Wednesday, March 31, 2010

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎందరో వ్యక్తులు భారతదేశానికి చెందినవారని మీకు తెలుసా?

కవులు, సినీ నటులు, సంగీత విద్వాన్ సులూ, క్రీడాకారులు లాంటివారే కాకుండా వేరే రంగాలకు చెందిన మరెందరో మన దేశానికి చెందినవారు కావడం మనం గర్వించదగిన విషయం. వారెవరెవరో తెలుసుకోవలనుందా...ఐతే ఈ క్రింది లింకును మీ బ్రౌజర్లో వేసి చూడండి.

http://lifestyle.in.msn.com/gallery.aspx?cp-documentid=3739982

Tuesday, March 30, 2010

2012 లో భరతదేశం ఎలక్ట్రానిక్ వేస్టులకు ఒక్ చెత్త కుండీ అవుతుంది

ఎంత చెత్త. గంట గంటకీ పెరిగిపోతోంది. సుమారు 40 శాతం ప్లాస్టిక్ మరియూ మునిసిపాలిటీలలో చెత్తలను ఏరటంలేదు. సగానిపైగా అంగ సంబందమైన చెత్తని పరిశుభ్రం చేయటంలేదు.....2012 లోపు ప్రపంచములోనే భారదేశం ఎలెక్ట్రానిక్ చెత్తతో నిండిపోతుంది. ఇంట్లో ఏరిపరేసే చెత్త మరియూ ప్లాస్టిక్ వస్తువుల చెత్తలను పరిశుభ్రం చేయడానికి కావలసిన టెక్నాలజీ మరియూ రీ సైకల్ పద్దతులు తెలిసున్నా, దీనిని వాడే సౌకర్య స్థలాలు మనదగ్గర లేవు.....110 సౌకర్య స్థలాలు ఉన్నా అది 50 శాతం చెత్తనే పరిశుభ్రం చేయగలదు అని మన వాతావర్ణ మంత్రిత్వ శాఖ వారు తెలుపుతున్నారు. ఇలా చెత్తలను పరిశుభ్రం చేయలేనివారి మీద చర్య తీసుకునే చట్టం తీసుకురావాలని వారు ప్రబుత్వాన్ని కోరుతున్నారు.

ఎందుకంటే ఈ పనికిరాని వాటిని తీసి పారేయకపోతే, అవి పేరుకు పోయి రాబోవుకాలంలో అది మన ఆరొగ్యాలకే ఒక పెద్దహానికరంగా ఉంటుంది....ప్రస్తుత మన దేశ పారిశ్రామక పురోగతిని పోలిస్తే పనికిరాని ఎలెక్ట్రానిక్ వస్తువులు ఒక పెద్ద సవాలుగా తయారౌతోంది. పనికిరాని ఎలెక్ట్రానిక్ వస్తువులంటే పాడైపోయిన లేక చెడిపోయిన సెల్ ఫోన్లు, రిఫ్రెజిరేటర్లు, ఏర్ కండిషన్ పరికరాలు, టెలివిషన్ సెట్లు, కంప్యూటర్లు అందులోనూ లాప్ టాప్‌లు లాంటివి.

2012 లోపు, భారతదేశమే సంవత్సరానికి 8,00,000 మిల్లియన్ టన్నుల ఈ-వేస్ట్ తో నిండిపోతుందట. ఈ ఈ-వేస్టుల మునకలో ప్రస్తుతం ముంబై నగరం మోదటి స్థానంలోనూ డిల్లి రెండవ స్థానంలోనూ ఉంటున్నాయి.మనదేశంలోనే తయారవుతున్న ఈ-వేస్టే కాకుండా అమెరికా మరియూ యూరప్ దేశాలనుండి తీసుకురాబడుతున్న ఈ-వేస్ట్ తో మనదేశం ఈ-వేస్టులకు ఒక పెద్ద చెత్త కుండీ అవుతోంది. బయటి దేశాలనుండి తీసుకురాబడుతున్న ఈ-వేస్ట్ ఎంతో అంచనావేయలేకపోతున్నారట, కారణం చట్ట వ్యతిరేకంగా తీసుకురాబడుతోంది కనుక.
2008 లో మన ప్రబుత్వం ఈ ఈ-వేస్ట్ ను తీవ్రమైన అనారోగ్య వస్తువుగా పేర్కోన్నది. అయినా పెద్ద నగరాలలో కూడా ఈ ఈ-వేస్ట్ ను సేకరించి పరిశుభ్రం చేయటంలేదు.....ఇకపోతే పరిశ్రమల వలన ఏర్పడుతున్న చెత్త చాలా ఆందోళన కలిగిస్తోంది. సంవత్సరానికి 6.2 మిల్లియన్ టన్నుల వేస్ట్ వస్తుంటే, అందులో 2.1 మిల్లియన్ టన్నులు పరిశుభ్రం చేయకుండా అలాగే ఉండిపోతున్నాయట. మొత్తం 36,000 అపాయకరమైన పరిశ్రమలను గుర్తించేరు. ఇందులో రసాయనాలు తయారు చేసే కంపెనీలూ మరియూ ప్లాస్టిక్ వస్తువులు తయారుచేసే కంపెనీలూ ఉన్నయి.....ఇలా ఈ ఈ-వేస్టులను పట్టించుకోకపోతే అది వాతావరనాన్ని పాడుచేసి ఆరొగ్యాలను పాడుచేస్తుందట.

దేశ అభివ్రుద్ది, పురోగతి ని ఒక ఆర్ధీక పరిస్తితుల మెరుగుదలను, పెరుగుదలనూ చూసి నిర్ణయించకూడదు. అలాచేస్తే అది ప్రజలను మోసం చేసినట్లౌతుంది. అన్ని రంగాలలోనూ పురోగతి సంపాదించుకున్నతరువాతే మనం పురోగతి పోందేమని గర్వ పడాలి....అంతవరకు మనం వెనుకబడి ఉన్నమనే చెప్పాలి. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టు కాకుండా చేతులు కాలకుండా ముందు నుంచే జాగ్రత్తపడాలి.

ఉరి శిక్చలు విధించటం వరకేనా...నెరవేర్చరా?

చివరి 5 సంవత్సరములుగా భారతదేశములో ఉరిశిక్చ వేయబడినవారు ఎవరూ ఉరితీయబడలేదు...."ఇది సంతొష పడవలసిన సమాచారం. దీనినిబట్టి చూస్తే ఉరిశిక్చలను రద్దు చేయాలనే ఉద్దేసం భారదేశానికి ఉన్నట్లు కనబడుతోంది" అని అం నెస్ టీ ఇంటర్నేషనల్ (Amnesty International) వారు అభిప్రాయపడుతున్నారు.

కానీ పోయిన సంవత్సరం 50 కేసులలో ఉరిశిక్చలు వేసి ఉరిశిక్చను చట్టరీత్యా నిషేధించలేదని మరోమారు చాటిచెబుతోంది. కనుక భారతదేశం ఉరిశిక్చను రద్దు చెయాలనే విషయములో చర్చాంచనీయ అంశం అయ్యింది. కాబట్టి భారతదేశం చట్టాలను కూడా సవరించి ఉరిశిక్చను రద్దుచేసే విషయములో శ్రద్ద చూపాలని వారు కోరేరు.

భారతదేశం ఉరిశిక్చను రద్దు చేయాలా? లేక ఉరిశిక్చ నేరాలను, ముఖ్యముగా ఉగ్రవాద నేరాలను తగ్గిస్తుంది అనే రెండింటి మధ్య ఊగిసలాడుతోంది. కానీ భారతదేశం ఈ విషయములో ఒక నిర్ణయానికి వచ్హి, ఉరిశిక్చను రద్దు చేసి మానవహక్కులను కాపాడాలని వారు అన్నారు.

చైనా, ఇరాన్ మరియూ సూడాన్ దేశాలు ఉరిశిక్చను ఒక రాజకీయ ఆయుధముగా వాడుకుంటున్నారు. 2009 లో ప్రపంచములోని అన్నిదేశాలూ కలిసి అమలుపరచిన ఉరిశిక్చల సంఖ్యను ఒక్క చైనాదేశమే దాటిపోయింది. వారు ( చైనా) సరైన లెక్కలు ఇవ్వకపోయినా వేలాదిమందిని ఉరితీసేరనే సమాచారం మాకు తెలుసు.

భారతదేశ సుప్రీంకోర్ట్ సలహా ఇచ్హిన విధముగా, ఉరిశిక్చ పడిన ప్రతి నేరస్తుడి మీద లా కమీషన్ మూలంగానో లేక మానవ హక్కుల ఉల్లంఘన కమిటీ వారిచేతగానీ ఉరిశిక్చ పడినవారికి ఆ శిక్చ తగునా అని తెలుసుకుంటే అమాయకులూ మరియూ తప్పుగా శిక్చించ బడ్డవారూ ఈ శిక్చ నుండి వారిని తప్పించవచ్హు.

భారతదేశం 2007 లోనూ, 2008 లోనూ యూనైటడ్ నేషన్స్ లో ఉరిశిక్చకు వ్యతిరేకంగా ఓటువేసింది. కానీ ఈ మధ్య ఆ శిక్చను విమానాలు దారి మళ్లించే యాక్ట్ లో ఖచ్హిత శిక్చగా ద్రువీకరించేరు. కనుక భారతదేశం ఉరిశిక్చపై ఒక కచ్హితమైన ఉద్దేసంతో వ్యవహరిస్తూ. ఆ శిక్చను పూర్తిగా రద్దుచేయాలని వారు కోరేరు.

ఉరిశిక్చను పూర్తిగా రద్దుచేయాలా, వద్దా అనే విషయములో ప్రపంచములోని అన్నిదేశాలూ తికమక పడుతూనే ఉన్నయి. అయినా ఉరిశిక్చను పూర్తిగా రద్దుచేయాలనే అంశం మీద విరివిగా చర్చలు జరుగుతునే ఉన్నాయి. ఈ ఉరిశిక్చ విషయములో మనదేశం చాలా తికమకలో ఉన్నదని తెలుస్తోంది. ఎందుకంటే ఎంతోమందికి విధించబడ్డ ఉరిశిక్చను అమలుచేయకుండా (ఉగ్రవాదులతో సహా)ఆలశ్యం చేస్తోంది.

ఉరిశిక్చను రద్దు చేయకూడదు, అలాగే ఉరిశిక్చ వేయబడిన వారి శిక్చనుకూడా అమలుపరచటంలో అనవసరమైన ఆలశ్యం చేయకూడదు, అలాచేస్తే నేరాలు చేసేవారు ఎక్కువ అవుతారు అనేది నా ఉద్దేసం.

మీరేమనుకుంటున్నారు?

నిత్యానంద స్వామి మీద అమెరికాలో ఒక క్రిమినల్ కేసు....ఇది అంతర్జాతీయ కుట్రలో భాగామా?

"నిన్న, మోన్నటివరకు ఊరికినే వుండి, ఇప్పుడు సడన్ గా ఆయనపై ఒక క్రిమినల్ కేసు పెట్టటం మన హిందూ మతానికి కళంకం తేవాలనే జరుగుతున్న కుట్రలో భాగం" అని ఒక భక్తుడు మండిపడ్డాడు. ఆయన మీద పెట్టిన కేసు విషయాలుఈ క్రింది వీడియోలో చూడండి.
స్వామి నిత్యానందా, తన మీద మోపబడిన ఆరొపణలను ఖండిస్తూ తన ఆశ్రమ పీఠాధిపత్యానికి సోమవారం నాడు రాజీనామా చేసేరు. ఈ యనకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2 మిల్లియన్ల మంది భక్తులుగా ఉంటున్నారు. వీరిలో చాలాశాతం ఆడవారేనట. వీరిలో చాలామంది ఈయన మీద మోపబడిన ఆరోపణలను నమ్మలేకపోతున్నారట.

"ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి స్వాములు తయారౌతున్నారంటే దానికి ప్రబుత్వమే ఒక ముఖ్య కారణం. ప్రబుత్వాలు గనుక స్వాములవారిమని చెప్పుకునే వారిని, వారు పెడుతున్న ఆశ్రమాలనూ, వారికి వస్తున్న ఆదాయాలనూ మొదటినుండే పర్యవేక్చిస్తుంటే దొంగ స్వాముల తయారుకూడా తగ్గటమే కాకుండా అలాంటి వారు ఉద్భవించటానికి భయపడతారు. కానీ అలా చేయకుండా ప్రబుత్వ అధికారులూ మరియూ రాజకీయ నాయకులు కూడా వారిని నమ్మేసి వారు పెట్టే ఆశ్రమాలకు ఆర్ధీక సహాయం కూడా చేస్తున్నారు" అని ఆల్ ఇండియా డెమాక్రటిక్ అసోషియేషన్ జెనెరల్ సెకరటరీ సుధా సుందరం అన్నారు.

"వీరిని గుడ్డిగా నమ్మే ప్రజలు ఉన్నంత వరకు వీరు వెలుగుతునే ఉంటారు. దొంగ డాక్టర్లూ, దొంగ ఇంజనీర్ల లాగా దొంగ స్వాములు కూడా ఉంటారని వీరు తెలుసుకోవాలి" అని ప్రసన్నా ట్రస్ట్ అధిపతి స్వామి హ్చ్. హ్చ్. సుఖ బోదానంద అన్నారు.

"దేముని ప్రార్ధనతోనూ, దీక్చతోనూ చూడగలగాలి. అంతేకానీ స్వాములవారమని చెప్పుకు తిరిగే ప్రతివారినీ ఆశ్రయించకూడదు" అని రామక్రిష్ణా మిషెన్ సెకెరటరీ స్వామి శాంతాత్మానంద్ అన్నారు.

"బాగా చదువుకున్న వారు కూడా స్వాములమని చెప్పుకునే వారిని నమ్ముతున్నారు. ఇది ఒక సాంఘీక చర్చ. సరియైన ౠజువూ మరియూ కంప్లైంట్ లేనిదే మేము ఎవరినీ అరెస్టు చేయలేము, ఎవరి మీదా చర్య తీసుకోలేము" అని డిల్లీ పోలీసు అధికారి రాజన్ బగత్ అన్నారు.

"స్వామివారిపై వస్తున్న ఆరోపనలు ఒక పెద్ద కుట్ర. రాజకీయ నాయకులూ మరియూ మత సంభంధితులూ కలిసి భారతదేశ మత గురువులపై దొంగ కేసులు జోడించి మన హిందూ మతానికే ఒక కళంకం తీసుకురావాలని ప్రయత్ణిస్తున్నారు" అని బాబా రాందేవ్ అన్నారు.

ఏది ఏమైనా అటు ప్రజలనూ, ఇటు హిందూ మతాన్ని కాపాడాలంటే, దొంగ స్వాములను ఏరిపారేయాలి. ఆరోపనలతో పట్టుబడిన స్వాముల మీద విచారనలను త్వరిత పరచి తప్పులేదని తెలిసివారిని విడిచిపెడుతూ, దొంగ స్వాములని తెలిసిన వారిని కఠినంగా శిక్చిస్తే మరి రాబోవుకాలంలో దొంగ స్వాముల అవతారం ఎత్తటానికి భయపడతారు. దీనివలన హిందూ మతం మీద, మతాచార్యుల మీద గౌరవం పెరుగుతుంది.

Monday, March 29, 2010

జాప్యమైన న్యాయం ప్రజాస్వామ్య వ్యతిరేకం....భారత ప్రధానమంత్రి

ఈ విషయం మన అందరికీ తెలిసున్నా, ఈ మాటల్ని మన ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు బహిరంగంగా చెప్పడం ఆయన మనొభావాన్ని మరోసారి మనకి ఎత్తిచూపుతోంది. రాజకీయ నాయకుడిగా ప్రజలకు మేలు చేయలనే తపన ఆయనలో కనబడుతోంది. ఈయనలాగానే ప్రతి రాజకీయ నాయకుడూ అనుకోగలిగితే అది ప్రజలకూ, మన దేశానికీ ఎంతో మేలు చేస్తుంది అనేది వేరుగా చెప్పక్కరలేదు.

భారతదేశ చట్ట మరియూ న్యాయ వ్యవస్థ ఒకదానికోకటి వ్యతిరేక ధోరనిలో ఉన్నది కాబట్టి న్యాయస్తానల పనితీరును వేగం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను పఠిష్టం చేయవలసినదిగా శనివారమునాడు ఆయన కోరేరు.

చట్టం, న్యాయం మరియూ సాదారణ ప్రజలు అనే సమావేశంలో మాట్లాడుతూ "భారత చట్టాలూ మరియూ న్యాయ వ్యవస్థ మనదేశ ప్రజాస్వామ్యానికి గట్టి పునాదులు...మన ప్రబుత్వం సాదారణ ప్రజలు చట్టరీత్యా కాపాడబడాలి అనే అంశానికి ముఖ్యత్వం ఇస్తోంది" అన్నారు.
“అతను గానీ , ఆమె గానీ తమ కనీసపు హక్కులను బద్రత చేసుకోగలిగి మరియూ వేగంగా న్యాయస్థానాలనుండి తమ న్యాయాలను తెచ్హుకోగలిగితేనే ప్రజాస్వామ్యం అనే పదానికి కోంతైనా అర్ధముంటుంది ....మన ప్రజాస్వామ్య పద్దతీ మరియూ మన చట్ట వ్యవస్తలే మనదేశానికి బలంగా ఉంటున్నాయని ప్రపంచవ్యాప్తంగా వాటిని మెచ్హుకుంటున్నారు. మనదేశంలో పత్రికా స్వాతంత్రం ఉంది,వాస్తవ్యమైన స్వతంత్రమైన న్యాయవ్యవస్థ ఉన్నది, స్వతంత్రమైన ఎన్నికల సంఘం, మరియూ అందరి లెక్కలనూ తనిఖీ చేసే స్తాపనలూ మన ప్రజాస్వామ్య కట్టుదిట్టాలను ఎత్తిచూపుతోంది. కానీ ఇవన్నీ ఇప్పుడు సన్నగిల్లుతున్నట్లు మనదేశంలో న్యాయస్థానాలలో పేరుకుపోయిన, ఆలస్య మవుతున్న కేసులను బట్టి తెలుస్తోంది” అని చెప్పేరు.

కాబట్టి పోయిన సంవత్సరం కేంద్ర ప్రబుత్వం అమలులోకి తీసుకువచ్హిన గ్రామ న్యాయస్థానాల చట్టాన్ని ప్రతి రాష్ట్రమూ త్వరగా అమలు పరిస్తే, సుమారు 5,000 గ్రామ కోర్టులు ఏర్పడి ప్రజలకు త్వరగా న్యాయం చేకూరేటట్లు జరుగుతుందని, కనుక ఆ చట్టాన్ని అమలు పరచవలసినదిగా ఆయన కోరేరు. ప్రబుత్వ లెక్కల ప్రకారం 3.10 కోట్ల కేసులు న్యాయస్థానాలలో పెండింగ్ లో ఉన్నాయని, దీనికి అనుగునంగానూ, పెండింగ్ లో ఉన్న కేసుల విచారన త్వరగా ముగిసి న్యాయం వెలువడాలనే ఉద్దేసంతోనే ఈ గ్రామ న్యాయ శభలను ఏర్పరిచేమని చెబుతూ ప్రతి గ్రామ కోర్టులలోనూ ఫస్ట్ క్లాస్ జ్యూడీషియల్ మెజెస్ట్రట్ నియమించబడతారని, వీరు న్యాయ అధికారులుగా పిలువబడతారని తెలిపేరు.

మరి రాష్ట్రా ప్రబుత్వాలు ఈ గ్రామ న్యాయస్థానాలను ఏర్పరచకుండా ఎందుకు ఆలశ్యం చేస్తున్నయో?

Saturday, March 27, 2010

మతాల పేరుతో గురువులు చేస్తున్న మోసాలు, దారుణాలు ఎల్లలు దాటి పోయినై

గురుశిశ్యులు అనే సిద్దాంతం హిందూ మతంలో ఒక పారంపర్యంగా ఉన్న సిద్దాంతం. ఈ మధ్య ఈ సిద్దంతాన్ని ఎందరో తమ వ్యక్తిగత పురొగతికి వాడుకుంటున్నారని, వాడుకున్నారని మీకందరికీ తెలుసు. వాడుకోవటమే కాకుండా ఆ గురుశిశ్య సంభంద సిద్దాంతానికే కళంకం తీసుకువచ్హేరు, తీసుకువస్తూనే ఉన్నరు. ఇది కాలంలో వచ్హిన మార్పో లేక మనుష్యులలో వచ్హిన మార్పో అర్ధంకావటంలేదు.

హిందూ మతంలో, హిందూ మతం మొత్తానికీ ఒకేఒక మతగురువు అనేది లేకుండా ఎవరికి వారు, వారికి ఇష్టమైనవారిని తమ మత గురువులుగా ఎన్నుకుని, వారిని ఆశ్రయించి వారికి కానుకలు మాత్రమే కాకుండా తమనే అర్పణ చేసుకుంటున్నారు. ఇలా చేసేవారిలో కొంతమంది తెలిసి చేస్తున్నారు, మరికొందరు తెలియక మోసపోతున్నారు.

ఏది ఎమైనా ఈ మధ్య వెలుగులోకి వచ్హిన నిత్యాణంద స్వామి విషయాలతోపాటు మరికోంతమంది స్వాముల అవినీతి పనులు ఆ గురుశిశ్య సంభందానికి మరియూ సిద్దంతానికే కళంకం తీసుకు వచ్హినై. కల్కీ భగవాన్ వీడియో క్లిప్పింగ్గులు మానవులలో వుండవలసిన నైతీకవిలువలు ఎంత దిగజారిపోయినైయో ఎత్తిచూపుతోంది.

