Wednesday, June 30, 2010

స్వామి నిత్యానందా ఆశ్రమానికి మేము ఇష్టపడే వెల్తున్నాము....అక్క-చెల్లెల్లు

"బాంగ్లూరు లో ఉన్న నిత్యానందాస్వామి వారి బిదాది ఆశ్రమానికి, అక్కడ అధ్యాత్మిక సేవలు అందిచటానికి మేము ఇష్టపడే వెడుతున్నాము. మా మీద కానీ, స్వామి నిత్యానంద మీద కానీ మా తల్లితండ్రులు ఫిర్యాదు ఇస్తే, మీరు ఆ ఫిర్యాదు తీసుకుని మా మీద కానీ, స్వామి నిత్యానంద మీద కానీ లేక ఆశ్రమానికి చెందిన వారి మీద కానీ ఎటువంటి చర్య తీసుకోకూడదు" కన్యాకుమారీకి చెందిన ఇద్దరు యువతులు చెన్నై పోలీస్ కమీషనర్ దగ్గర వచ్హి లిఖిత పూర్వముగా తెలిపేరు.

ఎస్.క్రిష్నేష్వరీ అలైస్ నిత్యప్రీతానందా(వయసు 29 సంవత్సరాలు)మరియూ ఎస్.చిత్రేష్వరీ అలైస్ నిత్య ప్రవనానందా( వయసు 28 సంవత్సరాలు)అని పేరు గలిగిన ఈ ఇద్దరు యువతులు అక్క చెల్లెల్లు. ఇద్దరూ ఎకోనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యువేట్స్.

"మా నాన్న సివబాలన్ మరియూ తల్లి లక్ష్మీ ఇష్టపడే మా ఇద్దరినీ ఆశ్రమానికి అర్పించేరు. 2006 లో మా ఇద్దర్నీ తీసుకు వెళ్లి ఆశ్రమంలో చేర్చేరు. మమ్మల్నిద్దరినీ ఆశ్రమానికి అర్పించుకోవటంలో వారికి ఎటువంటి అభ్యంతరం లేదని లిఖిత పత్రం కూడా ఇచ్హేరు" అని వారు తెలిపేరు.

బ్రహ్మచారిణి లు అవడానికి కావలసిన అర్హతలు సంపాదించుకోవటానికి ఆశ్రమం జరిపిన అన్ని కోర్స్ లు చదివి ఉత్తీర్ణులైయ్యేరు.

"మా నాన్న గారికి మా గురువుగారు పరమహంస నిత్యానంద స్వామి అంటే ఎనలేని గౌరవం. మమ్మల్ని చూడటానికి ఆశ్రమానికి చాలా సార్లు వచ్హేరు. అయితే, స్వామి నిత్యానందా మీద ఎప్పుడైతే తప్పుడు సమాచారం వచ్హిందో మమ్మల్నిద్దరినీ నాన్నగారు ఇంటికి తీసుకువెళ్ళేరు" పి.హ్చ్.డి స్కాలర్స్ అయిన అక్కచెల్లెల్లు చెప్పేరు.

"మమ్మల్ని మార్చటానికి మా తల్లితండ్రులు ఎంతో ప్రయత్నం చేసేరు. మా ఇద్దరికీ పెళ్లి చేయడానికి కూడా ఎంతో ప్రయత్నం చేసేరు. మా తల్లితండ్రులు చేస్తున్న ఒత్తిడ్లను తట్టుకోలేక మా మామయ్య విశ్వరూపానందా గారింటికి వచ్హేసేము. మేము ఆశ్రమానికి తిరిగి వెళ్లాలనుకుంటున్నాము. మా తల్లితండ్రులకు అది ఇష్టంలేదు. అందుకని వారు స్వామి నిత్యానందా మీద "కిడ్నాప్" కేసు పెట్టి ఆయన్ను ఖైదు చేయించ దలచుకున్నారు. మేము ఎవరి బలవంతం మీద గానీ ఎవరి ప్రొద్భలం తో గాని వెళ్ళటంలేదు. మేము ఇష్టపడే వెడుతున్నాము. కనుక పోలీసులు మా తల్లితండ్రులు స్వామి నిత్యానందా మీద ఇచ్హే తప్పుడు కేసు మీద ఎటువంటి చర్య తీసుకోకూడదు" అని తెలిపేరు.

స్వామి నిత్యానందా ఒక సినీ నటితో సన్నిహితంగా ఉన్నట్టు విడుదలైన వీడియో టేప్ గురించి అడిగితే "అది ఒక స్రుష్టించ బడ్డ టేప్. నిజమైనది కాదు. ఆయన మీద మాకు నమ్మకం ఉన్నది. ఆశ్రమంలో మొత్తం 300 మంది మహిళలు ఉన్నారు. అందులో వివాహితులు కూడా ఉన్నారు. ఎవరూ ఆయన గురించి తప్పుగా చెప్పలేదే" అన్నారు.

వరకట్న వేదింపు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారా? ఒక్క ఉత్తరప్రదేశ్ జైల్లలో 9000 మంది భర్తలు ఉన్నారట

ఇండియా టుడే పత్రికలో ప్రచురితమైన ఒక న్యూస్ ఆర్టికల్లో వరకట్న వేదింపు చట్టాన్ని పగతీర్చుకోవడానికి ఉపయోగిస్తూ దుర్వినియోగం చేయబడుతోందని తెలిపేరు.

34 సంవత్సరాల పుష్కర్ సింగ్, అతని భార్య పెట్టిన తప్పుడు కేసు వలన 4 సంవత్సరములు జైలు శిక్ష అనుభవించేడు. జైలు నుండి విడుదలైన తరువాత అవమానం భరించలేక ఆత్మహత్యచేసుకున్నాడు. తన ఆత్మహత్యకు తన బావమరుదులే కారణమని తెలిపేడు.ఇతనికి ఒక చిన్న పిల్లడు మరియూ అనారోగ్యంతో బాధ పడే తల్లి ఉన్నారట.

34 సంవత్సరాల బిజీష్ అవస్తీ దగ్గరనుండి అతని బావమరుదులు అప్పుతీసుకున్నారుట. అప్పు తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వమని చెప్పడమే కాకుండా అతని భార్య దగ్గర అతను రహశ్యంగా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడని చెప్పేరు. ఇది విని ఆమె ఆత్మహత్య చేసుకుంది. వరకట్నం ఎక్కువ కావాలని వేదించటంవలనే తమ చెల్లెలు ఆత్మహత్య చేసుకుందని చెప్పి అతని మీద కేసు పెట్టేరు. జైలు నుండి విడుదలైన అతను తన ఇద్దరు కూతుర్లను చూసుకుంటున్నాడట.

జైలుకు వచ్హే వారి సంఖ్యలో హత్యలు చేసి జైలుకు వచ్హిన వారి తరువాత, వరకట్న వేధింపు చట్టం క్రింద ఖైదు చేయబడి శిక్ష అనుభవించేవారే ఎక్కువగా వస్తున్నారని ఉత్తరప్రదేశ్ జైలు అధికారి సుల్ఖాన్ సింగ్ ఐ.పి.ఎస్ చెబుతున్నారు.

లక్నోకి చెందిన వ్యాపారి ఇంద్రనైల్ బట్టాచార్యా తన భార్యను ఎక్కువ ఖర్చు పెట్టవద్దని ఖండించినందువలన ఆమె అతనిపై వరకట్న వేధింపు కేసు పెట్టిందట.

ఇంకోక విచిత్రమైన కేసులో రాం సరన్, సరోజ్ అనే ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. ఒక రోజు సరోజ్ కనబడకుండా పోయింది. సరోజ్ తండ్రి రాం సరన్ మరియూ అతని కుటుంభ సభ్యులు తన కూతుర్ని కట్నం ఎక్కువతీసుకురాలేదని వేధించి, చంపేసి, ఆమె శవాన్ని ఎక్కడో దాచేసేరని కేసు పెట్టేరు. క్రింది కోర్ట్ లో రాం సరన్ కి, అతని కుటుంభ సభ్యులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించేరు. హై కోర్ట్ కు వెళ్లిన రాం సరన్, కోర్ట్ విచారనలో ఉన్నప్పుడు చనిపోయిందని చెప్పబడుతున్న అతని భార్య సరోజ్ కోర్ట్ కు వచ్హి తాను చంపబడలేదని, తన ప్రేమికుడితో ఇళ్లు వదిలి వెళ్లిపోయిందని చెప్పింది.

2004 నుండి 2008 వరకు 3,36,842 మంది మీద కేసులు మోపబడితే అందులో 94 శాతం కేసులు తప్పుడు కేసులుగా తేలిందట. ఈ శాతం చూస్తే వరకట్న చట్టం దుర్వినియోగం చేయబడుతున్నట్లు కనబడుతోంది.

ఈ వరకట్న వేదింపు చట్టం పోలీసులకూ, లాయర్లకూ డబ్బు ఇచ్హే మిషిన్ గా ఉపయోగపడుతోందని నేను నిశ్శందేహంగా చెప్పగలనని తప్పుడు కేసుతో భాదింపబడ్డ స్వరూప్ సర్కార్ చెబుతున్నారు.

"గత 8 నెలలలో నా దగ్గరకు వరకట్న కేసులని చెప్పి 622 కేసులు వచ్హినై. వాటిని మీడియేషన్ సెంటర్ కు పంపేను. అందులో 500 కేసులు వరకట్నానికి సంభందించినవి కావని తేలింది" అని అలహాబాద్లోని సీనియర్ లాయర్ తెలిపేరు. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఆర్ధీకంగా బాగున్న వారు, బాగా చదువుకున్న వారి నుండే ఎక్కువగా కేసులు వస్తున్నాయని కూడా ఆయన చెప్పేరు.

వరకట్న చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటానికి మొదటి ప్రయత్నముగా కేసు పెట్టిన వెంటనే ఎవరినీ ఖైదు చేయ కూడదని, పూర్తిగా విచారించిన తరువతే ఖైదు చేయలని అలహాబద్ కోర్ట్ పోలీసులకు సలహాలు ఇచ్హిందట.

ముంగీస-పాము పోరాటం చూసుంటారు, ఇక్కడ ఉడుత--పాము పోరాటం చూడండి

ముంగీస--పాము పోరాడటం సహజంగా అందరికీ తెలిసిందే. మనలో చాలామంది చూసుంటారు కూడా. కానీ ఒక ఉడుత పాముతో తల పడటం ఆశ్చర్యంగానే ఉంది. మామూలుగా ఉడుతలకి భయం ఎక్కువ. కానీ ఇక్కడ ఈ ఉడుత ధైర్యం చూస్తే...వ్వా వ్వా

పామూ...ముంగీసపామూ....ఉడత

Tuesday, June 29, 2010

అవతార్ లాంటి మరో సినిమా

హాలీవుడ్లో ఈ వేసవికి రిలీజ్ అయిన హిట్ సినిమాల కధలు ఏదో ఒక ఇంతకు ముందు సినిమాకు తరువాయి భాగమో లేక మరో భాషలో వచ్హిన సినిమా కధ ఆధారంతో తీసినవో లేక మరో భాషా చిత్రాన్ని అనువదించి తీసినవే నట. ఈ వరుసలో ఐరన్ మాన్,స్రెక్,కరాతే కిడ్, టాయ్ స్టోరీ, సెక్స్ అండ్ సిటి-2, రాబిన్ హుడ్ మరియూ ఏ టీం సినిమాలు. సొంత కధతో నిర్మించబడ్డ సినిమా ఆంజలీనా జోలీ నటించిన ‘సాల్ట్’ ఒకటే.

సొంత కధతో నిర్మించబడ్డ మరో సినిమా "ఇన్ సెప్ షన్"(INCEPTION). ఈ సినిమా వచ్హే నెల (జూలై) 16 న విడుదలవుతుందని చెబుతున్నారు. కానీ అప్పుడే ఈ సినిమా గురించి ప్రజలు మరియూ హాలీవుడ్ ప్రముఖులు మాట్లాడుకోవడం, ఎదురుచూడటం జరుగుతోంది.

దీనికి కారణముంది. ఈ సినిమా సొంతంగా రాయ బడ్డ కధతో చిత్రీకరించ బడింది. ఈ సినిమాను అందిస్తున్నది హాలీవుడ్ ఫేమస్ డైరక్టర్ క్రిష్టోఫర్ నొలాన్. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించేడు. అందులో ఒకటి 'ది డార్క్ నైట్'. "ఇన్ సెప్ షన్" సినిమా కధ గురించి "ఇది ఒక సైన్స్ ఫిక్షన్ త్రిల్లర్ స్టోరీ---మైండ్ వేసిన ఒక ఆలోచన గురించి తీసిన సినిమా" అని వివరించేరు. ఈ సినిమా తీయడానికి చాలా ఖర్చు అయిందని చెబుతున్నారు గానీ ఎంత అని చెప్పడం లేదు.

అవతార్ సినిమా 2.7 బిల్లియన్ల డాలర్ల కలెక్షెన్ తో రికార్డులు బద్దలు కొడుతూ హారీ పోటర్, స్పైడర్ మాన్ సినిమాలను వెనక్కు తోసింది. అవతార్ సినిమా అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, సినిమా చూసిని ప్రతి ఒక్కరినీ వెరే లోకాలకు తీసుకు వెళ్లిన అనుభూతిని కలిగించింది.

అవతార్ సినిమా లాగానే "ఇన్ సెప్ షన్" సినిమా కధ కూడా వాస్తవానికి దగ్గరగా అత్యున్నతమైన సాంకేతిక నైపుణ్యముతో అద్భుతంగా చిత్రీకరించబడిందట. అవతార్ సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు కలిగిన అనుభూతి లాంటిదే ఈ సినిమా చూసేటప్పుడు కలుగుతుందట. కలక్షన్లలో కూడా అవతార్ సినిమా లాగానే రికార్డులు స్రుష్టిస్తుందని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

ఆ సినిమా ట్రైలర్ ఈ క్రింది వీడియోలో చూడండి.


