Friday, April 30, 2010

నిజమైన ఈ-మైల్స్ కంటే స్పాం ఈ-మైల్స్ ఎక్కువ వస్తున్నాయా? అవి ఏ దేశాలనుండి వస్తున్నాయో తెలుసుకోండి

సోఫాస్ అనే కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ప్రపంచం మొత్తం మీద వస్తున్న ఈ-మైల్స్ లో 97 శాతం స్పాం ఈ-మైల్సేనట. ఈ స్పాం ఈ-మైల్స్ ను పంపించేవారు చాలావరకు దొంగ వస్తువులను అమ్మేవారట. కొంతమంది మాత్రం స్పాం ఈ-మైల్స్ లో వైరస్ పపించి వారి ఆనందాన్ని తీర్చుకుంటారట.

ఏ ఏ దేశాలనుండి ఈ స్పాం ఈ-మైల్స్ ఎక్కువ వస్తున్నయో వివరాలను అందించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1) అమెరికా నుండి...13.1 శాతం.
2) ఇండియా నుండి.... 7.3 శాతం.
3) బ్రజిల్ నుండి...6.8 శాతం.
4) సౌత్ కొరియా నుండి...4.48 శాతం.
5) వియత్నాం నుండి....3.4 శాతం.
6) జెర్మనీ నుండి...3.2 శాతం.
7) ఇంగ్లాండ్ నుండి...3.1 శాతం.
8) రస్యా నుండి....3.0 శాతం.
9) ఇటాలీ నుండి...3.1 శాతం.
10) ఫ్రాన్స్ నుండి....3.0 శాతం.
11) రొమేనియా నుండి....2.5 శాతం.
12) పోలాండ్ నుండి...2.4 శాతం.

ఒకప్పుడు చైనా దేశం నుండి ఎక్కువ స్పాం ఈ-మైల్స్ వచ్హేవట. కొన్ని కఠినచర్యలు తీసుకున్నందువలన చైనా దేశం ఇప్పుడు 1.9 శాతంతో 15 వ స్థానంలో ఉన్నదట.

ఆసియా దేశాలలో భారతదేశం మరియూ సౌత్ కొరియా స్పాం ఈ-మైల్స్ కు ఒక జంక్ షన్ గా ఉన్నాయట.

చైనా నుండి వస్తున్న స్పాం ఈ-మైల్స్ తక్కువైనా ప్రపంచం మొత్తం మీద వచ్హే ఈ-మైల్స్ శాతంలో ఆసియా 33.7 శాతంతో మొదటి స్థానం లోనూ, యూరప్ 31.2 శాతంతో రెండవ స్థానంలోనూ, నార్త్ అమెరికా 16.9 శాతంతో 3 వ స్థానంలోనూ, లాటిన్ అమెరికా 14.7 శాతంతో చివరి స్థానంలోనూ ఉన్నాయట.

అమెరికా, సౌత్ కొరియా,బ్రీజిల్ మరియూ భారతదేశం నుండి కలిపి 30 శాతం స్పాం ఈ-మైల్స్ హాక్ చేయబడ్డ కంప్యూటర్లలోనుండి వస్తున్నాయట.

"చిలుక పలుకులు" వినే ఉంటారు...ఈ అద్భుతమైన వీడియోలో ఈ చిలుక మాట్లాడిన తీరు గమనించండి

ఎవరైనా అందంగా మాట్లాడితే చిలుకపలుకులు అంటాము. ఇక్కడ ఒక చిలుక నిజంగానే అద్భుతంగా మాట్లాడింది. మరి దీనిని ఏమనాలి? ఈ అద్భుతాన్ని ఎలా వివరించాలో తెలియక, ఏమనాలో తెలియక ఆ వీడియోనే మీ ముందుంచుతున్నాను. ఎలా వివరిస్తారో మీ కమెంట్ మూలంగా తెలుపండి. ఆ చిలుక పలుకులని పూర్తిగా వినండి...ఆనందించండి.

చిలుక అంత అద్భుతంగా మాట్లాడిందంటే అది ఆ చిలుకకు ఉన్న ప్రతిభనా లేక ఆ చిలుకకు పలుకులు నేర్పిన ఆ చిలుక ట్రైనర్ గొప్పదనమా?

Thursday, April 29, 2010

అశ్లీలత వీడియోను తీసివేయవలసిందిగా గూగుల్ కి, యూట్యూబ్ కి నటి రంజిత నోటీస్

స్వామీ నిత్యానందతో తాను ఉన్నట్లు చూపిన అశ్లీలత వీడియోను తీసివేయవలసిందిగా ఇంటెర్ నెట్ మేజర్ గూగుల్ కి మరియూ వారి మరో కంపెనీ యూట్యూబ్ కి నటి రంజిత తన లాయర్ మూలముగా లీగల్ నోటీస్ పంపించేరు. మే 2 వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇస్తున్నట్లు, ఆ లోపు ఆ వీడియోని తీసివేయాలని ఆ నోటీస్ లో చెప్పబడి ఉన్నది.

మార్చ్ 2 వ తారీఖు తరువాత మొదటిసారిగా నటి రంజిత మీడియాకు ఇచ్హిన స్టేట్ మెంట్ ను ఆమె లాయర్ ప్రసాంత్ మెన్ డి రాట్టా మీడియావాళ్ళకు అందిచేరు. ఆ స్టేట్ మెంట్ లో "నేను ఈ వీడియోగురించి మాట్లాడేనని కొన్ని పత్రికలు తెలుపటం పూర్తిగా స్రుష్టించబడినది మరియూ పూర్తిగా అబద్దమైనది" అని అమె చెప్పేరు.

రంజిత ఒక కష్టజీవి, పట్టుదల గల వ్యక్తి. నీతికి కట్టుబడ్డ ఈమె తన 20 సంవత్సరాల సినీజీవితంలో ఎటువంటి చర్చలకూ లోనవలేదు. ఎవరూ కూడా ఈమే గురించి తప్పుగా మాట్లాడలేదు అని ఆమె లాయర్ తెలుపుతూ రంజిత గారు ఈ విషయం గురించి మీడియావారితో ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు అని తెలిపేరు.

తనమీద మోపబడిన ఆరొపణతో మనొబాధకు లోనైన రంజిత కొన్నిరోజులు నలుగురిలోనూ తిరగక తన మనశ్సాంతికై తన కుటుంబంతో గడపదలుచుకున్నట్లు, కానీ ఆమె అవసరమైనవారితో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని మరిచిపోవటాని ప్రయత్నిస్తున్నట్లు అమె లాయర్ తెలిపేరు.

మొదట ప్రముఖ టెలివిషన్ వారు చూపించిన వీడియో ను ఆ వీడియో నిజమైనదో కాదో తెలుసుకోకుండానే మీడియా వారూ తమ ఇష్టం వచ్హినట్లు వాడుకున్నారని ఆ స్టేట్ మెంట్ లో ఉన్నది. అది యధార్ధమైన వీడియోనా? ఆ వీడియోలో ఉన్న ఆడమనిషి నిజంగా ఈమేనా మరియూ రహస్యముగా తీయబడిని ఈ వీడియో ఒక ౠజువుగా కోర్టు తీసుకుంటుందా అన్నది చూడాలి.

ఈ వీడియో క్లిప్పింగ్ భారత చట్టాలను ఉల్లంఘించింది. నటి రంజితపై ద్వేషంతో, పగతో అమెను నిర్మూలించటానికి మరియూ ఖచ్హితంగా అమెకు హాని కలిగించటానికి ఆమెపై జోడించబడింది. ఆ వీడియోలో ఉన్నది తానుకానని, ఆ విడియో తన జీవితం, పరువు, ప్రతిష్ట లకు అపాయకరంగా ఉన్నదని ఆమె చెప్పింది.. ఇలాంటి వీడియో తీయటమూ ఒక తప్పు, దానీ చూపించడం, దానిని ఇంటెర్ నెట్లో వేయడం, అక్కడినుండి దానిని డౌన్లోడ్ చేసుకోవటం కూడా తప్పేనని ఆమె స్టేట్ మెంట్ లో తెలిపింది.

అలాగే రంజిత తో కర్నాటకా పోలీసులు మాట్లాడినట్లు వచ్హిన వార్తలు కూడా తప్పు. వీటిమీదకూడా మేము చట్టరీత్యా చర్య తీసుకుంటాము అని చెప్పేరు.

వాయిదా పై వాయిదాతో 24 సంవత్సరాలు నడిచిన కేసు...చివరికి కోట్టివేయబడింది

ఒక కేసుకు 24 సంవత్సరాలు అతిపెద్ద జీవితకాలంతో సమానం...అందులోనూ న్యాయం జరుగుతుందన్న కేసు. ఈ కేసు నడిచిన కాలం ఎంతపెద్దదో ఆ కేసులో నింద మోపబడిన ఆయన్నే అడగాలి.

ఇప్పుడు 61 సంవత్సారాల వయసున్న అరున్ కక్కర్ ఒక నిందితుడుగా కోర్ట్ చుట్టూ 24 సంవత్సరాలు తిప్పబడ్డారు. ఇతనితోపాటూ మరో 4 గురుని నిందితులుగా పేర్కొన్నారు. కానీ వీరెవరిమీదా నేరారోపణలు వ్రాయబడలేదు. కాలం ఎవరికోసం ఆగదుకదా? ఈ లోపు ఈ కేసుకు సంభందించిన 4 గురు చనిపోయేరు. ముగ్గురు లాయర్లు మరియూ ఒక నిందితుడు. కక్కర్ మీద మోపబడ్డ నేరం ఏమిటంటే అతను తన వ్యాపారంలో ( జిప్పులూ, కాటన్ గుడ్డలూ మరియూ పాలియస్టర్ గుడ్డలూ) 21 లక్షల రూపాయలు కస్టంస్ డ్యూటీ కట్టకుండా ప్రబుత్వాన్ని మోసంచేసేడని.

"ఈ కేసు తలరాత ఏమిటంటే...వాయిదా పై వాయిదా. 24 సంవత్సరాలలో నా క్లయంట్ పై ఎటువంటి ౠజువూ చూపించకపోవడం, ఆరోపణను నమోదుచేయక పోవడం. ఇది న్యాయ చరిత్రలోనే ఒక హాస్య కావ్యంగా ఉన్నది" అని కక్కర్ లాయర్ రాజీవ్ దావర్ అన్నారు.
ప్రబుత్వ తరఫు న్యాయవాది మాలా సర్మ "వీరి మీద (చనిపోయిన నిందితుడితో సహా) నేరం చేసేరని చెప్పటానికి కావలసిన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలతో వారి మీద చార్జ్ షీట్ ఫైల్ చేయవచ్హు. అంతే కాకుండా ఈ కేసులో లిఖిత పూర్వంగా వాదోపవాదాలు సమర్పించబడ్డాయి" అని చెప్పేరు.

కానీ సమర్పించ బడ్డ లిఖిత పూర్వ వాదాలలొ ఎక్కడా నిందితులు నేరం చేసేరని (నేరం చేసినట్లుగానీ) నిరూపించబడలేదని కక్కర్ న్యాయవాది తెలిపేరు.

ప్రబుత్వ తరపు న్యాయవాది వాదనతో విసుగెత్తిపోయిన న్యాయమూర్తి "మొత్తం 36 సాక్చులలో, 1986 నుండి ఇప్పటివరకు 5 గురినే విచారించేరు. వాళ్ళిచ్హిన వాంగ్మూలాలలో కూడా వీరెవరూ నిందితులుగా పేర్కోనబడలేదు. అంతే కాకుండా వారి వాంగ్మూలం నిస్చయముగాలేవు. అనుమానాలతోనూ, ఊహలతోనూ ఒకరు నేరం చేసి ఉండవచ్హునని కోర్ట్ వారిని నేరస్తులుగా పరిగనించదు. ఈ కోర్ట్ మీతో, మీరు చెప్పిన విధంగా లిఖిత పూర్వకంగా సమర్పించబడ్డ వాదనలతో ఏకీభవించదు" చెబుతూ కేసును కోట్టివేస్తున్నాననే తీర్పును ఇచ్హేరు.

Wednesday, April 28, 2010

రాజకీయ అధికారం మనుష్యులను అవినీతిపరులుగా మారుస్తుందా?

"రాజ్ నీతి" హిందీ సినిమాలో రాజకీయనాయకుడిగా నటిస్తున్న నటుడు అజై దేవగన్ "సినిమాలో రాజకీయనాయకుడిగా నటించటం చాలా తేలిక. అదే నిజ జీవితంలో ఆ పని చేయలేను. ఎందుకంటే రాజకీయం మనుష్యులను అవినీతిపరులుగా మారుస్తుంది. అంతేకాక రాజకీయాలు జరపాలంటే మనం చాలా తెలివితేటలు ఉపయోగించాలి, ఎన్నో ఆటలు ఆడాలి" అని ఐఏఎనెస్ (IANS) కు ఇచ్హిన ఒక ఇంటర్ వ్యూలో చెప్పేరు.

"నేను రాజకీయాలు చేయలేను. నేను దానికి తగినవాడినికాను. మంచి రాజకీయం చేయాలన్నా ఎంతోమంది చెడ్డవారిని ఎదుర్కోవాలి. నేను దానికి పనికిరాను" అన్నారు.

"యువ" సినిమాలో కూడా రాజకీయాలలోకి దిగే యువకుడిగా నటించేడు అజై దేవగన్.

"రాజకీయం మంచిదికాదని నేను చెప్పడంలేదు. రాజకీయాలలోకి వచ్హిన వారు, అలా వచ్హిన తరువాత సరిగ్గా ఉండటంలేదు. రాజకీయం దేశానికి చాలా అవసరం. అందులోనూ మంచి రాజకీయం ఈ ప్రపంచాన్ని నడపడానికి ఎంతో అవసరం. నిజాయతీ గలవారు రాజకీయాలలోకి వస్తే అది దేశాన్ని అభివ్రుద్ది చేస్తుంది" అన్నారు.

"రాజకీయం మనుష్యులను అవినీతిపరులుగా చేస్తుందని నా నమ్మకం. ప్రజలకు మంచి చేయాలనుకుని రాజకీయాలలోకి వచ్హినవారుకూడా, రాజకీయాలలోకి వచ్హినతరువాత అవినీతిపరులుగా మారుతున్నారు. దీనికి మనం రాజకీయనాయకులను తప్పుపట్టకూడదు. వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు? మన సంఘము నుండే వస్తున్నారు. వాళ్ళను మనమే తీసుకోస్తున్నాము. వాళ్ళు అవినీతిపరులుగా ఉంటున్నారంటే, మనం అవినీతిపరులుగా ఉంటున్నాము...మన సంఘం అవినీతిపరులుగా ఉంటోంది. ఎవరిని మనం తప్పు పట్టాలి?" అడిగేరు.

ఈ రాజ్ నీతి సినిమాలో నటి కత్రినాకైఫ్ సోనియాగాంధీ వేషం వేసిందని చెబుతున్నారు అని అడిగినందుకు "నిజ జీవిత మనుష్యులనో, రాజకీయనాయకులనో ఉద్దేసించి ఏ పాత్రనూ పోషించలేదు. అయితే నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇందులో ఉన్నాయి. అవి బహుస మీరు పేపర్లలో చదివే ఉంటారు. సినిమా చూస్తె మీకే అర్ధమౌతుంది" అన్నారు.

ఆయన నిజం చెప్పేరనిపిస్తోంది.

భారతదేశస్తులు విపరీతమైన ఎండను పొందగలుగుతున్నారు కానీ ఆ ఎండవలన పొందవలసిన మంచిని పొందటంలేదు

ఎండలవలన చిరాకు పొందుతున్న మనం ఎండవలన పొందవలసిన మంచి ఏమిటని అనుకుంటున్నారు కదూ. ఎండ మనకు విటమిన్-డీ ని అందించాలి. విటమిన్-డీ మనిషికి ఎంతో ముఖ్యమైన విటమిన్. భరత ఖండం ఎక్కువ ఎండకు ప్రశిద్ది పొందింది. కాబట్టి భారతీయులకు విటమిన్-డీ కొరత రాకూడదు. కానీ విపరీతమైన ఎండలని ఎదుర్కొంటున్న మనలో విటమిన్-డీ అతి తక్కువగా ఉన్నది. దీని వలన మనం అనేక వ్యాధులతో బాధపడుతున్నం.

సూర్యరస్మి లోని అల్ట్రా వైలెట్ రేస్ మన చర్మాన్ని తాకిన వెంటనే అది విటమిన్-డీ గా మారి మనకు అందాలి. కానీ విపరీత ఎండలున్నా వాతావర్ణంలోనీ కాలుష్య పదార్ధాలు సూర్యరస్మిలోని అల్ట్రా వైలెట్ రేస్ ను అడ్డుకుని ఉత్త సూర్యరస్మి వేడిని మాత్రం మనకు అందితొస్తోంది. ఇదొక్కటే కాకుండా భారత దేశ ప్రజల చర్మంలో ఉన్న 'మెలానిన్ విటమిన్-డీ తయారవకుండా అడ్డుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్-డీ మన శరీరంలోని ఎముకలను కాపాడుతూ, ఎముకలకు కావలసిన కాల్సియుం ను అందిస్తుంది. ఈ మధ్య జరిపిన పరిశొదనలలో వ్యాధి నిరోధకానికి ఇది చాలా ముఖ్యమైనదని తెలిసింది. కాబట్టి విటమిన్-డీ మనకు చాలా అవసరం. చాలా రకాల( మాటి మాటికీ జబ్బు పడటం, జ్వరం రావడం, టీ.బీ మరియూ క్యాన్సర్) వ్యాధులకు విటమిన్-డీ తక్కువగా ఉండటము ఒక పెద్దకారణంగా చెబుతున్నారు. ముఖ్యముగా కారణమే లేకుండా వస్తున్న వెన్ను నొప్పి ( ఈ మధ్య చాలామంది దీనితో బాధ పడుతున్నారు).

సూర్యరస్మి, ఎండ తక్కువుగా ఉన్న దేశాలు ఈ విషయాన్ని ఎప్పుడో తెలుసుకుని తమ దేశాలలొ అమ్ముతున్న ఆహారపదార్ధాలలో విటమిన్-డీ ఖచ్హితంగా కలపాలని చెప్పి, ఇప్పుడు కలిపినవే అమ్ముతున్నారు.

కాబట్టి మనం కూడా విటమిన్-డీ ని తప్పకుండా తీసుకోవాలి. మనం తినే ఆహారపదార్ధాలలో ఇది ఎక్కువగా లేదు. కాబట్టి దీనిని టాబ్లెట్ మూలంగా తీసుకోవాలి. ఈ మధ్య చేసిన స్టడీలో ఒక మనిషికి 800 యూనిట్ల కాల్షియం అవసరమని తెలుసుకున్నరు. కానీ మన మందుల తయారి కంపెనీవారు ఇంకా 400 యూనిట్ల టాబ్లెట్సే తయారుచేస్తున్నారు.

కనుక మనమందరం కాల్షియం ను రోజూ తప్పక తీసుకొని మన ఆరొగ్యాన్ని బలపరచుకోవాలి. మీడాక్టర్లను కలిసి రోజుకు ఎంత కాల్షియం మీకు అవసరమో కనుక్కోని దానికి తగిన విధంగా కాల్షియం వాడి విటమిన్-డీ వలన వచ్హే వ్యాధులనుండి బయటపడాలి.

70 సంవత్సరములుగా తిండి, నీరు లేకుండా బ్రతుకుతున్న అతన్ని భారత శాస్త్రవేత్తలు పరిశోదిస్తున్నారు

వారం రోజులనుండి డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవెలెప్మెంట్ ఆర్గనైషేషన్(DRDO)కు చెందిన శాస్త్రవేత్తలు మరియూ స్పెసలిష్ట్ డాక్టర్స్ బ్రుందం 70 సంవత్సరములుగా తిండి,నీరు తీసుకోకుండా బ్రతుకుతున్నానని చెప్పినతన్ని పరిశోదిస్తున్నారు.

82 సంవత్సరముల వయసున్న ప్రహలాద్ జని అనే ఈయనను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉంచి పరిసీలిస్తున్నారు.తమ పరిశోదనలలో తిండి, నీరు లేకుండా బ్రతకడం ఏలా అనే విషయంలో ఏవైనా కిటుకులు దొరికితే వాటిని మన సాయుధ దళాలకు నేర్పించి వారికి అవసరమైనప్పుడు కొన్ని రోజులు బ్రతకటానికి పనికివస్తుందనే ఆశతో ఉన్నారు.

“ప్రస్తుతానికి అన్ని విషయములూ రహస్యముగా ఉంచుతాము. పూర్తి నిజాలు ఖచితంగా తెలిసినప్పుడు వాటిని అందరితోనూ పంచుకుంటాము" అని డి.ఆర్.డి.ఓ. అధికారి డాక్టర్ వసనా రెడ్డి తెలిపేరు. స్టెర్లింగ్ హాస్పిటల్ వారు ఈ పరిశొదనలో సహాయపడుతున్నారు.పరిశోదనా ఫలితాలు తెలుసుకుంటే అవి మానవజాతికి ప్రక్రుతీ వైపరీత్యాలలోనూ, విపరీతమైన ఒత్తిడి లలోనూ అంతే కాక అన్య ప్రాణుల పరిశొధనార్ధం చంద్ర గ్రహానికి లేక ఇంకేదైనా గ్రహానికో మానవజాతి వెళ్ళినప్పుడు తిండీ,నీరూ లేకుండా ఎలా బ్రతకాలో తెలుసుకుని ఉపయోగించుకోవచ్హు నని చెబుతున్నారు.

15 రోజులు జరగబోతున్న ఈ పరిశోధనలో 35 డాక్టర్లు (డి.ఆర్.డీ.ఓ.,డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిసియాలజీ అండ్ అల్లైడ్ సైన్స్ కు సంబంధించిన వారు) ఉన్నారు. 24 గంటలూ ఆయనను పర్యవేక్చించటానికి 2 వీడియో కెమేరాలు ఆయనున్న హాస్పిటల్ గదిలో ఉంచేరు. ఆయన మంచం నుండి దిగి అటూ ఇటూ నడిస్తే గమనించటానికి ఒక మొబైల్ కెమేరా ఫోన్ ఉంచేరు. ఆయనున్న గదికి సీల్ వేసి ఉంచేరు. ఆయన అడిగినందున ఆయనున్న గది బాత్ రూం కి కూడా సీలువేసి ఉంచేరు.

