Monday, May 31, 2010

స్విస్ బ్యాంకుల్లో దాచుకునే డబ్బుకు పన్ను

"విదేశీయులు తమ బ్యాంకులలో దాచుకునే డబ్బుకు పన్నులు వసూలిస్తాము" స్విస్ ప్రభుత్వం ప్రకటించింది. వసూలుచేసిన డబ్బును ఆయా దేశాలకు పంపిస్తాము. కానీ బ్యాంకులో ఖాతాలు పెట్టుకున్నవారి వివరాలను మాత్రం ఇవ్వమని స్విస్ ప్రభుత్వం తెలిపింది.

అంతేకాక, ఇకపై పన్ను చెల్లించిన ఖాతా దారులకే డబ్బు దాచుకునే అవకాశం అన్న అంశాన్ని పరిసీలిస్తున్నామని, అయితే తప్పుడు లెక్కలు చూపించి పన్నులు ఎగగొట్టే వారి వివరాలను అందించటంలో బాధ్యత వహించమని తెలియజేసేరు.

నల్ల ధనం తాలూకా ఖాతా దారుల వివరాలను అందించాలని మన దేశంతో పాటూ పలు దేశాలు స్విస్ ప్రభుత్వంపై కొన్ని సంవత్సరాలుగా ఒత్తిడి చేస్తున్నారు. నల్ల ధనం వలన బోలెడంత ఆదాయపు పన్ను పోగొట్టుకుంటున్నామని, అది దేశ అభివ్రుద్దికి చాలా ఇబ్బంది కలిగిస్తోందని, కనుక తమ బ్యాంకులలో డబ్బు దాచుకున్నవారి వివరాలను మాకు అందజేయాలని పలు దేశాలు స్విస్ ప్రభుత్వాన్ని అడిగేరు.

ప్రపంచ ఆర్ధీక సహకార అభివ్రుద్ది సంస్థతో జరిపిన చర్చలలో స్విస్ బ్యాంకర్లు అంతర్జాతీయ పన్ను ప్రమాణాలను ఒప్పుకోవటంతో స్విస్ ప్రభుత్వం ఖాతాదార్లపై పన్ను వసూలుకు అంగీకరించింది.

అక్రమంగా, అవినీతితో సొమ్ము సంపాదించి స్విస్ బ్యాంకులలో డబ్బుదాచుకున్నవారికీ, దాచుకోబోయేవారికి స్విస్ ప్రభుత్వ ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. ఇంతకు ముందే కోట్లాను కోట్ల రూపాయలు దాచుకున్నవారు, తాము దాచుకున్న డబ్బులో కొంత సొమ్మును పన్నుగా కట్టవలసి వస్తుంది. ఇక మీదట స్విస్ బ్యాంకులలో సొమ్ము దాచుకోవాలనుకుంటే ఆ సొమ్ముకు ఆదాయపు పన్ను కట్టి తీరవలసిందే.....అయితే ఎవరెవరు దాచుకున్నారో, ఎంత సొమ్ము దాచుకున్నారో మాత్రం మనకు తెలియకుండానే ఉంటుంది. ప్రస్తుత స్విస్ ప్రబుత్వ ప్రకటన మూలంగా మనదేశానికి కొంత డబ్బు పన్నుగా వస్తుంది.

ఇకపోతే మన ప్రబుత్వం చేయవలసిన పనేమిటంటే, ఎవరెవరు స్విస్ దేశానికి వెడుతున్నారో క్చుణ్ణంగా పరిసీలించి, వారి ఆదాయాలనూ, వారి వ్యాపారాలనూ తనిఖీ చేసి వారి అక్రమ సంపాదనలను పట్టుకుంటే అవినీతి జరగటాన్ని కొంతవరకు అరికట్టవచ్హు.

Sunday, May 30, 2010

ప్రజారాజ్యం రోశయ్య ప్రభుత్వంలో చేరుతుందా?

చేరుతుందనే అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజారాజ్యం ఎం.ఎల్.ఏ లు రోశయ్య ప్రభుత్వంలో జేరి తమకూ కాంగ్రెస్ కూ ఉన్న బంధుత్వాన్ని మరింత బలపరుచుకోవాలని చూస్తున్నారట. కనీసం ప్రజారాజ్యానికి చెందిన 4 గురు ఎం.ఎల్.ఏ లు మంత్రిపదవులను ఎదురుచూస్తున్నారట. ఇంతే కాకుండా ప్రజారాజ్యం కాంగ్రెస్ తో విలీనమైపోవాలని తమ నాయకుడు చిరంజీవిగారి మీద ఒత్తిడి తీసుకువస్తున్నారట.

ప్రజారాజ్యం కాంగ్రెస్ తో కూటమికి సిద్దంగా ఉన్నట్లు నిన్న చిరంజీవిగారు డిల్లీలో సోనియా గాంధీ ని కలిసి మాట్లాడుకోవటం మూలంగా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు ఇరు పార్టీలూ ఒక ఒప్పందానికి వచ్హినై కనుక.

"మా పార్టీకీ, కాంగ్రెస్ పార్టీకీ ఒకే విధమైన సిద్దంతాలూ, ప్రజా సంక్చేమ కార్యాలూ ఒకేలాగా ఉన్నాయని మా నాయకుడు చిరంజీవిగారు చెప్పడంతో, మా పార్టీకి ప్రత్యేక గుర్తింపు కావాలని పోరాడటంలో అర్ధంలేదు. కాంగ్రెస్ తో కలిసి, వారి మత్రివర్గంలో చేరి మిగిలిన 4 సంవత్సరాలూ ప్రజలకు సేవచేయటంలోనే అర్ధముంది" అని ప్రజారాజ్యం ఎం.ఎల్.ఏ ఒకరు ఒక ప్రముక దినపత్రికకు తెలిపేరు.

2014 అశెంబ్లీ ఎన్నికలలోపు ప్రజారాజ్యం కాంగ్రెస్ తో విలీనం అవడానికి ఒత్తిడి తెస్తున్నారు కనుక, ఇప్పుడే రోశయ్య గారి మంత్రివర్గంలో జేరిపోవాలని కూడా ఆయన తెలిపినట్లు అ పత్రిక తెలిపింది.

"మా నియోజకవర్గంలో అందరూ మమ్మల్ని ఇప్పటికే కాంగ్రెస్ ఏం.ఏల్ ఏ ల మని అంటున్నారు. అటువంటప్పుడు మంత్రివర్గంలో జేరి ప్రజలకు సేవ చేస్తే మరింత మంచిది కదా" ఈస్ట్ గోదావరి కి చెందిన ప్రజారాజ్యం పార్టీ నేత ఒకరు చెప్పేరు.

కానీ చిరంజీవి గారికి తన పార్టీ రోశయ్య మంత్రివర్గంలో చేరటం గురించి ఆశక్తి ఉన్నదా లేదా అనేది తెలియదు. రాజ్యసభ ఎన్నికలకు ముందే మాతో విలీనం అయిపోవాలి, అప్పుడే రాజ్యసభ ఎన్నికలలో ప్రజారాజ్యం అబ్యర్ధికి మద్దత్తు ఇస్తామని కాంగ్రెస్ చెప్పటంతో, ఇప్పుడు అలాంటి మద్దత్తు అవసరంలేదని,తమ అబ్యర్ధి ఎన్నికలలో నిలబడరని తెలిపి, ప్రస్తుతం రెండు పార్టీలూ కలిసికట్టుగా పనిచెయడానికి మాత్రమే చిరంజీవిగారు ఒప్పుకున్నట్లు తెలిసింది.

ముఖ్యమంత్రి రోశయ్య గారికి కూడా ప్రజారాజ్యంతో కూటమి పెట్టుకోవడానికి సమ్మతమేనని చెబుతున్నారు. తన మత్రివర్గంలో ప్రజారాజ్యం పార్టీ ఎం.ఎల్.ఏ ల కు మంత్రి పదవులు ఇవ్వటానికి తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదని తెలిపేరట.

ఎప్పుడో జరగాల్సిన మంత్రివర్గ విశ్తీరన ఇంకా జరగలేదు కనుక, మంత్రివర్గ విశ్తీరనలో ప్రజారాజ్యం పార్టీని చేర్చుకునే అవకాసమున్నది.

జగన్ బి.జె.పీ తో స్నేహాన్ని బలపరచుకుంటున్నారా?

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డీ వేస్తున్న ప్రతి అడుగునూ క్చుణ్ణంగా పరిసీలిస్తూ రాష్ట్రంలో ఆయన నడవడికలకు అడ్డునిలుస్తున్న కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి కట్టుబడకుండా తన ఉనికిని ఇటు ప్రజలలోనూ అటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లోనూ బలపరచాలని ప్రయత్నిస్తున్న జగన్ కాంగ్రెస్ అధిష్టానవర్గానికి ఒక చాలెంజ్ గా ఉంటున్నారు.

తాము అనుకున్నదానికంటే జగన్ బలంగా ఉండటం కాంగ్రెస్ అధిష్టానవర్గాన్ని కొంత కలవరపెడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని విడదీయగల సత్తా జగన్లో ఉన్నదా లేదా అనే విషయంలో కాంగ్రెస్ నేతలు బిన్నాభిప్రాయాలు వెలువడిస్తున్నారు.

కానీ జగన్ ఈ విషయం గురించి ఎవరికీ ఎటువంటి ఆలోచన కలగనీయటంలేదు.అయితే ఇటు రోసయ్య ప్రబుత్వానికీ అటు కాంగ్రెస్స్ అధిష్టానవర్గానికీ తనదైన బాణిలో తనను గుర్తించటానికి ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు.

కర్ణాటకాకు చెందిన కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు జగన్ తరఫున డిల్లీలో బి.జె.పీ నాయకులను కలిసి, ఒక వేల జగన్ గనుక కాంగ్రెస్ నుండి విడిపోతే బి.జె.పీ జగన్ కు మద్దత్తు ఇవ్వాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాలు ఒక ప్రముఖ దినపత్రికకు తెలిపినట్లు ఆ దినపత్రిక తెలిపింది.

కానీ బి.జె.పీ ఏమీ సమాదానం చెప్పలేదట. బి.జె.పీ కి రాష్ట్రంలో పెద్దగా పలుకుబడిలేదు. కానీ జగన్ మాత్రం తన బి.జె.పీ స్నేహితులతో మరింత సన్నిహితంగా ఉంటూ తనకూ బి.జె.పీ.కి ఉన్న స్నేహాన్ని బలపరస్తున్నరని చెబుతున్నారు. ఈయన కర్ణాటకా బి.జె.పీ మంత్రులు గాలి బ్రదర్స్ కు ఎంత సన్నిహితులో అందరికీ తెలిసిందే. కానీ వీరు (గాలి బ్రదర్స్) మాత్రం జగన్ తరఫున బి.జె.పీ నాయకులతో మాట్లాడిన వారిలో లేరు.