Monday, June 28, 2010

రాజ్ తాఖరే కొడుకు అమిత్ ఏ మీడియం లో జేరతాడు?

మామూలు పరిస్తితులలో అయితే ఈ విషయం గురించి ఎవరూ పట్టించుకోరు, చర్చించుకోరు. కానీ అమిత్ మామూలు విధ్యార్ది కాదు. ఇతను, మరాఠీ భాషను ఆయుధంగా చేసుకుని, దానితో తనకంటూ ఒక గుర్తు తెచ్హుకున్న మహారాష్ట్రా నవనిర్మాణ సేన నాయకుడు రాజ్ తాఖరే కొడుకు మరియూ సివ సేనా నాయకుడు బాల్ తాఖరే మనవడు కావటంతో ప్రజలలో అతను ఏ మీడియంలో తన చదువును కొనసాగిస్తాడో ననే విషయం మీద చర్చ జరుగుతోంది.

ఈ మధ్య రాజ్ తాఖరే తన కొడుకు అమిత్ తో కలిసి ముంబై నగర పొలిమేరలలో ఉన్న రియా కాలేజ్ ప్రిన్సిపల్ ను తన సిబ్బందితో వెళ్లి కలిసేరు. తన కొడుకు అమిత్ చేరాలనుకున్న "మాస్ మీడియా" కోర్స్ లో నేర్పే సబ్జెక్ట్స్ గురించి అడిగి తెలుసుకున్నారని కాలేజ్ ప్రిన్సిపల్ సుహాస్ పెద్నేకర్ తెలిపేరు. ఆ కోర్స్ గురించిన పూర్తి వివరాలను మరియూ ఆ కోర్స్ చదువుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందీ అన్న విషయయాలను కూడా అడిగి తెలుసుకున్నారట. తన కొడుకుని రాజ్ తాఖరే ఇంకా చేర్చలేదని, కానీ క్లాస్ రూములు, లైబ్రరీ రూములను చూసి ఆ కోర్స్ కో-ఆర్డినేటర్ తో కాసేపు మాట్లాడేరని కాలేజ్ అధికారి ఒకరు తెలియ పరిచేరు.

అమిత్ గనుక ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పే "మాస్ మీడియా" కోర్స్ లోనే చేరాలనుకుంటే, అది రాజ్ తాఖరీకి మరియూ అతని పార్టీకి తలవంపులతో పాటు అపకీర్తిని తెస్తుంది. ఎందుకంటే మరాఠీ భాష ను ప్రొశ్చాహిస్తూ, ఆ బాషను అడ్డుపెట్టుకుని, ఆ భాష కోసమే బ్రతుకుతున్నాని ప్రచారం చేస్తూ తన ఉనికిని బలపరుచుకున్నారు. ఈ విషయం మీకందరికీ తెలిసిందే. ఇట్టి పరిస్తితులలో తన కొడుకు ఇంగ్లీష్ మీడియంలో జేరితే అది ఒక పెద్ద సమస్యగా మారుతుందని అనుకుంటున్నారు.

అమిత్ ఇంగ్లీష్ మీడియంలో జేరినా అది పార్టికి గాని, పార్టీ నాయకుడు రాజ్ తాఖరే కి గాని సమస్యగా ఉండదని మహారాష్ట్రా నవనిర్మాన సేనా పార్టికి చెందిన కొందరు చెబుతున్నారు. ఎందుకంటే ఇంతవరకు అమిత్ చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలోనే. అయినా ఎవరూ ఈ విషయాన్ని సమస్యగా తీసుకురాలేదు.

రెండు సంవత్సరాల క్రితం అమిత్ పోదార్ కాలేజ్ లో ఇంటర్ జేరేడు. సెకండ్ లాంగ్వేజ్ గా కూడా మరాఠీ తీసుకోలేదు. జర్మన్ తీసుకున్నాడు. ఎందుకంటే జర్మన్ లో నైతే ఎక్కువ మార్కులు తెచ్హుకోవచ్హునని. ఇంతేకాదు.....బాల్ తాఖరే మనవళ్ళు, మనవరాల్లు అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు, చదువుకున్నారు.

కానీ రాజ్ తాఖరే ప్రతి సంవత్సరం రియా కాలేజ్ కి వెళ్ళి అక్కడ బి.ఏ (మరాఠీ) కోర్స్ లో ఎంతమంది జేరుతున్నారో వాకబు చేస్తారట.

పట్టుదలను నిరూపించుకున్న సైనా ....హాట్స్ ఆఫ్

ఇండోనేషియాలో జరగబోయే సూపర్ సీరిస్ బాట్మింటన్ చాంపియన్ టైటిల్ ను తప్పక గెలుచుకుంటానని చెప్పిన సైనా, తన పట్టుదలతో నిన్న ఇండోనేషియాలోని జకార్తా నగరంలో జరిగిన ఇండోనేషియన్ ఓపెన్ సూపర్ సీరీస్ బాట్మింటన్ చాంపియన్షిప్ టైటిల్ ను జపాన్ కు చెందిన, బలమైన, డిఫెండింగ్ చాంపియన్ సయాకా సటో నుండి పట్టుదలతో పోరాడి గెలుచుకింది.21-19, 13-21, 21-11 పాయింట్లతో, ఉద్రిక్త ప్రదర్శనతో హరాహోరీగా పోరాడి సయాకా సటో ను ఓడించింది.

ఈ టైటిల్ గెలుచుకోవటంతో ఈమె ఈ సంవత్సరం వరుసగా 3 టైటిల్స్ గెలుచుకుని, హాట్రిక్ సాదించి, మాజీ బాట్మింటన్ చాంపియన్ ప్రకాష్ పదుకోన్ రికార్డును అందుకోగలిగింది..

"గెలవటానికే పుట్టింది" ఆమె కోచ్ ఒకరు సంతోషంగా చెప్పేరు.

"బలమైన ప్రత్యర్ధిని ఎదురుకోవటానికి నిదానంగా ఉంటూ అవకాశం కోసం ఎదురుచూడాలి అని చెప్పిన నా కోచ్ గోపీచంద్ గారు చెప్పిన మాటలు గుర్తుంచుకున్నాను. అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన సయాకా సటో ను మొదటి రౌండ్లో ఓడించినా, రెండవ రౌండ్లో అలసట మూలంగా ఓడిపోయేను. కానీ మూడవ రౌండ్లో బలమంతా పుంజుకుని ఆడటంతో టైటిల్ గెలుచుకున్నాను" సైనా తెలిపింది.

సయాకా సటో ఎన్నో రకాలుగా, ఎన్నో యుక్తులతో ఆడినా తన మానసిక బలంతో ఆమెను ఎదుర్కొని ఎత్తుకు పై ఎత్తులతో తానూ ఆడి ఆమెను గెలవగలిగింది సైనా.

హైదరాబద్ కు చెందిన సైనా, ఇక ఇప్పుడు తన మనస్సును, పట్టుదలను ఆగస్ట్ నెలలో పారీస్ లో జరుగబోయే ప్రపంచ బాట్మింటన్ చాంపియన్షిప్ మీద కేంద్రీకరించిది.
సైనా
ప్రపంచ ర్యాంక్.........3
2008 లో చైనా లో జరిగిన జూనియర్ బాట్మింటన్ చాంపియన్షిప్ ను గెలుచుకుంది.
2009 లో ఇండోనేషియన్ ఓపెన్ సూపర్ సీరిస్ చాంపియన్షిప్ ను గెలుచుకుంది.
2010 లో ఇండియా ఓపెన్....సింగపూర్ ఓపెన్.....ఇండోనేషియన్ ఓపెన్ మరియూ ఆల్ ఇంగ్లాండ్ సెమీ-ఫైనలిస్ట్.

ఈమె గెలుపులు భారతదేశ క్రీడారంగానికి ఎనలేని పేరు తెచ్హింది. ఈమె ఇలాగే రాబోవు కాలంలో ప్రపంచ చాంపియన్షిప్ తో పాటు మరెన్నో టైటిల్స్ గెలుచుకోవాలని, దానికి కావలసిన మానసిక పట్టుదలను, ఆరోగ్యాన్నీ అమె కు ఇవ్వాలని కోరుకుంటున్నాను.

హాట్స్ ఆఫ్ టు యూ సైనా.

Sunday, June 27, 2010

ధరలు పెరిగినై కాబట్టి మా జీతాలు కూడా పెరగాలి....ఎం.పి లు

ధరలు పెరగడంతో, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన మన దేశంలోని మన ప్రజా ప్రతినిధులు, అంటే ఎం.పి లు (చట్టలను రూపొందించే వారు) వారి జీతాలు పెంచుకోవాలని అనుకుంటున్నారు.

దీనికోసం ఏర్పాటు చేయబడ్డ ఒక లోక్ సభ కమిటీ, ఎం.పి ల జీతాలను రూ.16,000 నుండి రూ.80,001 గా పెంచాలని సిఫార్స్ చేసింది. కేంద్ర ప్రభుత్వ సెక్రెటరీ కంటే వీరికి కనీసం ఒక రూపాయి ఎక్కువ జీతం కావాలట.

ప్రభుత్వం ఈ కమిటీ చేసిన సిఫార్స్ ను అమలుచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ లోక్ సభ వ్యవహారాల మంత్రి పి.కె.బన్సాల్ గారు "ఇంకా దీని గురించి ఖచ్హితమైన నిర్ణయాలు తీసుకోలేదు. చర్చలు జరుపుతున్నాం. కమిటీలోని మంత్రులతో మరోసారి మాట్లాడిన తరువాత లోక్ సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టి అనుమతి తీసుకుంటాం" అని తెలిపేరు.

"తప్పులేదు...ధరలు పెరగడం వలన మరియూ ఖర్చులు పెరగడం వలన జీతాలు పెంచమని అడగటంలో తప్పులేదు. ఎం.పీ.లకు జీతాలు చివరిసారి పెంచింది 10 ఏళ్ళ క్రితం" బన్సాల్ అన్నారు.

ఈ విషయం మీద సి.పి.ఎం లీడర్ సీతారాం యేచూరి మాట్లాడుతూ "పెంచాలని అడిగిన పద్దతి బాగుండలేదు. ఇది ఖచ్హితంగా వివాదం తీసుకువస్తుంది. ఎం.పి లే తమ జీతాలను నిర్ణయించుకోవడం, పెంచుకోవడం చాలా తప్పు. ఈ బిల్లు ను లోక్ సభలో ప్రవేశపెట్టినప్పుడు మా పార్టీ దానిని వ్యతిరేకిస్తుంది" అన్నారు.

"ఇతర దేశాలలో ఎం.పి.లు తీసుకునే జీతాలుతో పోలిస్తే మన ఎం.పి.లు తీసుకునే జీతాలు చాలా తక్కువ. శ్రీలంకలో ఒక ఎం.పి తన ఎం.పి పదవి కాలం ముగిసిన తరువాత ఖరీదైన, సొగసైన కార్లను తక్కువ రేట్లతో కొనుక్కోవచ్హు. అమెరికాలో ఒక సెనేటర్ 18 మందిని తన సెక్రెటరీ గా ఉంచుకోవచ్హు. కానీ మనదేశంలో ఒక ఎం.పి సెక్రెటరీలను పెట్టుకోవటానికి రూ.20,000/- మాత్రమే ఇస్తున్నారు. రూ.20,000 లకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ని కూడా నియమించుకోలేము" అని చెప్పి ఒక ఎం. పి తమ జీతాల కోరికను సమర్ధించుకున్నారు.

ధరలు పెరగడంతో తమ జీతాలను తామే పెంచుకోబోతున్నారు మన ఎం.పీ లు------మరి ధరల పెరుగుదలతో జీవితాలే గడుపలేకపోతున్న తమ ప్రజలకు ఏం చెయ్యబోతారో మన ప్రజా ప్రతినిధులు?

Saturday, June 26, 2010

గొప్ప మనసున్న బిచ్హగాడు

ధర్మ గుణం ఉండటానికి గొప్ప మనస్సు ఉండాలి కానీ డబ్బు మాత్రమే ఉండాలనే అవసరంలేదని నిన్న ఒక బిచ్హగాడు నిరూపించేడు.

మెహసనా (అహమదాబాద్) పట్టణంలో నివసిస్తున్న 64 సంవత్సరాల కింజీబాయ్ ప్రజాపతి గత 10 సంవత్సరాలుగా అడుక్కుని బ్రతుకుతున్నాడు. శనివారం నాడు ఇతను శ్రీమతి కేసర్బాయ్ కిలాచంద్ స్కూల్ ఫర్ డెఫ్ అండ్ డంబ్ లోని 11 మంది చెవిటి, మూగ విధ్యార్ధిని లకు కొత్త బట్టలను దానం చేసేడు.

డబ్బుగల దాతలను ఎక్కువగా చూసే ఆ స్కూల్ వారు, మొదటిసారిగా ఒక బిచ్హగాడు తాను దాచుకున్న డబ్బుతో దానం చేయడానికి రావడం చూసి ఆశ్చర్యపోయేరు. మాసిన జుట్టు, నెరిసి పెరిగిపోయిన గడ్డం, చిరిగిన దుస్తులతో కుంటి వారి వాహనంలో వచ్హి 11 మంది విధ్యార్ధిని ల చేతుల్లో కొత్త బట్టలు ఉంచేడు. అతను అడుక్కుని దాచుకున్న 3,000 రూపాయలను ఆ బట్టలు కొనడానికి ఉపయోగించేడు.

మెహసనా పట్టణంలో ఉన్న సిమందర్ స్వామి జైన్ ఆలయం దగ్గర మరియూ అదే ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర నివసిస్తూ గుడికి వచ్హే భక్తుల దగ్గర చేయిచాస్తాడు.