సొనో గ్రాఫిక్ టెస్ట్ మూలంగా తెలుసుకున్నదేమిటంటే ఆయన యూరిన్ బ్లాడర్‌లో నీరుజేరుతోంది కానీ అది కాసేపట్లో కనబడకుండాపోతోందిట.
"ఇది ప్యూర్ గా ఒక సైన్స్ ఎక్స్ పరిమెంట్. ఈయన ఏమీ తినడంలేదు, త్రాగడంలేదు అని తెలుసుకోవటానికి ఈ విధముగా చేస్తున్నము" అని పరిశోధనా ప్యానెల్ లో ఒకరైన ఐఐఎం-ఏ(IIM-A) ప్రొఫెసర్ అనిల్ గుప్తాగారు తెలిపేరు.

ఈయన మీద పరిశోధన చేయటం ఇది మొదటిసారికాదు. 2003 లో ఒక సారి డాక్టర్ సుధీర్ షా బ్రుందం ఈయనను పరిశొధంచింది. వారి పరిశోధనా వివరాలు www.neuro.org వెబ్ సైట్ లో ఉన్నాయట.

అహమదాబాద్ కు చెందిన ఈయన 7 సంవత్సరాల వయసులో ఇల్లువదిలి వచ్హేరుట. అప్పటి నుండి నర్మదా నది సమీపంలో ఉన్న మౌంట్.అబూ (Mt.Abu) అడవిప్రాంతములో తిరుగుతూ ఉండేవారట. ఎందుకనో ఈయనకి తిండి మీద, నీరు మీద, మూత్ర,మల విసర్జనల మీద విరక్తి పుట్టిందట. తన పేలెట్ నుండి వస్తున్న ఎలిక్ సర్ ను ఉపయోగించుకుని ఆరొగ్యముగానూ, బలంగానూ ఉంటున్నానని ఆయన చెబుతున్నారు.

ఇతని బందువులని హాస్పిటల్ 7 వ అంతస్తులో ఉంచేమని చెబుతున్నారు. కానీ, ఈయనకు అసలు ఎవరూ లేరని హాస్పిటల్లో పనిచేస్తున్నవారు తెలిపేరు.

Tuesday, April 27, 2010

మీ నడకతో మీ మొబైల్ ను చార్జ్ చేసుకోవచ్హు

కొద్ది రోజులలో రాబోతున్న ఒక కొత్త పరికరంతో మీరు నడుస్తూ (మీ నడకవలన) మీ మొబైల్ ఫోనునిగానీ, లాప్ టాప్ ను గానీ, ఐపాడ్ ను గానీ చార్జ్ చేసుకోవచ్హు. నమ్మలేకపోతున్నారు కదూ...కానీ నమ్మాలి. ఎందుకంటే ఈ రోజు అతివేగంగా అభివ్రుద్ది చెందుతున్న టెక్నాలజీ మనల్ని ఆశ్చర్య పరిచే పరికరాలని మనకి అందిస్తోంది కాబట్టి.

జార్జియా టెక్నాలజీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక కొత్త పరికరాన్ని కనిపెట్టేమని చెబుతున్నారు. మనం నడుస్తున్నప్పుడూ, పరిగెత్తుతున్నప్పుడూ మన శరీర కదలికలవలన కరెంట్ ను ఉత్పత్తిచేసే పరికరం. పైజో ఎలెక్ట్రానిక్స్ (PIEZOELECTRONICS) మెటీరియల్స్ తో మన శరీర కదలికల నుండి కరెంట్ ను ఉత్పత్తిచేసే పరికరాన్ని కనుగొన్నారు.

ఈ పైజో ఎలెక్ట్రిక్స్ సుమారు 1.26 వోల్టుల దాకా మరియూ అంతకంటే ఎక్కువ కరెంట్ ను ఉత్పత్తిచేస్తుందని డిస్కవరీ చేనల్ తెలిపింది.
"ఈ టెక్నాలజీ పోనుపోనూ అభివ్రుద్ది చెంది రాబోవు కాలంలో మనకి చాలా ఉపయోగపడుతుంది" అని ఆ పరిశొధన టీం లోని శాస్త్రవేత్త జెడ్.ఎల్.వాంగ్ అన్నారు. "మన ప్రతి కదలిక అంటే ఒక అడుగువేసినా ఆ కదలిక నుండి ఎలెక్ట్రిసిటీ తయారుచేసుకోవచ్హు. అదే మనం కొంచం వేగంగా నడిస్తెనో లేక పరిగెడితేనో ఆ కదలికల వలన తయారయ్యే కరెంట్ ఒక మొబైల్ ఫోన్ నుగానీ,ఒక లాప్ టాప్ నుగానీ లెక ఐపాడ్ నుగానీ చార్జ్ చేస్తుంది" అనికూడా తెలిపేరు.

3 స్కవైర్ సెంటీమీటర్ (SQURE CENTIMETER) లో 20,000 నానో వైర్లను (NANOWIRES) ఉపయోగించి, ప్రపంచంలోనే మొదటి పైజో ఏలెక్ట్రిక్ మెటీరియల్‌తో పనిచేసే పరికరాన్ని కనిబెట్టేరు.

ఈ పైజో ఎలెక్ట్రిక్ మెటీరియల్ అనేది మనం జరిగినప్పుడు, ముందుకు ఊగినప్పుడు మనలో ఏర్పడే కదలికలవలన కరెంట్ ను ఉత్పత్తిచేస్తుంది. ఇంకా కొన్ని సంవత్సరాలలో (3 లేక 5) నానో వైర్ లతో కూడిన పైజో ఎలెక్ట్రిక్ పరికరాన్ని మన షర్ట్ కాలర్లలోనో లేక మన షూ హీల్స్ లోనో పెడితే అది మనం నడిచేటప్పుడు (కొద్ది నడకతోనే) కలిగే కదలికతో కరెంట్ తయారుచేసి మన మొబైల్ ఫోన్ లేక లాప్ టాప్ బ్యాటరీ ని చార్జ్ చేస్తుందిట.

భారతదేశం ఒక ప్రపంచ చెత్త కుండీనా?

నేను ఇంతకుముందు ఒక టపాలో భారతదేశాన్ని ప్రపంచ ఎలెక్ట్రానిక్ పరికరాలకు ఒక చెత్త కుండీగా ఉపయోగిస్తున్నారని రాసేను. ఇప్పుడు తెలిసిందేంటంటే ఒక్క ఎలెక్ట్రానిక్ పరికరాలకే కాక అన్ని చెత్తలకు భారతదేశాన్ని అభివ్రుద్ది చెందినదేశాలు డస్ట్ బిన్ గా వాడుకుంటున్నారు. ఈ టపాలో రాసిన విషయాలు చదివితే మీరు ఆశ్చర్యపోతారు.

ఈ శతాబ్ధి ఆరంబంలో స్పైన్ (Spain) దేశపు బార్సిలోనా నగరం శ్రుంగార నగరంగా మారాలనీ మరియూ కనులకు విందుగా పచ్హగా కళకళలాడుతూ కనిపించాలని, చెత్తకు ప్రశిద్ది అన్న పేరును తుడిపేసుకోవాలనీ నిర్నయించుకున్నది. కాబట్టి, తమ నగరంలోని 103.7 మెట్రిక్ టన్నుల చెత్తను (చినిగిపోయిన ప్లాస్టిక్ బ్యాగులూ,ఉపయోగించిన డైయాపర్స్ మరియూ పారేసిన చేతి రుమాలాలూ) 3 నౌకా బోగీలలో దక్షిణ భారతదేశపు పెద్దగా ఉపయోగించని తూత్తుకుడి ఓడరేవుకు పంపించేరు.

ఆగస్ట్ 2008 లో తూత్తుకుడి ఓడరేవుకు వచ్హిచేరిన ఆ 3 నౌక బోగీలలోనుండి విపరీతమైన కంపురావడంతో రేవు అధికారులు వాటిని తిరిగి బార్సిలోనాకే పంపించేసేరు. కానీ 8 నెలలుగా 72.59 మెట్రిక్ టన్నుల బరువున్న, చెత్తతో (పాస్టిక్ పీచు,వాడబడిన నూనె డబ్బాలు మరియూ రబ్బర్ ముక్కలు)నిండిన 2 నౌక బోగీలు సౌదీ అరేబియాలోని జెడ్డా నగరం నుండి వచ్హినవి రేవులోనే కంపుకొడుతూ పడి ఉండటం రోత పుట్టిస్తోంది.

పోయిన సంవత్సరం మాత్రం హానికలిగించు చెత్తను 9 బోగీలలో మలేసియా,సౌదీ అరేబియా మరియూ బార్సిలోనా నుండి 3 తమిళనాడు కంపెనీలు దిగుమతిచేసుకున్నాయి. వీటిని అధికారులు పట్టుకున్నారు.అయితే, ఈ దిగుమతిచేసుకోవడం చూస్తే అభివ్రుద్ది చెందిన దేశాలు భారతదేశ గ్రామీణ ప్రాంతాలను వారి చెత్త కుండీలుగా వాడుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ సంవత్సరంకూడా 20 బోగీల హానికరమైన చెత్తను గ్రీస్ దేశం నుండీ మరియూ రీ యూనియన్ అనే ఒక ఫ్రెంచ్ కాలనీ నుండి దక్షిణ తమిళనాడులోని పేపర్ తయారుచేసే ఒక కంపెనీ తెప్పించుకుంటుంటే అధికారులు పట్టుకుని తిరిగి పంపించేసేరుట. కానీ ఆగస్ట్ 2008 లో కోయంబట్టూర్ లో ఉన్న ఒక గ్రామంలోని బావిలోనుండి వాడిన ఇంజెక్షన్ సిరెంజ్ లు,కాలీ పళ్లరసం ప్యాకెట్లు మరియూ నెత్తురు మరకలున్న రుమాలలు (napkins) లండన్ నగరం నుండి తెప్పించుకున్నవి దొరికినై.

ప్రతిదేశమూ చెత్తను రీసైకిల్ చేయాలి లేదా ద్వంశంచేయాలి. కానీ అభివ్రుద్దిచెందినదేశాలు భారతదేశాన్ని ఎందుకు చెత్తకుండీగా ఎన్నుకున్నాయ్? ఎందుకంటే ఆ దేశాలలో చెత్తను రీ సైకిల్ చేయాలంటే వారికి మెట్రిక్ టన్నుకు రూ.12,000 ఖర్చౌతుంది. దానినే మనదేశానికి పంపితే రూ.2,800 మాత్రమే వారికి ఖర్చౌతుంది. తమిళనాడులోని సిమెంట్ కంపెనీలు ఈ హానికరమైన చెత్తను, హానికరంగానివిగా రాయించి, అధికారులను ఏమార్చి తెప్పించుకుంటున్నారట.

"భారతదేశంలో ఈ బోగీలను స్కాన్ చేసే మిషిన్ లు లేవు. అంతేకాకుండా మన దేశంలో కాలుష్య చట్టాలు కఠినంగా లేవు. మేము ఇలాంటి హానికరమైన వస్తువులను పట్టుకున్నప్పుడు వాటిని దిగుమతిచేసుకున్న కంపెనీలు కోర్ట్ నుండి విమోచనాలు తెచ్హుకుంటున్నాయి" అని పేరుతెలుపని ఒక కస్టంస్ (customs) అధికారి తెలిపేరు.

ఒక బ్రిటీష్ టీ.వీ చెనల్ లండన్ నుండి చెత్త ఎలా మనదేశానికి పంపుతున్నారో వివరంగా ఒక రిపోర్ట్ లో ప్రశారంచేసింది. దీనిని చూసిన మనదేశ అధికారులు మేలుకుని కొన్నికేసులు పట్టుకున్నారు...ఇలా జరుగుతున్నప్పుడు చెత్తను (Trash) దిగుమతిచేసుకుంటున్నవారి మీద రోజూ తనిఖీ చేస్తూ, హానికరమైన చెత్తను దిగుమతి చేసుకుంటున్నవారి లైసెన్స్ లను రద్దుచేయవచ్హు కదా?

Monday, April 26, 2010

అన్య ప్రపంచం ఉన్నది,కానీ వాటి జోలికీపోతే అది మనకే ప్రమాదం...ప్రముఖ శాస్త్రవేత్త హాకింగ్ వెళ్ళడి

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త హాకింగ్ తాను తీసిన డాక్యూమెంటరీ, డిస్కవరీ చేనల్లో వచ్చేనెల ప్రశారం అవబొతున్న సినిమాలో అన్య ప్రపంచం ఖచ్హితంగా ఉన్నదని చెప్పేరు.

“స్రుష్టిలో 100 బిల్లియన్లకుపైగా నక్షత్ర సముదాయాలు ఉన్నాయి. ప్రతి నక్షత్ర సముదాయంలోనూ వందలకొలది నక్షత్ర గ్రహాలు ఉన్నాయి.భూమి మీదే మాత్రమే ప్రాణాంతర జీవులు ఉన్నాయనుకోవడం సరికాదు....నా మెథమాటికల్ బుర్రతో ఈ గ్రహాల సంఖ్యను లెక్కవేస్తే అన్య ప్రపంచం ఉందనే విషయం అబద్దంకాదని అనుకుంటున్నాను” అని తెలిపేరు.

“మనకున్న నిజమైన సవాల్ ఏమిటంటే ఈ అన్య ప్రాణులు ఎలా ఉంటాయో చూడటమే. అవి మన కంటికి కనబడని మైక్రొబ్ లుగా ఉండవచ్హు, వికార ఆకారం గల జంతువులులాగా ఉండవచ్హు లేక పెద్ద పెద్ద పురుగులులాగా ఉండవచ్హు. ఇవన్నీ కొన్ని మిల్లియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్నవే. అవన్నీ మన కళ్ళకు మామూలు ప్రాణులుగా కనబడతాయి కానీ వాటిని మనం తేలికగా తీసుకోకూడదు. ఈ అన్య ప్రాణులు మనకంటే తెలివితేటలు కలిగి ఉన్నయ్యా అని మనం తెలుసుకోవాలి. ఆ విషయం తెలుసుకోకుండా మనం వాటిజోలికి పోకూడదు”
"ఈ అన్య ప్రాణులు పెద్ద పెద్ద యంత్రాలలో నివసిస్తాయని నా అంచనా. తమకున్న తెలివితేటలతో, వనరులన్నిటినీ ఉపయొగించుకుని వారి గ్రహాలలో ఉంటున్నాయి. అన్ని తెలివితేటలున్న ఈ అన్య ప్రాణులు బహుస సంచారా జీవులుగా ఉండవచ్హు. వాటి శక్తి సామర్ధ్యాలతో దాడి చేయగల గ్రహాల మీద దాడి చేస్తూ, అక్కడ వాళ్ల నివాసాలని ఏర్పరచుకుంటూ, వారి సామ్రాజ్యాన్ని విరివిచేసుకుంటూ వారి రాజ్యాన్ని స్తాపించి ఆ గ్రహాలలోని ప్రాణులను బానిసలుగా చేసుకోవచ్హు"

పక్షవాతంతో బాధ పడుతున్న ఈ శాస్త్రవేత్త "మానవజాతి ఈ అన్యులను కలుసుకోవాలనే ప్రయత్నం మాత్రం చేయకూడదు. అలాకాక ప్రయత్నించి కలుసుకుంటే మానవజాతికే ఆపద వస్తుంది. అదేలాగా అన్యులు మన భూమి మీదకు ఎప్పుడైనా రావాలనుకుంటే అది వాళ్ళకు లాభకరంగా ఉండదు" అని హాకింగ్ తెలిపినట్లు సండే టైంస్ దినపత్రిక పేర్కొన్నది.

తిరుమల తిరుపతి దేవస్థానం మీకైతే ఈ వసతి చేస్తుందా?

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్ మాన్ డీ.కే. ఆదికేసవులు గారు తిరుమల అలిపిరి గేటును అర్ధరాత్రి 12 గంటల తరువాత తెరిపించి కొంతమంది ప్రముఖుల కుటుంబీకులను దేవస్థాన విధులకు మారుగా స్వామి వారి ఆలయంలోనికి స్వయంగా దగ్గరుండి తీసుకునివెళ్ళేరట. మీరే గనక అర్ధరాత్రి 12 తరువాత వెడితే మీకు అలిపిరి గేటును తెరుస్తారా? మిమ్మల్ని ఆలయంలోకి పంపిస్తారా?

ప్రముఖ వ్యక్తుల కుటుంబీకలంటే ఏవో పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారేమో అనుకుంటున్నారా? అదేమీ కాదు. ప్రముఖ పేర్లున్నవారు. ఎవరా అనుకుంటున్నారా? ప్రముఖ పారిశ్రామక వేత్త ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ, తల్లి కోకిలాబెన్ మరియూ ప్రముఖ క్రికెట్ వీరుడు సచిన్ టెండూల్ కర్ భార్య అంజలి.

వీరి తిరుమల రాక ఆలశ్యమవటంతో వారు అలిపిరికి అర్ధరాత్రి 12.40 కి చేరుకున్నారు. తిరుమల విధుల ప్రకారం అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారు జామున 3 గంటలవరకు ఎవరినీ కొండ ఎక్కనివ్వరు. అలాగే ఆ సమయమున ఎవరికీ ఆలయ ప్రవేశము లేదు. అయితే ఆదికేసవులు గారు చితూరు నుండి అలిపిరికి వచ్హి, అలిపిరి సెక్యూరిటీ వారిని గేట్లు తెరవమని చెప్పి, తెరిపించి, దగ్గరుండి వారిని తిరుమలకు తీసుకువెళ్లటమే కాకుండా ముకేష్ అంబానీ గారి తల్లిని స్వయంగా తన వెంట ఆలయంలోకి తీసుకువెళ్ళి స్వామివారి దర్శనం చూపించేరు. వేసవి సెలవుల కారణంగా జనసమూహంతో నిండిపోయిన స్వామి వారి ఆలయములో అప్పుడు 'ఏకాంత సేవా పూజ జరుగుతున్నది. మిగిలిన వారు 'సుప్రబాత సేవా' పూజ టికెట్లు ఉన్నందువలన వారు లోపలికి వచ్హెంత వరకు ఆమెను అక్కడ ఉంచి వారితో కలిపేరు.

ఐ.పీ.ఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై గెలావలని వేడుకోవటానికి వారు తిరుమల వచ్హేరట. ఐతే, ఫైనల్స్ లో ముంబై గెలవలేదు...అది వేరే విషయం.

ఆదికేసవులుగారు ఏమన్నారంటే "వీరంతా చాలా ముఖ్యమైన ప్రముఖులు. వారి ప్రయాణం ఆలశ్యమవటం వలన వారు అలిపిరి జేరుకోవటానికి ఆలశ్యమైంది. వీ.వీ.ఐ.పీ లు గనుక వారి సెక్యూరిటీ కోసం వారిని విధులకు మారుగా తీసుకువెళ్ళవలసి వచ్హింది. ఇంతే కాక వీరందరికీ 'సుప్రబాత సేవా' టికెట్లు ఉన్నాయి. అలిపిరిలో ఆ టైముకి (అర్ధరాత్రి 12.40 గేట్లు) మూసేస్తారు. వీరు గనుక అక్కడే ఉండిపోతే వారి టికెట్లు వేస్ట్ అవుతాయి. అందుకని దగ్గరుండి తీసుకు వెళ్లేను" అని చెప్పేరు. మరి ఇదేవిధంగా సాదారణ ప్రజలకు అలిపిరి గేట్లను అర్ధరాత్రి 12 తరువాత తెరుస్తారా? ఆలయ ప్రవేశం చేయనిస్తారా?...ఆదికేసవుల గారినే అడగాలి.

ఈ విషయాన్ని టీటీడీ ఎక్సిక్యూటివి ఆఫీసర్ ఐ.వి.ఆర్. క్రిష్ణా రావ్ గారిని అడిగితే "నేను తిరుమల వెళ్ళగానే విషయాలు తెలుసుకుంటాను" అని తెలిపేరు.

Saturday, April 24, 2010

జూదాన్ని చట్టపరం చేస్తే దొంగతనంగా జరుగుతున్న బెట్టింగ్స్ (పందేలు) తగ్గుతాయా?

జూదాన్ని చట్టపర్యం చేస్తే రహశ్యమూగానూ, దొంగతనంగానూ జరుగుతున్న బెట్టింగ్స్ వెలుగులోకి వచ్హి, దానివలన ప్రబుత్వానికి చాలా ఆదాయం లభిస్తుందని ఒక ప్రముఖ దిన పత్రిక అభిప్రాయం వ్యక్తం చేసింది.

లోక్ శభలో పరిపాలనలో ఉన్న రాజకీయనాయకులే కాకుండా ప్రతిపక్ష రాజకీయవేత్తలుకూడా ఏకగ్రీవంగా ఐ.పీ.ఎల్ (I.P.L) పోటీలు ఒక అంతర్జాతీయ అండర్ వరల్డ్ డెన్ గా మారుతోందని భయం వ్యక్తం చేసేరు. ఇది నిజమేననిపిస్తోంది.

ఆ దిన పత్రిక జరిపిన అన్వేషనలో ఇప్పటికే 3,500 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు, ఇంకో 1,500 కోట్ల రూపాయలు ఐ.పీ.ఎల్ ఫైనల్ మ్యాచ్ కి పందెంగా పెట్టినట్లు తెలిపింది. దేశంలో ఉన్న డబ్బుగలవారే కాకుండా బీదవారు కూడా ఐ.పీ.ఎల్ మ్యాచ్ ల్లో ఎటువంటి పందెంకైనా డబ్బుకడుతున్నారు. ఇంతే కాకుండా ఐ.పీ.ఎల్ మ్యాచ్ ల మీద పందెం కాయటానికి మన డబ్బు అంతర్జాతీయ జూద కంపెనీలకు వెల్లిందట. లండన్‌లో ఉన్న లాడ్ బ్రోక్స్ జూద కంపెనీలో 2 మిల్లియన్ల డబ్బు పందెం కాసున్నారట. భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలోనుండి 3500 కోట్ల రూపాయలు పందెలకు ఖర్చు పెట్టేరట.

జూదమాడటం నేరం అని తెలిసున్నా బెట్టింగ్ కట్టడం ఎవరూ ఆపటంలేదు. దొంగతనంగా జరుగుతున్న ఈ జూదాలలో నల్ల ధనమే ఎక్కువగా పెడుతున్నారు. ఈ జూదాలు జరిపేవారు క్రిమినల్స్ అవటం వలన లాభంలో వచ్హే కోట్లకొలది డబ్బు టెర్రరిస్టులకూ, దేశవిద్రోహ శక్తులకు వెలుతోందట.