బి.జె.పీ అధిష్టానవర్గం రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ గొడవులలో తలదూర్చకూడదని నిర్ణయించుకుంది. ఎందుకంటే ఆ గొడవలవలన తమకు ఎటువంటి రాజకీయ లాభమూ లేదని అనుకుంటోంది. అందువలన జగన్ కు మద్దత్తునివ్వటం, జగన్ ని కాపాడాలనుకోవడం చేయటంలేదని చెబుతున్నారు.

కాంగ్రెస్ అధిష్టాన వర్గం జగన్ ని ముఖ్యమంత్రి చేయలేమని ఖచ్హితంగా తెలిపింది. జగన్ కనుక కాంగ్రెస్ కు ఇబ్బందులివ్వకుండా ఉంటే కేంద్ర మంత్రిత్వ శాఖలో మంత్రి పదవి ఇస్తామన్న మాటల్ని కూడా ఇప్పుడు చెప్పటంలేదు.

"జగన్ గనక ఒక నిజమైన కాంగ్రెస్ వాదిగా ఉంటే కాంగ్రెస్ అధిష్టానవర్గానికి కట్టుబడి ఉండాలి...అధిష్టానవర్గం చెప్పినట్లు నడుచుకోవాలి" అని సీనియర్ కాంగ్రెస్ నేత ప్రనాబ్ ముఖర్జీగారు అన్నారు.

Saturday, May 29, 2010

రాజకీయాలు స్థిరంగా ఉండేవి కాదు, మారుతూ ఉంటాయి....చిరంజీవి

"మా పార్టీలాగానే కాంగ్రెస్ పార్టీకూడా మతాతీతమైన పార్టీ. కాబట్టి ఆ పార్టీతో దీర్ఘకాల సహకారం కావాలని కోరుకుంటున్నాను. ఇందులో తప్పేమీలేదు. ఎందుకంటే రాజకీయాలు స్థిరంగా ఉండేవి కాదు, మారుతూ ఉంటాయి. నాకు ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నా, కాంగ్రెస్ ప్రెశిడెంట్ సోనియా గాంధీ అన్నా గౌరవం. అంతేకానీ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ తో విలీనం అవుతుందన్న మాటకి మాత్రం చోటే లేదు" సోనియా గాంధీ ని కలిసిన తరువాత పత్రికా విలేకరులతో మాట్లాడుతూ తెలిపేరు చిరంజీవిగారు.

వచ్హే నెల జరుగబోయే రాజ్య సభ ఎన్నికలలో రాష్ట్రం నుండి పోటీలేకుండా గెలవాలని నిర్ణయించికుంది కాంగ్రేస్. మొత్తమున్న 6 సీట్లలో 3 సీట్లు కాంగ్రెస్స్, 2 సీట్లు తెలుగుదేశం పోటీలేకుండా గెలుస్తాయి. పోతే మిగిలిన ఒక సీటుకు ఏ పార్టీకి కావలసిన ఓట్లు లేవు. కాబట్టి ఆ సీటుకు పోటీ పడవలసి ఉంది. ఈ సీటుకు ప్రజారాజ్యం తమ అభ్యర్ధిని నిలబెట్టాలనుకుంది. కానీ కాంగ్రెస్ మద్దత్తులేనిదే గెలవలేరు. కనుక కాంగ్రెస్ మద్దత్తు అవసరం. కాంగ్రెస్ కు ఈ సీటుమీద పోటీ ఇష్టంలేదు. పోటీ వస్తే జగన్ ఆదరవాదులు కాంగ్రెస్ కు ఇబ్బంది కలిగించవచ్హు. అందుకని ఆ సీటుకు పోటీ ఉండకూడదని భావించి కాంగ్రెస్ ప్రెశిడెంట్ సోనియా చర్చలకు రావలసిందిగా చిరంజీవిని డిల్లి కి పిలిచేరు.

ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధికి మద్దత్తు ఇవ్వవలసిందిగా సోనియా గాంధీ ని అడగాలనుకున్నారు చిరంజీవి. అయితే అక్కడ జరిగింది వేరు. సీనియర్ కాంగ్రెస్ నేతలు లేనందున మద్దత్తు ఇవ్వలేమని, మీరే తప్పుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మద్దత్తు ఇవ్వాలని సోనియా గాంధీ చిరంజీవిగారిని అడగటంతో ఆమెకు ఆలోచిస్తామని చెప్పేరు చిరంజీవి.

చిరంజీవిగారు ఆలోచిస్తామని చెప్పటం లాంచనాప్రాయమేనని, తమ పార్టీ రాజ్య సభ సీటుకు పోటీ చేయదని, కాంగ్రెస్ కే మద్దత్తునిస్తుందని ప్రజారాజ్యం పార్టీ నేత ఒకరు తెలిపినట్లు తెలిసింది.

ప్రజారాజ్యం పార్టీ తమ వెంట ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలపడుతుందని కాంగ్రెస్ అభిప్రాయపడుతున్నది. ఇదే ఆలోచనలు ప్రజారాజ్యం పార్టీలోనూ ఉన్నది కనుక రెండు పార్టీలూ అవగాహనతో నడుచుకుంటాయని చెబుతున్నారు.

దేశానికి సమర్ధవంతమైన పాలన అందించగల సత్తా కాంగ్రెస్ కు మాత్రమే ఉందని, చిరంజీవిగారికి కూడా ఈ విషయంలో అనుమానంలేదని, కనుక కాంగ్రెస్ పార్టీని సమర్ధిస్తూ తాముకూడా బలపడాలని ప్రజారాజ్యం పార్టీ అనుకోవడంలో తప్పులేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ తో విలీనం అయినా ఆశ్చర్యపొనక్కర్లేదు.

Thursday, May 27, 2010

జనాభా లెక్కలలో కులాల వివరాలు చేర్చటం సరి కాదు...సుబ్రమణ్య స్వామి

జనాభా లెక్కలలో కులాల వివరాలను చేర్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో మారిన రాజకీయ పరిస్థితుల ద్రుస్ట్యా ఇలా చేయటం అవసరమని దీనికోసం ఏర్పరిచిన క్యాబీనెట్ మీటింగ్లో కొంతమంది మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
జనాభా లెక్కలలో కులాల వివరాలను సేకరించటంవలన మన రాజకీయ పరిస్థితుల మీద ఆ సేకరన ఎలాంటి మార్పును తీసుకువస్తుందో వారికి మాత్రమే తెలియాలి.

జనాభా లెక్కలలో కులాల వివరాలు చేరిస్తే అది మనదేశానికి కష్టాలు తీసుకువస్తుందని జనతా పార్టీ ప్రెశిడెంట్ సుబ్రమణ్య స్వామి అన్నారు. ఆయన మాట్లాడుతూ "1932 లో, అప్పుడు మనదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటీష్ వారు సెడ్యూల్ కులాల వారికి ప్రత్యేక ఓటర్ లిస్టు కావాలని అప్పుడు ఇదే విధంగా జనాభా లెక్కలలో కులాల వివరాలను సేకరించదలచింది. ఆమేరకు ఆదేశాలు జారీ చేసింది"

"జనాభా లెక్కలో కులాల వివరాలు సేకరిస్తే అది ప్రజలను విడగొడుతుందని, బ్రిటీష్ వారి ఆదేశాన్ని ఎదిరిస్తూ గాంధీగారు అమరణ నిరాహార దీక్ష వహించేరు. డాక్టర్ అంబేత్కర్ కూడా దీనిని ఎదిరించేరు. వీరిరువురివలన ఆ రోజు బ్రిటీష్ ప్రబుత్వం జనాభా లెక్కలలో కులాల వివరాలను చేర్చాలనే ఆదేశాలను వెనక్కితీసుకుంది"

"ఇంతేకాక బగవత్గీత చాప్టర్ 4 లో కులాలు పుట్టుకతో రాలేదని తెలుపబడింది. కాబట్టి హిందువులందరూ ఈ చరిత్రను అమలుపరచాలి. ఆర్.ఎస్.ఎస్. వారు దేశమంతటా సత్యాగ్రహాలూ, శాసనోల్లంఘనలూ నిర్వహించి కేంద్రం జనాభా లెక్కలలో కులాల వివరన సేకరించకుండా ఉండేటట్లు చేయాలి" అని తెలిపేరు.

దేశంలో 17 వేల కులాలు, ఉప కులాలూ ఉన్నందున ఈ ప్రక్రియ చాల కష్టమని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.
భారాతీయ జనతా పార్టీ వారు మాట్లాడుతూ "జనాభా లెక్కలలో కులాల వివరాలను చేర్చకుండా ఉండటానికే కాంగ్రేస్ ప్రబుత్వం ప్రయత్నిస్తోంది. అలా చేయాలనే ఒక క్యాబీనెట్ కమిటీని ఏర్పరచింది" అంటున్నారు.

ఐ.ఐ.టీ-జెఈఈ లో మొదటి ఏడు స్థానాలూ ఆంద్రాకే....హాట్స్ ఆఫ్ ఆంద్రా స్టూడెంట్స్

ఐ.ఐ.టీ-జెఈఈ 2010 లో మన రాష్ట్రానికి చెందిన విధ్యార్ధులు మొదటి 10 స్థానాలలో 7 స్థానాలూ, మొదటి 100 స్థానాలలో 40 స్థానాలూ సంపాదించి కొత్తగా రికార్డు స్రుష్టిస్తూ అటు వారికీ ఇటు మన రాష్ట్రానికి ప్రతిష్టను తీసుకు వచ్హేరు. ఇది ఇప్పటిదాకా జరిగిన ఐ.ఐ.టీ-జెఈఈ పరీక్షలలో మన రాష్ట్ర విద్యార్ధులు ప్రదర్శించిన అత్యుత్తమమైన ప్రతిభ.

అందులోనూ ఐ.ఐ.టీ-జెఈఈ పరీక్షలలో మొదటి ర్యాంకును మన రాష్ట్ర విద్యార్ధి ఏ.జీతేందర్ రెడ్డీ సంపాదించి చరిత్ర స్రుష్టించేరు. మన రాష్ట్రానికి చెందిన విధ్యార్ధి ఐ.ఐ.టీ-జెఈఈ పరీక్షలలో మొదటి స్థానం సంపాదించటం ఇదే మొదటిసారి.

