Wednesday, February 24, 2010

ఈ వార్తలు కూడా చదవండి

1) విక్టోరియా లకాటస్ అనే పేరుగల గర్భిణీ స్త్రీ బరువు 240 కిలోలు. రొమేనియాలోని బుచారెస్ట్ కు చెందిన ఈమెను ప్రశవానికి ఆంబ్యులాన్స్ లో తీసుకువచ్హి, సుమారు 10 మంది సహాయముతో ఆమెను ఆసుపత్రిలోపలకు తీసుకువెల్లేరు. ఈమె పోయిన గురువారమునాడు పండంటి ఆడబిడ్డను ప్రశవించిందట. తల్లి,బిడ్డ ఆరోగ్యముగా వున్నారు.

2) ఒకే సెక్స్ కు చెందిన అమేరికన్ భార్యా, భర్తలు బ్రెడ్ ఫిస్టెర్ మరియూ మైకెల్, ఒక అద్దెకు తీసుకున్న తల్లి మూలంగా ఒక పండంటి ఆడబిడ్డను పొందేరు. ఈ కానుపుకు సుమారు 60,000 డాలర్లు (రూ.27,00,000 ) ఖర్చు చేసిన ఈ హోమోసెక్సువల్ దంపతులు ఒక కంప్యూటర్ కంపేనీని నడుపుతున్నారు. ఈ పిల్ల హైదరాబాదులో పుట్టింది. హైదరాబదులో ఉన్న అమెరికన్ కౌన్సిలేట్ ఇటువంటి ప్రశవానికి మోదటిసారిగా సహాయపడ్డారు.

3) గర్భిణీగా ఉన్నప్పుడు ఇద్దరికోసం తినడం ఒక కల్పిత కధ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటీష్ హెల్త్ గైడ్లైన్ అనే ఒక సంస్త గర్భం దరించినవారు ఎక్కువ తినడం వలన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎంతమాత్రం మంచిదికాదని, గర్భముతో ఉన్నప్పుడు వారి తిండి అలవాట్లలో ఎటువంటి మార్పులూ చేసుకోకూడదని చెప్పవలసినదిగా అక్కడి డాక్టర్లకు సలహా ఇచ్హేరు. చివరి 3 నెలలు మాత్రం వారికి 200 కెలోరీల శక్తి అవసరమని, అది రెండు సాండ్విచ్ ముక్కలు తింటే చాలని తెలిపేరుట.

"జెనెటికలీ మోడిఫైడ్" (జీ.ఎం) పంటలే రాబోవు కాలంలో ప్రజల ఆకలిని తీరుస్తాయి..... శాస్త్రవేత్తలు

పాడిపంటల శాస్త్రవేత్తలు "జెనెటికలీ మోడిఫైడ్" పంటల గురుంచి ప్రజలలో ఉన్న అనుమానాలని తీర్చాలి, లేకపోతే రాబోవుకాలంలో ప్రజలందరూ ఆహారపధార్ధాల కోరతతో ఆకలి బాధకు లోనవుతారని "జెనెటికలీ మోడిఫైడ్ పంటలు మరియూ వాతావర్ణ కాలుష్యం" అనే సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల శాస్త్రవేత్తలు తెలిపేరు.

భీట్ .భ్రింజాల్ ని ప్రవేశపెట్టబోతున్నామని కేంద్ర ప్రబుత్వం చెప్పినప్పుడు, దానికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత తెలిపేసరికి, ప్రబుత్వం ఆ ప్రయత్నాన్ని నిలిపివేసింది. కానీ ఈ జెనెటికలీ మోడిఫైడ్ బీట్.బ్రింజాల్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో, వ్యతిరేకం తెలిపేవారు సరియైన కారణం చెప్పకుండా జీ.ఎం క్రాప్ ఒంటికి ఆరోగ్యకరంకాదని మాత్రమే చెబుతున్నారు.

జీ.ఎం పంటలవలన ఎటువంటి హానీ లేదని ప్రజలకు తెలిపి, ఈ సంవత్సరం నుండి జీ.ఎం పంటలలో శ్రద్ద చూపెడితేనే ఆహారపదార్ధాల కోరత తగ్గుతుంది, దీనితో ధరలుకూడా తగ్గి మన దేశ పురొగతికి దారి తీస్తుంది......అలాకాకుండా కేంద్రముగనుక చేతులు ముడుచుకుని కూచుంటే,మనం ఆహార పదార్ధాల కోరతతో విపరీతముగా అవస్త పడవలసి వస్తుంది. ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అప్పుడు మనం ఆహారపదార్ధాలని దిగుమతి చేసుకోవాలి. అలా దిగుమతిచేసుకునే ఆహారపదార్ధాలు జీ.ఎం తో తాయారు చేయబడినవేనని మనం గుర్తుపెట్టుకోవాలి.

వాతావర్ణ కాలుష్యము వలన వాతావర్ణములో మార్పులు ఏర్పడుతున్నాయి. ఈ వాతావర్ణ మార్పులవలన మామూలుగా పండే పంటలు సరిగ్గా పండకుండా అటు రైతులనీ ఇటు ప్రజలనీ విపరీతంగా నష్టపరుస్తున్నాయి. ఎన్నో దేశాలు ఈ జీ.ఎం పంటలనే పండిస్తున్నారు. ఎందుకంటే ఈ పంటలు ఎటువంటి వాతావర్ణానికైనా తట్టుకునే శక్తి కలిగినవి. ఎండలు ఎక్కువైనా, వానలు తక్కువైనా మరియూ ఎటువంటి అవాంఛనీయ వాతావర్ణానికైనా తట్టుకోగలవు. అలాగే కాల మార్పులకు లోనవకుండా పెరగగలవు. అప్పుడు మనకు ఆహారపదార్ధాల కోరత రానే రాదు.

ప్రతి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదలకీ ఆరు మిల్లియన్ టన్నుల గోదుమ పంట నాశనమౌతున్నదని యూనైటడ్ నేషన్స్ పంట ఉత్పత్తి పర్యవేక్చక సంఘం తెలుపుతోంది. వాతావర్ణ మార్పులు మన తలుపులను తడుతుంటే, ఆకలిని, పెరుగుతున్న ప్రపంచ జనాభా ను ఎలా కాపాడబోతామని ప్రశ్నిస్తోంది.

23 దేశాలుకు చెందిన శాస్త్రవేత్తలు ఒక సదస్సులో కలిసినపుడు .. ప్రపంచం ఇకమీదట జీ.ఎం పంటలమీదే ఆధారపడాలి. ఈ జీ.ఎం పంటల గురించి చేసే పరిశోధనల అభివ్రుద్దిని ఒక దేశం అన్ని దేశాలకూ తెలియపరచాలి. పోయిన శతాబ్ధిలో సుమారు 75 శాతం పంట వెరైటీలను మనం పోగోట్టుకున్నాము....ఇప్పుడు ఏవో కొన్ని వెరైటీలమీద మాత్రమే ఆధారపడియున్నాము. ఈ మిగిలిన రకాలను పరిశీలించి, పరీక్చించీ, వాటిని మన పరిశోధనాకేంద్రాలలో బద్రపరచుకొని, వాటి విత్తనాలని మన పరిశోధనాకేంద్రాలలో తయారుచేయాలి. లేకపోతే ఉన్న విత్తనాలనికూడా మనం వదులుకోవలసివస్తుంది. ప్రతిఒక్క దేశమూ వారి పరిశోధనలలో వేసే ముందడుగులను మిగిలిన దేశాలతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి.

ఒక ప్రక్క పాత వెరైటీలను బద్రపరచుకుంటూ, రాబోవుకాలంలో ఎటువంటి మార్పులకైనా, ఎటువంటికాలంలోనైనా పండగలిగే పంటలను పండించుకోవటానికి మనం సిద్దపడాలి అని తెలిపేరు.

పెళ్ళి కావాలిగానీ పెళ్ళి భందాలు అవసరంలేదు...ఈ నాటి యువత...ఇది ఎంతవరకు నిజం?

పాతకాలపు రొజులలో పెళ్ళి అంటే జీవితములో ఒక పెద్ద భాద్యత అని, బందు మిత్ర సపరివారము ముందు చెపట్టే ఒక మరపురాని, మధురమైన రోజుగా తలుచుకుని, ఆ రోజున చేపట్టిన భాద్యతను కాపాడటానికి అన్ని రకాల కష్టాలని ఓర్చుకుంటూ, భాద్యతలను ముగుంచికుంటూ జీవితాన్ని సంతోషముగా గడిపేవారు.

కానీ, ఈ నాటి యువత పెళ్ళి మాత్రం కావాలి కానీ భందాలు మరియూ భాద్యతలూ అవసరంలేదు అన్నట్లు ఉంటున్నారు. వారికి బ్రమ్మాండమైన, ఎవరూ కని, విని ఎరుగాని విధముగా ఎంతో ఎక్కువ ఖర్చుతో పెళ్ళిమాత్రం జరగాలి, కాని ఆ పెళ్ళివలన వచ్హే భందాలు మరియూ భాద్యతలూ అవసరంలేదు అనే విధముగా ఉంటున్నారు. అందుకనే ఈ రోజు వివాహమైన ఎందరో దంపతులు, విడి విడి గా జీవిస్తున్నారు,విడాకులు పోందుతున్నారు. ఇంతే కాకుండా వీరు, వీరి వివాహ సంభందుము వలన ఏర్పడిని సంతానాన్ని భందాలకు దూరంగా ఉండే ఒక కొత్త సంఘంగా రూపోందిస్తున్నారు. ఈ సంఘానికి చెందినవారు పెద్దైనాక ఎటుపోవాలో తెలియక తికమక పడుతున్నారు.

పెళ్ళి అనేది డబ్బు ఖర్చుపెట్టి జరిపే పేరంటం కాదు, ఇద్దరి మనసుల మరియూ మనుష్యుల కలయిక. భార్యా, భర్తల భందాలలో కలతలు చోటు చేసుకుంటాయి, వాటిని జీవిత పరీక్చలుగా తీసుకుని, ఆ పరీక్చలో నెగ్గటానికి భార్యాబర్తలు కలిసి పోరాడలి అని పెల్లి అంటే అర్ధం ఏమిటని అడిగే ప్రతి యువతీ, యువకుడు చెబుతున్నారు గాని, పాటించటంలేదనీ, డైవర్స్ కేసులు విపరీత స్తాయిలో ఉన్నయని మరియూ డైవర్స్ తీసుకోకుండానే భార్యా భర్తలు విడి విడిగా జీవిస్తున్న వెస్టెరన్ కల్చర్ పద్దతి ఇక్కడకూడా పాటిస్తున్నారని.... ఈ మధ్య జరిపిన ఒక సర్వేలో తెలిసినట్లు ఒక పత్రిక తెలిపింది.

ఇది ఎంతవరకు నిజమని మీరు నమ్ముతున్నారు?

Monday, February 22, 2010

అందరికీ నమస్కారములు

అందరికీ నమస్కారములు,

నాకు హెల్త్ కోంచం బాగుండకపోవడం వలన, నేను 3 రోజులుగా మీకు టపా అందిచలేకపోయేను. హెల్త్ సరైన వెంటనే మళ్ళి టపాలు అందిస్తాను.

ధన్యవాదాలు.
మీకోసం.

Friday, February 19, 2010

చదువుకోసం డొనేషన్లు అడిగేవారికి "జైలు శిక్చ" విధించాలని కేంద్ర ప్రబుత్వం నిర్ణయించుకుంది

చదువు చెప్పే సంస్తలు డోనేషన్లు అడగటంగానీ, తమ సంస్తల గురించి ఇచ్హే ప్రకటనలలొ తప్పులు చెప్పినా గానీ, విధ్యార్ధులకు తమ సంస్తలగురించిన సరియైన వివరాలు ఇవ్వకపోయినాగానీ మరియూ తమ ప్రకటనలలో వెలువడించే వసతులు తమ సంస్తలలో ఇవ్వలేకపోతే ఆ సంస్త అతి పెద్ద జరిమాణా కట్టవలసి వస్తుంది. ఇంతే కాక, ఆ సంస్తను నడిపే వారు జైలుకు వెళ్ళవలసి వస్తుంది.

ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశములో హెచ్.ఆర్.డి మంత్రిత్వశాఖ వారు ప్రవేశ పెట్టబోతున్న "ప్రొహిబిషన్ ఆఫ్ అన్ ఫైర్ ప్రాక్టీసస్ ఇన్ టెక్నికల్, మెడికల్ ఇన్ స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్ బిల్ 2009" లో ఇలా చెప్పినదానిని "గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్" తమ ఆమోద ముద్ర వేసేరు.

"గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్" ఆమోద ముద్ర వేసిన ఈ బిల్లు, ఆమోదాలు తెలిపిన బిల్లులలో మూడవది. మోదటిది...ఎడ్యూకేషన్ ట్రైబ్యునల్స్ ను ఏర్పాటు చెయాలనే బిల్లు, రెండవది... అక్రిడేషన్ బాడీ ఏర్పాటు చేయాలనే బిల్లు.

చిన్న సవరణలు చేసిన ఈ బిల్లును క్యాబీనెట్ కు పంపుతామని హెచ్.ఆర్.డి. మంత్రి కపిల్ సిబల్ గారు తెలిపేరు......ఈ బిల్లులో చదువులు చెప్పే సంస్తలు చేస్తున్న 25 దురాచార పనులను గుర్తించి, వాటి బారి నుండి విధ్యార్ధులను కాపాడటమే మా మంత్రిత్వశాఖ ధ్యేయం. ఏ సంస్తైనా ఈ 25 దురాచారాలలో ఏ ఒకటి చెపడుతున్నట్టు తెలిసినా ఆ సంస్త, ఆ సంస్త నడిపేవారూ శిక్చకు లోనవుతారు. ఆ శిక్చ, సంస్తకు రూ.50 లక్షలు జరిమాణాగానూ, ఆ సంస్తను నడిపేవారికి 3 సంవత్సరాల జైలుగానూ ఉండేటట్లు బిల్లును ప్రవేశపెడుతున్నామని అయన తెలిపేరు.

తమిళనాడులో ఒక మెడికల్ కాలేజీ వారు డొనేషన్లతో విధ్యార్ధులను పీడించుకు తినడం బహిరంగంగా బయటపడటమే ఈ బిల్లును ప్రవేశపెట్టటానికి ముఖ్య కారణం.

ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని ఒక విప్లవాత్మక చర్యగా పేర్కోనాలి. ఎందుకంటే, దేశంలోని అనేక ప్రైవేటు కళాశాలలని నడుపుతున్నది రాజకీయనాయకులూనూ, వారి బంధువులూను. ఇది తెలిసికూడా కపిల్ సిబిల్ గారు మరియూ "గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్" ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారంటే ఇది నిజంగా ఒక విప్లవాత్మక చర్యే. దీనికి కపిల్ సిబిల్ గారిని మరియూ "గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్" ను అభినందిస్తున్నాను.

పార్లమెంటులో కూడా ఈ బిల్లు తప్పక ఆమోద ముద్రతో బయట పడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పార్లమెంటులో కాంగ్రెస్ కు మెజారటీ ఉండటమే కాకుండా, మిగిలిన పార్టీ వారు కూడా ప్రజలకు బయపడి తమ అమోదాన్ని ఇవ్వవలసివస్తుంది కాబట్టి.

ఇక పోతే, ఈ బిల్లును విధ్యార్ధులూ, వారి తల్లితండ్రులూ దైర్యముగా ఉపయోగించుకోవాలి. "అందరికీ చదువు హాక్కు" అనే అంశం మీద, డొనేషన్లు అడిగే విధ్యా సంస్తలను ఫీజుల పేరుతో ఎక్కువ డబ్బును వసూలు చేసే వారిని దైర్యముగా కోర్టుకు లాగాలి, శిక్చలు పడేటట్లు చేయాలి. అప్పుడే ఈ బిల్లుకు న్యాయం చేసినవారమౌతాము, రాబోవు విధ్యార్ధులకు మేలుచేసినవారౌతాము.

Thursday, February 18, 2010

గూగుల్‌లో ప్రకటనలిచ్హి మీ వ్యాపారాన్ని పెంచుకోవాలనుందా?..ఐతే గూగుల్ వారు ఇస్తున్న రూ.2500/- ఉచిత కూపన్ తో మోదలుపెట్టండి

చిన్న మరియూ మీడియం వ్యాపారస్తులకు, తమ మూలంగా వ్యాపార అభివ్రుద్ది దొరకాలనే ఉద్దేశంతో "జంప్ స్టార్ట్" అన్న పేరుతో ఒక కోత్త పధకాన్ని ప్రవేశపెడుతున్నామని గూగుల్ ఇండియా వారు తెలిపేరు.

"ఈ 'జంప్ స్టార్ట్' అనే మా సర్వీసు కేవలం ప్రకటనలని గూగుల్‌లో ఇవ్వడం వరకే కాకుండా, ప్రకటనలు ఎలా ఇవ్వాలో, ఎక్కడ ప్రకటించాలోననే విషయములో కూడా వ్యాపారస్తులకు సహాయం అందిస్తుంది" అని గూగుల్ ఇండియా తెలిపింది.

ఈ కోత్త సర్వీసుతో చిన్న వ్యాపారస్తులు గూగుల్‌లో చిన్న చిన్న ప్రకటనలివ్వటం మోదలుపెట్టి వారి వ్యాపారాన్ని అభివ్రుద్దిచేసుకుంటూ, గూగుల్‌లో ప్రకటనలివ్వడం ఎంత సులభమో తెలుసుకోవచ్హు. ప్రకటనలు ఇవ్వడంలో నిపుణులైన మా కంపేనీ పెద్దలు ఈ చిన్న వ్యాపారస్తులకు అన్నివిదాలా సహాయపడతారు. ఈ నిపుణులు చిన్న వ్యాపారస్తులతో నేరుగా మాట్లాడి, ఆ వ్యాపారస్తులు ఎటువంటి ప్రకటనలు ఇవ్వలనే విషయములోనూ, వారి ఆర్ధీక స్తొమతకు తగిన విధంగా వారి ప్రకటనల నెలసరి బడ్ జెట్ ను దాటనివ్వకుండా వారి వ్యాపార ప్రకటనలని ప్రచురించడంలోనూ సహాయం అందజేస్తారని గూగుల్ తెలియపరిచింది.