జూదాన్ని చట్టపర్యం చేస్తే ఆ వ్యాపారమంతా వెలుగులోనే జరుగుతుంది కనుక అండర్ వరల్డ్ క్రిమినల్స్ పూర్తిగా రాకపోయినా, చాలామేరకు తగ్గుతారని ఆ దిన పత్రిక పేర్కొన్నది. ఇంతేకాకుండా జూదాన్ని చట్టపర్యం చేస్తే నల్ల ధనం లెక్కలలోకి వచ్హి వైట్ మనీగా మారుతుంది. టాక్స్ లు కట్టటానికీ, నల్ల ధనాన్ని వైట్ మనీగా మార్చటానికి ప్రబుత్వం ఇస్తున్న విమోచనా ప్రొగ్రాములు తగ్గుతాయి. అందుకనే చాలా దేశాలు జూదానికి పూర్తిగా అనుమతించకపోయినా, కొన్నిరకాల జూదాన్ని అనుమతించేరు.

అమెరికాలో ప్రబుత్వ అనుమతితో నడుస్తున్న జూదాలు నడిపే కంపెనీలకు 2007 లో 4,10,000 కోట్ల రూపాయల వ్యపారం జరుపగా ప్రబుత్వానికి 25,000 కోట్లు టాక్స్ గా వచ్హిందట. 2009 లో ఇంగ్లాండ్ దేశానికి జూదాల వలన 10,000 కోట రూపాయలు ఆదాయం వచ్హిందట. అలాగే 2010 లో యూరోపియన్ దేశాలలో 3,80,000 కోట్ల రూపాయలూ వచ్హిందట. మనదేశంలో జూదాన్ని చట్టపర్యం చేస్తే కనీసం 62,000 కోట్ల రూపాయలు ఆదాయంగా వస్తుందని అంచనా. 1997-98 లో మన దేశం నల్ల ధనాన్ని బయటకు తీసుకురావటానికి టాక్స్ రాయతీలు ప్రకటిస్తే వచ్హిన ఆదాయం కేవలం 7,594 కోట్ల రూపాయలు మాత్రమే.

జూదాన్ని చట్టపర్యం చేస్తే చాలా లాభాలు ఉన్నాయి. నల్ల ధనాన్ని వైట్ గా మార్చవచ్హు, క్రిమినల్స్ చేతులలోనుండి ఈ వ్యాపారాన్నిపారదోలవచ్హు, టెర్రరిస్టులనూ మరియూ మాఫియా గ్యాంగ్ లనూ ఇందులో పెట్టుబడి దార్లుగా లేకుండా చేయ వచ్హు, బయటి దేశాలకు పోతున్న డబ్బును ఆపవచ్హు, మ్యాచ్ ఫిక్సింగ్ లను తగ్గించవచ్హు మరియూ ప్రబుత్వానికి ఒక కొత్త విభాగం నుండి ఎక్కువ రేటుతో టాక్స్ లు వస్తాయి.

మరి మీ అభిప్రాయం?

Friday, April 23, 2010

గొడవలు జరిగితేగానీ ప్రబుత్వం మేలుకోదా?

లలిత్ మోడీ, సషీ తరూర్ ల వ్యక్తిగత గొడవల వలన ఐ.పీ.ఎల్ తుఫాన చెలరేగింది. ఈ తుఫాన ఒక్క క్రికెట్ ప్రపంచాన్ని నడుపుతున్న ప్రముఖులనే కాకుండా, అ ప్రపంచంలో బాగం పంచుకున్న క్రికెట్ క్రీడాకారులతో సహా ఐ.పీ.ఎల్ నడుపుతున్నవారినీ, ఐ.పీ.ఎల్ టీములను కొనుక్కున్నవారినీ, ఐ.పీ.ఎల్. పోటీలను ప్రశారం చేసే వారినీ, క్రికెట్ బోర్డ్ వారినీ, రాజకీయ నాయకులనీ మరియూ క్రికెట్ క్రీడాకారులనీ, ప్రేక్చకులనీ ఆనంద పరచటాని వచ్హిన 'చియర్ లీడర్స్ ను కూడా విడిచిపెట్టలేదు.

ఈ తుఫాన అన్న స్కాంలో కేంద్ర ప్రబుత్వం మరియూ ఇన్ కం టాక్స్ వారూ చిన్న చిన్న వారి (ఎక్కువ పలుకుబడి లేనివారి) జోలికి పోతున్నారు కానీ పెద్ద పెద్ద వారి ( బాగా పలుకుబడి ఉన్నవారు....ఉదాహరణకు:..సరద్ పవార్ మరియూ ఆయన కూతురు సుప్రియా సూలే) జోలికి పోవటం లేదు. ప్రబుత్వానికి దైర్యముంటే ఉదహరించిన ఆ ఇరువురి మీదా ఇన్ కం టాక్స్ రైడ్ జరపమనండి.

మోడీ పేరు వింటేనే కాంగ్రెస్ ప్రబుత్వానికి అలర్జీ. అందులోనూ ప్రజలలో ఎక్కువ పలుకుబడి సంపాదించుకుంటున్నారంటే ఇంక్కా ఎక్కువ అలర్జీ. మొదట్లో గుజరాత్ ముఖ్యమంత్రి పై రాజకీయంగా విరుచుకుపడ్డారు, ఇప్పుడు లలిత్ మోడీ పై ఐ.పీ.ఎల్ స్కాం అంటూ విరుచుకు పడుతున్నారు. సషీ తరూర్ మంత్రి వర్గం నుండి రాజీనామా చేసిన తరువాతే మన ఆర్దీఖ శాఖ మంత్రికి లలిత్ మోడీ పై కోపం ఎక్కువైంది. వెంటనే ఇన్ కం టాక్స్ వారిని పంపించి ఐ.పీ.ఎల్ వారి పై రైడ్ చేయమన్నారు. ఐ.పీ.ఎల్ లో ఎంత డబ్బు చేతులు మారుతున్నాయో ప్రబుత్వానికి ఇంతకు ముందు తెలియదా.....లేక తరూర్ ని మత్రివర్గం నుండి రాజీనామా చేయించి నందుకు ఐ.పీ.ఎల్ మీద పగ తీర్చుకుంటున్నారా?

ఐ.పీ.ఎల్ ఒక అతి పెద్ద లాభకరమైన వ్యాపారం. దీనిని వ్యాపార వేత్తలు గానీ, ఆ వ్యాపారంలో బాగస్తులైన రాజకీయ నాయకులు గానీ, ఐ.పీ.ఎల్ పోటీల మీద జూదమాడుతున్నవారు గానీ, ఆ జూద కేంద్రాలని నడుపుతున్న వారు గానీ ఐ.పీ.ఎల్ ని మునిగిపోనివ్వారు. తమ పలుకుబడులతో పూర్తిగా కాపాడతారు. ఇంత పెద్ద స్కాంలో .....చాలా తక్కువమంది, అందులోనూ ఊరూ పేరూ తెలియని కొంతమంది పట్టుబడతారు. అంతేగానీ ఐ.పీ.ఎల్ లో జరుగుతున్న అవకతవకలలో ఆవగింజంత నిజాన్ని కూడా బయటకు రానివ్వరు. ఈ స్కాం కొన్ని రోజులు ప్రశిద్దిలో ఉంటుంది, ఆ తరువాత అందరూ మర్చిపోతారు.

ఐ.పీ.ఎల్ మొదటి సీసన్ లో ఆటగాళ్ళను వేలం పాటలో కోట్లకొలది డబ్బు పోసి వ్యాపార వేత్తలు కొనుకున్నప్పుడే లెక్కలలోకి రాని డబ్బు చేతులు మారుతున్నాయని ప్రబుత్వాని తెలియదా? పెద్ద పెద్ద ఆటలలో జూదాలూ, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటివి ఉంటాయని ప్రబుత్వానికి అప్పుడు తెలియదా? మొదట్లోనే ప్రబుత్వం మేలుకుని ఇప్పుడు చేస్తున్న ఇన్ కం టాక్స్ రైడ్లను అప్పుడు జరిపుంటే?!

తరూర్, మోడీల గొడవలు జరిగిన తరువతే ఐ.పీ.ఎల్ వ్యవహారంలో ప్రబుత్వం జోక్యం చేసుకుంది. అంటే ఎక్కడైనా గొడవ జరిగితేనే ప్రబుత్వం మేల్కొంటుందా?

Thursday, April 22, 2010

స్నేహం కోసం ఒక ఉడుత చెసే సాహసాన్ని ఈ వీడియోలో చూడండి

అద్బుతమైన ఈ వీడియో చూసి, అందులో ఆ చిన్న ఉడుత తన స్నేహితుని శరీరాన్ని కాకులు పొడిచి తినకుండా మరియూ లాక్కుని ఎగిరిపోకుండా ఉండటాని కి ధైర్యముగా ఆ కాకులతో పోట్లాడటం చూసి మురిసిపోయిన నేను ఆ వీడియోను మీ అందరికీ చూపించి ఆ నోరులేని జీవి స్నేహాంకోసం చెసే సాహసాన్ని ఏమని వివరించాలో తెలియక ఆ వీడియోని మీముందు ఉంచుతున్నాను. మీ కామెంట్స్ ను తప్పక రాయవలసిందిగా కోరుతున్నాను.

Amazing Squirrel Fights off Crows - Protects Dead Friend's Body


Wednesday, April 21, 2010

వాతావర్ణ మార్పిడి వలన అగ్ని పర్వత పేళ్ళులు,భూకంపాలూ,సునామీలు ఎక్కువౌతాయి...నిపుణులు…నాసా తీసిన ఐస్ లాండ్ ఫ్హొటొ చూడండి

వాతావర్ణ మార్పిడివలన మనం ఎదుర్కొంటున్న కష్టాలు ఒకటో రెండో కాదు. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న కష్టాలలో చాలా శాతం వాతావర్ణ మార్పిడి వలనే. వాతావర్ణంలో మార్పిడి ఏర్పడుతోందని మొదటిసారి తెలుసుకున్నప్పుడే కావలసిన చర్యలు తీసుకోనుంటే ఇప్పుడు మనం ఇన్ని కష్టాలకు లోనైయ్యే వారం కాదు. తెలుసుకున్నా ఎవరూ పట్టించుకోకుండా ఎవరిదారిన వారు వెళ్ళటం మూలానే ఈ రోజు మనం ఇన్ని ప్రక్రుతీ వైపరీత్యాలతో బాధపడుతున్నాము. దీనికి మనమే బాధ్యులం.

వాతావర్ణ మార్పిడి వలన మనం ఎదుర్కొంటున్న కష్టాలలో భూకంపాలూ, సునామీలూ, వరదలూ సాదారణమైనవి. వీటికంటే మనిషిని ఎక్కువ కష్టపెట్టే మరియూ ఎక్కువ నష్టపరిచే ఎండ, దానివలన కలిగే వేడి, దానివలన కరుగుతున్న మంచుకోండలు మరియూ అగ్నిపర్వత పేళ్ళులూ మనల్ని ఎక్కువ నష్ట పరుస్తాయని నిపుణులు తెలిపేరు.

వారు చెప్పిన మాట నిజమేననిపిస్తోంది. భూకంపమో లేక సునామీయో అయితే ఆ నష్టం ఏదో ఒక ప్రాంతానికే పరిమితమౌతుంది. ఆ ప్రాంత ప్రజలు మాత్రమే నష్టపోతారు. మిగిలిన దేశాల సహాయంతో ఆ నష్టం నుండి వారిని కాపాడవచ్హు, ఆదుకోవచ్హు మరియూ వారిని పుంజుకోచేయవచ్హు.

కానీ ఈ మధ్య ఐస్ లాండ్ లోని అగ్నిపర్వత పేలుడు ప్రపంచ మొత్తాన్ని నష్ట పరిచింది. విమాణ ప్రయాణాలకు అంతరాయం కలిగించి తేరుకోలేని బాధను కలిగించింది. నష్టాన్ని అంచనావేయలేము, కష్టాలని వివరించలేము. ఒక దేశమని కాకుండా ఒక్కసారిగా అన్ని దేశాలూ స్తంబించిపోయేయి. ఎవరిని ఎవరు ఆదుకోవాలో, ఎవరికి ఎవరు సహాయం చేయాలో తెలియని పరిస్తితి.

వాతావర్ణ మార్పిడివలన ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీని వలన మంచుకోండలు కరుగుతున్నాయి. అలా కరిగిన నీరు సముద్రములో జేరుతోంది. సముద్ర నీటి మట్టాన్నీ, ఉష్ణోగ్రతనూ పెంచుతోంది. దీని వలన సుడిగుండాలూ, తుఫానలూ మరియూ అవసరంలేని వాయుగుండాలూ ఎర్పడుతున్నాయని, ఇవి రాను రాను అధికమౌతాయని రాయల్ సొసైటీ లండన్ వారు సమర్పించిన పేపర్లలో తెలిపేరు.
తైవాన్ లో ఈ మధ్య ఏర్పడిన "టైఫూన్" వలన గాలి ఒత్తిడి తక్కువైనది. ఇది ఒక విధమైన పొరను విడుదల చేసింది. అందువలన భూకంపాలు ఎక్కువవుతాయి అని తెలియజేసేరు........ప్రపంచములోని దేశాలన్నీ కలసి పనిచేస్తెనే ఈ ప్రమాదాల నుండి మనం బయటపడగలమని తెలిపేరు.

ఐస్ లాండ్ లోని అగ్నిపర్వత పేలుడు ఈ క్రింది ఫోటో నాసా వారు తమ ఉపగ్రహము నుండి తీసేరు. చూడటానికి ఎంతో బాగున్న ఈ ఫోటో లో అతి ప్రమాదమైన కెమికల్స్, బూడిద ఉన్నయట.....ఈ ఫోటో గురించి, అగ్ని పర్వత పేళ్ళుల గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది లింకును మీ బ్రౌజర్లో వేసి ఆ సైట్ కు వెళ్ళండి
. http://apod.nasa.gov/apod/ap100419.html

Courtesy:NASA

Tuesday, April 20, 2010

తండ్రిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన తనయుడు ఖైదు

వయసు మీరిన, ఆధారంలేని తల్లితండ్రులను అశ్రద్ద చేస్తూ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసే బిడ్డలను దండించ వచ్హు అనే చట్టాన్ని ఉపయోగించి 57 సంవత్సరములున్న ఒకతనిని 77 సంవత్సారాలున్న తన తండ్రిని పట్టించుకోకపోవటమే కాకుండా కొట్టేడన్న ఆరోపణతో కోయంబత్తూర్ పోలీసులు అరెస్ట్ చేసేరు. ఇది తమిళనాడు చరిత్రలో మొదటిది.

వయసు మీరిన, ముసలితనంలో ఆధారంలేకుండా ఉన్నటువంటి తన తండ్రిని ఇంట్లోనుండి వెళ్ళిపొమ్మన్నందుకు స్వామినాదన్ అనే ఒక వ్యాపారిని మైంటనెన్స్ అండ్ వెల్ఫార్ ఆఫ్ పేరెంట్స్ & సీనియర్ సిటిజెన్స్ యాక్ట్ ( Maintenance and Welfare of Parents and Senior Citizens Act) 24 క్రింద అరెస్ట్ చేసేరు.

మన దేశంలో వయస్సు మల్లిన వారి శంఖ్య ఎక్కువ శాతంగా పెరిగినందున 2007 లో వీరిని కాపాడటానికి ప్రబుత్వం ఈ చట్టాన్ని తీసుకు వచ్హింది. ఈ చట్ట ప్రకారం తల్లితండ్రులను నిర్లక్ష్యంతో పట్టించుకోని వారిని శిక్చించవచ్హు. శిక్చగా, 3 నెలల కారాగార శిక్చ లేక రూ.5,000 జరిమానా, లేక రెండూ విధించవచ్హు. తల్లితండ్రులను తమ దగ్గర ఏ కారణం చేతైనా ఉంచుకోలేని పక్షంలో వారు బ్రతకటానికి ఒక్కొక్కరికీ రూ.10,000/- నెలకు వారికి ఖర్చుల క్రింద ఇవ్వవలయును.

మాణిక్య మొదలియార్ అనే 77 ఏళ్ల ఆయన, ఇలా ఒక చట్టమున్నదని తెలుసుకుని, తన పిల్లలు తనను నిర్లక్ష్యం చేసి బాధపెట్టిన విదానాన్ని ఆ ఊరి కలెక్టర్‌కు వివరించి చెప్పేరు. ఒకప్పుడు పెద్ద వ్యాపారస్తుడైన ఈయన తనకు వయసు మీరటంతోనూ,ఆరొగ్యం బాగుండక పోవడంతోనూ తన వ్యాపారాలను తన పెద్ద కొడుకు స్వామినాధన్ కు ఇచ్హి తాను రిటైర్మెంట్ తీసుకున్నాడు. 2 నెలల క్రితం ఇంటి తాళాలను లాక్కుని తండ్రిని బలవంతముగా ఇంటినుండి బయటకు తోసేసేడు. దిక్కుతోచని మాణిక్య మొదలియార్ తన రెండవ కొడుకు ఇంటికి వెళ్ళేడు. అతను తన ఇంటికి రావద్దని చెప్పేడు. కూతురింటికి వెళ్ళేడు. కూతురుకూడా రావద్దని చెప్పటంతో నీరుగారిపోయిన ఈయన న్యాయం కోసం కలెక్టర్ దగ్గరకు వచ్హి తన గోడు చెప్పుకున్నాడు. ఈయన చెప్పిన దాంట్లో నిజమున్నదని పోలీసుల ద్వారా విచారించి తెలుసుకున్న కలెక్టర్ స్వామినాదాన్ని అరెస్ట్ చేయమని పోలీసులకు చెప్పేరు.స్వామినాధన్ ఖైదు చేయబడ్డాడు.

ఎంతోమంది బిడ్డలు తమ తల్లితండ్రులను పట్టించుకోవటం లేదు. చాలామంది తమ తల్లితండ్రులను అనాధాశ్రమాలలో జేరుస్తున్నారు. కొన్ని సంవత్సరముల తరువాత తాము కూడ ఇలాంటి పరిస్తితిని ఎదుర్కోవలసి వస్తుందని ఆలోచించటంలేదు. కష్టమో నష్టమో జన్మ నిచ్హిన తల్లితండ్రులను బిడ్డలే అనాధలుగా చేయకూడదు.

తమిళనాడులో ఒక మునిస్పల్ కార్పోరేషన్ ఆఫీసులో యాగం...జంతు బలి!!!.

కొంత మంది ప్రజలలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలని పోగొట్టవలసిన ప్రబుత్వ అధికార యంత్రాంగమే మూఢ నమ్మకాలని ప్రొశ్చాహించే విధంగా పనులు చేస్తుంటే...వారు ప్రజలను ఎలా కాపాడతారు?

పోయిన ఆదివారం రాత్రి తమిళనాడులో ఉన్న సేలం మునిస్పల్ కార్పోరేషన్ ఆఫీసులో మర్మమైన రీతిలో యాగం జరిపినట్లూ, ఆ యాగంలో భాగంగా ఏదో ఒక జంతువును బలి ఇచ్హినట్లు వార్తలు వచ్హినై.

సోమవారం నాడు ప్రొద్దున మునిస్పల్ ఆఫీసులో పని ఉండటంతో అక్కడికి వచ్హిన కొందరు నెత్తుటి మరకలు మరియూ ఏదో తంతు జరిగిన సూచనలు ఆఫీసు ముఖద్వారం నుండి వెనుక ద్వారం దాకా ఉండటాన్ని చూడటంతో ఒక్కసారిగా భయానికి లోనైయ్యేరు......ఏదో జంతువును బలి ఇచ్హి, ఆ జంతు రక్తమును ఆ ఆఫీసంతా విరజిమ్మినట్లు అనుమానాపడ్డారు....భయాందోళనలతో మొదట్లో అలజడికి గురైన ప్రజలు కొంచం తేరుకుని అక్కడ పనిచేస్తున్న మునిస్పల్ ఆఫీస్ స్టాఫ్ ని ముట్టడించేరు. "మీరు ఎలా ఇలాంటివి ఇక్కడ ప్రబుత్వ కార్యాలయంలో జరుపవచ్హు?" అని ప్రశ్నించేరు.

మొదట్లో కార్పోరేషన్లో పనిచేస్తున్న వారికి ఏమీ అర్ధం కాలేదు. కొంతసేపైన తరువాత "ఇక్కడ ఈ ఆఫీసులో పనిచేస్తున్న వారూ మరియూ కౌన్సిలర్సూ మాటి మాటి కీ అనారొగ్యంతో భాదపడుతున్నారు. అందుకని ఆదివారం నాడు ఇక్కడ ఒక యాగం జరిగింది" అని చెప్పేరు........ఎవరు ఈ యాగం చేయించాలనుకున్నారు? ఎవరు యాగాన్ని చేసింది? అన్న ప్రశ్నలకు మాత్రం జవాబు రాలేదు.

సేలం కార్పోరేషన్ మేయర్ జె.రేకా ప్రియదర్సిణి ని అడిగితే "నేను వారం రోజులనుండి ఆఫీసుకు రావటం లేదు. ఈ యాగానికీ నాకూ ఎటువంటి సంబంధమూ లేదు" అని చెబుతూ "మా ఆఫీసు బిల్డింగ్ పనులని ఒక కాంట్రాక్టర్‌కి ఇచ్హేము. ఆ కాంట్రాక్టర్‌కి చెందిన పనివారు మాటి మాటి కీ ప్రమాదాలకు గురౌతున్నారు. దెబ్బలు తగులుతున్నాయి. ఆయనేమైనా చేయించేడేమో" అని తెలిపింది.

"అలా అయితే పనిజరుగుతున్న చోటున మాత్రమే యాగం చేసుండాలి. కానీ ఆఫీసు మొత్తం ఎందుకు నెత్తురు మరకలు ఉన్నాయి" అని ప్రజలు అడిగిన ప్రశ్నకు అమె సమాధానం చెప్పలేదు.

Monday, April 19, 2010

ప్రపంచమంతా వేడిమయం...మార్చ్ నెల రికార్డ్ స్రుస్టించింది...కారణం ఎల్ నినొ (El Nino)

ఎల్ నినొ ( చలికాలంలో సముద్రపునీటి ఉష్ణోగ్రత మామూలుకంటే అధికముగా ఉండటం) ప్రభావం వలన ప్రపంచమంతటా భూ వాతావర్ణ ఉష్ణోగ్రత పెరిగి, ఈ సంవత్సరం మార్చ్ నెల ఎక్కువ ఉష్ణోగ్రతతో రికార్డ్ స్రుస్టించింది. గ్లోబల్ వార్మింగ్ అనేది ఏమీ లేదని అంటున్నవారిని మరోసారి ఆలోచించేటట్లు చేసింది.