కానీ, తాను అడుక్కుని సంపాదించుకున్న డబ్బును అభాగ్యవంతులైన ఆ పిల్లలకు ఎందుకు దానం చేయాలి? "నేను రోజుకు రెండు పూట్ల మాత్రమే తింటాను. రాజ్కోట్ లొ అనారోగ్యంతో భాదపడుతున్న నా భార్యకు కొంత డబ్బు పంపిస్తాను. మిగిలిన డబ్బుతో ఆకలితో భాదపడుతున్న పేదవారికి తిండిపెడతాను. ఈ మూగ, చెవిటి పిల్లలకు ఏదో ఒకటి చేయాలని ఎప్పటినుండో నాలో ఒక కోరిక ఉండేది. దీనికోసం రోజూ కొన్ని పైసలు దాచేవాన్ని" కింజీబాయ్ చెప్పేడు.

రాజ్కోట్లో కింజీ బాయ్ ఒక టీ కొట్టు నడిపేవాడు. ధరల పెరుగుదలతో మరియూ లాభాలు బాగా తగ్గిపోవటంతో అతను విపరీతమైన నష్టాలకు గురై చవరికి వీదుల్లో పడ్డాడు.

దేముని మీద నమ్మకంతో అతను మెహసానా వచ్హి జైన్ ఆలయం బయట తలదాచుకున్నాడు. "బీదవారిమో...ధనవంతులమో, ప్రతి ఒక్కరూ కష్టాలలో ఉన్నవారికి సహకరించాలి" అంటున్న కింజీబాయ్ అంతకుముందు ఒక అనాధ పిల్లకు పెళ్ళి చేసేడు.

అతను దానం చేసిన బట్టలను అందుకున్న, ఆ స్కూల్లోనే చాలా కాలంగా ఉంటున్న 18 ఏళ్ళ స్వాతి కళ్ళల్లో ఆనందం చూసి కంట తడి పెట్టుకున్న కింజీబాయ్ ని ఆ స్కూల్ అధికారి ఓదార్చేరు.

బిచ్హమెత్తుకుని బ్రతుకుతున్నా పరోపకారిగా ఉండాలనుకున్న కింజీబాయ్ ప్రజాపతికి జోహార్లు.

నియంత్రణ ఎత్తివేసి రూ.25 కోట్ల సబ్సిడీ భారం తగ్గించుకున్న ప్రభుత్వం

నిత్యావసర వస్తువులకు సబ్సిడీలు ఇవ్వటం ఒకప్పుడు నిజమైన ప్రజా సంక్షేమ పధకంగా ఉండేది. కానీ రాను రాను అది రాజకీయ లాభాలకు ఒక ఆయుధంగా మారింది. అత్యవసర పరిస్తితులలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అప్పుడప్పుడు సబ్సిడీలతో ఇస్తున్న వస్తువుల పై ధరలు పెంచవలసి వస్తుంది.ఈ విషయం తెలిసున్నా అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండే రాజకీయ పార్టీలు ఆ ధరల పెంపుదలని ఒక ఆయుధంగా వాడుకుని ప్రజలను తమ వైపు తిప్పుకుని రాజకీయ లాభం పొంది పరిపాలనకు వచ్హేవారు. అలా పరిపాలనలోకి వచ్హిన పార్టీలు కూడ, ఉత్పత్తులను పెంచకుండా ధరలను మాత్రం పెంచుకుంటూ వెళ్లేరు. అలా అన్ని రాజకీయ పార్టీలూ పెంచిన ధరలతోనే నేడు అత్యావసర వస్తువుల ధరలు పేదవారిని అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు కూడా పెట్రోలియం వస్తువుల ధరల పెంపుదలని ప్రతిపక్షాలు ఆయుధంగా వాడుకోవటానికే చూస్తున్నారు. వారు పరిపాలనలోకి వచ్హినా వీటి ధరలను పెంచక మానరు.

ఈ రోజు ఒక్క కిరోసిన్ తప్ప మిగిలిన పెట్రోలియం ప్రాడక్టులని ఎక్కువగా వాడేది పేద వారికంటే ధనవంతులే ఎక్కువ. కిరోసిన్ వాడే వారి సంఖ్య చాలా తక్కువుగా ఉందట. మరో విధంగా చెప్పాలంటే పెట్రోల్, డీజల్ మరియూ వంట గ్యాస్ వాడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. ఒక పెట్రోలియం ప్రాడక్ట్ కు గత సంవత్సరం సబ్సిడీ ఖర్చు 3,000 కోట్ల రూపాయలుగా ఉంటుందని ప్రబుత్వం అంచనావేస్తే, సబ్సిడీ 14,000 కోట్ల రూపాయలికి చేరుకుందట. ఇలా పెద్ద పెద్ద మొత్తాలను సబ్సిడీగా ఇవ్వటం ఏ ప్రభుత్వానికైనా పెద్ద భారమే అవుతుంది. ఎందుకంటే సబ్సిడీల వలన కలిగే నష్టాన్ని ఆ యా కంపెనీలకు చెల్లించాలి. లేకపోతే అసలుకే మోసమొస్తుంది.

పెట్రోల్ ధరల పై మాత్రమే నియంత్రణను ఎత్తివేసింది ప్రభుత్వం. మిగిలిన వాటిపై ధరలు పెంచింది. అయితే మిగిలిన వాటిపై కూడా కొన్ని రోజులలో నియంత్రణను ఎత్తివేస్తుందని తెలుస్తోంది.

సబ్సిడీల వలన లాభ పడేది పేదవారి కంటే సంపన్నులే ఎక్కువగా ఉన్నారు. ఇటీవలి కాలంలో డీజల్ కార్ల కొనుగోలు విపరీతంగా పెరిగింది. అలాగే గ్యాస్ సిలిండర్ల వాడకం మరియూ పెట్రోల్ వాడకం గణనీయంగా పెరిగింది. ధనిక, పేద లేకుండా సబ్సిడీలు ఎందుకివ్వాలి అనేది సరైన ప్రశ్నే.

రాజకీయ లాభాలను ద్రుష్టిలో ఉంచుకుని సబ్సిడీలను ఇవ్వటం కంటే, సబ్సిడీలు పేదవారికి మాత్రం వెళ్లి చేరటానికి కచ్హితమైన పధకం రూపొందించి (రేషన్ కార్డ్ లాగా) దానిని అమలులో పెడితే, పేదవారి పేరు చెప్పుకుని లాభ పడే వారి దగ్గర నుండి సరైన ధరను వసూలు చేయవచ్హు.

ఏ సబ్సిడీ అయినా పరిమిత కాలానికే ఇవ్వాలి గానీ, అపరిమితంగా, అనంతంగా ఇవ్వకూడదు. సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేసి, అత్యావసర వస్తువులను అందుబాటు ధరలతో సామాన్య మానవునికి అందే విధంగా పధకాలను వేసి అందించాలి గానీ సబ్సిడీ పేరుతో అందరికీ అందిస్తే దీర్గకాలిక సుస్తిరతను పొందలేము.

Tuesday, June 22, 2010

వెయ్యి చేతుల నాట్యం.........వీడియో

బహుశ మీరందరూ ఈ నాట్యాన్ని చూసుంటారనుకుంటా. చూడనివారికోసం ఈ అద్బుత వీడియో మరోసారి.

Monday, June 21, 2010

లండన్ రధ యాత్ర పండగలో పాల్గొన్న వేలాది భక్తులు

ప్రపంచం నలుమూలల నుండి వచ్హిన వేలాదిమంది భక్తులు, నమ్మకస్తులు మరియూ మత గురువులు నిన్న లండన్ నగరంలో జరిగిన రధ యాత్ర పండగలో పాల్గొన్నారు. లండన్ నగరమే రంగు రంగుల తోరణాలతోనూ మరియూ భక్తి పాటలతోనూ కళకళలాడిపోయింది.

40 అడుగుల ఎత్తున్న, వివిధ రంగులతో అలకరించబడ్డ జగన్నాధ స్వామి, సుబద్రా దేవి మరియూ బలరాముని విగ్రహాలతో ఊరేగింపుగా తీసుకువెడుతున్న రధాలను భక్తులు లండన్ నగరంలోని హైడీ పార్క్ నుండి ట్రఫాల్గర్ స్క్వయర్ వరకు తీసుకువెళ్లేరు.

ఈ పెద్ద పెద్ద రధాల వెనుక భక్తి గీతాలు పాడే వారు, సంగీత కళాకారులూ మరియూ న్రుత్య కళాకారులూ భక్తి గీతాలు పాడుకుంటూ, న్రుత్యం చేసుకుంటూ వెళ్ళేరు.

ట్రాఫల్గర్ స్క్వయర్ దగ్గర ముగిసిన యాత్రలొ, యాత్ర గురించి, చరిత్ర గురించి మరియూ ఆచారాల గురించి వివరించే సభకు మరికోందరు వేచి యున్నారు.

ఈ రధాల పండగనేది 5000 సంవత్సరాల క్రితం మొదలైంది. ఈ రధ పండుగ ప్రతి సంవత్సరం ఒరిస్సాలో ఉన్న పురాతన పుణ్య నగరమైన జగన్నాధ పూరీలో జరుగుతుంది. రధాలకు కట్టిన తాళ్ళను లాగితే స్రుష్టికే కారనమైన శ్రీ క్రిష్ణుని సన్నిధానానికి వెళ్ళి మోక్షం పొందవచ్హునని నమ్ముతారు.

"40 సంవత్సరాలుగా, విడువకుండా ప్రతి సంవత్సరం జరిగే ఈ రధ యాత్ర పండుగలో కలుసుకునే జన సమూహం ఎక్కువౌతోందే గానీ తగ్గటం లేదు. అంటే దేముని మీద నమ్మకం రోజు రోజుకూ పెరుగుతోందని చెప్పవచ్హు" అని లండన్ రధ యాత్ర పండుగను నిర్వహించే తితిక్షు దాస్ తెలిపేరు.

ఈ రధ యాత్ర పండుగను పాశ్చ్యాత్త దేశాలకు తీసుకు వచ్హిన ఘనత ఇంటెర్ నేషనల్ సొసైటీ ఫర్ క్రిష్ణ చైతన్యం ను ప్రారంభించిన స్వామి శ్రీ భక్తి వెదాంతి గారికే చెందుతుంది.

అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 1967 వ సంవత్సరం మొట్టమొదటి రధ యాత్ర పండగ జరిగింది. 1969 లో ఈ పండగ లండన్ నగరంలో జరుపబడింది. ఆ రోజు నుండి 40 సంవత్సరాలుగా భక్తి శ్రద్దలతో ఈ పండుగను అక్కడ జరుపుకుంటున్నారు.


Saturday, June 19, 2010

Friday, June 18, 2010

మానవులను స్రుష్టించింది అన్యులా?(వీడియో చూడండి) ప్రపంచ శాస్త్రవేత్తలను ఆలోచనకు గురిచేసిన పుస్తకం

సెసారియా సిటిచిన్ అనే పేరు ప్రపంచ శాస్త్రవేత్తలను ఆలొచింప చేసిందా? విపరీతంగా అమ్ముడుపోయిన 13 పుస్తకాలను రాసినాయనే ఈ సెసారియా సిటిచిన్. ఈయనకు 90 సంవత్సరాలు.13 పుస్తకాలు రాసినా, ఎన్నో కాపీలు అమ్ముడుపోయినా ఈయన సెలబ్రటీ రచయతగా ప్రశిద్దికెక్కలేదు. ఈయన సోవియట్ రష్యాలో పుట్టేరు. ప్రస్తుతం అమెరికా దేశంలో ఉన్న న్యూయార్క్ నగరంలో నివసిస్తున్నారు. ఈయన తన 14 వ పుస్తకాన్ని ఈ నెల విడుదల చేసేరు.

ఈ 14 వ పుస్తకంలో ఆయన అన్యులు భూమిమీద చాలా కాలం క్రితం ఉండేవారని, దానిని నిరూపించడానికి కావలసిన రుజువుల గురించి రాసేరు. 60 సంవత్సరాల క్రితం ఆయన రాసిన మొదటి పుస్తకం "పన్నెండవ గ్రహం"( 12th PLANET). ఈ పుస్తకంలో ఆయన 12 వ గ్రహం గురించి రాసేరు. అప్పటి నుండి ఆయన రాసిన 12 పుస్తకాలూ ఈ 12 వ గ్రహం గురించే రాసేరు. ఈ మొత్త 13 పుస్తకాలలోనూ ఆయన మనుష్యులను స్రుష్టించింది దేముడు కాదు... మనుష్యులను స్రుష్టించింది అన్యులే నని వాదిస్తూ దానికి కొన్ని రుజువులను కూడా చూపించేరు. ఆయన చెప్పేదాంట్లో అర్ధం లేదని ఆయన్ను తీసిపారేసేరు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆయన తను పరిశోదించిన విషయాల ఆధారంతో తను చెప్పేది నిజమని పుస్తకాల మూలంగా తెలిపేవారు. ఆయన తన 14 వ పుస్తకం లో అన్యులే మనుష్యులను ఒక ప్రోగ్రాం ప్రకారం తయారు చేసేరని, దీనికి రుజువుగా పురాతన సిధిలాల పైన రాసిన రాతలను తన పుస్తకంలో ప్రచురించేరు.

ఈయన ఒక సాదారన పుస్తక రచయత కాదు. ప్రపంచానికి తెలిసిన ఒక అన్య ప్రాణుల పరిశోధకుడు. ఈయన తన 14 వ పుస్తకంలో రాసిన విషయాలు చాలామందిని వొప్పుకునేలా చేసింది. ఈయన రాసిన 13 వ పుస్తకం కొన్ని మిలియన్ల కాపీలు అమ్ముడవటమే కాకుండా 25 భాషలలోకి అనువదించబడింది.

ఈయన చెబుతున్న 12 వ గ్రహం పేరు "నిబిరూ" (NIBIRU). ఈ గ్రహం కొన్ని వేల సంవత్సారాల క్రితం భూమికి అతి దగ్గరగా వెడుతూ ఆ గ్రహంలో ఉన్న కొంతమందిని భూమి మీద పడేసేరట. ఫురాతన సిధిలాల పై ఈ విషయం గురించి విరివిగా రాయబడిందని, వాటి ఆధారంగానే తాను ఇలా చెప్ప గలుగుతున్నానని ఆయన రాసేరు.