"దీనికోసం ఆన్ లైన్ వసతిగల చిన్న వ్యాపారస్తులకు మేము ఉచితంగా రూ.2500/- కి ఒక కూపన్ ఇస్తాము. ఈ కూపన్ వాడుకుని వారు ప్రకటనలివ్వడం ప్రారభించవచ్హు".....ఈ ఉచిత కూపన్ కావాలని కోరుకునే చిన్న వ్యాపారస్తులు 1860 266 6622 నెంబర్ కు ఫోన్ చేసి, వారి వెబ్ సైట్లని 'గూగుల్ ఇండియా ఆడ్ వర్డ్స్ ప్లాట్ ఫార్మ్' లో రిజిస్టర్ చేసుకోవాలి.

ఈ విషయాన్ని ప్రకటిస్తూ గూగుల్ కంపేనీ ఆన్ లైన్ ప్రకటనల ఇండియా అధినేత శ్రీధర్ సేసాద్రి గారు "మేము ఈ పధకాన్ని మోదట చండీఘర్‌లో మోదలుపెట్టేము. ఇప్పుడు భారత దేశం పూర్తిగా అమలుచేయాలని నిర్ణయించుకున్నాము. మా ఈ పధకం చాలా ఉపయోగకరమైనది. ప్రతి చిన్న వ్యాపరస్తులూ తమ వ్యాపారానికి తగినట్లు ప్రకటనలు ఇచ్హుకోవచ్హు. కేవలం రోజుకి రూ.200/- ఖర్చుతో తమ ప్రకటనలు మోదలుపెట్టి, వారి వ్యాపార అభివ్రుద్ది చూసుకుని, వారి వ్యాపార ప్రకటనల బడ్ జెట్ ని పెంచుకోవచ్హు లేక తగ్గించుకోవచ్హు. తమ ప్రకటనలకు ఎంత ఖర్చు పెడుతున్నారో చూసుకోవచ్హు. ఎక్కువ ఖర్చు పెడుతున్నామనుకుంటే వెంటనే వారి ప్రకటనలను ఆపుకునే వసతి కూడా ఇందులో ఉన్నది" అని చెప్పేరు.

ఆడ్ వోర్డ్స్ ఒక గొప్ప ప్రకటనా పరికరం. ఇది చిన్న వ్యాపారస్తుల కలలు పండించే పరికరం. చిన్న వ్యాపారస్తులకు భారత దేశంలో అమోఘమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయి. అందుకనే మేము చిన్న వ్యాపారస్తులకు వాటాదార్లులాగా ఉండి వారి వ్యాపార అభివ్రుద్దికి పాటుపడతామని గూగుల్ తెలిపింది.

ఒక మనిషికి ఎంత నిద్ర అవసరమో మీకు తెలుసా? అలాగే నిద్రలో వచ్హే కలల వలన ఎంత లాభమో మీకు తెలుసా?

మంచి ఆరొగ్యముతో ఉండాలంటే రోజుకి 8 గంటల నిద్ర అవసరమా?....శాస్త్రవేత్తలే ఈ విషయాన్ని ద్రువీకరించటం లేదు.....ఎక్కువ సేపు నిద్ర పోవడం....ఎక్కువగా తినడం...రెండూ ఆరొగ్యానికి మంచివికావు......అమేరికాలో 1.1 మిల్లియన్ల ప్రజల మీద జరిపిన ఒక పరిశోధనలో రోజుకు 8 గంటలు నిద్రపోయేవారు, రోజుకి 5 లేక 6 గంటలు మాత్రమే నిద్రపోయేవారి కంటే అనారొగ్యంతో బాధ పడుతున్నారట. ఇక రోజుకి 10 గంటలసేపు నిద్ర పోయేవారిగురించి చెప్పక్కరలేదు.

భారత దేశంలో 93 శాతం మంది నిద్రకే అప్పు పెడుతున్నారట...అంటే వీరు అతి తక్కువ సేపే, రోజుకు 3 నుండి 5 గంటలు మాత్రమె నిద్ర పోతున్నారు. ఇలాంటి వారు ఒక రాత్రంతా నిద్రపోతేనే ఆ అప్పును తీర్చగలరని శాశ్త్రవేత్తలు చెబుతున్నారు.

నిద్ర తక్కువ వలన మనిషి పడే అనారోగ్యం బయటకు కనపడదట. అది మన శరీరంలోని అన్ని అవయవాలనీ బాధిస్తుందట.....అందువలన మనం ఫలాన రోజున నిద్ర పోలేమనో, నిద్ర తక్కువ అవుతుందనో తెలుసుకో గలిగినప్పుడు, అ రాబోవు నిద్ర కోరతని ముందురోజే ఎక్కువసేపు నిద్రపోయి శరీరాన్ని ఆరొగ్యంగా ఉంచుకోవాలట. ఇలా చేస్తేనే మనకు నిద్ర తక్కువ వలన కలిగే అనారొగ్యం తప్పుతుందట......నిద్ర తక్కువ వలన మొగవారికంటే ఆడవారే ఎక్కువ బాధలకు గురి అవుతారని స్లీప్ అనే పత్రిక తెలిపింది. ఆడవారే ఎక్కువసేపు నిద్రపోవాలని, వారి నిద్రే మంచి నిద్ర అని పరిశోదనలో తెలిసింది. మగవారికంటే ఆడవారే నిద్రని ఒక మందుగా వాడుకుంటారుట. చాలామంది మగవారు నిద్ర పడుతుందని ఆల్కహాల్ వాడుతారు.....కానీ ఇది నిద్రని తగ్గిస్తుంది. మత్తుగా పడుకుంటారుగాని వారు నిద్ర పోరట. అలా వారు నిద్రకు కరువవుతారట.

కలలు:...ప్రతి రోజూ మనిషి పడే ఉద్రేకాలకి, సమస్యలకి కలలు ఒక పరిష్కారమట. గాఢ నిద్రలో వచ్హే కలలు ఆ రోజు ఉద్రేకాల వలన, సమస్యల వలన మన శరీరంలో ఏర్పడ్డ మార్పులని సరిచేస్తాయట. నేచర్ న్యూరో సైన్స్ అనే పుస్తకములో కలలు మనుష్యుల మైండ్ లని తెలివిగా ఉంచటానికే వస్తాయట. అలాగే ఏదైనా సబ్దములు కలిగినప్పుడు, అలికిడిలు కలిగినప్పుడు మరియూ మెళుకువ రావాటానికి ముందు మాత్రమే కలలు వస్తాయనీ, అందువలనే చాలా మంది కలలను మరిచిపోతారనీ అ పత్రిక తెలిపింది.

మీరు కునుకు తీస్తారా?.....ఒక గంట సేపు ప్రొద్దుటి పూట ( అంటే మధ్యాణ్నం పూటో లేక మనకి టైము దొరికినప్పుడో) నిద్ర పోతే, అది ఒక రాత్రి నిద్రతో సమమని చాలా మంది అనుకుంటారు. ఇది నిజమే, కానీ ఎప్పుడో తెలుసా ఆ పగటి నిద్ర మంచి నిద్ర అయితేనే......అయినా రాత్రంతా నిద్రపోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే అది మన శరీరంలోని అతి ముఖ్య పనులకు సహాయ పడుతుందట. పగటి పూట ఒక గంట సేపు మంచి నిద్రపోతే అది మన మెమోరీనీ, లేర్నింగ్ అబిలిటీలను పెంచుతుందిట.

Wednesday, February 17, 2010

ఈ బ్రౌషర్స్ గురించి మీకు తెలుసా? ఎప్పుడైనా విన్నారా? మీలో ఎవరైనా వాడుతున్నారా?

ఎక్కువమందికి తెలియని, అతి తక్కువమందికి తెలిసిన ఈ వెబ్ బ్రౌషర్స్ కోన్ని రోజులలో ప్రశిద్దికెక్కి పెద్ద పెద్ద బ్రౌషర్స్ కి ఆందోళన కలిగిస్తాయట.

వెబ్ బ్రౌషర్స్ అని చెప్పిన వెంటనే ఇంటెర్ నెట్ ఎక్స్ ప్లోరర్, ఫైర్ ఫాక్స్, ఓపేరా మరియూ గూగుల్ వారి క్రోం మాంత్రమే మనలోని చాలమందికి గుర్తుకువస్తాయి.

మనలో చాలా మందికి ఫ్లాక్, కే-మెలాన్ మరియూ మాక్స్ తాన్ పేర్లు వినివుండం. కానీ ఈ బ్రౌషర్స్ లో ఉన్న సౌకర్యాలు చాలా ఉన్నతమైనవిట. ఒక సారి వీటిని వాడితే, వీటిని మన టూల్స్ లో శాశ్వతంగా ఉంచేసుకుంటాముట.

ఫ్లాక్: ( http:// www.flock.com/versios)......ఇది ఒక సోషియల్ వెబ్ బ్రౌషర్ గా చెప్పబడుతున్నది. వెబ్ 2.0 టెక్నాలజీలో కావలసినన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయట. ఒక ప్రక్క బ్రౌష్ చేస్తూ, మన ఫ్రెండ్స్ తో చాట్ చేసే సౌకర్యం కలిగివున్నదిట. అలాగే సోషియల్ నెట్వర్క్ లని కూడా చూసుకోవచ్హుట. ఫోటో అప్ లోడ్ సౌకర్యమూ, ఫోటోలని ఎడీట్ చేయు సౌకర్యములు, వాటిని మన కంప్యూటర్లోనుండి పికాసా, ఫోటో బకెట్ మరియూ టైనీ పిక్ లకు పంపవచ్హునట. మీకు బ్లాగ్ ఉంటే, బ్లాగ్ టపాలని ఈ బ్రౌషర్ లో ఉన్న బ్లాగ్ ఎడీటర్ మూలంగా పోస్టు చేయవచ్హునట. ఇంకా చాలా సౌకర్యాలున్న ఈ బ్రౌషర్ని చాల సులువుగా వాడుకోవచ్హునట.

కే-మెలాన్: ( http://kmelon.sourceforge.net)........వెబ్ బ్రౌసింగ్లో మనకి వేగం కావాలంటే ఈ బ్రౌషర్ మనకి చాలా ఉపయోగపడుతుందట. అతి తక్కువ మందికి తెలిసిన ఈ బ్రౌషర్ మిగిలిన బ్రౌషర్స్ కంటే అతి వేగంగా పనిచేస్తుందట.మనం ఒకేసారి 10 సైట్లని తెరవాలనుకుంటే, ఒకేఒక షార్ట్ కట్ తో అన్నిటినీ ఒపెన్ చేసుకోవచ్హుట. ఇంకా చాలా సౌకర్యాలున్న ఈ బ్రౌషర్ మరెన్నో ఉపయోగాలకి పనికివస్తుందట.

మాక్స్ తాన్: ( http:// www.maxthon.com) ….... ఇది చైనాలో తయారుచేయబడ్డ బ్రౌషర్.ఈ బ్రౌషర్ అన్ని విషయాలలోనూ తేడాలతో ఉంటుందట. గూగుల్ వారి క్రోం లో కంటే ఈ బ్రౌషర్ లోని ఇంటెర్ ఫేస్ లో కూడా ఇంటెర్ ఫేస్ ని మార్చుకునే సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయట. కీ బోర్డ్ మూలంగా ఈ బ్రౌషర్ని వాడుకునే సదుపాయంతోపాటూ మరెన్నో సదుపాయాలు కలిగివున్నదిట.

ఈ బ్రౌషర్స్ గురించి, వాటి పనితనం గురించి, వాటిలో ఉన్న సౌకర్యాల గురించి తెలుసుకోవాలంటే ఒక సారి వాటిని చూసి, సౌకర్యాలని తెలిసికోని, వాడి, నేర్చుకుని తెలుసుకోవాలట.........కోన్ని రోజులలో ఈ బ్రౌషర్స్ గురించి అందరికీ తెలియవస్తుందని, వీటి పనితనం, ఇవి అందించే సౌకర్యాలు తో ఇవి ప్రసిద్దికేక్కుతాయని గార్డియన్ న్యూస్ పేపర్ తెలిపింది.

మీలో ఎవరికైనా ఈ బ్రౌషర్స్ గురించి తెలిసుంటే అందరికీ తెలుపండి.

హిమాలయా పర్వతాలలో ఉన్న మంచు గడ్డలు వేగంగా కరుగుతున్నాయి.....అనుమానం లేదని చెబుతున్న పచౌరీ

ఐ.పీ.సి.సి (ఇంటర్ గవర్న్ మెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్) అధినేత రాజేంద్ర పచౌరీ గారు హిమాలయా పర్వతాలలొ ఉన్నటువంటి మంచు గడ్డలు 2035 లోపు కరిగిపోతాయని చెప్పడాన్ని కొంతమంది శాస్త్రవేత్తలు తప్పు పట్టేరు. కానీ ఈ మధ్య ప్రపంచములోని కోన్ని భాగాలలొ రికార్డులు స్రుష్టించేంత విపరీతమైన మంచు పడటం, దీనివలన అక్కడి ప్రజలు విపరీతమైన కష్టాలకు లోనవడం, ఖచ్హితముగా హిమాలయాలలోని మంచు గడ్డలు కరగడం మోదలుపెట్టటం వలనేనని...ఇందులో సందేహంలేదని తెలిపేరు.

ముంబై నగరంలో "ఈకో-హౌసింగ్" అన్న సదస్సులో మాట్లాడుతూ “కోంత మంది నిపుణులు హిమాలయా పర్వతాలలో ఉన్న మంచు గడ్డలు కరగటం లేదని చెబుతున్నారు. ఇది నిజం కాదు. మంచు గడ్డలు అతి వేగంతో కరుగుతున్నాయనడంలో నాకు ఎటువంటి సందేహమూలేదు.ఐతే ఇది నిరూపించటానికి మన దేశములో సైంటిఫిక్ రీసెర్చ్ పరికరాలు అందుబాటులో లేవు. అందువలన ఈ విషయాన్ని సైంటిఫిక్ రీసెర్చ్ మూలంగా నిరూపించలేక పోతున్నాను. అంతే కాకుండా అ మంచు గడ్డలు ఎంత వేగంగా కరుగుతున్నాయో కూడా చెప్పలేక పోతున్నాను. కానీ నా దగ్గరున్న వాతావర్ణ డాటాతో అవి అతి వేగంగా కరుగుతున్నాయని ఖచ్హితముగా చెప్పగలను. దీనివలన నార్త్ ఇండియాలో నదులు పొంగి వరదలు వస్తాయి....అతివ్రుష్టీ మరియూ అనవ్రుష్టీ రెండూ కలుగుతాయి. ఎప్పుడైనా రాజస్తాన్‌లో వరదలు చూసేమా?....ఈ సారి చూసేము”

“వాతావర్ణ కాలుష్యం వలన ఏర్పడబొయే వాతావర్ణ మార్పులని, అ మార్పులు మనకు కలిగించబొయే నష్టాలని తెలుసుకుని ఉండిగూడా కొన్ని శక్తివంతమైన శక్తులు తమ జీవిత విధానాలలో మార్పులు చేసుకోవడానికి ఇష్టపడటంలేదు. ఇంతే కాకుండా సైన్స్ మీద, వాటి లెక్కలమీద తప్పులుపడుతూ పేద దేశాలని పక్కదోవ పట్టిస్తున్నారు. వాతావర్ణ కాలుష్యం వలన పేద దేశాలకు రాబోవు ప్రమాదాలగురించి నేను హెచ్హరిస్తుంటే, శక్తిగలవారికి అది నచ్హటంలేదు. ఇంకోంతమంది సైన్స్ ను నమ్మడంలేదు......కానీ నా ప్రజలు, అంటే భారత దేశ ప్రజలు నన్ను నమ్ముతున్నారనే నమ్మకం నాకు ఉంది. ఈ దేశమే నన్ను ఇంత పెద్ద వానిగా చేసింది. మన ప్రధాణ మంత్రి డిల్లీలో జరిగిన ఒక సదస్సులో నా మీద నమ్మకాన్ని వెలిబుచ్హేరు.....వాతావర్ణం లో ఇప్పుడు చూస్తున్న మార్పులని మనం ఒక హెచ్హరికగా తీసుకోవాలి. రాబోవు కాలంలో జరగబొయే విపరీత మార్పులని ఎదుర్కోవడానికి మనం కావలసిన కట్టుబట్లు చేసుకోవాలి”

“సముద్రపు నీటిమట్టం పెరుగుతొందనేది అందరికీ తెలుసు. దీనివలన ముంబై నగరానికి ముప్పు ఉంది. వర్షా కాలం, ఎండాకాలం మరియూ చలి కాలాలలో చాలా మార్పు కనబడుతుంది. 2005 లో ముంబై వరదలు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి”

“వాతావర్ణంలో మార్పులు రావడం లేదనే వారు, ఈ సంవత్సరం యూరప్‌లో పడిన విపరీతమైన మంచు ప్రభావం దేనివలనో చెప్పాలి. అలాగే అమెరికాలో కూడా విపరీతమైన మంచుపడి ప్రజల జీవితం రెండువారాల దాక స్తంభించిపోయింది. మన దేశంలో 2003 లో ఆంధ్ర ప్రదేశ్ లో వీచిన వడగాల్పులకి సుమారు 4000 మంది చనిపోయేరు. ఇవన్నీ వాతావర్ణములో కాలుష్యము అధికమవటంవలనే నని గ్రహించి ప్రబుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదే నేను చెప్పదలుచుకున్నది......మహారాష్ట్ర ప్రబుత్వం నేను చెప్పిన విషయాలకు గౌరవమివ్వడం, దాని మీద పనులను ప్రారంబించటం నాకు చాల సంతోషం కలిగిస్తోంది" అని చెప్పి ముగించేరు.

