Sunday, June 27, 2010

ధరలు పెరిగినై కాబట్టి మా జీతాలు కూడా పెరగాలి....ఎం.పి లు

ధరలు పెరగడంతో, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన మన దేశంలోని మన ప్రజా ప్రతినిధులు, అంటే ఎం.పి లు (చట్టలను రూపొందించే వారు) వారి జీతాలు పెంచుకోవాలని అనుకుంటున్నారు.

దీనికోసం ఏర్పాటు చేయబడ్డ ఒక లోక్ సభ కమిటీ, ఎం.పి ల జీతాలను రూ.16,000 నుండి రూ.80,001 గా పెంచాలని సిఫార్స్ చేసింది. కేంద్ర ప్రభుత్వ సెక్రెటరీ కంటే వీరికి కనీసం ఒక రూపాయి ఎక్కువ జీతం కావాలట.

ప్రభుత్వం ఈ కమిటీ చేసిన సిఫార్స్ ను అమలుచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ లోక్ సభ వ్యవహారాల మంత్రి పి.కె.బన్సాల్ గారు "ఇంకా దీని గురించి ఖచ్హితమైన నిర్ణయాలు తీసుకోలేదు. చర్చలు జరుపుతున్నాం. కమిటీలోని మంత్రులతో మరోసారి మాట్లాడిన తరువాత లోక్ సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టి అనుమతి తీసుకుంటాం" అని తెలిపేరు.

"తప్పులేదు...ధరలు పెరగడం వలన మరియూ ఖర్చులు పెరగడం వలన జీతాలు పెంచమని అడగటంలో తప్పులేదు. ఎం.పీ.లకు జీతాలు చివరిసారి పెంచింది 10 ఏళ్ళ క్రితం" బన్సాల్ అన్నారు.

ఈ విషయం మీద సి.పి.ఎం లీడర్ సీతారాం యేచూరి మాట్లాడుతూ "పెంచాలని అడిగిన పద్దతి బాగుండలేదు. ఇది ఖచ్హితంగా వివాదం తీసుకువస్తుంది. ఎం.పి లే తమ జీతాలను నిర్ణయించుకోవడం, పెంచుకోవడం చాలా తప్పు. ఈ బిల్లు ను లోక్ సభలో ప్రవేశపెట్టినప్పుడు మా పార్టీ దానిని వ్యతిరేకిస్తుంది" అన్నారు.

"ఇతర దేశాలలో ఎం.పి.లు తీసుకునే జీతాలుతో పోలిస్తే మన ఎం.పి.లు తీసుకునే జీతాలు చాలా తక్కువ. శ్రీలంకలో ఒక ఎం.పి తన ఎం.పి పదవి కాలం ముగిసిన తరువాత ఖరీదైన, సొగసైన కార్లను తక్కువ రేట్లతో కొనుక్కోవచ్హు. అమెరికాలో ఒక సెనేటర్ 18 మందిని తన సెక్రెటరీ గా ఉంచుకోవచ్హు. కానీ మనదేశంలో ఒక ఎం.పి సెక్రెటరీలను పెట్టుకోవటానికి రూ.20,000/- మాత్రమే ఇస్తున్నారు. రూ.20,000 లకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ని కూడా నియమించుకోలేము" అని చెప్పి ఒక ఎం. పి తమ జీతాల కోరికను సమర్ధించుకున్నారు.

ధరలు పెరగడంతో తమ జీతాలను తామే పెంచుకోబోతున్నారు మన ఎం.పీ లు------మరి ధరల పెరుగుదలతో జీవితాలే గడుపలేకపోతున్న తమ ప్రజలకు ఏం చెయ్యబోతారో మన ప్రజా ప్రతినిధులు?

2 comments:

 1. హ్మం అప్పుడెప్పుడో మన ప్రధాన మంత్రి అన్నట్టు గుర్తు ... కంపెనీల సి.ఐ.ఓ లు జీతాలు తక్కువ చేసుకోవాలి అని...
  సంవత్సరానికి తెలిసి యాభై కోట్లు బొక్క.

  ReplyDelete
 2. కౌండిన్య
  బాగా గుర్తు చేశారు.కార్పొరేట్ కంపెనీలు ఇస్తున్న హెచ్చు జీతాలవల్ల ప్రజల ఆదాయాలలో విపరీతమైన తారతమ్యాలు ఏర్పడి అసూయా ద్వేషాలు రగులుతున్నాయని అందువలన కార్పోరేట్ కంపెనీలు జీతాలు తగ్గించాలని మన్మోహన్ సింగ్ గారు కోరారు ఆనాడు.
  *కేంద్ర ప్రభుత్వ సెక్రెటరీ కంటే ఒక రూపాయి ఎక్కువ జీతం, పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయితే రోజుకి రూ.2 వేల భత్యం,నియోజకవర్గాలకు వెళ్లేందుకు 34 ఉచిత విమానప్రయాణాలు,కార్యాలయాల నిర్వహణకు అదనపు ఖర్చులు ఎంపీలు కోరుతున్నారు.
  * గ్రామ సర్పంచ్ లకు మండలాద్యక్షులకూ ఆఫీసు భవనాలు ఉన్నాయి గానీ కేంద్ర ప్రభుత్వ సెక్రెటరీ హోదా కలిగిన ఎంపీలకూ,కలక్టర్ స్థాయి జీతంవచ్చే ఎమ్మెల్యేలకు సొంత ఆఫీసు భవనాలు లేవు.వాళ్ళ ఇళ్ళలోనో ఎక్కడో ఆఫీసులు నిర్వహిస్తూ ఉంటారు.
  *284 తాలూకాలను 1128 మండలాలుగా విడగొట్టినందువలన ప్రజలకు పాలనా యంత్రాంగం దగ్గరయ్యింది.అలాగే ప్రతి ఎంపీకి ఒక కలెక్టరు,ప్రతి ఎమ్మెల్యేకి ఒక సబ్ కలెక్టర్ ను అనుసంధానం చేసి ఆయా భవనాలలో కూర్చోబెడితే మన రాష్ట్రంలోజిల్లాలు23 నుండి 42 కు,డివిజన్లు82 నుండి 294 కు పెరిగి ప్రజలకు పాలన మరింత దగ్గరౌతుంది.ఆమేరకు శాశ్వత భవనాలూ ,మౌలికఆస్తులూ,సౌకర్యాలు ఎక్కువ ప్రాంతాలకు వికేంద్రీకరించబడతాయి.

  ReplyDelete