అనాధలుగా తమ దగ్గరకు నీడా, కూడు, గుడ్డ కోసం వచ్హిన 200 చెవిటి పిల్లలను, తన కామవాంఛలకు వాడుకున్నారని ఒక రోమన్ కాతలిక్ మత గురువు మీద అభియోగం వస్తే, ఆయనమీద 1996 లో కేసు నమోదుచేసి విచారన జరుపుతున్నారు. ఈ రోమన్ కాతలిక్ మతగురువుని అతను కోరేడని అతన్ని ఈ కేసునుండి కాపాడటానికి పోప్ బెండిక్ట్ 16 ప్రయత్నం చేసేరని ఆయనమీద అభియోగం వచ్హింది. ఆ రోమన్ కాతలిక్ మతగురువుని మతగురువు పదవినుండి తోలగించవలసిందిగా వచ్హిన కోరికలను పోప్ సమ్మతించలేదని, తరువాత ఆ మతగురువు 1998 లో మతగురువుగానే చనిపోయేడని చెబుతున్నారు. ఈ కేసులోనే కాకుండా మరెన్నో రోమన్ కాతలిక్ మతగురువుల కేసులలు పోప్ సహాయపడి వారిని కాపాడేరని అభియోగం ఈయనపై వచ్చింది.

ఐర్ లాండ్, ఆస్త్రియా, నెదర్లాండ్స్ మరియూ స్విజర్లాండ్ లోని చెర్చ్ లలో ఉన్న ఫాధర్ ల పైన కూడా ఆరోపణలు వచ్హినై. వీరందరిపై వచ్హిన ఆరోపణలను కప్పిపుచ్హటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు....ప్రపంచంలోనే ఎక్కువ కట్టుబాట్లున్న, ఒకే మత గురువు చూపుల్లోనే ఉంటున్న ఈ రోమన్ కాతలిక్ చెర్చ్ ఫాదర్లపై రోజురోజుకూ బయటపడుతున్న ఆరొపనలు ప్రజలను ఆశ్చర్య పరుస్తోంది.

పిల్లలపై జరిగే అన్యాయలకు కఠినమైన చట్టాలున్న దేశాలలోనే ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయంటే, ఇక చట్టాలు సరిలేని, లంచాలకు లోంగిపోయే మన దేశంలో మతగురువులని ఛెలామని అవుతున్నవారు తప్పించుకోవటం పెద్ద కష్టం కాదు.

మరి వీటిని ఆపేవారు ఎవరు? మతగురువులమని చెప్పుకుంటున్నవారి దగ్గర నుండి ప్రజలను ఎవరు కాపాడతారు? మతం పేరుతొ జరుగుతున్న మోసాలను ఆపేదెలా?.......ఆ భగవంతునికే తెలియాలి.

ఆమెరికాలోని టెక్సాస్ నగరంలో షిర్డీ సాయ్ బాబా విగ్రహం అవిస్కరించిన ఫొటోలు ఇక్కడ చూడండి

పోయిన గురువారం నాడు అమెరికాలోని అస్టిన్ (టెక్సాస్) లో షిర్డీ సాఇ బాబా విగ్రహం ప్రతిష్టించేరు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.

2012 సినిమా తమ దేశ అభివ్రుద్దికి అడ్డుపడుతుందని భయపడుతున్న ఉత్తర కొరియా

2012 సినిమా రిలీజ్ ను ఉత్తర కోరియా ప్రబుత్వం తిరస్కరించింది. ఇప్పుడు ఈ సినిమా దొంగ సీ.డీ లు తమదేశంలోకి రాకుండా ఉండటానికి అన్ని ప్రయత్నాలూ తీసుకుంటోంది. ఈ సినిమా వారి దేశ ప్రజల మనసులను పాడుచేస్తుందని, కాబట్టి ఈ సినిమా వారి దేశ ప్రజలు చూడకుండా ఉండటానికి కావలసిన కట్టుదిట్టాలను అమలు చేస్తోంది.

దీనికి చాలా పెద్ద కారణం ఉంది. అది ఏమిటంటే 2012 ని వారిదేశానికి అద్రుష్టకరమైన సంవత్సరముగా వారి రాజు చెప్పడమే కారణం.....ఆ దేశపు ఏకాంత రాజు కిం జాంగ్-ఇల్, 2012 ఉత్తర కొరియా ప్రపంచములోనే ఒక పెద్ద సూపర్ పవర్ అవడానికి మొదటి అడుగు వేసే సంవత్సరం అని చెప్పేరు...ఏప్రిల్ 15, 2012, ఉత్తర కోరియా ఉద్భవించటానికి కారణమైన కిం 2-సంగ్ యోక్క 100 వ పుట్టిన రోజు. ఈయన 1994 లో చనిపోయినా, ఇంకా అయన్నే ఆ దేశానికి రాజుగా భావిస్తూ, ఆయన పేరు మీదే అధికారపూర్వ పరిపాలన జరుగుతోంది. అందువలన ఉత్తర కొరియా నాయకులు వారి దేశ ప్రజలు ఈ 2012 సినిమాను చూడకూడదని అనుకుంటున్నారు.

ఎందుకంటే ఆ సినిమాలో ప్రపంచం 2012 న అంతమైపోతుందని చూపించేరు. తీవ్రమైన ప్రక్రుతీ వైపరీత్యాలైన భూ కంపాలూ, సునామీలూ, అగ్ని పర్వత పేళుల్లూ 2012 లో సంభవిస్తాయనీ, దీనితో భూమి చాలా వరకు ద్వంశం అవుతుందని చూపించటమే. అయితే ఈ 2012 వ సంవత్సరమే ఉత్తరకోరియా ఎదగిపోయే సంవత్సరం అని నమ్ముతున్న దేశ ప్రజలు ఈ సినిమా చూసి మనసులు పాడుచేసుకుని భయానికి గురౌతారని అభిప్రాయపడుతున్నారు.

చైనా సరిహద్దుల నుండి దొంగ సీ.డీ లు తెచ్హుకుని ఈ సినిమాను చూసిన కొంత మందిని ఉత్తర కోరియా పోలీసులు అరెస్ట్టు చేసినట్లు జపాన్ దిన పత్రిక ఆసహీ తెలిపింది.....తమ దేశ అభివ్రుద్దిని పాడుచేసే ఈ సినిమాను చూడటం తీవ్రమైన నేరంగా పరిగనిస్తూ , అలా ఆ సినిమా చూసిన వారిని, ఆ సినిమా దొంగ సీ.డీ లు పెట్టుకున్న వారిని పట్టుకుంటే 5 సంవత్సరముల కఠిన కారాగారా శిక్చ విదిస్తున్నారని పేరు తెలుపని అధికారులు తెలిపేరట.

2012 లో పఠిష్టమైన, అభివ్రుద్దితోకూడిన దేశంలో జీవిస్తారని తమ దేశ ప్రజలకు ఆ దేశ రాజు వాగ్ధానం చేసేడట. ఆ వాగ్ధానాన్ని కాపాడటానికే ఈ కట్టుదిట్టాలట......ఆయన చేసిన వాగ్ధానాలలో ముఖ్యమైనది ఆ దేశంలో 105 అంతస్తుల రైయుయాంగ్ అనే హోటల్ ను నిర్మిస్తాననడం ఒకటి. అయితే 1993 లో డబ్బులేక ఈ హోటల్ కట్టటం ఆగిపోయిందట. ఆ తరువాత ఆ దేశ ఆర్ధీఖ పరిస్తితి క్చీణించిందట. ఎన్ని పధకాలు వేసినా వారి దేశ ఆర్ధీఖ పరిస్తితి మెరుగు పడటం లేదట.

ఎన్నో కష్టాలను ఎదుర్కుంటున్న ఈ తరుణంలో ఈ 2012 సినిమా ఆ దేశ ప్రజల మనసుని మరింత క్రుంగదీస్తుందని భయపడుతున్నారట.

Friday, March 26, 2010

6 సంవత్సరముల పిల్లవాడికి 15 చేతి వేళ్ళు, 16 కాలి వేళ్ళు

చైనాలోని సెన్యాంగ్ కు చెందిన 6 సంవత్సరముల పిల్లవాడికి 15 చేతి వేళ్ళు మరియూ 16 కాలివేళ్ళు ఉన్నయట. కిండర్ గార్డెన్లో సహ విద్యార్ధులు అతన్ని విక్రుత ఆకారి అని పిలిచేవారట.

మంగళవారం నాడు ఆ పిల్లవాడికి 6 1/2 గంటల సేపు ఆపరేషన్ చేసి ఎక్కువగా ఉన్న వేళ్ళను తీసేరట. ఆపరేషన్ సక్సెస్ అని, ఆపరేషన్ తరువాత పిల్లవాడు ఆరొగ్యముగా ఉన్నడని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు.

ఆ పిల్లవాడు వేగంగా కోలుకుని అందరిలాగే మామూలు మనిషిగా పిలవబడాలని కోరుకుంటున్నాను.


ఈ క్రింద ఆ పిల్ల వాడి ఫొటోల లింకు ఇస్తున్నాను. దీనిని కట్ అండ్ పేస్ట్ చేసి మీ బ్రౌజర్లో చూసుకోవచ్హు.


http://news.in.msn.com/gallery.aspx?cp-documentid=3740108

మనుషుల ప్రాణాలతో ఆడుకోవటమంటే ఇదే కాబోలు?

దొంగ మరియూ కాలపరిమితి దాటిపోయిన మందులు అమ్ముతూ, ఏమీ తెలియని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ సొమ్ము చేసుకునే వారిని ఏమనాలి? మానవ మ్రుగాలని చెప్పచ్హా? లేక ఇంకా కఠినమైన పేరేమైనా ఉన్నదా? మానవ మ్రుగాల సంఖ్య ఎక్కువవటం వల్లనో ఏమో క్రూరముగాలు తమ సంఖ్యను తగ్గించుకున్నాయనుకుంటా.

మీకందరికీ ఇప్పడికే తెలిసుంటుంది. చెన్నై నగరంలోనూ మరియూ తమిళనాడు రాష్ట్రం పలుమూలలలోనూ ఈ మధ్య బయటపడిన దొంగ మరియూ కాలపరిమితి దాటిన మందుల అమ్మకం, కోట్ల కొలది రూపాయలు విలువచెసే ఇలాంటి మందులు కుప్పలు కుప్పలుగా పడియుండటం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వ్యాపారం చేసే ముఠాలోని పలుమందిని పట్టుకున్నా ఇంకా ఎంతోమందిని పట్టుకోవలసి ఉంది. కోట్లకోలది రూపాయలు విలువచేసే ఇలంటి మందులను పటూకున్నా ఇంకా ఇలాంటి మందులు షాపులలో ఎన్ని ఉన్నయోనని ప్రజలు భయపడుతున్నారు.

"ప్రజలు ఆందోళన చెందక్కరలేదు...మందులు కోనేటప్పుడు వాటిమీదున్న ఎక్స్ పైరీ డేట్ ను చూసి కొనండి" అని చెబుతున్న ప్రబుత్వ అధికారులు, కొన్ని సంవత్సరాలనుండి జరుగుతున్న ఈ వ్యాపారం గురించి ఎందుకు సీరియస్ గా లేదు? ముందే ఎందుకు ఈ వ్యాపారాన్ని ఆపలేకపోయేరు? ఈ ప్రశ్నలకు మాత్రం సమాదానం లేదు.

ఇలాంటి మందులను తయారు చేసి, అమ్ముతున్న ముఠాకు నాయకుడైన ప్రదీప్ చోర్డియా ను నిన్న పోలీసులు అరెస్టు చేసేరు. కానీ ఇతన్ని పోలీసులు ఇంతకుముందు 2003 లో ఒక సారి ఇదే కేసుక్రింద అరెస్ట్ చేసేరట. అయితే అతను ఆ కేసులోనుండి ఎలాగో తప్పించుకున్నాడట.... ఇతను ప్రబుత్వ ఆసుపత్రికి చెందిన మందులను తక్కువ రేటుకు కొని వాటిని షాపులకు ఎక్కువ రేటుతో అమ్మేవాడట. ఆ తరువాత మెడికల్ షాపులలో కాలపరిమితి దాటిపోయేయని ఏరి పారేస్తున్న వాటిని తీసుకుని, వాటికి కొత్త లేబుల్స్ అతికించి అవి అమ్మేవాడట. ఆ తరువాత నాసిరకం మందులుకోని వాటిని కూడా అమ్ముతున్నాడట.

డిసెంబర్ 3, 2009 లో క్రితికా దేవదర్షిని అనే 3 సంవత్సరముల పాపకు జ్వరం వస్తే, ఒక షాపులో కొన్న మందువలన ఆ పాప చనిపోయింది. ఈ విషయం మీద పాప తల్లితండ్రులు కాలపరిమితి దాటిన మందులు వాడబట్టే తమ కూతురు చనిపోయిందని ఆ షాపు మీద పోలీసులకు ఫిర్యాదు చేసేరు.

ఈ నెల మధ్యలో హెల్త్ డిపార్ట్ మెంట్ వారు కొన్ని షాపుల మీద రైడ్ చేసేరు. అప్పుడు వారికి ఆ షాపులలో దొంగ మరియూ కాలపరిమితి దాటిన మందులు దొరికినై. వారిని పట్టుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. ...ప్రదీప్ చోర్డియాతో పాటు ఈ ముఠాకు చెందిన మరో 8 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి విచారనలో ఈ ముఠాకు చెందిన మరికోందరు ఆంధ్ర రాష్ట్రంలోనూ మరియూ డిల్లీలోనూ ఉన్నట్లు భావిస్తున్నారు. అదే విచారనలో ఈ ముఠాకు ఎందరో ప్రబుత్వ అధికారులు సహాయపడి ఉండవచ్హునని తెలిసిందట. ఇంతేకాక ఈ వ్యాపారంలోని మందులు ఎలాంటివో తెలిసికూడా కోందరు మెడికల్ షాపు యజమానులూ, స్టాకిస్టులు ఈ మందులను కోని అమ్ముతున్నారనేదే అన్నిటికంటే ఆశ్చర్యం.

ఇలాంటి దొంగ మందుల నుండి మనం తప్పించుకోవాలనుకుంటే మనం కోనే ప్రతి మందుకూ ( అది రూపాయి కానివ్వండి, 10 రూపాయలు కానివ్వండి, 100 రూపాయలు కానివ్వండి) షాపు వారిని బిల్లు అడగాలి. బిల్లు ఇవ్వడం వారి కర్తవ్యం, బిల్లు తీసుకోవడం మన భాద్యత. వారు బిల్లు ఇవ్వకపోతే వారిమీద పోలీసులకు ధైర్యమూగా ఫిర్యాదు చెయాలి. పోలీసులు నడవడికతీసుకోకపోతే కోర్టులకూ ఫిర్యాదు చేయాలి.

లేకపోతే మనల్ని మనమే మోసం చేసుకున్నవారమౌతాము.

Thursday, March 25, 2010

చైనా నుండి తప్పుకుని గూగుల్ పెద్ద తప్పు చేసిందా?

ప్రపంచములోనే అతిపెద్ద అంతర్జాల మార్కెట్‌ను వదులుకుని గూగుల్ పెద్ద తప్పుచేసిందనే చెప్పాలి.

మేము తప్పుకోబోతున్నామని గూగుల్ చైనా ప్రబుత్వాన్ని హెచ్హరించినా, చైనా ప్రబుత్వం కొంచంగూడా ఆందోళన చెందలేదు. వారితో ఎటువంటి చర్చలూ జరపలేదు. ఇప్పుడు నిజంగానే గూగుల్ తప్పుకున్నా చైనా ప్రబుత్వమే కాకుండా, చైనా ప్రజలుకూడా బాధపడలేదనే చెప్పాలి.

కారణాలు ఏదైనా చైనా భూమిని వదిలి వెళ్ళిన గూగుల్, చైనా అంతర్జాల మార్కెట్ ను వదులుకోలేక వ్యాపార ధోరనిలో మాత్రమే అలోచించి గూగుల్ హాంకాంగ్ నుండి గూగుల్.సి.ఎన్ (google.cn) అన్ సెన్సార్డ్ సెర్చ్ ఇంజెన్ ను చైనాలోకి ప్రసారం చేసింది. కానీ ఏమైంది. హాంకాంగ్‌లో ఉన్న అతి పెద్ద అంతర్జాల కంపెనీ టీ.ఓ.ఎం.(TOM)గూగుల్‌తో సంభందాలు తెంచుకుంది. గూగుల్ సెర్చ్ ఇంజెన్ మూలంగా తమ వెబ్ సైట్ ను ఎవరూ చూడకుండా చేసింది. హాంకాంగ్‌లో ఉన్న ఇతర అంతర్జాల కంపెనీలుకూడా గూగుల్‌తో సంభందాలు తెంచుకుందామని ఆలోచిస్తున్నారట.

ఇలా ఎందుకు జరుగుతోంది. కారణం ఒకటే. ఏ సంస్త అయినా ఇంకోదేశంలో వారి బ్రాంచీలను తెరచి అక్కడ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఆ దేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలి. కానీ ఆ దేశ చట్టాలకు విరుద్దముగా, అంతర్జాలములో మేమే దేముళ్లము అన్న అహంకారంతో నడుచుకుంటే ఇలాంటివే జరుగుతాయి. ఈ మధ్య న్యూజీలాండ్ కూడా అంతర్జాలములో అభ్యంతరకరమైన వాటిని నిశేధించింది. పోనుపోనూ అన్నిదేశాలూ ఏదో ఒక విషయంలో నిశేధాలు విధిస్తారు. అప్పుడు గూగుల్ పరిస్తితి ఏమౌతుంది.

గూగుల్ నిజంగానే, మనస్పూర్తిగానే చైనాను వదులుకోవాలనుకున్నప్పుడు, ఆ దేశం నుండి వారి బ్రాంచీని మాత్రమే తీసిందిగానీ గూగుల్.సి.ఎన్ (google.cn) ను హంకాంగ్ నుండి చైనాలోకి ఎందుకు ప్రసారం చేయాలి. చైనాలో తమ ప్రసారాలని ఆపేసి ఉండవచ్హుకదా?..అలాచేయలేదంటే చైనాలో రోజురోజుకి పెరుగుతున్న అంతర్జాల వ్యాపారాన్ని గూగుల్ వదులుకోదలచుకోలేదనే చెప్పాలి. టెక్నాలజీ అభివ్రుద్ది చెందుతున్న ఈ తరుణంలో గూగుల్ ప్రసారాలని చైనాలో బంద్ చేయడం చైనా ప్రబుత్వానికి కష్టంకాదు.

అంతర్జాలంలో స్వాతంత్రం అన్న ఒకేఒక మాటకి గూగుల్ ని ప్రపంచమంతా ఆదరిస్తుందని, అదే మాటని మాటిమాటికీ వాడుతున్న గూగుల్ ఖచ్హితంగా అంతర్జాలంలో తప్పుదోవలో వెడుతోంది. ఇది గూగుల్ వారి ప్రత్యర్ధులకు పెద్ద అవకాశంగా మారుతుంది.

గూగుల్ చైనా నుండి తప్పుకోవడం, అమెరికన్ ప్రబుత్వ కుట్ర అని చైనా ప్రబుత్వం చెబుతోంది. రాజకీయాలగురించి, మానవ విలువల గురించి ప్రచారం చేసినంత మాత్రానా గూగుల్ గొప్పదైపోదని చైనా ప్రబుత్వం చెబుతోంది. ఎందుకంటే గూగుల్ ప్రవర్తనలు అమెరికన్ కుట్రలో భాగమని చైనా ప్రజలకు తెలుసు. అంతర్జాల యుద్దం మొదలుపెట్టిన అమెరికా అంతర్జాలములో మమల్ని ఏమీచెయలేక ఇప్పుడు గూగుల్ మూలంగా ఆ యుద్దాన్ని తీసుకువెడుతోంది అని చైనా ప్రబుత్వం చెబుతోంది. ఇది గూగుల్ కూ అమెరికాకూ మంచిది కాదు.

విదేశీయ విశ్వవిద్యాలయాలు మనదేశంలో అడుగుపెట్టడం మనకు లాభమా? నష్టమా?

విదేశీయ చదువు సంస్తల బిల్లును పార్లమెంట్లో ప్రవేసపెట్టబోతున్నారు. ఈ బిల్లు ప్రవేసపెట్టిన తరువాత విదేశాలకు చెందిన విశ్వవిద్యాలయాలు మనదేశంలో తమ బ్రాంచీలని పెట్టుకుంటారు. దీనితో విదేశాలకు వెళ్ళి తమకు ఇష్టమైన విశ్వవిద్యాలయములో పెద్దచదువులు కొనసాగించుకోవాలనుకునే విద్యార్ధినీ విద్యార్ధులు పెట్టుబడులకు, శ్రమలకు గురికాకుండా మనదేశంలోనే వారి చదువులను కొనసాగించవచ్హు.

ఈ బిల్లును ప్రవేసపెట్టకూడదని మనదేశంలోనే పురాతణమైన మద్రాస్ విశ్వవిద్యాలయం అభిప్రాయపడుతున్నది.

విదేశీ విశ్వవిద్యాలయాలు బాగా డబ్బున్న విద్యార్ధులకే ఉపయోగపడుతుందని, అటువంటి విద్యార్ధులనే ఆ విశ్వవిద్యాలయాలు ప్రొస్చాహిస్తూ అనుమతిస్తాయని, కనుక విదేశీ విశ్వవిద్యాలయాలను మనదేశంలో అనుమతించరాదని మద్రాస్ విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ డాక్టర్ జి.తిరువాశగం అన్నారు.

