Monday, April 26, 2010

అన్య ప్రపంచం ఉన్నది,కానీ వాటి జోలికీపోతే అది మనకే ప్రమాదం...ప్రముఖ శాస్త్రవేత్త హాకింగ్ వెళ్ళడి

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త హాకింగ్ తాను తీసిన డాక్యూమెంటరీ, డిస్కవరీ చేనల్లో వచ్చేనెల ప్రశారం అవబొతున్న సినిమాలో అన్య ప్రపంచం ఖచ్హితంగా ఉన్నదని చెప్పేరు.

“స్రుష్టిలో 100 బిల్లియన్లకుపైగా నక్షత్ర సముదాయాలు ఉన్నాయి. ప్రతి నక్షత్ర సముదాయంలోనూ వందలకొలది నక్షత్ర గ్రహాలు ఉన్నాయి.భూమి మీదే మాత్రమే ప్రాణాంతర జీవులు ఉన్నాయనుకోవడం సరికాదు....నా మెథమాటికల్ బుర్రతో ఈ గ్రహాల సంఖ్యను లెక్కవేస్తే అన్య ప్రపంచం ఉందనే విషయం అబద్దంకాదని అనుకుంటున్నాను” అని తెలిపేరు.

“మనకున్న నిజమైన సవాల్ ఏమిటంటే ఈ అన్య ప్రాణులు ఎలా ఉంటాయో చూడటమే. అవి మన కంటికి కనబడని మైక్రొబ్ లుగా ఉండవచ్హు, వికార ఆకారం గల జంతువులులాగా ఉండవచ్హు లేక పెద్ద పెద్ద పురుగులులాగా ఉండవచ్హు. ఇవన్నీ కొన్ని మిల్లియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్నవే. అవన్నీ మన కళ్ళకు మామూలు ప్రాణులుగా కనబడతాయి కానీ వాటిని మనం తేలికగా తీసుకోకూడదు. ఈ అన్య ప్రాణులు మనకంటే తెలివితేటలు కలిగి ఉన్నయ్యా అని మనం తెలుసుకోవాలి. ఆ విషయం తెలుసుకోకుండా మనం వాటిజోలికి పోకూడదు”
"ఈ అన్య ప్రాణులు పెద్ద పెద్ద యంత్రాలలో నివసిస్తాయని నా అంచనా. తమకున్న తెలివితేటలతో, వనరులన్నిటినీ ఉపయొగించుకుని వారి గ్రహాలలో ఉంటున్నాయి. అన్ని తెలివితేటలున్న ఈ అన్య ప్రాణులు బహుస సంచారా జీవులుగా ఉండవచ్హు. వాటి శక్తి సామర్ధ్యాలతో దాడి చేయగల గ్రహాల మీద దాడి చేస్తూ, అక్కడ వాళ్ల నివాసాలని ఏర్పరచుకుంటూ, వారి సామ్రాజ్యాన్ని విరివిచేసుకుంటూ వారి రాజ్యాన్ని స్తాపించి ఆ గ్రహాలలోని ప్రాణులను బానిసలుగా చేసుకోవచ్హు"

పక్షవాతంతో బాధ పడుతున్న ఈ శాస్త్రవేత్త "మానవజాతి ఈ అన్యులను కలుసుకోవాలనే ప్రయత్నం మాత్రం చేయకూడదు. అలాకాక ప్రయత్నించి కలుసుకుంటే మానవజాతికే ఆపద వస్తుంది. అదేలాగా అన్యులు మన భూమి మీదకు ఎప్పుడైనా రావాలనుకుంటే అది వాళ్ళకు లాభకరంగా ఉండదు" అని హాకింగ్ తెలిపినట్లు సండే టైంస్ దినపత్రిక పేర్కొన్నది.

2 comments:

  1. ఈ విషయాలు మాకు చేర్చినందుకు ధన్యవాదాలు. దీని పూర్తి వివరాలు ఎక్కడ ప్రచురితమయ్యాయో చెప్పగలరా?

    ReplyDelete
  2. అన్య ప్రపంచ ప్రాణుల జోలికి పోతే మనకే ప్రమాదం అన్నది చాలా ప్రిమెచ్యూర్ గా అనిపిస్తుంది. ప్రమాదమా కాదా అనేది వాళ్ళతో పోలిస్తే భూలోక వాసులు అభివృధ్ధి చెందారా లేదా అనే దానిపైన ఆధార పడుతుంది. అలానే గ్రహాంతర వాసుల పరిణామం భూలోక వాసుల లా "సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ " అనే సిధ్ధాంతం ప్రకారం జరిగిందా లేదా అనే దాని మీద కూడా ఆధార పడుతుంది. వాళ్ళకి ఏ జెనెటిక్ మ్యుటేషన్ వల్లనో స్వార్ధ పరులవ్వాల్సిన అవసరం కలగక పోతే వాళ్ళ వలన మనకు వచ్చే నష్టం ఏమిటి? హాకింగ్ లాంటి వాళ్ళు తమ కోర్ ఫీల్డ్ ను తప్పుకొని బయటి విషయాల గురించి అనవసరపు స్పెక్యులేషన్లు చేయటం మానితే మంచిది.

    ReplyDelete