మొత్తం 1500 సీట్లు మన రాష్ట్ర విధ్యార్ధులు సంపాదించి మన రాష్ట్రానికి మరింత ప్రతిష్ట తీసుకువచ్హేరు. పోయిన సంవత్సరం మొదటి 10 స్థానాలాలో 2 స్థానాలే మన రాష్ట్ర విధ్యార్ధులు పొందగలిగేరు. ఈ సంవత్సరం మొదటి స్థానంతో పాటూ 1500 స్థానాలు సంపాదించుకుని ఉత్తరాది రాష్ట్రాలతో పోటీ పడగలమని నిరూపించేరు.

మొత్తం 4.72 లక్షల మంది ఈ పరీక్షను రాసేరు. మన రాష్ట్రంలో నుండి సుమారు 50 వేల మంది ఈ పరీక్షలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 10,000 సీట్లు ఉన్న ఐ.ఐ.టీ లలొ 1500 సీట్లు మన రాష్ట్ర విధ్యార్ధులు సంపాదించటం చదువుల మీద మనరాష్ట్ర విధ్యార్ధులకు ఉన్న ప్రీతిని ఎత్తిచూపుతోంది.

గ్రేట్ పెర్ఫార్మన్సె....హాట్స్ ఆఫ్ టు ఆంద్రా స్టూడెంట్స్.

Tuesday, May 25, 2010

కుంగ్ ఫూ (KUNG FUU) ఎలుగబంటి....వీడియో

కుంగ్ ఫూ చేస్తున్న ఎలుగబంటిని ఈ వీడియోలో చూడండి.


Sunday, May 23, 2010

స్నేహం అంటే ఇదే......ఈ వీడియోలో చూసి ఆనందించండి

బద్ద శత్రువులని చెప్పబడే 3 జంతువులు కుక్క, పిల్లి మరియూ ఎలుకా ఎంత స్నేహంగా ఉన్నాయో ఈ వీడియోలో చూడండి. స్నేహానికి ఎంత విలువ ఉందో ఈ జంతువులు తెలుసుకున్నాయనుకుంటా.


Saturday, May 22, 2010

మంగళూరు మిమాన ప్రమాదానికి ఎవరు బాధ్యులు? ప్రబుత్వమే

దుబాయ్ నుండి మంగళూరు వస్తున్న ఇండియన్ ఎయర్ లైన్స్ విమానం ఘోర ప్రమాదానికి గురై 158 మంది చనిపోయిన సంగతి మీకందరికీ తెలిసిందే.

ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం చాలా వరకు ద్రువీకరితం అవుతున్నా,దీనికి ఎవరు బాధ్యులు అనే విషయంలో ఎవరూ ఖచ్హితమైన సమాదానం ఇవ్వటంలేదు. ఎవరిని బాధ్యులుగా చూపాలో ప్రభుత్వానికి అర్ధంకావటంలేదు. ఎందుకంటే చాలావరకు బాధ్యులు తామే గనుక.

విమానం రన్వేలో దిగాల్సినచోటుకన్నా 2000 అడుగులు ముందుకు వెళ్ళి దిగింది. ముందుకు వెళ్ళి రన్వేలో మలుపు తిప్పుకునేంత దూరం రన్వేలో లేకపోవటంతో బ్రేకులువేసి విమానాన్ని నిలిపివేసేందుకు పైలట్ ప్రయత్నించేరు. కానీ సడన్ గా బ్రేకులువేయడంతో విమానం టైర్లు పగిలిపోయి విమానం అదుపుతప్పి, పైలట్ కంట్రోల్ కి కట్టుబడక ప్రమాదానికి గురై ఘొర విపత్తులో చిక్కుకుంది.

పైలట్ చాలా అనుభవం కలవారు. మంగళూరులో 19 సార్లు విమానాన్ని ల్యాండ్ చేసేరు. కో పైలట్ అహుల్లావాలియా ఇదే విమానాశ్రయంలో 66 సార్లు విమానాన్ని ల్యాండ్ చేసేరు. కాబట్టి వీరు పొరపాటుచేసి ఉండటం చాలా అరుదు.

మంగళూరు విమానాశ్రయంలో "టేబుల్ టాప్" రన్వే ఉన్నది.ఆప్టికల్ ఇల్ల్యూజన్ తో విమానాలను దింపాలి. ఎంత అనుభవమున్న పైలట్ కైనా ఇలాంటి రన్వేలలో విమానాలను దింపటం కష్టమౌతుంది. ప్రత్యేక శిక్షణ ఇచ్హిన పైలట్లే ఇటువంటి రన్వేలలో దిగగలరు. ఈ విషయం తెలిసున్నా ప్రబుత్వం ఎందుకు విమానాలను ఇక్కడ దింపేందుకు అంగీకరించింది?

మంగళూరు విమానాశ్రయంలో రెండో రన్వే వేయడానికి అభ్యంతరాలు తెలుపుతూ కర్ణాటకా హైకోర్టులో 4 పి.ఐ.ఎల్ పిటీషన్లు వేయబడ్డాయి. 1990 లో వేయబడ్డ మొదటి పిటీషన్లో రెండవ రన్వే వేయడం అంతర్జాతీయ కట్టుదిట్టాలకు అనుగునంగాలేదని, అలా కాదని రన్వే వేస్తే అది ప్రమాదాలకు దారితీస్తుందని, కాబట్టి అక్కడ రెండవ రన్వే వేయడానికి అనుమతించకూడదని కోరేరు. ఇదేవిధంగానే మిగిలిన 3 పిటీషన్లలోనూ అక్కడ రెండవ రన్వే వేయకూడదని కోరేరు. ఈ కోరికలను ఒప్పుకోనుంటే ఈ రోజు అక్కడ ఈ ప్రమాదం జరిగేది కాదు. అంతర్జాతీయ చట్టాలను కాదని అక్కడ రెండవ రన్వే కట్టడంవలనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. కర్నాటకా హైకోర్టు 4 పిటీషన్లనూ కొట్టివేసింది. సుప్రీం కోర్టుకు వెడితే అక్కడ 2003 లో ఈ పిటీషన్లను కొట్టివేసేరు. 2004 లో రన్వేను కట్టడం మోదలుపెట్టి 2006 లో ఉపయోగించటం చేసేరు.

"మంగళూరు రన్వే చాలా కష్టమైన రన్వే. ఎలాంటి పైలట్ కైనా అక్కడ విమానాన్ని దింపటం ప్రతిసారీ ఒక పెద్ద చెలెంజ్ గా ఉంటుంది. ఈ విమానాశ్రయం గురించి మేము భయపడుతునే ఉన్నాం. మా భయం ఈ రోజు నిజమైంది" అని మన విదేశాంగ మంత్రి ఎస్.ఎం.క్రిష్ణ గారు అన్నారు.

ఇన్ని ఆపదలు ఉన్న ఈ విమానాశ్రయాన్ని ప్రబుత్వం ఎందుకు ఉపయోగించాలి? ఎవరిని త్రుప్తి పరచాలని అలా చేసేరు? ఈ రోజు ఈ విమానాశ్రయం రన్వే 158 మంది ప్రాణాలను బలిగొన్నదే...దీనికి ఎవరు బాధ్యులు? ప్రబుత్వమే.

ఉల్లిపాయ చేసే అతి ముఖ్యమైన మేలు

ఉల్లిపాయ ఒక ఆంటీబయాటిక్ (Anti-biotic). దీనిని తిననవసరంలేదు. కానీ మన పక్కన ఉంచుకుంటే వైరస్, బాయక్టీరియాల వలన వచ్హే జబ్బులను మన దగ్గరకు రానివ్వదు. వచ్హిన జబ్బులను కూడా నయంచేస్తుంది .


1919 లో ఫ్లూ (FLU) జ్వరం వచ్హి 40 మిల్లియన్ల ప్రజలు చనిపోయేరు. గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారని తెలుసుకున్న ఒక డాక్టర్ గ్రామాలకు వెళ్ళి అక్కడున్న ప్రజలను కాపాడాలని నిర్ణయించుకుని గ్రామాలకు వెళ్లేడు. ఆయన వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రజలో చాలామందికి ఈ జబ్బు వచ్హి చనిపోయేరు. అయితే ఒక గ్రామంలో ఒక కుటుంభం మొత్తం సంతోషంగా, ఆరొగ్యంగా ఉండటం చూసిన డాక్టర్ ఆశ్చర్యపడి "ఇది ఎలా సాధ్య పడింది" అని ఆ కుటుంబీకులను అడిగేరు. అక్కడున్న ఒక రైతు భార్య "ఇదుగో దీని వలన" అంటూ ఒక పెచ్హుతీయని ఉల్లిపాయను చూపించింది. "ఉల్లిపాయలను ఒక గిన్నెలో ఉంచి ప్రతి రూములోనూ ఉంచేము...ఇది మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతోంది" అని చెప్పింది. డాక్టర్ వారి దగ్గరున్న ఉల్లిపాయను తీసుకుని తన మైక్రోస్కోప్ లో చూసేడు. ఆ ఉల్లిపాయ నిండా ఆ ఫ్లూ (FLU) వైరస్ ఉన్నది.

ఉల్లిపాయలలో బ్యాక్టీరియాలకూ, వైరస్ లకూ కావలసిన మాగ్నెట్ ఉంది. ఆ మాగ్నెట్ ఆకర్షణ వలన బ్యాక్టీరియాలూ, వైరస్ లు ఉల్లిపాయలోకి వెడతాయి. వెళ్ళిన తరువాత ఆ ఉల్లిగాటుకు అవి చనిపోతాయి. ఆ చనిపోయిన బ్యక్టీరియా మరియూ వైరస్ లు వలన ఉల్లిపాయ నల్లబడుతుంది.

బ్యాక్టీరియాతో గానీ, వైరస్ తోగానీ జబ్బుపడి బాధ పడుతున్నవారు పెచ్హుతీయని ఉల్లిపాయను రెండు ముక్కలుగా తరిగి, ఆ రెండు ముక్కలనూ తలో గిన్నెలో ఉంచి తమ దగ్గర పెట్టుకుంటే ఆ జబ్బు పడ్డవారిలో ఉన్న బ్యాక్టీరియానో, వైరసో ఆ ఉల్లి ఆకర్షణకు బయటకు వచ్హి ఉల్లిలో జేరిపోతాయి. జబ్బు పడ్డ వారిలో బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి కనుక వారికి జబ్బు నయం అవుతుంది.

ఉల్లిపాయ గురించిన ఈ విషయాలు చాలా చొట్ల వెతికి సేకరించినవి కనుక లింకులు ఇవ్వలేను. అంతే కాక దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు.ఉల్లిపాయను ఉపయోగించి జబ్బులు నయం చేసుకున్న వారు అందించిన సమాచారాన్ని బట్టి ఈ టపా రాసేను.