Tuesday, February 16, 2010

ప్రపంచములోనే భారత దేశపు సంస్థలు చాలా విశ్వశనీయమైనవి....ఒక సర్వేలో వెళ్ళడి

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలలొ, భారతదేశపు వ్యాపార సంస్థలే చాలా విశ్వశనీయమైనవి, వ్యాపారాభివ్రుద్ది కలిగినవి (అమ్మే వస్తువులలో నాణ్యత ఉంటుంది) మరియూ నిలకడైనవని ఒక సర్వే మూలముగా వెళ్ళడైంది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రాజాదారణ పొందిన సంస్థల గురించి సమాచరం సేకరించే ఈడెల్ మాన్ అనే కంపెనీ "ట్రస్ట్ బారో మీటర్---సర్వే 2010" పేరుతో జరిపిన ఒక సర్వేలో భారత దేశంలోని సంస్థలే నమ్మకమైనవి, నిలకడైనవి మరియూ నిజాయితీ కలిగినవి అని ఆ సర్వేలో పాల్గొన్న వారు తమ ఓట్ల మూలంగా తెలిపేరు.

25-34 ఏళ్ళలోపు వారినీ, 35-64 ఏళ్లలోపు వారినీ, 22 దేశాలలో ఎన్నుకుని సర్వేని చేపట్టినప్పుడు వారు పై విదంగా ఓటు వేసి తమ నమ్మకాలని వెలిబుచ్హేరు.

"నమ్మకం ఒక వ్యాపారానికి ఎంతో ముఖ్యం. ఈ నమ్మకమే ఏ వ్యాపారాన్నైనా అన్ని దేశాలకూ వ్యాపింప చేస్తుంది. ఈ నమ్మకమే పెట్టుబడి దార్లను ఈ సంస్థవైపుకు లాగుతుంది....కాబట్టి ఏ కంపనీ అయినా ఈ నమ్మకాన్ని ప్రజలకి, వ్యాపారకూటమిలో వారికి, వాటాదార్లకూ కలిగించాలి. అప్పుడు ఆ కంపెనీ ఒక అతి పెద్ద సంస్థగా ఎదుగుతుంది" అని ఈడిల్ మాన్ కంపెనీ అధినేత రిచర్డ్ ఈడిల్ మాన్ అన్నారు.
అన్ని సంస్థలలో ఐ.టీ కంపేనీలకు 88 శాతం ఓట్లు లభించి మొదటి స్తానం లభించింది.

భారత బ్యాంకులకు 82 శాతం.....ఆటోమొబైల్ కంపెనీలకు 79 శాతం.....మందుల కంపెనీలకు 75 శాతం....హెల్త్ కేర్ కు 73 శాతం......ఎంటర్ టైన్మెంట్ కు 70 శాతం.......ఇండియన్ మీడియ్యకు మాత్రం 58 శాతమే వచ్హింది.

రెండు సంవత్సరాలనుండి ప్రపంచ ఆర్ధీక పరిశ్తితి బాగలేదు. దీనికి కారణం అమెరికన్ కంపెనీలు నష్టపోవటమే. ఇందులోనూ ప్రపంచ వ్య్యప్తముగా పెద్దదైన, నమ్మబడ్డ, ఎక్కువమంది పెట్టుబడుదార్లున్న లేమాన్ బ్రదర్స్ బ్యాంకు దివాలా తీయటం అందరినీ ఆశ్చర్యులను చేసింది. దీని తరువాత ఎన్నో కంపెనీలు దివాళాలు తిసినై. ఒక సమయములో సిటీ గ్రూప్ గూడా ఆర్ధీక కష్టాలలొ ఉన్నమని తెలిపింది. అప్పుడు అమెరికన్ ప్రబుత్వం అప్పుగా ఒక అతి పెద్ద మోత్తాన్ని ఇచ్హి సిటీ గ్రూప్‌తో సహా మరెన్నో కంపెనీలను ఆదుకుంది......ఈ లోపు ఇంగ్లాండులోని హ్చ్.ఎస్.బీ.సీ బ్యాంకు కూడా తమ ఆర్దీక పరిస్తితి బాగుండలేదని ప్రకటించింది. దీనీతో ప్రపంచ షేర్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా చాల సంస్థలకు నష్టం ఏర్పరచడమే కాకుండా, ఏంతోమంది పెట్టుబదుదార్లను పేద వారిగా చేసింది.

కానీ అట్టి పరిస్తితులలోకూడా భారత దేశ సంస్థలు తమ నిజాయతీల వలన ప్రపంచ అర్ధీక సమస్యలలో నిలకడ చూపించింది.....బహుశ దీనివలనే మన దేశ సంస్థలకు ప్రపంచ ప్రజలలో నమ్మకం తీసుకోచ్హుండాలి.

ఇది మనమందరం గర్వించదగిన విషయం.

ఒకేఒక ముద్దుతో సంవత్సరానికి ఒక మిల్లియన్ ప్రజలు చనిపోతున్నారట!!!....దోమ కాటుకి

దోమలుండటం ఒక పెద్ద బెడద మాత్రమే కాదు....వాటి కాటు వలన ఎంతోమంది హాస్పిటల్ పాలవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 300 నుండి 500 మిల్లియన్ల ప్రజలు దోమ కాటువలన అనారోగ్యానికి గురవుతున్నారు. ఇందులో ఒక మిలియన్ దాకా చనిపోతున్నారుట. భారత దేశంలో సంవత్సరానికి సుమారు 40 మిల్లియన్ల ప్రజలు దోమకాటువలన అనారొగ్యముతో బాధ పదుతున్నారట.

వెచ్హటి ఉష్ణోగ్రత, వానలు, వరదలు మరియూ అశుభ్రత దోమల పెంపకానికి ఎక్కువ చోటునిస్తాయట. వీటివలన ప్రజలు అనారొగ్యముతో అవస్తలు పడుతున్నారట.

ప్లాస్మోడియం వివక్స్ అనే వైరస్, దోమల మూలంగా వ్యాప్తి చెంది మలేరియా వ్యాధిని కలిగిస్తున్నాయి. 2006 లో ప్రపంచ వ్యాప్తంగా 247 మిల్లియన్ల ప్రజలు ఈ వ్యాధితో బాధ పడ్డారుట. డబ్ల్యూ.హ్చ్ .ఓ వారి ప్రకటనలో ప్రపంచ వ్యాప్తంగా 30 సెకండ్లకి ఒక శిశువు ఈ వ్యాధితో చినిపోతున్నదట.

ఈ మధ్య కాలంలో మలేరియా వ్యాధి బాగా ఎక్కువగా పెరిగిపోయిందట. కారణం, డి.డి.టీ, క్లోరోక్వీన్ లాంటి మందులను ఎదుర్కునే శక్తి ఈ దోమలలో పెరగటం వలన. తరువాత బోదకాలు, తరువాత జపానీస్ మెదడువాపు వ్యాధి ( ఇది ఎక్కువగా బియ్యం పండించే గ్రామాలలో వస్తుంది), తరువాత ఎల్లో ఫీవర్ ( ఇది ఎక్కువుగా అడవి ప్రాంతాలలో వస్తుంది) .....ఇప్పుడు చికెన్ గునియా, డెంగ్ వ్యాదులు విడివిడిగానే కాకుండా, రెండూ కలిపి ( మిస్టీరియస్ ఫీవర్) వస్తున్నాయి.

ఈ దోమల బాధ నుండి మనల్ని కాపాడవలసిన భాద్యత ప్రబుత్వానికి ఎంతో ఉంది.....అలాంటి భాద్యత ప్రబుత్వం చేపట్తేంతవరకూ మనల్ని మనమే ఈ దోమలనుండి రక్షించుకోవాలి.

మనిషి శరీరంలో నుండి వచే కార్బండ ఆక్సైడ్, వేడి మరియూ తడి వలననే దోమలకి మనం ఆకర్శితులవుతున్నాముట. వీటిని మనం మన శరీరంలో నుండి రాకుండా ఆపలేము. కనుక దొమలనే మన దగ్గరకు రాకుండా అపాలి.

దోమల బాధ నుండి మనల్ని రక్షించటానికి ఈ రోజు కొత్తరకం దోమతెరల దగ్గరనుండి దోమలను చంపే బాట్ ల దాకా ఎన్నో కొత్త రకాల వస్తువులు మార్కెట్లలో దొరుకుతున్నాయి. వీటిలో, పాతరోజులలో వాడే దోమ తెరలు అన్నిటికంటే గొప్పవి. కానీ, ఇప్పుడున్న వాతవర్ణానికి అది ఉపయోగకరంగా లేవు. పెద్ద రంద్రాలు ఉండే దోమతెర అయితేనే మనకు గాలి ఆడుతుంది. అయితే, పెద్ద రంద్రాలలోనుండి దొమలు కూడా వస్తున్నాయి, కనుక వాటి ఉపయోగం తగ్గిపోయింది. ఎన్నో రకాల మస్కిటో రెపెల్లెంట్స్ మార్కెట్లలొ దొరుకుతున్నాయి. ఇవి కోంతవరకు దోమలని అడ్డుకోవడంలో ఉపయోగంగా ఉన్నా, వీటి వలన అలర్జీ లాంటి వ్యాదులతో అవస్త పడవలసి వస్తున్నది. ఇంతే కాకుండా వీటి పని తీరులలో తేడాలుండటం వలన ఇవికూడా అంత ఉపయోగకరంగా లేవనే చెప్పాలి.....మస్కిటో మాగ్నెట్ అనే పరికరం ఒకటి ఉంది. ఇది చాలావరకు దోమలని మన దరికి రాకుండా ఆపగలవు. ఎందుకంటే, ఈ మాగ్నెట్ మన శరీరంలాగా కార్బండ ఆక్సైడ్, వేడి మరియూ తడిని బయటకు పంపిస్తుంది. దీనివలన దోమలు అయోమయ స్తితికి లోనై ఆ మాగ్నెట్ దగ్గరకు వెళ్ళి చనిపోతాయి. కానీ ఇది ఛాల ఖరీదైన పరికరమే కాకుండా, ఈ పరికరం యోక్క పనితీరులో కోన్ని అనుమానాలు ఉన్నై కనుక దీని ఉపయోగాన్ని ఇంకా ద్రువీకరించలేదు.

దోమలని మన దరికి రాకుండా తరమాలనుకుంటే అన్నిటికంటే ఉత్తమమైనది వేప నూనె. ఈ వేప నూనెను కొబ్బరినూనెతో కలిపి శరీరానికి రాసుకుంటే తప్పక మనం దోమ కాటు నుండి తప్పించుకోవచ్హుట. అలాగే పెప్పర్మింట్ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుందట. ఇవికాకుండా మన ఇంటి గోడలకి చిక్కటి (DARK) రంగు కలర్ వాడకూడదట. ఇంటి చుట్టూ మరియూ ఇంటిలోనూ సుబ్రముగా ఉండేటట్లు చూసుకోవాలట.

Monday, February 15, 2010

పేదవారిని కాపాడటమే మా ధ్యేయం....భారత దేశంలో వీరికి జరుగుతున్న అన్యాయాలను ఐక్యరాజ్య సమితికి తెలియపరుస్తాము....ఆసియా దేశాలని పర్యవేక్చిస్తున్న ఫియాన్

తమిలనాడులో రేషన్ మూలంగా కిలో బియ్యం 1 రూపాయికి ఇవ్వటం పేదవారి ఆకలిని ఎంతమాత్రం తీర్చే ఉపయోగకరమైన పధకం కాదు....ఎందుకంటే మిగిలిన ఆహార పధార్ధాల ధరలు పేదవారి ఆకలిని తీర్చేవిగా లేవు. వీటిని కూడా తక్కువ ధరలకు రేషన్ మూలంగా అందిస్తేనే వారి ఆకలిని కోంతవరకైనా తీరుస్తుంది....అని ఫుడ్ ఫస్ట్ ఇన్ ఫర్మేషన్ అండ్ యాక్షన్ నెట్ వర్క్ (Food First Information and Action Network) వారి ఆసియా దేశాల పర్యవేక్చణ బ్రుందం అధినేత సబైన్ పాబస్ట్ తెలిపేరు.

పత్రికా విలేకరులతో మాట్లాడుతూ తమిలనాడులో రేషనింగ్ సిస్టెం సరిగ్గా పనిచేయటం లేదు. చాలా రేషన్ షాపులలో అత్యావసర వస్తువులని సరిగ్గా వినియోగించటం లేదు...పేద రైతులకు రెండేకరాల భూమిని ఉచితంగా ఇస్తామన్న పధకాన్ని సరిగ్గా అమలుపరచటం లేదు. పంట ఉత్పత్తి దారులను ( అంటే చిన్న రైతులను) ఆదుకోవలనే విషయాన్ని పట్టించుకోవటంలేదు.............. మేము తమిళనాడుని ఒక ఉదాహరణగా చెబుతున్నము. భారత దేశంలో మేము పర్యవేక్చణ చేసినంత వరకూ చాల చోట్లలో ఇలాగే ఉన్నది. ఇంకా పర్యవేక్చణ జరప వలసిన ప్రాంతాలు చాల ఉన్నాయి..

పంటలు పండించటంలో సంవత్సరానికి 4 శాతం అభివ్రుద్దికి పాటుపడితే చాలు ఆహార పధార్ధాల సమస్యే తలెత్తదు. ఇది పోందటం కూడా చాలా సులభం. ఇదే గనుక పొందగలిగితే పేదవారు అన్నివిధాలా లాభపడతారు......భారత ప్రబుత్వం మోత్త అభివ్రుద్ది 9.5 శాతంగా ఉండి మోత్త అభివ్రిద్దిలో లో చాలాబాగా ముందుకుపోతోంది. కానీ మోత్త 9.5 శాత అభివ్రుద్దిలో, వ్యవసాయ రంగం అభివ్రుద్దిలో కేవలం 2.5 శాతం మాత్రమే ఉంది. రాష్త్ర ప్రబుత్వాలు దీనిమీద (వ్యవసాయ రంగం మీద) శ్రద్ద చూపించాలి.

అలాగే పేదవారి భూములని ప్రబుత్వం కైవసం చేసుకుంటోంది...ఈ విషయములో మాకు చాల ఫిర్యాదులు వచ్హినై. పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపనీలు వీరి భూములని స్వాధీనం చేసుకుంటున్నై. మధురై పట్టణం లో ఉన్న, తిరుమంగళం గ్రామములోని పేదవారి భూములను స్పెషల్ ఎకోనొమిక్ జోన్ కి మార్చటానికి తమిళనాడు ప్రబుత్వం భూములను స్వాధీన పరుచుకునే ప్రయత్నం చేస్తోంది. అదేలాగా కేరళా ప్రబుత్వం కోకోకోళా కంపనీకి సరఫరా చేస్తామంటున్న నీటి గురించి గూడా మేము ఎంక్వయరీ చేస్తున్నాము. ఈ ప్రదేసాలకు వెళ్ళి, ఎంక్వయరీలు ముగించుకుని అందులోని నిజానిజాలని తెలియజేస్తాము.

ఇది మేము రాష్ట్ర ప్రబుత్వాలను కించ పరచటానికోసం చేయటం లేదు. పేద వారి హక్కులని కాపాడటమే మా ధ్యేయం. మేము ఇంతవరకు 60 దేశాలలొ పేదవారి పరిస్తితుల గురించి పర్యవేక్షణ చేసేము. ఎన్నో అవకతవకలని గుర్తించేము. వీటిని ఐక్యరాజ్య సమితికి తెలియపరుస్తాము. భారత దేశం ఐక్యరాజ్య సమితిలో, ఐక్యరాజ్య సమితి కి చెందిన ఆహారపదార్ధాల, ఆర్ధీక మరియూ సోషియల్ రెస్ పాన్స్ బిలిటీ లలో ఒప్పందాలు చేసింది కాబట్టి మేము భారత దేశంలో పేదవారికోసం చెపట్టిన పధకాలలో జరిగే అవకతవకల గురించి ఐక్యరాజ్య సమితికి తెలపాలి.....ఇప్పటికే మాకు ఇక్కడ జరుగుతున్న అవకతవకల గురించి 100 కు పైగా ఫిర్యాధులు వచ్హినై అని ఆమె తెలిపింది.

చైనా డాక్టర్లు మందులు వాడే విధానం వలన, మందులను ఎదుర్కోనే శక్తి కలిగిన బాక్టీరియాలు ప్రపంచమంతా వ్యాపిస్తాయట

చైనా వారు అర్ధం పర్ధం లేకుండా వారి ఆరోగ్య విషయంలోనూ, వారు పండించే పంటలలోనూ యాంటీ బయాటిక్స్ అలక్ష్యముగా ఉపయోగించడం వలన, మందులను ఎదుర్కొనే బాక్టీరియాలు ఎక్కువై, అవి ప్రపంచ ఆరొగ్య పరిస్తితినే పాడు చేస్తాయని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు.

చైనా డాక్టర్లు చిన్న చిన్న జబ్బులకు కూడా, అంటే మామూలు తలనొప్పి, జలుబు, సాదారణ ఒళ్ళు నొప్పులూ మరియూ అతి చిన్న వ్యాదులకూ ఒక మనిషికే రకరకాల యాంటీ బయాటిక్స్ ని అవసరమున్నా లేకపోయినా వాడుతున్నారట.

