్లు జరిగిందని, ఎంతోమంది ఈ హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ వలన భాదించ బడ్డారని తెలిసున్నా ప్రబుత్వం గానీ, మెడికల్ కౌన్సిల్ గానీ వారి దగ్గర నుండి సాదారణ మానవులను కాపాడటానికి ఎటువంటి ప్రయత్నం తీసుకోలేదు. కారణాలు వారికే తెలియాలి .

ఇప్పుడు ఆరోగ్యశ్రీ పధకం క్రింద వచ్హే పేషెంట్ల ను కొంతమంది డాక్టర్లు మోసం చేసి డబ్బు సంపాదించుకుంటున్నారని తెలిసింది. ఇక ప్రబుత్వం గానీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గాని ఏమీ తెలియనట్లు చేతులు ముడుచుకు కూర్చుంటే మనదేశంలోని మెడికల్ ఫెటర్నటీ మీద మనకే కాక విదేశీయులకు కూడా నమ్మకం తగ్గిపోతుంది. ఎంతోమంది విదేశీయులు (మెడికలీ డెవెలపెడ్ దేశాల నుండి కూడా)తమ ఆరోగ్యం చక్కబెట్టుకోవటానికి మన డాక్టర్లను నమ్మి మనదేశానికి వస్తున్నారు. ఆటువంటి వారి సంఖ్య తగ్గిపోతుంది. విదేశాలలో మనదేశం లోని డాక్టర్ల మీద నమ్మకం తగ్గుతుంది.

కాబట్టి వెంటనే ప్రబుత్వం డబ్బు కోసమే వైద్య వ్రుత్తి చేసేవారి మీద ఒక చెక్ పెట్టాలి. ప్రతి పెద్ద, చిన్న నగరంలోనూ "గవెర్నమెంట్స్ సెకండ్ ఒపీనియన్ ప్రొవైడింగ్ సెంటర్" అనే పేరుతో ఒక మెడికల్ కేంద్రాన్ని ఓపెన్ చేయాలి. దీని గురించి ప్రజల దగ్గర ప్రచారం చేయాలి. పేషెంట్లకు ఎవరైనా డాక్టర్ ఏదైనా శస్త్ర చికిత్చ అవసరమని చెబితే, ఆ డాక్టర్ చెప్పినదాని మీద "సెకెండ్ ఒపీనియన్" తీసుకోవచ్హునని తెలపాలి. ఒక వేల ఆ డాక్టర్ తప్పుడు సలహా ఇచ్హుంటే ఆ డాక్టర్ మీద చర్య తీసుకోవాలి. అదేలాగా "సెకండ్ ఒపీనియన్" లేకుండా (ఎమర్జన్సీ కేసులలో తప్ప) శస్త్ర చికిత్సలు చేయకూడదని డాక్టర్లకు సూచనలివ్వాలి. ఇలా చెస్తే డాక్టర్లు డబ్బుకోసమే చేస్తున్న శస్త్ర చికిత్సలు చాలావరకు తగ్గుతాయి.

ఇది పేషెంట్లు తమకు తామే చేసుకోవచ్హు. శస్త్ర చికిత్సలు చేసుకోవాలని తమ డాక్టర్ చెబితే, వెంటనే చేయించుకోకుండా, ఇద్దరు లేక ముగ్గురు ఇతర డాక్టర్ల దగ్గరకు వెళ్లి వారి ఒపీనియన్ తీసుకుంటే మంచిది. ఎమర్జెన్సీ అని చెప్పే శస్త్ర చికిత్సల కు కూడా కొంత టైం ఉంటుంది, టైముందని తెలిసినా చెప్పరు. ఈ విషయం మీరు ఇంకోక డాక్టర్ దగ్గరకు వెడితే తెలుస్తుంది..

ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకునేంత వరకు మనల్ని మనమే కాపాడుకోవాలి.

Sunday, July 11, 2010

అతి చిన్న డాన్స్ మాస్టర్...వీడియో

ఈ వీడియో చూస్తే మీరు కూడా ముగ్ధులవుతారు. 3-4 సంవత్సరాల ప్రాయం లోనే అంత గొప్పగా డాన్స్ ఆడటం ఆ చిన్న పిల్లలోని పట్టుదలని ఎత్తిచూపోతుంది. తల్లితండ్రుల ప్రోశ్చాహం ఉంటే ఎంతటివారైనా తమలోని గొప్పతనాన్ని బయటపెడతారని నిరూపించింది. స్టేజ్ భయం లేకుండా అంతమంది ఎదుట ఆడటం ఆ పిల్ల లోని మరో గొప్పతనమనే చెప్పాలి.

నేను చెప్పడం కంటే మీరు చూడటమే కరెక్ట్. ఇదిగో ఆ వీడియో.


బీట్రూట్ జ్యూస్ లోని నైట్రేట్ రక్తపోటును తగ్గిస్తుంది

లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో బీట్రూట్ జ్యూస్ లో ఉన్నటువంటి నైట్రేట్ కు రక్తపోటును తగ్గించే గుణాలున్నట్లు నిరూపించబడింది .రక్తపోటు ఉన్నవారిలో కొంత మందికి నైట్రేట్ మాత్రలూ, మరికొందరికి బీట్రూట్ జ్యూస్ ఇచ్హినప్పుడు 24 గంటలలో వారికి రక్తపోటు తగ్గిందట.

బీట్రూట్ జ్యూస్ ను గుండె జబ్బు ఉన్నవారు తాగితే అందులో ఉన్నటువంటి నైట్రేట్ వారి రక్తంలోని నైట్రిక్ ఆసిడ్ గ్యాస్ ను అధికం చేసి వారి గుండె ఆరొగ్యంగా ఉండటంలో సహకరిస్తుందని క్వీన్ మేరీ విల్లియం హార్వే రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్లో వ్యాస్కులర్ బయాలజీ ప్రొఫెసర్ గా ఉంటున్న అమిత్రా అహుల్వాలియా తెలిపేరు.

నైట్రేట్ మాత్రలూ, బీట్రూట్ జ్యూస్ రక్తపోటుని తగ్గించటంలో ఒకే విధంగా పనిచేస్తున్నాయి. రోజుకు 250 ML బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే చాలుట. రక్తంలో నైట్రిక్ ఆసిడ్ గ్యాస్ ఎంత తక్కువగా ఉంటే, రక్తపోటు అంత అధికంగా ఉంటుందట. అది ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు రక్తపోటు అధిక మవుతుందో కనుక్కోవటం కష్టం కనుక రోజూ బీట్రూట్ జ్యూస్ తాగితే చాలా మంచిదట.

రెండు సంవత్సరాల క్రితం బీట్రూట్ జ్యూస్ తాగితే రక్తపోటు తగ్గుతుందని మాకు తెలిసింది కానీ బీట్రూట్ లోని ఏ గుణం వలన అనేది ఇప్పుడే తెలుసుకున్నామని ఆయన తెలిపేరు.

బీట్రూట్లో ఆరోగ్యానికి కావలసినంత మంచి గుణాలున్నయట. అవి:

1) బీట్రూట్లో రోజుకు కావలసినంత ఫోలిక్ ఆసిడ్, విటమిన్లు బి1, బి2, బి3, విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం,ఫాస్ ఫరస్, పొటాషియం మరియూ సోడియం ఉన్నాయి.