El Nino: The term El Niño (means Christ child in Spanish) was originally used by fishermen along the coasts of Ecuador and Peru to refer to a warm ocean current that typically appears around Christmas time and lasts for several months. Fish are less abundant during these warm intervals, so fishermen often take a break to repair their equipment and spend time with their families. Over the years, the term ‘El Niño’ is referred to these exceptionally strong warm intervals that not only disrupt the normal lives of the fishermen, but also bring heavy rains.

మామూలు ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండటంతో మార్చ్ నెలలోనే ప్రపంచమంతా ప్రజలు వేడితో తల్లడిల్లిపోయేరు. ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, దక్షిణ ఆసియా మరియూ కెనడా దేశాలు ఈ అధికమైన ఉష్ణొగ్రతతొ బాధపడ్డారు.

సరాసరి భూ మండలం లోని నేల మీది ఉష్ణోగ్రత, సముద్రపు నీటి పై ఉన్న ఉష్ణోగ్రత మార్చ్ నెల 13.5 డిగ్రీల సెల్సీయస్ గా రికార్డ్ అయ్యింది. ఇది 20 వ శతాబ్ధము లో రికార్డైన ఉష్ణోగ్రత కంటే ఈ శతాబ్ధములో. అంటే 21 శతాబ్ధములో 0.77 డిగ్రీలు అధికముగా ఉన్నది. 20 వ శతాబ్ధములో సరాసరి రెకార్డైన ఉష్ణోగ్రత 12.7 డిగ్రీల సెల్సియస్...1880 నుండి చూస్తే (అప్పటి నుండే ఉష్ణోగ్రతలను రికార్డ్ చేయటం మొదలుపెట్టేరు) భూ మండల నేల, నీటిపై ఉన్న ఉష్ణోగ్రతలు మార్చ్ నెల అధికమవటం ఇది నాలుగోసారి.

ఈ కొంత మార్పిడికే డిల్లీ నగరం గత 50 సంవత్సరలుగా లేనంత ఉష్ణోగ్రతతో తల్లడిల్లిపోయింది. ఈ ఏప్రిల్ నెలకూడా అత్యధిక ఉష్ణోగ్రతో డిల్లీ నగర ప్రజలు తట్టుకోలేకపోతున్నారు......అలాగే భారతదేశంలోని పలుప్రాంతాలలో ఎండాకాల ఉష్ణోగ్రత మార్చ్ నెల నుండే ప్రారంబమైంది. ఈ ఎండలనే తట్టుకోలేకపోతున్నాము. ఇక "మే" నేల అసలు ఎండాకాలం ఎండను ఎలా తట్టుకుంటామో తెలియటంలేదు.

ఈ ఎల్ నినొ అతి వ్రుష్టినీ, అనా వ్రుష్టినీ వచ్హేటట్లు చేస్తుంది. ఎండాకాలంలో అత్యధిక ఎండనూ, వానాకాలంలో అత్యధిక వాననూ వచ్హేలా చేస్తుంది. మన దేశమే కాకుండా, అనేక దేశాలు, ముఖ్యం గా ఎప్పుడూ చల్లగా ఉండే దేశాలుకూడా ఎండను ఎక్కువగా పొందుతూ, అక్కడి ప్రజలను బాధిస్తోంది.

ఇది ఇలాగే కొనసాగుతుందని, ఎల్ నినొ ప్రభావం ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటుందని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రషన్ (National Oceanic and Atmospheric Administration) వారు చెబుతున్నారు.

"స్వర్గం చాలా అందంగా బాగుంది"...చనిపోయి తిరిగి బ్రతికిన 3 సంవత్సరముల బాలుని మాటలు

చిన్న పిల్లలు దైవంతో సమానం. వారు అబద్దం ఆడరు. నిజమే చెబుతారు అన్నది నిజమని నమ్మితే "స్వర్గం" అనేది ఉన్నదని నమ్మాలి.

జెర్మనీకి చెందిన 3 సంవత్సరముల బాలుడు ఒక కొలనులో పడి డాక్టర్లచే చనిపోయేడని చెప్పిన తరువాత...3 గంటలు గడచిన పిదప కళ్ళు తెరచి అక్కడున్నవారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేడు. కళ్ళు తెరిచిన వెంటనే "స్వర్గం చాలా అందముగా బాగుంది...కానీ నేను ఇప్పుడు అమ్మానాన్నల దగ్గరకు రావడం నాకు సంతోషం కలిగిస్తోంది" అని చెప్పడం అక్కడున్నవారిని ఇంకా ఆశ్చర్య పరించింది.

పాల్ ఈకల్ అనే పేరుగల ఈ బాలుడు తమ ఇంటి కొలనులో పడి ఉండటం చూసిన ఆ బాలుని తాత అతన్ని ఆ కొలనులోనుండి పైకి తీసేడు. ఆ బాలుని తండ్రి స్ప్రుహ కోల్పోయి, ఊపిరి సలపని తన కొడుకును బ్రతికించుకోవటానికి ఆ బాలుని హ్రుదయాన్ని అణిచి నొక్కి, ఆ బాలుని నోటిలో నోరు పెట్టి గాలి ఊదేడు. ఎంతప్రయత్నించినా ఆ బాలుడిలో కదలిక రాలేదు.కొద్ది నిమిషాలలో అక్కడికి ఒక హెలికాప్టర్ వచ్హింది. ఆ హెలికాప్టర్లో ఆ బాలుడిని హాస్పిటల్ కు తీసుకువెళ్లేరు.అక్కడి డాక్టర్లు ఆ బాలుని గుండె తిరిగి కొట్టుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేసేరు. కానీ ఆ బాలుడు స్ప్రుహలోకి రాలేదు. డాక్టర్లు ఆ బాలుడు చనిపోయేడని నిర్నయించి అదే విషయాన్ని ఆ బాలుని తల్లితండ్రులకు తెలిపేరు.

3 గంటల 18 నిమిషముల తరువాత ఆ బాలుని గుండె కొట్టుకోవటం మొదలుపెట్టింది. అతను మెల్లగా కళ్ళు తెరవటం చూసిన వారు ఆశ్చర్య పోయి ఆ విషయాన్ని వెంటనే డాక్టర్లకు తెలిపేరు. డాక్టర్ల సహాయంతో అతను మళ్ళీ ప్రాణం పోసుకుని పూర్తి స్ప్రుహలోకి వచ్హేడు.

అతను స్ప్రుహలోకి వచ్హిన వెంటనే "నేను అమ్మమ్మ ఎమ్మీని చూసేను. అక్కడ ఎన్నో లైట్లు ఉన్నాయి. నేను గాలిలో తెల్తున్నాను. అక్కడ ఒక గేటు చూసేను.గేటుకి అవతలవైపు ఎమ్మీ అమ్మమ్మ నిలబడి ఉంది. పాల్ ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు మీ అమ్మానాన్నల దగ్గరకు వెళ్ళాలి. నీకోసం నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది. నేను స్వర్గంలో ఉన్నానని తెలుసుకున్నాను. అక్కడ చాలా బాగున్నది.కానీ అమ్మమ్మ వెళ్ళిపొమ్మన్నది. అందుకని వచ్హేసేను.ఇప్పుడు అమ్మానాన్నల దగ్గర ఉన్నాను. నాకు చాలా సంతొషముగా ఉన్నది" అని ఆ బాలుడు చెప్పేడని డైలీ టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.

"నేను ఇంతవరకూ ఇలాంటిది చూడలేదు. మామూలుగా పిల్లలు నీటిలో పడితే కొద్ది నిమిషాలకే చనిపోతారు. వారు బ్రతికి రావటమనేది జరగదు. కనుక ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం" అని ఆ హాస్పిటల్ పెద్ద డాక్టర్ లోతార్ స్కవింగియర్ అన్నారు.

ఇప్పుడు పాల్ జెర్మనీలోని నార్త్ బెర్లిన్ లో ఉన్న లైచెన్ నగరంలో ఉన్నాడు.

Sunday, April 18, 2010

రాజకీయ వారసత్వంలో సోనియాగాంధీని సహాయం కోరనున్న కరుణానిధి

తన రాజకీయ రిటైర్మెంట్ తరువాత డీ.ఎం.కే పార్టీ ఆధిపత్యం కోసం తన ఇరువురి కొడుకుల మధ్య తగువులూ, పోటీలూ పెరుగుతున్నాయని తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఆ తగువులూ, పోటీలనుండి తాను ఎన్నుకున్న తనయుడూ, ప్రస్తుత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ నే డీ.ఎం.కే ఆధిపత్యాన్ని చేపట్టాలని, ఆధిపత్యానికి తన కొడుకులు గొడవపడి ప్రజలలో అల్లరి పడకూడదని, తన ఇద్దరి కొడుకుల మధ్య తగువులు వచ్హినా స్టాలిన్ నే ఆధిపత్యం వహించే విధముగా చేయాలని, దీనికి తన బలం సరిపోదని, కాంగ్రెస్ పార్టీ బలం కూడా కావాలని ఊహించిన కరుణానిధి, ప్రయాణానికి తన శరీరం అంగీకరించకపోయినా వచ్హేనెల 6 వ తారీఖున డిల్లీలో జరుగనున్న ప్లానింగ్ కమీషన్ మీటింగుకు వెళ్ళి అక్కడ సోనియాగాంధీనీ , ప్రధాని మన్మోహన్ సింగ్ ని కలిసి ప్లానింగ్ కమీషన్ విషయాలకన్నా తన తరువాత డీ.ఎం.కే పార్టీ ఆధిపత్యం గురించి వివరించి వారి సహాయం పొందాలని డిల్లీ వెళ్ళనున్నారు.

డీ.ఎం.కే పార్టీ ఆధిపత్యములో కాంగ్రెస్ పార్టీని సహయాం అడగటం ఏమిటా అని మీరంతా ఆశ్చర్య పడవచ్హు. కానీ రాజకీయాలలో ఆరితేరిన రాజతంత్రి కరుణానిధికి కాంగ్రెస్ ఎందుకు సహాయపడాలో బాగా తెలుసు...ఎందుకంటే గత కొన్నేళ్ళుగా తమిళనాడులో కాంగ్రెస్స్ పార్టీ ఎవరికి మద్దత్తు ఇస్తారో ఎన్నికలలో ఆ పార్టీయే గెలుస్తోంది. డీ.ఎం.కే పార్టీ గెలావాలన్నా కాంగ్రెస్ మద్దత్తు అవసరమౌతోంది. అయితే ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎవరినీ కలుపుకోకుండా ఒంటరిగా నిలబడుతుందని రాహుల్ గాంధీ తెలుపుతున్నారు. డీ.ఎం.కే పార్టీకి కరుణానిధీ ఆధిపత్యం ఉన్నా కాంగ్రెస్ పార్టీ మద్దత్తు ఉంటేనే ఎన్నికలలో గెలవగలదని ఆయనకు తెలుసు. ఇప్పుడు తన ఇద్దరి కొడుకుల పోటీతో డి.ఏం.కే. రెండుగా విడిపోతే?

అది డీ.ఎం.కే కి అగౌరవమే కాకుండా జయలలితకు లాభం...దీనిని గ్రహించిన కరుణానిధి తాను రిటైర్ మెంట్ తీసుకోకుండా, వచ్హే సంవత్సరం (2011) జరగనున్న ఎన్నికలను ఈ సంవత్సరం ఆఖరులోనే జరిపి, అందులో గెలిచి, తాను ఎన్నుకున్న వారసుడైన స్టాలిన్ ను ముఖ్యమంత్రి చేసి ఆ తరువాత తాను రిటైర్ మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారు. దీనికి కాంగ్రెస్ మద్దత్తు అవసరం డీ.ఎం.కే కి ఎంతో ఉన్నదని కరుణానిధికి తెలుసు.

దీనికోసం ఆయన ఏది చేయటానికైనా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పెద్ద కొడుకు అలగిరి కేంద్ర మంత్రిగా ఉంటున్నారు. ఏన్నికలకూ, పార్టీ వారసత్వ పోటీకీ ఇదే గనుక అడ్డువస్తే, అలగరిని మంత్రి పదవిలోనుండి తీసేసి, అదే మంత్రి పదవిని తన కుమార్తె కనిమొయి కి ఇప్పించటానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు.


అలగిరి బహిరంగంగా డీ.ఎం.కే పార్టీకి బ్రతికున్నంతవరకూ తన తండ్రే ఆధిపత్యం వహించాలని, ఆయన ఆరొగ్య కారణాలవలన ఆయన బ్రతికున్నప్పుడే ఆధిపత్య విషయం వస్తే తాను ఆధిపత్య పదవికి తప్పక పోటీచేస్తానని తెలిపేరు. ఇంతేకాక, పార్టీ ఆధిపత్యాన్ని తన తండ్రే వహించాలని అలాకాక ఇంకెవరికైనా చేస్తే తాను సహించబోయేదిలేదని కూడా చెప్పేరు.

దీనిమూలంగా డీ.ఎం.కే పార్టీలోనూ, తమిళనాడు రాజకీయాలలోనూ ఏం జరుగనున్నదో అని ప్రజలే కాకుండా మిగిలిన రాజకీయ పార్టీ వారు కూడా ఎదురు చూస్తున్నారు.

చాక్లెట్లు ఆరొగ్యానికి చాలా మంచిది...అధికారపూర్వముగా వెళ్ళడి

ఒక కొత్త పరిశోధన చాక్లెట్ ను ఒక సూపర్ ఆహారంగా పేర్కొన్నది. దీనికి కారణం ఆరొగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడంట్స్ (Anti-Oxidants) చాక్లెట్ లో ఎక్కువ శాతంలో ఉన్నదిట.

లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ఈ మధ్య జరిపిన ఒక పరిశోధనలో చాక్లెట్ తినడం వలన మాటి మాటికీ వచ్హే దగ్గు తగ్గుతున్నదని తెలిసింది. చాక్లెట్ లో ఉన్న మరో పదార్ధం ఫినిల్ ఎతిలమైన్ మనోభావాలను పెంచే గుణం కలిగిందని ఆ పరిశొధనలో తెలిసినట్లు డైలీ మైల్.కొ.యూకే ( dailymail.co.uk) ప్రచురించింది.

చాక్లెట్లో ఉన్న యాంటీఆక్సిడంట్స్ మన చర్మాన్ని పాడుచేసే అల్ట్రా వైలెట్ రేస్ నుండి చర్మాన్ని కాపాడుతుందట. మరియూ మన హ్రుదయం చేసే పనితీరును పెంచుతుందట. అందువలన చాక్లెట్ ను తినమని కొంతమంది డాక్టర్లు మందు చీటీలోనే రాస్తున్నారట.

ఘానా దేశపు మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ కే.కే.అట్సినా కోకో పౌడర్ని రక్తపోటును తగ్గించడానికి ఒక మందుగా వాడుతున్నారట. మరో డాక్టర్ ఎఫ్.వాకూ అడాయ్ మలేరియా వ్యాధిని తగ్గించటానికి పేషెంట్లకు కోకో టీ ని రోజుకు 2 నుండి 5 కప్పుల వరకు త్రాగమని చెబుతున్నారట.

హార్లే స్ట్రీట్ లండన్ విషన్ క్లీనిక్ కళ్ళ సర్జన్ డాన్ రైన్ స్టీన్ తన దగ్గర కళ్ళ ఆపరేషన్ కు వచ్హిన పేషెంట్లని ఆపరెషన్ కి అరగంట ముందు చాక్లెట్లు తినమని చెబుతున్నారట. మత్తు ఇంజెక్షన్ ఇచ్హి ఆపరెషన్ చేసే పేషెంట్ల కంటే చాక్లెట్లు తిన్న పేషెంట్లు ఆపరెషన్ కి ముందు, జరుగుతున్నప్పుడూ మరియూ ఆపరేషన్ తరువాత ధైర్యముగానూ, అలెర్ట్ గానూ ఉంటూ సహకరిస్తున్నారని ఆయన చెబుతున్నారు.

మన మనోభావాలను నియంత్రించు సెరిటోనిన్ మరియూ డోపామైన్ అనే మన మైండ్ లో ఉన్న అతి ముఖ్యమైన రెండు కెమికల్స్ ని బ్యాలన్స్ చేసే ఉపయోగం ఈ చాక్లెట్ లో ఉన్నదట. ఈ రెండు కెమికల్స్ మన మనోభావాలని క్రమ పద్దతిలో ఉంచి మనం ఎంత ఆహరం తినాలో మరియూ మనం ఎక్కడ ఎలా ప్రవర్తించాలనే పనులలో సహకరిస్తాయి. చాక్లెట్లను ఒక పద్దతిగా, ఒక మోతాదులో తింటే అది యాంటీ డిప్రసంట్ లా పనిచేస్తుందని మనోతత్వ డాక్టర్లు చెబుతున్నారు.

కనుక, మనం కూడా చాక్లెట్లని ఒక పద్దతిగా, ఒక మోతాదులో తింటూ మన ఆరొగ్యాన్ని బలపరుచుకుందాం (సుగర్ వ్యాధి ఉన్న వారు తమ డాక్టర్లని సంప్రదించే తినాలి).

Saturday, April 17, 2010

ప్రజారాజ్యం పార్టీ ని బలహీనం చేయడానికి తెలుగుదేశం సన్నాహాలు

2009 ఎన్నికలలొ ఒడిపోయిన దగ్గరనుండి తెలుగుదేశం పార్టీ ప్రజారాజ్యం పార్టీని తప్పుపడుతున్నది. తెలుగుదేశం పార్టీ నుండి ప్రజారాజ్యం పార్టీ కి వలస వెళ్ళిన వారిని తమ పార్టీకి తిరిగి రమ్మని బహిరంగంగా పిలుస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు.

ప్రజారాజ్యం పార్టీ వలనే తమ పార్టీ ఓట్లు చీలిపోయి అది కాంగ్రెస్ గెలవడానికి దాహోదపడిందని తెలుగుదేశం పార్టీ వారు అభిప్రాయపడుతున్నారు.
అప్పటి నుండీ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గారిని తెలుగుదేశం అధినేత తప్పుపడుతూనే ఉన్నారు. ఇంతేకాక రాజకీయ వలయంలో చిరంజీవీ గారు తన ప్రజారాజ్యం పార్టీని మూసేసి కాంగ్రెస్ లో చేరబోతున్నారని వదంతి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ వారు కూడా చిరంజీవిగారిని తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఆయనకు పదవి ఇస్తామని చెబుతున్నారు.

చిరంజీవి గారు ఈ మధ్య తిరుపతిలో పర్యటిస్తూ తమ ప్రజారాజ్యం పార్టీని బలహీనం చేయడానికి ప్రయత్ణాలు జరుగుతున్నాయని తెలిపేరు. అలాగే తన పార్టీ కాంగ్రెస్ తో కలిసిపోతోందనే వదంతిలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పేరు.

కాకినాడ లోక్ శభ సీటుకు పోటీచేసి ఓడిపోయిన ప్రజారాజ్యం లీడర్ సునీల్ గారిని తమ పార్టీలో జేరవలసినదిగా తెలుగుదేశం ఒత్తిడిచేస్తోంది.
ప్రజారాజ్యం ఎం.ఎల్.ఏ కన్నబాబు గారు మాట్లాడుతూ "నిజమే, మా పార్టీని బలహీనం చేయడానికి తెలుగుదేశం సన్నాహాలు చేస్తోంది. మా పార్టీలోని పెద్దవారిని తమ పార్టీకి రావలసిందిగా కోరుతోంది. కొంతమంది ప్రజారాజ్యం కార్యకర్తలు ఎక్కడో తెలుగుదేశంలో జేరితే, దానికి పెద్ద ప్రకటన ఇచ్హి ప్రజారాజ్యం పార్టీవారు, ఆ పార్టీ వదిలి తెలుగుదేశంలో జేరుతున్నారని ప్రచారం చేస్తున్నారు" అన్నారు.

తూర్పు గోదావరిలోని జగ్గంపేట లో ప్రజారాజ్యానికి చెందిన కొందరు కార్యకర్తలు, ప్రజారాజ్యం లీడర్ మరియూ జిల్లా గ్రంధాలయ చైర్మాన్ ఎస్.వీ.ఎస్ అప్పలరాజు, చంద్రబాబునాయుడు ఎదుట తెలుగుదేశం పార్టీలో జేరినదానిని ఒక పెద్ద విషయం గా చెబుతున్నారు.

Friday, April 16, 2010

పూంక్-2 (PHOONK-2) సినిమాను ఒంటరిగా చూసినతనికి రాంగోపాల్ వర్మ రూ.5 లక్షలు ఇచ్హుకోవాలి

తాను తీసిన భయం పుట్టించే సినిమా పూంక్-2 ను ఎవరైనా ఒంటరిగా చూస్తే వారికి రూ.5 లక్షలు బహుమతిగా ఇస్తానన్నారు రాంగోపాల్ వర్మ గారు.

ఇప్పుడు బెంగులూరుకి చెందిన ఒకతనికి రూ.5 లక్షలు ఇచ్హుకోవటమే కాకుండా తాను తీసిన పూంక్-2 సినిమా భయం పుట్టించేదిగా లేదని తెలుసుకోనుంటారు రాంగోపాల్ వర్మగారు.

బెంగులూరు లోని కూర్గ్ కి చెందిన పవిన్ పొన్నాన అనే 31 సంవత్సరములున్నతను పూంక్-2 సినిమా ఆడుతున్న ఒక సినిమాహాలులో మార్నింగ్ షో టికెట్లన్నీ తానే కొనుకుని తానోక్కడూ ఒంటరిగా ఆ సినిమాను చూసి..."ఈ సినిమా భయపెట్టేవిధంగా ఏమీ లేదని" తెలియజెప్పేడు. ఇతనే అంతకు ముందు ఆగస్ట్ 2008 లో పూంక్ సినిమాను ఒంటరిగా చూసేడు.

"మా కూర్గీలు చాలా దైర్యవంతులం. మూఢ నమ్మకాలు లేనివారం. పిచ్హి బ్రమలను నమ్మం. ఈ సినిమాలో చూపించిన పిచ్హి నమ్మకానికి లొంగము" అని అడ్వర్ టైసింగ్ కంపెనీ నడుపుతున్న పవిన్ పొన్నాన చెప్పేరు. ఒంటరిగా సినిమా చూడటానికి అతను ఖర్చు పెట్టిన డబ్బు రూ.21 వేలు ( ఆ సినిమా హాలులో ఒక ఆటకి మొత్తం టికెట్ల ధర).