అంతేకాకుండా చైనాలోని రైతులు కూడా తమ పంటలని బద్రపరచుకోవటానికి చాలా ఎక్కువ స్తాయిలో ఈ యంటీ బయాటిక్స్ ని ఉపయోగిస్తున్నారుట.....అందువలన ఈ ఆహారపదార్ధాలలో ఈ యాంటీ బయాటిక్స్ ఎక్కువ శాతంలో ఉన్నాయని, ఇవి ఆరొగ్యానికి హానికలిగిస్తాయని చెబుతున్నారు.

చైనాలో జరిపిన ఒక పరిశొధనలో యాంటీ బయాటిక్స్ ని ఎదుర్కునే బాక్టీరియాలు విపరీత పెరుగుదల చెందినట్లు తెలిసిందట. ముఖ్యముగా స్టెఫిలో కోకౌస్ ఔరుస్ (Staphylococcus aureus) (దీనిని ఎం.ఆర్.ఎస్.ఏ అని కూడా చెబుతారట) ఉన్నదిట. చాలా వ్యాదులకు ఈ బాక్టీరియా ఒక కారణమట......ఇలా కోత్తగా ఉత్పత్తి అవుతున్న బాక్టీరియా రెసిస్టన్స్ బగ్స్ (Bacteria resistance bugs) అతి వేగంగా విస్తరిస్తున్నాయట. ఈ విస్తరణ విమాణ ప్రయాణీకుల మూలముగానూ, ఇంటర్నేషనల్ ఫూడ్ అవుట్ సోర్సింగ్ వలననూ ప్రపంచ వ్యాప్తముగా విశ్తరణ చెందవచ్హునని భయపడుతున్నారు.

చైనా డాక్టర్లు ఇంత ఎక్కువ యాంటీ బయాటిక్స్ ని, ఎక్కువ మోతాదులో ఎందుకు వాడుతున్నారంటే, అవి ఎక్కువగా అమ్ముడైతేనే వారికి లాభముట....వారి ప్రబుత్వ ఆరొగ్య పధకాలకు సరిపాల్లలో డబ్బు లేకపోవడంతో ఇలా మందులు అనవసరముగా వ్రాస్తూ, వాడుతూ ఆ డబ్బుతో హాస్పిటల్స్ ని నడపాలట.

చైనా చాలా విషయాలలో ముందడుగు వేస్తోందని చెబుతున్నారు. కానీ ఈ పరిశోధనా రిపోర్ట్ చదివిన తరువాత ప్రపంచాన్ని వెనకడుగు వేయించి, తాను ముందడుగులో ఉన్నట్లు గా చెబుతోందనే భావన కలుగుతోంది. ఈ విషయము మాత్రమే కాదు, ఈ మధ్య చైనాలో జరుగుతున్న విషయాలు కూడా అదే భావన్ని కలిపిస్తున్నది.

Sunday, February 14, 2010

తెలంగాణాలో జోరబడటానికి ఇదే మంచి సమయం.......మావోయిష్ట్ లేఖ

ఆంధ్ర రాష్ట్రంలో నెలకోన్న ప్రస్తుత రాజకీయ కల్లోల పరిస్తితే తెలంగాణాలో జోరబడటానికి మంచి సమయమని మావోయిష్టులు అనుకుంటున్నారట. ఈ విషయాన్ని నిరూపించే విధంగా మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ లీడర్ గణపతి అనబడే ముప్పాల లక్ష్మణ రావ్ వ్రాసిని లేఖను ప్రబుత్వ గూఢాచర అధికారులు చేపట్టేరు.

"ప్రచారక్" మరియూ "గాయవ్" అనే ఇద్దరిని మావోయిష్టులు ఇదివరకే గుర్తించి, వారి మూలముగా తెలంగాణా పోరాటములో పాల్గోనేందుకు తయారవుతున్నట్టు ఆ లేఖ మూలంగా తెలిసిందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపేరు.

పోలీసులు ఈ "ప్రచారక్" మరియూ "గాయవ్" లు ఎవరనేది తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారని, వారిని పూర్తిగా గుర్తించటానికి కోంత సమయం పట్టవచ్హునని, కానీ ఆ లేక వ్రాయబడ్డ విధానం, ఆ లేఖలో వ్రాసిన విషయం మరియూ ఆ లేకలో కామ్రేడ్ సీతాపతికి అని మోదలుపెట్టి ఉండటం, మావోయిష్టులు తెలంగాణా పోరాటంలో ప్రవేసమవుతున్నారు అనడానికి ఒక ఖచ్హితమైన నిదర్శనం అని చెబుతున్నారు.

పోలీసులు ఈ సీతాపతి, ఖచ్హితంగా చెరుకూరి రాజకుమార్ అని, ఇతనుకూడా మావోయిష్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ అని, ఇతనుకూడా ఆంద్రప్రదేశ్ కు చెందినతనేనని చెబుతున్నారు......ఉత్తర ఇండియాలో మావోయిష్టుల కేంద్రమని తెలుసుకున్న ఒక చోటుని దాడి చేసినప్పుడు, ఈ లేక అక్కడ దోరికిందని, ఈ లేఖ 2009 డిసెంబర్ నెల 22 వ తారీఖున వ్రాయబడిందని చెప్పేరు.

పురోగతి మరియూ ప్రజాశామ్యం కావాలని కోరుకునేవారందరూ కలసికట్టుగా ఒకే పేరుతో ఒక సంఘంగా మారి, తెలంగాణా పోరాటంలో కలిసిపోవాలి....ఇదే అదునైన సమయం కనుక ఈ విషయాన్ని ప్రచారక్ మరియూ గాయవ్ లు ఒక వార్తా ప్రకటన మూలముగా మావోయిష్ట్ పార్టీలోని ఇతర సహచరులకు తెలియ పరచాలని, అంతే కాకుండా లేఖల మూలంగా కూడా తెలియపరచాలని గణపతి ఆ లేఖలో రాసేరుట.

మావోయిష్ట్ అధినేత ఆంధ్ర రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా చేయాలనుకుంటున్నారట. తెలంగాణా, ఆంధ్రా, రాయలసీమ మరియూ ఉత్తర ఆంధ్రా అని పేర్కోంటూ ఎట్టి పరిస్తితిలోనూ హైదరాబద్ ని తెలంగాణాలోనే ఉంచాలని, మిగిలిన భాగాలకు కేంద్ర ప్రబుత్వం రాజధాణులను వెతుక్కోవాలని ఆ లేఖలో ఉన్నదట......తెలంగాణా రాష్ట్ర అవతరణ అంత సులభంగా జరగదు....దీనికి చాలా కష్ట పడాలి, అదేలాగా హైదరాబద్ లేకుండా తెలంగాణా రావటం వేస్ట్ అని ప్రజలకు చెప్పి, వారందరినీ ఒకే బాటకి తీసుకురావాలని రాసుందట.

రాజకీయ నాయకులకంటే విధ్యార్దులూ,యువతలు మరియూ ఉద్యొగస్తులే ఎక్కువగా పోరాడేరని, వీరి ఒత్తిడి మూలంగానే కేంద్ర ప్రబుత్వం కోంతవరకు దిగివచ్హిందని గణపతి అ లేఖలో తెలిపేరుట.

ఇంటెర్ నెట్ వలన గర్భంతో ఉన్నామనే ఆనందాన్నే మర్చిపోతున్నారు ఈ నాటి స్త్రీ లు.....ఒక సదస్సులో వెళ్ళడి

ఈ మధ్య కాలంలో తల్లులు కాబోతున్న గర్భిణీ స్త్రీ లు, తమకు ప్రశవం ఎలా అవుతుందో, కడుపులో ఉన్న శిశివును 9 నెలలు ఆరొగ్యంగా ఉండేటట్లు ఎలా కాపాడుకోవాలో, గర్భంతో ఉన్నప్పుడు తమకు కలిగే శరీరక మార్పులను ఎలా ఎదుర్కోవాలో, ప్రశవ సమయములో ఎలా ఉంటుందో, ఏమవుతుందో ననే ఆందోలనకు గురౌతున్నారు.

కారణం, ఈ నాటి స్త్రీలు తాము గర్భవతులమైనామని తెలిసినవెంటనే ఇంటెర్ నెట్ లోని గూగుల్ సెర్చ్ కు వెళ్ళి, గర్భం గురించి, గర్భకోశంలో ఉన్న శిశువు గురించి,తాము తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిసీ,తెలియని వారు వ్రాసే వ్యాశాలను వెదకి, చదివి, ఒక్కోక్క వ్యాశంలో విధ విధంగా వ్రాసిన అంశాలను చదవటం వలన అయోమయ స్తితిలో పడిపొతున్నారు .

గర్భిణీ స్త్రీ లు ఇలా తీవ్రమైన ఆందోళన పడటంతో, వారిలో భయం పెరుగుతుంది. ఈ భయం వలన గర్భిణీ స్త్రీ లు మామూలు ప్రశవాన్ని కూడా అసాధారణ ప్రశవంగా మారుస్తున్నారని లైఫ్ సెల్ ఇంటెర్నేషనల్ వారు చెన్నైలో నిర్వహించిన ఆంటేనేటల్ వర్క్ షాప్ లో పాల్గోన్న గర్భిణీ స్త్రీ లను ఉద్దేసించి సైకాలజిస్ట్ మరియూ చైల్డ్ బర్త్ నిపుణులైన రేకా సుదర్షన్ తెలియజేసేరు.

నేటి స్త్రీ లు గర్భం అయిన వెంటనే, గర్భం గురించి, దానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గూగుల్ సేర్చ్ మూలముగా తెలుసుకుంటున్నారు. వారు రెగులర్ చెకప్ కోసం వెళ్ళినప్పుడు వారి రెగులర్ డాక్టర్లు చెప్పేదానికంటే కూడా గూగుల్ సెర్చ్ నే ఎక్కువ నమ్ముతున్నారు. ఇలా గూగుల్ సెర్చ్ వలన అయోమయ శ్తితిలో పడే గర్భిణీ స్త్రీ లు, గర్భంతో ఉన్నప్పుడు పడవలసిన పరవశాన్ని, ఆనందాన్ని కోల్పోతున్నారు. ఆ సదస్సుకు వచ్హిన గర్భిణీ స్త్రీ లకు, గర్భం గురించి, గర్భంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలీ, ఏమి చేయాలి అన్నది విసదీకరించి చెబుతూ గర్భమైన స్త్రీ లు అసలు ఇంటెర్ నెట్ చూడకూడదు....తమ డాక్టర్లు చెప్పినదే వినాలి, చేయాలి అని సలహా ఇచ్హేరు.

ఈ సదస్సులో పాల్గోన్న గర్భిణీ స్త్రీ లు చాలా వరకు తమ భర్తలతో వచ్హేరు. వారి భర్తలు కూడా వారిలాగానే ఆందోళన చెంది ఉన్నారు. గర్భిణీ స్త్రీ లు ఏం చేయాలీ, ఏలా ఉండాలో ఇంటెర్ నెట్ లోనుండి డౌన్లోడ్ చేసి భార్యలకు సహాయపడుతున్నారు. అలా చేయటం మంచిది కాదని చెప్పేరు......వారందరినీ ఉద్దేసించి..."మీరందరూ ఒక విషయం మరచిపోతున్నారు..గర్బం దాల్చటం, 9 నెలలొ, 10 నెలలో గర్భం లోని శిశువు పెరిగేటప్పుడు ఉండే కదలికల ఉనికి, మీ శరీరంలో కలిగే మార్పులు....ఇవన్నీ ప్రక్రుతిగా వచ్హే మార్పులు. వీటిని వాస్తవమైన మార్పులుగా తీసుకుంటే మీకు ఆనందం, పరవశం కలుగుతాయి. అప్పుడు మీకు ప్రశవం కూడా సులభమవుతుంది. మన తల్లులూ, అమ్ముమ్మలూ 8 నుండి 12 మందిని అనందంగా, సుఖంగా కన్నారు. అప్పుడు ఈ ఆందోళనలు లేవు......గూగుల్ లేదు" అనిచెప్పి ముగించేరు.

ఈ సదస్సులో గర్భిణీ స్త్రీ లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, గర్భంగా ఉండటాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో అన్న విషయాలలో వారికి సలహాలు, సూచనలూ ఇచ్హేరు.

Saturday, February 13, 2010

ఒక ప్రక్క మావోయిష్ట్ లు, మరో ప్రక్క రక్షక ధళాలు భారత దేశంలో స్కూల్ పిల్లలను తమ పోరాటాలలో వాడుకుంటున్నారు.....యూనెస్కో(UNESCO) ప్రకటన

ఈ మధ్య కాలంలో అంటే 2006 నుండి 2009 లోపు స్కూల్ల మీద, విధ్యార్ధుల మీద, టీచర్ల మీద 4 దేశాలలో తిరుగుబాటుదార్ల దాడులు చాలా ఎక్కువైనై. ఇందులో భారత దేశం కూడా ఉన్నది. మిగిలిన 3 దేశాలూ ఆఫ్ గనిస్తాన్, పాకిస్తాన్ మరియూ తాయిలాండ్ అని యూనెస్కో వారు ఒక ప్రకటనలో తెలిపేరు.

చిన్న పిల్లలను అపహరించుకు పోయి, వారికి బాణాలు వేయటంలోనూ, తుపాకులు కాల్చటంలోనూ ట్రైనింగ్ ఇస్తున్నారు.
తరీం కోసా అనే అతను హ్యూమన్ రైట్స్ వాచ్ గ్రూప్ వారితో మాట్లాడుతూ "నేను ఒక ప్రబుత్వ ప్రైమరీ స్కూల్లో 8 వ తరగతి చదువుతున్నప్పుడు, కోంతమంది నక్సలైట్లు మా హాస్టల్ కి వచ్హేరు...నన్నూ, నాతోపాటు మరో ముగ్గురిని బలవంతముగా తీసుకువెళ్ళేరు. 10-12 కిలోమీటర్లు వెళ్ళిన తరువాత మిగిలిన ముగ్గురినీ వదిలేసేరు. నన్ను మాత్రం తీసుకువెళ్ళేరు. అప్పుడు నాకు 13-14 ఏళ్లు ఉంటాయి. వారు నాకు బాణాలు ఎలా వేయాలో, తుపాకులు ఎలా ఉపయుగించాలో, బాంబులు ఎలా పెట్టాలో నేర్పించేరు" అని అతను చెప్పేడని యునైటడ్ నేషన్స్ తెలిపింది.

భారత దేశంలో 2006 నుండి 2009 మధ్యలో సుమారు 300 స్కూళ్ళని మావోయిష్టులు పేల్చివేసేరుట. 2009 లో జార్కంద్ లో 18 స్కూళ్ళని, బీహార్‌లో 50 స్కూళ్ళని పేల్చివేసేరుట.....కోన్ని స్కూళ్ళని మన రక్షక దళాలు ఆక్రమించి వారు ఉండటంకోసం వాడుకుంటున్నారట.

నక్సలైట్లు 6 నుండి 12 ఏళ్ళలోపు పిల్లలని అపహరించుకుపోయి వారి దళాలో చేర్చుకుని వాడుకుంటున్నారట. చిన్న పిల్లలని తిరుగుబాటు దళాలో చేర్చుకోవడం వారి సిద్దాంతలకే వ్యతిరేకమైనా, ఇప్పుడున్న, మావోయిష్టులని చెప్పుకునేవారు వారి సొంత సిద్దంతాలకే దూరంగా ఉంటూ ఎదోఒకటి చెయాలని, చేస్తున్నారని యూనైటెడ్ నేషన్స్ తెలిపింది.

చట్టిసాగర్లో చిన్న పిల్లల జీవితాలు సర్వ నాశనమయినాయి. నక్సలైట్లే కాకుండా, మావోయిష్టులను ఎదిరించే గ్రూప్ లు మరియూ రక్షక దలాలూ కూడా ఈ చిన్న పిల్లలని వాడుకుంటున్నారు. ఇలా వీరు కూడా వారి జీవితాలతో ఆడుకోవడం శోచనీయం. ఈ చిన్న పిల్లలని స్కూళ్ళలో నుండి, వారు స్కూలుకి వెడుతున్నప్పుడు గానీ ఎత్తుకుపోయీ మవోయిష్టులు గానీ రక్షక దలాలు గాని వాడుకుంటున్నారని తెలిపేరు.

2008 లెక్కల ప్రకారం సుమారు 2,50,000 మంది పిల్లలు ప్రపంచంలోని వివిధ తిరుగుబాటు దళాలలో ఉన్నారట......భారత దేశంలోనే ఎక్కువగా పిల్లలను ఎత్తుకువెలుతున్నారని, దీనికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా---మవోయిష్ట్ గ్రూపులే కారణమని చెబుతూ.......పిల్లలని కాపాడే భాద్యత దేశానికీ ఉన్నదని, ఈ విషయాన్ని అతి ముఖ్య విషయముగా తీసుకోవాలని తెలిపేరు.

చిన్న పిల్లలని మావోయిష్టులు ఎత్తూకుపోయి వాడుకునే విధానాన్ని తీవ్రవాద పనిగా చెప్పవచ్హు......కానీ రక్షక దళాలే వాడుకుంటున్నయంటే అది సిగ్గు చేటు. మరి దీన్ని ఏమనాలో?

ద్రాక్ష చెట్లు మరియూ ఆరెంజ్ చెట్లు గల ఫోటోని మీ ఇంట్లో పెట్టుకోండి.....ఫెంగ్ స్యూ (Feng Shui) నిపుణులు

చైనా వారి నూతన సంవత్సరం ఈ నెల 14 వ తారిఖున ప్రారంభం అవుతోంది. వారి ఫెంగ్ స్యూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరమంతా గోడవలూ, నాశనాలతో కూడి ఉంటుందట.......ఈ దుష్ట శక్తుల దగ్గర నుండి తప్పించుకోవాలంటే ప్రతి ఇంట్లోనూ ద్రాక్ష చెట్టు మరియూ ఆరెంజ్ చెట్టూ కలిసి ఉన్న ఫొటో గానీ, ఆర్ట్ గాని గోడకు తగిలించుకోవాలని చెన్నై నగరంలోని పేరుగాంచిన ఫెంగ్ స్యూ నిపుణులు డీ.కష్మిరా తెలిపేరు.