2) బీట్రూట్ జ్యూస్ తాగితే రక్తం బల పడుతుంది. రక్తపోటు తగ్గిస్తుంది మరియూ గుండె జబ్బులకు నివారణగా పనిచేస్తుంది.

3) బీట్రూట్ ని నీటిలో ఉడకపెట్టినప్పుడు, ఆ నీరు మొటిమలూ మరియూ సెగ్గెడ్డలను తగ్గిస్తుంది.

4) బీట్రూట్ ని పచ్హిగా తింటే మంచిది. ఉడక బెట్టినప్పుడు అది కొంత విటమిన్లను పొగొట్టుకుంటుంది.

5) పసిపిల్లలలో న్యూరల్ ట్యూబ్ లోని లోపాలని పొగొడుతుంది కనుక గర్భిణీ స్త్రీలు కు ఇది చాలా మంచిది.

అమెరికన్ హార్ట్ అసోషియేషన్ జర్నల్ హైపర్ టెన్షన్లో బీట్రూట్ గురించిన పరిశోధనా వివరాలను ప్రచురించేరు.

Saturday, July 10, 2010

మనుష్యులతో అనుబంధం: ఈ రోజు అక్టొపస్ పాల్...ఆ రోజు లైన్ (సిం హం) క్రిస్టియానా (వీడియో చూడండి)

జర్మనీ లోని ఆక్టోపస్ పాల్ ప్రపంచ ఫుట్ బాల్ కప్ మ్యాచ్‌ల గురించి జోస్యం చెప్పి ఎంతో మంది మనసులను ఆకట్టుకుంది.ఈ ప్రాణి జర్మనీ ఆడిన మ్యాచ్‌లలో ఎవరుగెలుస్తారో ముందే ఊహించి జోస్యం చెప్పింది. జర్మనీ ఆడిన అన్ని మ్యచ్లలోనూ(సెమిఫైనల్ వరకు) జర్మనీ గెలుస్తుందని చెప్పింది. జర్మనీ ప్రజలు సంతోషించేరు. ఆక్టోపస్ గొప్పతనాన్ని మెచ్హుకున్నారు. కానీ ఆక్టోపస్ పాల్ సెమీ ఫైనల్ మ్యచ్‌లో జర్మని ఊడిపోతుందని తెలిపింది. జర్మనీ ఊడిపోయింది. ఓటమిని తట్టుకోలేక పోయిన జర్మనీ అభిమానులు అంతవరకు మెచ్హుకుంటూ వచ్హిన ఆక్టొపస్ ని చంపేయమన్నారు.

చంపినా చంపేస్తారు...ఎందుకంటే కొందరు మనుష్యులు ఎప్పటికప్పుడు మ్రుగాల మీద అనుబంధాలను మార్చుకుంటూ ప్రవర్తిస్తారు కనుక. కానీ ఆక్టొపస్ మాత్రం మానవుల మీద తన అనుబంధాన్ని మార్చుకోలేదు. 3 వ చోటు ఎవరు గెలుచుకుంటారని అడిగితే జర్మనీ అని చెప్పింది. అలాగే జరిగింది. 3 వ చోటుకై నిన్న ఆడిన ఆటలో జర్మనీ గెలిచింది. ప్రపంచ ఫుట్ బాల్ మ్యాచ్ కప్ ను ఎవరు గెలుస్తారని అడిగినప్పుడు స్పైన్ దేశమని చెప్పింది. బహుశ అదే జరుగుతుందనుకుంటా.

బ్రతికున్నా, చనిపోయినా ఆక్టోపస్ పాల్ అనేక మంది మనసులో చోటు చేసుకుంది. చరిత్రలో కూడా చోటు చేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే చంపేస్తామని కొందరు మనుష్యులు తనను బెదిరించినా తనను పెంచుతున్న వారితో అనుబంధంగానూ,స్నేహంగానూ,విశ్వాసం గాను ఉండి తన పనిని న్యాయంగా చేసింది.

మ్రుగాలు మనుష్యులతో స్నేహం గానూ, ఆప్యాయంగానూ మరియూ విశ్వాసం గానూ ఉంటాయనడానికి క్రిస్టియానా అని పిలువబడ్డ సిం హం కూడా ఒక ఉదాహరణ. చిన్నప్పుడు తనను దగ్గరకు తీసుకుని పెంచి పెద్దచేసిన వారిని కొన్ని ఏళ్ళ తరువాత కలిసినప్పుడు తాను ప్రక్రుతిగా క్రూరమైన జంతువైనా ఆప్యాయంతో, అనుబంధంతో వారి దగ్గరకు వెళ్ళి వారిని కౌగలించుకుని తన విశ్వాసాన్ని చూపింది. దానిని ఈ క్రింది వీడియోలో చూడవచ్హు.
ఈ ప్రాణి గురించి, దాని ప్రవర్తన గురించి ఎన్నో పుస్తకాలలో రాసేరు. ఈ ప్రాణి చరిత్రలో చోటుచేసుకుంది. దీనిని ఆధారంగా తీసుకుని సాదు మ్రుగాలే కాకుండా క్రూర మ్రుగాలు సైతం అప్యాయతలకు, అనుబంధాలకు కట్టుబడతాయని తలియచెప్పే సినిమాను సోనీ కంపెనీ వారు తీయబోతున్నారు. ఇది ఆక్టోపస్ పాల్ ను చంపమని అడిగే వారికి కను విప్పు తేవాలి.

Friday, July 9, 2010

జర్మనీ లో ప్రపంచ ఫుట్ బాల్ కప్ మ్యాచ్‌లకు కరెక్ట్ గా జోస్యం చెబుతున్న ఆక్టొపస్(విడియో చూడండి) కు రక్షణ....స్పైన్ ప్రధాన మంత్రి

ప్రపంచ ఫుట్ బాల్ కప్ సెమి ఫైనల్స్ లో జర్మనీ ఓడిపొతుందని ఆక్టోపస్ జోస్యం చెప్పటం, ఖచ్హితంగా అలాగే జరగటంతో జర్మనీ లో ఉన్న, జర్మనీ దేశమే గెలవాలని ఆశ పడ్డ అభిమానులు జర్మనీ ఓడిపోవటంతో ఆ ఆక్టోపస్ ను చంపేయాలని గొడవచేస్తున్నారు.

ఇదే ఆక్టోపస్ అంతకు ముందు జర్మనీ ఆడిన అన్ని మ్యచ్లలోనూ జర్మనియే గెలుస్తుందని జోస్యం చెప్పింది. అప్పుడు సంతోషపడ్డ అభిమానులు సెమీఫైనల్స్ లో జర్మనీ ఓడిపోతుందని జోస్యం చెప్పిన ఆక్టోపస్ ను చంపేయాలని అనడం వారి దేశం వోడిపోయిందనే బాధతో చెబుతున్నా అది అంత బాగాలేదు.