పచ్హయప్ప కళాశాల విద్యార్ధులను ఉద్దేసించి మాట్లాడుతూ "విదేశీ విశ్వవిద్యాలయాలు డబ్బుగల విద్యార్ధులనే చేర్చుకుంటాయి, పేద విద్యార్ధులకు అక్కడ చోటుదొరకదు. అంతే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'హర్ వర్డ్ ' లాంటి విశ్వవిద్యాలయాలు ఇక్కడకు రావు" అన్నారు.

"అసలు ఈ బిల్లు వలన మనదేశానికి రెండే లాభాలు. ఒకటి..ఇక్కడినుండి విదేశాలకు వెళ్ళే విద్యార్ధుల సంఖ్యను తగ్గించవచ్హు. ప్రస్తుతం 1.8 లక్షల మంది విద్యార్ధులు విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. రెండవది...విదేశీ ప్రొఫెసర్లకూ, మన ప్రొఫెసర్లకూ మధ్య జరిగే పరస్పర సంకర్షణ పెరుగుతుంది. ఈ బిల్లువలన ఇలాంటి లాభాలే తప్ప, మనకు ఎక్కువ నష్టాలే కలుగుతాయి. విదేశీ విశ్వవిద్యాలయాలు ఇచ్హే సిలబస్ మన అవసరాలకి సరిపోదు. ఫారిన్ ఎక్స్ చేంజ్ దెబ్బతింటుంది. రిజర్వేషన్ సిస్టం అమలుపరచరు. అలాంటి విదేశీ విశ్వవిద్యాలయాలకు భూమి,నీరు,కరెంట్ మరియూ డబ్బు ఎందుకు ఇవ్వాలి" అని ఆయన అడిగేరు.

మిగిలిన విషయాల గురించి చెప్పకుండా విశ్వవిద్యాలయాలు పెట్టుకుని, దాని మూలంగా సంపాదించుకునే డబ్బును వారి దేశాలకు తీసుకువెళ్లకూడదనే పాయింటుకు చాలా విదేశీ విశ్వవిద్యాలయాలు అంగీకరించేయని మన హ్చ్.ఆర్.డి మంత్రి కపిల్ సిబిల్ గారు తెలిపేరు.

ఏది ఏమైనా, విదేశాలలో చదువుకోవాలనే ఆశ ఉన్న విద్యార్ధులు, తప్పక బయటి దేశాలకు వెడతారు...ఎందుకంటే వారి చదువుకు కావలసిన అన్ని సౌకర్యములూ అక్కడ ఉన్నాయి. అక్కడ చదువుకుంటూ ఆ చదువు పూర్తిచేసుకున్నాక అక్కడే ఉద్యోగాలు సంపాదించుకుంటారు. దీని వలన మనదేశానికి ఫారిన్ ఎక్స్ చెంజ్ కూడా లభిస్తుంది. విదేశాలలో చదువుకున్నారనే గౌరవం వారికి ఎప్పుడూ ఉంటుంది.......అందువలన విదేశీ విశ్వవిద్యాలయాలవలన మనకు ఎక్కువ లాభాలు ఉండవని నేను భావిస్తున్నాను.

మరి మీరేమనుకుంటున్నారు?

Wednesday, March 24, 2010

ఒక మొగా, ఆడా పెళ్ళికాకుండా ఒకటిగా కలిసి జీవించడం నేరం కాదు....సుప్రీం కోర్ట్ అభిప్రాయాం

సుప్రీంకోర్టు నిన్న వెలిబుచ్హిన అభిప్రాయం దేశములో పెళ్ళికాకుండానే జంటగా ఉంటున్న పలు జంటలకు మరియూ అలా ఉండటం తప్పుకాదని వాదిస్తున్నవారికి చాలా సంతోషం కలిగించి ఉంటుంది.

"వయస్సు వచ్హిన ఇద్దరు కలిసి జీవిద్దామనుకోవడం ఏ విధముగా నేరమౌతుంది? ఇది నేరం క్రింద వస్తుందా? కలిసి జీవించాలనుకోవడం తప్పు కాదు...కాబట్టి ఇది నేరం కాదు" అంటూ ముగ్గురు జడ్జీలు చీఫ్ జస్టీస్ కే.జీ. బాలాక్రిష్ణన్ గారు, దీపక్ వర్మ గారు మరియూ బి.ఎస్. చౌహాన్ గారు గల సుప్రీంకోర్ట్ బెంచ్ తన అభిప్రాయంలో తెలిపింది.

పురాణాలలో రాధా క్రిష్ణులు కలిసి ఉన్నట్లుగా చెప్పబడినదానీని పురాణ ఉదాహరణగా చెప్పేరు.

దక్షిణ భారతదేశ ప్రముఖ నటి శ్రీమతి కుష్బూ 2005 సంవత్సరములో కొన్ని పత్రికలకు ఇచ్హిన ఇన్ టెర్ వ్యూలలో పెళ్ళి కాకుండా వయస్సు వచ్హిన ఒక ఆడా,మొగ కలిసి జీవించ వచ్హునని చెప్పింది. ఈమె చెప్పింది నేరమని, ఈమే చెప్పిన ప్రకటనలు యువ వయస్సులో ఉన్నవారి మనసులను పాడుచేసిందని, ఈమె ప్రకటనల వలన యువతలో ఉన్న నైతీక విలువలు తగ్గిపోయేయని మరియూ మన దేశ సామాజిక విలువ నశించిందని ఆమె మీద వివిధ కోర్టులలో 22 కేసులు నమోదు చెయబడింది.

నేను చెప్పింది నేరంకాదని...కనుక నా మీద పెట్టిన కేసులను కొట్టిపారేయవలసిందిగా శ్రీమతి కుష్బూ సుప్రీంకోర్టులో పెటీషన్ పెట్టుకుంది.

ఆమె పెటీషన్‌ను విచారణకు తీసుకున్న సుప్రీంకోర్ట్ బెంచ్ "పెళ్ళికాకుండా ఒక ఆడా, మొగ కలిసి జీవించటం చట్టరీత్యా నేరమని ఎక్కడా చెప్పబడలేదు...ఏ చట్టం క్రింద ఇది నేరమని చెబుతున్నారో చెప్పండి...అలాగే ఆమె పత్రికలకు ఇచ్హిన ఇన్ టెర్ వ్యూ తరువాత ఎంతమంది ఆడపిల్లలు తమ ఇళ్ళలో నుండి పారిపోయేరో తెలపండి" అని ప్రతిన్యాయవాది ని అడిగింది.

ఈ పెటీషన్ మీద జడ్జ్ మెంట్ రిసర్వ్ చేసేరు.

Tuesday, March 23, 2010

భక్తులు దేమునికి సిగిరెట్లు, మత్తు పానీయాలూ సమర్పించుకున్నారంటే మీరు నమ్ముతారా?

నమ్మలేము. ఎందుకంటే పూవులు, పండ్లు, టెంకాయలు మరియూ స్వీట్లు దేమునికి సమర్పించుకోవటం మన పూర్వీకులనుండి వస్తున్న ఆనవాయతీ మరియూ మనం ప్రస్తుతం చేస్తున్నదికూడా అదే కనుక. కానీ ఇది నమ్మాలి. ఎందుకంటే కర్ణాటకా రాష్ట్రంలో ఉన్న కర్వార్ గ్రామంలో ఉన్న మునీశ్వర దేముడికి అక్కడికి వచ్హే భక్తులు సిగిరెట్లు మరియూ మత్తు ( ఆల్కహాల్ ) పానీయాలూ సమర్పించుకుంటారట.
దేశం నలుమూళలనుండి ముఖ్యంగా మహారాష్ట్రా మరియూ గోవా రాష్ట్రాల నుండి ప్రజలు తమ కోరికలను తీర్చ మని అడగటానికి ఈ గుడికి వస్తూ, ఈ దేమునికి సిగిరెట్లూ, మత్తు పానీయాలు సమర్పించుకుంటారట.

"ఈ గుడిలోని దేమునికి సిగిరెట్లు, మత్తుపానీయాలు అంటే ఇష్టం" గుడి పూజారి ఆనందరాజ్ నాయక్ తెలుపుతూ "అందుకని ఆయనకు ప్రీతిగల వాటిని భక్తులు ఆయనకు సమర్పించుకుంటూ తమ కోరికలు తీర్చమని వేడుకుంటారు" అని చెప్పేరు.

తమ కోరికలను తీర్చమని కోరుకున్న భక్తులు, తాము కోరుకున్నవి జరిగిన తరువాత ఈ గుడికి వచ్హి ఇవి సమర్పించుకుంటారు. ఈయన బ్రతికున్నప్పుడు ఇవంటే ఆయనకు చాలా ఇష్టం అని తెలిపేరు.

ప్రతి సంవత్సరమూ మార్చి నెలలో ఇక్కడ తిరణాల జరుగుతుంది. అప్పుడు దేశం పలు మూలల నుండి భక్తులు వచ్హి సిగిరెట్లూ, మత్తుపానీయాలే కాకుండా మేకలూ, కోళ్ళు మొదలగువాటిని సమర్పించుకుంటారట.

"మునీశ్వర దేముడు మా కోరికలు తీరుస్తాడు...వ్యాధులను గుణ పరుస్తాడు....ఆయన ఋణం తీర్చుకోవడానికి ఆయనకు ప్రియమైన సిగిరెట్లు, వైన్ ఆయనకు సమర్పించుకుంటాము" అంటూ కిరన్ వెంకటరామన్ అనే ఒక భక్తుడు చెప్పేడు.

మునీశ్వర దేముడు 300 సంవత్సరాల క్రితం "కపీర్" అన్న పేరుతో ఒక రూపం దాల్చి కర్వార్ గ్రామానికి వచ్హి అక్కడున్న పేదవారికి మరియూ కష్టాలలో ఉన్న ప్రజలకు సహాయపడేవారట. ఆయన చనిపోయినతరువాత అక్కడ ఆయనకు గుడి కట్టబడిందని చెబుతున్నారు.

Monday, March 22, 2010

త్రాగు నీరుని ప్లాస్టిక్ ప్యాకెట్లలో అమ్మటాన్ని బాన్ చేయడం సబబేనా?

ప్లాస్టిక్ ప్యాకెట్లలో అమ్ముతున్న మంచినీటి పాకెట్లను ఏప్రిల్ నెల నుండి బాన్ చేయాలని చెన్నై కార్పోరేషన్ నిర్ణయించుకుంది. దీనికి ముఖ్య కారణాలు ఈ పాకెట్లలొ అమ్ముతున్న నీరు పరిసుద్దమైనది కాదట, ఆ పాకెట్లలో అమ్ముతున్న మంచి నీరు ఆరొగ్యానికి మంచిది కాదట. ఇంతే కాకుండా ఆ నీటిని త్రాగిన తరువాత ఆ కాలీ ప్లాస్టిక్ పాక్ లను ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారని, దీనివలన వాతావరనం కాలుష్యం అవడమే కాకుండా, ఆ పారేసిన వేస్ట్ పాకెట్లు వీధులలో ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయి రోడ్ల మీద పడే వర్షం నీరు పోకుండా ఆడ్డుకుని నీటి పారుదలను బాధిస్తోందట.

ఈ కొన్ని నెలలలోనే 1.70 లక్షల నీళ్ళ పాకెట్లని స్వాధీనం చేసుకుని, ఆ పాకెట్లలో ఉన్న నీరు పరిసుభ్రముగా లేవని తెలుసుకుని వాటిని ధ్వంశం చేసేమని తెలిపేరు.

వర్షాకాలంలోనే రోజుకు సుమారు 2 లక్షల వాటర్ పాకెట్లని చెన్నై నగరంలో అమ్ముతున్నారు. అదే ఎండాకాలంలో, అంటే ఏప్రిల్ మరియూ మే నెలలో రోజుకు 3 లక్షల పాకెట్లు అమ్ముతున్నారు.

బార్లలో ఈ మంచి నీటి పాకెట్లను ఎక్కువ రేటుకు అమ్ముతున్నారట. మంచి నీరే కాకుండా మజ్జిగ మరియూ చవక రకం కూల్ డ్రింకులు కూడా ఇలాంటి ప్లాస్టిక్ పాకెట్లలో అమ్ముతున్నారట......వీటిని తయారుచేస్తున్న చిన్న చిన్న ఇళ్ళు ( కుటీర పరిశ్రమలని కూడా చెబుతున్నారు) కోంచం కూడా శుబ్రముగా లేవట. చాలా మంది అనుమతలు తీసుకోకుండానే తయారుచేస్తున్నారట. ఎన్నోసార్లు ఇలాంటి వారిని పట్టుకుని శిక్చించినా మళ్ళీ వారే ఈ పాకెట్ల తయారీలో ఈడుపడుతున్నారని, వీరే కాకుండా ఎంతోమంది వారికితగిన రీతిలో పాకెట్లు తయారుచేస్తున్నారని తెలిపేరు.

వీరిని పట్టుకోవటం అంత సులువుకాదు కనుక వీటి అమ్మకాన్ని బాన్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఇలా చేస్తే ప్రజలకు మంచి చేసినట్లే. ఎలాగంటే ఇలాంటివాటిని అమ్ముతున్న కొట్లవారిని సులభంగా కనుక్కొని వారిని అమ్మకుండా చేయవచ్హు. కార్పోరేషన్ బాన్ అమలులో ఉంటుంది కనుక వారే అమ్మడం మానేస్తారు. అలాగే ప్రతి కోట్లోనూ ఒక నోటీస్ అంటిస్తాము. కనుక ఏప్రిల్ 1 వ తారీఖునుండి వీటిని బాన్ చేయాలని అనుకుంటున్నాము అని కార్పోరేషన్ అధికారులు తెలిపేరు.

ఇది మెల్లమెల్లగా ప్రతి రాష్ట్రంలోనూ అమలుపరచాలని, అవసరమైతే కేంద్ర ప్రబుత్వమే ఈ వాటర్ పాకెట్లను బాన్ చేయాలని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేరు.

మీరేమనుకుంటున్నారు?

Sunday, March 21, 2010

డిల్లీ పాకిస్తాన్‌లోనూ, కలకత్తా సముద్రములోనూ ఉన్నాయిట......ఈస్ట్రన్ రైల్వే పటం

సుమారు నెలరోజులక్రితం మహిళా మరియూ పిల్లల అభివ్రుద్ది శాఖ వారు పత్రికలకు ఇచ్హిన ఒక సాటింపులో పాకిస్తాన్ దేశ విమాన ధళపతి మనదేశానికి చెందినట్లు, అతని బొమ్మను భారతదేశ పెద్దలతొ కలిపి ఆ సాటింపులో చూపించేరు.

ఈ సాటింపు పెద్ద ఎత్తున ధుమారం లేపింది. పోరపాటు జరిగిందని ఒక్క మాటతో ప్రబుత్వం తప్పించుకుంది. ఆ శాఖకు చెందిన మంత్రి మాత్రం క్చమాపన అడిగి, సాటింపులో పొరపాటు ఎలా జరిగిందొ, దానికి ఎవరు కారకులో కునుక్కుంటామని తెలియపరిచింది. కానీ ఇప్పటివరకు కనీసం ఆ పొరపాటుకు ఎవరు భాధ్యులో తెలుపలేదు. ఇంకేవో గొడవలు రావడంతో అప్పోషిషన్ పార్టీలు ఈ విషయాన్ని మరిచిపోయేరు.

ఇప్పుడు ఈస్ట్రన్ రైల్వే వారు. రైల్వే మినిస్టర్ మమతా బెనర్జీ గారు "మహారాజా ఎక్స్ ప్రెస్" రైలు ప్రారంభొశ్చవం సందర్భముగా పత్రికలకు ఒక సాటింపు ఇచ్హేరు. ఆ సాటింపులో భారతదేశ పటము వేసి అందులో ఆ రైలు ఎక్కడి నుండి ఎక్కడికి వెడుతుందో ఒక బొమ్మగీసి వేసేరు. ఆ బొమ్మలోని భారతదేశ పటములో మన దేశ రాజధాని డిల్లీ ని పాకిస్తాన్‌లోనూ, కలకత్తాను బే ఆఫ్ బెంగాల్ సముద్రములోనూ ఉన్నట్లు చూపించేరు.

తప్పు తెలుసుకున్నవెంటనే క్చామాపనలు అడుగుతూ, ఈస్ట్రన్ రైల్వే సాటింపులను ప్రచరనకు ఇచ్హే హక్కును, ప్రచరనలు ఇచ్హే సంస్తను రద్దు చేసేరు.

అసలు ఎందుకిలా జరుగుతోంది? ఒక నెలరోజులలో రెండు పొరపాటులా? అతి పెద్ద పొరపాట్లను చేసినవారిని కనుక్కోవడం కష్టమా? దీని వెనుక ఏదైనా కుట్ర ఉన్నదా? పరీక్చలలో విధ్యార్ధి పోరపాటుగా తప్పు చేస్తే సిక్చించే ప్రబుత్వం ఇంత పెద్ద పోరపాట్లను చేసినవారిని ఎలా సిక్చిస్తుంది? అసలు పొరపాట్లు ఎలా జరుగుతున్నాయి? దేశ పటాలు చూడగానే తెలిసిపోయే తప్పులను ఎలా చూడకుండా వదిలేసేరు? దీనికి ఎవరు బాధ్యులు? ఇంత నిర్లక్ష్యం చూపిస్తున్న ప్రబుత్వం మనకు తెలియని పొరపాట్లు ఎన్ని చేస్తున్నదో? ఈ ప్రశ్ణలకు సమధానం ఎవరు ఇవ్వగలరు.

ఇదీ ప్రస్తుతం మన ప్రబుత్వ అధికారుల వైకరి.

Saturday, March 20, 2010

ప్రజలు న్యూస్ పేపర్లు, టీవీ ల కంటే బ్లాగులమీదే ఆధారపడతారు....ఇండీ బ్లాగర్ల మీటింగ్‌లో వెళ్ళడి...మీట్ విషేషాలు,ఫొటోలు

"ఇంకా కొన్ని సంవత్సరాలలో బ్లాగులు ఒక పెద్ద మీడియాగా తయారై, ఇప్పుడున్న న్యూస్ పేపర్ల ని మరియూ టీ.వీ చెనెల్స్ ని వెనక్కితోస్తుంది. ఇది ఖచ్హితంగా జరుగుతుంది" అని నిన్న చెన్నైలో జరిగిన ఇండీ బ్లాగర్స్ మీట్లో ఒక బ్లాగర్ అన్నరు.....నిన్న జీ.ఆర్.టీ కన్వెన్షన్ హాలులో జరిగిన ఇండీ బ్లాగర్స్ మీట్ లో సుమారు 250 మంది బ్లాగర్స్ పాల్గొన్నారు. అందులో నేనూ ఒకడిని. ఈ క్రింది ఫోటో నాదే.
యూనివర్సల్ సెల్ వారు స్పాన్సార్ చేసిన ఈ మీట్ ని పత్రికా విలేఖరులు, టీ.వీ వారు కవర్ చేసేరు. వివిధ భాషలలో బ్లాగింగ్ చేస్తున్న బ్లాగర్స్ ఒకే చోట కలవటం, ఒకరి అనుభవములను మరొకరితో పంచుకోవటం...ఈ ఇండీ బ్లాగర్స్ మీట్ ని విజయవంతంచేసింది. తెలుగు బ్లాగర్స్ తరఫున నేనూ మరియూ వెదకు.కాం నడుపుతున్న శ్రీ కే.వీ. రమణగారు పాల్గొన్నాము. ఈ క్రింద ఉన్నవి మా ఇద్దరి ఫోటోలు.
మీట్ ని విజయవంతముగా జరిపిన ఇండీబ్లాగర్.ఇన్ వారికి, బ్లాగర్లను ఒకటిగా ఒకేచోట చేర్చి తమ సహాయాన్ని అందజేసిన యూనివర్సల్ సెల్ వారికి మరియూ ఈ మీట్ గురించి ఈ రోజు పేపర్లో రాసిన పత్రికల వారికీ నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు.

మీట్ లో చాలా టాపిక్స్ మీద చర్చలు జరిగినై. కొత్త బ్లాగర్స్ కు టిప్స్ అందించేరు. ఎందుకోసం బ్లాగింగ్ చేస్తునారో అందరూ వివరించేరు. మీట్ లో పాల్గొన్నవారికి విందు ఏర్పాటుచేసి, టీ షర్టులు ఇచ్హేరు....మీట్ కు సంబంధించిన మరికొన్ని ఫొటోలు.
చాలా వివరాలతో ఆనందంగా ముగిసిన ఇండీ బ్లాగర్స్ మీట్ ను 6 నెలలకు ఒకసారైనా జరపవలసినదని అందరి కోరిక.

Friday, March 19, 2010

మీ దగ్గరున్న టాలెంటును ప్రపంచానికి చూపండి....యూట్యూబ్ ద్వారా కాదు..దేశీతర ద్వారా

మీకు డాన్స్ టాలెంట్ ఉందా, పాడే టాలెంట్ ఉందా, మిమిక్రీ టాలెంట్ ఉందా, మ్యూజిక్ టాలెంట్ ఉందా లేక మరింకేదైనా టాలెంట్ ఉందా? మీరు టాలెంట్ అనుకున్నదానిని వీడియోలో చిత్రించి దేశీతర .కాం ( desitara.com ) లో ఉంచండి.....యూట్యూబ్‌లో వేయకండి. ఎందుకంటే అది ఆల్రెడీ పాపులారిటీ ఉన్నవారి ని మాత్రమే ప్రోశ్చాహిస్తోంది. కానీ ఈ దేశీతర.కాం మన దేశస్తులది, టాలెంట్ ఉన్న కొత్తవారికోసం ఈ వెబ్ సైట్ ను వెదుకుతున్నారు. కాబట్టి అలా వెదుకుతున్నవారి కళ్లకు మీరు కనబడవచ్హు. వారు మీకు చాన్స్ ఇవ్వ వచ్హు.