మా పంచాంగం ప్రకారం ఈ సంవత్సరాన్ని "ఇయర్ ఆఫ్ టైగర్" గా పేర్కోనబడ్డదని ఆయన చెప్పేరు......”పులి ఎంత క్రూరమైన జంతువో, ఈ సంవత్సరం ప్రజలు అంత క్రూరమైన అనుభవాలకు లోనవుతారు. దీనికి అర్ధమేమిటంటే అనవసరమైన గోడవలు, నాశానలూ ఎక్కువగా ఉంటాయి. పోయిన సంవత్సరంలోలాగా మంచీ,చెడూలు సరిసమానంగా ఉండవు" హైడ్ అవుట్ అనే బొటీక్యూ ని నడుపుతున్న ఈ ఫెంగ్ స్యూ నిపుణులు చెప్పేరు.

"ఈ సంవత్సరపు జాతక చక్రం ప్రకారం నీటి కోరత చాలా ఎక్కువుగా ఉంటుంది. అలగే జాతక చక్రంలో ఇనుము, చెక్క ఎక్కువగా కనపడుటం వలన ఈ సంవత్సరం నాశన ప్రవర్తనను చూపుతోంది. దీనికి మంచి విరుగుడు ఎమిటంటే, చేసే పనులు మంచివా కావా అని చూడటం మరియూ మట్లాడే ధోరణి ని సరిచూసుకోవటం" అని చెప్పేరు.

జాతక చక్రంలో నీటి కోరత చూపిస్తున్నది కాబట్టి, ప్రతి ఒక్కరూ వారి ఇళ్ళలో నీరు ( ఒక చెంబుతో గానీ లేక ఒక బిందెతో గానీ)ఉంచుకోవాలి. ఆ నీరు కదలిక రూపం లో ఉంటే (అంటే...ఒక ఫౌంటన్ లాగా పై నుండి క్రిందకు నీరు కారేలాగా ) ఇంకా మంచిదని కూడా ఆయన చెప్పేరు......అదేలాగా ఒక డ్రాగన్ బొమ్మ (ఫెంగ్ స్యూ జాతక గుర్తు) ను ఇంట్లో పెట్టుకుంటే, అది వచ్హే నాశనాన్ని, గొడవలని అడ్డుకోగలదని చెప్పేరు.

మీకు ఫెంగ్ స్యూ పై నమ్మకముంటే ఈయన చెప్పినవిదంగా చేయండి.

Friday, February 12, 2010

మంత్రిత్వ శాఖలలో ప్రతి సంవత్సరం ఒక లక్షకోట్ల రూపాయల కేంద్ర ప్రబుత్వ నిధులు వాడకుండానే ఉండిపోతున్నాయట!?

మన కేంద్ర ప్రబుత్వం ఖజానాలో డబ్బులేక కష్టపడుతున్నామని చెబుతూ ప్రజలకోరకు చేపట్టిన సాంఘీక సంక్చేమ పధకాలను నెరవేర్చటానికి పెద్ద ఎత్తున అప్పు చేస్తోంది.

కానీ 2005-2006, 2006-2007 లో కేంద్ర ప్రబుత్వం ప్రజా సంక్చేమ పధకాలకని కోన్ని మంత్రిత్వ శాఖలకు కేటాయించి ఇచ్హిన డబ్బులో సుమారు ఒక లక్షకోట్ల (1,00,000 Crores) రూపాయలు ప్రజా క్షెమ పధకాలకు ఖర్చు పెట్టకుండా అలాగే ఉండిపోయున్నదట.....100 కోట్లు కేటాయించబడిన ప్రజా సంక్చేమ పధకాలు కొన్నిటిని, కోన్ని మంత్రిత్వ శాఖలు అమలుచేయకపోవటంతో, అలా అమలుచేయని పధకాలకు కేటాయించిన డబ్బులో 59,000 కోట్ల రూపాయలు అలాగే ఉండిపోయేయని కంప్ట్రోలర్ అండ్ ఆడీటర్ జెనరల్ (Comptroller and Auditor General) వారు తెలియచేసేరు. ఇది కాగ్ (CAG) వారు 2007-2008 కి తనిఖీ చేసిన అక్కౌంట్లవరకు మాత్రమే. ఇంకా 2008-2009 అక్కౌంట్లు తనిఖీ చేయవలసి ఉంది.

చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే....ప్రజా సంక్చేమ పధకాలకు ఖర్చు చేసేమని ప్రబుత్వ అక్కౌంట్లలో ఖర్చుక్రింద వ్రాసినవి, నిజంగా ప్రజాక్చేమ పధకాలకే ఖర్చు పెట్టేరా అన్నదే మా అనుమానం అని కాగ్ (CAG) తెలియపరచింది......ఎందుకంటే 2007-2008 కి ప్రజాక్చేమ పధకాలకని కేటాయించిన డబ్బులో 51,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రబుత్వం ఎన్.జి.ఓ లకు, స్వయం ఉపాధి కల్పించే సంఘాలకు, మండలాధిపతులకు నేరుగా వారి బ్యాంకు అక్కౌంట్లలోకి జమ చేసింది......ఈ పంపించిన డబ్బుని ఖర్చు పెట్టేరా.. లేక ఈ డబ్బుకూడా అలాగే బ్యాంకులలో ఉన్నదా అన్నదే ప్రశ్న.

వీటిని తనిఖీ చేయటం ప్రబుత్వ పరిధిలో లేదు కనుక ప్రబుత్వం తనిఖీ చెయలేదు.....ఇదే మాకు చాలా ఆందోలన కలిగించే విషయమని కాగ్ (CAG) తెలిపింది......ఇలా ప్రజా సంక్చేమాలకు కేటాయించిన డబ్బును ఉపయోగించలేదంటే ప్రజా సంక్చేమ పధకాలను ప్రజలకు పూర్తిగా అందచేయలేదనేది తెలుస్తోంది. ఇది ప్రజలనీ, ప్రబుత్వాన్ని ఇరకాటంలో పెట్టటమే కాకుండా ఆ మంత్రిత్వ శాఖలు సరిగ్గా పనిచేయటంలేదనే విషయాన్ని ఎత్తిచూపుతోంది. వారికని కేటాయించిన డబ్బును మా దగ్గరనుండి నేరుగా తీసుకోవలసిన కొన్ని మంత్రిత్వ శాఖలు అలా కేటాయించిన డబ్బులో సొగం మాత్రమే తీసుకున్నాయి. ఎన్ని సార్లు ఎత్తి చూపినా ఆ డబ్బును తీసుకోవటం లేదు. దీనివలన ప్రజా సంక్చేమ పధకాలు సగంలో ఆగిపోతున్నాయి. పోయినసారి చేసిన తప్పును తిరిగి చేయకుండా ఉండటాన్ని వారు సరిద్దిద్దుకోవటంలేదు.

ఆరొగ్య శాఖ, చదువులు, రూరల్ డెవెలొప్మెంట్, రేషన్ (PDS) మరియూ మరికొన్ని శాఖలు వారికి కేటాయించిన డబ్బును పూర్తిగా ఉపయోగించక అలగే ఉంచేసినై.

ఇలా 60 కేసులు మా లెక్కలో ఉన్నాయి .......బడ్జెట్ గ్రాంటులో కేటాయించిన డబ్బును ఒక శాఖ సరిగ్గా వాడలేదంటే అది సరియైన బడ్జెట్ కాకపోవచ్హు, లేకపోతే ఆ శాఖ సరిగ్గా పనిచేస్తూ ఉండకపోవచ్హు అనేది చూపుతోంది.

2007-2008 లో సివిల్ శాఖకు 97 గ్రాంట్స్ కేటాయించేరు. అందులో 1,08,000 కోట్ల డబ్బు వాడకుండా అలాగే ఉన్నది. అలా వాడని డబ్బును తిరిగి ఇచ్హేయాలి. సంవత్సరం చివరి దాకా ఉంచుకోనవసరంలేదు. అలాగనకచేస్తే, కేటాయించిన డబ్బులో ఒక్కోక్క మంత్రిత్వ శాఖలో ఎంత డబ్బు మిగిలిందో మేము ప్రబుత్వానికి మళ్ళీ బడ్జెట్ వేసేలోపు తెలియపరచవచ్హు. కానీ అలా జరగటంలేదని కాగ్ (CAG) వారు తెలియచేసేరు.

కాగ్ (CAG) వారి ప్రకటన బట్టి చూస్తే మనదేశం సుభిక్చముగానే ఉంది. మంత్రిత్వ శాఖలే సరిగ్గా పనిచేయటం లేదు. ప్రతి మంత్రిత్వ శాఖ వారికి కేటాయించిన డబ్బును పూర్తిగా ప్రజా సంక్చేమాలకు వాడితే ప్రజలుకు అది ఎంతో ఉపయోగంగా ఉంటుందికదా? నిధులు ఉండి వాటిని వాడకుండా ఉండటానికి కారణమేమిటో? నిధులు లేవని చెబితే ఇంకెలా నమ్ముతారు ? రాజకీయనాయకులు ఇవన్నీ ఆలోచించరా?

ప్రజా సేవ తప్ప మరి వారికి ఇంకేంపని ఉందబ్బా?!

"రాష్ట్రంలో రాష్ట్రం"...తెలెంగాణా సమస్యకు ఒక సలహా........కోంతమంది రాష్ట్రములోని మేధావులు

కేంద్ర ప్రబుత్వం ప్రత్యేక తెలెంగాణా ఏర్పాటుకు ఒక కమీషన్ ను అమర్చి ప్రత్యేక తెలంగాణాకు మద్దత్తు, వ్యతిరేకం తెలుపుతున్న వారిని కలిసి, ఆలోచనలు జరిపి, అందరికీ ఆమోదకరంగా ఉండే ఒక ప్రణాలికను రూపోందించటానికి ప్రయత్నాలు మోదలుపెట్టిందని మన అందరికీ తెలుసు.

ప్రత్యేక తెలెంగాణా విషయములో అటు తెలెంగాణా వారికి, ఇటు సమైక్య ఆంధ్రానే కావాలని కోరుకునే వారికీ ఆమోదకరంగా ఉండవచ్హుననే భావంతో రాష్ట్రానికి చెందిన కోంతమంది మేధావులు ఒక ప్రణాలికను ఒక సలహాగా రూపొందించ్హేరు.

దాని సారంశం "రాష్ట్రంలో రాష్ట్రం"......అంటే, ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయకుండా అటు తెలంగాణా కోరుకునే వారినీ, ఇటు సమైఖ్య ఆంధ్రానే కావలని అడుగుతున్నవారిని, వారి మనసులని కష్ట్టపెట్టకుండా తెలెంగాణా సమస్యకు ఒక ప్రణాలికని రూపోందించేరట. ఈ ప్రణాలికకు పూర్తి మెరుగులు దిద్దవలసి ఉందట.

వారి ప్రణాలికలోని ముఖ్య అంశాలుగా పేర్కోనబడ్డవి:...1) ప్రత్యేక తెలంగాణా కావలని కోరుకోవడానికి ముఖ్య కారణం, తెలంగాణా ప్రజలచే ఎన్నుకోబడ్డవారే, తెలంగాణా అభివ్రుద్దికి పాటు పడగలరని, వారే తెలెంగాణా రాష్ట్ర ప్రజల సమస్యలను తీర్చగలరని కాబట్టి వారే పరిపాలనా అదికారం చేపట్టాలని, వారి రాష్ట్ర వణరులమీద వారికే పూర్తి హక్కు కావాలనే కోరిక. 2) కాని దీనికి కావలసినది ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయకూడదంటున్న,సమైఖ్య ఆంధ్రానే కావలని కోరుకుంటున్న వారి అంగీకారం.....వీరు సమైఖ్య ఆంధ్రానే కావాలని అడగటానికి కారణాలు.....ఒకే బాష మాట్లాడుతున్న రాష్ట్రాన్ని రెండుగా విడదీయకూడదు మరియూ కోస్తా, రాయలసీమ నుండి హైదరాబద్ కు వెళ్ళిన వారికీ, వారి పెట్టుబడులకూ, ఆశ్తులకూ బధ్రత ఉండదని.

ఈ కోంత మంది మేధావుల ప్రణాలికి ప్రకారం తెలంగాణాకు స్వయం ప్రతి పత్తి (autonomus statehood)) ఇస్తూ హైదరాబద్ ని తెలెంగాణలోని భాగంగానే ఉంచుతూ హైదరాబద్ ని తెలెంగాణా రాజధానిగా చెయటం, తెలంగాణా కు స్వయం ప్రతి పత్తి కలగజేయడం వలన రాష్ట్ర విభజన అవసరంలేదు కాబట్టి హైదరాబద్ ఇప్పటిలాగే ఆంధ్ర రాష్ట్రానికి కూడా రాజధానిగా ఉంటుంది. ఇలా చేయడంవలన అతి ముఖ్యమైన హైదరాబద్ సమస్య తీరిపోతుంది.........ఈ ప్రణాలిక అమలు పరిచితే తెలంగాణాకు స్వయం ప్రతి పత్తి ఇవ్వటంతో ముఖ్య సమస్యైన రాష్ట్ర విభజన చేయనవసరంలేదు కాబట్టి ఆంధ్రాకు చెందిన శాశన శభ శబ్యులని సంత్రుప్తి పరచి రాష్ట్ర శాశన శభలో తెలెంగణా కు సంబంధించిన అమోద పత్రాన్ని ప్రవేసపెట్టి, అమోదన పోందవచ్హు నని ఈ ప్రణాలికను ఒక సలహాగా మాత్రమే చెప్పిన మేధావులు తెలిపేర.

ఈ మేధావుల సలహా ప్రణాలికలోని అతి ముఖ్యమైన అంశాలు....1) స్వయం ప్రతి పత్తి కలిగిన తెలంగాణా, వారి ప్రజలచే ఎన్నుకోబడ్డ శాశన శభ, మంత్రిత్వ శాఖ కలిగివుంటుంది ...2) ఆ శాశన శభ కు చట్టలను రూపోందించుకునే పూర్తి హక్కు....3) ఒక మెకానిజం మూలంగా నీటి జలాల వాటాను వారికీ, ఆంధ్రదేశములోని మిగతా వారికి పంచుకోనే విదం...4) పన్ను వసూళ్ల వాటాను ఇప్పుడున్న అంచనాలకు సరిపోయే విదం...5) తెలెంగాణా లో ఉన్న కోస్తా,రాయలసీమ వారికి,వారి ఆస్తులకూ, పెట్టుబడులకు రక్షణ కల్పించటం.

పై సలహా ప్రణాలికను ఇండియన్ ఎక్స్ ప్రెస్ దిన పత్రికకు ఇచ్హిన మేధవులు తాము ఎవరనేది తెలుపకూడదని అడిగేరు.

ఈ టపాని చదివిన వారు పై సలహాల మీద కమెంట్ చేయదలచుకుంటే ఒక ముక్కలో అంటే "బాగుంది...బాగుండలేదు" అని మాత్రమే ఇస్తే చాలా సంత్రుప్తిగానూ, సంతోషంగానూ ఉంటుంది.

Thursday, February 11, 2010

భారత రాష్ట్రపతి కుటుంబీకులపై కోర్టులో గెలుపొందిన సాదారణ రైతు

ఉద్యోగంలేని, దీనుడైన ఒక రైతు ఒక కోర్ట్ లో 3 సంవత్సరముల పోరాటం తరువాత తన రెండేకరాల పొలాన్ని బలమైన భారత దేశ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ కుటుంభ శభ్యులనుండి విడిపించుకోగలిగేడు.

"అమరావతీ నగరానికి దగ్గరున్న చంద్రాపూర్-కుల్లార్ గ్రామానికి చెందిన 29 ఏళ్ళ కిషొర్ బన్ షడ్ అనే పేద రైతు రాజకీయ బలం ఉన్న షేకావత్ కుటుంబీకులతో పోరాడి తన రెండు ఎకరాల భూమిని తిరిగి పోందగలిగేడు" అని అతని లాయర్ సునీల్ గజ్ బియే తెలిపేరు.

షేకావత్ కుటుంబీకులు ఈ రైతుని, అతని రెండెకరాల పొలాన్ని 10 లక్షల రూపాయలకు అమ్మవలసినదిగా ఒత్తిడి చేసేరుట. ఈ రెండేకరాల భూమిని వారి 200 ఎకరాల పోలానికి దారిగా చేసుకోవటానికిట. ఆ రైతు తనకు వంశపారంపర్యముగా వచ్హిన పోలాన్ని, అందులోనూ తన తండ్రి తనకు ఇచ్హి వెళ్ళిన పొలాన్ని అమ్మదలచుకోలేదు....ఈ విషయాన్ని షేకావత్ కుటుంబానికి చెప్పేడు.

కానీ, 2007 వ సంవత్సరం మార్చీనెల 10 వ తారీఖున షేకావత్ కుటుంబీకులు తమ పలుకుబడిని ఉపయోగించి, రెవెన్యూ డిపార్ట్ మెంటులో ఉన్న ఈ రెండెకరాల పొలం తాలూకా డాక్యూమెంట్లలో తమ పేర్లనికూడా చేర్చేరుట.