ఫేస్ బుక్, ట్విట్టర్ లో కూడా దీని గురించి జర్మనీ అభిమానులు రాయడం చూస్తుంటే నిజంగానే ఆ ఆక్టోపస్ ను చెంపేస్తారేమోనని ప్రపంచంలోని చాలామంది ఫుట్ బాల్ అభిమానులు అనుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ ఆక్టోపస్ ప్రపంచ ఫుట్ బాల్ కప్ ఫైనల్స్ లో స్పైన్ దేశం గెలుస్తుందని జోస్యం చెప్పింది. విడియో చూడండి.

ఒక పత్రికా మీటింగ్ లో స్పైన్ ప్రధాన మంత్రి ఆ ఆక్టొపస్ కు రక్షణ కలిపిస్తానని (నవ్వుతూ ) తెలిపేరు.

3 వ చోటు కై జర్మనీ ఉరుగువే తో ఆడబోతోంది. 3 వ చోటు కోసం జరగబోయే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే జోస్యంలో చాలా సేపు ఉరుగువే జండా అతికించిన ప్యాకెట్ దగ్గర గడిపినా, చివరికి జర్మనీ దేశ జెండా ఉన్న ప్యాకెట్ లోని ఆహారాన్నే తిన్నదట. అంటే 3 చోటును జర్మనీ గెలుచుకుంటుంది.

ఆక్టోపస్ జోస్యం చెప్పిన విధంగానే ఇప్పటి వరకు జరిగినా......ఆక్టోపస్ చెప్పిన చివరి జోస్యం నిజమౌతుందా లేదా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Thursday, July 8, 2010

జగన్ ఓదార్పు యాత్రపై కాంగ్రెస్ హై కమాండ్ ఎందుకు మౌనం వహించింది?

కొన్ని రోజుల క్రితం వరకు జగన్ జరుపతానన్న ఓదార్పు యాత్రకు వ్యతిరేకతను తెలిపిన కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పుడెందుకు ఒప్పుకోకా, కాదనక మౌనం వహించింది. హై కమాండ్ మౌనాన్ని సమ్మతంగా తీసుకుని జగన్ ఓదార్పు యాత్రను మొదలుపెట్టేరు.

తండ్రి మరణ వార్త విని తట్టుకోలేక రాష్ట్రంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించటానికి ఓదార్పు యాత్ర జరుపుతున్నానని జగన్ చెబుతున్నా, ప్రజలలో తన ఇమేజ్ ను పెంచుకుని దాని మూలంగా తన తండ్రి తరువాత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి తనే అర్హుడునని నిరూపించుకోవటానికే జగన్ ఈ యాత్రను మోదలుపెట్టెరని కాంగ్రెస్ పార్టీలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

జగన్ ఇచ్హాపురంలో ఫలక్నామా ఎక్స్ ప్రెస్స్ లోనుండి దిగినప్పుడు ఆయన్ను ఆహ్వానించడానికి ఆయన అభిమానులు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎం.ఎల్.ఏ లు గానీ, ఎం.పీ. లు గానీ, మినిస్టర్లు గానీ రాలేదు. దీనినిబట్టి చూస్తే ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ హై కమాండ్ ఇష్టపడలేదని తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోని కనీస గుర్తింపు గలవారు కూడా రాలేదు.

ఇచ్హాపురం నుండి ఎన్నుకోబడ్డ ధర్మన ప్రసాద రావ్ కూడా జగన్ ని ఆహ్వానించడానికి రాలేదు. ఆయన హైదరబాద్‌లోనే ఉండి,తన తరఫున తన కొడుకును పంపించేరు. జగన్ ని ఆహ్వానించినవారిలో కొంచం గుర్తింపు గల వారెవరైనా ఉన్నారంటే అది మునిసిపల్ చైర్ పర్సన్ లాభాల స్వర్ణమని గారు మాత్రమే. కానీ జగన్ గానీ, అతని సన్నిహితులుగానీ ఈమెను పట్తించుకోలేదు. పైగా ఆమెను క్రిందకు తోసేసి గాయ పరిచేరు.స్వల్ప గాయాలతో ఆమె బయట పడింది.

200 కార్లతో మొదలుపెట్టిన జగన్ ఓదార్పు యాత్రలో అన్ని కార్లూ కడప, అనంతపూర్ మరియూ హైదరాబద్ కు చెందినవే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కు చెందిన కార్లు కనబడలేదు.. జగన్ తో ఓదార్పు యాత్రలో అతని అభిమానులు మొత్తం 500 మంది ఉన్నారట.

అసలు కాంగ్రెస్ హై కమాండ్ ఎందుకు మౌనం వహించింది? ఇంటెలిజంట్స్ రిపోర్ట్ ప్రకారం జగన్ కు కాంగ్రెస్ పార్టీలో 40 మంది ఎం.ఎల్.ఏ ల పూర్తి మద్దత్తు ఉన్నట్లు తెలుస్తోంది.దీన్ని తెలియపరస్తూ సోనియాకు ఇంటెలిజెంట్స్ వారు రిపోర్ట్ అందించేరు. జగన్ పై కఠినంగా ఉండాలనుకున్న కాంగ్రెస్ హై కమాండ్ ఈ రిపోర్ట్ తో జగన్ పై తమ వైఖరిని మార్చుకుంది. ఓదార్పు యాత్రను కాదంటే జగన్ కాంగ్రెస్ నుండి వైదొలగుతారేమోనని, వైదోలగితే అతనితో పాటూ ఆ 40 మంది ఎం.ఎల్.ఏ లు వైదొలగే ప్రమాదముంది. అదే గనుక జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడటమే కాకుండా, రాష్ట్ర పరిపాలనకు ఇబ్బంది కలుగుతుందేమోననే అనుమానంతో తో ఓదార్పు యాత్రకు కాదనలేక, అవుననలేక మౌనం వహించిందని చెబుతున్నారు. 40 మంది కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ లే కాక ప్రజారాజ్యం పార్టీకి చెందిన 6 గురు ఎం.ఎల్.ఏ ల మద్దత్తు కూడా ఉన్నదని తెలిసింది.

ఓదార్పు యాత్ర వలన జగన్ కు ప్రజలో ఎంత పలుకుబడి ఉన్నదో కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఓదార్పు యాత్ర తరువాత జగన్ గురించి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. దానికి తగినట్లు హై కమాండ్ జగన్ గురించి ఒక నిర్ణయానికి రావచ్హు నని భావించి ప్రస్తుతం రాష్త్ర కాంగ్రెస్స్ నాయకులు మౌనంగా ఉన్నారని చెబుతున్నారు.

ప్రక్రుతి అద్భుతాలతో నిండిపోయిన ప్రపంచం...2

"లెంటికులర్ క్లౌడ్స్"
ఈ ఫోటోలో మీరు చూస్తున్నదానిని "లెంటికులర్ క్లౌడ్స్" అంటారు. వేగమైన గాలి పెద్ద పెద్ద కొండల పైన అతివేగంగా వీచినప్పుడు ఆ కొండపై యున్న మేఘాలు గాలితో చుట్టుకుని సుడిగాలి మేఘంగా పైకి తోయబడుతుందట.

వీటిని దూరం నుండి చూసినప్పుడు ఏదో ఒక పరికరం ఆకాశంలో ఉన్నట్టు కనబడుతుంది. చలాసార్లు దీనిని యూ.ఎఫ్.ఓ (UFO) అని అనుమానపడతారట.