ఇదే చివరిసారిగా ఈ విషయం గురించి తాను రాస్తున్నట్లు తెలుపుతూ, తాను చెబుతున్నది నిజమో కాదో తెలుసుకోవటానికి 4500 సంవత్సారల క్రితం చనిపోయిన సుమేరియన్ ఆడ మనిషి (పౌబి)శరీర డి.ఎన్.ఏ ను మనుష్యుల డి.ఎన్.ఏ తో పోల్చి చూడవలసిందిగా కోరేరు.

లండన్లో ఉన్న నాచురల్ హిస్టరీ మ్యూసియం లో ఈ ఆడ మనిషి శవానికి కి చెందిన మిగులుడు భాగాలను బద్రపరిచి ఉంచేరు. అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో ఆ పౌబీ మనిషి మిగులుడు భాగాల డి.ఎన్.ఏ ను పరిశోదించ వలసినదిగా ఆయన కోరేరు. అలా పరిశిలిస్తే తాను చెప్పేది నిజమని తెలుస్తుందని సెసారియా సిటిచిన్ తెలిపేరు.
దీనితో పన్నెండవ గ్రహ గురించిన అన్వేషణ మళ్ళీ మోదలైంది.

Thursday, June 17, 2010

రాజనీతిని కాలరాసిన రాజనేతలు

నిజమైన రాజనేతలు (POLITICIANS) వెండితెరపై చూపబడ్డ రాజనీతితో ( POLITICS) పోటీ పడడంతో, ఆ రాజనేతలందరూ కోర్టుకు వెళ్ళవలసి వచ్హేటట్లున్నది. ఎందుకంటే ఆ రాజనేతలందరూ దొంగ సీ.డీ వేసుకుని "రాజ్ నీతి" సినిమాను చూసేరట.

"పైరసీ సీ.డీ లను అంతంచేయవలసిన రాజనేతలే దొంగ సీ.డీ వేసుకుని సినిమా చూడటం సోచనీయం. నేను తీసిన ఈ సినిమాను దొంగ సీ.డీ లో చూసిన ఆ రాజనేతలందరినీ కోర్టులో నిలబెడతాను" అని రాజనీతి సినిమాను తీసిన ప్రకాష్ జా గారు తెలిపేరు.

దొంగ సీ.డీ లో రాజ్ నీతి సినిమాను చూసిన రాజనేతలందరూ రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన బి.జె.పీ ఎం.ఎల్.ఏ లు.....రాజస్తాన్ రాష్ట్రంలో జరగబోయే రాజ్య సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వారు తమ ఎం.ఎల్.ఏ లను డబ్బుతో కొనుక్కోటానికి ప్రయత్నిస్తారనే భయంతో బి.జె.పి ఆ రాష్ట్ర ఎం.ఎల్.ఏ లందరినీ జైపూర్ నగరంలో ఉన్న ఒక ఆధునిక హోటల్ రూములో ఉంచేరు. మరోవిధంగా చెప్పాలంటే బంధించేరు. బంధించిన ఎం.ఎల్.ఏ లకు బోర్ కొట్టకుండా ఉండటానికి వారికి దొంగ సీ.డీ మూలంగా రాజ్ నీతి సినిమా ను చూపించేరు.

రాజ్ నీతి సినిమాను తీసిన ప్రకాష్ జా గారు నిజంగా, ధైర్యంగా వీరందరినీ కోర్టులో నిలబెడతారో లేదో తెలియదు గానీ, ఆయన బీ.జె.పీ కి తలవంపులు తీసుకువచ్హేరు.

ఒక పక్క ఎం.ఎల్.ఏ లను తీసుకుపోయి, హోటల్ రూములో దాచి ప్రజాసామ్య మనే మాటకే ఎదురు దెబ్బ తీసి, ఆ తప్పును కప్పి పుచ్హుకోవటానికి ప్రజలకు ఎన్నో కధలు చెబుతున్న సమయంలో దొంగ సీ.డీ తో సినిమా చూసేరనే విషయం బి.జె.పీ పార్టీకి పెద్ద తలనొప్పి తీసుకు వచ్హింది.

పైరసీ ని అంతంచేయవలసిన రాజకీయ నాయకులే దాన్ని ప్రేరేపించే విధంగా దొంగ సీ.డీ తో సినిమా చూసేరే అని అడిగినదానికి "ఇది చాలా చిన్న విషయం. దీనిని పెద్దది చేయకండి. ఇందులో మా పార్టీ తప్పు గానీ, మా ఎం.ఎల్.ఏ ల తప్పు గానీ ఏమీలేదు. సినిమా చూడాలని ఉంది అని అంటే అక్కడున్న వారు ఆ సీ.డీ ని తీసుకువచ్హె వేసేరు" అని ఒక బి.జె.పీ నేత చెప్పేరు.

ఇలా ఎం.ఎల్.ఏ లను తీసుకుపోయి దాచటం ప్రజాసామ్య విరుద్దమని ఇదివరకు మీరే అన్నారు. మరి ఇప్పుడు మీరే ఆ పనిచేసేరే...మీ ఎం.ఎల్.ఏ ల మీద నమ్మకం లేకనా అని అడిగిన ప్రశ్నకు "మా ఎం.ఎల్.ఏ లను నమ్మకపోవటమనేది లేదు. ఈ సారి ఎన్నికలు గందరగోళంగా ఉన్నాయి. ఎం.ఎల్.ఏ లు ఏ బటన్ నొక్కి ఓటు వేసే విధానంలో వారికి ట్రైనింగ్ ఇవ్వటానికే వారిని హోటల్లో ఉంచేము" అని తెలిపేరు.

"రాజనీతిని కాపాడవలసిన రాజనేతలే దొంగ సీ.డీ తో సినిమా చూడటం పెద్ద తప్పే.. కానీ వారు చూసిన సినిమా, వారందరూ చూడవలసిన సినిమానే" అని ఒక ప్రజా సంక్షేమ సంఘం ప్రతినిధి అన్నారు.

Wednesday, June 16, 2010

ఎక్కువసేపు నిద్రపోవడం ఆరొగ్యానికి హానికరం

పొద్దున్నే నిద్రలేవడమంటే చాలామందికి ఇష్టముండదు. మెలుకువ వచ్హిన వెంటనే పక్కపైనుండి లేవడానికి కూడా ఇష్టముండదు. కొంతసేపైనా పక్కమీద అటూ ఇటూ దొర్లితేనే నిద్రపోయేమనే అనుభూతి కలుగుతుంది. అలా కాకుండా మీరు కొంచం ఎక్కువసేపు నిద్రపోతుంటే, మీ అలవాటును ఖచ్హితంగా మార్చుకోవాలి.

నిద్రలేమి గురించి, దాని వలన మన ఆరొగ్యానికి ఏర్పడే హాని గురించి మనందరికీ తెలుసు. అలాగే ఎక్కువసేపు నిద్రపోవడం వలన కూడా మన ఆరొగ్యానికి హాని కలుగుతుందట. రోజుకు 6-8 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయేవారు, వారి జీవితకాలాన్ని 17 శాతం తగ్గించుకుంటున్నారని పరిశోధనలు తెలుపుతున్నాయి.

ఎక్కువసేపు నిద్ర పోవటం వలన సుగర్, బ్లడ్ ప్రషర్, మైగ్రేన్, గుండె జబ్బులు (హార్ట్ అటాక్ లాంటివి) మరియూ శరీరంలో హార్మోన్స్ ఎక్కువవటం జరుగుతుందని ముంబైకు చెందిన జెనెరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ ప్రకాష్ లుల్లా చెబుతున్నారు.

ఎక్కువసేపు నిద్రపోవటం వలన వచ్హే సహజమైన వ్యాధులు ఒబిసిటీ, అలసట, చికాకు మరియూ నీరసం అని ముంబైకు చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ సునీతా దూబే అంటున్నారు.

నిజం చెప్పాలంటే నిద్ర వలన నష్టం ఏమీ లేదు. కానీ ఎక్కువసేపు నిద్రపోవటానికి కొన్ని సామాన్య సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలవలనే ఎక్కువసేపు నిద్రపోతారట.

ఎక్కువసేపు నిద్రపోయేవారిలో 15 శాతం డిప్రెషన్ తో బాధ పడుతూ ఉంటారు. అదేలాగా క్చోభ, మనోఘాతం మరియూ ఒత్తిడి వలన కూడా ఎక్కువసేపు నిద్ర పడుతుందట. వీటిలో చాలా వరకు మనకు తెలియకుండానే జరుగుతుందట.

ఎక్కువసేపు నిద్రపోవటానికి కొన్ని కారణాలు:...1) మీరు చెస్తున్న ఉద్యోగం ఎక్కువసేపు కూర్చునిచేసే ఉద్యోగమా? శరీరానికి వ్యాయామం తక్కువైతే దీనిని సవరించటానికి శరీరం ఎక్కువ నిద్ర కోరుతుందట. కనుక, సమయం లేదనుకోకుండా రోజుకు ఒక గంటసేపు వ్యాయామం చేసి ఈ ప్రాబ్లం నుండి తప్పించుకోండి. 2) ఆరోగ్యమైన ఆహారం తీసుకోకపోవడం వలన కూడా ఎక్కువసేపు నిద్ర పడుతుందట. అలాగే జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నా, జీర్ణం అవడానికి ఎక్కువ సమయం తీసుకునే ఆహారం తీసుకున్నా నిద్రకు భంగం కలుగుతుందట. దీనివలన శరీరం ఎక్కువ నిద్ర కోరుకుంటుందట. మీ డయట్ స్టైల్ ను మారిస్తే ఈ ప్రాబ్లం నుండి తప్పించుకోవచ్హు. 3) సిగిరెట్లు మరియూ ఆల్కహాల్ తీసుకోవటం వలన కూడా ఎక్కువసేపు నిద్ర వస్తుందట. వీటి అలవాట్లను మానేస్తే సరిపోతుందట. 4) ఆరోగ్య లోపం ఉన్నా కూడా ఎక్కువసేపు నిద్రపోతారట. తైరాయడ్, నరాల బలహీనత మరియూ జీర్ణ శక్తి లోపం లాంటివి ఉన్నా నిద్ర ఎక్కువ పడుతుందట.

రోజుకు 7 గంటల సేపు నిద్రపోతే చాలుట. ఆలారం పెట్టుకుని లేవటం అలవాటు చేసుకోవాలి. కొన్ని రోజుల తరువాత మన శరీరం 7 గంటల నిద్రకు అలవాటు పడుతుందట. అలాగే అలవాట్లను మార్చుకుంటే చాలా మంచి జరుగుతుందట. అవసరమనుకుంటే సైకలజిస్ట్ ను కలవాలి.

తల్లితండ్రులను గౌరవించటానికి చట్టాలు అవసరమా?

కన్న తల్లితండ్రులను గౌరవిస్తూ, వారికి ప్రేమను అందిస్తూ, వారి ఆయిస్సు ముగిసేదాకా వారిని చూసుకోవటం బిడ్డల బాధ్యత కాదా? దీనికి చట్టాలు అవసరమా? న్యాయస్థానం ఆదేశిస్తేగానీ బిడ్డలు తల్లితండ్రులను చూసుకోరా? ఈ వ్యవస్థ మన నాగరికతలోకి ఎప్పుడు వచ్హింది? ఏలా వచ్హింది? దీనికి కారకులెవ్వరు?...ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు చాలామందికి జవాబు దొరకటంలేదు.

ఎక్కడో, ఎవరో కొంతమంది బిడ్డలు తమ తల్లితండ్రులను అగౌరవపరచి,చీదరించుకుని, బాధపెట్టి చివరికి వారిని అనాధలు చేస్తున్నారని అనుకుంటున్నాము. కానీ మన అంచనా తప్పని...మొత్త వ్యవస్థలోనే మార్పు వచ్హిందని ఒక సర్వే రిపోర్ట్ మూలం గా తెలిసింది. ఎవెర్నో కొందరిని న్యాయస్థానాలు శాసించవచ్హునెమోగానీ, ఈ వ్యవస్థనే మార్చాలంటే అది న్యాయస్థానాల వలన, చట్టాలవలన కుదరదు. ప్రతి మనిషిలోనూ వ్యక్తిగతంగా మార్పు వస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది.

పెద్దలను అగౌరవ పరచటం గురించి ఎత్తిచూపే ప్రపంచ దినంగా ప్రకటించబడ్డ నిన్నటి దినాన భారతదేశంలో పెద్దలను ఎలా అగౌరవ పరుస్తున్నారో, దానిని ఎలా అరికట్టాలో అని అలోచించటానికి ఏర్పాటుచేసిన సదస్సులో "హెల్పేజ్ ఇండియా" (HELPAGE INDIA) వారు తమ సర్వే రిపోర్ట్ ను విడుదలచేసేరు....సర్వే 8 నగరాలలో నిర్వహించేరు.

పెద్దలను...అంటే తల్లితండ్రులను అగౌరవపరచటంలో చెన్నై నివాసులు మొదటి స్థానం వహిస్తున్నారు. (సర్వేలో భోపాల్ నగరం మొదటి స్థానం వహిస్తున్నా ఆ నగరంలోని పరిస్తితులను అంచనా వేసుకుని ఆ నగరాన్ని లెక్కలలోకి తీసుకోలేదు). చెన్నైలో నివసిస్తున్న పెద్దలలో (60 సంవత్సరములు పైబడినవారు) 56 శాతం తమ పిల్లలతో నివసించటంలేదని తెలిపేరు.71 శాతం పెద్దలు, పిల్లలు తమల్ని గౌరవించటంలేదని తెలిపేరు.23 శాతం పెద్దలు తమల్ని తిట్లతో అగౌరవపరుస్తున్నారని తెలిపెరు. 4 శాతం పెద్దలు, పిల్లలు తమల్ని శరీరకంగా బాధపెడుతున్నారని చెప్పేరు.