పోయిన సంవత్సరం జూన్ నెలలో రెవెన్యూ డెపార్ట్ మెంట్ కు వెళ్ళి, తన పోలానికి సంభందించిన డాక్యూమెంట్ కాయితాల కాపీలు తీసుకున్న ఈ రైతుకి అప్పుడు ఈ విషయం తెలిసిందట.....తన రెండెకరాల పొలం డాక్యూమెంట్లలో షేకావత్ కుటుంబీకుల పేర్లు కలిపి ఉండడం చూసి ఆశ్చర్యపోయిన ఈ రైతు, తన పొలం డాక్యూమెంట్‌లో సవరణలు చేసిన విషయాన్ని అక్కడున్న సబ్ డివిషనల్ కోర్ట్ లో ఒక పిటీషన్ మూలంగా తెలుపుతూ తనకు న్యాయం చేకూర్చవలసినదిగా కోరేడు.

3 సంవత్సరాల వాదనలు విన్న తరువాత, ఆ రెండేకరాలూ కిషోర్ బన్ సడ్ కు మాత్రమే చెందినదని, కాబట్టి రెవెన్యూ రెకార్డులలో ఈ పొలం తాలూకా డాక్యూమెంట్లలో నుండి షెకావత్ కుటుంబీకుల పేర్లు తొలగించమని కోర్ట్ ఉత్తర్వు జారీచేసింది.

"సి.పి.సి సెక్చన్ 10 మూలంగా ఈ కోర్ట్ కు ఇలాంటి కేసులలో తీర్పునిచ్హే అధికారం ఉంది. ఈ నిరుపేద, నిరుద్యోగి రైతు రాజకీయ బలం, డబ్బు బలం ఉన్న షేకావత్ కుటుంబంపై గెలవడం చాలా సంతోషకరమైన విషయం" అని అ రైతు లాయర్ తెలిపేరు.

షేకావత్ కుటుంబీకుల పేర్లలో భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ భర్త పేరూ, ఆయన సహోదరుడి పేరూ మరియూ మరి కోంత మంది భందువుల పేర్లూ ఉన్నాయట....... ఈ విషయం గురించి రాష్ట్రపతి ఆఫీసులో అడిగితే ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదు. రాష్ట్రపతి కొడుకు మరియూ కాంగ్రెస్స్ ఎం.ఎల్.ఏ రాజీందర్ షేకావత్ ని అడిగితే మేము ఎప్పుడూ, ఎవరి దగ్గరా బలవంతముగా పొలాలనిగానీ, భూములనిగానీ తీసుకోలేదని చెప్పేరు......కోర్ట్ వారి ఎంక్వయరీలో పొరపాటున పేర్లు మార్చ బడ్డాయని రెవెన్యూ డివిషినల్ ఆఫీస్ వారు తెలిపేరుట.

ఏది ఏమైనా చివరికి న్యాయం గెలవటం సంతోషంగా ఉన్నది.

ప్రతిఒక్కరూ రాజకీయాలలోకి రానవసరంలేదు...కానీ ప్రతిఒక్కరూ రాజకీయాలగురించి తెలుసుకోవాలి.....రాహుల్ గాంధీ

"ప్రతిఒక్కరూ రాజకీయాలలోకి రానవసరంలేదు, కాని ప్రతిఒక్కరికీ రాజకీయ అవగాహన ఉండాలి. అర్ధమున్న రాజకీయ చర్చలను వినాలి, వాటి గురించి ఒక అభిప్రాయం కలిగి ఉండాలి" అని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జెనరల్ సెక్రెటరీ మరియూ పార్లమెంట్ శభ్యులు రాహూల్ గాంధీ చెప్పేరు.

"తమ సొంత లాభాల కోసం చిన్న చిన్న నాయకులు చేసే ప్రజసామ్య విరుద్ధమైన మాటలనూ, పిలుపులనూ విధ్యార్ధులు పట్టించుకోకూడదు. అలాంటి నాయకులు చెప్పే చిన్న చిన్న ఉద్దేశాలను, ప్రజలను విభజించే మాటలను త్రోసిపారేసి చదువు, ప్రజాసామ్యం మరియూ పేదవారిని పైకి తీసుకురావటం మీద మాత్రమే తమ ఆలోచనలని కేంద్రీకరించాలి" అని పాండిచ్హేరీ విశ్వవిధ్యాలయ విధ్యార్ధులను ఉద్దేసించి మాట్లాడుతూ చెప్పేరు.

"దేశ విభజన చేయాలనుకునేవారు అల్ప సంఖ్యలోనే ఉంటారు. మన దేశంలోని ప్రజాసామ్య పద్దతులు వారికి అలా మట్లాడే హక్కు కలిగించింది. అలాంటి వారి మాటలను వినేవారు అతి తక్కువ మందే ఉన్నారు. ఎక్కువ మంది శాంతియుత వాతావర్ణాన్నే కోరుకుంటూ దేశం ఒకటిగా ఉండాలనే కోరుకుంటున్నారు" అని కూడా చెప్పేరు.

"మీరు ఈ దేశానికి ఏమి ఇవ్వదలచుకున్నారు" అని అడిగిన ప్రశ్నకి సమాధానముగా "ప్రస్తుతం నేను దాని గురించి ఏమీ చెప్పలేను ...కానీ నేను ప్రజలని వారి అభివ్రుద్దికొరకు, దేశాభివ్రుద్దికొరకు పాటు పడేవారిగా తయారుచేయటములో నిమగ్నమై ఉంటున్నాను...ఎందుకంటే అది మాత్రమే నిజమైన, పూర్తికరమైన అభివ్రుద్దిని తీసుకువస్తుంది" అన్నారు.

"అలాగే పెద్ద చదువులని, వైర్ లెస్ శాధనాలని మరియూ ఇంటెర్ నెట్ ని పేదవారికి అందేటట్లు, వాటివలన వారికి దొరికే లాభాల గురించి వారికి తెలియచేస్తాను" అని కూడా చెప్పేరు.

సోషియలిషం గురించి మాట్లాడుతూ ..."ఇందిరా గాంధీ మరియూ జవహర్లాల్ నెహురూ సోషియలిషం గురించి పట్టించుకోకుండానే చదువు,ఉద్యోగం మరియూ ప్రజా ఆరోగ్య పధకాల మీద శ్రద్ద వహించి నెరవేర్చేరు......ప్రజాశామ్య పద్దతులు ఏ పార్టీలోనూ లేవు...కాంగ్రెస్ పార్టీని కలిపే చెబుతున్నాను..ఇది చాలా భాధాకరమైన విషయం. కానీ గుజరాత్,పుంజాబ్,పాండిచ్హేరీలలో యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో ప్రజాశామ్య పద్దతులను అవలంభించే ఎన్నికలు జరిపేను. దీనిని ఇతర పార్టీవారు కూడా హర్షించేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జేరే వారి సంఖ్య చాలా పెరిగింది. ఇది నాకు చాలా సంతొషం కలిగిస్తోంది"అన్నారు.

ప్రతి మనిషీ దేశంలో రాజకీయముగా ఏం జరుగుతోందో తెలుసుకోవాలి, రాజకీయనాయకులు ఏం చేస్తున్నారో అర్ధం చేసుకోవాలి, మంచి విషయాలను సమర్ధించాలి, చెడు విషయాలను చర్చలతో ఎదుర్కోవాలి...దీనికి ప్రతి మనిషీ రాజకీయ అవగాహన కలిగుండాలి. నేను రాహూల్ గాంధీ చెప్పినదానికి పూర్తిగా ఆమోదిస్తున్నాను, ఏకీభవిస్తున్నాను మరియూ ఆయనను అభినందిస్తున్నాను.

Wednesday, February 10, 2010

ఈ బిచ్హగాడు డబ్బుగలవాడే కాకుండా ఒక సుఖవాసి కూడాట!!!

బిచ్హగాల్ల గురించి మనం ఎక్కువ పట్టించుకోము...ఇష్టమైతే డబ్బువేస్తాము లేకపోతే మనదారిన మనం పోతాము..నేను చూసినంతవరకు బిచ్హగాల్లు ఏ ప్లాట్‌ఫారాల మీదో, బస్ స్టాండులోనో లేక ఏ వీధి చివరో పడుకోని ఉంటారు. కానీ ఈ బిచ్హగాడి కధ విన్న తరువాత, మోదటిసారిగా బిచ్హగాల్లు ఇలా కూడా జీవితాన్ని అనుభవిసారా అనిపించింది.

శంకర్ మెహతా అనే ఒక బిచ్హగాడు, మార్కెట్లలో ఏ కొత్త రకం వస్తువు వచ్హినా కోంటాడట, పెద్ద పేద్ద హోటల్లలోనే బస చేస్తాడుట, జీవితాన్ని సుఖముగా, ఆనందముగా గడుపుతాడట.....ఈ 52 ఏళ్ళ బిచ్హగాడిని వారం రోజులక్రితం , ఒక ప్రబుత్వ గెస్ట్ హౌస్‌లో ఉండగా చండీగర్ పోలీసులు ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గర్స్ యాక్ట్ క్రింద అరెస్ట్ చేసేరు. ఈ గెస్ట్ హౌస్‌లో నెలకి 6000 రూపాయలు అద్దె కడుతూ, రెండు నెలలుగా ఉంటున్నాడుట. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర 3000 రూపాయల నగదు, ఒక మొబైల్ ఫోన్ ఉన్నాయట.

"నాకు పోలీసులంటే భయం లేదు....నేను అడుక్కోవడాన్ని ఎవరూ ఆపలేరు....ఈ ఎండాకాలానికి సింలా వెళ్ళదలచుకున్నాను" అని పోలీసుల దగ్గర చెప్పేడుట.

ఇతన్ని ఇంతకుముందు రెండుసార్లు అరెస్ట్ చేసేరుట...అప్పుడు ఇతను పెద్ద హోటల్లో ఏ.సి రూము తీసుకుని ఉన్నాడట......"నేను కడుపునిండా నాకు కావలసిన, ఇష్టమైన ఆహారాన్ని ఎన్నుకుని తింటాను...రాత్రిపూట ఏ.సి. లేకపోతే నిద్ర పోలేను....కలర్ టీ.వీ లో ప్రోగ్రాములు చూడాలి....నా సంపాదన నాకు ఈ సౌకర్యాలన్నీ ఇస్తోంది. చిన్నతనంలోనే అడుక్కోవడం మోదలుపెట్టేను....ఇందులో రాబడి బాగా రావడంతో దీనినే వ్రుత్తిగా ఎన్నుకున్నాను....కష్టపడుతున్నాను...అనుభవిస్తున్నాను.....ఇలా ఎప్పుడైనా పోలీసులు అరెస్టు చేస్తారు.....కోన్ని రోజుల తరువాత వదిలేస్తారు....ఇది మామూలే .....నాకేమీ భయంలేదు" అంటున్న ఇతని వాలకం చూసి, నిజంగానే ఇతను అడుక్కోవడం వలనే ఇంత డబ్బు సంపాదిస్తున్నాడా లేక ఇంకేదైనా సంఘ విద్రోహ చర్యలు చేస్తున్నాడా అన్న్న అనుమానంతో, అతని మొబైల్ పోనులో ఉన్న నెంబర్లని చెక్కింగ్ చేస్తున్నారట.

కంప్యూటర్ హాక్కింగ్ లో ట్రైనింగ్ ఇస్తున్న ఒక వెబ్ కంపనీని చైనా ప్రబుత్వం పట్టుకుంది

చైనా పోలీసులు వెబ్ హాక్కింగ్లో ట్రైనింగ్ ఇస్తున్న ఒక పెద్ద వెబ్ కంపనీని కనిపెట్టి, దాడి చేసి ఆ కంపనీ అధికారులను ఖైదు చేసి ఆ కంపనీని మూసివేసేరు.

ఆ ట్రైనింగ్ ఇచ్హే వెబ్ సైట్ ను నడుపుతున్న ముగ్గురు కంపనీ అధికారులు సైబర్ అట్టాక్స్ ఎలా చేయాలో, ఆ సాఫ్ట్ వేర్ ని ఎలా ఉపయోగించాలో ననే విధానములో నైపుణ్యం గలవారని చెబుతున్నారు.

చైనాలోనే అతి పెద్ద హాకర్స్ ట్రైనింగ్ ఇన్స్ ట్యూట్ గా చైనా పోలీసులు చెబుతున్న ఈ సంస్త పేరు "బ్లాక్ హాక్ సేఫ్టీ నెట్". ఇది హూబై నగరంలో ఉన్నది.

ఈ కంపనీకి చెందిన ఒక కోటీ పన్నెండు లక్షల (1,12,00,000) ఆశ్తిని, 9 వెబ్ సర్వర్లు, 5 కంప్యూటర్లు మరియూ ఒక కారును పోలీసులు 2009 నవెంబర్ నెలలో జరిపిన దాడిలో స్వాధీనం చేసుకున్నారట........చైనాలో జరిగిన ఒక సైబర్ అట్టాక్కులో, ఈ కంపనీలో ట్రైనింగ్ అయిన ఒక హాకర్‌ని చైనా పోలీసులు పట్టుకున్నప్పుడు, ఈ కంపనీ గురించి తెలుసుకోగలిగేరుట.

ఈ దాడి, చైనాలో గూగుల్ కంపనీ వారు అమేరికాలో తమ కంపనీ మీద జరిగిన సైబర్ దాడులు, అమేరికాలో బిజినెస్ చేస్తున్న కోన్నివేలమందికి చెందిన కంప్యూటర్ల మీద జరిగిన దాడులు, జీమైల్ మీద జరిగిన సైబర్ దాడులు, చైనా బయట నివశిస్తూ, చైనాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి రాస్తున్న వారి వెబ్ సైట్లని చైనా వారు హాక్కింగ్ చేస్తున్నారని, కాబట్టి మేము చైనా నుండి విరమించుకుంటామని గూగుల్ వెళ్ళడించక ముందే జరిగిన దాడి.

చైనా ప్రబుత్వముగానీ, చైనాలో వారికిగాని ఏమాత్రం ఈ దాడులతో సంబంధము లేదని అప్పుడు చైనా తెలిపింది. కానీ, గూగుల్ అందించిన సమాచరం నిజమేనని, అమేరికాలో జరిగిన అతి నైపుణ్యమైన సైబర్ అట్టాక్కులు చైనానుంచే జరిగినవని ఖచ్హితముగా చెప్పగలమని, కాబట్టి చైనా ప్రబుత్వం దీనికి సమాధానం చెప్పాలని అమేరికా ప్రబుత్వం చైనా ప్రబుత్వాన్ని ఒత్తిడి చేసింది మీకందరికీ తెలుసు.

చైనా వారి పెద్ద సెర్చ్ ఇంజిన్ బైడూ.కాం తో సహా అమేరికాలోని మరియూ ప్రపంచములోని ఇతర ముఖ్య దేశాలలో ఉన్న 42,000 వెబ్ సైట్లని హాక్కింగ్ చేసినవారు తమ పేరును "ఇరాన్ సైబర్ ఆర్మీ" అని పెట్టుకున్నారు.

ఈ బ్లాక్ హాక్ కు చెందిన వెబ్ సైట్ నాలుగు రోజులనుంచి సైబర్ వరల్డ్ లో కనిపించుటలేదు. ఈ కంపనీ ప్రకటనలు కూడా చైనాలో ఎక్కడా కనిపించటంలేదు.....ఈ కంపనీని 2005 లో మోదలుపెట్టేరు. ఇందులో 12,000 మంది నెలవారి చెందాలు కట్టి మెంబర్లుగా ఉన్నారట. మరో 1,70,000 మంది ఫ్రీ రిజిస్టర్డ్ మెంబర్లుగా ఉన్నారట. వీరు రూ.700 నుండి రూ.7,000 దాకా కంపనీ హాక్కింగ్ ట్రైనింగ్ కి, ట్రోజాన్ సాఫ్ట్ వేర్ కి కడుతున్నారని చైనా డైలీ న్యూస్ అనే వార్తా పత్రిక తెలిపింది.

Tuesday, February 9, 2010

"మా పోరాటనికి కూడా మద్దత్తు ఇవ్వండి" ...అవతార్ సినిమా డైరెక్టర్ జెమెష్ కోమెరోన్ ని సహాయం అడిగిన ఓరిస్సా లోని దోంగ్రియా జాతివారు

ఒక అంతర్జాతీయ మైనింగ్ కంపెనీ వారితో పోరాటం జరుపుతున్న ఓరిస్సా లోని ఒక కోండ ప్రాంతానికి చెందిన ఒక జాతి వారు, తమ పోరాటానికి మద్దత్తు ఇవ్వవలసినదిగా అవతార్ సినిమా డైరెక్టర్ జేమెస్ కోమెరూన్ని కోరేరు.

"వేరైటీ" అనే హాలీవుడ్ కు చెందిన ఒక సినిమా పత్రికలో ఒక ప్రకటనలో "మీ సినిమాలో లాగానే మేము నివసిస్తున్నాము, దైవంగా కోలుస్తున్న మా కోండ ప్రదేశాన్ని "వేదాంతం" అనే ఒక అంతర్జాతీయ కంపేనీ మా కోండ ప్రాంతంలోని చెట్లని, ప్రాణులనీ చంపుతూ, కోండలని పగులకోడుతూ, మా ప్రాంతాన్ని ఆక్రమిస్తూ మాకు నివాశాలు లేకుండా చేస్తోంది....మేము వీరి మీద పోరాటం చేస్తున్నాము, మా పోరాటానికి మద్దత్తునిస్తూ, మాకు సహాయపడవలసినదిగా కోరుతున్నాము" అని కోరేరు.

ఆ ప్రకటన హెడ్డింగ్ ఇలా ఉన్నది..."జెమెస్ కోమారోన్ గారికి......అవతార్ ఒక కల్పిత కధ....మాది నిజమైన కధ" .

