Tuesday, April 27, 2010

భారతదేశం ఒక ప్రపంచ చెత్త కుండీనా?

నేను ఇంతకుముందు ఒక టపాలో భారతదేశాన్ని ప్రపంచ ఎలెక్ట్రానిక్ పరికరాలకు ఒక చెత్త కుండీగా ఉపయోగిస్తున్నారని రాసేను. ఇప్పుడు తెలిసిందేంటంటే ఒక్క ఎలెక్ట్రానిక్ పరికరాలకే కాక అన్ని చెత్తలకు భారతదేశాన్ని అభివ్రుద్ది చెందినదేశాలు డస్ట్ బిన్ గా వాడుకుంటున్నారు. ఈ టపాలో రాసిన విషయాలు చదివితే మీరు ఆశ్చర్యపోతారు.

ఈ శతాబ్ధి ఆరంబంలో స్పైన్ (Spain) దేశపు బార్సిలోనా నగరం శ్రుంగార నగరంగా మారాలనీ మరియూ కనులకు విందుగా పచ్హగా కళకళలాడుతూ కనిపించాలని, చెత్తకు ప్రశిద్ది అన్న పేరును తుడిపేసుకోవాలనీ నిర్నయించుకున్నది. కాబట్టి, తమ నగరంలోని 103.7 మెట్రిక్ టన్నుల చెత్తను (చినిగిపోయిన ప్లాస్టిక్ బ్యాగులూ,ఉపయోగించిన డైయాపర్స్ మరియూ పారేసిన చేతి రుమాలాలూ) 3 నౌకా బోగీలలో దక్షిణ భారతదేశపు పెద్దగా ఉపయోగించని తూత్తుకుడి ఓడరేవుకు పంపించేరు.

ఆగస్ట్ 2008 లో తూత్తుకుడి ఓడరేవుకు వచ్హిచేరిన ఆ 3 నౌక బోగీలలోనుండి విపరీతమైన కంపురావడంతో రేవు అధికారులు వాటిని తిరిగి బార్సిలోనాకే పంపించేసేరు. కానీ 8 నెలలుగా 72.59 మెట్రిక్ టన్నుల బరువున్న, చెత్తతో (పాస్టిక్ పీచు,వాడబడిన నూనె డబ్బాలు మరియూ రబ్బర్ ముక్కలు)నిండిన 2 నౌక బోగీలు సౌదీ అరేబియాలోని జెడ్డా నగరం నుండి వచ్హినవి రేవులోనే కంపుకొడుతూ పడి ఉండటం రోత పుట్టిస్తోంది.

పోయిన సంవత్సరం మాత్రం హానికలిగించు చెత్తను 9 బోగీలలో మలేసియా,సౌదీ అరేబియా మరియూ బార్సిలోనా నుండి 3 తమిళనాడు కంపెనీలు దిగుమతిచేసుకున్నాయి. వీటిని అధికారులు పట్టుకున్నారు.అయితే, ఈ దిగుమతిచేసుకోవడం చూస్తే అభివ్రుద్ది చెందిన దేశాలు భారతదేశ గ్రామీణ ప్రాంతాలను వారి చెత్త కుండీలుగా వాడుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ సంవత్సరంకూడా 20 బోగీల హానికరమైన చెత్తను గ్రీస్ దేశం నుండీ మరియూ రీ యూనియన్ అనే ఒక ఫ్రెంచ్ కాలనీ నుండి దక్షిణ తమిళనాడులోని పేపర్ తయారుచేసే ఒక కంపెనీ తెప్పించుకుంటుంటే అధికారులు పట్టుకుని తిరిగి పంపించేసేరుట. కానీ ఆగస్ట్ 2008 లో కోయంబట్టూర్ లో ఉన్న ఒక గ్రామంలోని బావిలోనుండి వాడిన ఇంజెక్షన్ సిరెంజ్ లు,కాలీ పళ్లరసం ప్యాకెట్లు మరియూ నెత్తురు మరకలున్న రుమాలలు (napkins) లండన్ నగరం నుండి తెప్పించుకున్నవి దొరికినై.

ప్రతిదేశమూ చెత్తను రీసైకిల్ చేయాలి లేదా ద్వంశంచేయాలి. కానీ అభివ్రుద్దిచెందినదేశాలు భారతదేశాన్ని ఎందుకు చెత్తకుండీగా ఎన్నుకున్నాయ్? ఎందుకంటే ఆ దేశాలలో చెత్తను రీ సైకిల్ చేయాలంటే వారికి మెట్రిక్ టన్నుకు రూ.12,000 ఖర్చౌతుంది. దానినే మనదేశానికి పంపితే రూ.2,800 మాత్రమే వారికి ఖర్చౌతుంది. తమిళనాడులోని సిమెంట్ కంపెనీలు ఈ హానికరమైన చెత్తను, హానికరంగానివిగా రాయించి, అధికారులను ఏమార్చి తెప్పించుకుంటున్నారట.

"భారతదేశంలో ఈ బోగీలను స్కాన్ చేసే మిషిన్ లు లేవు. అంతేకాకుండా మన దేశంలో కాలుష్య చట్టాలు కఠినంగా లేవు. మేము ఇలాంటి హానికరమైన వస్తువులను పట్టుకున్నప్పుడు వాటిని దిగుమతిచేసుకున్న కంపెనీలు కోర్ట్ నుండి విమోచనాలు తెచ్హుకుంటున్నాయి" అని పేరుతెలుపని ఒక కస్టంస్ (customs) అధికారి తెలిపేరు.

ఒక బ్రిటీష్ టీ.వీ చెనల్ లండన్ నుండి చెత్త ఎలా మనదేశానికి పంపుతున్నారో వివరంగా ఒక రిపోర్ట్ లో ప్రశారంచేసింది. దీనిని చూసిన మనదేశ అధికారులు మేలుకుని కొన్నికేసులు పట్టుకున్నారు...ఇలా జరుగుతున్నప్పుడు చెత్తను (Trash) దిగుమతిచేసుకుంటున్నవారి మీద రోజూ తనిఖీ చేస్తూ, హానికరమైన చెత్తను దిగుమతి చేసుకుంటున్నవారి లైసెన్స్ లను రద్దుచేయవచ్హు కదా?

5 comments:

 1. మొదటి సారిగా వింటున్నానండి ఇలాంటి వార్తను. ఇది ఎంతో శోచనీయం.
  అధికారులు కళ్ళు తెరచి ఈ దుశ్చర్యలను అడ్డుకోవాలని ప్రార్థిస్థున్నా.

  ReplyDelete
 2. అసలు ఈ చైనా బజార్లు అన్నీ అలా ప్లాస్టిక్ చెత్త ని ఇండియా లొ డంప్ చెసే మార్గాలని నా డౌటు.

  ReplyDelete
 3. ఒక్క సారి అలొచించండి... అది వాళ్ళ తప్పా.. మన కక్కుర్తా

  ReplyDelete
 4. మన వీధుల్నీ మనపరిసరాలనీ మనమే యథేచ్చగా చెత్త కుండీలుగా, బహిర్భూములుగా వాడుకుంటూ వుంటే, మరెవరో అదేపని చెయ్యడంలో విపరీతమేమున్నది? మన్ని మనం గౌరవించుకుంటేనే వేరే వాళ్ళు మన్ని గౌరవిస్తారు. పరిసరాలకీ పర్యావరణానికీ కూడా ఇదే వర్తిస్తుందనుకుంటాను.
  - తాడేపల్లి హరికృష్ణ

  ReplyDelete
 5. This is not small thing. How world will look at India.
  these companies should be punished

  ReplyDelete