Wednesday, June 30, 2010

వరకట్న వేదింపు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారా? ఒక్క ఉత్తరప్రదేశ్ జైల్లలో 9000 మంది భర్తలు ఉన్నారట

ఇండియా టుడే పత్రికలో ప్రచురితమైన ఒక న్యూస్ ఆర్టికల్లో వరకట్న వేదింపు చట్టాన్ని పగతీర్చుకోవడానికి ఉపయోగిస్తూ దుర్వినియోగం చేయబడుతోందని తెలిపేరు.

34 సంవత్సరాల పుష్కర్ సింగ్, అతని భార్య పెట్టిన తప్పుడు కేసు వలన 4 సంవత్సరములు జైలు శిక్ష అనుభవించేడు. జైలు నుండి విడుదలైన తరువాత అవమానం భరించలేక ఆత్మహత్యచేసుకున్నాడు. తన ఆత్మహత్యకు తన బావమరుదులే కారణమని తెలిపేడు.ఇతనికి ఒక చిన్న పిల్లడు మరియూ అనారోగ్యంతో బాధ పడే తల్లి ఉన్నారట.

34 సంవత్సరాల బిజీష్ అవస్తీ దగ్గరనుండి అతని బావమరుదులు అప్పుతీసుకున్నారుట. అప్పు తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వమని చెప్పడమే కాకుండా అతని భార్య దగ్గర అతను రహశ్యంగా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడని చెప్పేరు. ఇది విని ఆమె ఆత్మహత్య చేసుకుంది. వరకట్నం ఎక్కువ కావాలని వేదించటంవలనే తమ చెల్లెలు ఆత్మహత్య చేసుకుందని చెప్పి అతని మీద కేసు పెట్టేరు. జైలు నుండి విడుదలైన అతను తన ఇద్దరు కూతుర్లను చూసుకుంటున్నాడట.

జైలుకు వచ్హే వారి సంఖ్యలో హత్యలు చేసి జైలుకు వచ్హిన వారి తరువాత, వరకట్న వేధింపు చట్టం క్రింద ఖైదు చేయబడి శిక్ష అనుభవించేవారే ఎక్కువగా వస్తున్నారని ఉత్తరప్రదేశ్ జైలు అధికారి సుల్ఖాన్ సింగ్ ఐ.పి.ఎస్ చెబుతున్నారు.

లక్నోకి చెందిన వ్యాపారి ఇంద్రనైల్ బట్టాచార్యా తన భార్యను ఎక్కువ ఖర్చు పెట్టవద్దని ఖండించినందువలన ఆమె అతనిపై వరకట్న వేధింపు కేసు పెట్టిందట.

ఇంకోక విచిత్రమైన కేసులో రాం సరన్, సరోజ్ అనే ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. ఒక రోజు సరోజ్ కనబడకుండా పోయింది. సరోజ్ తండ్రి రాం సరన్ మరియూ అతని కుటుంభ సభ్యులు తన కూతుర్ని కట్నం ఎక్కువతీసుకురాలేదని వేధించి, చంపేసి, ఆమె శవాన్ని ఎక్కడో దాచేసేరని కేసు పెట్టేరు. క్రింది కోర్ట్ లో రాం సరన్ కి, అతని కుటుంభ సభ్యులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించేరు. హై కోర్ట్ కు వెళ్లిన రాం సరన్, కోర్ట్ విచారనలో ఉన్నప్పుడు చనిపోయిందని చెప్పబడుతున్న అతని భార్య సరోజ్ కోర్ట్ కు వచ్హి తాను చంపబడలేదని, తన ప్రేమికుడితో ఇళ్లు వదిలి వెళ్లిపోయిందని చెప్పింది.

2004 నుండి 2008 వరకు 3,36,842 మంది మీద కేసులు మోపబడితే అందులో 94 శాతం కేసులు తప్పుడు కేసులుగా తేలిందట. ఈ శాతం చూస్తే వరకట్న చట్టం దుర్వినియోగం చేయబడుతున్నట్లు కనబడుతోంది.

ఈ వరకట్న వేదింపు చట్టం పోలీసులకూ, లాయర్లకూ డబ్బు ఇచ్హే మిషిన్ గా ఉపయోగపడుతోందని నేను నిశ్శందేహంగా చెప్పగలనని తప్పుడు కేసుతో భాదింపబడ్డ స్వరూప్ సర్కార్ చెబుతున్నారు.

"గత 8 నెలలలో నా దగ్గరకు వరకట్న కేసులని చెప్పి 622 కేసులు వచ్హినై. వాటిని మీడియేషన్ సెంటర్ కు పంపేను. అందులో 500 కేసులు వరకట్నానికి సంభందించినవి కావని తేలింది" అని అలహాబాద్లోని సీనియర్ లాయర్ తెలిపేరు. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఆర్ధీకంగా బాగున్న వారు, బాగా చదువుకున్న వారి నుండే ఎక్కువగా కేసులు వస్తున్నాయని కూడా ఆయన చెప్పేరు.

వరకట్న చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటానికి మొదటి ప్రయత్నముగా కేసు పెట్టిన వెంటనే ఎవరినీ ఖైదు చేయ కూడదని, పూర్తిగా విచారించిన తరువతే ఖైదు చేయలని అలహాబద్ కోర్ట్ పోలీసులకు సలహాలు ఇచ్హిందట.

1 comment:

  1. yes, this particular law is being misused. there are several women who are not making use of the law inspite of difficulties. the law is unfortunately 'used' by some sadists.

    ReplyDelete