Monday, June 28, 2010

పట్టుదలను నిరూపించుకున్న సైనా ....హాట్స్ ఆఫ్

ఇండోనేషియాలో జరగబోయే సూపర్ సీరిస్ బాట్మింటన్ చాంపియన్ టైటిల్ ను తప్పక గెలుచుకుంటానని చెప్పిన సైనా, తన పట్టుదలతో నిన్న ఇండోనేషియాలోని జకార్తా నగరంలో జరిగిన ఇండోనేషియన్ ఓపెన్ సూపర్ సీరీస్ బాట్మింటన్ చాంపియన్షిప్ టైటిల్ ను జపాన్ కు చెందిన, బలమైన, డిఫెండింగ్ చాంపియన్ సయాకా సటో నుండి పట్టుదలతో పోరాడి గెలుచుకింది.



21-19, 13-21, 21-11 పాయింట్లతో, ఉద్రిక్త ప్రదర్శనతో హరాహోరీగా పోరాడి సయాకా సటో ను ఓడించింది.

ఈ టైటిల్ గెలుచుకోవటంతో ఈమె ఈ సంవత్సరం వరుసగా 3 టైటిల్స్ గెలుచుకుని, హాట్రిక్ సాదించి, మాజీ బాట్మింటన్ చాంపియన్ ప్రకాష్ పదుకోన్ రికార్డును అందుకోగలిగింది..

"గెలవటానికే పుట్టింది" ఆమె కోచ్ ఒకరు సంతోషంగా చెప్పేరు.

"బలమైన ప్రత్యర్ధిని ఎదురుకోవటానికి నిదానంగా ఉంటూ అవకాశం కోసం ఎదురుచూడాలి అని చెప్పిన నా కోచ్ గోపీచంద్ గారు చెప్పిన మాటలు గుర్తుంచుకున్నాను. అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన సయాకా సటో ను మొదటి రౌండ్లో ఓడించినా, రెండవ రౌండ్లో అలసట మూలంగా ఓడిపోయేను. కానీ మూడవ రౌండ్లో బలమంతా పుంజుకుని ఆడటంతో టైటిల్ గెలుచుకున్నాను" సైనా తెలిపింది.

సయాకా సటో ఎన్నో రకాలుగా, ఎన్నో యుక్తులతో ఆడినా తన మానసిక బలంతో ఆమెను ఎదుర్కొని ఎత్తుకు పై ఎత్తులతో తానూ ఆడి ఆమెను గెలవగలిగింది సైనా.

హైదరాబద్ కు చెందిన సైనా, ఇక ఇప్పుడు తన మనస్సును, పట్టుదలను ఆగస్ట్ నెలలో పారీస్ లో జరుగబోయే ప్రపంచ బాట్మింటన్ చాంపియన్షిప్ మీద కేంద్రీకరించిది.




సైనా
ప్రపంచ ర్యాంక్.........3
2008 లో చైనా లో జరిగిన జూనియర్ బాట్మింటన్ చాంపియన్షిప్ ను గెలుచుకుంది.
2009 లో ఇండోనేషియన్ ఓపెన్ సూపర్ సీరిస్ చాంపియన్షిప్ ను గెలుచుకుంది.
2010 లో ఇండియా ఓపెన్....సింగపూర్ ఓపెన్.....ఇండోనేషియన్ ఓపెన్ మరియూ ఆల్ ఇంగ్లాండ్ సెమీ-ఫైనలిస్ట్.

ఈమె గెలుపులు భారతదేశ క్రీడారంగానికి ఎనలేని పేరు తెచ్హింది. ఈమె ఇలాగే రాబోవు కాలంలో ప్రపంచ చాంపియన్షిప్ తో పాటు మరెన్నో టైటిల్స్ గెలుచుకోవాలని, దానికి కావలసిన మానసిక పట్టుదలను, ఆరోగ్యాన్నీ అమె కు ఇవ్వాలని కోరుకుంటున్నాను.

హాట్స్ ఆఫ్ టు యూ సైనా.

2 comments:

  1. హాట్స్ ఆఫ్ టు సైనా.
    she is very clsoe to world No 1 rank.

    ReplyDelete