మీరు కూడా ప్రయత్నించండి.బ్యాక్టీరియా వలన జబ్బు వచ్హినప్పుడు ఒక పెచ్హుతీయని ఉల్లిపాయను రెండుగా తరిగి, రెండు ముక్కలనూ తలో గిన్నెలో ఉంచి మీ పక్కన పెట్టుకుని చూడండి. అలాగే వైరస్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి అని తెలుసుకున్న వెంటనే ముందు జాగ్రత్తగా పెచ్హుతీయని ఉల్లిపాయలను రెండుగా తరిగి మీ ఇళ్ళలోని రూములలో ఉంచండి...ఆరొగ్యంగానూ, ఆనందంగానూ ఉండండి.

ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ప్రయత్నించటంలో తప్పులేదని మీకు తెలుసు. పెద్దగా ఖర్చు పెట్టనవసరంలేదు కాబట్టి అందరూ ప్రయత్నించవచ్హు.మీలో ఎవరైనా ఇంతకుముందే ఉల్లిపాయవలన లాభం పొంది ఉంటే ఆ విషయం అందరికీ తెలుపండి.

పి.ఎస్ (P.S) :...మీరు వంటలలో ఉపయోగించటానికి ఉల్లిపాయలు వాడతారు. ఒకసారి తరిగిన ఉల్లిపాయను మిగిలిపోయింది కదా నని మరుసటిరోజు వాడకండి. ఎందుకంటే ఆ ఉల్లిపాయలో గాలిలో ఉన్న బ్యాక్టీరియాలు జేరి ఉంటాయి.

Friday, May 21, 2010

శాస్త్రవేత్తలు మొట్టమొదటి క్రుతిమ జీవకణాలను తయారుచేసేరు....మానవులు దేమునితో పోటీ పడటం న్యాయమా?

ప్రపంచంలోనే మొట్టమొదటి క్రుతిమ జీవ కణం అమెరికాలోని క్రైగ్ వెంటర్ ఇన్ స్టి ట్యూట్లో శాస్త్రవేత్తలు తయారుచేసేరు. 24 మంది శాస్త్రవేత్తలు కలిగిన ఈ శాస్త్రవేత్తల బ్రుందంలో భారతదేశానికి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు.

"ఈ జీవ కణాలు క్రుతిమంగా తయారు చేయబడ్డా, అవి నిజమైన, యదార్ధమైన జీవకణాలనే చెప్పాలి" అని జినోమిక్స్ గురించి ప్రయోగాలుచేసే ప్రఖ్యాత శాస్త్రవేత్త క్రైగ్ వెంటర్ అన్నారు.

"30 మిల్లియన్ల డాలర్ల ఖర్చుతో జరిపిన ప్రయత్నాలలో క్రుతిమ జీవకణాలను తయారుచేయడం నిజ జీవితాన్ని మార్చ వచ్హు అనే విషయానికి ఒక దారి చూపింది. ఒకప్పుడు ఇది జరిగే పనికాదు అనుకున్నారు. కానీ, చేసి చూపించేరు" అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది.

"ఇంతవరకూ, ఇప్పుడు నిజ జీవితంలో ఉన్న జీవకణాలలోని డి.ఎన్.ఏ లలో మార్పులు చెస్తూ చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ జెనెటికల్ ఇంజనీరింగ్ మూలంగా చెట్లూ మరియూ జంతువులలో మార్పులు తీసుకు వచ్హేవారు. కానీ ఇప్పుడు క్రుతిమ జీవకణాన్ని తయారుచేసి, ఒక క్రొత్త క్రుతిమ జీవిని ఉత్పత్తి చేసి, నిజ జీవితాలపై పోటీ ఏర్పరుస్తున్నారు" అని పేరుప్రతిష్టలున్న కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కానీ ఈ క్రుతిమ జీవకణాన్ని తయారు చేసిన విదానాన్ని, తమ విజయాన్ని సైన్స్ జర్నల్ లో ప్రకటించేటప్పుడు... జీవిత ధర్మం,నీతి,చట్టం,నిజమైన జీవులకు క్రుతిమ జీవుల వలన కలిగే హానీ లాంటి మరెన్నో ప్రశ్నలకు సమాదానం చెప్పవలసి వస్తుంది.
మనిషికీ, ప్రక్రుతికీ ఉన్న బందుత్వంలో ఇది ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని రట్జెర్స్ యూనివర్సిటీ మోలిక్యులర్ బైయాలజిస్ట్ రిచర్డ్ ఎబ్రైట్ అన్నారు. ఈయన ఆ బ్రుందంలోని శాస్త్రవేత్త కారు.

ఈ కొత్త క్రుతిమ జీవ కణం, ఒక విధమైన ప్రాణి (బాక్టీరియా). దీనిని మనం తయారుచేయగలం అని తెలుసుకోవటానికే దీనిని తయారుచేసేం అని తయారుచేసినవారు తెలిపినా ఈ కొత్త క్రుతిమ జీవకణం పుట్టడంవలన ఇది వ్యాపారం కోసం కొన్ని ప్రాణులను తయారుచేయడానికి ఉపయోగపడుతుందని చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మనిషి ఎప్పుడూ తన లిమిట్ లోనే ఉండాలి. దేముడౌదామనుకోవడం అతి తెలివి తనం. ఇది మానవ జీవితానికే నాసనం తీసుకువస్తుంది. స్రుష్టిని తెలుసుకోవాలనుకోవడమే ఒక తప్పు...స్రుష్టించడం అతి పెద్ద తప్పు అని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వీరు చెప్పింది నిజమే. ఎవరిపనులు వారే చేయాలి. ప్రక్రుతితో మానవులు పోటీ పడకూడదు. పోటీ పడినా విజయం సాధించలేరు అనేది నా అభిప్రాయం.

"సంతోషం" మనుష్యులలో 50 వ సంవత్సరంలో పుడుతుందట!!....ఒప్పుకుంటారా?

చాలామందికి 50 సంవత్సరాలు వచ్హిందంటే, తాము తమ జీవిత చివరి దశ లో కి వచ్హేమని అనిపిస్తుంది. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు అది తప్పు అంటున్నారు. ఒక మనిషికి నిజమైన, సంతోషకరమైన జీవితం 50 వ సంవత్సరంలోనే పుడుతుంది అని చెబుతున్నారు.

50 సంవత్సరాల తరువాత ఒక మనిషి జబ్బులకూ, మరణానికీ దగ్గరవటం నిజమైనా, 50 సంవత్సరాల తరువతే ప్రతి మనిషీ అన్ని విషయాలలోనూ నెగటివ్ గా ఆలోచించడం మానేస్తాడు. అంతేకాక అప్పటి నుండి కలత పడటం, ఆరాటపడటం మరియూ దిగులుపడటం తగ్గుతుంది. వాస్తవం మీద మాత్రమే వారి మనసు లగ్న మౌతుందని న్యూయార్క్ లోని స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపేరు.

తమకు 50 ఏళ్ళు వచ్హినై అనేది గుర్తుకు వచ్హినవెంటనే మనుష్యులలో ఒత్తిడి, కోపం మరియూ ఆందోళన క్రమక్రమముగా తగ్గిపోయి సంతోషం అనే అనుభూతి పెరుగుతుందట. 'మా స్టడీలోనే ఇదే మేము కనుగొన్న ఆశ్చర్యకరమైన విషయం' అని స్టడీ జరిపిన టీం లోని ఒక శాస్త్రవేత్త ఆర్తర్ స్టోన్ తెలిపేరు.

ఆ వయస్సు వచ్హిన తరువాత పెద్ద పెద్ద జబ్బులు ఒక బెడదగా ఉంటుందని ఆ వయసు వచ్హిన ప్రతి ఒక్కరూ అనుకుంటారని మనమంతా అనుకుంటున్నాము. అది తప్పు. ఆ వయసు వచ్హినవారు అలా జబ్బుల గురించి ఆలోచించరు. ఆ వయసులో వారి ద్యాశ స్నేహితులనీ,కుటుంబీకులనూ మరియూ బంధువులను కలుసుకోవాలని మాత్రమే ఉంటుందట. దీనికి కారణం వారు సంతొషంగా ఉండటమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

3,40,000 మందిని స్టడీ చేసిన తరువాత శాస్త్రవేత్తలు తెలుసుకున్నదేమిటంటే ఒక మనిషికి 20 సంవత్సరాలు వచ్హిన తరువాత వారిలో కోపం మరియూ ఆందోళన తగ్గుతుందట. అదే మనిషికి 50 సంవత్సరాలు వచ్హిన తరువాత కలత పడటం తగ్గిపోతుందట. అయితే ప్రతి మనిషిలోనూ 'సాడ్ నెస్స్’ (SADNESS) మాత్రం చివరిదాకా ఉండిపోతుందని తెలిపేరు.

అందువలన ప్రతి మనిషికీ 50 సంవత్సారల తరువాత వయసు గోల్డన్ ఇయర్స్ (GOLDEN YEARS) గా ఉంటుందట.

ఈ స్టడీలో తెలిపిన విషయాలను మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు? నాకైతే ఈ స్టడీలోని విషయాలు చాలావరకు నిజమనే అనిపిస్తోంది. 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు జీవితంలో ఎంతో పోరాడవలసి ఉంది. 50 సంవత్స్రాల తరువాత పోరాటాన్ని తగ్గించుకుంటము, ఎందుకంటే శరీరం అంగీకరించదు కనుక.

Thursday, May 20, 2010

ఇంగ్లాండ్ మహారాణి 11 అమెరికన్ ప్రెశిడెంట్లతొ తీసుకున్న ఫోటోలు……..మరో టపాఇంగ్లాండ్ మహారాణి మరణించిందని తప్పుడు సమాచారం అందించిన బి.బి.సీ క్షామాపణ....మహారాణి 11 అమెరికన్ ప్రెశిడెంట్లతొ తీసుకున్న ఫోటోలు

84 సంవత్సారాల వయసుతో ఆరోగ్యంగా ఉన్న ఇంగ్లాండ్ మహారాణి క్వీన్ ఎలిజిబత్-2 మరణించిందని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బి.బి.సీ రేడియో మగళవారం నాడు ప్రకటించింది. ఈ ప్రకటన విన్న ప్రజలు ఆందోళన చెందేరు. కొంతసేపటి తరువాత ఆమె చనిపోలేదని...హాస్యంకోసం అలా ప్రకటన చేసేనని బి.బి.సీ రెడియోలో ప్రకటనచేసినతను తెలిపేడు. ఈ విషయాన్ని ప్రజలు తీవ్రంగా ఖండించేరు. బి.బి.సీ తప్పుడు ప్రకటన చేసినందుకు క్షమాపణ కోరుతూ ప్రకటన చేసినతని మీద చర్య తీసుకుంటున్నట్టు తెలిపింది.