ఇతని తండ్రి మాత్రం సినిమా ప్రారంబించేముందు గుడిలో పూజ చేయించేడట. ఇతని భార్య అంతకు కొంచం ముందే ఒక పాపకు తల్లి అయిందట. అందువలన ఇతని సాహసం గురించి ఆమెకు తెలుపలేదట.

ఇతని సినిమా చూస్తుంటే ఏమైనా అవుతుందేమోనని ఆ సినిమాహాలు ఓనర్ ఎమర్జెన్సీకి ఒక డాక్టర్‌ను ఏర్పాటు చేసేరుట. "ఇదంతా అనవసరం, నేను ఇంటెర్ వెల్ లేకుండా మొత్తం 2 1/2 గంటల సినిమాను ఒకేసారి ఒంటరిగా చూసేను" పవిన్ అన్నారట.

"ఇలాంటి మాయమాటలు చెప్పి, ప్రకటనలు ఇచ్హి,సినిమాకు పబ్లిసిటీ చేయకూడదు. ఒక సినిమా బాగుందా లేదా, భయంకరమైనదా కాదా అనేది సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పాలి కానీ సినిమా తీసినవారు చెప్పకూడదు అన్న విషయాన్ని బయటకు చెప్పాలనే నేను ఇలా చేసేను" అని వివరించేరు పవిన్ పొన్నాన.

Thursday, April 15, 2010

విమాన రాకపోకలకు పెద్ద ఎత్తున అంతరాయం కలిగించిన ఐస్ లాండ్ అగ్ని పర్వత పేలుడు వీడియోలను తిలకించండి

ఐస్ లాండ్లో ఉన్న ఐజాఫ్ జల్లజొకుల్ ఐస్ కొండ ఒక అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతం పోయిన నెల 23 వ తారీఖున మొదటిసారి అగ్నిని కక్కుతూ పేలుడుకు గురైనది. ఆ తరువాత చిన్న చిన్న పేలుళ్ళతో ఆ పర్వతం పైనున్న మంచు గడ్డలు కరగటం జరిగింది. ఆ కరిగిన మంచునీరు నదీజలాలలో కలవటం మూలంగా నీటిమట్టం 10 అడుగులు పెరిగింది. వరద ప్రమాదం వలన వందలాది ప్రజలను అక్కడనుండి సురక్చిత ప్రాంతాలకు తరలించేరు.
ఈ అగ్నిపర్వతంలో బుధవారం నాడు (14/04/2010) న మళ్ళీ పెద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడు మూలంగా కొండనుండి ఒక్కసారిగా ఆకాసంలోకి సుమారు 17 కిలోమీటర్ల ఎత్తువరకు బూడిద వెలువడింది. ఈ బూడిద పెద్ద మబ్బులాగా ఆకాసాన్ని యూరోప్ లో సగానికిపైగా మూసివేయడంతో విమానా రాకపోకలకు అంతరాయం కలిగించింది. యూరోప్ నుండి బయలుదేరవలసిన విమానాలను రద్దు చేసేరు. యూరోప్ పై నుండి ఇతర దేశాలకు వెళ్ళవలసిన విమానాలను కూడా రద్దు చేయవలసి వచ్హింది.
ఇంగ్లాండ్ హీత్రో విమానాశ్రయం నుండి బయలుదేర వలసిన అన్ని విమానాలను రద్దు చేయడం వలన వందలాది ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ఇది విమాన రాకపోకల చరిత్రలోనే అతి పెద్ద భంగంగా చెబుతున్నారు. విమాన రాకపోకలు ఎప్పుడు తిరిగి మొదలుపెడతారో సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఈ అగ్నిపర్వతం గనుక మళ్ళీ మళ్ళీ పేలితే విమాన రాకపోకలకు కనీసం నెలరోజులదాకా అంతరాయంగా ఉంటుందంటున్నారు.

Wednesday, April 14, 2010

సినిమాల వలన వచ్హిన పలుకుబడితో రాజకీయాలలో రానించగలరా? చిరంజీవి గారు తిరిగి సినిమాలకు వెల్లాలని అలోచిస్తున్నారా!?

సినిమా ఇండస్ట్రీ మరియూ ప్రజలు కావాలనుకుంటే తిరిగి సినిమా రంగంలోనికి వెడతానని ప్రజారాజ్యం అధినేత చిరంజీవిగారు నిన్న ఒక పత్రికకు ఇచ్హిన ఇంటెర్ వ్యూ లో తెలిపేరు. ఈ మాట రాజకీయాలలొ తన పార్టీ పెద్దగా రాణించనందున నిరాశతో చెప్పిన మాటలాగ అనిపిస్తోంది.

ఎందుకంటే అంతకు ముందు ఆయన పత్రికావిలేకరులతో మాట్లాడుతూ "మేము ప్రజలకోసం వారికి మంచి చేయాలని చెమటోడ్చి పనిచేస్తున్నము...కానీ ఇది ప్రజలకు ఎలా తెలియాచెప్పలో అర్ధం కావటంలేదు. కానీ తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడుగారు ఈ విషయములో ఆరితేరిన మనిషి. ప్రజలకోసం కష్టపడకుండానే, వారికోసం ఏమీ చేయకుండానే ప్రజల దగ్గర పేరు తెచ్హుకుంటున్నారు. ఈ విషయంలో నేను చాలా వెనుకబడియున్నాను" అని చెప్పేరు. "తిరుపతిలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్హి ప్రజలు నన్ను నేరుగా కలుసుకునేటట్లు చేస్తాను" అని కూడా చెప్పేరు.

కష్టమే, రాజకీయాలలొ రానించటం చాలా కష్టమైనపని. అందులోనూ ఒక పార్టీ పెట్టి ఏకంగా రాష్ట్ర పరిపాలనను చేజిక్కీంచుకోవటం చాలా కష్టం. సినిమా పలుకుబడి రాజకీయాలలో రాణించదు. ఆ ఘనత ఎం.జీఆర్ కు మరియూ ఎంటీ ఆర్ కు మాత్రమే దొరింకింది.
దీనికికూడా కారణాలున్నాయి. ఎం.జీ.ఆర్. చాలారోజులుగా (డి.ఎం.కే) రాజకీయాలలో ఉంటూ, నటుడిగా ఉండి మంత్రిపదవులు చేపట్టి రాజకీయ అనుభవం తెచ్హుకున్నారు. ఆ అనుభవానికి తోడు ఆయన సినిమా పలుకుబడి కూడా కలిసింది. అందువలన ఆయన రాజకీయాలలో రాణించగలిగేరు.

ఇకపోతే ఎన్.టీ.ఆర్. గారు. ఈయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అంతవరకు కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న ఆంద్ర రాష్ట్ర ప్రజలు మార్పుకావాలని ఒక్కసారిగా తెలుగుదేశమును ఎన్నుకున్నారు గాని ఎన్.టీ.ఆర్ రాజకీయాలో ఉన్నారని కాదు. వీరిరువరూ తప్ప సినిమా పలుకుబడి ఉందని రాజకీయాలలోకి వచ్హిన మిగిలిన అందరూ అప్పుడూ, ఇప్పుడూ కూడా రాజకీయాలలో రాణించలేదు.

సివాజీ గనేషన్ గారు ఎంతో ప్రయత్నం చేసేరు, కానీ రానించలేదు. ఇప్పుడు విజయకాంత్. చిరంజీవిగారిలాగానే ప్రత్యేక పార్టీ పెట్టి ప్రయత్నిస్తున్నారు. కానీ రానించలేకపోతున్నారు. ఇలాగే చాలా మంది రానించలేకపోయేరు. ఎందుకంటే వారందరినీ నటులుగా ప్రజలు గుర్తిస్తున్నారు కానీ రాజకీయ నాయకులుగా గుర్తించటంలేదు.

ఇప్పుడు రాజకీయాలలో ఉంటున్న సినిమా రంగంవారు అంతకుముందున్న ఏదో ఒక రాజకీయ పార్టీలో జేరి పదవులలో ఉంటున్నారు. వీరుకూడా వీరి సినిమా పలుకుబడితో రాలేదు. ఏ రాజకీయపార్టీలో ఉంటున్నారో ఆ రాజకీయ పార్టీ వలనే. ఇది తెలుసుకునే రజినీకాంత్ కూడా మొదట్లో రాజకీయాలలో మొగ్గు చూపినా తరువాత దానికి దూరంగా ఉంటున్నారు. సినీజీవితంలో గెలిచి తెచ్హుకున్న పేరును రాజకీయ జీవితంతో పోగొట్టుకోకూడదు.

Tuesday, April 13, 2010

నకిలీ మందుల తరువాత ఇప్పుడు నకిలీ పాల డబ్బాలు

నకిలీ మందుల స్కాం నుండి ఇంకా పూర్తిగా తేరుకోని ప్రజలు, ఇప్పుడు నకిలీ పాల డబ్బాలు మార్కెట్ లో ఉన్నాయని తెలిసి కంగుతిన్నారు. ఈ నకిలీ పాల డబ్బాల అమ్మకం వెనుక కూడా ఒక పెద్ద ముఠా ఉన్నట్టు అనుమాన పడుతున్నారు.

లాక్టొజెన్--నెం 1 (LACTOGEN-NO-1) అనే ప్రసిద్ది చెందిన పసిపిల్లల పాల డబ్బా లోని పాలు తాగిన 4 నెలల పసిబాలుడు ఆ పాలు త్రాగిన వెంటనే స్ప్రుహ కోల్పోయేడు. ఆ పాల డబ్బలోని ఆహారపదార్ధం చెడిపోయినదని మరియూ పురుగులు పట్టిందని తెలియవచ్హింది.

స్ప్రుహ కోల్పోయిన పసి పిల్లవాడిని, అతని తండ్రి స్టీఫెన్ వెంటనే ప్రక్కనున్న హాస్పిటల్‌కు తీసుకువెళ్ళేడు. అందువలన ఆ పసిపిల్లవాడి ప్రాణం కాపాడబడింది...ఇంటి ప్రక్కనున్న డిపార్ట్ మెంట్ స్టోర్స్ లో తన పిల్లవాడికోసం లాక్టోజెన్-నెం 1 కోన్న ఆ పసిపిల్లవాని తండ్రికి ఆ పాలడబ్బా వలనే తన పిల్లవాడు స్ప్రుహ కోల్పోయేడని తెలియదు. ఇంటికి తిరిగి వచ్హిన తల్లితండ్రులు నీరసంగా ఉన్న పిల్లవాడికి తిరిగి ఆ డబ్బాలోని పాలు కలిపేరు. అప్పుడు ఆ పాలలో చిన్న చిన్న పురుగులు కనబడ్డాయి. కంగారుపడిన స్టీఫెన్ ఆ డబ్బాను తీసుకుని డిపార్ట్ మెంట్ స్టోర్స్ కి వెల్లి అడిగితే మాకేమీ తెలియదని వారు చెప్పేరు.

మరుసటి రోజు స్టీఫెన్ కన్ స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ లో కేసు పెట్టి విచారించవలసినదిగా కోరేడు. కన్ స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ వారు ఆ డబ్బాను పరిశొధనకు కింగ్ ఇన్స్ టిట్యూట్ కు పంపిస్తూ ఆ కేసును కన్ స్యూమర్ ప్రొటెక్షన్ ఆర్గనైసేషన్ కు మార్చేరు.

"ఆ డబ్బామిద ఎక్ స్పైరీ తారీఖు ఫిబ్రవరీ 11/2011 అని వేసుంది. కానీ అది నిజమైన తారీఖో కాదో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ డబ్బాలోని పౌడర్ అప్పుడే పాడైపోవటం మాకు అనుమానం కలిగిస్తోంది. నకిలీ మందులు అమ్ముతున్న లాగానే నకిలీ పాల పౌడర్లూ, నకిలీ ఆహారపదార్ధాలు మార్కెట్లో ఒక గ్యాంగ్ అమ్ముతున్నదని తెలుస్తోంది" అని తమిళనాడు కన్ స్యూమర్ ప్రొటెక్షన్ ఆర్గనైసేషన్ ప్రెసిడెంట్ సి.పాల్ బర్నబాస్ చెప్పేరు.

ఈ ఫోరంలో ఇది మొదటి కేసుకాదు. ఇంతకుముందే ఇలాంటివి 4 కేసులు వచ్హినై. ఒక కేసులో ఒక కూల్ డ్రింక్ బాటిల్ లో ఫంగస్ (FUNGUS) ఉన్నది. ఇంకొకకేసులో ఒక చాక్లెట్లో బొద్దెంక ఉన్నది. మేము అన్ని కేసులూ ఆర్గనైసేషన్ కు అందిచేము అని ఆయన తెలిపేరు.

ఆర్గనైసేషన్ లోని ప్రతి కేసూ 90 రోజులలో తేల్చాలి, తీర్పు ఇవ్వాలి కానీ తీర్పులివ్వడంలో ఆలస్యం జరుగుతున్నదట. ఎందుకో తెలియదు........ప్రజలు ఇప్పుడు మార్కెట్లో ఏది కొనాలన్నా భయంతో కొంటున్నారు.

బలవంతముగా దేవతగా మార్చబడిన పిల్ల మరణం

అయోధ్యలో సాదారణ కుటుంబములో పుట్టిన పిల్ల మరణించేటప్పుడు దేవతగా కొలువబడింది.

అయోధ్యకు దగ్గరలో ఉన్న బిజిలియాదహ అనే గ్రామానికి చెందిన 11 సంవత్సరముల కుష్బూ అనే పిల్ల, సంవత్సరం క్రితంవరకు ఒక సాదారణ మైన మామూలు ఆడపిల్ల. సంవత్సరం క్రితం ఆ పిల్ల తల్లితండ్రులకు కలలో ఒక దేవత కనబడిందట. ఆ మరుసటిరోజు ఆ పిల్లకు జ్వరం వచ్హింది. వెంటనే అ పిల్ల తల్లితండ్రులు ఆ పిల్లను దేవత వరించిందని చెప్పటం మొదలుపెట్టేరు.

జ్వరం వచ్హిన ఆ పిల్లను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లకుండా, అక్షర జ్ఞానం రాని ఆ పిల్ల తల్లితండ్రులు, ఆ పిల్లకు పట్టుబట్టలు కట్టి, చేతిలో ఒక శూలం ఇచ్హి కూర్చోబెట్టేరు.....ఈ వార్త ఆ చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. వెంటనే ఆ గ్రామాలకు చెందిన ప్రజలు ఈ చిన్నారి దేవతను దర్శనం చేసుకోవటానికి వరుసగా నిలబడ్డారు.

జ్వరంతో ఉన్న ఆ పిల్ల నీరసించిపోయి మాట్లాడలేక పోయింది. వెంటనే అ పిల్ల తల్లితండ్రులు ఆ చిన్నారి దేవత మౌనవ్రతం పాటిస్తోందని చెప్పేరు. ఇది విని అక్కడ జన సమూహం కూడింది. జ్వరం ఎక్కువై ఆ పిల్ల తినడం మానేసింది. అది కూడా దైవసంకల్పమే నన్నారు.
వారం రోజులక్రితం అ పిల్ల చనిపోయింది. ఆ పిల్ల తల్లితండ్రులు దేవత తిరిగి తన ఆలయాన్ని చేరుకుందని చెప్పేరు. కోలాహలంగా జరిగిన అంత్యక్రియలతో ఆ పిల్లను సమాధి చేసేరు. ఆ గ్రామస్తులు ఆ పిల్ల సమాధిపైన ఒక గుడి కట్టాలని ఆలోచిస్తున్నారట.

ఆ గ్రామానికి చెందిన, ఈ దేవతా అవతారాలపైన నమ్మకంలేని ఒకతను ఆ పిల్ల తండ్రి త్వరగా డబ్బు సంపాదించాలనే ఆ విధముగా చేసేడని, గత కొన్ని నెలలుగా ఆ పిల్ల తండ్రి వేలాది రూపాయలు సంపాదించేడని చెబుతూ......ఈ మాటను నేను అరిచి చెప్పలేను, ఎందుకంటే ఈ గ్రామస్తులందరూ మూఢనమ్మకస్తులు. నేను చెప్పేదాంట్లోని నిజాన్ని వారు ఒప్పుకోరు సరికదా నన్ను పిచ్హివాడని, నాస్తీకుడని చెబుతారు అన్నాడు.

పోలీసులుకూడా ఈ విషయాన్ని రహస్యముగా ఉంచేరు. "ఈ విషయం మాకు కొద్ది రోజుల క్రితమే తెలిసింది. ఇది మత నమ్మకాలకి సంబందించిన విషయం కావటంతో మేము ఒక నిర్ణయానికి రాలేకపోయేము. నిజాలు తెలిసిన వెంటనే చట్ట రీత్యా చర్య తీసుకుంటాము" అని చెప్పేరు.

ఇది మూఢ నమ్మకం అని చెప్పి ఆ పిల్లను పోలీసులు ఆసుపత్రికి తరలించి ఉంటే ఆ పిల్ల బ్రతికేది. కానీ మన దేశంలో చదువుకున్న వారూ, చదువులేనివారూ మూఢ నమ్మకాలకు బలౌతుంటే ఇలాంటి సంఘఠనలు జరగటం సహజమే.

ఈ మూఢ నమ్మకాలనుండి ఎప్పుడు మన ప్రజలు విముక్తి చెందుతారో? అంతవరకు కుష్బూ శరీరం ప్రశాంతంగా సమాధిలో ఉంటుందేమోకానీ ఆమె ఆత్మ మాత్రం ప్రశాంతంగా ఉండదు.

Monday, April 12, 2010

క్రికెట్ ఇప్పుడొక విశ్వవిద్యాలయ కోర్స్ గా మారింది

అవును మరి, కోట్లు సంపాదించి పెడుతున్న క్రికెట్టును ఒక చదువుగా (కోర్స్) నేర్పించడం మంచి ఐడియానే.

ఐటీ (IT)మరియూ ఇతర పరిశ్రమలలాగానే, క్రికెట్ కూడా ఇప్పుడు ఒక అతి పెద్ద పరిశ్రమగా మారింది. క్రికెట్ మ్యాచ్ లు నడిపేవారూ, ప్రసారం చేసే వారూ, ప్రకటనలు ఇచ్హేవారూ కోట్లకొలది డబ్బును పెట్టుబడిగా పెడుతున్నప్పుడు అది ఒక పరిశ్రమ క్రిందే వస్తుంది.

ఇక ఆ ఆటను ఆడేవారు కోట్లకొలది రూపాయలను సంపాదిస్తున్నారు. ఇది చూసి యువకులు చదువుల మీద చూపిన శ్రద్దనే ఈ ఆటమీద చూపిస్తున్నారు. తళ్ళితండ్రులు కూడా తమ పిల్లలు క్రికెట్ ఆడి ఇటు డబ్బు, అటు పేరూ సంపాదించాలని తాపత్రయ పడుతున్నారు. అటువంటప్పుడు క్రికెట్ ను ఒక కోర్స్ గా పెట్టడం మంచి ఐడియానే.

క్రికెట్ ఇలా ఒక చదువుగా మారడానికి ఐ.పి.ఎల్ (IPL) ఒక ముఖ్య కారణం. 22 యార్డుల ఆటను విశ్వవిద్యాలయం వరకు తీసుకువెళ్ళిన ఘనత ఐ.పి.ఎల్.కే జేరుతుంది.

మిగిలిన సబ్జెక్ట్ ల లాగానే, క్రికెట్‌ను ఒక సబ్జెక్ట్ గా విశ్వవిద్యాలయంలో చేర్చి, దానికి ఒక డిప్లమో సర్టిఫికెట్ ను అందించాలనీ, ఆ సబ్జెక్ట్ ను ప్రమంచములోనే మొదటిసారిగా విశ్వవిద్యాలయ కోర్స్ గా పరిచయం చేసే గొప్పతనాన్ని న్యూజీలాండ్ చేజిక్కించుకుంది.

న్యూజీలాండ్ లోని ఆక్లాండ్ విశ్వవిద్యాలయం "డిప్లమో ఇన్ క్రికెట్" అనే ఒక కోర్స్ ను మొదలుపెట్టింది. ఈ కోర్స్ లో విధ్యార్ధినీ విధ్యార్ధులను చేర్చుకోవటానికి ఆ యూనివర్సిటీ భారతదేశం మీద కన్ను వేసింది. ఎందుకంటే ప్రపంచములోని అన్ని దేశాల కన్నా మన దేశ ప్రజలు క్రికెట్ మీద ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. ఈ ఆటను ఆడుతున్నారు మరియూ ఈ ఆట మూలంగా డబూ సంపాదిస్తున్నారు కనుక.

ఈ ఒక సంవత్సరం "డిప్లమో ఇన్ క్రికెట్" కోర్స్ ను క్రికెట్ ఆటకు సంబందిచిన అన్ని రంగాలలోనూ ప్రవేశపెడుతున్నారు. అంటే, క్రికెట్ ఆటలోని ఏ రంగంలోనైనా ఈ కోర్స్ చదువుకోవచ్హు. క్రికెట్ ప్లేయర్, క్రికెట్ అంపైర్, క్రికెట్ కామెంటేటర్, క్రికెట్ స్కోరర్, గ్రౌండ్స్ మాన్, క్రికెట్ కోచ్, క్రికెట్ స్టేడియం మానేజ్ మెంట్ లాంటి క్రికెట్ శాఖకు సంబందించిన మరెన్నో కోర్స్ లలో జేరవచ్హు.

ఈ కోర్స్ చదివిన వారిని మొదట న్యూజీలండ్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లలో ఆడనిస్తారు. సర్ రిచర్డ్ హాడ్లీ మరియూ జాన్ రైట్ లు గెస్ట్ లెక్చరర్లుగా ఉంటారు. స్కాట్ స్టైరిస్ మరియూ మార్టిన్ గుప్తిల్ కూడా ఉంటారు.

ఆక్లాండ్ విశ్వవిద్యాలయములో ఇదివరకే 'స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ ' అనే సబ్జెక్ట్ ఉన్నది. అందులో ఇప్పుడు క్రికెట్ ను కూడా జేరుస్తారు. ఆండ్ర్యూ ఎడే ఇప్పుడు ఆ పనిమీదే ఉన్నారు. ఇండియాలో ప్రయాణం చేస్తున్నారు. ఈయన ఐ.సీ.సీ (ICC) కి 2000 నుండి 2003 వరకు గ్లోబల్ క్రికెట్ డెవెలప్మెంట్ మేనేజర్ గా పనిచేసేరు.