Wednesday, July 7, 2010

తాలిబన్ తో యుద్దం చేయడానికి ఇప్పుడు 'సైబోర్గ్" రోబో మిషెన్లు

స్టార్ వార్స్ లాంటి ఎన్నో సినిమాలలో మానవులచే తయారు చెయబడ్డ రకరకాల రోబో మిషెన్లు యుద్దాలలోనూ సైన్స్ ఫిక్షన్ సినిమాలలోనూ ఉపయోగపడే విధానాన్ని వెండి తెరపై చూసేము.కానీ ఇప్పుడు బ్రిటీష్ ప్రభుత్వం తమ సైనికులు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లతో యుద్దం చేయడంలో సహాయపడటానికి "సైబోర్గ్" రోబో మిషెన్లను తయారు చేసింది. కొన్ని నెలలో ఈ మిషెన్లను యుద్దంలో వాడుతారట.

తాలిబన్స్ తో చేస్తున్న యుద్దంలో చాలా మంది బ్రిటీష్ సైనికులే కాకుండా మరెన్నో దేశాల సైనికులు కూడా చనిపోతున్నారు. అంతే కాక తాలిబన్లు 'సూసైడ్ బాంబర్స్ ను ఉపయోగించి దాడులు జరపటంతో మరెందరో చనిపోతున్నారు. దీనికి బ్రిటన్ దేశంలోనే కాకుండా అన్ని దేశాల లోనూ అసంత్రుప్తి వెళ్ళడిస్తూ పోరాటాలు జరుగుతున్నాయి.

అందుకని యుద్దం లో తమ సైనికులను కాపాడే విధంగా రొబొస్ ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ రోబోస్ అన్ని వాతావర్ణాలలోనూ, అన్ని రకముల ప్రదేశాలలోనూ పనిచేసే విధంగా ఉండాలని మరియూ అవి ఎటువంటి రకమైన దాడినైనా తట్టుకునే శక్తి కలిగి ఉండాలని అత్యంత ఆధునిక టెక్నాలజీ ని ఉపయోగించి పరిశోధనలు జరిపి చివరికి విజయవంతముగా ఈ "సైబోర్గ్" రోబో ని కనిబెట్టెరు.

రెండడుగుల ఆరు ఇన్ చ్ ల (2ft 6in) ఎత్తు, నాలుగు కాళ్ళూ కలిగి ఎటువంటి ప్రదేశాలలోనైనా సంతరించగల ఎట్-ఎట్ లాండ్ వాకర్స్ ను తయారు చేసేరు.

ఎనిమీలు కాల్చే తూటాలు, బాంబులు ఎటువైపు నుండి వస్తున్నాయో పసిగట్టి, అటుగా తమ టార్గెట్ ను ఎంచుకుని వారి మీద దాడి చేసే శక్తి కలిగినవి. ఇంతే కాకుండా ఈ "సైబోర్గ్" రోబోలు మందుగుండు సామగ్రిని తీసుకు వెళ్ళి తమ సైనికులకు అందించటమే కాకుండా యుద్దంలో గాయపడిన వారిని తీసుకు రావడం చేస్తాయట.

మనిషిలో కలిగే కల్పిత ఆలోచనలకు రూపాలనిచ్హి నిజం చేయటం చూస్తే పెరుగుతున్న టెక్నాలజీ మరెన్ని ఆశ్చర్యాలని ఇవ్వనున్నదో.

ఆపిల్ వారి ట్రాన్స్ పరెంట్ (TRANSPARENT) మొబైల్ ఫోన్ ను చూసేరా?....అందమైన ఆ మొబైల్ ఫోన్ ను ఇక్కడ చూడండి

ఈ అందమైన ట్రాన్స్ పరెంట్ మొబైల్ ఫోన్ వాతావరణానికి తగినట్టు రూపు మార్చుకుంటుందట.

Tuesday, July 6, 2010

ప్రక్రుతి అద్భుతాలతో నిండి పోయిన ప్రపంచం.....1

ఈ శీర్శిక కింద ప్రపంచములో జరుగుతున్న కొన్ని అద్భుత విషయాలను మీతో పంచుకోవాలని అనుకుని ఈ శీర్శికను మొదలపెట్టేను. అయితే ఈ శీర్శిక క్రింద నాకు తెలిసిన, దొరికిన అద్భుత విషయాల గురించి ఒకే సారి వ్రాయలేను. అదేలాగా ప్రతిరోజూ ఈ శీర్శికను అందించలేను. కారణం రోజూ జరిగే మిగిలిన విషయాలను కూడా మీ ముందుంచాలి కనుక.

కాబట్టి అప్పుడప్పుడు మీకు ఒక్కొక్క అద్భుత విషయాన్ని అందిస్తాను.

మొదటిది:.....కదిలే రాల్లు

ఈ చిత్రంలో మీరు చూసేది కదిలే రాల్లు. డెత్ వాలీలో మట్టితో నిండిన ప్రదేశంలో ప్రక్రుతి రహశ్యంతో అతివేగంగా కదులుతున్న రాల్ల గురించి శాస్త్రవేత్తల మధ్య కొన్ని సంవత్సరాలుగా వాదోపవాదనలు జరుగుతున్నాయి.

100 పౌండ్ల బరువున్న రాల్లు ఒకేసారి వంద గజాల దూరం దాకా కదలి వెలుతున్నాయి.

అతి వేగమైన గాలి మరియూ మట్టి మీదున్న మంచు వలన రాల్లు కదులుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ అందరూ ఈ వాదాన్ని ఒప్పుకోవటం లేదు. కారణం రాల్లు వేరు వేరు దిక్కులలో, వివిధ వేగంతో వెడుతున్నాయి.

ఇంతేకక, బౌతిక శాస్త్రం వంద మైళ్ళ వేగంతో గాలి వీస్తేనే కొన్ని రాల్లు కదిలే అవకాశం ఉన్నదని చెబుతోంది. కానీ అక్కడ గాలి అంత వేగంగా ఉండదట.

మరి ఇది ప్రక్రుతి యోక్క ఒక అద్భుతమే కదా.

Monday, July 5, 2010

విడాకులు ఒక అంటువ్యాధి!

మీరు నమ్మండి లేక నమ్మకపొండి. విడాకులనేది కొన్ని జబ్బుల లాంటిది. ఈ జబ్బు స్నేహితులకు, పరిచయస్తులకు మరియూ కుటుంబీకులకు సోకుతుంది.

విడాకుల ప్రభావాన్ని "డొమినో ఎఫ్ఫెక్ట్" అంటారు. అంటే తమ స్నేహితులుగానీ, సన్నిహితులుగానీ లేక కుటుంబీకులు గానీ ఎవరైనా విడాకులు తీసుకోనుంటే దాని ప్రభావం తమ మీద 75 శాతం వరకు ఉంటుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తమకు మూడో వ్యక్తి, అంటే ఒకరి స్నేహితునికి-స్నేహితుడు విడాకులు తిసుకోనున్నా ఆ విడాకుల ప్రభావం 40 శాతం వరకు తమ మీద ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పినట్టు డైలీ మైల్ పత్రిక తెలిపింది.