ఈ సందర్భంగా ఆమే పది కాలాలపాటు ఆరొగ్యంగా, ఆనందంగా ఉండాలని మనసారాకోరుకుంటూ ఆమె తన 84 సంవత్సరాలలో 11 మంది అమెరికన్ ప్రెశిడెంట్లను కలుసుకుందని తెలియజేస్తూ, వారితో ఆమె తీయించుకున్న ఫోటోలను మీకు అందిస్తున్నాను.

మిగిలిన ఫోటోలు మరో టపాలో చూడండి.

Wednesday, May 19, 2010

సామాన్య ప్రజలు డబ్బు కట్టాలి...ఎం.పీ లు కట్టక్కరలేదు......మరోసారి మనుష్యులను వేరుచేసే రూల్

ఇప్పుడు అధికారపూర్వంగా వెళ్ళడి. ఎం.పీ లూ, ఎం.ఎల్.ఏ లూ జాతీయ రహదారులలో ప్రయాణించేటప్పుడు టోల్ టాక్స్ కట్టనవసరంలేదు. కానీ సామాన్య ప్రజలు మాత్రం టోల్ టాక్స్ కట్టవలసినదే.

ప్రణాబ్ ముఖర్జీ ఆదిపత్యంలో ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ లో పై నిర్ణయం తీసుకుంటూ జాతీయ రహదారులలోని టోల్ టాక్స్ దూరాన్ని 80 కిలోమీటర్ల దూరం నుండి 60 కిలోమీటర్లకు తగ్గించేరు. ఈ మీటింగ్లో మన ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ కమల్ నాత్ గారు ప్రదాణ మంత్రికి రాసిన లేఖలో ఎం.పీ లనూ మరియూ ఎం.ఎల్.ఏ లనూ ఈ టోల్ టాక్స్ కట్టేవారి లిస్ట్ లో నుండి మినహాయించవలసిందిగా కోరడాన్ని అంగీకరించి, వారిని మినహాయిస్తూ రూల్ పాస్ చేసేరు.

1997 లో మొదటిసారిగా జాతీయ రహదారులలో ప్రయాణిస్తున్న ఎం.పీ మరియూ ఎం.ఎల్.ఏ లు టోల్ టాక్స్ లు కట్టనవసరంలేదని తెలిపేరు. కానీ 2008 లో ఇది సరికాదని వారుకూడా టోల్ టాక్స్ లు కట్టవలసినదేనని రూల్ తీసుకువచ్హేరు. రాజకీయనాయకులందరూ దీనిని ఎదిరించేరు. అందువలన మళ్ళీ ఇప్పుడు వారు టోల్ టాక్స్ లు కట్టనవసరం లేదని రూల్ తీసుకువచ్హేరు.

ఎం.పీ.లూ, ఎం.ఎల్.ఏ లే కాకుండా సుప్రీంకోర్ట్ మరియూ హై కోర్ట్ న్యాయమూర్తులను కూడా మినహాయింపు లిస్ట్ లో చేర్చేరు.
సామన్య ప్రజలే ఈ రూల్స్ అమలుచేస్తున్న రాజకీయనాయకులను ఎన్నుకుంటున్నప్పుడు టోల్ టాక్స్ లు కట్టవలసిన జాతీయ రహదారులను ఉపయోగించుకునే వారిలో వీరిని వేరు చేయడం. వీరి దగ్గరనుండి టోల్ టాక్స్ లు కట్టించుకుని వారు (ఎం.పీ.లు మరియూ ఎం.ఎల్.ఏ లు) మాత్రం ఉచితంగా ప్రయాణించడం......దీనివలన వారికి ఎటువంటి లాభమో అర్ధం కావటంలేదు.

20 సంవత్సరాలలో మొదటి సారిగా "మే" నెలలో ఆంద్రా తీరాన్ని తాకుతున్న తుఫాన....తుఫానల గురించి

తుఫాన, టైఫూన్ లు మరియూ హరికేన్స్...అన్నీ ఒకటే. భారతదేశంలో తుఫాన అంటారు, చైనా దేశంలో టైఫూన్ అంటారు, దీనినే అమెరికాలో హరికేన్ అంటారు...ఒకోక్క దేశంలో ఒకోక్క పేరుతో పిలువబడే ఈ ప్రక్రుతీ వైపరీత్యం సముద్రంలో నీటిఒత్తిడి తగ్గిపోయి సముద్రం పైన గాలి వేగం గంటకు 62 కిలోమీటర్లకంటే ఎక్కువగా పెరిగినప్పుడు సముద్రంలో సుడిగుండం ఏర్పడి గంటకి 150 నుండి 800 కిలోమీటర్ల వేగంతో నీరుతురుగుతుంది. దీనినే తుఫానలుగా గుర్తిస్తారు. ఈ సుడిగుండం గంటకి 300 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ తీరాన్ని చేరుకుంటుంది. ఈ వేగాన్ని బట్టే ఆ సుడిగుండం ఎటువంటిదో తీర్మానిస్తారు.

51 కిలోమీటర్ల వేగం కంటే తక్కువ ఉంటే దానిని అల్పపీడనం గా గుర్తిస్తారు. 51 నుండి 61 కిలోమీటర్ల వేగం ఉంటే దానిని తీవ్ర అల్పపీడనం గా గుర్తిస్తారు. 62 కిలోమీటర్ల వేగంకంటే ఎక్కువగా ఉంటే దానిని తుఫానగానూ, 88 కిలోమీటర్లవేగం ఉంటే తీవ్రమైన తుఫానగానూ, 222 కిలోమీటర్ల వేగం ఉంటే ఉప్పెనగానూ గుర్తిస్తారట.

బే ఆఫ్ బెంగాల్ మరియూ అరేబియన్ సముద్రాల నీరు వెచ్హగా ఉండటంవలన ఇక్కడ తుఫానలు ఎక్కువగా ఏర్పడతాయట.
ఈ తుఫానలకు పేర్లు పెట్టడానికి కారణం వాటి గురించి ప్రజలు మరియూ తుఫాన హెచ్హరిక కేంద్రాలూ త్వరగా అర్దం చేసుకోవటానికి. అలాగే తుఫాన తీవ్రతను గుర్తించటానికిట. మొదటిసారిగా 1900 సంవత్సరంలో ఆస్ట్రేలియాకు చెందిని తుఫాన హెచ్హరిక కేంద్ర అధికారి తుఫానకు పేరుపెట్టేరు. ఈయన ఆయనకు నచ్హని రాజకీయనాయకుల పేర్లు పెట్టేరట.

ఇండియన్ ఓషన్ మరియూ బే ఆఫ్ బెంగాల్ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఈ తుఫానలకు పేరు పెడతారట. ఇప్పుడు ఆంద్రా తీరాన్ని దాటుతున్న తుఫానకు "లైలా" అని పేరుపెట్టింది పాకిస్తాన్ దేశంట...ఈ సంవత్సరం ఎండ దాటికి తట్టుకోలేని ప్రజలు ఈ తుఫాన రావడాంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ రకం తీవ్రమైన తుఫానలు భారీ నష్టాన్ని ఏర్పరుస్తాయి.

ఈ మద్య వచ్హిన తుఫానలు:..."నిషా" తుఫాన....2008 నవెంబర్ నెల 25 నుండి 29 వరకు తన ప్రతాపం చూపి తమిళనాడు లో 200 మంది చనిపోవటానికి కారణమైనది. 3,700 కోట్ల రూపాయల నష్టం ఏర్పరచింది.

"బిజిలీ" తుఫాన....2009 ఏప్రిల్ 14 నుండి 17 దాకా తన ప్రతాపాన్ని చూపింది. విపరీతమైన వర్షపాతంతో ఆంద్రా, ఒరిస్సా మరియూ బంగ్లాదేశ్ లలో విపరీత నష్టం ఏర్పరచింది.

"ఐలా" తుఫాన.....2009 మే 23 నుండి 26 వరకు తన ప్రతాపాన్ని చూపింది.149 మందిని బలి తీసుకున్న ఈ తుఫాన వెస్ట్ బెంగాల్, ఒరిస్సా మరియూ బంగ్లాదేశ్ లలో 1000 ఎకరాల పంటబూములను నాసనం చేసింది .

మరి ఇప్పుడు ఏర్పడ్డ "లైలా" తుఫాన ఎంత నష్టాన్ని ఏర్పరుస్తుందో? ఇప్పటికే భారీ వర్షాలవలన, విపరీత గాలులవలన తమిళనాడు మరియూ ఆంద్రాలలో సుమారు 20 మందిని బలితీసుకుంది....ఒక ప్రక్క విపరీత ఎండ నుండి తప్పించుకున్నామనే సంతోషం ఉన్నా తుఫానవలన ఏర్పడే నష్టాన్ని తలచుకుంటే భయంగా ఉన్నది.

Tuesday, May 18, 2010

హోమియోపతి ని శూన్యం, చేతబడి తో పోల్చిన ఇంగ్లాండ్ మెడికల్ బాడీ!? నిజమంటున్న భారత డాక్టర్లు!!

హోమియోపతి చికిత్సా విధానం చేతబడి, శూన్యము తో సమానం అంటూ ఇంగ్లాండ్కు చెందిన జూనియర్ డాక్టర్లు ఓటు వేసి చెప్పేరు. ఇంతేకాకుండా హోమియోపతి చికిత్స ను పూర్తిగా రద్దుచేయాలని కోరేరు. బ్రిటీష్ మెడికల్ ఆసోసియేషన్ లో మెంబర్లుగా ఉంటున్న వందలాది డాక్టర్లు హోమియోపతి చికిత్సా విధానాన్ని ఖండిస్తూ , ప్రబుత్వం ఆదాయ పన్ను కడుతున్నవారి డబ్బును ఉపయోగంలేని, సైంటిఫికల్ గా ప్రభావము కలిగిన చికిత్సగా నిరూపించబడని ఈ హోమియోపతి చికిత్సా విధానానికి ఖర్చు పెట్టకూడదని అడిగేరు.

బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్ జూనియర్ డాక్టర్స్ కమిటీ డెప్యూటీ చైర్మాన్ డా.టాం డాల్ఫిన్ హోమియోపతి ని శూన్యముతో పోలుస్తూ ఈ చికిత్సా విధానానికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వకూడదని, ప్రభుత్వ ఆస్పత్రుల నుండి ఈ డిపార్ట్మెంటులను తీసివేయాలని అడిగేరు. బ్రిటీష్ ప్రబుత్వం సంవత్సరానికి 4 మిల్లియన్ పౌండ్లు ఈ చికిత్సా విధానానికి ఖర్చుపెడుతూ 54,000 మందికి హోమియోపతి మందులు వాడుతున్నారని ఆయన తెలిపేరు.