Sunday, April 11, 2010

దాంతేవాడ హత్యాకాండతో తమ గొంతుకు తామే ఉరితాడు బిగించుకున్నారు మావొయిష్టులు

ఏ ప్రబుత్వమూ, ఏ సంఘమూ మరియూ ఏ మనిషీ దాంతేవాడలో మావొయిష్టులు రక్షక దళాల పై జరిపిన దాడిని ఖండిచకుండా ఉండరు. మావోయిష్టుల సింపతైసర్స్ కూడా ఈ దాడిని సహించలేకపోయేరు.

76 మంది రక్షదళాలను చట్టీస్ గర్ లోని దాంటేవాడలో మావొయిష్టులు హతమార్చటాన్ని ఏ ప్రబుత్వమూ చూస్తూ ఊరుకొదు. మావోయిష్టులు జరిపిన ఈ రక్తపాతంతో వారే వారి గొంతులకు ఉరితాడు బిగించుకున్నారు. దీనిలో బలి అయ్యేది మావొయిష్ట్ లీడర్స్ కన్నా వారిని గుడ్డిగా నమ్మి వారు చెప్పింది చేస్తున్న వారి శిష్య దళాలే ఎక్కువ. మావోయిష్టు లీడర్లు వారి శిష్య దళాలను తప్పుదోవ పట్టిస్తున్నారనటానికి ఈ దాడే ఒక ఉదాహరణ.

26/11 న ముంబై నగరంలో జరిగిన మారణకాండతో మన ప్రబుత్వం పాకిస్తాన్ తో ఎలా మాట్లాడటం మానేసేరో, అలాగే దాంతేవాడ మారణహోమం వలన మావోయిష్టులతో మాట్లాడతామన్న పిలుపును రద్దు చేసేరు మన కేంద్ర ప్రబుత్వ అధికారులు.

దాంతేవాడలో మావోయిష్టులు జరిపిన హింసాకాండ ముందు వరకు ప్రబుత్వం మావోయిష్టులమీద జరిపే యుద్దాన్ని ఆపి వారిని మాటలకు రమ్మని పిలిచుండేది. మావోయిష్టులు ఎన్ని కండిషన్స్ పెట్టినా (మావోయిష్టులపై ప్రబుత్వ అణిచివేతలు నిలిపివేయాలి, ఖైదు చేయబడ్డ మావోయిష్టులను విడుదల చేయాలి లాంటివి) రైల్వే స్టేషన్స్ పేల్చివేయటం, టెలిఫోన్ టవర్స్ ను కూల్చివేయడం మరియూ స్కూల్స్,పంచాయతీ బిల్డింగులను పడగొట్టటం లాంటి హింశాకాండలను తగ్గించుకోనుంటే మావోయిష్టులతో తప్పక ప్రబుత్వం సంప్రదింపులకు ముందుకు వచ్హేది. కానీ ఈ దాంతేవాడా హింశాకాండతో మావోయిష్టులతో మాట్లాడరు సరికదా వారిని ఏరిపారేయటానికి కూడా వెనుకాడరు.

దాంతేవాడ హింశాకాండవలన ప్రబుత్వానికి పెద్ద నష్టం జరగడమే కాకుండా అతి పెద్ద అవమానం కూడా జరిగింది. ప్రబుత్వ దళాల బలహీనతను అర్ధం చేసుకుంది. ఇప్పుడు ఆ బలహీనతలను ప్రక్కకుతోసి, బలం పుంజుకుని దెబ్బ తీస్తే, తీస్తే ఏమిటి తీయదలచుకున్నారు. ఇప్పుడు ఇది మావోయిష్టులకు ఉరితాడుగా తయారైంది.

మావోయిష్టులపై ఎలాంటి జాలి చూపకూడదని అన్ని రాజకీయ పార్టీలూ ఒకటిగా కలసి వారిని ఏరిపారేయాలంటున్నారు. ఇది నిజంగా మావోయిష్టులకు ఒక పిడుగులాంటి దెబ్బే. ప్రబుత్వం అనుకున్నట్టు ఇంకో 3 సంవత్సరాలలో మావోయిష్టులు లేకుండా చేయగలదు.

Saturday, April 10, 2010

ప్రొఫెసర్స్ మరియూ మీడియా వారి చేసింది రాగింగ్

అలిగార్ ముస్లీం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ శ్రీ శ్రీనివాస్ రాం చందర్ సిరాస్ చనిపోవాటానికి కారణం రాగింగ్ అనే చెప్పాలి.

ఒక మనిషియొక్క అవిటితనాన్ని (లేక) అంగ హీనతను, ఆ మనిషికి తెలియకుండా వీడియో తీయడం, ఆ విడియోని చూపించి ఏడిపించడం తప్పకుండా రాగింగే అవుతుంది. అందొలోనూ ఇప్పుడు ఆయన చనిపోవడం క్రిమినల్ రాగింగ్ అవుతుంది.

ఇలా రాగింగులుచేయడం విశ్వవిద్యాలయ విద్యార్ధులు ఒక సరదా అనుకుని చేస్తున్నారు. అటువంటి రాగింగ్ గే ఒక పెద్ద తప్పు. ఇది తప్పు అని చెప్పవలసిన బాధ్యత ప్రొఫెసర్లకూ, మీడియావారికి ఉన్నది. అలాంటిది ప్రొఫెసర్లూ, మీడియావారే రాగింగ్ లో ఈడుపడితే వారికి ఎటువంటి శిక్చ వేయాలి?

ప్రొఫెసర్ సిరాస్ ఒక గే అని, ఆయన హొమొసెక్స్ లో ఈడుపడుతున్నాడని నిరూపించటానికి కొంతమంది మీడియావారితో కలిసి అదే విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్.ఏ.కె. దురానీ, ప్రొఫెసర్ రహత్ అబ్రార్ మరియూ విశ్వవిద్యాలయానికి చెందిన అధికారి జూబిర్ ఖాన్ కలసి ప్రొఫెసర్ సిరాస్ నివసిస్తున్న ఇంటికి వెళ్ళి, ఆయనకు తెలియకుండా ఆయన చేస్తున్న పనులను వీడియోతీసేరు. ఆ వీడియోను విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ కు చూపించగా అయన ప్రొఫెసర్ సిరాస్ ను సస్పెండ్ చేసేరు.

సస్పెండైన ప్రొఫెసర్ సిరాస్ విశ్వవిద్యాలయ అధికారులపైనా, ఆ ప్రొఫెస్సర్స్ పైన మరియూ మీడియా వారి పైన కొర్టులో ఫిర్యాదు చేసేరు. తన అనుమతి లేకుండా తన ఇంటికి వచ్హి, తన ప్రైవసీకి బంగం కలిగించి వీడియో తీసి తనను బెదిరించి సస్పెండ్ చేసేరని తన ఫిర్యాదులో తెలిపేరు. కొర్టు ప్రొఫెసర్ సిరాస్ మీద ఏ తప్పు లేదని, ఆయన సస్పెండ్ చెల్లదని తీర్పు ఇస్తూ దౌర్జన్యంగా ప్రొఫెసర్ సిరాస్ ఇంట్లోకి వెల్లిన మీడియావారి మీదా మరియూ వారితో వెళ్ళిన ప్రొఫెస్సర్స్ మీద దర్యాప్తు జరప వలసినదిగా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసేరు.

ఈ లోపు ప్రొఫెసర్ సిరాస్ అనుమానస్పధమైన పరిస్తితులలో ఆయన ఇంట్లోనే చనిపోయేరు.

అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని కొందరంటున్నారు. ఆయన హత్య చేయబడి ఉండవచ్హునని కొందరు అంటున్నారు. పోలీసులు విచారన కోనసాగిస్తున్నారు.

ఆయన ఆత్మహత్య చేసుకోనున్నా దానికి ఆ ప్రొఫెస్సర్స్ మరియూ మీడియావారే భాద్యులు. హత్య చేయబడి ఉంటే దానికి భాద్యులైనవారు ఎవరనేది కనుక్కోవాలి....ఏది ఏమైనా ఆయనను అవమానపరచిన ప్రొఫెస్సర్స్ మరియూ మీడియావారూ ఆయనను రాగింగ్ చేసినట్లే. కాబట్టి వీరిని రాగింగ్ చట్టం క్రింద అరెస్ట్ చేసి శిక్చించాలి. ఆయన హత్యకేసును విచారించి దానికి కారనమైనవారినికూడా శిక్చించాలి.

ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వలనే దొంగ మందులు అమ్ముతున్న ముఠాకి తిరుగులేని వ్యాపారం…ఇప్పుడు దొంగ ప్రిమోలట్-ఎన్ మరియూ జింకోవెట్ మాత్రలు

ఈ మధ్య తమిళనాడులో బయటపడిన దొంగ మందుల అమ్మకం ప్రజలలో భయాందోళనలు పుట్టించినై, పుట్టిస్తునే ఉన్నాయి ( ఇంకా ఎన్ని దొంగ మందులు అమ్మబడుతున్నాయో తెలియక).

ప్రతిరోజూ కోంతమందిని దొంగమందులు అమ్ముతున్నారని పోలీసులు పట్టుకుంటున్నారు. ఇందులో కొంతమందిని పోలీసులు 2000 వ సంవత్సరములోనే ఒక సారి ఇదేలాగా దొంగమందులు అమ్ముతున్నారనే నేరం క్రింద పట్టుకున్నారట.....ఆ కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయట. ఆ కేసుకు సంబంధించిన నిందితులు బైల్ మీద బయటే ఉన్నారట. కానీ వారు మళ్ళీ దొంగమందుల వ్యాపారమే చేస్తున్నారా అనేది ఎవరికీ తెలియదు.

పాత కేసుల వివరాలు వింటే, ఇప్పుడు బయట పడ్డ కేసులకంటే అవి చాలా ఘోరమైనవి. 2000 సంవత్సరములో లైఫ్ సేవింగ్ మందులు (Life Saving Medicine) దొంగవి అమ్ముతున్నారని పట్టుకున్నారు.సైంట్ ఇసబెల్ హాస్పిటల్ వారు గ్లాస్కో (Glaxo) కంపెనీ తయారు చేసిన "ఫోర్టం" ఇంజెక్షన్ ను ఒక గర్భిణీ స్త్రీకి వేసేరుట. ఐతే, ఆ ఇంజెక్షన్ పనిచేయలేదట. వెంటనే ఆ ఇంజెక్షన్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసేరు. అదే ఇంజెక్షన్‌ను మిగిలిన స్టాక్ లో నుండి తీసుకుని, అప్పుడున్న డ్రగ్స్ కంట్రోలర్ కి పంపించగా వారు చేసిన పరిశోధనలో ఆ ఇంజెక్షన్ దొంగ మందని, ఉత్త డిస్టిల్ వాటర్ పోసిన ఇంజెక్షన్ అని తెలిసింది. అంతకు ముందే తమ "ఫోర్టం" ఇంజక్షన్ అమ్మకం బాగా తగ్గిపోయిందని, దీని మీద ఒక విచారణ జరపవలసిందిగా గ్లాస్కో కంపెనీ వారు డ్రగ్స్ కంట్రోల్ వారికి ఒక పిటీషన్ ఇచ్హేరు .

ఆ కేసును విచారించిన పోలీసులు చెన్నై నగరానికి దగ్గరున్న గుమ్మిడిపూండీలో డిస్టిల్ వాటర్ పోసి ఇంజెక్షన్ తయారు చేసి దాని మీద గ్లాస్కో వారి 'ఫొర్టుం" లేబుల్స్ ని అతికిస్తున్నఒక ఫ్యాక్టరీని పట్టుకున్నారు. ఆ కంపెనీ తయారు చేసిన ఆ దొంగ మందులను హైదరాబాద్ లో ఉన్న ఒక మందుల పంపినీ సంస్త భారతదేశమమంతటికీ పంపి అమ్మకం చేసేరట. ఆ దొంగ మందును తయారు చేసిన కంపెనీ లో ఉన్న 8 మందిని పోలీసులు అరెస్టు చేసేరు. ఎనిమిది మందీ బైలులో బయటకు వచ్హేరు. ఆ కేసులో చార్జ్ షీట్ 2002 లో పూర్తి చేయబడి 2003 లో ఆ కేసు విచారణ కు వచ్హింది. ఆ కేసు విచారణ పూర్తికాక ఈ రోజుకీ ఇంకా పెండింగ్‌లోనే ఉందట.

ఈ కేసు మూలముగా దొంగ మందులు తయారు చేసే వారూ, పంపినీ చేస్తున్నవారూ ఒక అంతర్ రాష్ట్రీయ గ్యాంగుగా వ్యవహరిస్తూ హైదరబాద్ ని వారి హెడ్ ఆఫీస్ గా పెట్టుకున్నారట. కానీ హైదరబాద్ ఆఫీసులో ఎవరినీ పట్టుకోలేదట. ఇంతవరకు వారెవరనేది తెలుసుకోలేదట.

అప్పుడే గనుక ఆ ముఠాని పట్టుకుని, ఆ నెట్ వర్క్ ను చేధించి ఉంటే ఇలా ఈ రోజు జరిగేదికాదు. 10 సంవత్సరాలుగా దొంగ మందుల వ్యాపారం చేసే వారు కాదు, కోటీశ్వరులయ్యేవారు కాదు. అమాయక ప్రజల ప్రాణాలు పోయేవి కాదు. ఇదంతా ప్రబుత్వ యంత్రాంగమైన డ్రగ్స్ కంట్రోలర్ మరియూ పోలీసు వారి నిర్లక్ష్యం వలనే జరిగింది, ఇంకా జరుగుతునే ఉన్నది...ఇప్పుడు దొంగ ప్రిమోలట్-ఎన్ (PRIMOLUT-N) మరియూ జింకోవెట్ (ZINCOVIT) మాత్రలు మార్కెట్లో ఉన్నాయట. వాటిలో చాక్ పౌడర్ ఉన్నదట.

ఈ దారుణం లో ఎవరు ఎవరిని శిక్చించాలి? అమాయక ప్రజలను ఎవరు కాపాడాలి?

Friday, April 9, 2010

బోలడంత డబ్బు ఇచ్హి తన స్వాతంత్రాన్ని కోనుకున్నాడా సోహిబ్ మాలిక్?.

ఎన్నో అడ్డంకులను దాటి సానియా-సోహిబ్ లు పవిత్రమైన వివాహభందం మూలంగా ఒకటౌతున్నారు. తన మాజీ భార్య దగ్గరనుండి విడాకులు పుచ్హుకోవటాని అందరికీ తెలిసి సోహిబ్ ఖర్చు పెట్టిన డబ్బు రూ.15,000/-.

కానీ కొందరు వ్యక్తులు చెప్పటం, మాట్లాడటం చూస్తే సోహిబ్ సానియాను వివాహం చేసుకోవటానికి ఒక పెద్ద మొత్తాన్ని, అంటే రూ.15 కోట్లు ఇచ్హి తన స్వాతంత్రాన్ని కోనుకున్నాడని తెలుస్తోంది.

కోంత మంది ముస్లీం నేతలు ఎలాగైనా సోహిబ్ ను అడ్డంకులలోనుండి విడిపించాలని చేసిన ప్రయత్నం యోక్క ఖర్చు ఇంత పెద్ద డబ్బుగా రూపుపోసుకుందట. ఆ ముస్లీం నేతలలో మాజీ క్రికెట్ వీరుడు మరియూ ప్రస్తుత ఎం.పీ మొహమ్మద్ అజారుద్దీన్, ఆంద్రప్రదేశ్ మైనారటీస్ వెల్ఫేర్ మంత్రి మొహమ్మద్ అహముదుల్లా మరియూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జెనెరల్ సెక్రెటరీ అబిద్ రసూల్ కాన్ ఉన్నారట.

విషయం నిర్ణయించబడింది, ఆయీషా కుటుంబీకులు సోహిబ్ మీద హైదరాబద్ పోలీసులకు ఇచ్హిన కేసులన్నిటినీ వెనక్కి తీసుకున్నారు. షారియా చట్ట ప్రకారం అధికార పూర్వముగా ఆయీషాకు రూ.5000/- వస్తాయి. మిగతా డబ్బుగురించి అడిగితే, ఆయీషా కుటుంబీకులు "అటువంటిదేమీ లేదని" ధ్రుడంగా చెబుతున్నారు.

Thursday, April 8, 2010

37 రాజ్య శభ మెంబర్ల మీద క్రిమినల్ కేసులున్నాయట....స్టడీ

17 శాతం రాజ్యశభ మెంబర్లకు క్రిమినల్ రికార్డ్ ఉందట. ఇందులో ఎక్కువ శాతం కాంగ్రెస్స్ వారు. దీనిలోకూడా వారిదే పై చేయి.

ఈ విషయాలు ఎవరో చెబితే తెలుసుకోలేదట. ఎన్నికలప్పుడు ఒకొక్క శభ్యులూ తమ సొంత వ్రాతతో రాసి ఇచ్హిన ద్రువీకరణ పత్రంలో ఉందట. ఈ పత్రాలు ఆ ఆ రాష్ట్ర అసెంబ్లీ సెక్రెటరీల దగ్గర ఉన్నాయట. మొత్తం 219 మంది శభ్యులున్న రాజ్య శభలో 37 మంది పై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయట. అందులో 12 మంది మీద ఘోరమైన కేసులు ఉన్నాయట.

అసోషియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫార్మస్ (ASSOCIATION OF DEMOCRATIC REFORMS) మరియూ నేషనల్ ఎలెక్షన్ వాచ్ (NATIONAL ELECTION WATCH) అనే ఒక 1200 మంది కలిగిన ఎన్.జీ.ఓ ల సంస్తలు జరిపిన ఒక సర్వేలో తెలియవచ్హింది.
కాంగ్రెస్ పార్టీకు చెందిన వారు 7 గురు, బి.జె.పీ కి చెందిన వారు 6 గురు, సమాజ్‌వాదీ పార్టీకి చెందినవారు 3 గురు ఉన్నారని ఆ రిపోర్ట్ లో ఉన్నదట.

ఏ.డీ.ఆర్(ADR) మరియూ ఎన్.ఈ.డబుల్యూ (NEW) జరిపిన సర్వేలో క్రిమినల్ కేసులే కాకుండా ఎవెరెవరికి ఎంత ఆస్తి ఉన్నదో తెలుసుకున్నారట. మొత్తమున్న 217 మందిలో 98 మంది మిల్లియనర్స్ ట...ఇందులో 68 శాతం కాంగ్రెస్ వారూ, 53 శాతం బి.జె.పీ వారు అని తెలిసింది.

ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ అద్యఖ్చురాలు సోనియా గాంధీ మరియూ భారత ప్రధాణి మన్మోహన్ సింగ్ గారు క్రిమినల్ రెకార్డులున్న వారిని రాజకీయాలలోకి రానివ్వకూడదని గట్టిగా మాట్లాడిన విషయం మీకందరికీ తెలిసిందే. రాజ్య శభకు ఎన్నుకునే వారిని ప్రజలు నేరుగా ఎన్నుకోవటంలేదు. రాజ్య శభకు పార్టీల వారిగా పార్లమెంటులోని రాష్ట్ర అసెంబ్లీ శభ్యులు తమకు కావలసిన వారిని నామినేట్ చేస్తున్నారు. అలాంటప్పుడు రాజ్య శభకు ఎన్నుకునే వారినైనా క్రిమినల్ రెకార్డులు లేనివారిని ఎన్నుకోవచ్హు కదా? అప్పోషిషన్ పార్టీ అయిన బి.జె.పీ కూడా అలాగే చేస్తొంది. కాబట్టి, రాజకీయాలు అని వస్తే అందరూ ఒకటే అని నిరూపన అవుతున్నది.

ఏ రోజైతే పార్టీ వారు పార్లమెంట్ ఎన్నికలప్పుడూ మరియూ రాజ్య శభ ఎన్నికలలొ క్రిమినల్ రెకార్డ్ ఉన్నవారిని రాకుండా (ఎన్నికలో నిలబెట్టకుండా) చేస్తారో, అప్పుడే వారు మన దేశానికి న్యాయం చేకూర్చిన వారౌతారు.

Wednesday, April 7, 2010

డి.ఎన్.ఏ (DNA) టెస్ట్ కు భయపడే సోహిబ్ డైవర్స్ పెపర్లలో సంతకాలు పెట్టేడా?

సానియా మిర్జా ఇప్పుడు సోహిబ్ కు రెండవ భార్య అనేది అందరికీ తెలిసిపోయింది. ఇలా అందరూ అనకూడదనే కాబోలు తనకు అసలు పెళ్లే కాలేదని మొదట, తరువాత తనకు పెళ్ళి అయిందని, కానీ ఈ ఆయిషాతో కాదని, ఆ తరువాత డైవర్స్ పేపర్లలో సంతకాలు పెట్టి ఈ అయిషానే తన మొదటి భార్య అని బహిరంగంగా చెప్పకుండా చెప్పడం, సోహిబ్-సానియాలు ఏ విషయాన్ని దాచాలనుకున్నారో ఆ విషయాన్ని దాచలేకపోయేరు.

ముస్లీం మత కలాచారం ప్రకారం డైవర్స్ పేపర్ల మీద సంతకాలు పెట్టి చాలా పెద్ద గొడవ నుండి సోహిబ్ తప్పించుకున్నాడు. ఇదే గనక చేసుండకపోతే అతను పోలీసులచే ఖైదు చేయబడి ఉండేవాడు. సానియాతో పెళ్ళి వాయుదా పడేది. సానియా మానసిక క్చోభకు గురి అయ్యేది. అన్నిటికంటే ముఖ్యమైనది మనదేశానికి, పాకిస్తానుకు మధ్య అనవసరమైన చర్చలు వచ్హేవి. వీటన్నింటినీ ఒక సంతకంతో తప్పించేడనే చెప్పాలి.