లండన్‌లో ఎం.బి.ఏ చదువుకున్న మన్సూర్ అనే అతను 2007 లో ఈ వెబ్ సైట్ ను మొదలుపెట్టేడు. గూగుల్ వారి బ్యాకింగ్ ఉన్న యూట్యూబ్ ద్వారా కోత్త వారు ప్రవేసించినా, అది వారికి అసలు ఉపయోగకరంగాలేదని తెలుసుకొని ఈ వెబ్ సైట్‌ని మొదలుపెట్టెడు.

ఈ వెబ్ సైట్లో తన డాన్స్ ప్రొగ్రామ్‌ని అప్లోడ్ చేసిన కైలాస్ కేర్ అనే అతనికి ఒక పెద్ద కంపనీ నుండి ప్రొగ్రాం ఇవ్వవలసినదిగా ఆఫర్ వచ్హింది. బాలీవుడ్‌లోని ఒక చిన్న డాన్సర్ కి బ్రమింగ్ హాం లో జరిగిన ఫ్రాన్స్ వారి ఫాషన్ షోకి డాన్స్ ఆడే చాన్స్ ఇచ్హేరుట. పాటలు పాడే అతనికి సినిమాలలో చాన్స్ వచ్హి, ఇప్పుడు అతను సినీ సింగర్ అయ్యాడట. యాక్టింగ్ టాలెంట్ చూపినతను ఇప్పుడు ఒక కన్నడ సినిమాలోనూ మరియూ హిందీ సినిమాలోనూ నటిస్తున్నాడట. ఇలా వీరి మూలంగా ఎంతో మంది, ఎన్నో రకలుగా చాన్స్ లు పోందేరట.

ఈ దేశీత్ర.కాం లో ప్రస్తుతం 1,20,000 మంది మెంబర్స్ గా ఉన్నారట. ఇది రోజు రోజుకూ పెరుగుతోందట. కొత్తవారికోసం వెదకటానికి ఈ వెబ్ సైటుని వెదకడానికి అమెరికా, ఇంగ్లాండ్, చైనా, జపాన్ మరియూ భారతదేశము నుండి ప్రముఖులు రావడం వలన ఈ సైటుకు 98 దేశాలనుండి 4 మిల్లియన్ల పేజ్ వ్యూలు వస్తున్నాయట. ...ఇంకొక విషయం ఏమిటంటే ఈ దేశీతర.కాం వారు ఈరోస్ ఇంటర్నేషనల్ వారితోనూ మరియూ సుభాష్ గై ఫిల్మ్ కంపనీవారితోనూ కలిసి ఎస్.లాడ్. ఎంటర్ టైన్ మెంట్ అనే కంపనీని మోదలుపెట్టి షార్ట్ ఫిలింస్ తీస్తూ కొత్తవారికి చాన్స్ ఇస్తున్నారట.

కనుక మీరుకూడా మీటాలెంట్ ని ఈ వెబ్ సైట్ మూలము గా చూపించదలుచుకుంటే ఈ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకుని మీ వీడియోను అప్ లోడ్ చేసి మీ అద్రుష్టాన్ని పరీక్చించుకోండి.

రేపు చెన్నైలో ఇండీ బ్లాగర్ల మీటింగ్

ఇండీ బ్లాగర్ వారు రేపు చెన్నైలో బ్లాగర్ల మీటింగ్ జరుపుతున్నారు. ఈ మీటింగ్ ను యూనివెర్సెల్ సెల్ వారు స్పాన్సార్ చేస్తున్నారు. జి.ఆర్.టీ కన్వెన్షన్ సెంటర్ లో మద్యాణ్ణం 2.30 కి మోదలై 6 గంటలకు ముగిస్తుంది. సుమారు 500 మందిదాక పాల్గోనవచ్హునని అంచనావేస్తున్నారు.

నేను కూడా పాల్గొంటున్నాను. మీటింగ్ విషేషాలతో, ఫొటొలతో ఆదివారం నాడు మీకు అందించే టపాతో మీకు అన్ని విషయాలూ తెలుపుతాను. చెన్నైలో ఉంటున్న తెలుగు బ్లాగర్లను రెపు కలుస్తాను అనుకుంటుంటే నాకు చాలా సంతోషముగా ఉన్నది.

Thursday, March 18, 2010

రేషన్ పేరుతో మోసం.....సుప్రీం కోర్ట్ పేనల్

"పేదవారికి తక్కువ ధరకు ఆహారపదార్ధలను అందజేయటానికి పెట్టిన పబ్లిక్ డిస్త్రిబ్యూషన్ సిస్టం లేక రేషన్ అనే పధకం లంచగొండితనం, దాచిపెట్టుకోవడం మరియూ బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడం అనే వాటి కంపుతో నిండిపోయి….ఈ పి.డి ఎస్. పధకం ఎందుకూ పనికిరాకుండా పోయింది" అని సుప్రీం కోర్ట్ పి.డి.ఎస్ పనితీరును గురించి అమర్చిన కమిటీ పేనల్ సుప్రీంకోర్టుకు సమర్పించిన రిపోర్ట్ లో తెలిపింది.
వివిధ రాష్ట్రాలలో పర్యటించి, అక్కడ పి.డి.ఎస్ లు, రేషన్ షాపులూ మరియూ న్యాయ ధరల షాపులని పర్యవేక్చించిన సుప్రీంకోర్ట్ పేనల్ అధినేత రిటైర్డ్ సుప్రీంకోర్ట్ జడ్జ్ జస్టీస్ డి.పి. వద్వా గారు సమర్పించిన రిపోర్ట్ లో ఈ విధముగా తెలిపేరు.

రాజస్తాన్‌లో ఈ పధకం అసలు పనిచేయడంలేదు. ఈ పధకం ఎందుకూ పనికిరాని పధకమని జార్కండ్ లో చూసి తెలుసుకోవచ్హు.....బీహార్ రాష్ట్రంలో 3-4 నేలలకి ఒకసారే రేషన్ ఇస్తున్నారు.....రేషన్ షాపులు నడుపుతున్నందకు ప్రబుత్వ అధికారులకు లంచం ఇవ్వాలని గుజరాత్ రాష్ట్రం వలన తెలుసుకోవచ్హు......రాజకీయనాయకుల పలుకుబడిలేనిదే రేషన్ షాపులు పెట్టుకోలేమనే విషయాన్ని ఒరిస్సా రాష్ట్రం నుండి తెలుసుకోవచ్హు......అధికారులందరూ లంచాలు తీసుకుంటున్నారని కర్నాటకా రాష్ట్రం నుండి తెలుసుకోవచ్హు....రేషన్ షాపులలో మామూలుధరలకే ఆహారపదార్ధాలని అమ్ముతున్నరని ఉత్తరాకండ్ రాష్ట్రం నుండి తెలుసుకోవచ్హు.......ఇక డిల్లి రాష్ట్ర మాటకి వస్తే అసలు అహారపదార్ధాలు పేదలకు అందవు, అందినా అతి చవుక రకం, అతి తక్కువ మోతాదులో ఇసారనేది తెలుసుకోవచ్హు. ఇక్కడున్న రేషన్ అధికారులకు ఎన్ని దొంగ రేషన్ కార్డులు ఉన్నయో ఖచ్హితంగా తెలుసు. ఈ దొంగ రేషన్ కార్డులకు రేషన్ ఇచ్హినట్లు రాసుకుని ఆ ఆహారపదార్ధాలను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు.......రేషన్ అధికారులలో లంచంతీసుకోనివారు ఎవరూ లేరనే చెప్పాలి. ఎందుకంటే ఇంత అవకతవకలు జరుగుతున్నా వారికి తెలియనట్లు నటిస్తున్నారు. ఇది నమ్మాలా?

తాము కనుగున్న కొన్ని ముఖ్య విషయములను బట్టి రేషన్ (పి.డి.ఎస్) పధకంలో పనిచేసేవారందరూ ఈ పధకం సరిగ్గా పనిచేయకపోవడానికి కారకులు అని ఆ పేనల్ పేర్కోన్నది......ఈ రిపోర్ట్ ను చదివిన సుప్రీంకోర్ట్, ఈ పి.డి.ఎస్ సిస్టానికి బదులు ఇంకే పద్దతిలోనానైనా పేదలకు ఆహారపదార్ధాలను బట్వాడా చేయవచ్హునేము తెలుపమని కమిటీ లో ఒకరైన గాన్ సాల్వే గారిని అడిగేరు.

ఇదండి మన దేశంలో పి.డి.ఎస్ నడుపుతున్న తీరు. దీన్ని ఎవరు బాగుచేస్తారో చూడాలి.

Wednesday, March 17, 2010

నోట్లతో ఓట్లు అనే సిద్దాంతమున్న దేశంలో మాయావతి మలావతిగా మారటంలో ఆశ్చర్యం లేదు...ఇంకా ఏం చెప్పేరో చదవండి

పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు ఈ డబ్బు దండ గురించి అనవసరమైన ధుమారాలు లేపుతున్నారు, వీరికి తోడు మీడియావారు. అన్ని పార్టీలూ పెద్ద ఎత్తున డొనేషన్లు తీసుకుంటున్నారు దొంగతనంగా...కానీ మాయావతిగారు అదే డొనేషన్‌ని ప్రజల మధ్య అందరికీ తెలిసేటట్లు తీసుకున్నారు. దొగంగతనంగా తీసుకోవటం తప్పా? లేక అందరికీ తెలిసేటట్లు తీసుకోవటం తప్పా?...మీరే ఆలోచించండి.

మాయావతి గారు ఒక దలిత మహిళ. ఆవిడ ఏం చేసినా మిగతా వారికి తప్పుగానే కనబడుతుంది. ఆవిడ కేకు కట్ చేసినా తప్పే, డైమెండ్స్ పెట్టుకున్నా తప్పే, విగ్రహాలు పెట్టినా తప్పే. ఐతే ఇదే పనులు మిగిలిన రాజకీయనాయకులు చేస్తే మాత్రం తప్పులేదు....ఇదేక్కడి న్యాయం?

రాజకీయ నాయకులకు ఇవ్వబడుతున్న ప్రతి బహుమతినీ ఇన్ కం టాక్స్ వారు తనిఖీ చేస్తున్నారా? చెప్పమనండి. నాయకులకు బహుమతులుగా ఇవ్వడం మరియూ డబ్బుగా ఇవ్వడం అన్ని రాజకీయ పార్టీలలోనూ జరుగుతున్నదే.

రాహుల్ గాంధీ నిన్న తిరుచ్హీ (తమిళనాడు) వచ్హినందుకు (ఒక్క రోజుకు) కేంద్ర ప్రబుత్వం ఆయన రక్షణకుగానూ ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టింది. ఎటువంటి పదవి వహించని ఆయనకు ఎందుకంత ఖర్చు. దీనిని మీడియావారు ఎత్తిచూపరేం?

బారియళ్ళి తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబీకులకు నష్ట పరిహారం ఇవ్వటానికి ఖజానలో డబ్బులేదని చెప్పిన మాయావతిగారు, సహ కుటుంబీకులను ఆదుకోవాలని, దానికి డబ్బు ఇవ్వమని పార్టీవారిని అడిగి ఇవ్వచ్హు కదా? ఎందుకు చేయలేదు....దలిత మహిళైనా ఆవిడా రాజకీయనాయకురాలే కదా.

మహాత్మా గాంధీ గారిని అవమానపరచినట్లే. ఆయన బొమ్మ వేసిన రూపాయనోట్లని మడిచి దండగా చేసుకుని వేసుకోవటం అహంకారాన్ని చూపుతోంది. డబ్బును ఎందుకోసం వాడాలో అందుకోసమే వాడాలి. ఇలా అలంకరనాలకి వాడకూడదు. డబ్బును అగౌరవపరచడం రిజర్వ్ బ్యాంక్ చట్ట ప్రకారం నేరం.....భారతదేశ జెండా ఎంత పవిత్రమైనదో భారతదేశ డబ్బుకూడా అంతే పవిత్రమైనది. దీనిని అవమానించడం శిఖ్చ అర్హం.

ఒకప్పుడు లంచం తీసుకోవటానికి భయపడేవారు. దొంగచాటుగా తీసుకునేవారు. కోంత మంది రాజకీయ నాయకుల పుణ్యామాని లంచం నిర్భయంగా తీసుకోబడుతోంది. ఇప్పుడు మయావతి పుణ్యామా అని పూల దండలు పోయి డబ్బు దండలు వచ్హేయి. బీహార్ ఎం.పీ ఇజాజ్ ఆలీ కి రూపాయ్ నోట్లతో ( సుమారు లక్ష రూపాయలున్నాయట) దండ తయారు చేసి ఉంచేరు ( బహుస వేసే ఉంటారు).

మరి మీరేం చెప్పదలుచుకున్నారు?

యోగా గురు బాబా రాందేవ్ రాజకీయ పార్టీ మోదలపెడతారట.....ఈయన రాజకీయాలలో రాణించగలరా?

బారతదేశ రాజకీయ పరిస్తితి గురించి తరచూ మాట్లాడే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యోగా గురు బాబా రాందేవ్ "భారత్ స్వాభిమాన్" అనే పేరుతో రాజకీయా పార్టీని స్తాపించి 2014 లో జరగబోయే లోక్ శభ ఎన్నికలలో మోత్తమున్న 545 సీట్లకీ పోటీ చేస్తామని తెలిపేరు.

"రాజకీయాన్ని కూడా పవిత్రం చేయాలి. ఈది నా 20 సంవత్సరముల కల. ఇప్పుడున్న అన్నీ రాజకీయ పార్టీలలోనూ నిజాయతీ పరులు ఉన్నారు. కానీ వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. ప్రస్తుతం రాజకీయాలలో ఉంటున్న అవినీతినీ, లంచగొండి తనాన్ని ఏరిపారేయాలంటే దానికి కల్మషంలేని, సంఘంలో గౌరవం ఉన్నవారిని వెతికి వారిని ఎన్నికలలొ నిలబెడతాను. అలాంటివారే ఇప్పుడున్న అవినీతిని ఎదుర్కోగలరు. నా అంచనా ప్రకారం ఇప్పుడు 300 లక్షల కోట్ల రూపాయల నల్ల ధనం విదేశీయలలో ఉన్నది. భారదేశం పురోగతి సాధించిందని చెబుతున్నారు. ఎక్కడ సాధించేరు? రొట్టెలూ-పప్పులూ లో పురొగతి సాధించాలి. ఏది? స్వాతంత్రం వచ్హి ఇన్నేళ్ళైనా ఎక్కడచూసినా నిరక్ష రాస్యత, ఆకలి. 40 మిల్లియన్ల ప్రజలు రోజూ తిండి తినకుండానే నిద్రపోతున్నారు. ఎంతకాలం ఇది కోనసాగుతుంది. దీనిని జయంచి భారతదేశాన్ని ముందుకు తీసుకువెడతాను" అని చెప్పేరు.

ఈయనకి ముందు దియోరహా బాబా, దీరేంద్ర బ్రమ్మచారీ మరియూ చంద్రస్వామీ రాజకీయ ప్రవేశములో ఎంతొకోంత విజయం సాధించేరనే చెప్పాలి.

మరి బాబా రాందేవ్ రానించగలరా? ఆయన అనుకున్నది సాధించగలరా?

Tuesday, March 16, 2010

జబ్బులను నయం చేసే మొబైల్ రింగ్ టోన్స్ ఉన్నాయంటే నమ్ముతారా?

జపాన్ వారు నమ్ముతున్నారు. రక రకాల జబ్బులకు విధ విధమైన రింగ్ టోన్స్ వాడుకుని వారు జబ్బులను నయం చేసుకుంటున్నారట. ఆస్చర్యముగా ఉన్నదికదా? కానీ ఇది నిజం.

"తెరాప్యూటిక్స్ రింగ్ టోన్స్" అన్న పేరుతో వస్తున్న రింగ్ టోన్స్ ని డౌన్లోడ్ చేసుకుని తమ నిత్య జీవితాలని ఉపయోగకరంగ కూడా చేసుకుంటున్నారట. ఈ రింగ్ టోన్స్ నిద్రలేమి జబ్బు దగ్గరనుండి అవయవాల అభివ్రుద్ది వరకు ఉపయోగించుకోవచ్హుట.

'ది జపాన్ రింగ్ టోన్ లాబరటరీ' వారు జబ్బులను నయంచేస్తాయని 27 రకాల రింగ్ టోన్స్ ని తయారుచేసేరట. ఈ రింగ్ టోన్స్ వాడితే జబ్బులు నయమవడమే కాకుండా జీవితం ఉల్లాసంగా ఉంటుందట. ఈ రింగ్ టోన్స్ ని ఒక ఇండెక్స్ గా చేసి, మొబైల్ సర్వీస్ కంపనీవారికి అందజేసేరట.

జపాన్ దేశములో 'హే ఫీవర్’ (Hay Fever) అనే వ్యాధి ఎక్కువగా ఉండేది. ఈ వ్యాధితో చాలా మంది బాధపడేవారు. ఈ మధ్య ఈ వ్యాధిని నయంచేసే రింగ్ టోన్ రావడం, దానిని వాడడం తో, ఆ వ్యాధి చాలావరకు తగ్గిపోయిందట. దీనితో ఈ రింగ్ టోన్లకు వ్యాధులను తగ్గించే శక్తి ఉన్నదని నమ్ముతూ తమకు కావలసిన రింగ్ టోన్‌ని డౌన్ లోడ్ చేసుకుని వాడు కుంటున్నారట. ప్రస్తుతం 'హన్నా సుక్కిరీ మెలోడీ' అనే రింగ్ టోన్ ఎక్కువ వాడకంలో ఉందట. చర్మ వ్యాదుల దగ్గరనుండి సాదారన తల నోప్పివరకు నయంచేసే రింగ్ టోన్స్ ఉన్నాయట.

ఇందులో చాలా నిజం ఉన్నదనిపిస్తోంది. సంగీతాన్ని ఒక మందుగా అంగీకరించేరు. సంగీతం చాలా జబ్బులని నయం చేస్తుందని చెబుతారు. మ్యూజికల్ తెరాపీ ని ఒక మెడికల్ సైన్స్ గా ఎప్పుడో గుర్తించేరు. కానీ దానిని ఇలా రింగ్ టోన్స్ గా వాడుకుని జబ్బులను నయంచేసుకోవచ్హని జపాన్ వారు నమ్ముతున్నారు...వాడుతున్నారు......జబ్బులు నయమైనాయని చెబుతున్నారు.

మనం కూడా మెడిసినల్ ఎఫ్ఫెక్ట్స్ ఉన్న ఇలాంటి రింగ్ టోన్స్ ని తయారు చేసుకు ని ఉపయోగించుకుంటే ఎంత బాగుంటుంది.

బ్రతికున్నవారికి విగ్రహాలు పెడితే తప్పా? ...అని అడిగిన మాయావతికి రూ.1000 నోట్లతో తయారుచేసిన దండ?!!!

బి.ఎస్.పి పార్టీని 25 సంవత్సరాల క్రితం ప్రారంభించిన కన్ షీ రాం గారి పూట్టిన రోజు వేడుక సందర్భముగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మయావతీ ఏర్పాటుచేసిన బహిరంగ సమావేసములో ఆమెకు, ఆమె పార్టీ వారు కర్ణాటకా నుండి విషేషముగా తయారుచేసి తెప్పించిన ఒక పెద్ద దండను ఆమెకు వేసేరు.

మోదట్లో అందరూ దానిని ఒక పూలమాలగా అనుకున్నారు. కానీ, దూరమునుండి తన కెమేరాను జూం చేసిన ఒక పత్రికా విలేఖరికి అది పూల దండగా కాకుండా డబ్బుల దండగా కనిపించింది. వెంటనే ఆ విలేకరి తన కెమేరాను మరింత జూంచేసి చూస్తే ఆ దండ మొత్తం రూ.1000 నోట్లతో తయారుచేసినట్లు తెలుసుకున్నాడు. ఆ దండలో సుమారు 50,000 వెయ్యి రూపాయల నోట్లు ఉండవచ్హని అంచనా వేసేడు. కానీ వేదికపై ఆమెకు ఆ దండ వేసినవారు, ఆ దండను చూసినవారు ఎటువంటీ ఆశ్చర్యాన్ని వెలిబుచ్హకుండా ఏమీ తెలియనట్లు నిలుచున్నారట.

ఈ విషయం బయటకు తెలియడంతో ఏం జరగబోతుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఆ బహిరంగ శభలో తన విగ్రహం పెట్టే విషయం గురించి మాట్లాడుతూ "బ్రతికున్న రాజకీయనాయకులకు విగ్రహాలు పెట్టకూడదని ఏదైనా చట్టం ఉన్నదా? చనిపోయిన నాయకులకే విగ్రహాలు పెట్టాలని, అలాంటి వారి విగ్రహాలకే ప్రబుత్వం డబ్బు ఖర్చు చేయాలనీ ఎక్కడైనా చట్టంలో రాసుందా? జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ మరియూ రాజీవ్ గాంధీ లకు ఎక్కడపడితే అక్కడ విగ్రాహాలు పెట్టి, వారి పేర్లతో కోన్నివేల పధకాలూ, కాలేజీలు, విశ్వవిధ్యాలయాలూ, విమానాశ్రయాలూ, రైల్వే స్టేషన్లూ, రోడ్లూ ఎన్నొ కోట్లు ఖర్చు పెట్టి తెరవలేదా? 63 సంవత్సరాల కాంగ్రెస్సు పరిపాలనలో గాంధీ-నెహ్రూ ల పేరుతో కోట్ల ఖర్చుతో ఎన్నో మెమోరియల్స్ మరియూ మ్యూజియంస్ తెరవలేదా? మేము కన్ షీ రాంగారి విగ్రహాలూ, మెమూరియల్స్ కడితే మాత్రం రాష్ట్ర డబ్బును వ్రుధా చేస్తున్నామంటున్నారు.....ఇదెక్కడి న్యాయం" అని అడిగేరు.