అనవసరమైన లేక అర్ధం లేని కారణాలకు విడాకులు కోరడం 1990 నుండి పెరిగిందని, మొదట ఈ అర్ధం లేని కారణాలకు విడాకులు కావాలని కోరుకున్న వారు అప్పటి సినిమా రంగంలోని ప్రముఖులని, ఆ తరువాత అది సమాజంలో ఉన్న చాలామంది మీద ప్రభావం చూపిందని, దానితో చిన్న చిన్న విషయాలకు కూడా విడాకులు కోరుకునే వారి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు.

ఈ విడాకుల ప్రభావాన్ని "విడాకుల గెలుపు" గా చిత్రించుకున్నారట. దగ్గరి స్నేహితులో, కుటుంబీకులో విడాకులు తీసుకోనుంటే అది ఆ స్నేహితుల గుంపులోనూ లేక కుటుంబీకులలోని మరికొందరిని ప్రెరేపించి వారి వీవాహ బంధాలలో ప్రశ్నలను రెకెత్తిస్తాయట. అదేలాగా ఆ ప్రేరేపణ పిల్లలున్న వారిలో కూడా విడాకుల కళంకం అనే భయాన్ని పోగొడుతుందట.

1948 నుండి విడాకుల మీద జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెళ్లడైనాయట. కనుక ఒకరికి ఎక్కువ మంది విడాకులు తీసుకున్న వారు తెలిసుంటే వారు కూడా విడాకులు తీసుకునే అపాయం ఎక్కువగా ఉన్నదట. అది పిల్లలున్నవారైనా సరే.

1970 కి ముందు వరకు విడాకులు తీసుకోవటానికి చాలా ఆలోచించేవారట. సాధ్యమైనంత వరకు ఎంత కష్టమైన సమస్య ఉన్నా దంపతులిద్దరూ సర్దుకు పోయేవారట. కాలక్రమేనా వారికున్న కష్టమైన సమస్య కూడా మామూలు విషయంగా మారిపోయి సంతోషంగా దాంపత్య జీవితం గడిపేవారట. చాలా మంది దంపతులు వారిరువరి మధ్య ఎన్ని సమస్యలున్నా తమ పిల్ల కోసం, పిల్లల భవిషత్తు కోసం సర్ధుకు పోయేవారట.

కానీ 1990 నుండి విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజు కీ అధికమై, ఈ రోజు విడాకులు తీసుకోవటం ఒక ఫ్యాషన్ గానే మారిపోయిందట. సర్ధుకు పోయే సమస్యలున్నా కూడా ఆ సమస్యలను పెద్దవి చేసుకుని విడాకులు తీసుకుంటున్నారట. సంఘంలో చాలామంది వలన దంపతులు సమస్యలను ఎదుర్కొంటున్నా వారితో సర్ధుకుపోతున్నారు. కానీ వారి కుటుంభంలో సమస్య వస్తే మాత్రం సర్ధుకు పోవటంలేదట. దీనికి కారణం విడాకులనే వ్యాధి సోకటం వలనేనట.

విడాకులనే ఈ అంటువ్యాధిని అడ్డుకోకుంటే ఇది పెళ్ళిసంభందంలో పెళ్ళిని వేరుగానూ, సంభందాన్ని వేరుగానూ చేసి మరెన్నో వ్యాధులకు అవకాసమిస్తుందట.

బంద్ జరిపినందువలన ఏమీ ప్రయోజనం లేదని తెలిసినా బంద్ కు ఎందుకు పిలుపునిస్తారు?

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందు బి.జె.పీ వారి నేపధ్యంలో అప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్.డి.ఏ ప్రభుత్వం దేశంలో పెట్రోలియం వస్తువుల ధరలను అంతర్జాతీయ ధరలకు సరిసమముగా పెంచాలని మరియూ పెట్రోలియం వస్తువుల పై నియంత్రణను ఎత్తివేయాలని నిర్ణయించు కుంది. కానీ రాజకీయ ఒత్తిడ్ల వలన నిర్ణయాన్ని మార్చుకుంది. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇతర పార్టీల ఒత్తిడ్లకు లొంగక పెట్రోలియం వస్తువుల ధరలను పెంచుతూ పెట్రోల్ మీద నియంత్రణను ఎత్తివేస్తే బి.జె.పీ మరియూ ఎన్.డి ఏ లలోని ఇతర పార్టీలు వ్యతిరేకం చూపిస్తూ ఈ రోజు భారత్ బంద్ నకు పిలుపునిచ్హేరు.

బంద్ జరిపినందు వలన ధరల విషయంలో ఎటువంటి మార్పూ తేలేమని తెలిసినా బంద్ కు పిలుపునివ్వటం బహుశ దేశంలో పలు చోట్ల రాబోవు ఎన్నికల కోసమే అయుంటుంది. ఎన్నికలలో గెలవాలనే ప్రయత్నిస్తున్నారు గానీ ఒక రోజు బంద్ వలన దేశానికి ఎంత నష్టమో, ప్రజలకు ఎంత కష్టమో వారికి తెలిసున్నా దానిని అప్పోజిషన్లో ఉన్న పార్టీలు పట్టించుకోరు.

ఉదాహరణకు కేరళా రాష్ట్రాన్ని తీసుకోండి. ఈ రాష్ట్రంలో సి.పి.ఐ(ఎం) మరియూ సి.పి.ఐ పార్టీలు జూన్ 26 న ఇదే విషయం పై విజయవంతంగా బంద్ నిర్వహించేరు. మల్లీ ఈ రోజు అదే విషయం పై రెండోసారి (ఈ సారి భారత్ బంద్ పేరుతో) బంద్ నిర్వహిస్తున్నారు(నిర్వహించేరు). 10 రోజుల వ్యవధిలో ఒకే విషయం పై రెండు సార్లు బంద్ నిర్వహించిన ఘణత వీరు దక్కించుకున్నారు. ఒక రోజు బంద్ వలన రాష్ట్రానికి సుమారు 700 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారు తెలిపింది వారికి బాగా తెలుసు.

ఎందుకిలా ఒకే విషయానికి రెండుసార్లు బంద్ నిర్వహిస్తున్నారని అడిగినదానికి "మొదటి సారి జరిపిన బంద్ అవసరవసరంగా జరపవలసి వచ్హింది. అప్పుడు మాకు ఇల్లా భారత్ బంద్ కు పిలుపునిస్తారని తెలియదు" అని చెప్పేరు.

త్రిపురా రాష్ట్రంలో ఉన్న సి.పి.ఐ(ఎం) కొంచం పరవాలేదు. ఎందుకంటే ధరల పెరుగుదలని ఖండిస్తూ 15 రోజుల క్రితం వారు ఆ రాష్ట్రంలో బంద్ జరిపేరు. అందువలన ఈ రోజు బంద్ లో పాల్గొనమని తెలిపేరు.