ఈ విషయంలో డిల్లీ నగరం చివరి స్థానం వహిస్తోంది. కలకత్తా నగరంలోని పెద్దలు ఎక్కువ శారీరక బాధలు అనుభవిస్తున్నారట. చాలా నగరాలలో పెద్దలు ఆర్ధీకంగా తమ పిల్లపై ఆధారపడుతున్నందు వలనే అగౌరవ పరచబడుతున్నారని చెబుతున్నారు.

పెద్దలను అగౌరవపరిచేవారిలో ఇంటి కోడల్లు మొదటి స్థానం లోనూ, కొడుకులు రెండవ స్థానం లోనూ, కూతుళ్ళు మూడవ స్థానంలోనూ ఉన్నారట.

చెన్నై నగరంలో ఉన్న పెద్దలకు తమ హక్కుల గురించి, చట్టాల గురించి ఎక్కువ తెలిసున్నా 80 శాతం పెద్దలు తమ పిల్లల్ని కొర్టుకెక్కించడానికి ఇష్టపడటంలేదట. 66 శాతం పెద్దలు పోలీస్ కంప్లైంట్స్, కోర్టుల సహకారం పిల్లలో నిజమైన మార్పును తీసుకురావని చెబుతున్నారు.

నిజమే, మనసులో లేని ప్రేమను శాసించి తీసుకువస్తే అందులో ఆనందముండదు. చట్టాల మూలంగా పెద్దలను ఆర్ధీక ఇబ్బందులనుండి తొలగించవచ్హునేమో కానీ మానసిక ఇబ్బందుల నుండి తొలగించలేము......కని, పెంచి, పెద్దచేసిన తల్లితండ్రులను చూసుకోవాలనే కనీస ధర్మానికి కూడా చట్టంతో పనిపడిందంటే అది సిగ్గుచేటు.

కాబట్టి వ్యవస్థలో మార్పు రావాలి. ఎప్పుడో బాట తప్పిన వ్యవస్థను తిరిగి సరైన బాటకు తీసుకు రావాలి. అది ఈ నాటి యువత దగ్గిరే ఉన్నది. ఇప్పుడున్న యువత రాబోవు కాలంలో పెద్దలవుతారు. ఇదే పరిస్థితిని తమ పిల్లల నుండి ఎదుర్కొంటరనే విషయాన్ని గుర్తుంచుకుని ఈ రోజు తమ పెద్దలకు గౌరవమిస్తూ, ప్రేమను చూపిస్తూ ఆదరిస్తే వీరి పిల్లలు కూడా వీరు పెద్దవారైనప్పుడు వీరిని ప్రేమిస్తూ గౌరవిస్తారని, కాబట్టి వీరు బాధలకు లోనవకుండా, చట్టలను ఉపయోగించ కుండా, న్యాయస్థానాలకు వెళ్ళకుండా ఆనందంగా జీవితం గడపవచ్హునని నా నమ్మకం.

Tuesday, June 15, 2010

రంగులతో జబ్బులు నయం!

రంగులు మన మనోభావాలను మారుస్తుందంటారు. ఈ విషయాన్ని మనం చాలాసార్లు వినే ఉంటాం.....అలాగే రంగులకు జబ్బులను నయం చేసే గుణం కూడా ఉందని చెబుతున్నారు.

తెలుగులో ఎలాచెబుతారో తెలియదు గానీ, ఆంగ్లంలో మాత్రం ఒక మనిషి ఎలాంటి మనోభావంలో ఉన్నారో వివరిస్తూ ఉంటారు. మీరందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు."హీ ఈస్ ఫీలింగ్ బ్లూ టుడే"(He is feeling blue today) , "ఐ టుర్నెడ్ గ్రీన్ విత్ ఎన్వీ"(I turned green with envy) మరియూ "షీ షా రెడ్" (She saw red) లాంటివి. ఇంతేకాకుండా రంగులు మనుష్యులలో మనోభావాలను పెంచటమో, మార్చటమో చేస్తుందట.

రంగులకూ, మనోభావాలకూ చాలా దగ్గర సంబంధం ఉన్నదని చెప్పటంలో అతిసయోక్తి లేదని నిపుణులు చెబుతున్నారు......క్రోమో తెరాపీ లేక కలర్ తెరాపీ అనేది కొత్తగా వచ్హింది కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాల నుండి, అంటే పురాతన గ్రీక్ మరియూ గ్రీస్ నాగరికత కాలం నుండి వస్తున్నదట. ఆ రోజుల్లో జబ్బులు నయం కావటానికి మనుష్యులను రకరకాల రంగులు పూయబడ్డ తలుపులూ మరియూ కిటికీలూ ఉన్న రూములలో ఉంచేవారట.

భారతదేశంలో కూడా మానవ శరీరంలో ఉన్న ఏడు చక్రాలకూ ఏడు రంగులను కేటాయించి, శరీరంలో మార్పులు తీసుకువచ్హేవారని పురాతణ చరిత్ర చెబుతోంది.

"మనం ప్రతిరోజూ రంగులను చూస్తూ ఉంటాము. ప్రొద్దున లేచిన దగ్గరనుడి నిద్రపోయేవరకు రంగుల కలయిక చూస్తూ ఉంటాము.చాలాసార్లు మనం మనల్ని రంగులతో అలంకరించుకుంటాము.డ్రెస్ చేసుకునే దగ్గర నుండి, నిద్రపోయే దుప్పటిదాకా మనకు నచ్హిన రంగులనే వాడతాము. రంగులు మనకు తెలియకుండానే మనలో అహ్లాదాన్ని తీసుకు వస్తుంది. ఇది మనలో ఉన్న మానసిక ఒత్తిడులను తగ్గించి మనకు మంచి చేస్తుంది" అని రంగు తెరాపీలో నిపుణులైన ఒకరు తెలిపేరు.

కలర్ తెరాపీ ఒక మంత్రం మీద పనిచేస్తుంది. రంగు సూర్యరస్మి (వెలుతురు) పడిన వెంటనే గాలిలో ఒక కదలికను రేపుతుంది. ఆ కదలికలోని స్పంధనలు మనిషిలో శక్తిని ప్రేరేపిస్తుందని మరొక నిపుణులు తెలిపేరు.

కనుక మీకు ఏ రంగు ఇష్టమో ఆ రంగుకే ఇష్టపడండి. ఇంకెవెరో చెప్పేరు కదా అని మీకు ఇష్టమైన రంగును మార్చుకోకండి. అలాగే మీ పిల్లలు అడిగే రంగులనే కొనివ్వండి. అది బట్టలైనా సరే.....బొమ్మలైనా సరే.

Monday, June 14, 2010

ఫీఫా (FIFA) ప్రపంచ కప్ మ్యాచ్ లకూ...భారతదేశానికి సంబంధం ఉన్నదా? ఉన్నది

సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న ప్రపంచ ఫుట్ బాల్ (FOOTBALL) కప్ మ్యాచ్ లలో భారత ఫుట్బాల్ జట్టులేదు. అందువలన ప్రపంచ కప్పు ఎవరు గెలుస్తారన్న ఆదుర్దా, మనమే గెలవాలన్న ఆశ మనలో చాలామందికి ఉండదు. మన జట్టులేకపోయినా, క్రికెట్ ఆటను చూసినట్లు, ఫుట్బాల్ మ్యాచ్ లను ఆత్రుత, సంతోషంతో చూసేవారు తక్కువ. అదేలాగా క్రికెట్ మ్యాచ్ల గురించి పత్రికలలో చదివేలాగా, ఫుట్బాల్ మ్యాచ్ల గురించి అంత ఇంటెరెస్ట్ గా చదివేవారు కూడా తక్కువనే చెప్పాలి.

కానీ ఈ విషయం గురించి అందరూ తెలుసుకోవాలి. అదే, ఫీఫా ప్రపంచ ఆటలకూ, కప్పుకూ మన దేశానికీ ఉన్న సంబంధం గురించి తెలుసుకోవాలి..........ఈ ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ మ్యాచ్ లలో ఉపయోగించే బంతులు (ఫుట్ బాల్స్) విదేశీయలలో ఉన్న అడిదాస్ కంపెనీవారు తయారు చేస్తున్నా, ఆ బంతుల తయారీకి ఉపయోగించే రబ్బర్ మనదేశం నుండి వెలుతున్నది. కేరళాలో ఉన్న రబ్బర్ ప్లాంటేషన్స్ నుండి వెడుతున్నది.

ఈ బాల్స్ ని " జబులని బాల్స్" (JABULANI) అంటారు. 100 బాల్స్ తయారుచేడానికి 7 కిలోల రబ్బర్ అవసరమౌతుంది........ఈ రబ్బర్ ను ఉపయోగించి లాటెక్స్ (LATEX) బ్లాడర్ లను డిల్లీ లో ఉన్న ఒక కంపెనీ తయారుచేస్తోంది. ఈ లాటిక్స్ బ్లాడర్లు ఫుట్ బాల్ ఆకారాన్నీ, వేగాన్నీ మరియూ ఎగిరే ప్రభావాన్నీ ఏర్పరుస్తుంది. ఆ తరువాత ఈ లాటెక్స్ బ్లాడర్లను అడిదాస్ కంపెనీకి పంపిస్తారు. అడిదాస్ లో ఈ లాటెక్స్ బ్లాడర్లకు కవర్ వేసి, పైన లైనింగ్ వేసి అ తరువాత వారి ముద్రలు వేసి పంపిస్తారు. ఇప్పటిదాకా 12 ట్రక్ లోడ్ల లాటెక్స్ పంపించేరట.

మనదేశం ప్రపంచ ఫుట్బాల్ కప్ లో ఆడకపోయినా, అక్కడ మంచి మంచి కిక్కులనిస్తున్నది మనదేశమే.

Saturday, June 12, 2010

తుపాకులున్న దేశాలకంటే నూకలున్న(ఆహారపదార్ధాలు )దేశాలకే భవిష్యత్తు బాగుంటుంది

పెట్రోల్, డీజల్ మరియూ వంట గ్యాస్ ధరలను ఎంత పెంచాలో నిర్ణయించటానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ అతి త్వరలో వీటి ధరలు ఎంతవరకు పెంచవచ్హో కేంద్రానికి తెలియపరుస్తారు. వీరి సలహామేరకు వీటి ధరలను పెంచుతారు.

వీటి ధరలు పెరిగినవెంటనే అన్ని రకాల వస్తువుల ధరలూ పెరుగుతాయి. ముఖ్యంగా ఆహారపదార్ధాల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే వీటి ధర ఆకాశాన్నంటుతూ సాదారణ మానవులకు భారంగా ఉంటున్నాయి......ఎలాగైతే పెట్రోలియం ప్రాడక్ట్ ల ధరలను పెంచడానికి కమిటీని ఏర్పాటు చేసి, వాటిపై నిర్ణయాలు తీసుకుంటున్నారో, అలాగే ఆహారపదార్ధాల పెరుగుదలకు పధకాలు వేయడానికి కమిటీలను ఏర్పరచాలి. ఈ కమిటీ ఆహారపదార్ధాల పెరుగుదలకు వ్యవసాయ రంగానికి రాబోవు రుతుపవనాల వర్షం నీరు పూర్తిగా ఉపయోగపడేలాగా నీటి పారుదలకు పధకాలు వేసి, ఆ పధకాలను ఖచ్హితంగా నెరవేర్చి ఈ రెండు రంగాలలోనూ కనీసం 5 శాతం పెరుగుదలకు ప్రయత్నించాలి.

వ్యవసాయరంగానికి మంచి పధకాలు వేసి, వాటిని నెరవేర్చి ఉంటే పోయిన ఏడాది మన దేశానికి ఆహారపదార్ధాల కొరత వచ్హి ఉండేది కాదు. ఆహారపదార్ధాల ధరలు ఆకాశాన్నంటి ఉండేవి కావు. అందులోనూ వాతావరన మార్పిడికి అనుగుణంగా మనం పధకాలను వేసుంటే మనదేశం మరింత పురోగతి చెంది ఉండేది.

కాబట్టి మనదేశం వెంటనే ఈ రంగాల అభివ్రుద్దికి కావాలసిన పధకాలువేసి ఈ రంగంలో టెక్నాలజీ మీద ద్రుష్టిని కేటాయించాలి. మనదేశంలో ఉన్న 128 వ్యవసాయరంగ మండలాలలు అభివ్రుద్దిచేయాలి.

తుపాకులు చాలా తేలికగా కొనుక్కోవచ్హు.ఎవరు పడితే వారు అమ్ముతారు. కానీ ఆహారపదార్ధాలను అమ్మటంలేదు. ఎందుకంటే ఏ దేశానికీ ఆహారపదార్ధాల నిలువలు సరిగ్గాలేవు. మనదేశమే ఈ విషయంలో కొంత మెరుగ్గా ఉన్నది. కానీ పోయిన సంవత్సరం మనంకూడా ఇబ్బంది పడ్డాము. దీనివలన ఆహారపదార్ధాల ధరలు పెరిగినై........ఏ దేశమూ ఈ రంగాన్ని అభివ్రుద్ది చేసుకోవటంలో సరైన మార్గాలను ఎన్నుకోలేదు. వాతావరన మార్పిడివలన వ్యవసాయ రంగంలో ఏర్పడే మార్పులను తక్కువ అంచనావేసేరు. అందువలన అనేకదేశాలు ఆహారపదార్ధాల కొరతతో బాధపడుతున్నాయి. ఆయుధాల ఉత్పత్తిలో ఎంతో అభివ్రుద్ది సంపాదించేరు. ఆధునిక ఆయుధాలతో దేశం అభివ్రుద్ది చెందిందని భావిస్తున్నారు.