"125 సంవత్సారల ఉనికి ఉన్న కాంగ్రెస్సు తన 21 సంవత్సరములలొ ఈ రాష్ట్రానికి చేయలేనిది మేము 25 సంవత్సరాల చరిత్రలొనే చేసేము....అది వారు భరించలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా మాకు ప్రజలలో చెడ్డపేరు తెప్పించాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు" అని అమే కాంగ్రెస్సును తప్పుపట్టింది.

ఈ బహిరంగ శభకు సుమారు 5 లక్షల మంది వచ్హి ఉంటారని అంచనా వేయబడింది.

Monday, March 15, 2010

ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు……… టైటానిక్ సినిమాని 3డీలోకి మార్చి తీస్తే.....మీరు మల్లి చూస్తారా?

వికృతి నామ సంవత్సరాది శుభాకాంక్షలు

3 డీలో అవతార్ సినిమాని తీసి విపరీతమైన ప్రసిద్ది తేచ్హుకున్న ఆ సినిమా డైరెక్టర్ జేంస్ కోమరూన్ తాను తీసి, డైరెక్ట్ చేసి, ప్రసీద్ది డబ్బు తెచ్హిపెట్టిన టైటానిక్ సినిమాని 3 డీలోకి మార్చి మల్లీ రిలీజ్ చేస్తానని తెలిపేరు. ఆస్కార్ బిరుదులు తీసుకున్న ఈ డైరెక్టర్ మొదట ఈ విషయానీ హాస్యానికి చెప్పినా...అవతార్ సినిమా 3 డీకి తీసుకువచ్హిన పాపులారిటీ, ఆయనకు ప్రొష్చాహం తెప్పించి ఆయన హాస్యంగా చెప్పిన దానిని నిజం చేయడానికి ప్రెరేపించింది.

ఆయన ఇప్పుడు టైటానిక్ సినిమాను 3 డీలో మార్చి మల్లీ రిలీజ్ చెయటానికి పూనుకున్నారు. అయితే, 3 డీలో వచ్హే టైటానిక్ సినిమా 2012 లో రిలీజ్ చేస్తారట. ఎందుకంటే, నిజమైన టైటానిక్ ఓడ మునిగి అప్పటికి 100 సంవత్సరములు అవుతుందట. యూ.ఎస్.ఏ. టుడే అనే పత్రిక ఈ విషయాన్ని తెలిపింది.

అలాగే కోన్ని మార్పులతో అవతార్ 3 డీ సినిమాని ఈ సంవత్సరం ఆఖరులో మల్లీ రిలీజ్ చేయలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనికి కారణం, ఇంకా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు వారి లాభాలు రావలసి ఉంది. ఇంకా ఈ సినిమాకు క్రేజ్ ఉన్నది కనుక, కొత్తగా కొన్ని సంభవాలను జతచేర్చి, ఇంకా కన్నులకు విందుగా రూపొందించి రిలీజ్ చేయాలని ఉన్నదని ఆయన చెప్పేరు.

మరి మీరు టైటానిక్ సినిమా 3 డీలో వచ్హింది కదా అని మల్లీ చూస్తారా? ఎందుకు అడుగుతున్నాంటే 3 డీ విషయం తప్ప ఆ సినిమాలో ఇంకేమీ మార్పులు ఉండవు. ఈ సినిమాను, సినిమా హాల్స్ లోనే చాలాసార్లు చూసిన వారు ఉన్నారు. అంతేకాక సీడీలు తెచ్హుకుని చూసేరు. ప్రతి టీ.వీ చేనెల్ లోనూ ఈ సినిమా అన్ని రకాల భాషలలోకి డబ్బింగ్ చేసి ప్రసారం చేయబడింది. అందుకని అడుగుతున్నా.

భారతదేశంలో ఆంగ్ల భాష కు రెండవ స్థానము.....మీరు ఈ భాషకు ఏ స్థానం ఇస్తారు?

హిందీ భాషను మినహాయిస్తే ఎక్కువమంది భారతీయులు ఇతర భాషలకంటే ఆంగ్ల భాషనే ఎక్కువగా మాట్లాడుతున్నారట. వెస్ట్రన్ యూరోపియన్ దేశాలలోని ప్రజలకంటే కూడా భారతదేశ ప్రజలే ఎక్కువగా ఆంగ్లభాషను మాట్లాడుతున్నారట. అంతకంటే ముఖ్యంగా గమనించవలసినది ఏమిటంటే ఇంగ్లాండు దేశంలోని సగం జనాభా భారతీయ ఆంగ్లాన్నే మాట్లాడుతున్నారట.

మన దేశం ఈ మధ్య విడుదలచేసిన 2001 కి సంబంధించిన రెండూ భాషలు మరియూ మూడు భాషలు మాట్లాడేవారి లెక్కలు తీస్తే ఈ విషయం తెలిసిందట.భారతదేశంలోని ప్రజలు ఎన్ని భాషలు మాట్లాడగలోరు లెక్కతీస్తే, 255 మిల్లియన్ల ప్రజలు రెండు భాషలూ, 87.5 మిల్లియన్ల ప్రజలు మూడూ మరియూ అంతకంటే ఎక్కువ భాషలూ మాట్లాడుతున్నారని తెలిసింది. దీనినిబట్టి చూస్తే 25 శాతం కంటే ఎక్కువ ప్రజలు ఒక భాషకంటే ఎక్కువ భాషలు మాట్లాడుతున్నారని తెలుసుకున్నారు .

సెన్సస్ తీసిన సమయములో 2.3 లక్షలమంది ఆంగ్లభాషను మోదటి భాషగా చెబితే, 86 మిల్లియన్ల ప్రజలు దానిని రెండవ భాషగానూ, 39 మిల్లియన్ ప్రజలు దానిని మూడవభాషగానూ ఉపయోగిస్తున్నట్లు చెప్పేరట.

అప్పుడు ఒకే ఒక భాషను ఎక్కువమంది మాట్లాడేవారట. అదే హిందీ భాష. 551.4 మిల్లియన్ల ప్రజలు హిందీ భాషను మాట్లాడేవారట. ఇందులో 422 మిల్లియన్ల ప్రజలు ఆ భాషను మోదటి భాషగా చెప్పేరుట. 98.2 మిల్లియన్ల ప్రజలు రెండవ భాషగానూ, 31.2 మిల్లియన్ల ప్రజలు మూడవభాషగానూ తెలిపెరట.......ఆంగ్ల భాషను మాట్లాడేవారి సంఖ్య ఎకువవటంతో, అప్పుడు బెంగాలీ భాషను ఎక్కువమంది మోదటి భాషగా ఉపయోగించినా, అది మూడవ స్థానానికి తోయబడింది. ఇప్పుడు బెంగాలీ భాషను మోదటి భాషగానూ, రెండవ భాషగానూ మరియూ మూడవ భాషగానూ మాట్లాడుతున్నవారి సంఖ్య మొత్తం 91.1 మిల్లియన్ ప్రజలగా ఉండటం, ఆ భాష ఆంగ్ల భాషకు చాలా దూర స్థానంలో ఉన్నది.

85 మిల్లియన్ల ప్రజలు మాట్లాడే తెలుగు భాష, 84.2 మిల్లియన్ల ప్రజలు మాట్లాడే మరాఠీ భాషలు బెంగాలీ భాష యొక్క తరువాతి స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆ తరువాతి స్థానాలలో 66.7 మిల్లియన్ల ప్రజలతో తమిళ భాష, 59 మిల్లియన్ల ప్రజలతో ఉర్దూ భాష లు ఉన్నాయి.....గుజరాతీ భాషను మొదటి భాషగా మాట్లాడే వారు ఎక్కువమంది ఉన్నా ఆ భాష కన్నడ భాష మాట్లాడే ప్రజలకంటే తక్కువగా ఉన్నది. గుజరాతీ భాషను 50.3 మిల్లియన్ ప్రజలు మాట్లాడుతుంటే కన్నడ బాషను 50.8 మిల్లియన్ల ప్రజలు మాట్లాడుతున్నారు. ఓరియా భాష మాట్లాడేవారు 36.6 మిల్లియన్, మళయాళం బాష మాట్లాడేవారు 33.8 మిల్లియన్, పంజాబీ భాష మాట్లాడేవారు 31.4 మిల్లియన్, అస్సామీ భాష మాట్లాడేవారు 18.9 మిల్లియన్ ప్రజలుగా ఉన్నారు.

5 సంవత్సరముల లోపు పిల్లలను ఈ లెక్కలలో తీసుకోలేదు. కారణం వారు ఆ వయస్సులో వారి మాత్రు భాషనే ఎక్కువగా మాట్లాడుతారు కాబట్టి. అలగే మనం నగరాలలో ఉన్నవారు ఎక్కువ బాషలు మాట్లాడుతారని అనుకుంటాము. అది నిజమే గానీ, ఇప్పుడు గ్రామాలలో వారు కూడా రెండు, మూడు భాషాలలో మాట్లాడగలుగుతున్నారట. ఏక్కువమంది ఆంగ్ల భాషను రెండవ భాషగా మాట్లాడుతున్నారట.

నిజమే, నేనుకూడా ఆంగ్ల భాషను రెండవ బాషగానే మాట్లాడతాను, చెబుతాను. ఎందుకంటే, ఎక్కడికి వెళ్ళినా, అది ఉద్యోగరీత్యా కానివ్వండి లేక పర్సెనల్ గా కానివ్వండి అన్ని చోట్లా అందరూ ఆంగ్ల భాషా మాట్లాడగలుగుతున్నారు.

Sunday, March 14, 2010

రక్త పోటుని కట్టుదిట్టం చేసుకోడానికి మీరు చేయవలసిన సాధారణ మరియూ సులభమైన పనులు....PART-2

ఉప్పు బాగా తక్కువగా తినండి:.... మీ వంశ పారంపర్యంలో ఎవరికీ రక్త పోటు లేకపోవచ్హు. అయినా మీరు ఉప్పు తక్కువగా వాడటం చాలా అవసరం మరియూ చాలా ఆరొగ్యకరం. ఉప్పుకు బదులు నిమ్మ రసం, వెలుల్లి, మెంతులు లేక రుచికోసం ఇంకేదైనా వాడండి. సాధ్యమైనంతవరకు తయారు చేయబడ్డ ఆహారపదార్ధాలను తినకుండా ఉండండి. ఎందుకంటే వాటిలో ఉప్పుశాతం ఎక్కువగా ఉంటుంది. ఊరగాయ పచ్హడులు చాలావరకు తగ్గించండి. దీనికి బదులు అప్పుడే చేసుకున్న పచ్హడులు వాడండి. మీరే గనక ఒక డైరీ రాసుకుని, రోజూ ఎమేమి తిన్నారో చూసుకుంటే, మీరు ఎంత ఉప్పు తింటున్నారో మీకు తెలిసి అది మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది.

డార్క్ చాక్లెట్లు తినండి:......డార్క్ వెరైటీ చాక్లెట్లలో "ఫ్లావనాల్స్" అనే ఒక పదర్ధం ఉంది. ఇది మన రక్త నాలాలను పెద్దదిగా చేసే శక్తి కలిగినది. కాబట్టి, 70 శాతం కోకో ఉన్న చాక్లెట్స్ తినండి.

ఆల్కహాల్ హెచ్హరిక:.....కోంచంగా ఆల్కహాల్ తీసుకోవటం ఒంటికి మంచిదే....కానీ అదే ఆల్కహాల్ ఒంటికి చాలా చెడు కూడా చేస్తుంది. ఒక గ్లాసు తాగితే ఆరోగ్యం. అదే రెండు గ్లాసులు తాగితే అనారొగ్యం. కాబట్టి మీరు ఆల్కహాల్ తాగే విదానాన్ని పరిశీలించుకోండి. మీరు రెండు లేక మూడు గ్లాసులు తాగుతున్నారంటే, మీ అలవాటును తగ్గించుకోండి.

టీ వలన కలిగె లాభాలు:.....హెర్బల్ టీలు తాగితే చాలా మంచిది. ఎందుకంటే హెర్బల్ టీలలో హిబిస్కస్ అనే పదార్ధం ఉంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. మామూలు టీ మంచిది కాదు. కాఫైన్ ఉన్న టీ, తాగిన వెంటనే రక్తపోటును అదికరిస్తుంది. అందుకని హెర్బల్ టీ తాగండి లేకపోతే గ్రీన్ టీ తాగండి.

పని తక్కువ చేసుకోండి..రెస్ట్ తీసుకోండి:..... ఆఫీస్ పనుల టైములను మరీ ఎక్కువ చేసుకోకండి.. అంటే మరీ ఎక్కువసేపు పనిచేయకండి. ఎక్కువసేపు పనిచేస్తే అది మీ రక్తపోటును అదికరిస్తుంది. పనుల ఒత్తిడులు మీకు అలసట తెప్పిస్తుంది. ఆ సమయములో మంచి శాస్త్రీయ సంగీతమో, సోలో ఇన్స్ ట్రుమెంటల్ సంగీతం వినండి.

జీవితం కష్ట మైనదే, కానీ దాన్ని సుఖవంతం చేసుకోవచ్హు, చేసుకుంటే, జీవితాన్ని ఆనందంగా, ఆరొగ్యంగా గడపవచ్హు.

Saturday, March 13, 2010

రక్త పోటుని కట్టుదిట్టం చేసుకోడానికి మీరు చేయవలసిన సాధారణ మరియూ సులభమైన పనులు....PART-1

అధిక రక్త పోటు వలన చనిపోయేవారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువౌతోంది. ఈ వ్యాధి లక్షనాలు ఎక్కువగా బయటకు కనబడవు, కానీ గుండె పోటు, పక్షవాతం మరియూ కిడ్నీ ఫైల్యూర్ కి ఇది ఒక ముఖ్య కారణం. మీ బరువు తగ్గించుకుంటూ (తగినంతగా), మీ నిత్య జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ రక్త పోటుని మీరు కట్టుదిట్టంగా ఉంచుకోవచ్హు.

ఈ క్రింద చెప్పినవి మీకు ఉపయోగపడతాయి.

నడక:……...నడక ఒక మందు. నడకని సక్రమంగా వాడితే ఈ వ్యాధియే కాకుండా మరెన్నో వ్యాదులను రాకుండా చేసుకోవచ్హు. రోజూ ప్రొదున్నే (అంటే పరగడుపున) వేగంగా ఒక గంట సేపు నడిస్తే రక్తపోటు కట్టుదిట్టంగా ఉంటుంది. వేగమైన నడక వలన మీ హ్రుదయం ఎక్కువ ప్రాణ వాయువును ఉపయోగించుకుని క్రమ పద్దతిలో పనిచేస్తుంది.ఇది మీకు ఎంతో ఆరొగ్యాన్ని ఇస్తుంది. మోదట రోజుకు 15 నిమిషాల నడక తో ప్రారంభించి మెల్ల మెల్లగా ఆ నడకని గంటకు పెంచండి.

లోపలికంటా గాలి పీల్చుకోండి:.......ఒక చోట కూర్చుని నిదానంగా గాలిని లోపలికి పీల్చుకోవటం మరియూ బయటకు వదలటం చేస్తే ఇది మీ రక్తపోటుని కట్టుదిట్టం చేయడమే కాకుండా మిమ్మల్ని ఆరొగ్యవంతులుగా చేస్తుంది. 10 నిమిషములు ప్రొద్దున, 10 నిమిషములు రాత్రి చేస్తే చాలు. దీనిని ఎలా చేయాలో మీకు దగ్గరగా ఉన్న యోగా మరియూ మెడిటేషన్ నేర్పే వాల్ల దగ్గర నేర్చుకుంటే మంచిది..

పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారపదార్ధాలను తినండి:…......సోడియం (ఉప్పు) వలన మనకు జరిగే హాని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది రక్తపోటును అధికరిస్తుంది. ఈ హాని నుండి తప్పించుకోవటానికి మనం పోటాషియం ఎక్కువగల పదార్ధాలను తినాలి. పండ్లు, కూరలలో పోటాషియం ఎక్కువగా ఉంది. అలాగే మీరు ప్రతిరోజూ భోజనంలో చిలకడ దుంప, టొమేటో, అరటిపండు, వేరుశెనగ పప్పు మరియూ ఆరెంజ్ జ్యూస్ చేర్చుకోండి.

మిగతా విషయాలు........PART-2 లో

Friday, March 12, 2010

నేను చేసింది ఒక పరిశోధన....నిత్యానంద స్వామి

నిత్యానంద స్వామి మోదటిసారిగా తన రాసలీలల వీడియో గురించి మాట్లాడేరు. "ఆ వీడియోలో చూసింది ఒక పరిశొధన. అందులో అశ్లీలత లేదు, ఎందుకంటే ఆ వీడియొలో కనిపించిన ఇద్దరూ బట్టలతోనే ఉన్నారు. కాబట్టి అది చట్ట విరుద్దం కాదు. అయినా నేను ఇంకమీదట పరిశోధనలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజలు దానిని ఒప్పుకోవటంలేదు. ప్రజలు ఒప్పుకోని వాటిని నేను పరిశోధన చేయను" యూట్యూబ్ మూలముగా మూడవసారి కనబడుతూ చెప్పేరు.

“నా ఆశ్రమమూ మరియూ నేనూ ఎప్పుడూ భగవంతుని సేవలో ఉండటంతో నా మీద నా బక్తులే కుట్ర పన్నుతున్నారని తెలుసుకోలేకపోయేను. వారు ఒక పధకం ప్రకారం నామీద దాడి జరిపేరు. విడియోలో ఉన్న ఇద్దరు మనుష్యులు కూడా బట్టలతోనే ఉన్నారు. అందులో ఆడది బలవంతంగా అతని మీద పడుతోంది. ఇలా నాకు అపకీర్తి తేవాలని, నాకు ద్రోహం చేయాలని అనుకున్నవారు నా పక్కనే ఉంటారని నేను ఉహించలేదు. శంకరాచార్యుల వారికీ, వివేకానంద స్వామి వారికీ మరియూ రామక్రిష్ణ పరమహంశ లాంటి వారికే అపనిందలు వచ్హేయి.వారి ముందు నేనెంతటివాడిని" అని చెప్పేరు.

మొట్టమొదట వీడియోగురించి మాట్లాడుతూ ఆ వీడియోలో ఉన్నది తానుకాదని, అది పూర్తిగా వేరే మనుష్యులతొ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసేరని చెప్పిన నిత్యానంద స్వామి మరి ఇప్పుడు ఇల్లా మాట్లాడటానికి కారణం?

వీడియోలో కనిపించిన తమిళ నటి నాలుగురోజులక్రితం ఒక ఇంటర్ వ్యూ లో "నేను స్వామివారికి సేవలు మాత్రమే చేసేను. అది పూర్తిగా ఆయన మీదున్న భక్తితోనే. నాకు స్వామివారు చాలారోజులుగా తెలుసు. నేను ఆయన దగ్గర ఎప్పుడూ భయభక్తులతోనే ఉంటాను. ఎందుకంటే, నాకున్న అనారొగ్యం 'ఆయాసం' ను పూర్తిగా గుణ పరిచేరు. అందువలన ఆయనకు నేను సేవలు చేసేను. భోజనం వడ్డించటం, కాల్లు నొక్కటం లాంటివి చేసేను. నేను బాగా పోద్దుపోయేదాకా ఆయన ఆశ్రమములో ఉండేదాన్ని. ఇది అక్కడున్నవాల్లందరికీ తెలుసు. నాకూ నా భర్తకూ ఎటువంటి మనస్పర్దలు లేవు." అని చెప్పింది.

విడియో బయటపడిన తరువాత, ఏ రోజు బయటప్రపంచానికి వచ్హి తన మొహాన్ని చూపిస్తారో తెలియని నిత్యానందా స్వామి ఏప్రిల్ 12 న తప్పక బయటకు రావలసి వస్తుంది. ఎందుకంటే శ్రీపెరంబదూర్ న్యాయశ్తానం కే.సెల్వమని అనే న్యాయవాది నిత్యానంద స్వామి మీద పెట్టిన ఒక కేసులో, ఆ కోర్టు నిత్యానందా స్వామిని ఆ రోజు కోర్టులో హాజరు కావలసిందిగా ఉత్తరువు జారీచేసింది.

"ఈ సంఘం, జీవితం మరియూ మానవత్వం నాకు ఇంత అవమానం తెస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది నన్ను మరింత బాధ్యత గల మనిషిగా చేసింది. ఇంక మీదట సంఘానికి ఇష్టంలేని పనులను చేయను" అని నిత్యానంద స్వామి చెప్పేరు.

ఇలా చెప్పడం ఆయన తప్పు చేసినట్లు ఒప్పుకోవడమా?..........మీరే నిర్ణయించుకోండి.

ఫేషన్ పేరుతో మోసం చేసిన వారికి వేసిన శిక్చ సరిపోతుందా?

తమ చేనల్ లో ఆడవారిని అర్ద నగ్నంగా చూపించేరని ఎఫ్ టీ.వీ చేనెల్ ని 10 రోజులు "బాన్" చేస్తూ, వారి ప్రసారాలని భారతదేశమంతటా 10రోజులవరకు ప్రసారించకూడదని భారతదేశ ప్రబుత్వం ఉత్తరవు జారీ చేసింది.