మొదట తనకు అసలు పెళ్ళే జరలేదని చెప్పిన సోహిబ్, తరువాత పెళ్ళి జరిగిందని ఒప్పుకున్నా ఆ పెళ్ళి ఈ ఆయీషాతో కాదని మొండికెత్తి, ఆ మాటమీదే గట్టిగా నిలబడ్డ సోహిబ్ ఎందుకు డైవర్స్ పేపర్లలో సంతకాలు పెట్టేడు అని అందరికీ ఆశ్చర్యం గా ఉన్నది. దీనిమీద ఎన్నో వదంతులు వస్తున్నాయి. అయితే, పేరుతెలుపని ఒక వ్యక్తి (వీరి డైవర్స్ విషయాలలో పాత్రవహించిన ఒక వ్యక్తి) "దీనికి చాలా ముఖ్యమైన కారణం ఉంది. అదేమిటంటే, పోలీసులు ఈ ఆయిషానే అతని భార్య అని నిరూపించటానికి డి.ఎన్.ఏ టెస్ట్ తీయవలసి వస్తుందని సోహిబ్ కి చెప్పేరు" అని తెలిపేరు. డి.ఎన్.ఏ టెస్ట్ తీస్తే అతని బండారం ఎలాగూ బయట పడుతుందని,అది ఇంకా గొడవలని పెంచుతుందని భయపడి డైవర్స్ పేపర్లలొ సంతకాలు పెట్టేడని చెబుతున్నారు.

నా వరకు నాకు ఇది నిజమేననిపిస్తోంది. డైవర్స్ పేపర్ల మీద సంతకాలు పెట్టటానికి ఇంతకంటే పెద్ద బెదిరింపు అవసరంలేదు.

సోహిబ్ డైవర్స్ ని ఒప్పుకున్న ఆయీషాకు ప్రశంసలు చెప్పాలి. తనను ఇదివరకే పెళ్ళిచేసుకున్నాడని సోహిబ్ ఒప్పుకోవాలనే ఆమె ఒత్తిడి చేసింది. ప్రపంచం అంతటికీ తను సోహిబ్ మొదటి భార్య గా తెలపటానికే అమె పట్టుబట్టింది కాని సోహిబ్-సానియా ల పెళ్ళిని ఆపటానికి కాదని తెలుస్తోంది. ఇష్టం లేని వానితో బలవంతంగా కాపురం చేయడం మనశ్శాంతి నివ్వదు. తన మాజీ భర్తైనా సానియాతో మనశ్శాంతిగా ఉండనీ అనుకుని ఈ విషయానీ అక్కడితో వదిలేసినందుకు జోహార్లు.

క్రికెట్లో మాచ్ ఫిక్సింగ్ చేసేడన్న ఆరోపణతో పాకిస్తాన్ ప్రబుత్వంచే ఒక సంవత్సరం బాన్ చేయబడ్డ సోహిబ్, సానియాతో పెళ్ళి ఫిక్సింగ్ లో నైనా నీతిగా ఉంటాడని భావిస్తూ, ఇక వీరువరూ మీడియాకు మేతగా ఉండకూడదని ఆశపడుతూ......తప్పుచేసినవారు ఎప్పుడూ తప్పించుకోలేరనే ౠజువు మరోసారి బయటపడినందుకు సంతొషిస్తున్నాను.

అన్యులు (ALIENS) మన భూమి మీదకు వచ్హి జంతువులను వేటాడుతున్నారు.....నిపుణులుఅనుమానాస్పధమైన రీతిలో కనబడకుండా పొతున్న జంతువులూ, చనిపోతున్న జంతువులనీ అన్యగ్రహానికి చెందిన వారు హానికరమైన, శక్తివంతమైన కిరణాలతోనూ, ఆధునిక పరికరాలతోనూ వేటాడి చంపటం, పట్టుకుపొవటం జరుగుతున్నదని లండన్‌లోని రైతులు అధికారులకు చెప్పిన విషయం పైన విచారణ మోదలుపెట్టేరట.

“మేము నిద్రపోయి లేచేసరికి మా పొలాలలో మా జంతువులు కొన్ని కనబడకపోవటం, కొన్ని దారుణంగా చంపబడి ఉండటం చూసేము. కొన్ని చంపబడ్డ జంతువులు చనిపోయివున్న విధం చూస్తే వాటిని ఏదో పరిశొధనా నిమిత్తం చంపినట్లుగా ఉన్నది” అని చెప్పేరు.

ఇలా జంతువులు చంపబడి ఉండటం అంటే వాటి బుఱ్ఱ్ లను తీసేసి ఉండటం, కళ్ళు పీకేసి ఉండటం మేము ఆకాసంలో ఆరెంజ్ కలర్ లో మర్మమైన కొన్ని లైట్లను చూసిన వెంటనే జరుగుతోందని అన్యులనూ, అన్యులు వస్తున్న వాహనాలను పరిశీలిస్తున్నవారు చెబుతున్నారు.

"కొంతసేపు అది స్టార్ వార్స్ యుద్దంలగా కనబడుతోంది" అన్య గ్రహ వాహనాల రాకను పరిశీలిస్తున్న 53 ఏళ్ల ఫిల్ హైలో చెప్పేరు. వెంటనే అక్కడకు వెళ్ళి అక్కడున్న రైతులను అడిగితే "ఏమిజరిగిందో తెలియటంలేదు...కానీ కోన్ని జంతువులు కనబడక పోవడం, కొన్ని చనిపోయి ఉండటం జరుగుతోంది అని చెబుతున్నారు" అని ఆయన తెలిపేరు.

"ఇది ఖచితంగా అన్యులు చేసిన పనులే...వారు ఇంకొక ప్రపంచం నుండి వస్తున్నారు.జంతువులు పరిశోధనలకు ముఖ్యమైనవి. ఆధునికమైన టెక్నాలజీతో వాటిని చంపి వారికి కావలసిన వాటిని తీసుకువెడుతున్నారు" అని అయన తెలిపినట్లు ది సన్.కొ.యూకే ( thesun.co.uk) తెలియపరచింది.....అనిమల్ పాతాలజీ ఫీల్డ్ యూనిట్ అధినేత అయిన ఫిల్, రాడినార్ అడవులలో ఉన్న వెల్స్ హిల్ల్ అనే వ్యవసాయ భూమికి వస్తున్న అన్య గ్రహాల గురించి పరిశోధన చేస్తున్నారు. వారు వాడుతున్న ఆయుధాలూ, ఆయుధాలనుండి వస్తున్న కిరణాలు మన ప్రపంచములో వాడే టెక్నాలజీ కాదు. స్యూస్బెరీ మరియూ పొవేస్ ప్రదేశాలలో 50 మైళ్ళ వరకు వచ్హి తిరిగి వెడుతున్న ఈ అన్యగ్రహాలు గ్లౌసెస్టైర్ లో ఉన్న డీన్ అడవులలో వారి వేటను కొనసాగిసున్నారని ఆయన అన్నారు.

సానియా మిర్జా, సొహిబ్ మాలిక్ ల వివాహం ఇదివరకే జరిగిపోయంది?

సానియా మిర్జా, సోహిబ్ మాలిక్ లు ఎవరికీ తెలియకుండా వారి చుట్టాలను మాత్రం పిలుచుకుని ఒక ప్రైవేట్ ఫన్ క్చన్ గా దుబాయ్ లో పెళ్ళిచేసుకున్నారా?

వీరిద్దరికీ ఇదివరకే వివాహం జరిగిపోయిందని, అందుకనే సోహిబ్ మాలిక్ ధైర్యముగా హైదరాబాద్ లోని సానియా మిర్జా వాల్లింటికి వచ్హి వెడుతున్నాడని చాలామంది చెబుతున్నారు. హైదరబాద్ లోని తాజ్ క్రిష్ణా హోటల్ని రిషెప్షన్ కు మాత్రమే బుక్ చేసుకున్నారని, పెళ్ళికి కాదని, ఈ విషయమే సానియాకు, సోహిబ్ కు ఇదివరకే పెళ్ళి జరిగిందని అందరిలో అనుమానాన్ని తెప్పిస్తోందని, సోహిబ్ రిసెప్షన్ కోసమే హైదరాబద్ వచ్హేడని అందరూ నమ్ముతున్నారట. దీనికి తగినట్లే వారి పెళ్ళి కార్డ్ లో రిసెప్షన్ గురించే వ్రాసేరు గాని పెళ్ళి గురించి ఏమీ రాయలేదు.

అంతులేని వీల్ల ప్రేమ మరియూ మోసాల గురించి వీరి వివాహం వాయిదా పడుతుందని అనుకునే సమయములో ఈ విషయం రావటం వీరి పెళ్ళి కధకు ఒక మెలిక అనే చెప్పాలి.

హైదరాబద్ లో వీరి మతానికి చెందిన వారు, వీల్లిద్దరికీ ఇదివరకే పెళ్ళి జరిగింది కాబట్టే సొహిబ్ పెళ్ళికి ముందే సానియా వాళ్ళింట్లో ఉంటున్నాడని, సోహిబ్ కు ఇది వరకే పెళ్ళి జరింగిదని చెబుతున్న విషయములో సానియా పూర్తి మద్దత్తు ఇస్తోందని చెబుతున్నారు.

సానియా కుటుంబీకులకూ మరియూ సోహిబ్ కుటుంబీకులకూ సానియా, సోహిబ్ ల ప్రేమ మరియూ వివాహం గురించిన విషయం చెప్పిన వెంటనే గొడవ జరుగుతుందని ముందే తెలుసు. ఎందుకంటే పాకిస్తాన్ కు చెందినతను ఇదివరకే ఒక హైదరాబద్ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడనే విషయం బయటపడితే, వీరి వివాహం ఆగిపోవచ్హునని ముందే ఊహించి సానియా, సోహిబ్ల పెళ్ళి ఎవరికీ తెలియకుండా జరిపేసి, ఆ తరువాత ఈ విషయాన్ని బయటపెదదామని నిర్ణయించుకున్నారని ఆ రెండు కుటుంబాలకూ దగ్గరైన ఒక వ్యక్తి తెలియపరిచేరట.

వారు అనుకన్నట్లే రెండేళ్ల క్రితం సోహిబ్ పెళ్ళి చేసుకున్న ఆయీషా కుటుంబీకులు సోహిబ్ పై ఫిర్యాదు చేసేరు. వీరు కూడా సానియాకూ సోహిబ్కూ ఇది వరకే పెళ్ళి జరిగిందా అనే విషయాన్ని వాకబు చేస్తున్నారు.

ఈలోపు కలకత్తాలో ఉన్న టిప్పుసుల్తాన్ మసీదుకు చెందిన ఇమాం సోహిబ్ ఆయిషాను మోసం చేసేడని అతని మీద ఫట్వా జారీ చేసేరు. పత్రికలవారితో మాట్లాడుతూ సోహిబ్ మాలిక్ ను అటు పాకిస్తాన్‌లోనూ ఇటు భారతదేశంలోనూ బహిస్కరించాలని అడిగేరు. నికాహామా ఒక ౠజువే. నికాహామ పెళ్ళి జరిగితేనే ఇస్తారు. ఆయీషా నికహామా చూపించింది అంటే వారిరువురికీ పెళ్ళి జరిగినట్లే. సోహిబ్ ఆయిషాను మోసం చేయకుండా ఆమెను తన మోదటి భార్యగా ఒప్పుకుంటూ సానియా మిర్జాను రెండవ భార్యగా చేసుకోవచ్హు. కానీ సోహిబ్ అనవసరమైన ప్రకటనలు ఇస్తున్నాడు. మొదట తనకు ఆయిషాతో పెళ్ళి జరగలేదని చెప్పేడు. తరువాత పెళ్ళి జరిగిందని ఒప్పుకున్నాడు. కానీ ఆయిషాను కలువలేదంటున్నాడు.ఫోన్ లో పెళ్ళి జరిగిందని చెబుతున్నాడు. కాబట్టి సోహిబ్ అందరి దగ్గరా క్చమాపణ అడగాలి అని ఆయన అన్నారు.

ఏది ఏమైనా ప్రేమ గుడ్డిదని మరోసారి ౠజువు చేసింది సానియా మిర్జా.

Tuesday, April 6, 2010

మీరు పీలుస్తున్న గాలి ఎంత కాలుష్యమైనదో తెలుసుకోండి-----PART-2

మనం పీలుస్తున్న గాలిలో ఉన్న కాలుష్యు రసాయనాలు.

లెడ్ (Lead):...ఈ వాయువును ఎక్కువుగా పీలుస్తే నరాలు భాదించబడతాయ్. జీర్ణకోసం సరిగ్గా పనిచేయదు. కాన్సర్ వ్యాధి వచ్హే అవకాసాలను ఎక్కువ చేస్తుంది. ఇది చిన్న పిల్లలకు చాలా హాని చేస్తుంది.

ఓజోన్ (Ozone):...ఈ రసాయణం వలన కళ్ళు దురద పుట్టటం, కల్లు మంటలు పుట్టటం, నీళ్ళు కారడం జరుగుతుంది. ఇది ఊపిరితిత్తుల వ్యాధులలో ఒకటైన ఆస్త్మాని ఎక్కువ చేస్తుంది.

ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ( Oxides of Nitrogen):...దీని వలన చిన్న పిల్లలకు ఊపిరితిత్తుల వ్యాధులు కలుగుతాయ్.

కార్బన్ మోనాక్సైడ్ (Carbon Monoxide):...ఇది మన రక్తంలో కలిసి, ఉపిరితిత్తుల నుండి వస్తున్న ప్రాణ వాయువును అడ్డుకుని, ప్రాణ వాయువుని రక్తంలో కలవడాన్ని తగ్గిస్తుంది. ఇది మన బుఱ్ఱ మరియూ గుండె చేసే పనితనాన్ని తగ్గుస్తుంది. గర్బిణీ స్త్రీ ల కడుపులో పెరుగుతున్న బిడ్డ పెరుగుదలని అడ్డుకుంటుంది.

సల్ఫర్ డైయాక్సైడ్ (Sulphur Dioxide):...ఇది గాలిలో ఉన్న తడితో కలిసి సల్ఫూరిక్ ఆసిడ్ ను మనలో జేరుస్తుంది. దీనివలన చిన్న పిల్లలకు ఆయాసం మరియూ ఊపిరి పీల్చుకోవడంలో కష్టం కలిగిస్తుంది.

సస్పెండడ్ పర్టికులేట్ మాటర్ (Suspended Particulate Mater---SPM):...ఇది ప్రమంచములోని చాలామందిని అనారొగ్యానికి గురిచేసింది, గురిచేస్తోంది. దీనివలన ఊపిరితిత్తుల కాన్సర్, గుండె వ్యాధులూ కలుగుతాయ్. ఈ వాయువు మన శరీరంలో అక్కడక్కడ పేరుకు పోతుంది. అప్పుడు అక్కడ వ్యాధి మోదలౌతుంది.

గాలిలో ఉన్న ఈ రసాయనాలు ఎంత ప్రమాదకరమైనవో తెలుస్తోంది కదా. గాలిలో ఉన్న ఈ కాలుష్యాన్ని తగ్గించటానికి తీసుకోవలసిన చర్యలను ప్రబుత్వాలు పట్టించుకోవటం లేదు. డబ్ల్యూ.హ్చ్.ఓ వారిచ్హిన పరిధి తీసుకుంటే మన దేసంలోని గాలి చాలా ప్రమాదకరమైనది.......ప్రబుత్వం పట్టించుకున్నా మనం మన ఆరొగ్యాన్ని పట్టించుకోవాలి. ముక్కుకు ఒక గుడ్డ కట్టుకుంటే అది మనకి ఎంతో మేలు చేస్తుంది.

మీరు పీలుస్తున్న గాలి ఎంత కాలుష్యమైనదో తెలుసుకోండి-----PART-1

మనం ప్రతిరోజూ పీలుస్తున్న గాలి చాలా కాలుష్యమైనది. గ్రామాలలో కంటే నగరాలలో ఎక్కువ కాలుష్యంగా ఉన్నది. మరోవిదముగా చెప్పాలంటే మనం పీల్చే గాలి ఒక స్లో పాయిజన్ అని చెప్పాలి. ప్రబుత్వానికి తెలిసున్నా ఈ గాలి లోని కాలుష్యాన్ని తగ్గించటానికి కఠిన చర్యలు తీసుకోవటంలేదు. డబ్ల్యూ.హ్చ్ ఓ ఎంత మొత్తుకుంటున్న చెవిన వేసుకోవటంలేదు.

ఈ గాలిని పీల్చడం వలన ఊపిరితిత్తుల వ్యాధులూ,గుండె జబ్బులూ, గర్భిణీ స్త్రీలకూ మరియూ వారి కడుపులో పెరుగుతున్న బీడ్డకూ అంగవైకల్యమైన వ్యాధులూ మరియూ కాన్సర్ వ్యాధీ లాంటివి కలుగుతున్నాయట. ఇప్పుడు గాలి ఎక్కువ కాలుష్యముతో ఉన్నందువలన వ్యాధిగ్రశ్తుల సంఖ్య ఎక్కువ అవుతున్నదని డబ్ల్యూ. హ్చ్.ఓ ఆందోళన వ్యక్త పరచింది.

సస్పెండడ్ పార్టికులేట్ మాటర్ (SPM) మరియూ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రొజెన్ ల కలయిక గాలిలో ఎక్కువ అవుతున్నందువలన, ఎక్కువమంది జబ్బులకు గురౌతున్నారట. సస్పెండడ్ పార్టికులేట్ మాటర్ అనే కలుషితం దుమ్ము, దూళీ, పొగ మరియూ తడి కలసిన ఒక మిస్రమం. ఇవన్నీ చేరడం వలన లెడ్, నికెల్, ఆర్సనిక్ మరియూ డీసెల్ పొగ వలన వచ్హే వాయువులు ఎక్కువగా ఉంటున్నాయట. ఇవి ఎక్కువ రక జబ్బులు ముఖ్యముగా అలెర్జీ జబ్బు రావాటానికి కారణముగ ఉంటొందట.

ఈ గాలి పీల్చడం వలన ఈ గాలిలోనీ కలుషిత పదార్ధాలు ఊపిరితిత్తులలోకి వెళ్ళి, అక్కడ పేరుకు పోయి ఆస్త్మా మరియూ ఊపిరితిత్తుల వ్యాధులను కలిగిస్తాయట..30 సంవత్సరాల క్రితం ఊపిరితిత్తుల వ్యాధులతో బాధ పడి డాక్టర్లను సప్రదించిన వారి సంఖ్య ఇప్పుడు అనేక రెట్లుగా పెరిగిపోయిందట..ఈ కాలుష్యం వలన అనారోగానికి గురైనవారు ఈ కాలుష్యమైన గాలి పీల్చటం వలనే తమకు జబ్బు వచ్హిందని కంప్లైంట్ చేయలేరట. స్కూల్ పిల్లలు, రోడ్డు మీద బ్రతికేవారూ, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మరియూ డ్రైవర్లు ఎక్కువగా బాధపడుతున్నారట. అయితే వీరెవరికీ కూడా వీరి అనారొగ్యానికి కారణం ఈ కలుషితమైన గాలే కారణమని తెలియదట.

ప్రబుత్వం ఈ కాలుష్యాన్ని తగ్గించటానికి తీవ్ర చర్యలు చేపట్టాలి. కాలుష్యమైన గాలి పీల్చకుండా ఉండేందుకు ముక్కుకు కట్టుకునే ఫిల్టర్ లు ఉచితంగా ఇవ్వాలి. వీటన్నింటికీ చాలా డబ్బు ఖర్చౌతుంది. ఆ డబ్బును గాలిని కలుషితం చేసేవారి దగ్గర నుండి వసూలు చేయాలి. ప్రతి వాహనానికీ కలుషిత పరిధులు పెట్టేరు. కానీ వాటిని ఆచరనలో పెట్టటంలేదు. ఆచరనలో పెడితే ఖచ్హితంగా చాలా మార్పు తీసుకురావచ్హు. ప్రబుత్వ వాహనాలు కూడా కాలుష్యానికి ఒక ముఖ్య కారణం. అటువంటి వాహనాలను ఉపయోగించరాదు.

ప్రబుత్వం చేసేంతవరకు ఆగకుండా మనమే మన ఆరొగ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి, కనీసం బయటకు వెళ్ళేటప్పుడైనా ముక్కుకు ఫిల్టర్లు వేసుకోవాలి. కష్టమైన పనే కాని మన అనారోగ్యానికి పెడుతున్న ఖర్చు తలచుకుంటే ఇది చాలా సులువైన పనిగా కనపడుతుంది.

ఇప్పుడు మనం పీలుస్తున్న గాలిలో ఏ ఏ కాలుష్య పదార్ధాలు ఉన్నాయో ......వాటివలన మనకి ఎటువంటి రకమైన అనారొగ్యం కలుగుతుందో అన్న విషయాన్ని పార్ట్-2 లో చదవండి.

Sunday, April 4, 2010

మీకు ఉద్యోగ అవకాశాలు కావలనుకుంటే ఓపెన్ యూనివర్ సిటీ లలో చదవకండి.....మంత్రి

ఉద్యోగ అవకాశాలు కావాలా? ఐతే తమిళనాడు ఓపెన్ యూనివర్ సిటీ (TNOU) లో చదవకండి. ఎందుకంటే అక్కడ చదివిన వారికి ఉద్యొగవకాశాలు రావు.

తమిళనాడు పెద్ద చదువుల శాఖా మంత్రి కె.పొన్ముడి గారు బుధవారం నాడు ఇలా చెప్పేరు. "తమిళనాడు ఓపెన్ యూనివర్ సిటీ కోర్స్ లు నాలెడ్జ్ కోసరమే. విధ్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే రెగులర్ లేక కరెస్ పాండెన్స్ కోర్స్ లు చేయాలి".

ఒక దిన పత్రికలో తమిళనాడు ఓపెన్ యూనివెర్ సిటీలో చదివి అండర్ గ్రాడ్యువేట్ మరియూ పోస్ట్ గ్రాడ్యూవేట్ డిగ్రీలు పోందిన వేలది విధ్యార్ధులు ఉద్యోగాలు దొరకక కష్టపడుతున్నారు. 10త్ మరియూ 12త్ చదవకుండా లేక పాసవకుండానే TNOU లో జేరి పట్టబద్రులైన (కొన్ని డిగ్రీలకూ మరియూ డిప్లమో కోర్స్ లకూ ట్ణోఊ లో 10త్ గానీ 12త్ గానీ పాసై ఉండక్కర్లేదు) అర్హత కలిగిన ఆ డిగ్రీలు పుచ్హుకుని ఉద్యోగాలకు వెడితే ఆ విధ్యార్ధులను కంపనీ వారు తిరస్కరిస్తున్నారని తెలిపింది......ఇదే విషయము మీద, దీని గురించి మంత్రిగారిని ఒక పత్రికా విలేఖరి "సరైన డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్నప్పుడు ఎందుకు వారికి ఉద్యోగాలు దొరకటం లేదు" అని అడిగితే ఆయన పై విధముగా సమాధానం ఇచ్హేరు.