ఈ భావం తప్పు. ఎప్పుడో జరగబోవు యుద్దాలలో తమదేశం ముందుండాలని అనుకుంటున్నారుగానీ ఏ రోజుకారోజు అవసరమయ్యే ఆహారపదార్ధాల గురించి అలోచించలేదు. యుద్దాలు జరుగుతాయో లేవో తెలియదు. జరిగినా ఆధునిక ఆయుధాలు వాడతారో లేదో తెలియదు. ఇలా తెలియని వాటి మీద రీసెర్చ్ లు చేసి, ఖర్చులు పెట్టటంకంటే ఆహారపదార్ధాల విషయంలో రీసెర్చ్ చేసి, ఖర్చులు చేసుంటే, అది వారిని గొప్పదేశంగా తయారు చేసేదని ప్రక్యాతిగాంచిన, ప్రముక వ్యవసాయరంగ శాస్త్రవేత్త, రాజ్య సభ మెంబర్ ఎం.ఎస్. స్వామినాదన్ తెలిపేరు.

Thursday, June 10, 2010

స్వామి నిత్యానందా సన్యాసి కాదు

స్వామి నిత్యానందా సన్యాసి కాదని, ఆయనెప్పుడూ తనను సన్యాసి అని చెప్పుకోలేదని ఆయన తరపు న్యాయవాది బి.వి.అచార్యా నిన్న బెంగళూర్ హై కోర్ట్ లో స్వామి నిత్యానందా బైలు పిటీషన్ మీద వాదనలో న్యాయమూర్తి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పేరు.

"సన్యాసి అని చెప్పుకుంటూ నిత్యానందా తన కారులో ఎలా ఒక స్త్రీ ని తీసుకు వెళ్ళవచ్హు" అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు నిత్యానందా తరపు న్యాయవాది పై విధముగా తెలిపేరు.

"కొన్ని ఆశ్రమాలు గ్రుహస్తాశ్రమ (కుటుంబ జీవిత)విధుల ప్రకారం నడుపుతారు. అలా గుహస్తాశ్రమ విధుల ప్రకారమే తన ఆశ్రమాన్ని స్వామి నిత్యానందా నడిపేరు. నిత్యానందా అందరిలాగా ఒక సాధారణ మనిషి. ఆయన అధ్యాత్మిక అంశాలను ప్రచారంచేసే బోధకుడు మాత్రమే . కాబట్టి ఆయన మీద వేసిన కేసును సాధారణ కేసుగానే తీసుకుని విచారించాలి" అని స్వామి నిత్యానందా తరపు లాయర్ వాదించేరు.

నిత్యానందా మీద ఆయనకు ఎదురుగా ఎటువంటి సాక్ష్యమూ దొరకలేదని , కాబట్టి ఇంక మీదట పోలీసుల విచారణకు ఆయన అవసరంలేదని ప్రభుత్వ తరపు లాయర్ తెలిపేరు.

స్వామి నిత్యానందా తమిళ నటితో సన్నిహితంగా ఉన్నట్లు చూపిని వీడియో సీ.డీ నిజందికాదని, అది తయారుచేయబడిందని, అదేలాగా ఆ సీ.డీ లో నిత్యానందా ఫొటోని జోడించటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని నిత్యానందా తరపు లాయర్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించేరు. "అవును, 3 ఇడియట్స్ సినిమాలో నటుడు అమీర్ కాన్ తన మాటలని జేర్చటం అటువంటిదే" అని ఉదాహరణగా చెప్పేరు.

ఆ తరువాత సి.ఐ.డి వారినుద్దేసించి "నిత్యానందా మీద కేసు నిరూపించటానికి మీకు ఇంకా ఎన్నిరోజులు కావాలి. ఆయన మీద రుజువులు సంపాదించకుండా ఈ కేసు ఎలా నడుపుదామని అనుకుంటున్నారు" అని న్యాయమూర్తి అడిగినప్పుడు "మేము నిత్యానందా మీద ఐ.పి.సి సెక్షన్ 295 ఏ ( ఇతరుల మత నమ్మకాలని వమ్ముచేసే విధంగా నడుచుకోవటం) కింద నేరం నమోదు చేసేము...ఆ సెక్షన్ కింద మేము కేసు విచారణ జరుపుతున్నాము" అని సి.ఐ.డి వారు తెలిపేరు.

స్వామి నిత్యానందా గత 50 రోజులుగా జైలులో ఉన్నారు కనుక ఈ కోర్టు ఆయనకు బైలు మంజూరు చేయవచ్హు అని నిత్యానందా తరపు లాయర్ కోర్టు ను అడిగేరు. కోర్ట్ తీర్పు రేపు వెలువడనుంది.

సౌర తుఫాన (SOLAR STORM) వలన 2013 లో భూమికి ఆపద..!? (వీడియో చూడండి)

ఏదో ఒకరోజు ప్రక్రుతీ వైపరీత్యాల వలన భూమి నాసనమైపోతుందనో, అంతమైపోతుందనో మీరు నమ్ముతున్నారా? పెద్ద పెద్ద భూకంపాలూ,అగ్నిపర్వత పేళుల్లు, పెను తుఫానలూ, ఉప్పెనలూ, సునామీలూ మరియూ వాతావరన మార్పిడి లాంటివి ఏర్పడి భూమిని నాసనం చేసి చివరికి అంతంచేస్తాయని నమ్ముతున్నారా?.

భూమికి ఇప్పుడు కొత్తగా ఒక బెదిరింపు వచ్హింది. 2013 లో భూమికి ఒక పెద్ద ఆపద ఉందట. ఈ ఆపదవలన భూమి స్థంభించి పోయి,ధ్వంశమైపోతుందని హెచ్హరిస్తున్నారు.

నాసా వారు వెలువడించిన ఒక ప్రకటనలో సూర్య గ్రహంలో ఏర్పడబోయే ఒక పెద్ద తుఫాన అగ్నిని కక్కుతూ భూమికీ అంతరిక్షానికీ మధ్య ఒక దుమారం లేపుతుందట. ఇది మానవులకు కొత్త విషయముగానూ, చరిత్రగానూ మిగిలిపోతుందట.

ఒక సౌర తుఫాన విపరీతమైన అగ్నిని కక్కుతూ, అగ్ని ముక్కలతో, ధ్వంశంచేసే ఉష్నోగ్రతతో అంతరిక్షంలోకి వస్తుందట. ఈ అగ్ని ముక్కలకూ, ఉష్ణోగ్రతకూ అయిస్కాంత శక్తి ఉండటంవలన అంతరిక్షంలో ఉన్న మన ఉపగ్రహాలకూ(SATELLITES), అంతరిక్ష నౌకలకూ (SPACE STATIONS) పెద్ద నష్టం ఏర్పడుతుందట.

1859 లో ఒకసారి సూర్యగ్రహం నుండి వచ్హిన ఉష్ణజ్వాల భూమిపై నుండి వెళ్ళినందువలన భూఆకర్శనలో ధుమారం ఏర్పడిందట. ఈ ధుమారంవలన టెలిగ్రాఫ్ వైర్లు తెగిపోయి కొన్నివేల ఇళ్ళు తగలబడిపోయినాయట. హవాయ్ నగరం మీద ఒక పెద్ద కాంతి ఏర్పడిందట. ఆ కాంతి వెలుగు ఎలా ఉందంటే, ఆ వెలుగులో అక్కడి ప్రజలు దినపత్రికలు చదువుకోగలిగినంత కాంతిగా ఉందట. 2013 మే నెల ఇదేలాగా (అంటే 1859 లో లాగా) సూర్యగ్రహం నుండి ఉష్ణజ్వాలా తుఫాన ఏర్పడుతుందని నాసాలోని శాస్త్రవేత్తలు తెలియజేసేరు.

హై-టెక్నోలాజికల్ సిస్టంస్ ఇప్పుడు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఈ రోజు మనందరం పూర్తిగా దీనిమీదే ఆధారపడియున్నాము. దీనివలనే మన జీవితాలు నడుస్తున్నాయని చెప్పవచ్హు. విమాన ప్రయాణాలూ,జీ.పీ.ఎస్ నావిగేషన్స్, బ్యాంక్ పనులు (క్రెడిట్ కార్డులు ఉపయోగించుకోవటానికి కూడా సెటిలైట్స్ అవసరం) అత్యావసర సమాచారా పంపినీ విధానాలూ, మొబైల్స్, డిష్ టీవీలు, ఇంటెర్ నెట్...ఇలా ఎన్నెన్నోవాటిని మనం సెటిలైట్స్ మూలంగా ఉపయోగిస్తున్నాము. ఇవన్నీ ఒక్కాసారిగా నిలిచిపోయి మనల్ని స్థంభింపజేస్తాయి.

అయితే ఈ హెచ్హరికవలన కొంత మంచి జరగవచ్హు. సెటిలైట్లనూ, ట్రాన్స్ ఫార్మర్స్ నూ "సేఫ్ మోడ్" లో పెట్టే టెక్నాలజీ మనదగ్గర ఉన్నది. దీనివలన కొంత మేలు జరగవచ్హు......నాసా వారి హీలియో ఫిసిక్స్ రీసెర్చ్ సెటిలైట్ సూర్యగ్రహంలో ఏర్పడుతున్న మార్పులనూ, అక్కడ ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు మనకు సమాచారం అందిస్తుంది కనుక ఈ సౌర తుఫాన గురించి మనం ఎక్కువ తెలుసుకోవచ్హు.

ఈ క్రింది వీడియోలో ఆ సౌర తుఫాన గురించి వివరించేరు....... చూడండి….వినండి.


Wednesday, June 9, 2010

భోపాల్ గ్యాస్ ట్రాజడీ లో ముఖ్య నిందితుడు ఆండెర్ సెన్ ను ఎవరు తప్పించేరు?

వారెన్ ఆండెర్ సెన్, అప్పటి యూనియన్ కార్బైడ్ చైర్మన్ 1984 డిసెంబర్ 7 వ తారీఖున (భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగిన 5 రోజుల తరువాత) భారతదేశం వచ్హేరు. విమానం దిగిన కొన్ని గంటలలోనే ఆయన్ను ఖైదు చేసేరు.

అయితే కొన్ని క్షణాలలోనే మధ్యప్రదేశ్ ప్రబుత్వానికి చెందిన కొంతమంది అధికారులు ఖైదు చేయబడ్డ ఆయన్ని తీసుకుని ఒక న్యాయమూర్తి దగ్గరకు తీసుకువెళ్ళి బైల్ మంజూరు చేయించి, రాష్ట్ర ప్రబుత్వానికి సొంతమైన విమానంలో ఆయన్ని డిల్లీ పాలం విమానాశ్రయానికి తీసుకువెళ్ళి దగ్గరుండి ఆయన్ని అమెరికా వెళ్ళే విమానం ఎక్కించి భారతదేశాన్ని దాటించేరు.

ఆ రోజున మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రబుత్వం పరిపాలిస్తోంది. విచారణలో, అప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్, ఆండెర్ సెన్ తప్పించుకుపోవటానికి అన్ని ఏర్పాట్లూ చేసి సహాయపడ్డారట. అయితే ఈ విషయంలో డిల్లీలోని ప్రదానమంత్రి కార్యాలయం నుండి ఫోన్ వచ్హిందని, ఆ ఫోన్ చేసిన వారు ఏమి చేయమన్నారో ఎలా చేయమన్నారో అదే చేసేరని చెబుతున్నారు.

ఇప్పుడు అనారోగ్యంతో బాధ పడుతున్న అర్జున్ సింగ్ కు 81 సంవత్సరాలు. ఈ విషయం గురించి ఆయన్ని పత్రికా విలేకర్లు అడిగితే ఆయన మౌనం వహిస్తున్నారుగానీ ఏమీ చెప్పటంలేదు. అయితే, తీర్పు వెలువడిన వెంటనే అనారోగ్యంతో ఉన్నా ఈయన సోనియా గాంధీని కలుసుకున్నారట. అర్జున్ సింగ్ గారి ఆఫీసులో ఉన్న కొంతమంది ఆ ఫోన్ కాల్ పి.ఎం.ఓ ఆఫీసు నుండి రాలేదని, హోం శాఖ ఆఫీస్ నుండి వచ్హిందని చెబుతున్నారు.

ఇంతే కాక, మాజీ చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా ఏ.హ్చ్. అహమదియా తమ బెంచ్ కు వచ్హిన భోపాల్ గ్యాస్ ట్రాజడీ కేసులో అందరి నిందితుల మీద సెక్షన్ 304/2 లో కేసు నమోదై ఉంటే, ఆ కేసులన్నింటినీ రెండేళ్ళ జైలు సిక్ష సెక్షన్ లోకి ఉద్దేశపూర్వంగానే మార్చేరట. దీని గురించి కాంగ్రెస్ ను అడిగితే మౌనంగా ఉన్నారు.

భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి, ఆ కేసు గురించీ విచారించటానికీ, పర్యవేక్చించటానికీ మరియూ అవసరమైన నిర్ణయాలు తీసుకోవటానికీ అప్పటి కేంద్ర ప్రబుత్వమైన కాంగ్రెస్ పార్టీ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ను ఏర్పాటుచేసింది. ఈ 19 సంవత్సరాలలో 17 సార్లు కలుసుకున్న ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బ్రుందం ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో తెలియదు.

భొపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రబుత్వం ఉన్నది......తీర్పు వచ్హినప్పుడూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రబుత్వమే ఉన్నది. కనుక కాంగ్రెస్ నాయకులకు ఈ కేసుతో సంబంధమున్నదని...వారే దీనికి బాధ్యులని, వారే దీనికి సమాదానం చెప్పాలని భోపాల్ గ్యాస్ లీక్ బాధితులు అభిప్రాయపడుతున్నారు.

ఆరొగ్యం మీద అతి శ్రద్ద తీసుకోవటం అపాయకరం

ఎవరైనా తమ ఆరొగ్యం మీద అతి శ్రద్ద తీసుకుంటే, అదే వారిని అనారొగ్యానికి దగ్గర చేస్తుందట. ఇలాచెబితే అది చాలామందికి నమ్మకానివ్వదు. అందులోనూ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో దీనిని నమ్మటం చాలా కష్టం.