ఈ చేనెల్ చూపుతున్న ప్రచారాలను తనిఖీ చేసిన మన పార్లమెంటరీ కన్సల్ టేటివ్ కమిటీ ఎఫ్ టీ.వీ భారతదేశములో చూడటానికి పనికిరాదని తెలిపింది. కానీ ఆ టీ.వీ చేనెల్ ప్రచారనలను పూర్తిగా ఎందుకు ఆపలేకపోతోందో వారికి మాత్రమే తెలుసు.

నాకు తెలిసినంతవరకు, ఆ టీ.వీ చేనెల్ ప్రొగ్రాములవలన మన ప్రజలకు ఎటువంటి ప్రయోజనమూ లేదు. ప్రజలను ఆకట్టుకునే ఉద్దేశంతో, ఫేషన్ పేరుతో, ఆడవారిని అర్ధ నగ్నంగానూ, అలంకరనలతోనూ చూపి డబ్బు చేసుకుంటున్నారు. ఇది తెలిసి, ఈ టీ.వీ చేనెల్ పనికిరాదని చెబుతూ ఆ టీ.వీ ని అనుమతిస్తున్నారంటే......!?

ఇంకోక విషయం ఏమిటంటే ఈ చేనెల్ ని "బాన్" చేయటం ఇది మూడవసారి. 2002 లో ఒక సారి వారం రోజులు "బాన్" చేసేరు. 2007లో 2 నెలలకు "బాన్" చేసేరు కానీ ఆ టీ.వీ అధికారులు క్చమాపన చెబుతూ ఇంకోసారి ఇలా జరగదని హామీ ఇచ్హిన మీదట ఆ 2 నెలల "బాన్" ని ఎత్తివేసేరు.

అయినా ఇప్పుడు మల్లి అదే తప్పు చేసేరంటే కేవలం 10 రోజుల "బాన్" శిక్చేనా వారికి విధించేది?

Thursday, March 11, 2010

ఐ.పి.ఎల్ 2010.....మోదటి సినిమా హాల్ టికెట్టును 11 లక్షలకు అమ్మేరు!!

ఐ.పి.ఎల్ 2010 క్రికెట్ పోటీలను నేరుగా చూడదలచుకున్నారా....స్టేడియానికి పోనవసరంలేదు. మీకు దగ్గరగా ఉన్న సినిమాహాలుకు వెల్లి, టికెట్టు బుక్ చేసుకుని, ఏర్ కండిషన్లో కూర్చుని చూడండి...ఎంజాయ్ చేయండి.

దీనికోసరమని ఒక కోత్త ప్రాజెక్ట్ మూలముగా దేశములోని 1000 సినిమాహాల్స్ లో ఐ.పి.ఎల్ 2010 క్రికెట్ మ్యాచ్ లని నేరుగా చూడటానికి ఏర్పాట్లు చేసేరు.

ఈ ప్రాజెక్టును విజయవంతం చేయాలని సీనియర్ క్రికెట్ వీరుడు, క్రికెట్ లో రెకార్డులు స్రుష్ట్రించిన సచిన్ టెండూల్కర్ ని ప్రచారనకర్తగా నియమించి ఆయనకు మోదటి టికెట్టును అమ్మి, ఆ టికెట్టు మీద ఆయనచేత ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు.

ఆ ఆటోగ్రాఫ్ చేసిన టికెట్టును ఒక క్రికెట్ ప్రియుడు 11 లక్షల రూపాయలకు కొనుకున్నాడు.

మార్చ్ 12 నుండి ఏప్రిల్ 25 వరకు జరగబోయే ఈ 2010 ఐ.పి.ఎల్.పోటీలు 43 రోజులు జరుగుతుంది...మొత్తం 65 పోటీలను 8 టీములు ఆడుతాయి...గెలుపు మాత్రం ఒకరిదే.

మార్చ్ 27 న "ఎర్త్ హవర్" లో పాల్గోనండి.....వాతావరణ కాలుష్యం నుండి భూమిని కాపాడండి

మీరుకూడా సంవత్సరానికి ఒక మారు జరుగబోయే "ఎర్త్ హవర్" లో పాల్గొని ప్రపంచ వాతావరణాన్ని కాలుష్యం కాకుండా ఉండటానికి మీతోటి సహాయంగా ఈ నెల అంటే మార్చ్ 27 వ తారీఖున రాత్రి 8.30 నుండి 9.30 వరకు మీ ఇల్లలోని లైట్లనూ, ఎలెక్ట్రికల్ సామగ్రిని ఆఫ్ చేయండి. మీకు తెలిసినవారికి మరియూ తెలియనివారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి వారిని కూడా ఈ వరల్డ్ వైడ్ "ఎర్త్ హవర్" లో పాల్గొనమని అడగండి.

ఈ "ఎర్త్ హవర్" అనే కార్యక్రమాన్ని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (World Wide Fund for Nature) వారు ప్రపంచములోని అన్ని నగరాలలోనూ మార్చ్ నెల చివరి శనివారం నాడు జరుపుతూ తాముకూడా భూ వాతావరణాన్ని కాలుష్యం నుండి కాపాడుతున్నామని వ్యక్తం చేస్తున్నారు.

"ఒక గంట సేపు లైట్లు ఆఫ్ చేసి .....ఆ గంట సమయంలో కాండిల్స్ వెలిగించుకుని కుటుంబీకులందరూ ఒక చోట కూర్చుని భోజనం చేస్తూ దాన్ని కాండిల్ లైట్ డిన్నర్ గా మార్చుకోండి...షాపింగ్ మాల్స్,హోటల్స్ మరియూ నగర ప్రజలను ఆ సమయములో లైట్లను ఆపవలసినదిగా కోరుతున్నాను" అని డిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్చిత్ గారు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వారు ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ అన్నారు.

"ఎర్త్ హవర్" భారతదేశపు ప్రచారకర్త అభిషేక్ బచ్హన్ గారు మాట్లాడుతూ "ఈ భూమి మీది పౌరులుగా ప్రతి ఒక్కరికీ ఈ భూమిని కాపాడుకోవలసిన భాధ్యత ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ "ఎర్త్ హవర్" లో పాల్గొని మన భూమిని కాపాడవలసినదిగా కోరుకొంటున్నాను...సినిమాలకు సంబంధించినవానిగా స్టూడియోలలోనూ, బయటనూ ఆ సమయములో షూటింగ్ ఆపవలసిందిగా అందరినీ అడుగుతాను" అన్నారు. పోయిన సంవత్సరం డిల్లీ మరియూ ముంబై నగరాలు కలిసి 1000MV కరెంటును ఆదా చేసేరట.

ఈ "ఎర్త్ హవర్" మొట్టమొదట 2007 సంవత్సరములో ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరంలో ప్రారంభించేరు. ఆ తరువాత 2008 లో 35 దేశాలలొ ప్రారంభించేరుట.2009 లో 88 దేశాలలో "ఎర్త్ హవర్" పాటించేరు. ఈ సారి, అంటే 2010 లో ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో ప్రజలు "ఎర్త్ హవర్" పాటించి, భూమిని కాపాడుకోవాలని కోరుతూ అన్ని దేశాలలొ ప్రచారనలు మోదలుపెట్టెరు.

గుర్తుంచుకోండి...మార్చ్ 27......రాత్రి 8.30 నుండి 9.30 వరకు మీ ఇల్లలో లైట్లు ఆపి మీరూ మీ వంతు సహాయం చేయండి. "ఎర్త్ హవర్" ని విజయవంతం చేయండి.

Wednesday, March 10, 2010

గర్వ పడాల్సిన సమయం......యువ భారత శాస్త్రవేత్తకు అమెరికా వారి అత్యున్నత బహుమతి

భారతదేశపు యువ కంప్యూటర్ శాస్త్రవేత్త, 'యూనిక్ గేంస్ కంజెక్చర్ ' ( Unique Games Conjecture ) లో ఖ్యాతి గాంచిన సుభాస్ కోట్ కి అమెరికావారి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వారి గౌరవనీయమైన "అలన్ టీ వాటర్ మాన్" అవార్డును అతని అత్యున్నత పరిశొధనా శక్తికి ఇవ్వబోతున్నారు. ఈ బహుమతితో పాటూ అతనికి 5,00,000 డాలర్లు కూడా ఇస్తున్నారు .

ముంబై ఐ.ఐ.టీ లో ఇంజనీరింగ్ డిగ్రీ, అమెరికాలోని ప్రిన్స్ టన్ లో డాక్టరేట్ పుచ్హుకున్న సుభాస్ కోట్ ప్రస్తుతం న్యూ యార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన చౌరంట్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెథమాటికల్ సైన్స్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

1975 లో మోదలుపెట్ట బడ్డ ఈ అవార్డ్ ఎంతో గౌరవనీయమైనదని , ఈ అవార్డును ప్రతి సంవత్సరం 36 ఏళ్లలోపు ఉండి సైన్స్ విభాగంలోగానీ, ఇంజనీరింగ్ విభాగంలోకానీ అత్యున్నత పరిశోధనా శక్తి కలిగిన వారికి మాత్రమే ఇస్తారట. ఈ అవార్డుతో పాటు ఇస్తున్న 5,00,000 డాలర్లను అతను తన పరిశోధనలకి ఉపయోగించుకోవచ్హు.

"కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ" అనే విషయములో పరిశొధనలు చేస్తున్న సుభాస్ కోట్, అమెరికావారి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వారు, న్యూ యార్క్ విశ్వవిద్యాలయముతోనూ మరియూ రుట్ జర్స్ విశ్వవిద్యాలయముతోనూ కలిసి 10 మిల్లియన్ డాలర్లతో కంప్యూటేషనల్ ఇంట్రాక్టబిలిటీ గురించి మరికోంత తెలుసుకోవటానికి చేస్తున్న పరిశోధనలో బాగస్తుడు.

"సుభాస్ కోట్ కంప్యూటర్ సెక్యూరిటీ గురించి పరిశోధన చేస్తూ, కంప్యూటేషనల్ ప్రాబ్లంస్ లో వస్తున్న అవకతవకలని ధైర్యముగా ఎదుర్కోని వాటికి నివారనలు కనుక్కోనే గొప్ప మేదస్సు కలిగిన యువ శాస్త్రవేత్త" అని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అధినేత ఆర్డెన్ ఎల్ బెమెంట్ జూనియర్, సుభాస్ కోట్ ని పొగుడుతూ మాట్లాడేరు.

"యూనీక్ గేంస్ కంజెక్చర్ ని కనుగోని, దానితో కంప్యూటెషనల్ కాంప్లెక్స్ సిటీ లో ముందడుగువేసిన కోట్ మా ఈ పరిశోధనలకు తన మేదస్సును ఉపయోగించి సహాయపడి మాకు విజయం కలిగించి అతను విజయం పోందుతాడు" అని కూడా ఆయన తెలిపేరు. మే నెల 4 వ తారీఖున జరగబోయే ఒక ఫంక్షన్లో అతనికి ఈ బహుమతి అందజేయబడుతుంది.

సుభాస్ కోట్ కి నా జోహార్లు.

అశ్లీల వెబ్ సైట్లకు .XXX అనే ప్రత్యేక గుర్తు.....ఆలోచనలు కొనసాగుతున్నాయి

ప్రపంచములొ ఇంటెర్నెట్ వాడకం సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అలాగే అశ్లీలతను చూపించే వెబ్ సైట్ల సంఖ్య కూడా పెరిగిపోతోంది. కొంతమంది తెలిసి, అలాంటి వెబ్ సైట్ లను చూస్తున్నారు. మరికోందరూ తెలియక ఆ వెబ్ సైట్లను ఓపెన్ చేస్తున్నారు. వయస్సులో ఉన్న పిల్లలు తల్లితండ్రులకు తెలియకుండా ఈ వెబ్ సైట్లని చూస్తున్నారని, అలా చూసి చెడిపోతున్నారని చాలామంది పెద్దలు వాపోతూ, అలాంటి వెబ్ సైట్లని ప్రచరించరాదని ఆందోలనలు చేస్తున్నారు. కోన్ని దేశాలు ఇటువంటి వెబ్ సైట్లని బంద్ చేయవలసినదిగా పెద్ద పెద్ద వెబ్ ప్రచురిత సంస్తలను ఒత్తిడిచేస్తున్నాయి. కొన్నిదేశాలు అలాంటి వెబ్ సైట్లను చూసేవారిని ఖైదు చేసి శిక్చిస్తున్నాయి.

ఎన్నిచేసినా ఈ వెబ్ సైట్లని అపడం కష్టముగా ఉన్నది. అందుకని అధికారులు ఇలాంటి వెబ్ సైట్లకు ప్రత్యేక గుర్తులు ఇవ్వాలని ( సినిమాలకి “ఏ” సర్టిఫికేట్ ఎలా ఇస్తున్నారో ), ఈ వెబ్ సైట్ లను చూసినవెంటనే అడెల్ట్ సైట్లుగా తెలిపే విధముగా ప్రత్యేక గుర్తు ఇవ్వదలచుకుని మోదట అటువంటి సైట్ల పేరుకి .XXX అని ఇవ్వదలచుకున్నారు. అంటె .కాం లేక .నెట్ బదులు.

ఐతే అమెరికాలోని కన్ సర్వేటివ్ గ్రూప్ వారు తీవ్ర నిరసన వ్యక్తం చేయటంతో వెనకకు తగ్గిన అధికారులు మళ్లీ ఆలోచనలు ప్రారంభించేరు.

కానీ ఇంటెర్ నెట్ ని పరిపాలిస్తూ, పరిసీలిస్తున్న ఇంటెర్ నెట్ కార్పోరేషన్ ఫర్ అస్సైండ్ నేంస్ అండ్ నెంబర్స్ అధికారులు మరు పరిసీలన చేసి అశ్లీల వెబ్ సైట్లకు ప్రత్యేక గుర్తులు ఇవ్వాలని నిర్నయించుకుని, వారి కమిటీని మల్లి ఈ నెల 12 వ తారీఖున సమావేస పరిచేరు.

"అశ్లీల వెబ్ సైట్లకు ప్రత్యేక గుర్తుగా .XXX ని ఖాయం చేస్తామని, అదేవిదంగా ఆ సైట్లకు పేర్లు నిర్నయిస్తామని, అప్పుడు ఆలాంటి సైట్లని చూడదలుచుకున్నవారు ఆ గుర్తును బట్టి చూడవచ్చు, చూడకూడదనుకునేవారు ఆ గుర్తును చూసి మానుకోవచ్హు. అలాగే బంద్ చేయాలనుకునేవారు ఆ గుర్తు గల వెబ్ సైట్లని ఫిల్టర్ చేసుకోవచ్హు" అని ఐ.సి.ఎం రిజిస్ట్రీ చైర్మాన్ స్టూవర్ట్ లాలే తెలిపేరు.

ఇప్పుడు కోర్టులలో ఉన్న పెండింగ్ కేసులు ముగించటానికి 320 సంవత్సరాలు పడుతుందట

ఇప్పుడు ప్రస్తుతం భారతదేశములో పెండింగ్‌లో ఉన్న 31.28 మిల్లియన్ కేసులు ముగించటానికి కనీసం 320 సంవత్సరాలు పడుతుందని ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ జెడ్జ్ జస్టీస్ వి.వి.రావ్ గారు తెలిపేరు.

"ఇప్పుడున్న పెండింగ్ కేసులనిచూస్తే భారతదేశంలోని ప్రతి జెడ్జీకి సుమారు 2,147 కేసులు సరాసరిగి ఉన్నట్లు...ఇన్ని కేసులుండటం ఒక జెడ్జీకి భారమే నని ఆయన 'ఈ గవెర్నెన్స్ ఇన్ జ్యూడీసరీ' లో మట్లాడుతూ చెప్పేరు.

17,641 జడ్జీలు ఉండవలసిన మనదేశంలో ఇప్పుడు 14,576 జడ్జీలే ఉన్నారు. దీన్ని లెక్కకడితే ఒక మిల్లియన్ జనాభాకి 10.5 జడ్జీలు ఉన్నట్లు అవుతున్నారు. 2002 లో అపెక్స్ కోర్ట్ ఒక మిల్లియన్ జనాభాకి 50 జడ్జీలు ఉండాలని తెలిపింది. ఇలా ఒక మిల్లియన్ జనాభాకి 50 జడ్జీల్కు అనే లెక్క 2030 సంవత్సరములోపు సరిచేయబడ్డా, ఆ నాటికి మనదేశ జనాభా 1.5 లేక 1.7 బిల్లియన్లు అవుతుంది. అప్పుడు జడ్జీల సంఖ్య కూడా 1.25 లఖ్చలుగా పెరుగుతూ కనీసం 300 మిల్లియన్ కేసులు చూడవలసి వస్తుంది" అన్నారు.

ఈ మధ్య జరిపిన ఒక సర్వేలో కేసులు పెరగడానికి కారణం జనాభాలో పెరుగుతున్న చదువులూ, అవగాహనే నని చెప్పబడింది. ఉదాహరణగా కేరళా రాష్ట్రాన్ని చూపుతూ 1000 మందికి 28 కోత్త కేసులు పెరిగినట్లు, అదే బీహార్ రాష్ట్రములో చదువులు, అవగాహన తక్కువగా ఉన్నందున కేవలం 3 కొత్త కేసులే పెరిగినై అని తెలుపుతూ, జ్యూడీసరీలో ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీని వాడితే అది జ్యూడీసరీ వారికి సహయపడి కేసులని త్వరగా ముగించటానికి ఉపయోగపడుతుందని తెలిపేరు.

Tuesday, March 9, 2010

80 శాతం మహిళలు ఉద్యోగాలకంటే కుటుంబాలకే ప్రాధన్యత ఇస్తున్నారు.....ఒక సర్వే

ఈ నాటి మహిళలు కుటుంబాలకంటే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని రంగాలలోనూ చొచ్హుకునిపోతూ తమకు ఇష్టమైన, నచ్హిన ఉద్యోగాలనూ చేస్తూ, ఆర్ధీకంగా విముక్తి చెందుతూ, తమ ఆధిక్యతను చూపుతున్నారని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ మధ్య జరిపిన ఒక సర్వేలోని వివరాలు చూస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుందనే చెప్పాలి.

ఈ సంఘంలోని ఒక మనిషిగా మనం మహిళలను రెండువిధాల మెచ్హుకుంటూ, వారు చేస్తున్న సేవలను హర్షిస్తూ మన ఇంట్లోని మహిళలుకూడా అన్ని రంగాలలోనూ ముందడుగు వేస్తున్నారని మన భుజాలని మనమే తట్టుకుంటూ "సభాష్" అనుకుంటున్నాము. వారు ఇంటిపనులలోనూ, ఉద్యోగాలలోనూ ముందడుగువేస్తున్నారని గర్వపడుతున్నాము. కానీ మెడ్రాస్ మెనేజ్ మెంట్ అసోషియేషన్ వారు సెరిబ్రస్ కన్సెల్ టెంట్స్ తో కలిసి జరిపిన ఒక సర్వేలోని వివరాలు మనల్ని నిజాలు తిలకించవలసిందిగా చెబుతోంది.

మనసుకు త్రుప్తి కలిగించే ఉద్యోగం చేస్తున్నా, 80 శాతం మహిళలు ఉద్యోగాలకంటే తమ కుటుంబం, తమ పిల్లలకే మోదటి ప్రాధన్యత ఇస్తున్నారు. 75 శాతం మహిళలు, తమ పిల్లలు ఎంత పెద్దవారైనా వారిని స్వయంగా చూసుకోటానికే ఆశపడుతున్నారు. 45 ఏళ్ళున్న మహిళలో ఈ శాతం కొంత తగ్గుతోంది.

ఇంటి పనులు, ఉద్యోగపనుల మధ్య న్యాయం చేయడానికి ఎంతో స్రమ పడవలసివస్తోందని ఇప్పటి మహిళలుకూడా చెబుతున్నారు. 27 శాతం మహిళలు మాత్రమే ఇంటిపనులకంటే ఉద్యోగానికే ప్రాధన్యత ఇస్తున్నారు. మిగిలినవారు ఇంటిపనులలో ఎక్కువసేపు శ్రద్ద వహించలేకపోతున్నామే ననే బాధ ను వ్యక్తం చేసేరని సర్వేలో తెలిసింది.

సగానికి పైగా మహిళలు తమ ఉద్యోగానికి సంభందించిన పనులను ఇళ్లకు తీసుకువచ్హి చేస్తున్నారట. అటు ఉద్యోగ పనులతోనూ, ఇటు ఇంటిపనులతోనూ సతమతమౌతున్నా 45 శాతం మహిళలు తమ కుటుంబంకోసం వెచ్హించే సమయం తమకు త్రుప్తినిస్తోందని చెప్పేరు.
మహిళలు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వారికి చాలా స్వాతంత్రం వచ్హిందని చాలామంది అనుకుంటున్నారు. అటువంటివారికి ఈ సర్వేలోని విషయాలు ఆశ్చర్యం కలిగించవచ్హు. 60 శాతం మహిళలు తమ చదువు, శక్తిసామర్ధ్యాలూ వ్రుధా అవకూడదనే ఉద్దేశంతోనే ఉద్యోగాలు చేస్తున్నారట. కుటుంబ ఆర్ధీక పరిస్తితులను మెరుగు పరచాలనే ఉద్దేశంతోనే చేసేవారు 40 శాతంగానూ, తమ సోంత ఆర్ధీక విముక్తికోసమే ఉద్యోగం చేస్తున్నామని 25 శాతం మహిళలు చెబితే ఒక 10 శాతం మహిళలు మాత్రం ఉద్యోగంచేయడానికి మాత్రమే ఇష్టపడుతున్నామని తెలిపేరు.....ఉద్యోగాలలో ముందుకు వెళ్ళాలంటే కుటుంబ శభ్యుల సహాయం కావలసి ఉందని కోందరుచెబితే, మరికోందరు ఉద్యోగాలకోసం కుటుంబాలనే త్యాగం చేయవలసివస్తోందని చెప్పేరు.