బంద్ లు చాలా రాష్ట్రాలలో పూర్తిగా విజయవంతం కావు. కానీ కేరళా మరియూ వెస్ట్ బెంగాల్ లలో ఎప్పుడూ పూర్తిగా జరిగి విజయవంతం అవుతుంది. ఎందుకంటే అక్కడుండే సామాన్య మానవులకు జీవితం మీద రిస్క్ తీసుకోవటం ఇష్టం లేదు. ఈ ఒక్క కారణం వలనే బి.జి.పీ పార్టీ కేరళ రాష్ట్ర అసెంబ్లీలో ఇంతవరకు ఒక సారి కూడా సీటు సంపాదించుకోకపోయినా అక్కడ బంద్ లను విజయవంతం గా నిర్వహిస్తారు.

కేరళ రాష్ట్ర హై కోర్ట్ బంద్ లకు నిషేధం విధించినా రాజకీయ పార్టీలు వేరే (హర్తాల్ అనో, జెనెరల్ స్ట్రైక్ అనో) పేరుతో బంద్ లను నిర్వహిస్తున్నారు.

Sunday, July 4, 2010

ఈ స్వాముల వారు ఇన్ కం టాక్స్ రైడ్ లో చిక్కుకున్నారు

రాజకీయంగా బాగా పలుకుబడి కలిగిన ఈ స్వామి తన ఆశ్రమంతో పాటూ విద్యాలయాలను తమిళనాడులో నడుపుతున్నారు. ఇన్ కం టాక్స్ వారు జరిపిన దాడిలో 13 కోట్ల రూపాయల నగదు ఒక్క ఈ స్వామి వారి బెడ్ రూం లో దొరికిందట.

16 ఇన్ కం టాక్స్ టీం లు మేల్ మరువత్తూర్ స్వామి బంగారు అడిగళార్ నడుపుతున్న ఆదిపరాశక్తి గ్రూప్ ఆఫ్ కాలేజీలలోనూ, ఆయనకు సొంతమైన 4 ఇళ్ళలోనూ మరియూ ట్రస్ట్ ఆఫీసులోనూ ఒకేసారి రైడ్ చేసేరు. శుక్రవారం ప్రొద్దున 11.30 గంటలకు ప్రారంబమైన తనిఖీ శనివారం తెల్లవారు జాము 4 గంటల వరకు కొనసాగింది.

9 కోట్ల రూపాయల నగదు ఒక్క ఆయన ఇంట్లోనే దొరికిందట. ఈ డబ్బు ఆయన బెడ్ రూం లో ఉన్నదట. ట్రస్ట్ ఆఫీసులో 3 కోట్ల రూపాయల నగదు మరియూ ఆయన కొడుకు అన్ బలగన్ ఇంట్లో 40 లక్షల రూపాయల నగదు దొరికిందట. బంగారు ఆభరణాలు కూడా దొరికినాయట. మరేవో డాక్యూమెంట్స్ దొరికినాయట. మొత్తం ఎంత దొరికిందో తెలుపలేదు.

"ఈయన నడుపుతున్న కాలేజీలో ఒక సీటుకు 20 నుండి 30 లక్షలు డొనేషన్ గా తీసుకుంటున్నారని మాకు సమాచారం అందింది. గత రెండు-మూడు నెలలుగా ఈ కాలేజీల మీద మా ఆఫీసువారు సమాచార సేకరనలో ఈడుపడ్డారు" ఒక ఇన్ కం టాక్స్ ఆఫీసర్ తెలిపేరు.

బంగారు అడిగళార్ నడుపుతున్న కాలేజీలలోనూ, ఆయన ఇంట్లో మరియూ ఆఫీసులలో రైడ్ జరుగుతోందని తెలిసిన వెంటనే మేల్ మరువత్తుర్ లో షాపులన్నీ మూసేసేరట. రైడ్ ను కవర్ చేయటానికి ఆయన ఆశ్రమానికి వెళ్ళిన మీడియావారిని ఆక్కడున్న (ఆశ్రమంలో) వారు కొట్టి తరిమేరట.

మేల్ మరువత్తుర్ లో ఆదిపరాశక్తి గుడి ఉన్నది. బహుశ ఈ టపా చదువుతున్న వారందరికీ తెలిసుండాలి. అంత ఫేమస్ అయినది ఈ గుడి మరియూ బంగారు అడిగళార్ ఆశ్రమం. గుడిని ఆధారంగా చేసుకుని ఆశ్రమాన్ని పెట్టింది బంగారు అడిగళారే. నెమ్మది నెమ్మది గా ఈ ఆశ్రమం మరియూ బంగారు అడిగలార్ ప్రశిద్ది కెక్కేరు. ఆయనను సందర్శించి ఆశీస్సులు పొందటానికి భక్తులు రావడం మొదలైంది. వీరు ఎంత ప్రసిద్ది కెక్కేరంటే ఆ గ్రామంలో (మేల్ మరువత్తూర్) ని రైల్వే స్టేషన్లో ప్రతి రైలూ ఆగటం మొదలు పెట్టింది. ఆశ్రమానికి వచ్హే భక్తుల రద్దీ ఎక్కువైంది. వీరిలో ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అంతే బంగారు అడిగలార్ ని దేమునిగా కొలవటం మొదలు పెట్టేరు. ఆయన పుట్టిన రోజున ఆయనను పల్లకీలో ఊరంతా ఉరేగించేరు. దీక్షలు తీసుకుని రావడం చేసేరు. ఆయన మీద ఎనలేని నమ్మకాన్ని పెంచుకున్నరు .

ఆదిపరాశక్తి పేరుతో విద్యాసంస్తలు ఏర్పరచి విద్యను అందరికీ సులువుగా దొరికేటట్లు చేస్తామని చెప్పి విద్యాసంస్తలకు అనుమతి తెచ్హుకున్నారు. ఇంజనీరింగ్ మరియూ మెడికల్ కళాశాలలు నిర్మించేరు. అంతే అంతా డబ్బు మయం అయ్యింది. ఆశ్రమం పేరుతోనే బొలెడు డబ్బు సంపాదించిన బంగారు అడిగళార్ కాలేజీల మూలం గా (డొనేషన్ ల పేరుతో) కోట్లు సంపాదించేరు.

ఇప్పుడు ఇన్ కం టాక్స్ వారి దగ్గర దొరికిపోయేరు. ఇన్ కం టాక్స్ వారు కేసును సి.బి.ఐ కి అందించేరు. మేల్ మరువత్తూర్ బంగారు అడిగళార్ పేరు ఇప్పుడు పోలీస్ రికార్డులలొకి ఎక్కింది. ఇంకా ఎన్ని విషయాలు రానున్నాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Saturday, July 3, 2010

రెహమాన్ హిందీ పాటను అమెరికన్ స్టూడెంట్స్ ఎంత బాగా పాడేరో వినండి...చూడండి

అమెరికన్స్ కి హిందీ భాష మాట్లాడాలంటే చాలా కష్టమైన పని. ఒకవేల ప్రయత్నించినా వారి స్టైల్ లోనే మాట్లాడ గలరు. మనం గూడా అంతే. ఇంగ్లీష్ వచ్హినా అమెరికన్ స్టైల్ లో మాట్లాడలేము. కానీ ఇక్కడ కొందరు అమెరికన్ స్టూడెంట్స్ రెహమాన్ సంగీతతో ప్రశిద్దికెక్కిన హిందీ పాటను ఎంత బాగా పాడేరంటే.......అది మీరు విని చెప్పాలి.సంగీతానికి భాషతో పనిలేదు.సంగీతంలోని మధురం ఎటువంటి వారినైనా మారుస్తుందనటానికి ఇదొక నిదర్శనంగా భావిస్తున్నాను.