ఈ విషయం విన్న తరువాత భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు, శాస్త్రవేత్తలూ బ్రిటీష్ మెడికల్ అసోసియెషన్ కి తమ ఆదరణ తెలుపుతూ ఈ చికిత్సా విధాననానికి ఎటువంటి సైంటిఫిక్ రుజువులు లేవని, మందులు ఏ మోతాదులో ఇవ్వాలో ఖచ్హితంగా ఎవరూ చెప్పలేరని...కాబట్టి ఈ మందుల వలన ఎటువంటి ఉపయోగమూ లేదని తెలిపేరు.

కానీ వీరి వాదనను భారతీయ హోమియోపతీ డాక్టర్ల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.

హోమియోపతి మందుల ప్రభావం గురించి చాలామందికి అనుమానాలున్నాయి. ఆంగ్ల మందుల చికిత్సా విధానంలో లాగా ఇందులో ప్రత్యేక జబ్బులకు స్పెషలిష్టులు లేరు. అదేలాగా మందులు ఏ మొతాదులో ఇస్తే ఖచ్హితంగా పనిచేస్తాయో తెలిపే సరైన రుజువులు, వివరాలు లేవు. కాబట్టి ఈ చికిత్సా విధానన్ని మనదేశంలోకూడా ఎత్తివేయాలని, ఈ చికిత్సా విధానానికి ఖర్చు పెడుతున్న కోట్లాది రూపాయలను మనదేశ సాంస్క్రుతిక వైద్య విధానమైన ఆయుర్వేదానికి ఖర్చుపెట్టి ఆ విధానంలో, ఆ మందుల ప్రభావంపై రుజువులు తీసుకురావడానికి ఉపయోగించాలని అంటున్నారు.

నేను ఇంతవరకు ఈ చికిత్సా విధానానికి వెళ్ళలేదు. కానీ నాకు తెలిసిన కొందరు ఈ విధానంలో చికిత్సలు పొందుతున్నారు. అయినా ఆంగ్ల మందులుకూడా వాడుతున్నారు. అడిగితే కొన్నిరోజులు ఆంగ్లమందులను కూడా వాడాలని హోమియోపతి డాక్టర్లు చెప్పేరని చెబుతున్నారు.
ఈ విషయంలో మీఅభిప్రాయాలను, అనుభవాలనూ వెళ్లడించవలసిందిగా కోరుతున్నాను.

అద్భుతమైన, అందమైన మరియూ అరుదైన అంతరిక్ష ఫోటోలు (PART-2)

In sixth place is the Cone Nebula. The part pictured here is 2.5 light years in length (the equivalent of 23 million return trips to the Moon).The Perfect Storm, a small region in the Swan Nebula, 5,500 light years away, described as 'a bubbly ocean of hydrogen and small amounts of oxygen, sculpture and other elements'.Starry Night, so named because it reminded astronomers of the Van Gogh painting. It is a halo of light around a star in the Milky Way.The glowering eyes from 114 million light years away are the swirling cores of two merging galaxies called NGC 2207 and IC 2163 in the distant Canis Major constellation.The Trifid Nebula. A 'stellar nursery', 9,000 light years from here, it is where new stars are being born.
That’s the Top 10 Hubble Pictures!!!

Saturday, May 15, 2010

అద్భుతమైన, అందమైన మరియూ అరుదైన అంతరిక్ష ఫోటోలు (PART-1)

1990 లో హబ్బుల్ అనే అంతరిక్ష టెలిస్కోప్ ని పంపించేరు. మొదట్లో సరిగ్గా పనిచేయని ఈ టెలెస్కోప్ ఆ తరువాత అద్భుతమైన అంతరిక్ష ఫొటోలను 16 సంవత్సరాలుగా భూమికి పంపుతోంది.

ఈ హబ్బుల్ టెలెస్కోప్ పంపించిన ఫొటోలలో శాస్త్రవేత్తలు ఓటువేసి అద్భుతమైన 10 ఫొటొలని ఎన్నుకున్నారు.

డైలీ మైల్ దిన పత్రిక విలేఖరి "మన జగత్తు ఎంతో విచిత్రమైనదే కాకుండా ఎదురుచూడని అందాలతోనూ, అద్భుతాలతోనూ నిండి ఉన్నది" అని చెప్పేరు.

ఆ ఫొటోలని మీకందిస్తున్నాను. చూసి ఆనందించండి.

HubbleSpace Telescope
The Sombrero Galaxy - 28 million light years from Earth - was voted best picture taken by the Hubble telescope. The dimensions of the galaxy, officially called M104, are as spectacular as its appearance.It has 800 billion suns and is 50,000 light years across.
The Ant Nebula, a cloud of dust and gas whose technical name is Mz3, resembles an ant when observed using ground-based telescopes.. . The nebula lies within our galaxy between 3,000 and 6,000 light years from earthIn third place is Nebula NGC 2392, called 'Eskimo' because it looks like a face surrounded by a furry hood. The hood is, in fact, a ring of comet-shaped objects flying away from a dying star. Eskimo is 5,000 light years from Earth.At four is the Cat's Eye Nebula.The Hourglass Nebula, 8,000 light years away, has a 'pinched-in- the-middle' look because the winds that shape it are weaker at the center.

నాసా వారి అంతరిక్ష నౌక వాయేజర్-2 ని అన్యులు దారిమళ్ళించి కైవసం చేసుకున్నారు...నిపుణులు

అన్యులు, నాసా వారు పంపిన వాయేజర్-2 అంతరిక్ష నౌకను దారిమళ్ళించి కైవసం చేసుకున్నారని అన్య అంతరిక్ష నౌకలను (UFO) గురించి అన్వేషణ చేస్తూ వాటిని పరిశొదిస్తున్న నిపుణులలో ఒకరు తెలిపేరు.

హార్ట్ విగ్ హౌస్డార్ఫ్ అనే జెర్మనీ దేశానికి చెందిన నిపుణులూ, శాస్త్రవేత్త ఈ విషయం చాలావరకు నిజమేనని, దీనిని తేలికగా తీసుకోకూడదని చెబుతున్నారు. ఎలా చెబుతున్నారని అడిగినందుకు, 1977 లో నాసా వారు అంతరిక్ష పరిశొధనకు పంపిన వాయేజర్-2 అంతరిక్ష నౌక కొద్దినెలలుగా మనకు అర్ధంకాని బాషలో ఏవో సంకేతాలు పంపుతోంది. అన్యులు దానిని కైవసం చేసుకున్నందువలనే అక్కడి నుండి వస్తున్న సంకేతాలు మనకు అర్ధంకాని బాషలో ఉన్నాయని ఆయన తెలిపేరు.

వాయేజర్-2 అంతరిక్ష నౌక అంతరిక్షంలోకి పంపిన దగ్గర నుండి, అంతరిక్షంలో జరుగుతున్న విషయాలను భూమికి పంపిస్తోంది. ఆ అంతరిక్ష నౌక పంపిన సంకేతాలు మన శాస్త్రవేత్తలు అర్ధం చేసుకుని వాటిని పరిశోదిస్తున్నారు. కానీ ఏప్రిల్ 22 వ తారీఖు నుండి ఆ అంతరిక్ష నౌక నుండి వస్తున్న విషాయల సంకేతాలలో చాలా తేడా ఉంది.

అంతరిక్ష నౌకలో ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ లో ఏదో లోపం జరిగింది. అందువలనే అక్కడి నుండి వచ్హే సంకేతాలు గజిబిజిగా మనకు అర్ధం కాకుండా ఉన్నాయని నాసాలోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది నిజం కాదు. ఇది ఖచ్హితంగా అన్యుల పనేనని హార్ట్ విగ్ చెబుతున్నారు. ఎందుకంటే ఆ అంతరిక్ష నౌకలోని మిగిలిన పరికరాలు సరిగ్గానే పనిచేస్తున్నాయి కనుక.

జెర్మన్ దినపత్రిక బిల్డ్ కి ఇచ్హిన ఒక ఇంటెర్వ్యూలో "ఎవరో నౌకను కైవసం చేసుకుని అందులోని సాఫ్ట్ వేర్ ప్రొగ్రాం ని మార్చేరు. వారు ఎవరనేది మనం తెలుసుకోవాలి. వాయేజర్-2 లో ఉన్న డిస్క్ లో 55 రకాల భాషలున్నాయి.ఈ 55 భాషలున్న డిస్క్ ని "గోల్డన్ రికార్డ్" అంటారు. దీనిని ముఖ్యంగా అన్యప్రాణులకోసమే ఉంచేరు. ఎవరైనా అన్యులు నౌకకు ఎదురౌతే ఈ డిస్క్ వారికి మన మనుష్యుల గురించి వివిధ భాషలలో చెబుతుంది. అంతేకాక ఆ డిస్క్ లో ఉన్న మరో పరికరం భూమి గురించిన చిత్రాలనూ, వివరాలనూ అందిస్తుంది. అదేలాగా అక్కడేమి జరుగుతున్నదో అప్పటికప్పుడు సమాచారాన్ని మన భాషలో మనకి పంపుతుంది. మరిప్పుడు మనకు అర్ధం కాని భాషలో, మనం డీకోడ్ చేసుకోలేని భాషలో సమాచారాన్ని పంపుతోందంటే బహుశ నౌకను అన్యులు కైవసం చేసుకుని వారి భాషలో సమాచారాన్ని అందిస్తున్నారు" అని ఆయన తెలిపేరు.

Friday, May 14, 2010

అద్రుష్టవంతుడంటే ఇతనే..."డబ్బు ఆనందాన్ని కొనలేదు" 7 సార్లు చావునుండి తప్పించుకున్నతని మాటలు

క్రొయేషియాకి చెందిన 81 సంవత్సరాల ఫ్రోనో సెలెక్ అనే ఈయన అసలు సిసలైన అద్రుష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే ఈయన తన 80 ఏళ్ళ జీవితంలో 7 సార్లు చావు బారి నుండి తప్పించుకున్నాడు. ఇంతేకాక తను కొన్న మొదటి లాటరీ టికెట్టుతో 3 కోట్ల 60 లక్షల రూపాయలు గెలుచుకుని దానిని మొత్తంగా దానధర్మాలకు ఉపయోగించేడు. 5 వ సారిగా పెళ్ళిచేసుకున్న ఈయనను అడిగితే "డబ్బు ఆనందాన్ని కొనలేదు, అందుకని ఆ లాటరీలో వచ్హిన డబ్బును దానధర్మాలకు ఉపయోగించేను. నేను మామూలుగా సంపాదిస్తున్న డబ్బు నాకు సరిపోతుంది" అని చెప్పేరు.