నెలకి రూ.50,000/- జీతం సంపాదిస్తున్న మహిళలోకూడా కుటుంబానికే ఎక్కువ ప్రాధన్యత ఇస్తున్నారని సర్వేలో తెలిసింది.

Monday, March 8, 2010

ఆస్కార్‌లో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గెలుచుకున్న మొట్ట మోదటి మహిళ......"అవతార్" సినిమా డైరెక్టర్ జేంస్ కోమరూన్ మాజీ భార్య

కాంగ్రెస్స్ ప్రబుత్వం 'ఇంటెర్నేషనల్ ఉమెన్స్ డే' అయిన నిన్నటి రోజున పార్లమెంట్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే బిల్లును ప్రవేశపెట్టి, దానికి పార్లమెంట్ ఉభయ శభలలొ ఏకిభవంగా ఆమోదం పోంది, ఆ బిల్లును మహిళలకు 'ఇంటెర్నేషనల్ ఉమెన్స్ డే' కానుకగా అందించాలని ఆశపడి, కలలుగని ఆ బిల్లును ప్రవేశపెట్టింది. ఎవరు ఓటువేసినా వేయకపోయినా బిల్లు గెలుస్తుందని తెలుసుకున్న కోంతమంది రాజకీయ నాయకులూ, ప్రముఖులు పార్లమెంట్ ఉభయ శభలలొ గందరగొలం స్రుష్టించి, శభలను అవమానపరిచి, బిల్లును ప్రవేశపెట్టనీయకుండా చేసి యావత్ భారతదేశన్ని తలదించుకునేలాచేసేరు.

కానీ నిన్న ఆస్కార్ బిరుదుల 82 సంవత్సరముల చరిత్రలోనూ, ప్రపంచ సినీ చరిత్రలోనూ మొట్టమోదటిసారిగా బెస్ట్ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్న మోదటి మహిల కాతరీన్ బిగెలో 'ఇంటెర్నేషనల్ ఉమెన్స్ డే' కి గౌరవం తెచ్హిందనే చెప్పాలి.

ఈమే ఎవరో కాదు.....500 మిల్లియన్ డాలర్ల ఖర్చుతో "అవతార్" సినిమా ను తీసి, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ నిర్మాత, బెస్ట్ సినిమా కేటగిరీల ఆస్కార్ బిరుదులకు పోటీ పడ్డ డైరెక్టర్ జేంస్ కెమరూన్ మాజీ భార్య....ఈమే అతి తక్కువ ఖర్చుతో తీసి, డైరెక్ట్ చేసిన 'ది హార్ట్ లా కర్ ' సినిమాకు తెచ్హుకున్న అవార్డ్.

ఈ సినిమా ఇరాక్ మరియూ ఆఫ్ గనిస్తాన్ దేశాలలొ పోరాడుతున్న అమెరికన్ సైనికుల గురించి తీసిన సినిమా. ఈ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ బెస్ట్ సినిమా మరియూ బెస్ట్ స్క్రీన్ ప్లే తో సహా మొత్తం ఆరు అవార్డులు వచ్హినై.

ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడండి
ఎంతో ఆశగా, ఆశక్తిగా ఎదురుచూసిన "అవతార్" సినిమాకి 3 ఆస్కార్ అవార్డులు మాత్రమే రావడం చాలామందిని ఆశ్చర్యపరిచినా హాలీవుడ్ సినీ ప్రపంచ ప్రముఖులు ఎదురుచూసినట్లే ఆస్కార్ అవార్డులు 'ది హార్ట్ లా కర్ ' కే వచ్హినై.

అవార్డు తీసుకుంటూ "ఈ సినిమాని ఇరాక్ లోనూ, ఆఫ్ ఘనిస్తాన్ లోనూ తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడుతున్న అమెరికన్ మహిలా మరియూ మొగ సైనికులలు అంకితంచేస్తున్నాను" అని ఆనందబాష్పాలతో తెలిపింది ఆస్కార్ బెస్ట్ డైరెక్టర్ అవార్డుగ్రహీత కాత్రీన్ బిగెలో .

పట్టుబడ్డ దెయ్యాలను అమ్మకానికి పెట్టేడు!?

ఇది చాలా వింతగా ఉంది కదా? ఇంతకుముందు మనం విఠలాచార్యాగారి సినిమాలలొ దెయ్యాలనూ, భూతాలనూ జాడిలలోనో, బాటిల్లలోనో పట్టి పెట్టినట్లు చూసేము. కానీ న్యూజీలాండ్ కు చెందిన ఒకతను నిజంగానే ఆ పనిచేసినట్లు చెబుతున్నాడు.

తమ ఇంట్లో వారిని చాలా భయపెట్టిన రెండు దేయ్యాలను మంత్ర శక్తులతో కట్టేసి, అ రెండు దేయ్యాలను, అమ్మకానికి వేలం పాటలు పెట్టి అమ్మకాలు జరిపే ట్రేడ్ మీ. కో.ఎంజెడ్ ( trademe.co.nz) అనే వెబ్ సైట్లో ప్రకటనమూలంగా అమ్మకానికి పెట్టేడు.

న్యూజీలాండ్‌లోని క్రైస్ట్ చెర్చ్ కి చెందిన మెల్విన్ అనే అతను ఈ అమ్మకాన్ని పెట్టేడు. “ఈ రెండు దెయ్యాలూ నా ఇంట్లో నానా ఆందోలన చేసేవి. ఒక మాంత్రీకుని సహాయముతో ఈ రెండు దేయ్యాలనూ పట్టి మంత్రించిన నీళ్ళు గల చిన్న బాటిల్లలో పట్టి ఉంచేము. ఈ రెండు దెయ్యాలలో ఒక దెయ్యం ఒక ముసలి మనిషికి చెందినది, రెండవది, ఒక చిన్న వయస్సు ఆడపిల్లది....ఈ రెండు దేయ్యాలు మా ఇంట్లో నానా రభస చేసేవి. మేము లైట్లు వేస్తే అవి అపేవి, మేము ఆఫ్ చేస్తే అవి వేసేవి, మా ఎలెక్ట్రిక్ స్టవ్ ను వెలిగించేవి, మా కుక్కను విపరీతంగా బయపెట్టేవి మరియూ ఇంకా ఎన్నో భయపెట్టే కార్యాలను చేసేవి. మేము ఒక మంత్రీకుడిని పిలిపించి, ఆ దెయ్యాల గురించి, వాటి పనుల గురించి అతనికి చెప్పేము. అతను వాటిని పట్టుకుంటానని చెప్పి రెండు బాటిల్లలో తెల్లటి మంత్రించిన నీరును నింపి, తన మంత్ర శక్తితో వాటిని పట్టుకుని, ఆ మంత్రించిన తెల్లటి నీరుగల బాటిల్స్ లో ఆ రెండు దెయ్యాలనూ బంధించేడు. ఆ రోజు నుంచి, అంటే జూలై 15, 2009 నుండి మాకు వాటి బెడద తప్పింది. ఇల్లంతా ప్రసాంతంగా ఉంది. ఆ బాటిల్స్ లోని తెల్లటి నీరు నీలి రంగుకు మారింది. కాబట్టి ఆ దెయ్యాలు ఆ బాటిల్స్ లో ఉన్నాయని నమ్ముతున్నాను”.

డి డైలీ టెలిగ్రాఫ్ ఆన్ లైన్ పత్రిక (The Daily Telegraph online Magazine) ఈ విషయాన్ని అతను తన ప్రకటనలో పేర్కోన్నాడని తెలిపింది. ఇప్పటిదాకా ఈ ప్రకటనను 70,000 మంది చూసేరుట. అమ్మకపు పాట 1500 న్యూజీలాండ్ డాలర్ల దాకా వచ్హిందట. ఇంకా ఎక్కువ డబ్బు తెస్తుందని అతను నమ్ముతున్నాడట.

Saturday, March 6, 2010

భారతీయులు సుమారు 140 బిల్లియన్ డాలర్ల బ్లాక్ మనీ విదేశాలలొ ఉంచేరుట......బయటకు తేగలరా?

"పన్ను కట్టవలసి వస్తుందని, దోంగ లెక్కలు జూపించి, ప్రబుత్వాన్ని మోసంచేసి లెక్కలకు రాని డబ్బును మన దేశస్తులు కోందరు విదేశలలో ఆ డబ్బును ( బ్లాక్ మనీ ) దాచుకున్నారు. ఆ డబ్బును మన దేశానికి తీసుకురావటానికి నా సాయశక్తులా ప్రయత్నిసాను" అని ఉభయ శభలలొ మాట్లాడుతూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు తెలిపేరు.

బి.జె.పి లీడర్ అద్వానీగారు ఈ విషయం గురించి మన ఆర్ధీక మంత్రి ప్రనాబ్ ముఖర్జీగారికి రాసిన లేకకు సమాధానంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇలా చెప్పేరు.

“20 దేశాలతో మనదేశం ఈ విషయం గురించి అగ్రీమెంట్లు వేసుకుంది. వారు మనకి అన్ని వివరాలూ ఇస్తూ వారి దేశంలో వేస్తున్న డబ్బుకు సంబంధించిన పన్ను వసూల్ల గురించి తెలుపుతారు. బహమాస్ మరియూ బెర్మూడా దేశాలతోకూడా ఈ విషయము గురించి చర్చలు జరుపుతున్నాము” అని చెప్పేరు.

“మనదేశం మిగిలిన దేశాలతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయములో ఖచితముగా ఉండాలని ఆ గ్రూప్‌లో జేరింది. భారతదేశం ఈ విషయములో అన్ని దేశాలతో కలిసి పనిచేస్తూ పన్నులు ఎగగొట్టేవారిని వెదకి పట్టుకుని అందరికీ తెలుపుతుంది. ఈ విషయముగా స్విజర్లాండ్ దేశంతో తిరిగి చర్చలు మోదలుపెట్టేము. వారికి మన దేశ పన్ను తీరుల గురించి వివరిస్తున్నాము. కనుక, వారి దగ్గరనుండి స్పెసిఫిక్ కేసులలో మనకి వివరాలు తెలుస్తాయి” అని చెప్పేరు.

బి.జె.పి, ప్రబుత్వం దగ్గరనుండి వైట్ పేపర్ అడిగేరు. అధికారపూర్వ డెటా లేదు. కానీ, భారతదేశానికి చెందినవారి బ్లాక్ మనీ విదేశాలలో సుమారు 140 బిల్లియన్ డాలర్ల దాకా ఉండవచ్హునని అంచనా వేసేరు.

ఈ బ్లాక్ మనీని మన రాజకీయనాయకులు బయటకు తేగలరా? విదేశాలలొ ఉన్న డబ్బుకు పన్నులు వసూల్లు చెయగలరా?

రాజధాని హైదరబాదులో మత్తు పదార్ధాలు అమ్మకం జోరుగా సాగుతోందట!!!

హైదరాబద్ నగరంలో మత్తుపదార్ధలు తేలికగా దోరుకుతున్నాయని, ఈ మత్తు పదార్ధాలకు యువతీ యువకులు బానిసలవుతున్నారని ఒక పత్రికలో వచ్హిన సమాచరం మనసును పిండేసింది. పత్రికల వారు వివరాలతో రాస్తున్నారంటే అది నగర పోలిసు యంత్రాంగానికి తెలియకుండా ఉంటుందా? ఎవరి చేతులమీదగా జరుగుతున్నదో తెలియటంలేదుగానీ, పోలీసు యంత్రాంగం ఈ మత్తు పదార్ధాల అమ్మక్కాన్ని అపలేకపోతోందంటే అందరిలో పలుకుబడి ఉన్నవారే చేస్తూ ఉండుంటారు.

సినిమా నిర్మాత కె.వెంకటెశ్వర రావ్ మరియూ మరో ముగ్గురినీ "ఏఫిడ్రిన్" అమ్ముతున్నారని ఆ మధ్య అరెస్ట్ చేస్తే, టాలీవూడ్ ప్రపంచం మీద కన్నేసేరు పోలీసులు. కానీ ఆ పత్రికలో టాలీవూడ్ లో వారే కాకుండా బాగా డబ్బున్నవారు కూడా "కోకైన్" వాడుతున్నారని, ఈ మత్తు మందు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్,కె.బి.ఆర్ పార్క్ మరియూ పెద్ద పెద్ద మాల్స్ లో తేలికగా దొరుకుతున్నాయని తెలిపింది.
సినిమా ఫీల్డ్ లో వారే కాకుండా, కార్పోరేట్ హాస్పిటల్ లో పనిచేస్తున్నా కొంతమంది డాక్టర్లు, కాలేజీ యువకులు, యువతులూ మరియూ 18-19 వయస్సు విధ్యార్ధులూ వాడుతున్నారట. ఈ మత్తు మందుకు అలవాటు పడిన కోందరు నగరంలోని నైట్ క్లబ్బులలో బ్యాగులు, మోబైల్ ఫొనులు దొంగతనం చేసి వాటిని అమ్మి ఈ మత్తు పదార్ధాన్ని కోనుక్కుంటున్నారట. కోంతమంది స్కూల్ విధ్యార్దులు కార్లలో వచ్హి, పబ్‌లలో కార్లు ఉంచి ఎవరికీ కనబడకుండా వాడుతున్నారట. బేగం పేట లో ఉన్న కొన్ని మాల్స్ కి సంభందించిన కార్ పార్కింగ్ లోకి వెడితే ఈ మత్తుమందు వాసన ఎవరికైనా తెలుస్తుందట.

ఎన్ని కట్టుదిట్టాలు చేసినా, ఎంత కఠినమైన రూల్స్ తీసుకువచ్హినా, ఎంత నిఘాలు పెంచినా ఈ మత్తుమందు వ్యాపారాన్ని ఆపడం చాలా కష్టం. ఎందుకంటే డబ్బుకోసం కక్కుర్తి పడే వారు ఈ సంఘంలో కొ కొల్లలమంది ఉన్నారు. అందుకని మనం జాగ్రత్తపడటం ఎంతైనా అవసరం. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవటం మన ధర్మం గనుక, వారికి స్వాతంత్రం ఇస్తున్నామనే పేరుతో వారిని పట్టించుకోకుండా వదిలేయకండి. వారిని ఒక కంట కనిపెడుతూనే ఉండడి. ఈ మత్తు పదార్ధాలకి అలవాటుపడినవారిని మామూలు పరిస్తితులకు తీసుకురావడం చాలా కష్టం.

ప్రబుత్వ అధికారులకూ, పోలీసు యంత్రాంగానికి ఒక మనవి. ఈ మత్తు పదార్ధాలని అమ్మే వారిని పట్టుకోండి, కఠినంగా శిక్చించండి, ప్రజలని, ముఖ్యముగా యువతీయువకులని కాపాడండి. ఈ మత్తు పదార్ధానికి అలవాటుపడి బానిసయ్యేవారిలో మీకు బాగా కావలసినవారో, మీ దగ్గరి బంధువులో లేక మీ సొంత వారో కూడా వుండవచ్హు. ఈ సమాజాన్ని సంఘవిద్రోహ శక్తుల దగ్గరనుండి కాపాడండి.

Thursday, March 4, 2010

2000 సంవత్సరములో హ్రుదయ వ్యాధుల వలన భారతదేశంలో 9.2 మిల్లియన్ల మానవ సంవత్సరాలు వ్రుధా అయినాయట!!

"2000 సంవత్సరములో హ్రుదయ వ్యాధుల వలన భారతదేశము సుమారు 9.2 మిల్లియన్ల భాగ్యవంతమైన మరియూ అభివ్రుద్ది గడించవలసిన సంవత్సరాలని పోగొట్టుకుంది. ఈ వ్యాధి ప్రబుత్వానికి ఒక సవాలుగా ఉన్నది" హార్ట్ సర్జన్స్ కాన్ ఫెరన్స్ లో మాట్లాడుతూ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు తెలిపేరు.

35 సంవత్సరముల నుండి 64 సంవత్సరముల లోపు వారికి హ్రుదయానికి సంభంధించిన వ్యాధులు రావడం, ఆ వ్యాధి వలన చాలామంది చనిపోవటంతో మన దేశం ఎంతో నష్టపోయింది..... ఒక పౌరుడు తన రిటైర్మెంట్ వయస్సులోపు చనిపోతే, ఆ పౌరుడు చనిపోయిన నాటి వయస్సునుండి అతను రిటైర్ అయ్యే వయస్సుదాకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో ఆ సంవత్సరాలని మానవ సంవత్సరాలుగా లెక్క కడతారు. ( అదే పౌరుడు ఆరొగ్యముగా తన రిటైర్మెంట్ వయస్సువరకు ఉంటే అది అతని కుటుంబానికీ, దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కదా? కానీ హ్రుదయానికి సంబంధించిన వ్యాధుల వలన చాలామంది తమ పూర్తి జీవితాన్ని అనుభవించకుండా మధ్యలోనే చనిపోతున్నారు) దీనికి ముఖ్య కారణం మనిషి తన ఆరొగ్యముపట్ల శ్రద్ద వహించకపోవటమే.

హ్రుధయ వ్యాధుల గురించి, వాటివలన ఏర్పడే కీడుల గురించి ప్రజలు తెలుసుకునేటట్లు చేయడమేకాకుండా హ్రుదయాన్ని ఎలా కాపాడుకోవాలో, దానికి ఏమి చేయాలో కూడా వారికి తెలపాలి. ఆప్పుడు ప్రతి మనిషీ తన పూర్తి జీవితాన్ని అనుభవిస్తాడు. అది అతనికి, అతని కుటుంభానికీ మరియూ దేశానికీ ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

2000 సంవత్సరములో మనదేశం 9.2 మిల్లియన్ల మానవ సంవత్సరాలని పోగొట్టుకుంది. చైనా వారు 6.6 మిల్లియన్ల మానవ సంవత్సరాలని, అమేరికా వారు 1.6 మిల్లియన సంవత్సరాలనీ పోగొట్టుకున్నారట. .......2030 వ సంవత్సరములో భారతదేశం 17.9 మిల్లియన్ల మానవ సంవత్సరాలనీ, చైనా వారు 10.4 మిల్లియన్ల మానవ సంవత్సరాలనీ, అమేరికావారు 1.9 మిల్లియన్ల సంవత్సరాలని పోగొట్టుకుంటారని అంచనా వేసేరు. కాబట్టి రాబోవు కాలంలో హ్రుధయానికి సంబంధించిన వ్యాధులకు అత్యున్నతమైన చికిశ్చ ఇవ్వాలని, దానికి డాక్టర్లు ప్రయత్నం చెయాలని కోరేరు.

కాన్ ఫెరన్స్ లో మాట్లాడిన డాక్టర్లు, ఈ వ్యాధిని రాకుండా చేసుకుంటేనే అందరికీ మంచిది. వచ్హిన తరువాత ఎంత అత్యున్నత చికిశ్చ ఇచ్హినా ఆ వ్యాధి వచ్హినవారు శ్రమకు గురౌతారు కాబట్టి ఆ వ్యాధిని రాకుండా చూసుకోవడమే అతిమంచి లక్షణమని తెలిపేరు.

30 సంవత్సరములు దాటిని ప్రతి ఒక్కరూ డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుని, హ్రుదయానికి సంబందించిన వ్యాదులు రాకుండా ఉండేందుకు ఏం చేయాలో అడిగి తెలుసుకుని, డాక్టర్ చెప్పినవిధముగా నడుచుకోవాలని తెలిపేరు.

చేపల వర్షం........ఎప్పుడైనా విన్నారా? చూసేరా?

ఆస్ట్రేలియాలోని నార్తెరెన్ టెరిటెరీలో ఉన్న లజామన్ గ్రామ ప్రజలు ఆశ్చర్యం మరియూ భయం నుండి ఇంకా తేరుకోలేదట. కారణం, వారి గ్రామములో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంలో తెల్లటి రంగులో ఉన్న చిన్న చిన్న చేపలు వందలకోద్ది పడటమే. అందులో చాలావరకు ఇంకా బ్రతికే ఉన్నాయట.

గత 30 సంవత్సరాలలో ఈ గ్రామములో ఇలా చేపల వర్షం కురవటం ఇది 3 వ సారిట. 1974 లో ఒక సారి, 2004 లో ఒక సారి ఇలాంటి చేపల వర్షమే కురిసి ఆ గ్రామాన్ని కుదుపిపారేసిందట.

పెనుగాలులతో కురిసిన వర్షంలో, పెనుగాలులు బహుస ఈ చేపలని ఆ గాల్పులు ఎక్కడినుండో తీసుకువచ్హి ఈ గ్రామంలో పడేసుంటుందని ఆస్ట్రేలియా వాతావరన నిపుణులు చెబుతున్నారు. కానీ అక్కడి ప్రజలు ఇది నమ్మటంలేదు. ఎందుకంటే ఈ గ్రామం ఒక ఎడారి ప్రాంతంలో చాలా లోపల ఉన్నది. ఈ గ్రామానికి దగ్గర అని చెప్పుకోవటానికి ఈ గ్రామానికి సుమారు 660 కిలోమీటర్ల దూరంలో ఒక నది మాత్రమే ఉన్నదిట. అందుకే ఆ గ్రామ ప్రజలు భయంతోనూ, ఆశ్చర్యంతోనూ ఉంటున్నారు.