Friday, July 2, 2010

చెన్నైలో నేడు "ఉచిత కౌగిలింత" ప్రచారాలు

మీరు చెన్నై నివాసులైతే ఈ రోజు అంటే శనివారం మీ దగ్గరకు ఎవరైనా వచ్హి మిమ్మల్ని కౌగలించుకోవచ్హా అని అడిగితే సిగ్గుపడి వద్దనకండి. ఆత్మీయత చూపించి మిమ్మల్ని సంతోష పరచటానికి మాత్రమే కౌగలించుకోబోతున్నారు. ఇందులో ఇంకేమీ చెడు అర్ధం లేదు.

2004 లో 'జువాన్ మాణ్ ‘ అన్న పేరుతో ఆస్ట్రేలియాలో మొదలపెట్టబడిన "ఉచిత కౌగలింత" ప్రచారం ప్రపంచంలోని అన్నిదేశాలకూ వ్యాపించింది. దీని స్పూర్తితోనే 30 మంది యువతీయువకులు చెన్నై నగరంలో కూడా "ఉచిత కౌగిలింత" ప్రచారాన్ని చేబట్టేరు.

5 మంది కలిగిన ఒక టీం జనసమూహం ఎక్కువగా ఉండే చెన్నై బెసెంట్ నగర్ లో ఉన్న ఎలియట్స్ బీచ్ దగ్గర, అమింజికరై లో ఉన్న అంపా స్కై పార్క్ దగ్గర, స్పెన్ సర్స్ ప్లాజా దగ్గర, మైలాపూర్ లో ఉన్న సిటీ సెంటర్ దగ్గర, నుంగంబాకం లో ఉన్న ఐఫోన్ సెంటర్ దగ్గర మరియూ అన్నానగర్ రౌండ్ టానా దగ్గర "ఉచిత కౌగిలింతలు" అని రాసున్న ప్రచార పలకలతో సిబిరాలు వేసుకుని ఉంటారు.

"ఈ ఉచిత కౌగలింపు టీం లో ఒక మెంబర్ గా ఉండటం నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నది. ఎన్నోసార్లు నన్ను ఎవరైన హత్తుకోరా అని ఎదురుచూసేదాన్ని. వారు నాకు తెలియనివారైనా సరే" ఉచిత కౌగలింత టీం లో ఒక మెంబర్ గా ఉంటున్న మనీషా చెప్పింది.

"ఒక్కొక్క టీం మెంబర్ కనీసం 200 మందినైనా కౌగలించుకోవాలి. మా టార్ గెట్ రోజుకి 10,000 మంది" టీం లోని ఇంకో మెంబర్ తెలిపేరు.

ఇదే సాకుగా తీసుకుని మీ మీద ఎవరైనా అత్యాచారం చేస్తారెమోనని మీరు భయపడటం లేదా అని అడిగినప్పుడు "ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో మాకు రక్షణ ఉంటుంది. అలాంటి రద్దీ చోట్లలో అలా ప్రయత్నించడానికి భయపడతారు. ప్రపంచం లో జరిగిన ఉచిత కౌగిలింత ప్రచారాలను వీడియోలో చూసేను. ఎవరూ తప్పుగా నడుచుకోలేదు" మనీషా చెప్పింది.

ప్రపంచ ఉచిత కౌగలింపు ప్రచారం చేసేవారు మనుష్యులను మానసిక ఒత్తిడిలలో నుండి బయటకు తీసుకు వచ్హి వారిని ఆనందంగా ఉంచడానికే మేము ఈ ప్రచారం చేస్తున్నమని చెబుతున్నా, చెన్నైలో ఉచిత కౌగిలింపు ప్రచారం చేసేవారు మాత్రం ఇది ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం చేస్తున్నామని, కౌగిలించుకున్నంత మాత్రానా ఎయిడ్స్ వ్యాధి సోకదని ప్రజలకు చెప్పడానికే ఇలా చేస్తున్నామని చెబుతున్నారు.

ఈ "ఉచిత కౌగలింత" ప్రచారానికి పోలీస్ అనుమతి తీసుకోవటానికి వెళ్ళినప్పుడు పోలీస్ కమీషనర్ దగ్గర ఇదే చెప్పేరు. "ఆత్మీయతను పంచండి...కౌగలించుకోండి...దీని వలన ఎయిడ్స్ వ్యాది సోకదు" అనే ముఖ్య ప్రచారం కోసమే ఈ ప్రచారం చేయాలనుకుంటున్నమని ఉచిత కౌగిలింత ప్రచార కో-ఆర్డినేటర్ కార్తిక్ సుందర్ గారు తెలిపేరు.

శనివారం జరగబోయే క్వార్టర్ ఫైనల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జర్మనీ అర్జెంటీనాను ఓడిస్తుంది.....ఆక్టోపస్(OCTOPUS) జాతకం

ప్రపంచ కప్ ఫుట్ బాల్ మ్యాచ్‌లలో జెర్మనీ ఎదుర్కొన్న దేశాలలొ ఎవరు గెలుస్తారో కరెక్ట్ గా చెబుతోందట ఒక ఆక్టోపస్. ఈ ఆక్టోపస్ కు ఏవో అద్భుతమైన శక్తి ఉన్నదని నమ్ముతున్నారు.
2 సంవత్సరాల వయసున్న ఈ ఆక్టోపస్ ఇంగ్లాండ్ లో పుట్టింది. ప్రస్తుతం జర్మనీ లో ఉన్న ఒక అక్వేరియం లో జీవిస్తోంది. దీనికి పాల్ అని పేరు పెట్టేరు. ప్రపంచ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ లలో ఎవరు గెలుస్తారో నూటికి నూరు శాతం కరెక్ట్ గా చెబుతోందట. గ్రూప్ మ్యాచ్ లలో సెర్బియాతో జర్మనీ ఆడబోయే మ్యాచ్‌లో జర్మనీ ఓడిపోతుందని చెప్పిందట. అదేలాగ జర్మనీ ఓడిపోయింది.

ఈ 8 కాళ్ళ ఆక్టోపస్ ఒబర్హుసేన్ సముద్రతీరంలో నీటిలో బ్రతికే ఒక జీవి. అలాంటి ఈ జీవి సడన్ గా ఒక సెలెబ్రిటీ గా మారింది. ఇప్పటిదాకా జర్మనీ ఆడే మ్యాచ్లలొ ఎవరు గెలుస్తారో కరెక్ట్ గా చెప్పిందట. పోయిన ఆదివారం నాడు జరిగిన జర్మనీ-ఇంగ్లాండ్ మ్యాచ్‌లో, జర్మనీ గెలుస్తుందని చెప్పిందట.