మనం తీసుకునే ట్రీట్ మెంట్స్ లో చాలావరకు (అంటే సుమారు ముప్పాతిక బాగం) అనవసరమైనవని చెబుతున్నారు. ఈ అనవసరమైన ట్రీట్ మెంట్స్ వలన డబ్బు ఖర్చు అవటం మాత్రమే కాకుండా, వాటివలన హానికరమైన సైడ్ ఎఫ్ఫెక్ ట్స్ వస్తాయట.

ఇది పుట్టుకతోనే మొదలవుతోందట. ఒక స్త్రీ గర్భం దాల్చిన వెంటనే, గర్భం లోని శిశువు ఎలా ఉన్నది, ఎలా పెరుగుతున్నది తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలతో అనవసరమైన ట్రీట్ మెంట్స్ మొదలవుతున్నాయట. అన్ని టెస్ట్ లలోనూ గర్భం లో ఉన్న శిశువు బాగుంది అని తెలుస్తున్నా ప్రసవం సిసేరియన్ ఆపరేషన్ తో ప్రారంభం అవుతోందట. ఇలా గర్భంలో ఉన్నప్పుడే మెడికల్ రేడియో ఆక్టివ్ రేడియేషన్లకు మన శరీరాలు ఎక్స్ పోస్ (EXPOSE) అవుతున్నాయట. పెరుగుతున్న కొద్దీ మరిన్ని అనవసరమైన మెడికల్ రేడియేషన్లకు గురైతే అది చివరికి మనల్ని ఐ.సీ.యూ (ICU) లో జేరుస్తుందట.

ప్రస్తుతం చాలామంది ప్రతి చిన్న విషయానికీ సీ.టీ స్కాన్ లు చేయించుకుంటున్నారట. ఎక్కువ సార్లు సీ.టీ (CT)స్కాన్లు చేయించుకుంటే దానివలన క్యాన్సర్ వ్యాధి వచ్హే అవకాసాలు ఉన్నాయట.

అదేలాగా చాలామంది మందులతో తగ్గించుకోవలసిన గుండె జబ్బులకు కూడా ఆపరేషన్లు చేయించుకుంటున్నారట.

డాక్టర్లు జలుబు చేసిన వారికి కూడా కొన్ని వందల రకాల ఆంటీ బైయాటిక్స్ వాడుతున్నారట. జలుబు లాంటి వైరస్ వ్యాధులకు ఆంటీ బైయాటిక్స్ పనిచేయవని తెలిసినా వాటిని వాడుతున్నారట.

అన్నిరకాల చిన్న వ్యాధులలో, నడుం నొప్పికి ఎక్కువగా అనవసరమైన వైద్యం చేయించుకుంటున్నారని తెలిసింది. ఈ వ్యాధికే ఎక్కువగా, ఎక్కువసార్లు ఎం.ఆర్.ఐ (MRI) స్కాన్లు తీస్తూ ఉంటారు. ఎన్ని స్కాన్లు తీసినా నడుం నొప్పికి కచ్హితమైన కారణాలు తెలియవట. అయినా కొంతమందికి స్పైనల్ కార్డ్ లో ఆపరేషన్ చేస్తారు. అలా ఆపరేషన్ చేయించుకున్న 5 గురిలో 1 రు మరో పదేళ్ళ తరువాత ఆపరేషన్ చేయించుకోవలసి వస్తుందట.

ఇలా ఎన్నో విషయాలలో జరుగుతోందని, కనుక ఆరొగ్య విషయములో కావలసిన/ అవసరమైన శ్రద్ద మాత్రమే తీసుకోవాలి కానీ అతి శ్రద్ద తీసుకోకూడదు అని అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ కు చెందిన డా.స్టీవెన్ వెంబెర్జర్ చెబుతున్నారు. ఈయన ఏ ఏ వ్యాధులకు అనవసరమైన శ్రద్దలు తీసుకుంటున్నారో కొన్ని రోజులలో పూర్తిగా తెలియపరుస్తారట.

సాదారన మానవుని ఆరొగ్య ఆందోళనను అనవసరమైన ట్రీట్ మెంట్స్ తో కొంతమంది డాక్టర్లు డబ్బుచేసుకుంటున్నారు. డాక్టర్లు ఏవైనా టెస్ట్ లు, ముఖ్యముగా స్కాన్లు రాస్తే అవి అవసరమా అని ఒకటికి రెండు సార్లు కనుక్కుని తీయించుకోవాలట.

Tuesday, June 8, 2010

వి.ఐ.పీ (VIP) ప్రాణాల సెక్యూరిటీకోసం సామాన్య మనుష్యుల ప్రాణాలతో చెలగాటం

ప్రధానమంత్రి విమాన ప్రయాణం కోసం 7 విమానాలను డిల్లీలో దిగనివ్వలేదు.. డిల్లీ విమానాశ్రయంలో దిగవలసిన వివిధ ఏర్ లైన్స్ కు చెందిన 7 విమానాలను ప్రధానమంత్రి పయనించబోయే విమానం కోసం డిల్లీ నగరంపైనే 50 నిమిషాల వరకూ తిరుగుతూ ఉండమని చెప్పి చివరకు కొన్ని విమానాలని జైపూర్ నగరంలోనూ, కొన్ని విమానాలను అమ్రిత్ సర్ విమానాశ్రయంలోనూ దిగవలసినదిగా ఆదేశించేరట.

కొన్ని రోజుల కిందట వి.ఐ.పీ ల విమానాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా ఉండటానికీ, వారికి సెక్యూరిటీ ఇవ్వవలసిన కారణం వలన డిల్లీలో దిగవలసిన 3 విమానాలను డిల్లీలో దిగనివ్వకుండా వేరే నగరాలకు పంపించేరు. ఈ విమానాలు అద్రుష్ట్ట వసత్తు ఘోర ప్రమాదాల నుండి తప్పించుకున్నాయి. కనీసం 500 మంది మరణం నుండి తప్పించుకున్నారు. ఒక విమానంలో 13 నిమిషాల ఎగురుదల వరకే పెట్రోల్ ఉన్నదట. మరో విమానంలో 8 నిమిషాల వరకే, మూడవ విమానంలో కేవలం 3 నిమిషాల వరకే పెట్రోల్ ఉన్నదట. ఈ మూడు విమానాలూ వేరే విమానాశ్రయంలో దిగటానికి ఏమాత్రం ఆలశ్యం జరిగి ఉన్నా, కొన్నివందలమంది ప్రాణాలు కోల్పోయేవారు.

ఈ సంఘటన ప్రజల మనసుల నుండి మరుగున పడకముందే నిన్న ప్రధానమంత్రి విమానాంకోసం 7 విమానాలను వేరు నగరాలకి తిప్పి పంపటం అందరినీ ఆశ్చర్య పరిచింది. సామాన్య మానవుల ప్రాణాలకంటే వి.ఐ.పీ ప్రాణాలే ముఖ్యమైనవని మరోసారి నిరూపించేరు.

ఈ 7 విమానాలకూ ముందుగానే విషయం తెలిపి ఉంటే, ఆ విమానాలు ఒక గంట ఆలశ్యముగా వచ్హి ఆందోళనకు గురికాకుండా ఉండేవి. అలా ముందుగా తెలుపకుండా, ఆ విమానాలాలో తగినంత పెట్రోల్ ఉందో లేదో తెలుసుకోకుండా వాటిని 50 నిమిషాల వరకూ విమానాశ్రయంలో దిగనివ్వకుండా, డిల్లీ నగరాన్ని చుడుతూ ఉండమని చెప్పడం, ఆ తరువాత వేరే నగరంలో దిగమని చెప్పడం సామాన్య మనుష్యులకు ఈ ప్రబుత్వం ఎంత విలువనిస్తోందో తెలుపుతోంది.

ఇలాచేయడం వలన ఆ విమానాలకు ఒక్కొక్క విమానానికీ 8 లక్షల రూపాయలు (మొత్తం 56 లక్షలు) నష్టం ఏర్పడిందట. "రూపాయల నష్టం కంటే...ప్రయాణీకులకు ప్రాణ నష్టం ఏర్పడుతుందేమోనని మేము ఎక్కువ భయ పడ్డాం" అని విమానాల అధికారులు తెలిపేరు.

సెక్యూరిటీ ప్రాబ్లం వలన వి.ఐ.పీ ప్రయాణాల గురించి ముందుగా వివరాలని అందజేయలేమని చెబుతున్నారు ప్రబుత్వ అధికారులు. అటువంటప్పుడు వి.ఐ.పీ లని చెప్పబడే వారికోసం వేరుగా విమానాశ్రయాలు నిర్మించుకోవాలి గానీ అలా వి.ఐ.పీ ప్రాణాలకు మిగిలిన వారి ప్రాణాలు అడ్డువేయకూడదు.

Monday, June 7, 2010

భోపాల్ విపత్తు ఒక పెద్ద ఘోరం.....కోర్ట్ తీర్పు మరింత ఘోరం

పాతికేళ్ల కిందట, సరిగ్గా 1984 డిసెంబర్ నెల 2-3 తారీఖులలో అత్యంత విషపూరితమైన మెతిల్ ఐసోసయానేట్ వాయువు భోపాల్లో ఉన్న యూనియన్ కార్బైడ్ ప్లాంట్ ట్యాంక్ నుండి లీకేజై దాదాపు 15,000 మందిని పొట్టనపెట్టుకుంది. ఆ వాయువు ప్రభావం వలన కొన్నివేల మంది రకరకాలుగా కోలుకోలేని జబ్బులకు లోనయ్యేరు.

న్యాయం కోసం కోర్టుకెక్కిన భోపాల్ ప్రజలు, 23 సంవత్సరాల పోరాటం తరువాత నిన్న కోర్టు తీర్పు వస్తుందని, వారికి న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురుచూసేరు. కానీ ఈ కేసులో నిందితులకు కోర్టు విధించిన శిక్ష విని తీవ్రమైన నిరాశకు లోనయ్యేరు. ఎందుకంటే ఈ కేసులో 8 మంది నిందితులకు అధికపక్ష శిక్షగా 2 సంవత్సరాల జైలు శిక్ష మాత్రం విధించటమే కాకుండా కేవలం రూ. 25,000/- కే వారికి బైలు మంజూరుచేసి వారిని విడిచిపెట్టేరు. ఈ కేసులో అతి హాశ్యమైన తీర్పు ఏమిటంటే ఆ పరిశ్రమకు అమెరికాలో ఉంటున్న అప్పటి చైర్మాన్ వారెన్ ఆండర్ సన్ కు ఎటువంటి శిక్ష విధించలేదు. ఆయనను పరారీలో ఉన్నట్టుగా తెలియపరిచేరు.

భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ప్లాంట్ సరైన విధులలో కట్టబడలేదని అమెరికాలో ఉన్న యూనియన్ కార్బైడ్ వారికీ, ముఖ్యముగా వారెన్ ఆండర్ సన్ కి తెలుసుననే విషయానికి తగిన ఆధారాలు ఉన్నాయి. అటువంటప్పుడు కేంద్ర ప్రబుత్వం ఎందుకు ఆయన్ని భారతదేశానికి రప్పించే ప్రయత్నం చేయలేదు? న్యాయస్థానంలో హాజరు పరచలేదు? ఈ రెండు ప్రశ్నలూ ప్రశ్నలుగానే మిగిలిపోయేయి.

బాధితులూ, బాధిత కుటుంబాలూ, న్యాయాన్ని ప్రేమించే పలు రంగాలకు చెందినవారూ "మోసం జరిగింది, న్యాయాన్ని చంపేసేరు. మనదేశమే మన ప్రజలకు అన్యాయం చేయటం సిగ్గుచేటు" అని వాపోయేరు. మనదేశానికి చెందిన సి.బి.ఐ విదేశీయదేశాలకు చెందినదిగా ప్రవర్తించింది.

తమను విచారించే అధికారం భోపాల్ కోర్టుకు లేదని అమెరికా కేంద్రంగా గల యూనియన్ కార్బైడ్ సంస్థ ప్రకటించింది. భోపాల్ ప్లాంట్ నిర్వహణలో తమ అధికారులెవ్వరూ లేరని, కాబట్తి ఈ కేసుతో వారికి సంబంధం లేదని తెలిపింది.

కోర్టు తీర్పును బాధితుల తరపు పనిచేసిన కార్యకర్తలు తీవ్రంగా ఖండించేరు. విదేశీయులెవరైనా మన దేశంలోకి వచ్హి, ప్రాణాంతర పరిశ్రమలను నెలకొల్పి, స్థానికులని బలిగొనవచ్హునని ఈ తీర్పు సందేశమిచ్హిందని మండిపడ్డారు.

భోపాల్ గ్యాస్ బాధితులకు న్యాయం అందడంలో చాలా ఆలశ్యమైనదని, ఒకరకంగా వారికి న్యాయ తిరస్కరణ జరిగిందని, న్యాయం సమాధి అయిందనడానికి ఇదో చక్కటి ఉదాహరణ అని మన కేంద్ర న్యాయ శాఖా మంత్రి వీరప్ప మోయిలీ వ్యాఖ్యానించేరు.

ఘోరం జరిగిన రోజుకంటే, తీర్పు వెలువడిన రోజే భారతదేశంలోని నలుమూలలా ఎక్కువ శోకం అలుముకుంది.

వరకట్న చట్టాన్ని దుర్వినియోగం చేయడం చట్టపరమైన తీవ్రవాదం

ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్చన్ 498ఏ (వరకట్న బాధింపు) దుర్వినియోగం చేయబడుతోందని చెబుతున్నవారికి దేశవ్యాప్తాంగా ఆదరణ పెరుగుతోంది.

వరకట్నం వలన బాధింపబడే అబలలకు చట్టరీత్యా రక్షణ కల్పించటానికి ఈ చట్టాన్ని తీసుకువచ్హేరు. కానీ ఈ చట్టాన్ని కొంతమంది వివాహిత మహిళలు బహిరంగంగా దుర్వినియోగం చేస్తున్నారట.