ఈయన మొదటిసారి 1962 లో చావు నుండి తప్పించుకున్నారట. సరజీవో నుండి దుబ్రోవంక్ కు ఈయన వెడుతున్న రైలు పట్టలు తప్పి క్రింద ఉన్న ఐస్ నదిలోకి పడిపోయిందట.17 మంది చనిపోయిన ఆ సంఘటనలో ఈయన ఎలాగో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారట.

1963 లో ఈయన ప్రయాణం చేస్తున్న విమానం కిటికీ అద్దాలు పగిలి చాలామంది క్రింద పడిపోయేరు. ఈయన ఒక పెద్ద గడ్డిపోచ కుప్ప మీద పడి బ్రతికేరట.

1966 లో ఈయన ప్రయాణం చేస్తున్న బస్సు ఒక రోడ్డు మలుపులో స్వాదీనం తప్పి ప్రక్కనున్న నదిలో పడిందట. 4 గురు చనిపోయేరు.ఈయన బ్రతికేరు.

1970 లో ఈయన నడుపుతున్న కారుకు నిప్పు అంటుకున్నదట. వేగంగా వెడుతున్న తన కారులో నుండి క్రిందకు దూకేరు. కొద్ది క్షణాల తరువాత పెట్రోల్ టాంక్ పేలి కారు ముక్కలైందట.

1973 లో ఒక పెట్రోల్ బంకులో ఏర్పడ్డ అగ్ని ప్రమాదంలో ఈయన ఇరుకున్నారట. ఈయన తల వెంట్రుకలకి నిప్పు అంటుకుందట. అక్కడున్న వారు ఈయన్ను బయటకు లాగేరట. జుట్టు మొత్తం పోయిందట.

1996 లో ఈయన నడుపుతున్న కారు కొండపైనుండి లోయలోకి పడిపోయిందట. కారు పడిపోతున్నప్పుడు కారు డోర్ తెరుచుకుని ఒక చెట్టుకొమ్మని పట్టుకుని తప్పించుకున్నారట.

ఈయన ఇంతకు ముందు చేసుకున్న 4 పెళ్ళిల్లు డైవర్స్ లో ముగిసినైయట. చివరిగా కాత్రీనా అనే ఆవిడని 14 ఏళ్ళ క్రితం పెళ్ళి చేసుకున్నారట. అప్పటి నుండి అతని జీవితం సాఫీగా సాగుతొందట. అందుకెనేమో 'కాత్రీనా అంటే నాకు ప్రాణం' అంటున్నారు.

ఆనందానికి మారుపేరు ఫ్రోనో సెలెక్ అని అతని 5 వ భార్య చెబుతున్నది. లాటరీ డబ్బులన్నీ దాన ధర్మాలు చేసేరే అని ఆమెను అడిగితే 'నాకు డబ్బు అవసరంలేదు.ఫ్రోనో సెలెక్ కావలి అని చెబుతున్నది.

Thursday, May 13, 2010

ఉరిశిక్చలు అమలుచేయడంలో ఆలస్యానికి అసలుకారణాలు

అజ్మాల్ కసాబ్ తో సహా మొత్తం 309 మంది ఖైదీలు ఉరిశిక్చతో కాలం గడుపుతున్నారు. వీరిలో చాలామంది ఖైదీలు శిక్చ బడిన కాలం నుండి సంవత్సరాల తరబడి ఉరితీయబడకుండా ఉన్నారు. కారణం వీరి ఉరిశిక్చలను వారున్న రాష్ట్ర హైకోర్ట్ లేక సుప్రీం కోర్టో ఇంకా ద్రువీకరించలేకపోవడం. ఒకవేల ఈ కోర్ట్ లు ద్రువీకరించి ఉన్నా, ఖైదీల క్చమా బిక్చ పిటీషన్లు రాష్ట్రపతి దగ్గర అనుమతికోసం వేచివుండటం.
కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఉరిశిక్చ పడిన ఖైదీలను ఎక్కువ జాప్యానికి గురిచేయకుండా వారి శిక్చలను అమలుచేసేవారు. ఏవో ఒకటో, రెండో ఉరిశిక్చ లు తప్ప మిగిలిన వాటిని త్వరితంగా అమలుచేసేవారు. ఉరి తాడును బిగించి, ఖైదీలను ఉరి స్తంభానికి ఎక్కించి, ఉరి అమలుచేసే వారు (Hangman) కూడా ఎక్కువగానే ఉండేవారు.

కానీ ఏ రోజైతే మన భారత రాజ్యాంగం, ఉరిశిక్చలలో 'తాడు బిగించి చనిపోయేంతవరకు’ అనే చట్టంలో సవరణలు తీసుకు వచ్హి ఇటువంటి ఉరిశిక్చల అమలును "ప్రత్యేక శిక్చ" గా మార్చేరో ఆ రోజు నుండి ఉరిశిక్చ విధించబడ్డ ఖైదీలు ఈ సవరణను ఉపయోగించుకుని తమకు పడిన ఉరిశిక్చ ప్రత్యేక శిక్చలో రాదని హై కోర్టులలోనూ, సుప్రీం కోర్టులలోనూ వాదించి ఉరిశిక్చ నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు కోర్టులలోనూ వారి వాదనలను త్రోసిపుచ్హితే, తమకు క్చమాబిక్చ పెట్టమని రాష్ట్రపతికి తమ కోరికలను పంపిస్తున్నారు.

ఉరితాడుతో ఉరిశిక్చకు ఖైదీలు చేసిన నేరాలు సరైనవా అన్న అంశంలో జరుగుతున్న వాదోపవాదనల మధ్యలో ఎంతోమందికి విధించిన ఉరిశిక్చలను ద్రువీకరించలేకపోవడం ఉరిశిక్చ అమలుకి ఆలస్యం అవుతున్నది. దీని కారణంగా ఉరితీసేవారు (Hangman) కూడా తగ్గిపోయేరు. మరోవిధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ పనికి ఎవరూ రావడంలేదట.

ఉరితాడుతో కాకుండా వేరే పద్దతులతో ఉరిశిక్చ అమలుచేయవచ్హు. ఇందులో ప్రాముఖ్యత కలిగినవి కరెంటు కుర్చీలో కూర్చోబెట్టి ఉరితీయడం లేక ప్రాణం తీసే విష మందులను ఇంజెక్షంగా ఇచ్హి ఉరితీయడం చేయవచ్హు. అయితే మనదేశంలో ఉరితాడుతోనే ఉరిశిక్చను ఖచ్హితంగా నెరవేర్చవచ్హు అని నమ్ముతున్నారు. తాడుతో ఉరితీసే విదానాన్ని ప్రత్యేక శిక్చగా సవరణ చేసినప్పుడు, ఉరిశిక్చలను అమలుచేయడానికి మన రాజ్యాంగంలో పై చెప్పబడ్డ మార్పులు తీసుకువస్తేనే ఉరిశిక్చలను ఆలస్యం లేకుండా అమలుచేయవచ్హు, ఇందువలన నేరాలు కొంతవరకు తగ్గవచ్హు.

మొత్తం 98 దేశాలు ఉరిశిక్చను పూర్తిగా రద్దుచేసినై. 58 దేశాలు ఉరిశిక్చను అమలులో ఉంచినై. ఈ 58 దేశాలలో మనదేశంకూడా ఉన్నది. అటువంటప్పుడు మన రాజ్యాంగ చట్టాలలో ఉరిశిక్చను ప్రత్యేక శిక్చగా చేసిన సవరణను పూర్తిగా రద్దుచేయాలి లేక ఉరిశిక్చ అమలులో పద్దతులను మారుస్తూ సవరణలు తీసుకురావాలి. అంతవరకు ఉరిశిక్చ ఖైదీలు, ఉరితాడుకు దూరంగా ఉంటారు.

Wednesday, May 12, 2010

విషాదకరమైన 26/11 ముంబై సంఘటనలను సినిమాగా తీయడం న్యాయమేనా?

ఆజ్మల్ కసాబ్ కు ఉరిశిక్చ. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఉరిశిక్చను అమలుచేస్తారా లేదా అనే దానిమీద ప్రజలందరూ చర్చలు చేసుకుంటున్నారు.మారణకాండలో జీవితాలు కోల్పోయిన వారి కుటుంబీకులు అజ్మల్ కసాబ్కు ఉరిశిక్చ పడిందని సంతోషించినా, ఉరిశిక్చను అమలుచేస్తారా లేదా అనే విషయంలో ఆందోళన చెందుతున్నారు. కానీ వెండితెరపై అజ్మల్ కసాబ్ ను ఉరితీసినట్లు చిత్రీకరించేరట.

నిజ జీవితంలో ఉరిశిక్చ ఖైదీగా జైలులో తారసలాడుతున్నాడు కసాబ్. కానీ "అసోక్ చక్ర" అనే సినిమాలో ఈ నెల 28 న ఇతను ఉరితీయబడుతున్నట్లు చిత్రీకరించేరు. ముంబై నగరంలో జరిగిన విషాద సంఘటనలను ఆధారం చేసుకుని రూపొందించబడింది ఈ సినిమా.

ఈ సినిమానే కాకుండా ఒక తెలుగు సినిమా మరియూ రాంగొపాల్ వర్మ తీస్తున్న మరో సినిమా కూడా ముంబై సంఘటనలను ఆధారంచేసుకుని తీయబడ్డ సినిమాలే. రాంగోపాల్ వర్మ గారు తాజ్ హోటల్ ని సందర్సించిన విషయం మీకందరికీ తెలిసిందే. ఆ రోజే అక్కడ చూసిన విషాద సంఘటనలను తన చిత్రంలో చూపించేరట.

ముంబై మారణకాండలో చాలామంది అమాయక ప్రజలు చనిపోయేరు. అద్భుతమైన, పురాతన ఆస్తులు నాశనమైనాయి. ఆ ఘోరసంఘటనల చేదుగుర్తులు ఇంకా ఎంతోమందిని వెంటాడుతునే ఉన్నాయి.

ఈ మారణకాండ జరుగుతున్నప్పుడే దానిని ప్రత్యక్చ ప్రశారంగా అనేక టీవీ చేనల్స్ లైవ్ గా చూపించినై. భారతదేశ ప్రజలే కాకుండా, ప్రపంచంలోని ఎంతోమంది ఆ మారణకాండను ప్రత్యక్చంగా చూసేరు. అటువంటప్పుడు ఆ మారణకాండలో ఏం మిగిలిపోయిందని దానిని చిత్రించటానికి, ప్రజలకు చూపించడానికి తాపత్ర్యపడుతున్నారో అర్ధంకావటంలేదు.