ఇది చాలా వింత సంభవం...శాస్త్రవేత్తలు వివరించలేని సంఘటన.

2008 సంవత్సరములో మనదేశంలోని కేరళా రాష్ట్రంలోని ఒక గ్రామములో ఇలాంటి చేపల వర్షమే కురిసింది. ఆ గ్రామ ప్రజలు ఆ చేపలను పట్టి వండుకుతిన్నారట. దీని గురించి అప్పుడు నేను నా ఆంగ్ల బ్లాగ్ లో ప్రపంచానికి తెలియపరిచేను. చాలామంది తమ ఆశ్చర్యాన్ని వెలిబుచ్హేరు. కోందరు ఇలాంటివి విన్నామని తెలిపేరు. కానీ ఎవరూ చూసినట్లు తెలుపలేదు......నేనుకూడా విన్నానుగాని చూడలేదు. కేరళాలో ఇలాంటి వర్షం పడిందని దినపత్రికలో వార్త వస్తే చదివి ఆశ్చర్య పోయేను. మల్లీ ఇదిగో ఇప్పుడు ఆస్ట్రేలియాలో పడిందని వార్త వస్తే మరింత ఆశ్చర్యపోయేను. ప్రక్రుతి మనకు ఎన్నో ఆశ్చర్యాలను ఇస్తుందని, మరోసారి నిరూపించిందని అనుకున్నాను.

మంచు గడ్డల వర్షం పడటం గూడా నేను భారతదేశంలో (నేనున్నచోట) చూడలేదు. కానీ, పోయిన ఏడాది నేను అమేరికా వెళ్లినప్పుడు అక్కడ చూసేను.

మీలో చాలామంది మంచుగడ్డల వర్షం చూసే ఉంటారు. అలాంటి వర్షం పడటం ఒక సహజమైన ప్రక్రుతి లక్షనం అని చెప్పవచ్హు. కానీ ఇలా చేపల వర్షం.....!?........మీరు ఇలాంటి విచిత్ర వర్షాల గురుంచి ఇంతకుముందు విన్నారా? చూసేరా?......మీరు ఎలాంటి విచిత్ర అనుభవాలని విని ఉన్నా.....చూసున్నా మాతో పంచుకోండి.

Wednesday, March 3, 2010

ఆనందమైన వివాహబంధానికి ఖచ్హితమైన లెక్క ఉన్నది....శాస్త్రవేత్తలు

ఆనందమైన వివాహబంధానికి, అంటే భార్యాభర్తలు జీవితాంతం కలిసి జీవించటానికి ఒక ఖచ్హితమైన లెక్క ఉన్నదని, దీన్ని పాటిస్తే భార్యాభర్తల మధ్య కలతలు రాకుండా జీవితాన్ని సుఖంగానూ, ఆనందంగానూ గడపవచ్హునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వారు చెప్పిన లెక్కలు ఇలా ఉన్నాయి.

1) భార్య, భర్త కన్నా 5 సంవత్సరములు చిన్నదిగా ఉండాలి.

2) భార్య, భర్తకు చెందిన ఆచారాలలోనే పుట్టినదిగా లేక పెరిగినదిగా ఉండాలి (భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ఆచారానికి చెందిన వారుగా ఉండాలి).

3) భార్య, భర్తకంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉండాలి.

ఎవరైనా సరే పై 3 లెక్కలనూ సరిచూసుకుని పెళ్ళి చేసుకుంటే, వారి దాంపత్యజీవితం ఆనందమయమౌతుందట.....జెనీవా స్కూల్ ఆఫ్ బిజినెస్ వారు జరిపిన ఒక సర్వేలో, శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా పెళ్ళి చేసుకున్న వారిలో చాలామంది భార్యాభర్తలు సుఖజీవితాలు అనుభవిస్తున్నారని పేర్కొన్నది.....ఈ లెక్కల ప్రకారం పెళ్ళి చేసుకుంటే ఆ జంట ఆనందమైన వివాహ జీవితాన్ని గడపవచ్హునని చెప్పటానికి ఎడిన్ బర్గ్ రాజూ, రానీ దంపతులే ఒక ఉదాహరణ గా తెలిపింది.

ఆచార తేడాలే భార్యాభర్తల మధ్య చర్చలకు, కలతలకు ముఖ్య కారణం. ఈ ఆచారతేడాలని ఏ దంపతులూ బయటపెట్టరు. పుట్తిన దగ్గరనుండి ఒకే ఆచారంలో పెరిగినవారు, ఇంకో ఆచరంలో ఇమడలేరు. ఇది వారి మనసుని వేధిస్తూనే ఉంటుంది. ఈ వేధనే భార్యాభర్తల మధ్య ఏర్పడే చిన్న చిన్న కలతలనూ, చర్చలనూ పెద్దది చేస్తుంది. ఇది వారి మధ్య వేరుబటును ఏర్పరుస్తూ చివరికి వారిరువురినే వేరుచేస్తుంది.

ఈ రోజు ఎంతోమంది భార్యాభర్తలు ఏవో కారణాలు చెప్పి విడాకులు తీసుకుని తాము ఆనందముగా గడపవలసిన వైవాహిక జీవితాన్ని వదులుకుంటున్నారు. కానీ వారు చెప్పే కారణాలు నిజమైన కారణాలు కావు. వారిరువురి మధ్య ఉన్న ఆచార తేడాలే నిజమైన కారణాలని, ఇవే వారిరువురి మధ్య ఏర్పడ్డ మిగిలిన చర్చలకు కారణమని పేర్కోన్నది.

నిత్యానంద స్వామి రాసలీలల గురించి ఈ పాటికి తెలుసుకోనుంటారు.....మరి భీమానంద స్వామి గురించి తెలుసుకున్నారా?

నిత్యానంద స్వామి రాసలీలల వీడియోతో దక్షిణ భారతదేశం అట్టుడికిపోతోంది. మోసపోయేమే ననే బాధ చాలామందిని వేధించుకు తింటోంది. ఈ దొంగ స్వామి గురించి, ఈయనకున్న మహిమల గురించి సన్నిహితులతో, స్నేహితులతో మరియూ బంధువులతో గొప్పగా చెప్పుకున్నవారు సిగ్గుతో తల దించుకున్నారు.

నిత్యానంద స్వామి రాసలీలల వీడియో మీరంతా చూసేఉంటారు. 'చీ' అనిపించే ఆ వీడియోను చూడకూడదని, చూడవద్దని కోరుకుంటున్నాను. కానీ ఈ వీడియోలోని కోంత భాగాన్ని చూస్తే చాలు మరోసారి ఎవరూ "స్వామీ" అని చెప్పుకునేవారిని నమ్మరని, "స్వామీ" అని చెప్పుకుని ప్రజలను మోసగించాలనుకునేవారు కూడా భయపడతారని నమ్ముతూ అందుకుమాత్రమే ఆ వీడియోని ఇక్కడ ప్రచురిస్తున్నాను.
ఇకపోతే భీమానంద స్వామి గురించి తెలుసుకోండి....ఈ స్వామిని శుక్రవారమ్నాడు డిల్లీ పోలీసులు 6 గురి ఆడవారితో ఉన్నప్పుడు ఖైదు చేసేరు.

ఉత్తరప్రదేశ్‌లోని చాం రౌహో గ్రామస్తులు ఈ స్వామిని ఒక దేవునిగా కోలుస్తూ వచ్హేరు. ఈ స్వామి అరెస్ట్ అవడం, అందులోనూ అతను ఒక సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని తెలుసుకున్నతరువాత ఆ గ్రామస్తులు షాక్ కు లోనైనారు. స్వామిని నమ్మినవారంతా ముక్కున వేలేసుకున్నారు.
ఈ దొంగ స్వామిని అరెస్టు చేసినప్పుడు ఆయనతో 6 గురు ఆడవారు ( అందులో ఇద్దరు ఏర్ హోస్టెస్సులుట) ఉన్నారు. ఈ దొంగ స్వామి ఆడవారితో వ్యాపారం చేయడమేకాకుండా వారిని విదేశీయులకు అమ్మి డబ్బుతోపాటు తుపాకులు తీసుకుంటాడట......ఈ 39 సంవత్సరాల దొంగ స్వామి అసలుపేరు సివ్ మురాట్. ఇతన్ని 1997 లో ఒక సారి అరెస్టు చేసేరుట. ఇతన్నేకాదు, ఇతని కుటుంబీకులందరినీ పలు నేరాలక్రింద అరెస్టు చేసేరుట. ఎలాగో తప్పించుకున్న ఇతను తన పేరు మార్చుకుని, తన గురించి, తనకున్న దైవీక శక్తుల గురించి పత్రికలలోనూ, సీ.డీ లు గానూ వేసుకుని ప్రజలలొ పలుకుబడి సంపాదించుకున్నాడు. తను చేసే సంఘవిద్రోహ చర్యల నుండి తప్పించుకోవటానికి పేదవారికి కొన్ని సేవలు చేస్తూ ఉంటాడుట.

ఈ దొంగ స్వామి రాబోవు ఏప్రిల్ నెల 25 వ తారీఖున "సత్ చండి యాగం" చేయబోతున్నట్టు, ఆ యాగంలో పేరుగల వ్యాపారస్తులూ, రాజకీయనాయకులూ,ఐ.ఏ.ఎస్ మరియూ ఐ.పి.ఎస్ అధికారులు కలుసుకోబోతునట్లు తెలిపేరు.

భక్తితో గుడికి వెళ్ళండి, నమస్కారం చేసుకోండి. అంతేకానీ స్వామీజీ అని చెప్పుకునే ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మకండి.

Tuesday, March 2, 2010

ఉస్మానియా విశ్వవిద్యాలయములో మావోయిష్టులు ఉన్నారు.....ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం

పారా మిలట్ర్రి సిబ్బందిని ఉస్మానియా విద్యాలయములో ఉంచవలసిన కారణం తెలుపవలసినదిగా సుప్రీం కోర్ట్ రాష్ట్ర ప్రబుత్వాన్ని అడిగిన విషయం అందరికీ తెలిసిందే.

మవోయిష్టులు విద్యాలయంలోకి జోరబడి, విద్యాలయ వసతిగ్రుహములో ఉంటూ తెలంగాణా పోరాటానికి విధ్యార్ధులను ప్రోత్సాహిస్తున్నారనడానికి కావలసిన రుజువుని ఆంద్రప్రదేశ్ ప్రబుత్వం అపెక్స్ కోర్ట్ లో లిఖితపూర్వముగా తెలిపింది.

ప్రత్యేక తెలంగాణా పోరాటం కోసం ఉస్మానియా విధ్యార్ధి సంఘాలు ఏర్పరచుకున్న జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నవారిలో చాలామంది ఉస్మానియా విద్యాలయ హాస్టల్ కు చెందినవారుకారు. సంఘ విద్రోహ శక్తులు, నిషేధించబడ్డ సంఘాలవారూ మరియూ వారి కూటమివారూ, అంటే మావోయిష్టులు విధ్యార్ధుల పోరాటాలలోకి జొరబడటమే కాకుండా వారి పోరాటాన్ని తీవ్రపరచడమెలగో ననే విషయములో విధ్యార్ధుల జాయింట్ యాక్షన్ కమిటీకి సలహాలు ఇస్తున్నారు. ఈమేరకు పోలీసులకు ముఖ్యమైన అంతర్గత మరియూ ఖచ్హితమైన రుజువులు దొరికేయని ప్రబుత్వం తెలిపింది.

విద్యాలయములో ఉన్న వేర్వేరు కట్టడాలని, పోరాటాన్ని ఏ దిశగా తీసుకుపోవలోననే చర్చా శభల వేదికలుగా వాడుకుంటున్నారు......పోరాటం జరుగుతున్న తీరు, దాని ఉద్రిక్తత తీరు, హింసాత్మక తీరుకు కారణం సంఘవిద్రొహ శక్తులు, నిషేధించబడ్డ సంఘాలూ అంటే మావోయిష్టులు, వారికి సానుభూతి చూపించేవారేనని పోలీసులకు ఖచితమైన సమాచారం అందినదని ప్రబుత్వం తెలిపింది.

తెలంగాణా పోరాటాలలో ప్రతిసారీ కనబడుతున్న హింసాత్మక వైఖరి విధ్యార్ధులు పోరాడుతున్న విధములోకూడా కనబడటం ఖచ్హితముగా పోరటాలలో మవోయిష్టుల ప్రభావము ఉన్నదని తెలియపరుస్తోంది.....ఈ పోరాటానికి మద్దత్తు ఇస్తున్నానని మావోయిష్టు లీడర్ కిషెన్ జీ తెలియజేయడాన్ని 2009 నవెంబర్ నెల 29 వ తారీఖున ఒక టీ.వీ చేనల్ ప్రకటించిది ప్రబుత్వం తెలిపింది.

ఒక ప్రక్క విధ్యార్ధులను కాపాడటానికీ మరో ప్రక్క పోరాటం హింసాత్మకంగా మారకుండా ఉండటానికీ పారా మిలెట్రీని ఉస్మానియా విద్యాలయంలో ఉంచేమని ప్రబుత్వం తెలిపింది.

ప్రజలను సంతోషపరిచే బడ్జెట్ల కంటే, ప్రజలను కాపాడగలిగే, ఉపయోగపడే బడ్జెట్లే వేయాలి.....ప్రధాన మంత్రి

పెట్రోల్, డీసెల్ ధరలను తగ్గించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారిని పత్రికా విలేకరులు అడిగినప్పుడు "పెంచిన పెట్రొలియం ధరలను తగ్గించే మార్గమేలేదు, అలాంటప్పుడు ధరలను తగ్గించటానికి ఆలోచనలు ఎలావస్తాయి? ప్రజలను ద్రవ్యోల్భణం నుండి కాపాడాలనుకుంటే ప్రజలను సంతోషపెట్టే బడ్జెట్ల కంటే వారికి ఉపయోగపడే బడ్జెట్లనే మనం తయారుచేయాలి" అని ఆయన సమాధానం చెప్పేరు.

ధరలు కోంతమంది మనసులని కష్టపెడుతుంది...కానీ వారిని సంతోషపెట్టలనే ఉద్దేశంతో రాయతీలను పెంచుకుంటూపోతే, ఏదో ఒక రోజు, ఆ రాయతీలవలన ఇటు ప్రబుత్వానికీ ఆటు పెట్రోలియం కంపెనీలకూ విపరీత నష్టం కలుగుతుంది. ఈ నష్టం ఆ కంపెనీలను పనిచేయలేకుండా చేస్తుంది. అప్పుడు ప్రజలకు భారీ నష్టం ఏర్పడుతుంది. దీనివలన పెట్టుబడుదార్లు నష్టపోతారు. చివరికి పెట్టుబడుదార్లు రావాటానికే భయపడతారు. దీనివలన మనం ఉన్న ఉద్యోగాలను కోల్పోవటమే కాకుండా కోత్త ఉద్యోగవకాసాలను ఏర్పరిచే అవకాశాలనే పోగొట్టుకుంటాము. దీనివలన మనం చివరికి మన దేశ అభివ్రుద్దికి, ప్రజా సంక్చేమాలకు వేసే పధకాలను నెరవేర్చలేకుండా పోతాము. కాబట్టి ప్రబుత్వం ఇరువైపులా సరిపోయే బడ్జెట్‌నే వేయాలి అని చెప్పేరు.

"పెట్రోలియం ధరల పెరుగుదలవలన హోల్ సేల్ ఇండెక్స్ 0.4 శాతం కంటే పెరగదు. ఇది ధరలను పెంచుతుంది. నేను కాదనటంలేదు. కానీ గోదుమ, పంచదార, నూనె గింజలూ మరియూ పప్పుల పంటల ఉత్పత్తి ఈ సారి బాగా పెరుగుతోంది కాబట్టి ధరలు ఖచితముగా తగ్గుతాయని నేను నమ్ముతున్నాను" అన్నారు.

ప్రజలను తమ పార్టీలవైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఎన్నో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజలను సంతోష పరచటానికి ఎన్నో పధకాలను వేసి, ఉచిత పధకాలను రూపోందిస్తూ, ఎప్పుడూ తమ పార్టీయే పరిపాలనా రంగంలో ఉండాలని ఎదురుచూసి బడ్జెట్లు వేస్తారు, ప్రజలకు తీయటి మాటలు చెబుతారు. ఇప్పుడు అప్పోషిషన్లో కూర్చున్న పార్టీవారు రాష్ట్రాలనీ మరియూ కేంద్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు ధరలు పెంచలేదా? ..కానీ, మన ప్రస్తుత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నది ఉన్నట్లు చెప్పటం ఆయన నిజాయతీని నిరూపిస్తూండటమే కాకుండా ప్రజలకు నిజం చెబుతున్నారని నమ్ముతున్నాను.

కానీ అప్పోషిషన్ పార్టీ వారు లోక్ శభ లోనూ మరియూ రాష్ట్ర శాసన శభల్లోనూ చేస్తున్న ఒత్తిడులనూ, వాకౌట్లనూ ఆపడానికి బహుస పెట్రొల్ మరియూ డీసల్ ధరలను కోంచంగా తగ్గించవచ్హునని భావిస్తున్నాను.

Monday, March 1, 2010

పసిబిడ్డను ఓక ఊర కుక్క నోటకరుచుకుపోయింది .....ఈ ఘోరానికి కారకులైనవారిని ఎలా దండించాలి?

రూ.500/- లంచం కోసం, ఈ ప్రపంచాన్ని చూడటానికి అప్పుడే పుట్టిన బిడ్డను, ఒక వీధి కుక్కకు ఎరగా చేసేరు ఆస్పత్రి పనివారు. ఇది అనకాపల్లిలోని ఒక హాస్పిటల్‌కు ప్రసవానికని వచ్హిన ఒక తల్లికి జరిగిన అన్యాయం.

అనకాపల్లికి చెందిన ఒకామెను పోయిన నెల 6 వ తారీఖున ప్రసవానికి చేర్చుకున్నారు ఆస్పత్రివారు. ఆ రోజు అర్ధరాత్రి సుమారు 2 గంటలకు సిసేరియన్ ఆపరేషన్ మూలముగా ఆమె పండంటి మొగ శిశువును ప్రసవించింది. ఆమెకు మొగ బిడ్డ పుట్టిన సంగతి కూడా తెలుపకుండా ఆమెను ఆపరేషన్ తియేటర్లోనుండి మామూలు వార్డ్ కు ఆస్పత్రి పనివారు మార్చేరు. పుట్టిన బిడ్డని మాత్రం ఆపరేషన్ తియేటర్లోనే ఉంచి, రూ.500/- లంచం ఇవ్వమని ఆ ఆస్పత్రి పనివారు అమె అక్కను అడిగేరు. ఆమె లంచం ఇచ్హుకోలేని పరిస్తితిలో ఉన్నదికాబోలు, ఆస్పత్రి పనివారు బిడ్డను ఆపరేషన్ తీయేటర్లోనే ఉంచడమే కాకుండా, ఏ బిడ్డ పుట్టిందో, ఎలా ఉన్నదోననే విషయము కూడా చెప్పకుండా తప్పించుకు తిరిగేరుట.

వేకువఝామున 5 గంటలకు ఒక కుక్క ఆస్పత్రి కాపలాదారుల కనులలో పడకుండా ఆపరేషన్ తియేటర్లోకి దూరి అక్కడున్న ఆ పసిబిడ్డను నోటకరుచుకుని బయటకు వచ్హింది. ఈ సంఘటనను నేరుగాచూసిన ఆ బిడ్డ తల్లి తల్లడిల్లిపోయింది. ఆ కుక్క పసిబిడ్డని నోటకరుచుకురావాటం చూసిన కోంతమంది పేషెంట్లు, ఆస్పత్రి పనివారూ ఆ కుక్క వెంబడి పడ్డారు. వారిని ముప్పతిప్పలు పెట్టించిన ఆ కుక్క చివరకు తన నోట కరుచుకున్న ఆ పసిబిడ్డని ఆస్పత్రిలోని మోదటి అంతస్తులో వదిలేసి పారిపోయింది.

విషయము తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకునేలోపు, ఆ ఆస్పత్రి పనివారు, ఆపరేషన్ తీయేటర్లోనూ, కుక్క తిరిగిన వార్డులలోనూ పడిన నెత్తుటి చుక్కలను తుడిచేసేరట. ........పోలీసులు దర్యాప్తు జరుపుతున్న ఈ కేసులో ఆ పసిబిడ్డకు ఏమైందో తెలియటంలేదు. బహుస ఆ బిడ్డని కాపాడే ఉంటారని, ఆ బిడ్డ ఆరొగ్యముగానే ఉండిఉంటుదని ఆసిస్తున్నాను.

డబ్బు కోసం, లంచం కోసం అప్పుడే ఈ ప్రపంచాన్ని చూడటానికి వచ్చ్హిన ఒక బిడ్డను తల్లికి వేరుగా ఉంచటం కోంతమంది మానవులలో మానవత్వం పూర్తిగా లేదని నిరూపిస్తోంది. తన బిడ్డను కుక్క నోట కరుచుకుపోవటం నేరుగా చూసిన ఆ తల్లి మనసు ఎంత క్చోభకు గురైఉంటుందో తలుచుకుంటేనే ఏదో ఒక భయం అలుముకుంటోంది. కుక్క నోటి పంటి గాయాలు తగిలిన ఆ పసిబిడ్డ పడ్డ నొప్పి గురుంచి తలుచుకోనేలేము.

ఈ ఘోర సంఘటన జరగడానికి కారకులైన వారిని ఎలా శిక్చించాలంటారూ?