నోరు లేని ఈ సముద్ర జీవి ఎలా మాట్లాడుతోందో అనుకుంటున్నారా. ఏలా అంటే, ఈ జీవికి ఆహారం అందించేటప్పుడు ఆ ఆహారాన్ని రెండు ప్లాస్టిక్ బ్యాగ్ లలో ఉంచి ఒక బ్యాగ్ మీద జర్మనీదేశ జెండా,మరో బ్యాగ్ మీద వారితో ఆడబోతున్న దేశం యోక్క జెండాను అతికించి తొట్టిలోకి దింపుతారు. పాల్ ఏ జెండా అతికించిన బ్యాగ్ ను తీసుకుంటుందో ఆ దేశం గెలుస్తోందట.

మంగళవారం నాడు పాల్ తొట్తిలోకి ఆహారాన్ని రెండు ప్లాస్టిక్ బ్యాగ్‌లతో దింపేరు. ఈ శనివారం నాడు జరగబోయే క్వాటర్ ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ-అర్జెంటీనా ను ఢీ కొంటోంది కనుక ఒక బ్యాగ్ మీద జర్మనీ జెండా, మరో బ్యాగ్ మీద అర్జెంటీనా జెండా ను అతికించేరు. పాల్ జెర్మనీ జెండా అతికించిన బ్యాగ్‌లోని ఆహారాన్ని తీసుకుంది. ఇప్పటిదాకా పాల్ ఏ జెండా అతికించిన ప్లాస్టిక్ బ్యాగ్ ను తీసుకుంటోందో ఆ దేసం గెలుస్తోంది గనుక శనివారం జరుగబోయే క్వాటర్ ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ అర్జెంటినాను ఓడిస్తుందని నమ్ముతున్నారు.

ఎప్పుడూ ఆహార పదార్ధాల ప్యాకెట్లను త్వరగా తీసుకునే పాల్ ఈ సారి ఆలోచించి నిదానంగా జర్మనీ జెండా అతికించిన బ్యాగ్ ను తీసుకుందట. ఆహారాన్ని కూడా కొద్దిసేపైన తరువాతే ముట్టుకుందట. కాబట్టి జర్మనీ-అర్జెంటీనాల మధ్య జరగబోయే క్వాటర్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగ జరుగుతుంది కానీ చివరికి జర్మనీ నే గెలుస్తుందని నమ్ముతున్నారు.

వేచి చూద్దం.

Thursday, July 1, 2010

పరువు హత్యలు:...ఉత్తర భారతదేశంలో "ప్రేమ" కు ఎదురుగా యుద్దమా?

ఏప్రిల్ 9 నుండి జూన్ 30 వరకు 19 పరువు హత్యలు. అంటే సుమారుగా 4 రోజులకు ఒక హత్య. ఉత్తర భారతదేశంలో "ప్రేమ" మీద దాడి జరుగుతోందా?

"పరువు హత్యలు కులాల మీద జరుగుతున్న దాడి అని అందరూ అనుకుంటున్నారు. కానీ దాని మీద కాదు. నిజానికి వారి దాడి "ప్రేమ" మీద. హత్య చేయబడ్డ వారందరూ పెద్దలు ఏర్పాటు చేసిన పెళ్లి చేసుకున్నవారా. కాదు. ప్రేమించి పెళ్ళిచేసుకున్నవారు. కులం కాని కులంలో పెళ్లి చేసుకున్నారని చెబుతున్నారే ఆ కులాన్ని కోసి చూస్తే అక్కడ ప్రేమ కనబడుతుంది. నెత్తురు కనబడుతుంది. లోతుగా వెళ్ళి చూడండి ఈ పరువు హత్యలు చేసే పెద్దలలో ఉద్రేకం కనబడుతుంది" పరువు హత్యకు గురికాబడ్డ ఒక అభాగ్యురాలి చెల్లెలు చెబుతోంది.

"అన్నదమ్ములు అక్కచెల్లెల్లను కాల్చటం, అమ్మమ్మ మనవరాళిని చంపటం, తల్లి కూతుర్ని గొంతు పిసికి చంపటం, తండ్రి కొడుకును చంపించటం. ఇన్నిరకాల చావుల్లో చనిపోయింది కులం కాదు...ప్రేమ" ఈ పరువు హత్యల గురించి ఒక విధ్యార్ధి అన్నాడు.

డిల్లీ పత్రికా విలేకరి నిరుపమా పతక్ తమ కులానికి చెందని ఒకతనితో సంభందం పెట్టుకుందని ఆమె తల్లే ఆమెను చంపేయటం, కులాలు లేని భారతదేశం కావాలని కోరుకునే వారినే కాకుండా మరెందరి గుండెలనో పిండి పారేసింది.

నిరుపమ చావు తరువాత దేశంలో ప్రతిరోజూ యుక్త వయస్సులో ఉన్న ఒకరు హత్య చేయబడటమో లేక విడదీయబడటమో జరుగుతోంది. భందువులూ, స్నేహితులూ, తమ మీద ప్రేమ చూపించేవారే వారికి యమధూతలవుతున్నారు.

"ఉత్తర భారతదేశంలో ఇంకా మగవారి ఆధిక్యత ఎక్కువగానే ఉన్నది.ఆడవారి మాటలకు ఎటువంటి విలువా లేదు. అయినప్పటికీ కొన్ని నెలల క్రితం వరకు ఇక్కడకూడా పరువు హత్యలను సమర్ధించేవారు కాదు. కానీ ఇప్పుడు పరువు హత్యలను సమర్ధిస్తున్నారు. రాజ్యాంగం కూడా వీటిని పట్టించుకోవటంలేదు. కారణం ఓట్ల కొరకు" జవహర్లాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు చెప్పేరు.

డిల్లి దేశ రాజధాని.అంతర్జాతీయ గుర్తింపు గల నగరం. కానీ 15 రోజులలో ఇక్కడ 3 పరువు హత్యలు జరిగినై. చేసింది తెల్ల చొక్కాలు వేసుకున్న పెద్ద మనుషులు కాదు. జీన్స్ ప్యాంట్ మరియూ టీ షర్టులు వేసుకున్న యువకులు.

హర్యానాలో రాజకీయంగా పలుకుబడి ఉన్న కొందరు, హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఒకే గోత్రానికి చెందిన వారు పెళ్ళి చేసుకోకూడదని ఒక సవరణ చేయమంటున్నారు. చేయకపోతే డిల్లీ నగరానికి హర్యానా నుండి వస్తున్న మంచి నీటిని ఆపుతామంటున్నారు.

"మా రోజుల్లో కూడా ప్రేమించి పెళ్ళి చేసుకునే వారు. కానీ ఇలా ఒకే గోత్రం వాళ్ళని కాదు. ఈ రోజు పిల్లలకు జీవిత విలువలు తెలియవు. విచ్హలవిడిగా తిరుగుతున్నారు. పెద్దలని కాదని ఇళ్ళలోనుండి పారిపోతున్నారు. మేము వాల్ల మీద పెట్టుకున్న ప్రేమ ఏం కావాలి. ఈ రోజున యువత రోజులు మారినై అంటున్నారు. అయితే వాల్లు పెద్దైనాక ఇలాంటి వివాహాలని సమర్ధించుకోమనండి. ఆ లోపు ఈ కాలంలో ఉన్న పెద్దలం చనిపోతాం" ఒక తండ్రి కంట తడి పెట్టేడు.