"దోంగ్రియా కోండ్ అనే కోండ జాతి వారిమైన మేము, మా కొండ ప్రదెశాన్ని, మా నివాశ స్థలాలని, మేము దైవంగా భావించే కోండలని ఒక అంతర్జాతీయ మైనింగ్ కంపనీవారి దగ్గరనుండి కాపాడుకోవటానికి మేము పోరాడుతున్నాము, కష్టపడుతున్నాము.......మాకు సహాయపడండి, మేము మీ సినిమా చూసేము, మీరు మమ్మలని, మేము పడుతున్న భాధలని కూడా చూడండి" అని ఒక 10 నిమిషముల డాక్యూమెంటరీ సినిమా: "మైనింగ్......దైవముగా పూజించబడే కోండలూ" అన్న పేరుతో, ఇంగ్లాండ్ సినిమా తార జోన్నా లుంలే తీసిన డాక్యూమెంటరీని చూడండి అని తెలిపేరు.

ఒక అంతర్జాతీయ ఎన్.జి.ఓ సంఘం "సర్ వైవల్" ఈ ప్రకటనను ఇస్తూ దోంగ్రియా కోండ్ వారి కధ అవతార్ సినిమాలోని నావిన్ కధ ఒకటే అంటున్నారు.

"దోంగ్రియా వారు ఒరిస్సాలోని నియాంగిరీ కోండలలో నివసిస్తారు, వీరు ఎఫ్.టీ.ఎస్.ఈ 100 అన్న పేరుగల ఒక బ్రిటీష్ కంపేనీవారు "వేదాంత వణరులు" అన్న పేరుతో కోండ రాళ్ళలోనుండి బాక్సైట్ ను తీయటానికి వారు దైవంగా బావిస్తున్న కోండలను ఆక్రమించి, పగలకోడుతున్నారు. అవతార్ సినిమా కధని, ఆ సినిమాలోని రక రకాల కలర్ లో చూపించబడ్డ చెట్లు, ప్రాణులు, వింత గుఱ్ఱాలూ తీసేస్తే, ఆ కధ, ఈ నియాంగిరి కోండ ప్రాంతం కధే అవుతుంది" అని "సర్ వైవల్" డైరెక్టర్ స్టీఫెన్ కోరీ తెలిపేరు. "కాబట్టి జమెస్ కోమెరూన్ గారు ఈ దోంగ్రియా జాతివారి పోరాటానికి సహాయపడి, వాళ్ళు దైవంగా భావిస్తున్న కోండలని కాపాడి, వాళ్ళ భవిష్యత్తును కాపాడతారని ఆశిస్తున్నాను" అని కోరేరు.

Saturday, February 6, 2010

నర్సింగ్ హోం లో ముద్దుల పిల్లిగా పెరుగుతున్న ఈ పిల్లి చనిపోబోతున్నవారిని మాత్రమే ఆనందపరుస్తోందట!!

ఇంగ్లాండ్ లో ఉన్న న్యూ ఇంగ్లాండ్ నర్సింగ్ హోం లో "ఓస్కార్" అని పేరుపెట్టి పిలువబడే ఒక పిల్లి ఉన్నదట. 5 సంవత్సరాల క్రితం చిన్న పిల్లగా అక్కడకి వచ్హిన ఆ పిల్లి ఆ నర్సింగ్ హోం లో ఉన్న డాక్టర్లు, నర్సులు, పేషంట్లు, వారిని చూడటానికి వచ్హే వారి బంధువులు, అతిధులు మరియూ ఆ నర్సింగ్ హోం లో పనిచేస్తున్న వారు అప్పుడప్పుడు పెట్టే తిండిని తింటూ అక్కడే వుండేదట.

ఆ పిల్లి పెరిగి పెద్దదవుతుంటే, చూడ ముచ్హటగా ఉన్న ఆ పిల్లిని ఆ నర్సింగ్ హోం వారు పెంపుడు పిల్లిగా ఉంచుకున్నారట.....మామూలుగా పిల్లులు కపట బుద్ది కలిగినవిగా చెబుతాము, కానీ ఈ పిల్లి కపటం లేనిదని ఆ నర్సింగ్ హోం లోని వారందరూ చెబుతున్నారు.

ఈ పిల్లి ఇప్పటి దాకా(5 ఏళ్ళలో) ఆ నర్సింగ్ హోం లో చనిపోబోతున్న 50 మంది పేషెంట్లని కనుక్కోగలిగిందట. ఛాలా సమయాలలో అ నర్సింగ్ హోం డాక్టర్ల అంచనాలని తలక్రిందలు చేసిందట......ఈ పిల్లి ఆ నర్సింగ్ హోం లో తిరుగుతూ, కోంతమంది పేషెంట్ల దగ్గర మాత్రం ఎక్కువ సేపు ఆడుతూ, వారిని ఆనంద పరుస్తూ ఉండేదిట. ఐతే, అ పేషెంట్లు కోన్ని రోజులకు చనిపోయేవారుట. అంటే ఆ పిల్లికి ఎవరెవరు చనిపోబోతున్నారో ముందే తెలుస్తోందన్నమాట.

ఈ పిల్లి చేసే ఈ చేష్టలని చూసి ఆ నర్సింగ్ హోం లోని వారు ఆశ్చర్యపోతున్నారట. ......కొన్ని సమయాలలో ఈ పిల్లి ఆ నర్సింగ్ హోం డాక్టర్లని తికమక పెడుతోందట. తమ పరిశొదనలలోనూ, పరీక్షలలోనూ ఒక పేషెంటు ఎక్కువ రోజులు బ్రతకడని తెలుసుకున్నా ఈ పిల్లి వారి దగ్గర ఎక్కువ సేపు గడకపోవటం, అలాంటి పేషెంట్లు బ్రతకడం జరుగుతోందట. అలాగే కొంత మంది పేషెంట్ల అరోగ్యం పరవలేదని చెప్పిన పేషెంట్ల దగ్గర ఎక్కువసేపు గడపడం, ఆ పేషెంటు చనిపోవటం జరుగుతోందట.

ఈ పిల్లికి ఏదో ఒక అద్బుత శక్తి ఉన్నదని అక్కడివారంతా అనుకుంటున్నారట........"ఇది మేము గత 5 సంవత్సరాలనుంచి చూస్తున్నాము....ఇ విషయము ఇక్కడున్న వారందరికీ తెలుసునని" బ్రౌన్ యూనివర్సిటీ ప్రోఫెసర్ డాక్టర్ డేవిడ్ దొసా చెబుతున్నారు.
ఇది చాల వింతైన విషయం.

ఇలాంటి వింత విషయాలు అక్కడక్కడ జరుగుతునే ఉన్నాయి ....నేను విన్నాను........కోన్ని రోజులకు ముందు నేను ఒక టపాలో నాగు పాము శివలింగానికి పూజచేయటం గురించి వ్రాసేను. ఇది దానికంటే వింతైన, ఆశ్చర్యకరమైన విషయముగా ఉన్నదని బావిస్తున్నాను.

Friday, February 5, 2010

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 6 ని, మరికోన్ని బ్రౌజర్ లని గూగుల్ వారు ఆదరించరట....మీరు ఈ బ్రౌజర్ లలొ వేటినైనా వాడుతుంటే వెంటనే వేరే బ్రౌజర్ లకు మారండి

గూగుల్ వారు వచ్హే (మార్చ్) నెల 1 వ తారీఖు నుండి ఇంటెర్ నెట్ ఎక్స్ ప్లోరర్ 6 కి తమ ఆదరణను నిలిపివేస్తారట. కాబట్టి ఈ బ్రౌజర్ వాడుతున్నవారు గూగుల్ వారి సైట్లని, జీమైల్, గూగుల్ డాక్యూమెంట్స్ మరియూ గూగుల్ వారి ఇతర సైట్లని ఓపెన్ చేయలేరు. ఓపెన్ చేద్దామనుకున్నా ఆ సైట్లు ఓపెన్ అవకుండా ఎర్రర్ చూపిస్తాయి.....ఇదేలాగా పాత వెర్షన్స్ లో ఉన్న మిగిలిన బ్రౌజర్స్ ని కూడా ఆదరించరట.

ఇంటెర్ నెట్ ఎక్స్ ప్లోరర్ 6 ని మాత్రమే కాకుండా, మోజిల్లా ఫైర్ ఫాక్స్ 2.0, ఆపిల్ సఫ్హారీ 2.0 మరియూ గూగుల్ సొంతమైన క్రోం 3.0 ని కూడా ఆదరించరట.

మైక్రోసాఫ్ట్ వారు గూగుల్ ప్రతిపాదనను అంగీకరించేరుట. ఎందుకంటే వారి ఇంటెర్ నెట్ ఎక్స్ ప్లోరర్ 6 కూడా జాల చ్హేధనకు అనుకూలముగా ఉన్నదని ఈ మధ్యనే వారు తెలుసుకున్నారు....జనవరి నెలలో గూగుల్ కంపేనీ వారినే కాకుండా, అమేరికాలోని మరో పెద్ద 20 సంస్థల కంప్యూటర్లని ఎవరో చ్హేధించేరు. ఇది చైనా వారే చేసుంటారని గూగుల్ మరియూ ఇతర కంపేనీలు నమ్ముతున్నాయి. ఈ 20 కంపేనీల సర్వర్లలోనూ మరియూ పర్సనల్ కంప్యూటర్లలోనూ ఎక్కువగా పై చెప్పబడిన బ్రౌజర్లనే వాడుతున్నారు.

ఇప్పటి వరకు ఇంటెర్ నెట్ ఎక్స్ ప్లోరర్ 6 బ్రౌజర్ చాలా ఉన్నత మైనదని బావిస్తూ ఆ బ్రౌజర్‌నే వాడుతూ వచ్హేరు. కానీ ఎప్పుడైతే ఈ బ్రౌజర్‌ని కూడా చేధించేరో, అప్పుడు మైక్రోసాఫ్ట్ వారు తమ బ్రౌజర్లో ఉన్న తప్పులను తెలుసుకున్నారు....ఆ తప్పులని వెంటనే సరి చేసేరు. అయినా అది కంప్యూటర్ల చ్హేధనను ఆపగలదా అన్న సందేహం వారికే రావడంతో, వారి బ్రౌజర్ ఐ.ఈ 6 ని వాడుతున్న వారిని వెంటనే బ్రౌజర్‌ని మార్చుకోవలసినదిగా తెలిపేరు.

ఇంటెర్ నెట్ ని తమ సోంత ఉపయోగానికి వాడుతున్న వారికి ఎక్కువ హాని కలుగక పోయినా, గూగుల్ వారు తమ ఆదరణ ఆపుతున్నారు కాబట్టి, మనం గూగుల్ వారి సైట్లను (జీమైల్ లాంటివి) ఓపెన్ చేయలేము కాబట్టి, మనము కూడా బ్రౌజర్‌ని మార్చుకోవలసి వస్తుంది.

Thursday, February 4, 2010

ఈ సారి జరగబోయే ఐ.పి.ఎల్ క్రికెట్ పోటీలను మీ అభిమాన తియేటర్లలో చూసి ఆనందించండి

మన దేశంలోని సుమారు 1000 సినిమా తియేటర్లు ఈ సారి జరగబోయే ఐ.పి.ఎల్-3 క్రికెట్ పోటీలను డిజిటల్ సెటిలైట్ మూలముగా వెండితెరపై చూపించబోతున్నారు.

యూ.ఎఫ్.ఓ మూవీజ్ లిమిటెడ్ వారి డిజిటల్ సినిమా నెట్వర్క్ మూలంగా వెండితెరపై చూపించ బోతున్న ఈ టి20 క్రికెట్ పోటీల హక్కులను క్రౌన్ ఇంఫోటైన్మెంట్ అనే కంపనీ వారు కొనుక్కున్నారు.

సినీమాక్స్, ఐనాక్స్, ఫేం మరియూ మరో 500 ల సినిమా తియేటర్లు ఈ పోటీలని చూపించటానికి వీరితో ఒప్పందం వేసుకున్నాయి. ఈ సినిమా హాల్లలో ఈ పోటీలను ప్రత్యక్ష ప్రశారం చేస్తారు.

"ఐ.పి.ఎల్. క్రికెట్ పోటీలు ప్రపంచ వ్యాప్తముగా ప్రశిద్దికెక్కినై. కానీ ఈ పోటీలు 9 ఊర్లలో మాత్రమే జరుగుతున్నాయి కాబట్టి ఆ ఊర్లలో ఉన్న కోంతమందికే ఈ పోటీలని స్టేడియంలో కూర్చుని చూసే ఆనందం దొరుకుతుంది...మిగిలిన క్రికెట్ ప్రియులు టెలివిషన్ల ముందు కూర్చుని పోటీలను చూస్తున్నారు...వీరిలో కొంతమందికైనా ఈ క్రికెట్ పోటీలను స్టేడియంలో కూర్చుని ప్రత్యక్షముగా పోటీలను చూసే అనుభూతిని కలిగించాలనే ఆశయంతో మేము ఈ పోటీలను వెండితెరపై ప్రత్యక్ష ప్రశారం చేస్తున్నము" అని యూ.ఎఫ్.ఓ మూవీజ్ ఇండియా లిమిటెడ్ అధినేత కపిర్ అగర్వాల్ తెలిపేరు.

ఇది క్రికెట్ ప్రియులకు ఆనందం కలిగిస్తుందని బావిస్తున్నాను.

2010 కి అంతర్జాలము (INTERNET) ను నోబుల్ శాంతి బహుమతికి ప్రతిపాదించేరు

అధికారపూర్వముగా అంతర్జాలమును ఇటాలీ దేశానికి చెందిన, ప్రఖ్యాతి గాంచిన "వైర్డ్" అనే పత్రిక 2010 కి నోబుల్ శాంతి బహుమతి పొందాలని, ఆ అర్హత అంతత్జాలానికి ఉన్నదని, అంతర్జాలాన్ని ప్రతిపాదించింది.

“అంతర్జాలం ప్రపంచాన్ని వాస్తవిక విప్లవముతో మార్చివేసింది. దీని వలన పరస్పర సంభందాలు, అన్యోన్యత, ఒడంబడికలు మరియూ చర్చా సదస్సులూ లాంటివాటిని పెంచి ప్రపంచ శాంతికి దాహోదపడింది..ఎక్కడో మారు మూల ఉన్న దేశాలను ఒక చోటుకు చేర్చిన ఘణత తెచ్హుకుంది. ఏ దేశములో ఏమి జరుగుతోందో ప్రపంచ మంతా చూడగలుగుతోంది. అలాగే ప్రజాసామ్యాన్ని ప్రచారం చేస్తోంది" అని ఆ పత్రిక తెలిపింది.

ఈ "వైర్డ్ ఇటాలీ" అనే పత్రిక "ప్రపంచ శాంతికి అంతర్జాలం" అనే ఒక ప్రచారాన్ని తమ పత్రికలో ఈ సంవత్సరం సెప్టంబర్ నెల వరకు జరుపుతుందిట ...ఈ ప్రచారములో అంతర్జాలము వలన ప్రపంచములో ఏమేమి మార్పులు వచ్హినాయో, ఎక్కడెక్కడ వచ్హినాయో, అంతర్జాలాన్ని ఉపయోగించి శాంతి కోసం ఎవరెవరు పోరాడేరో ప్రచురిస్తుందిట.

"అంతర్జాలం ఒక అతి పెద్ద సముదాయం. ఈ సముదాయములో జాతి,కులం,మతం బేదాలు లేకుండా ప్రపంచములోని ఆడా, మొగ కలిసి ఉంటున్నారు. ఈ సముదాయములో అందరూ స్నేహాన్ని పంచుకోవటం, మాట్లాడుకోవటం, కష్టాలని తెలియపరచుకోవటం లాంటివి చేస్తూ ఒక కోత్త సంస్క్రుతిని ఏర్పరచుకుంటున్నారు. తమకు తెలిసిన జ్గానాన్ని కోత్తవారితో పంచుకుంటూ అన్ని సరిహద్దులనీ దాటుకుంటూ ముందుకు పోతున్నారు.......ఈ ఒక్క అంశం మీదే అంతర్జాలాన్ని ఒక కోత్త సముదాయాన్ని పుట్టించే "ఆయుధము" గా తీసుకోని ప్రజలలో ఉన్న అసూయనూ, గొడవలను సరిదిద్ది, సర్దిచెప్పే శాంతిని నెలకోల్పే ప్రజాసామ్యతను ఏర్పరచవచ్హు......ఇరాన్లో పోయినసారి ఎన్నికలో జరిగిన అవతవకలను ప్రపంచానికి ఎత్తి చూపింది అంతర్జాలం. దీనితో బయపడ్డ ఇరాన్ దేశం ఆ ఎన్నికలను రద్దు చేసింది. అంతర్జాలమే లేకపోతే అక్కడ జరిగిన అన్యాయాలనూ బయటకు రాకుండా అక్కడి పత్రికల వారికీ, టెలివిషన్ వారికీ ప్రచార నిషేధాలు విదించేది...........ఇలా చెప్పుకుంటూపోతే అంతర్జాలమువలన ప్రపంచానికి ఎంత ఉపయోగమో, ఎన్ని మార్పులుతేవచ్హో చెప్పుకుంటూ పోవచ్హు....కానీ ఈ అంతర్జాలము వచ్హిన తరువాత ప్రపంచములో కోంత శాంతి చోటు చేసుకుంది" అంటూ ఆ పత్రిక తెలిపింది.

అంతర్జాలాన్ని నోబుల్ శాంతి బహుమతికి "వైర్డ్ ఇతాలీ" పత్రికేకాకుండా, 2003 లో నోబుల్ బహుమతి గ్రహీత షిరీన్ ఈబడి మరియూ ఇటాలిలోనే క్యాన్సర్ వ్యాది నిపుణులైన డాక్టర్ ఉంబర్టో వెరోనెసీ కూడా ఉన్నారు.....అంతర్జాలం ఈ బహుమతి గెలుచుకుంటే ఎవరు ఈ బహుమతిని పుచ్హుకుంటారో తెలియపరచలేదు.