ఈ సినిమాల మూలంగా ప్రజలకు ఎటువంటి నీతిని భోధించబొతారు. సినిమాలు చూసి టెర్రరిస్టులు మనసులు మార్చుకుంటారా?.....ముంబైలో 26/11 న జరిగిన విషాద సంఘటనలను చిత్రించడానికి కారణం బహుశ దానిని డబ్బుచేసుకోవడానికే కాబోలు అనిపిస్తోంది.....ఇటువంటి సినిమాలు ప్రజల మనసులని మరింతగాయ పరుస్తాయిగానీ ఓదార్చవు.

వేరుసెనగపప్పులు తినండి...మీ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోండి

ప్రతిరోజూ గుప్పెడు వేరుసెనగపప్పులు మీ ఆహారంలో చేర్చుకుంటే అది మీ ఆరొగ్యానికి చాలా మేలు చేస్తుందట. సోమవారం నాడు ప్రచురించబడ్డ ఒక స్టడీ రిపోర్ట్ లో వేరుసెనగపప్పును ప్రతిరోజూ తింటే అది నెత్తురులో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుందని తెలుపబడింది.

గుప్పెడు అని చెప్పటం కంటే, ఖచ్హితంగా చెప్పాలంటే, రోజూ 67 గ్రాముల వేరుసెనగపప్పును తింటే అది 5.71 శాతం మొత్త కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందట. అందులో 7.4 శాతం లో డెన్సిటీ కొలెస్ట్రాల్ (Low Density cholesterol….LDL) ని తగ్గిస్తుందట. దీనినే చెడ్డ కొలెస్ట్రాల్ అని కూడా చెబుతారు.

ట్రైగ్లిసరైడ్స్ (Triglycerides) ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజూ వేరుసెనగపప్పును తింటే వారి నెత్తురిలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ని 10.2 శాతంగా తగ్గిస్తుందని ఆ స్టడీలో తెలిపేరు. వేరుసెనగపప్పు మాత్రమే కాకుండా ఏ రకమైన నట్స్ తిన్నా అది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందట.
7 దేశాలలో, 25 ప్రయోగాల మూలంగా ఈ స్టడీ రిపోర్టును తయారు చేసేమని ఈ స్టడీ జరిపిన కాలిఫోర్ణియాలో ఉన్న లోమా లిండా యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ జోన్ సబేటే తెలిపేరు.

లావుగా, అంటే ఓబీస్ గా ఉన్నవారిలో కంటే, మాములుగా ఉన్నవారిలో ఉన్న కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి నట్స్ బాగా పనిచేస్తాయని ఆ రిపోర్ట్ లో తెలిపేరు.

ఆలెశ్యం దేనికి.....ఈ రోజునుండి మీ ఆహరంలో మీకు నచ్హిన నట్స్ ను చేర్చుకుని మీలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించుకోండి.

Tuesday, May 11, 2010

ఒక చిన్న ఆడపిల్ల తనలో ఉన్న చిత్రకళా నైపుణ్యాన్ని ప్రదర్శించటాన్ని ఈ వీడియోలో చూసి ఆనందించండి

సెలవులు పూర్తిచేసుకుని తిరిగివచ్హిన వెంటనే నాకు వచ్హిన ఈ క్రింది వీడియోని మీకు అందిస్తున్నాను.

ఈ వీడియోలో ఒక చిన్న ఆడపిల్ల తన చిత్రకళా నైపుణ్యాన్ని చూపడమేకాకుండా, ఆ చిత్రకళకు తీసుకున్న అంశం అక్కడున్న అందరి మనుష్యుల మనసులని కదిలించింది.

అంతగొప్ప నైపుణ్యమున్న ఆ పిల్లనూ, ఆమె చూపిన నైపుణ్యాన్ని మీరుకూడా చూడాలని ఈ వీడియోని మీకు అందిస్తున్నాను.Monday, May 3, 2010

"ట్వింకెల్ ట్వింకెల్ లిట్టిల్ స్టార్"...భారతదేశ సంగీతాల బాని లొ.....ఎంజాయ్ ది వీడియో

నేను ఈ రోజు నుండి తిరిగి మళ్ళివచ్హే మంగళవారం దాకా ఊర్లో ఉండటంలేదు. వెకేషన్ లో వెడుతున్నాను. అందువలన మీకు నా బ్లాగ్ మూలంగా ఈ వారం రోజులూ అప్ డేటెస్ అందించలేను. కాబట్టి మీరు సరదాగా ఉండటానికి ఈ వీడియోను అందిస్తున్నాను. మీలో ఎవరైనా ఇదివరకే ఈ వీడియో చూసుంటే మీకు తెలిసినవారికి అందించండి.


అంతవరకు సెలవు.

పత్రికలు,పత్రికా విలేఖర్లు అంటేనే నచ్హని ప్రపంచ వ్యాప్తంగా 40 మంది పేర్లను బయటపెట్టింది ఆర్.ఎస్.ఎఫ్(RSF)

ఆర్.ఎస్.ఎఫ్. అనేది ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వాతంత్రాన్ని పర్యవేక్చిస్తున్న ఒక సంస్త. ప్రపంచ "పత్రికా స్వాతంత్ర దినం" సందర్భంగా ఈ సంస్త ఈ 40 పేర్లనూ పేర్కొన్నది.

పత్రికలనూ, పత్రికావిలేఖరులను అనగద్రొక్కటంలో వీరు ఒక్క అడుగు కూడా వెనుకవేయరట. ఈ 40 మందిలో రాజకీయనాయకులూ, మతగురువులూ, టెర్రరిస్టులూ మరియూ ప్రబుత్వలూ ఉన్నాయి.

వీరంతా ఆధికారం ఉన్నవారు, అపాయకరమైనవారూ,దౌర్జన్యం చేసేవారూ మరియూ చట్టాన్ని చేతిలోకి తీసుకునేవారు.పత్రికా స్వాతంత్రం అంటేనే నచ్హని వీరు ప్రెస్ సెన్సార్ ని పెట్టేవారు,విలేఖరులను నిర్భందించేవారు, వారిని ఎత్తుకుపోయేవారూ, హింశల్కు గురిచేసేవారు మరియూ హత్యచేసేవారు గా ఉన్నారట.

ఈ లిస్ట్ లో అతి ముఖ్యమైన, అతి ప్రభలమైనవారు: చైనాదేశం హూ జింటో, ఇరాన్ ప్రెశిడెంట్ మొహమ్మద్ అహమదినిజాద్, రవండా ప్రెశిడెంట్ కాగామే, క్యూబా సర్వాధికారి రావుల్ కాస్ట్రో, రష్యా ప్రెశిడెంట్ వాల్డిమీర్ పుటిన్, తాలిభాన్ చీఫ్ ముల్లా ఓమర్, చెచెన్యా ప్రెశిడెంట్ రంజాన్ కదిరావ్, సోమాలియా మరియూ ఇటాలీ మిలిటంట్స్.

ఇలా ఈ లిస్ట్ పోతూనే ఉంది......అయితే ఈ లిస్టు లో భారతదేశం లేకపోవడం, మన దేశంలో ఇంకా పత్రికా స్వాతంత్రం ఉన్నదని నిరూపిస్తోంది. ఇది ఇంకా మనదేశంలో ప్రజాసామ్య పద్దతులను చేపడుతునారని తెలుపుతోంది. ఇది సంతోషకరమైన విషయం.

Saturday, May 1, 2010

ఇప్పుడు నటి సుహాసిని మీదున్న కేసులుకూడా కొట్టివేయబడ్డాయి

ఇద్దరు హీరోయిన్లు, రెండు వేరు వేరు కోర్ట్ లు,ఒకే విధమైన కేసు, ఒకే విధమైన తీర్పు, ఒకే విధమైన మనశ్శాంతి.

సుప్రీం కోర్టు నటి కుష్బూ మీద వేసిన 22 కేసులను కొట్టివేసిన మరుసటిరోజు, మద్రాస్ హై కోర్ట్ నటి సుహాసిని మీద వేసిన 8 కేసులని కొట్టివేసింది.

2005 సంవత్సరం నటి కుష్బూ ఇచ్హిన పత్రికా స్టేట్ మెంట్ కు తన మద్దత్తు తెలిపినందుకు నటి సుహాసిని మీద వివిధ కోర్టులలో 8 కేసులు నమోదు చేయబడ్డాయి. సుప్రీం కోర్ట్ కుష్బూ మీదున్న కేసులకు తీర్పు ఇచ్హినట్లుగానే, నటి సుహాసిని మీదున్న కేసులలోనూ మద్రాస్ హై కోర్ట్ తీర్పు ఇస్తూ అమె మీదున్న 8 కేసులనూ కొట్టివేసింది.

"5 సంవత్సరాల తల నొప్పికి ఒక విమోచనం లభించింది. సుమారు 20 మంది ఏ పనీ లేకపోవటంతో వాళ్ళకు తోచిన కారణాల చూపించి, నామీద కోర్టులో కేసులు వేసేరు. ఈ కేసులన్నీ కోర్టులో ఓడిపోతాయని నాకు తెలుసు. నటి కుష్బూ ఇచ్హిన ఇంటెర్ వ్యూ గురించి నన్ను అడిగినప్పుడు నేను పత్రికలవారికి ఇచ్హిన జవాబును చర్చగా తీసుకున్నారు. పాపం కుష్బూ చాలా కష్టపడింది. నాకు మాత్రం కష్టంగా ఉండేదికాదు కానీ చిరాకుగా ఉండేది" న్యూజీలాండ్ నుండి చెన్నై కి తిరిగి వచ్హిన నటి సుహాసిని తెలిపింది.

"2005 లో కుష్బూ పత్రికలకు ఇచ్హిన ఇంటెర్ వ్యూ లో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది గానీ ఎవరినీ ఉద్దేసించి మాట్లాడలేదు. కాబట్టి అమె తప్పుగా మాట్లాడింది ఏమీలేదు. ఎవరికైనా ఆమె చెప్పింది తప్పుగా అనిపిస్తే ఆమె తరఫున నేను క్చమాపణ కోరుకుంటున్నాను అన్నందుకు నామీద కేసులు పెట్టేరు".

“ఆమె (కుష్బూ) చెప్పిన జవాబు కూడా ఏఐడ్స్(AIDS) వ్యాధి మీద అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పినవే. కానీ ఆ మాట్లని "తప్పు" అని చెప్పి ఆమె మీద కేసులువేసి ఆమెను గాయపరిచేరు. ఇప్పుడు కోర్టులు నామీద, కుష్బూ మీదా పెట్టిన కేసులను కొట్టివేసినై. ఈ తీర్పులతో నా మీద, కుష్బూ మీద కేసులు పెట్టినవారు తలదించుకోవలసినదే" రిలీఫ్ తో కనబడ్డ నటి సుహాసిని తెలిపింది.