ఈ 498ఏ చట్ట ప్రకారం భార్యని...భర్త గానీ, భర్త యొక్క బంధువులు గానీ వరకట్న కారణాల వలన బాధపెడితే, అలా బాధ పెట్టేవారిని చట్టప్రకారం శిక్చించవచ్హు. ఆ శిక్చ 3 సంవత్సరముల కారాగారా శిక్చ మరియూ జరిమానా గా విధించవచ్హు.

ఈ చట్టాన్ని ఈ మద్య కొంతమంది భార్యలు దుర్వినియోగం చేస్తున్నారని చాలామంది భర్తలూ, చట్ట నిపుణులూ చెబుతున్నారు. వరకట్న వేధింపులో భార్యలు తప్పుచేసిన భర్తనే కాక, భర్త యొక్క తండ్రిని, తల్లిని కూడా పోలీస్ స్టేషన్లకి ఈడుస్తున్నారట. కొన్ని కేసులలో భర్త తరపు చెల్లెల్లనీ, అక్కలని కూడా వారు తప్పుచేయకపోయినా వారిని ఈ సంకటమైన కేసులలో ఇరికిస్తున్నారని చెబుతున్నారు. కొంతమంది భార్యలు వయసు మీరిన తమ తల్లితండ్రుల చావులని కూడా తప్పుగా ఈ కేసులలో ఒక కారణంగా చూపిస్తున్నారట.

ఒక ప్రముఖ దినపత్రిక ఈ విషయముగా కొంతమంది ప్రక్యాత న్యాయవాదులని అడిగితే ఈ చట్టంలో,మరో చిన్న చట్టాన్ని చేర్చాలి. వరకట్న వేదింపు కేసులలో తప్పుడు కేసులు ఇచ్హేవారినీ, తప్పుగా ఎవరినైనా చేర్చేవారిని శిక్చించే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని తెలిపేరట.

"ఈ 498ఏ చట్టం చాలా గొప్పది. ఈ చట్ట ప్రకారం ఖైదు చేయబడ్డవారికి బైలుకూడా ఇవ్వరు. కానీ ఈ మధ్య ఈ చట్టాన్ని విపరీతంగా దుర్వినియోగం చేస్తున్నారు. తప్పు చేసిన భర్త మీద అన్ని సెక్చన్లలోనూ కేసులు నమోదు చేస్తున్నారు" ఒక న్యాయామూర్తి తెలిపేరు.

సుప్రీం కోర్టు ఈ కేసులలో కొన్ని సూచనలు చేయాలి. ఈ సూచనలు, వరకట్న చట్టం వలన బాధింపబడే అమాయకపు భర్తలను రక్షించే విదంగా ఉండాలని ఒక న్యాయవాది అన్నారు.

ఈ వీడియోలో పులుల గుంపు దగ్గర నుండి తమ గుంపులో ఒకరిని కాపాడుకున్న గేదెలను చూడండి

ఒకటిగా కలసి ఉంటే ఎంతటి బలసాలులనైనా ఎదుర్కొన వచ్హు అనడానికి ఈ వీడియో ఒక నిదర్సనం.

అనుకోని పరిస్తితులలో బయట ఊరికి వెళ్ళవలసి వచ్హినందువలన నా బ్లాగ్ ను వారం రోజులుగా అప్ డేట్ చెయలేక పోయేను. ఈ రోజు నుండి మళ్ళి నా బ్లాగ్ మూలంగా మీకు కొత్త విషయాలు అందిస్తాను.

మీ కోసం.

Thursday, June 3, 2010

చైనా వారి సూపర్ కంప్యూటర్ ప్రపంచములోనే 2 వ అతి వేగమైనది

చైనాలో ఉన్న ఒక సూపర్ కంప్యూటర్ ప్రపంచములోనే అతివేగమైన 2 వ సూపర్ కంప్యూటర్ గా అమెరికా మరియూ యూరోపియన్ దెశాలకు చెందిన అన్వేషణా శాస్త్రవేత్తలు తెలిపేరు. దీనినిబట్టి చూస్తే చైనా దేశం ప్రపంచ టెక్నాలజీ సెంటర్ గా ఎదగటానికి ప్రయత్నిస్తున్నదని తెలుస్తోంది.

అమెరికాలోని టాన్నీస్ నగరంలొని అమెరికన్ ఎనర్జీ డిపార్ట్ మెంట్ లో ఉన్న సూపర్ కంప్యూటర్ ప్రపంచంలోనే అతి వేగమైన కంప్యూటర్. దక్షిణ చైనా నగరం షెంజెహాన్ లో ఉన్న నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్ లో ఉన్న నెబులే కంప్యూటర్ ప్రపంచంలోనే అతి వెగమైన రెండవ కంప్యూటర్ గా పేర్కొన్నారు.

ఈ సూపర్ కంప్యూటర్లు అతి క్లిష్టమైన వాతావరన మార్పులను తెలుసుకోవటానికీ, న్యూక్లియర్ ఆయుధాల ఎనర్జీ గురించిన పరిశోధనలు జరపటానికీ మరియూ అతి వేగమైన యుద్ద విమానాలను డిజైన్ చేయటానికి ఉపయోగిస్తారట.

ప్రతి 6 నెలలకూ ఒకసారి అభివ్రుద్ది చెందిన దేశాలలో జరుగుతున్న ముఖ్య పరిశోధనా విషయాలను ప్రచురించే ఒక పత్రిక చైనా వారు ఈ అతివేగ సూపర్ కంప్యూటర్ తో సాదించిన అభివ్రుద్దిని, అమెరికా, యూరోప్ మరియూ జపాన్ దేశాల అభివ్రుద్దితో పోల్చేరు. అలాగే చైనాదేశం అన్వేషణల మీద ఖర్చు పెడుతున్న డబ్బు, వారి దేశం ఆర్ధీకంగా అభివ్రుద్ది చెందటం గురించి వివరంగా రాసేరు.

అయితే చైనా దేశం తమ అతివేగ కంప్యూటర్ ని తయారుచేయటంలో కీలకమైన సమాచారాన్ని అభివ్రుద్ది చెందిన దేశాల నుండే పొంద గలిగింది. అదేలాగా వారి సూపర్ కంప్యూటర్ లో వాడిన ప్రాససెర్ లు ఇంటెల్ మరియూ న్విడియా కంపనీవారివే.

చైనా దేశం వారి ఈ నెబులే సూపర్ కంప్యూటర్ ఒక సెకండుకు 1,271 కాల్ క్యులేషన్స్ ని గణించగలదట.

Tuesday, June 1, 2010

గూగుల్ కంపెనీలో మెల్ల మెల్లగా విండోస్ ఆపరేటింగ్ సిస్టంస్ (WINDOWS OPERATING SYSTEMS) ను తీసేస్తున్నారట

ఇంటెర్ నెట్ మేజర్ గూగుల్ తమ కంపెనీలలో వాడుతున్న మైక్రోసాఫ్ట్ వారి విండోస్ ఆపరేటింగ్ సిస్టంస్ ను సెక్యూరిటీ రీసన్స్ వలన మెల్ల మెల్లగా తీసేస్తున్నారట. ఈ మద్య చైనాలో తమ కంపెనీ కంప్యూటర్లు హాక్ చేయబడటమే దీనికి కారణమట.

"సెక్యూరిటీ రీసన్స్ వలనే మా కంపెనీలో విండోస్ ఆపరేటింగ్ సిస్టంస్ ను తీసేస్తున్నారు" గూగుల్ లో పనిచేస్తున్నవారు తెలిపినట్లు ఇంగ్లాండ్ దినపత్రిక ' ఫైనాన్షియల్ టైంస్’ పేర్కొన్నది.

చైనాలో తమ కంప్యూటర్స్ హాక్ అయిన తరువాత జనవరి నెల నుండి తమ కంప్యూటర్లలో విండోస్ ఆపరేటింగ్ సిస్టంస్ ను తీసివేయడం మొదలుపెట్టేరట.

ఇలా చేయడం వలన గూగుల్ కంపెనీలో విండోస్ ఆపరేటింగ్ సిస్టంస్ వాడకం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఈ కంపెనీలో పనిచేస్తున్నారు.

చైనాలో మా కంపనీ కంప్యూటర్లలో జరిగిన హాకింగ్ వలన మేము విండోస్ నుండి మాక్ ఆపరేటింగ్ సిస్టంస్ కు మారేమని గూగుల్ కంపెనీలో పనిచేసే ఒకరు తెలిపినట్లు ఆ దినపత్రిక తెలిపింది.

ఇప్పుడు గూగుల్ కంపెనీలో పనికి జేర్చుకునేవారికి ఆపిల్ వారి మాక్ ఆపరేటింగ్ సిస్టంస్ లో గానీ లేక యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టంస్ లో గాని అనుభవముండాలట.

మిగిలిన ఆపరేటింగ్ సిస్టంస్ కన్నా విండోస్ ఆపరేటింగ్ సిస్టంస్ ఉన్న కంప్యూటర్లు హాకింగ్ కి, వైరస్ లకు ఎక్కువ సులభంగా ఉందట.

300 అడుగుల ఎత్తు బుద్ద విగ్రహం.....ఫొటోలు

తాయ్ లాండ్ దేశంలో ఉన్న 300 అడుగుల ఎత్తు బుద్ద విగ్రహం. చాలా గంభీరంగా నూ అందంగానూ ఉన్నది. ప్రపంచంలో ఉన్న ఎత్తైన విగ్రహాలలో ఇదీ ఒకటి.

డాక్టర్లే సిగిరెట్లు త్రాగుతుంటే!?

"నేను కూడా అందరిలాంటివాడినే. పొగ త్రాగటం ఒక బానిసత్వం. నేను పొగ త్రాగటం మానేయాలని ప్రయత్నిస్తున్నాను. పేషెంట్లకు పొగ త్రాగ కూడదని చెప్పేటప్పుడు నాకు సిగ్గుగా ఉంది. పొగత్రాగేవారు నన్ను ఎగతాలీ చేయవచ్హు" సిగిరెట్ త్రాగే అలవాటున్న ఒక సీనియర్ కార్డియాలజిస్ట్ అన్నారు.

సిగిరెట్లు త్రాగే వారి వలన మూడవ మనిషికి కూడా హాని కలుగుతుంది. సిగిరెట్టులోని హానికరమైన వాయువులు సిగిరెట్లు కాల్చిన వారి తల వెంట్రుకలలోనూ, వేసుకున్న బట్టలమీద ఉండిపోతాయట. మూడో మనిషి వీరిని కలిసినప్పుడు ఈ వాయువులను పీల్చటం వలన హాని కలుగుతుందట. మనదేశంలో ఎంతమంది డాక్టర్లు సిగిరెట్లు త్రాగుతున్నారో లెక్కతీసి, ఒక కర పత్రం మూలంగా వారందరికీ ఈ విషయాన్ని తెలిపి, వారిచే జూలై నెల 1 వ తారీకు నుండి (ఆ రోజు ప్రపంచ డాక్టర్స్ డే) సిగిరెట్లు మానిపించాలని క్యాన్సర్ వ్యాది నిపుణుల బ్రుందం ప్రయత్నిస్తున్నారు.

సిగిరెట్లవలన ఎంత హాని జరుగుతుందో సాదారన మనిషి కన్నా డాక్టర్లకు ఎక్కువ తెలుసు. అలా తెలిసికూడా వారు సిగిరెట్లు త్రాగటం మానటంలేదంటే వారు కూడా సిగిరెట్లకు బనిసైనట్లే.

సిగిరెట్లు కాల్చినవారు రూము నుండి వెళ్ళిపోయినా, ఆ సిగిరెట్టు పొగలోని హానికరమైన రసాయనాలు సోఫాలకూ, చాపలకూ,కార్పెట్లకూ,దుప్పట్లకూ, కర్టన్లకూ అంటుకునే ఉంటాయట. ఆ రూములోకి వెళ్ళే ఏ మనిషైనా ఆ రసాయనాలను వారికి తెలియకుండానే పీలుస్తారు. ఇది చాలా హానికరమైనది. అందులోనూ డాక్టర్లు సిగిరెట్లు కాలిస్తే వారు రోజుకు ఎక్కువ మందిని కలుస్తారు కనుక ఎక్కువ మందికి హాని కలుగుతుంది.

ఈ విషయాలన్నీ ఒక కర పత్రం మూలంగా డాక్టర్లకు తెలుపుతూ ప్రచారంచేయబోతామని ఆ నిపుణుల బ్రుందం తెలిపింది.

సిగిరెట్లు మానేస్తే శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో ఇలా వివరించేరు:....
1) మనేసిన 20 నిమిషాల తరువాత......రక్త పొటు, నాడి కొట్టుకోవటం నార్మల్ కు వస్తాయి.
2) మనేసిన 8 గంటల తరువాత......శరీరంలోని కార్బన్ మొనాక్సైడ్ బయటకు వస్తుంది.
3) మనేసిన 24 గంటల తరువాత......హార్ట్ అటాక్ వచ్హే అవకాశం తగ్గుతుంది. ఊపిరితిత్తులలో నిమ్ము తగ్గుతుంది.
4) మానేసిన 48 గంటల తరువాత......శరీరంలో పేరుకుపోయిన నికోటిన్ బయటకు వస్తుంది. రుచులు బాగా తెలుస్తాయి. ఆక్సిజెన్ తీసుకువెళ్ళే రక్త కణాలు పెరుగుతాయి.
5) మానేసిన 2 నుండి 12 వారాలలో......రక్త ప్రసరన నార్మల్ అవుతుంది.
6) మనేసిన 3 నుండి 9 వారాలలో...... దగ్గు తగ్గుతుంది. ఊపిరి పీల్చుకునే బాధ తగ్గుతుంది.
7) మనేసిన 5 సంవత్సరాల తరువాత......గుండె జబ్బులు వచ్హే వకాశం 50 శాతంగా తగ్గుతుంది.
8) మనేసిన 10 సంవత్సరాల తరువాత......ఊపిరితిత్తుల క్యాన్సర్ రావటం 50 శాతంగా తగ్గుతుంది.
9) మనేసిన 15 సంవత్సరాల తరువత......పూర్తి నార్మల్.