అయితే, TNOU ప్రకటనలలొ “ EVELOVE FLEXIBLE AND ROBUST CURRICULA TO CREATE ENTERPRENEURIAL SKILL SETS AND REACH THE RURAL COMMUNITIES THROUGH LIFELONG LEARNING PROGRAMMES FOR LIVELYHOOD IMPROVEMENT” రాసుంది.

రెగులర్లో చదువుకోవటానికి అవకాశం లేని వారు పై చదువులు చదువుకోవటానికి ఉపయోగపడాలనే TNOU ని పెట్టేరు. మరిప్పుడు ఒక మంత్రి, అందులోనూ పై చదువుల శాఖా మంత్రి అక్కడ చదివితే ఉద్యోగాలు దొరకవని చెప్పడం ప్రబుత్వ ప్రకటనకు వ్యతిరేకంగా ఉంది. ....ప్రబుత్వమే ఇలా ఆశలు కలిపించే ప్రకటనలు చేసి విధ్యార్ధులను తప్పుదోవ పట్టిస్తుంటే, ఇక ప్రైవేటు విధ్యా సంస్తలు ఎలాంటి ప్రకటనలు ఇస్తారో ఊహించుకోవచ్హు.

నా సందేహమల్లా ఒక్కటే. ఇది ఈ ఒక్క తమిళనాడు ఓపెన్ యూనివెర్ సిటీ లోనేనా? లేక దేశంలో ఉన్న ఏ ఓపెన్ యూనివర్ సిటీలో చదువుకున్న అంతేనా?

"సేఫ్" సిగిరెట్టు తయారుచేయడానికి 23 మిల్లియన్ల పౌండ్లు (సుమారు 1600 మిల్లియన్ రూపాయలు)ఖర్చు పెడతారట!

లండన్ కు చెందిన ఒక అతి పెద్ద పొగాకు కంపనీ ఆరొగ్యానికి హానికలిగించని "సేఫ్" సిగిరెట్టును తయారుచేయడానికి పూనుకుంది. దీనికోసం ఆ కంపనీ శాస్త్రవేత్తలు అడిగిన 23 మిల్లియన్ పౌండ్ల డబ్బును ఇవ్వటానికి అంగీకరించింది.

సిగిరెట్లలో ఆరొగ్యానికి హానికలిగించే (ముఖ్యముగా కాన్సర్ వ్యాది) 4000 రకాల రసాయనాలు ఉన్నాయని, వీటిని పొగాకు లో నుండి తొలగించాలంటే కనీసం 23 మిల్లియన్ పౌండ్లు ఖర్చౌతుందని తెలిపేరు. ఈ ఖర్చుని తాము బరిస్తామని లండన్ లోని ఒక పెద్ద పొగాకు కంపనీ ముందుకు వచ్హింది....ఆ శాస్త్రవేత్తలు ఆరొగ్యానికి హానికలిగించని 40 రకాల సిగిరెట్లను తయారు చేసి ఉంచటమే కాకుండా, సిగిరెట్లలో ఉన్న పొగాకు వాసనను మరియూ కోత్తరకమైన ఫిల్టర్లనూ కూడా మార్చటంలో పనిచేస్తున్నారట. ఈ శాస్త్రవేత్తలు బ్రిటీష్ అమెరికన్ టొబకో సంఘానికి చెందిన వారని, వీరు తెలిపిన ఈ విషయాలను 'డైలీ ఎక్స్ ప్రెస్ ' దిన పత్రిక తెలిపింది .

"ఇది సిగిరెట్ట్లు త్రాగేవారి సంఖ్య ను పెంచుతుంది" అంటూ సిగిరెట్లను (పొగ త్రాగడాన్ని నిషేధించమనే సంఘాలు) వ్యతిరేకించే సంఘాలు ఈ సిగిరెట్టును తయారుచేయకూడదని పోరాడుతున్నారట.

వీరి పోరాటానికి నేను పూర్తి మద్దత్తు ఇస్తున్నాను. పొగ త్రాగటాన్ని ప్రతిదేశమూ నిషేదిస్తూ చట్టాలు రూపొందిస్తూ ఆచరనలో పెడుతుంటే వీరు ఇలా సిగిరెట్లు తయారు చేడం ఎంతమాత్రం సరికాదు. ఆరొగ్యానికి హానికలిగించదుకదా అని పొగ త్రాగడం మొదలెడతారు. అంతేకాకుండా పొగ త్రాగడన్ని నిషేదిద్దాం అనే ప్రయత్నానికి ఇది ఒక అడ్డుకట్టగా నిలుస్తుంది.

ఎన్ని కట్టుదిట్టాలు, చట్టాలు, ప్రయత్నాలు చేసినా పొగ త్రాగాలనుకునే వారు త్రాగుతునే ఉన్నారు. అటువంటి వారిని పోగ త్రాగడం వలన ఏర్పడే హానికరమైన వ్యాధుల నుండి కాపాడాలనే మా ఈ ప్రయత్నం అంటున్నారు ఈ పొగాకు కంపెనీ వారు.

Saturday, April 3, 2010

కంచు చెంబు ఖరీదు కోటి రూపాయలు!!!

ఈ కంచు చెంబు ఒక అక్చయపాత్ర..."ఈ పాత్రను మీ దగ్గర ఉంచుకుంటే ఎప్పుడూ ఆహారానికి కరువు ఉండదు...అంతే కాకుండా ఈ పాత్ర మీ దగ్గరున్నందు వలన మీరు కోటీశ్వరులౌతారు, మీరు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. అంత విషేషమైన ఈ చెంబు ఖరీదు కోటి రూపాయలు మాత్రమే" అని చెబితే మనం కొనుక్కుంటామా? ఆలోచిస్తాము....కోటి రూపాయలు మన దగ్గర ఉంటే మనం ఆల్ రెడీ కోటీశ్వరలమే……...ఐనా, అలాంటి మ్యాజిక్ పాత్రను వారిదగ్గరే ఉంచుకోకుండా ఎందువలన అమ్ముతున్నారు అన్న సందేహం మనకి వస్తుంది కదా?

రమేష్ అనే ఒకతను ఈ అక్షయ పాత్రను కొనుక్కుంటానని చెప్పి, ఆ చెంబును అమ్ముతానన్న దేవీ అనే ఒక ఆవిడకు రూ.22 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్హేడు. మిగతా డబ్బుని కొన్ని రోజులలో ఇచ్హి ఆ చెంబు తీసుకుంటానన్నడట. రమేష్ కి ఆ చెంబును ఒక సారి చూడాలనిపించి అదే మాటను దేవీ తో చెప్పేడు. ఆమె సరే నని చెప్పి అమె సహచరుడైన గోపాలక్రిష్ణను తీసుకుని, రమేష్ ని కూడా తీసుకుని HDFC బ్యాంక్ లాకర్ లో ఉన్న ఆ చెంబు ను రమేష్ కు చూపించి మిగిలిన 78 లక్షలు ఇచ్హిన వెంటనే చెంబు ఇస్తానని రమేష్ తో చెప్పింది.

బ్యాలన్స్ డబ్బును రెడీచేసిన రమేష్ దేవీని కలుద్దామని వెల్లేడు. కానీ ఆమె కనిపించలేదు. కంగారు పడ్డ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేసేడు.
రెండు రోజుల వేట తరువాత దేవీని వేలూర్ జైలులో అరెస్టు చేసేరు. ఆమె సహచరుడైన గోపాలక్రిష్ణని కూడా అరెస్టు చేసేరు......పోలీసు విచారనలో తెలిసిందేమిటంటే ఈ దేవి అనే ఆమె తన తల్లి రేవతీతో కలసి ఇలాంటి ఇంకొక చెంబును బెంగలూరుకు చెందిన ఒక బిజినెస్ మాన్ కి రూ.50 లక్షలకు అమ్మిందట. మోసపోయేననుకున్న అతను పోలీసులకు ఫిర్యాదు చేస్తే దేవీనీ, ఆమె తల్లిని అరెస్టు చేసి వేలూర్ జైలులో ఉంచేరు.

అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అంత చిన్న చెంబును అంత ఖరీదు ఇచ్హి ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారు? కోంతమంది ఆ చెంబుకు ఏదో ఒక శక్తి ఉందని, ఆ చెంబు ఎప్పుడూ బియ్యంతో నిండి ఉంటుందని చెబుతున్నారు.

ఈ చెంబు ఒక పురాతన సౌందర్యమైనది. ఒక గుడి గోపుర కలశం. ఒక విషేషమైన రోజున పిడుగుపడి ఆ గోపుర కలశాలు పడిపోయినై. ఆ గోపుర కలశలే ఈ చెంబులు. అంతర్జాతీయ మార్కెట్టులో ఈ పురాతన కలశ చెంబుకు మంచి రేటు వస్తుంది. అందుకే ఆ చెంబులను అంత రేటు పెట్టి కొనుక్కుంటున్నారు అంతేకానీ మూఢ నమ్మకాలకు ఇంత డబ్బు పెట్టరు అని కోందరు చెబుతున్నారు.

ఇది విన్న పోలీసులు అన్ని కోణాలలోనూ విచారిస్తున్నరని, డబ్బులిచ్హి కోనుక్కున్నవారిని కూడా విచారిస్తున్నారని చెబుతున్నారు.

Friday, April 2, 2010

గుర్తు తెలియని వ్యక్తుల శవాలను అమ్ముకోవటం తప్పు కాదు.....రాజస్తాన్ ప్రబుత్వం

ప్రబుత్వ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తుల శవాలను అమ్ముకోవడం నేరం క్రింద రాదని, అది అనాదిగి జరుగుతున్న ఒక ప్రక్రియ అని రాజస్తాన్ ప్రబుత్వం చెబుతోంది.

వారి రాష్ట్రములో గాంధీ నగర్లో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తుల శవాలను అమ్ముతున్నారని ఒప్పుకున్నా, అది నేరం క్రింద రాదని అంటోంది.....రాజస్తాన్ హోం శాఖ మంత్రి శాంతి కుమార్ దారివాల్ మార్చ్ నెల 30 వ తారీఖున రాష్ట్ర శాశన శభలో మాట్లాడుతూ "ఈ విషయములో అవకతవకలు జరిగినైగాని" అని ఒప్పుకుంటూ, "అవి నేరాలు మాత్రం కాదు" అని తెలిపేరు.

రాజ్ కుమార్ సోనీ అనే ఒకాయన తన 19 సంవత్సరాల కొడుకు చనిపోతే, అతని శవాన్ని గాంధీనగర్ పోలీసులు అమ్మేసేరని ఫిర్యాదు ఇచ్హేడు.
రాష్ట్రంలోనే ఒక అతి పెద్ద గుంపు గుర్తుతెలియని వ్యక్తుల శవాలను అమ్ముకుని డబ్బుచేసుకుంటున్నారనే విషయాన్ని తన ఫిర్యాదు మూలంగా బయట పెట్టినందుకు రాజ్ కుమార్ సొనీని ప్రశ్నిస్తున్నారు అధికారులు.

పోలీసులూ మరియూ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ కలిసే ఈ పని చేస్తున్నారు కాబట్టి, నా ఫిర్యాదును సి.బి.ఐ. కి అందించాలని తన ఎఫ్.ఐ.ఆర్ లో అడిగేరు......"మే 25, 2009 న ఒక పార్కులో, గాయాలతో పడున్న నా బిడ్డను పోలీసులు ఆశుపత్రిలో జేర్చేరు. అతను మరుసటి రోజు చనిపోయేడు. చనిపోయిన మనిషి ఎవరో ఆరా తీసి, విషయాన్ని మాకు తెలుప వలసిన పోలీసులు ఇవన్ని చేయకుండా, చట్ట వ్యతిరేకంగా నా కొడుకు శవాన్ని అమ్మేసేరు" అని రాజ్ కుమార్ సోనీ వాపోయేరు.

శవాలని అమ్ముకు (పీక్కు ) తినడమంటే ఇదే కాబోలు.

సానియా మిర్జా ఇక భారతదేశం కోసం ఆడకూడదు.....బాల్ తాఖరీ

"ఎప్పుడైతే ఒక పాకిస్తాన్ దేశస్తుడిని పెళ్ళి చేసుకుంటుందో అప్పుడు సానియా మిర్జా కూడా పాకిస్తాన్ దేశస్తురాలౌతుంది. భర్త ఏ దేశస్తుడో భార్య కూడా ఆ దేశస్తురాలే అవుతుంది. అటువంటప్పుడు ఒక పాకిస్తానీ దేశీయురాలు ఎలా ఇంకోక దేశానికి ఆడుతుంది. అందులోనూ బద్ద శత్రు దేశమైన పాకిస్తాన్ కు చెంది మన దేశానికి ఆడడమా? అలా జరగకూడదు, ఆమే భారతదేశానికి ఆడకూడదు" అని తమ పార్టీ పత్రిక సామన లో రాసేరు.

"అంతే కాదు, ఆమె నిజమైన భారత దేశ పౌరురాలు కాదు. అమే హ్రుదయపూర్వకంగా భారతీయురాలైతే ఒక పాకిస్తాన్ కు చెందిన అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటుందా" అని రాస్తూ "ఆమె నిజంగా భారతదేశనికే ఆడాలనుకుంటే ఒక భారతీయుడిని పెళ్ళిచేసుకోవాలి" అన్నారు.

"టెన్నిస్ కోర్టులో గెలుపులవలన కాకుండా, ఆమె తన దుస్తులతోనూ, ఫ్యాషన్లతోనూ, అలంకరనలతోనూ మరియూ ఆమె ప్రేమ వ్యవహారాలతోనూ అందరినీ ఆకట్టుకుంది. ఆమె ఆడే ఆటకంటే అమెను చూడటం కోసమే ఎక్కువమంది ఇష్టపడుతున్నారు".

"సోహిబ్ కు ఇండియా ఆటల రంగంలోనే కాకుండా యుద్ద రంగంలో కూడా ఒక బద్ద శత్రువు. సొహిబ్ కు చాలా మంది స్త్రీలతో సంబంధముందని చెబుతున్నారు. ఎంతోమంది అమ్మాయలకు పెళ్ళి చేసుకుంటానని మాటిచ్హేడని చెబుతున్నారు"

"అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటంటే లతా మంగేష్కర్ లాంటి వారికే విసా ఇవ్వని పాకిస్తాన్ ప్రబుత్వం అప్పుడే సానియా కుటుంబీకులకు విసా ఎలా ఇచ్హింది" అని తమ పత్రికలో రాసేరు.

Thursday, April 1, 2010

33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ శభలో అమోదించబడుతుందా?

రాబోవు వేసవికాల లోక్ శభ సమావేశాల మోదటి రోజునే తాను చెపట్టి రాజ్య శభలో అంగీకార ముద్ర వేయించుకున్న "లోక్ శభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్" బిల్లును ప్రవేశపెట్టి ఎలాగైనా అమోదం పొందాలనీ సోనియా గాంధీ పట్టుదలతో ఉన్నారు.

బిల్లులో సవరణలకు ససెమిరా ఒప్పుకోని సొనియా గాంధీ, లోక్ శభలో ఈ బిల్లు తిరస్కరించబడుతుందనే సందేహంతో అఖిల పక్ష పార్టీలను ఏప్రిల్ 5 వ తారీఖున ఈ బిల్లు గురించి విరివిగా మాట్లాడటానికి మరియూ అందరినీ అంగీకరింపజేయటానికీ ఒక మీటుంగ్ ను ఏర్పాటు చేసేరు.
ఈ బిల్లు ఇప్పుడున్న విధంగానే ప్రవేశపెడితే ఖచితంగా తిరస్కరించబడుతుందని, అది ప్రభుత్వానికే ఆపద తీసుకువస్తుందని కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అందువలన ఈ బిల్లును ప్రవేశపెట్టే ముందు లోక్ శభ లోని అఖిల పక్చ నాయకులతో మాట్లాడి వారి అనుమతితో, సహకారంతో ఈ బిల్లు ను ఏప్రిల్ 15 వ తారీఖున ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.

అయితే ఇది చాలా కష్టమైన పని. శ్రీ ములాయం సింగ్ యాదవ్, శ్రీ లలూ ప్రసాద్ యాదవ్ మరియూ శ్రీ సారద్ యాదవ్ లు ఈ బిల్లును ఇప్పుడున్న విధముగా అంగీకరించమని ఖచ్హితంగా చెబుతున్నారు. ఈ 33 శాతంలో కొంత శాతం ముస్లీముల్కూ మరియూ వెనుకబడిన జాతి వారికీ వేరుగా కేటాయిస్తేనే ఆమోదిస్తామని చెబుతున్నారు.

మాయావతి గారు అప్పుడే, అంటే రాజ్య శభలో ప్రవేశపెట్టినప్పుడే అంగీకరించలేదు.

కాంగ్రెస్ కి పెద్ద తల నొప్పిగా ఉన్నది రైల్వే శాఖ మంత్రీ మరియూ త్రినాముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ గారిని ఒప్పించడమే. ఈమె యాదవ్ గ్రూప్ లాగా ఈ బిల్లును తిరస్కరిస్తోంది. 33 శాతమే కాకుండా దానికి పై కొంత శాతాన్ని ముస్లీములకు కేటాయించవలసిందిగా ఒత్తిడి చేస్తోంది. ఎందుకంటే, వెస్ట్-బెంగాల్ లో ముస్లీముల ఓట్లు ఎక్కువ. ఇంకొక్క సంవత్సరం తరువాత ఆమె తన జీవితంలోనే ముఖ్యమైన ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంది.

బి.జే.పీ ఈ బిల్లును రాజ్య శభలో అమోదించినా, లోక్ శభలోని తమ పార్టీ శభ్యులు ఈ బిల్లును ఇప్పుడున్న రీతిలో అంగీకరించమని చెబుతున్నారు. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే, ఈ బిల్లు మీద ఆమోదం తెలపటానికి లోక్ శభలో రెండంకెల వరకే (సుమారు 88 మందే) ఆమోదం దొరుకుతుంది.....కనుక ఈ బిల్లుకు పూర్తి ఆమోదం దొరకదని, మళ్ళీ ఈ బిల్లు వలన కొన్ని రోజులకు లోక్ శభ పనులు వాయుదా పడవచ్హునని అనుకుంటున్నారు.

అల్లం కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది

మీరుగనుక చాలా మందిలాగా అల్లం వాసనను ఇష్టపడి, ప్రేమిస్తూ దానిని మీ ఆహారంలోనో లేక మీరు త్రాగే "టీ" లోనో కలుపుకుంటుంటే మీరు మీకు తెలియకుండానే మీ ఆరొగ్యానికి ఎంతో మేలు చేసుకుంటున్నారు. అల్లం మన ఆరొగ్యానికి చాలా విధాలుగా సహాయపడుతుంది. కాబట్టి దానిని మనం ప్రతి దినమూ మనం తింటున్న ఆహారపదార్ధాలలో చేర్చుకోవాలి.


Image courtesy: Thinkstock


రక్తపోటును తగ్గిస్తుంది:………అల్లం మన శరీరంలోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తూ రక్తపోటును తగ్గిస్తుంది. "అల్లం మన శరీరంలోని కండరాలని మెతక చేసి రక్తనాలాలని కండరాల ఒత్తిడినుండి విడిపిస్తుంది" అని ముంబైకు చెందిన ఆహారపదార్ధల నిపుణులు దీపా గుజరాల్ చెబుతున్నారు. అలా చేయడం వలన హ్రుదయానికి సంభందించిన వ్యాధులు రాకుండా చెయగలుగుతుంది.

అరుగుదల:………అల్లం ప్రక్రుతి అందించిన, శరీరాన్ని శుభ్రపరిచే ఒక ఆహారపదార్ధం మరియూ అరుగుదలకు సహాయపడుతుంది. అల్లం మనం తినే ఆహారపదార్ధలను అరిగించే విధానంలో సహాయపడడమే కాకుండా, అరిగిన ఆహారపదార్ధాల సత్తును (ఎనెర్జీ) మన శరీరం ఉపయూగించుకోవటంలో తోడుగా ఉంటుంది. కండరాలని మెతక చేస్తుంది గనుక అరుగుదల చాలా సులువు అవుతుంది. అంతే కాకుండా అరుగుదల ప్రక్రియను ఒత్తిడులకు లోనవకుండా చేస్తుంది. పొత్తి కడుపు నొప్పితో పాటూ స్త్రీ లకు వచ్హే కడుపునొప్పులనుకూడా తగ్గిస్తుందని డిల్లీకి చెందిన ఆహారపదార్ధాల నిపుణులు అమితా టాండన్ తెలిపేరు.

వాపులను తగ్గిస్తుంది:………మనకేదైనా దెబ్బ తగిలినపుడు, ఆ దెబ్బ త్వరగా తగ్గడానికి ఉపయోగపడి వాపు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. అల్లంలో ఉన్నటువంటి రసం వాపును తగ్గించటానికీ, రక్త ప్రసవన బాగా జరగడానికి ఉపయోగపడుతుంది. దీని వలన వాపు తగ్గి, నొప్పికూడా తగ్గుతుంది. అంతే కాకుండా మన శరీరంలోపల ఏర్పడే పుండ్లను నయం చేస్తుందని అమితా టాండన్ గారు చెప్పేరు.

వికారాన్ని తగ్గిస్తుంది:……కోంతమందికి నిద్ర లేవగానే ఏర్పడే వికారం మరియూ ప్రయాణాలు చెసేటప్పుడు ఏర్పడే వికారాలను తగ్గించుకోవటం అతి కష్టంగా ఉంటుంది. దీనికి చాలామంది మందులు వాడుతారు. అలాంటివారు అల్లం ముక్కను నమిలితే వారికి ఏర్పడే వికారం తగ్గిపోతుంది . అరుగుదలలో పూర్తిగా సహాయపడి మనం తినే ఆహారాన్ని పూర్తిగా అరిగిస్తుంది కనుక వికారంగా ఉండటం జరగదని గుజరాల్ గారు తెలిపేరు.

అల్లం రసం ను వేడి నీటితో కలిపి రోజూ త్రాగితే అది మనకు ఆరొగ్యరీత్యా ఎంతో మేలు చేస్తుందట. ....ఇంత మేలుచేసే అల్లం ను మనమెందుకు ఒకసారి ఉపయోగించి చూడకూడదు? ఈ రోజు నుండి ఆల్లం ను తప్పని సరిగా మనం తినే ఆహారపదార్ధాలో చేర్చుకుందాం...ఆరొగ్యంగా ఉందాం.