అంతర్జాలనికే నా మద్దత్తు.

Wednesday, February 3, 2010

తక్షణ శక్తి కొసం త్రాగే పానీయం (ఎనర్జీ డ్రింక్స్) ఆరోగ్యానికి మంచిది కాదుట

తక్షణ శక్తి కొసం మీరు ఇన్ స్టంట్ ఎనర్జీ డ్రింక్స్ త్రాగుతున్నారా? అవి మీ ఆరొగ్యానికి హాని కలిగిస్తున్నదని మీరు ఎప్పుడైనా గమనించేరా?

ఎనర్జీ డ్రింక్స్ తాగే చాలా మంది గమనించి వుండరు. ఎందుకంటే ఈ ఎనర్జీ డ్రింక్స్ త్రాగే వారిలో ఎక్కువ మంది యువతలు మరియూ మధ్య వయస్సు వారు వున్నారు. యువ వయస్సులో వున్న వారు చాలావరకు తమ శరీర పెంపుదల కొసం వాడతారు కనుక వారు గమనించి వుండరు. మధ్య వయస్సులో వున్నవారు తమ పనుల ఒత్తిడివలన గమనించి వుండరు.

అతి త్వరలో ఈ తక్షణ శక్తి ఇచ్హే ఎనెర్జీ డ్రింక్స్ పైన ముద్రించే లేబుల్స్ మీద వాటివలన కలిగే హానిని పెద్ద అక్షరములతో చూపించవలననే కఠిన మైన రూల్స్ ని అమలుపరుచబోతున్నారు......ఎందుకంటే ఈ తక్షణ శక్తి నిచ్హే పానీయాలు, పానీయం త్రాగిన వెంటనే శరీరములో శక్తి ని పెంచుతున్నై కాని ఆ తక్షణ పెరిగే శక్తి వలన శరీరములో ఏర్పడే మార్పులను అరికట్టలేవు.

ఈ పానీయము త్రాగిన వెంటనే హ్రుధయం ఎక్కువ వేగముతో నెత్తురుని పంపింగ్ చేస్తుందట. దానివలన శరీరానికి శక్తి పెరిగినట్లు అనిపిస్తుందట. కానీ హ్రుధయము వేగముగా పనిచేసేటప్పుడు ఒత్తిడికి లోనవుతుందట. ఇది ఎవరూ గమనించలేరట. దీనివలన హ్రుదయ స్పంధన ఎక్కువ అవుతుందని, అది హ్రుదయానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ పానీయాలు శరీరములో ఒక్కసారిగా సుగర్ లెవల్స్ ని పెంచడమువలన శరీరానికి ఎక్కువ హాని కలిగించటమే కాకుండా ఒక్కోసారి శరీర పనితన్నానే దెబ్బతీస్తుందట.

శరీర పెంపుదలకోసం యువకులు ప్రోటీన్లతో కూడిన ఎనర్జీ డ్రింక్స్ తాగుతారు. ఈ ప్రోటీన్లు త్వరగా అరుగుదలచెందవుట. దీనివలన అరుగుదల కష్టాలు రావడమే కాకుండా లివర్ దెబ్బతినే అవకాసం ఉందట. .....ఇంతే కాకుండా యువకులు ప్రోటీన్లతో కూడిన ఇన్ స్టంట్ ఎనర్జీ డ్రింక్స్ త్రాగిన తరువాత ఎంతసేపు శరీర వ్యాయామం చేయాలో ఎవరూ చెప్పలేరుట.

మనము ప్రతి రోజూ తినే ఆహార పధార్ధాలలోనే మంచి పోషక పధార్ధాలు వున్నాయని, అవి తింటూ, ఒక క్రమ పద్దతిలో రోజూ తప్పకుండా వ్యాయామము చేస్తేనే మనకు కావలసిన శరీర పెంపుదల మరియూ ఎనర్జీ దోరుకుతాయని నిపుణులు చెబుతున్నారు.

కనుక....ఈ ఇన్ స్టంట్ ఎనెర్జీ డ్రింకులు వాడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరము.

"చైనాలో తయారుచేయబడ్డ" వస్తువులని బహిష్కరించండి.....అరుణాచలప్రదేశ్ విధ్యార్ది సంఘం పిలుపు

మాటి మాటికీ అరుణచలప్రదేశం మాకు చెందింది అని ప్రకటన చేస్తున్న చైనా దేశాన్ని ఖండించే విధంలో, చైనా ఆర్ధీఖ స్థోమత పెరగటానికి ముఖ్య కారణమైన వారి ఎగుమతిని అడ్డుకోవడానికి, అరుణాచలప్రదేశ్ లోనే శక్తి వంతమైన విధ్యార్ధి సంఘం , చైనాలో తయారుచేయబడ్డ వస్తువులని ఈ నెల 8 వ తారీఖు నుండి బహిష్కరిస్తున్నామని ప్రకటిస్తూ దీనికై పోరాడతామని తెలిపింది.

అరుణాచలప్రదెస్ విధ్యార్ధి సంఘాల ప్రెసిడెంట్ తకవ్ తతంగ్ ఒక లేఖలో "ఈ బహిష్కరణ చాలా అవసరం, మాటి మాటికీ అరుణాచలప్రదేశ్ మాకు చెందిందని చైనా ప్రబుత్వం అంటున్నది...ఇది ప్రజలలో విపరీతమైన కోపాన్ని తెప్పిస్తోంది...అందుకే ఈ బహిష్కరణ ...మా విధ్యార్ధి సంఘాల ప్రతినిధులు ఒక్కోక్క వ్యాపార సంస్థకు వెళ్ళి, తనిఖీ చేస్తారు" అని తెలిపేరు.

"ఈ బహిష్కరణకు వ్యాపారస్తుల సహకారం ఎంతో అవసరం....వ్యాపార్స్తులని ఈ బహిష్కరణలో మాతో సహకరించవలసినదిగా కోరుతున్నాము, వేడుకుంటున్నాము.....అంతే కాకుండా వ్యాపారస్తులకు ఈ విషయములో చాలా వ్యవధి ఇచ్హేరు.....చైనా వారి వస్తువులని అమ్మవద్దని అరుణాచలప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు ఒక నెల క్రితమే వ్యాపారస్తులకి ఈ బహిష్కరణ విషయం తెలిపేరు" అని విధ్యార్ధి సంఘాల నాయకుడు తెలిపేరు.

"చైనా వారు అరుణచలప్రదేస్ మీద చూపిస్తున్న ఆశక్తిని కేంద్రం పెద్దగా పట్టించుకోవటం లేదు...దీనిని నిరూపించడానికి ఒక విషయం చెబుతాను...చచే చాధర్ అనే మన గ్రామస్తుడుని చైనా సైనికులు నిర్భందించేరు...ఆయనను విడిపించటానికి ఎటువంటి ప్రయత్నాలు మన ప్రబుత్వం చెపట్టినట్లు లేదు" అని ఆ విధ్యార్ధి నాయకుడు తెలిపేరు.

అరుణాచలప్రదేశ్ గురించి మన డిఫెన్స్ మినిస్టర్‌ని అడిగినప్పుడు మన బద్రతా దళాలు మన దేశ సరిహద్దులలొ రక్షణ కట్టుదిట్టం చేస్తున్నారు. ఇది అరుణాచలప్రదేశ్‌లో కూడా జరుగుతోంది...కానీ ఆ సరిహద్దును సైనిక దళంగా మార్చే అవసరము లేదు...మన బద్రతా దళాలు ఎప్పుడూ ఏ అవాంచనీయ సంఘట నైన ఎదుర్కోనే శక్తి గలవరేనని ఆయన చెప్పేరు.

చైనాలో తయారు చేయ బడ్డ వస్తువులని బహిష్కరించాలనే నిర్ణయాన్ని నేను హర్షిస్తున్నాను. ఎందుకంటే చైనా ఆర్దీకంగా ముందుకుపోవటానికి ముఖ్య కారణం వారు ఇతర దేశాలకి చేస్తున్న ఎగుమతులె. ఆర్దీకంగా ఎదుగుతున్నారు కాబట్టే వారు ఈ మధ్య కొంచం కఠినంగా ప్రవర్తిస్తున్నారు. వారు కూడా ప్రపంచ ఆర్దీక సంఘములో శభ్యులు కాబట్టి వ్యాపారరీత్య వారిని మన ప్రబుత్వం అడ్డుకోలేదు. కానీ మనం, అంటే, భారత దేశ ప్రజలు ఆడ్డుకోవచ్హు. ఎలాగంటే వారి వస్తువులని ప్రజలు కోనకుండా ఉంటే, వారి వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు వ్యాపరస్తులు కూడా వారి సరకులని తెప్పించటం మానేస్తారు.

నేను ఇంతకు ముందు ఒక టపాలో వ్రాసేను ......చైనాలో తయారుచేయబడ్డ పిల్లల ఆటవస్తువులలొ (ప్లాస్టిక్ బొమ్మలు) ఆరోగ్యానికి హాని కలిగించే రసాయణాలు ఎక్కువ శాతం ఉన్నది, కాబట్టి ఈ సారి మీ పిల్లలకు బొమ్మలు కోనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవలసినదిగా కోరేను.

Tuesday, February 2, 2010

మాజీ మిలిటెంట్ కు పద్మశ్రీ బిరుదు......ఇది బిరుదుకు గౌరవమా? అగౌరవమా?

జమ్మూ కాష్మీరుకు చెందిన ఒక మాజీ మిలిటెంట్ కు పద్మశ్రీ బిరుదు మరియూ బ్యాంకును మోసం చేసిన ఒక ఎన్.అర్.ఐ. అతనికి పద్మ భూషన్ బిరుదు.

జమ్మూ కాష్మీరుకు చెందిన మాజీ మిలిటెంట్ గులాం మొహమ్మద్ మీర్ కి పద్మశ్రీ బిరుదు, ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కొన్ని కోట్ల రూపాయలతో మోసం చేసిన ఎన్.ఆర్.ఐ హోటల్ అధిపతి కి పద్మబూషన్ బిరుదు.....ఇదండీ ఈ సంవత్సరం పద్మా బిరుదులకు ఎన్నుకున్న వారి విధానన్ని ప్రశ్నిస్తోంది.

"నేను మిలిటెన్సీ వదిలేసిన తరువాత, మన సైనిక దళాలకు ఎనలేని సహాయం చేసేను. కోన్ని వేల మంది మిలిటెంట్లని మన సైనిక దళాలు పట్టుకోవటాని, హతమార్చటానికి వారికి నేను ఏంతో సహాయ పడ్డను. నా సహాయాన్ని మేచ్హుకుంటూ సైనిక దళాల అదిపతులు నాకు ఎన్నో ప్రశంశా పత్రాలు ఇచ్హేరు. చూడండి" అని తన దగ్గరున్న ప్రశంశాపత్రాలను పత్రికా విలేకరులకు చూపించి "కాబట్టి పద్మశ్రీ బిరుదుకు నేను అర్హుడినే" అని మాజీ మిలిటెంట్ గులాం మొహమ్మద్ మీర్ అన్నరు.

ఈయన మీద హత్యా ప్రయత్ణం మరియూ బలత్కారమూగా డబ్బు గుంజిన కేసులు కోర్ట్ లలో విచారణలో ఉన్నాయి......ఈయన విషయము గురించి జమ్మూకాష్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లాను అడిగితే..."నాకు ఈ విషయము గురించి ఏమీ తెలియదు.నేను గాని, నా ప్రబుత్వాధికారులు గానీ ఈయన పేరును శిఫారసు చేయలేదు. మేము కొంతమంది పేర్లను శిఫారసు చేసేము, అందులో ఎనలేని ధైర్యసాహసాలు చేసిన రక్షణ పేరు ఉంది గాని ఈయన పేరు లేదు. బహుశ పద్మ అవార్డుల కమిటీ తాముగా నిర్ణయం తీసుకోని ఉండవచ్హు" అని ఆయన చెప్పేరు .

కేంద్ర ప్రబుత్వాన్ని అడిగితే "చీఫ్ ఇన్ ఫర్ మేషన్ కమీషనర్ వజాహత్ హబిబుల్లా మరియూ మాజీ బి.జె.పి. నాయకుడు హర్ష్ వర్ధన్ ఈయన పేరుని శిఫార్స్ చేసేరు. అంతే కాకుండా మాజీ జమ్మూకాష్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా గారు మరియూ ఎం.ఎల్.ఏ గులావ్ హసన్ ఈయన పేరును 2008 లోనే లికిత పూర్వముగా శిఫార్సు చేసేరు" అని తెలిపింది.

ఇంకోక పద్మా అవార్డ్ విషయములో .......ఈ సారి పద్మభూషన్ బిరుదు విషయములో.....ఈ అవ్వర్డుకు ఎన్నుకున్న వారిలో ఎన్.ఆర్.ఐ. హోటల్ అధినేత సంత్ సింగ్ చత్వాల్ ఉన్నారు. ఈయన కొన్ని సంవత్సరముల ముందు సి.బి.ఐ వారిచే ముంబైలో ఖైదు చేయబడ్డారు. ఈయన 9 మిల్లియన్ల డాలర్ల మేరకు ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మోసం చేసేరని ఖైదు చేయబడ్డారు. ఈయన మీదున్న కేసును ఆ తరువాత కొట్టిపారేసారు....ఎందుకనో తెలియదు. ఈయన మాజి అమేరికా ప్రేశిడెంట్ బిల్ల్ క్లింటన్ కు చాలా సన్నిహితుడట.

బి.జె.పీ వారు ఈయన మీద ఇంకా చాల కేసులు ఉన్నాయని చెబుతూ ఈయన ఈ బిరుదుకు అనర్హుడని తెలుపుతూ మన రాష్ట్రపతికి ఒక లేఖ కూడా రాసేరు.

రాజకీయ స్థిరత్వం కోసమే మేఘాలయాలో నలుగురికి ముఖ్యమంత్రి హోదాలు.....కాంగ్రెస్

మేఘాలయాలో ప్రస్తుతం నలుగురు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రం నిజమైన ముఖ్యమంత్రిగా పదవి విహిస్తున్నారు. మిగిలిన ముగ్గురికి ముఖ్యమంత్రి హోదా ఇచ్హేరు.

నిజమైన ముఖ్యమంత్రి దార్వింగ్ డియాంగ్‌డో లపంగ్ తన ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవటం కోసం, మిగిలిన ముగ్గురికీ ముఖ్యమంత్రి హోదాలు ఇచ్హేరట. అంటే ఈ ముగ్గురూ ముఖ్యమంత్రి చేయవలసిన పని తప్ప ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎటువంటి హోదా దొరుకుతుందో, ఆ హోదాలన్ని అనుభవిస్తారు.

జీతం, ప్రబుత్వ కారు, ఉచ్హిత బంగ్లా, అన్నిటికీ ప్రబుత్వ ఖర్చులు మరియూ ప్రబుత్వ ఖర్చుతో బద్రత దొరుకుతాయన్నమాట. ఈ ఖర్చంతా ఎవరి డబ్బుతోనో తెలుసుగా....పన్ను చెల్లింపు దారుల డబ్బుతో......ఇదేమిటని అడిగితే "రాజకీయ స్థిరత్వం" కోసమని ఒక్క మాటలో చెప్పింది కాంగ్రెస్.

మార్చ్ 2008 నుండి మేఘాలయాలో వరుసగా మూడు ప్రబుత్వాలు మారినై. రాష్ట్ర శాశన శభలో కాంగ్రెస్ కూటమి పక్షానికి 37 సీట్లు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ కు 28 సీట్లు వారి కూటమి పార్టీ యూ.డి.పి కి 9 సీట్లు.

అధికార పూర్వముగా ప్రకటన చేయబడ్డ మిగిలిన ముగ్గిరి ముఖ్యమంత్రి హోదాలూ "ముఖ్యమంత్రి" అనే పదవినే కించపరిచే విధముగా లేదా అని అడిగితే కాంగ్రెస్ అధికార ప్రకటన విభాగ అధికారి అభిషేక్ మనూ సంఘవీ "ఇలా ఎక్కడా జరగదు...జరగకూడదు. కానీ మేఘాలయా చిన్న రాష్ట్రం కాబట్టి , రాష్ట్రములో రాజకీయ స్థిరత్వం కోసం అలా చేయవలసి వచ్హింది...దీని వలన వచ్హే కష్ట నష్టాలని రాష్ట్ర పరబుత్వమే భరిస్తుంది" అని మేఘాలయా రాష్ట్ర ప్రబుత్వానికి మద్దత్తుగా మాట్లాడేరు.

కానీ కేంద్రములోని సీనియర్ కాంగ్రెస్ నాయాకులకు ఇది నచ్హలేదు....ఎవరో ఒకరు కోర్ట్ లో ఇలా నలుగురు ముఖ్యమంత్రులని నియమించకూడదని పిటీషన్ వేస్తారు.....అప్పుడు అదే సర్దుకుంటుంది అనే భావనలో ఉన్నారు.

"ఏది ఏమైనా ఇది కేంద్రం లోని కాంగ్రెస్స్ ప్రబుత్వానికి కీడు తెస్తుంది.........చిన్న, చిన్న రాష్ట్రాలలో ప్రబుత్వాన్ని స్థిరముగా ఉంచడం చాలా కష్టం ......అందుకనే మేము చిన్న రాష్ట్రాల ఏర్పాటును వద్దంటున్నాము" అని ఒక కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పేరు.

కేంద్ర ప్రబుత్వం మేఘాలయా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటుందట........వారి రాష్ట్రములోని రాజకీయ నిలకడని వారే చూసుకోవాలట....మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి,, ముఖ్యమంత్రి అవటానికి ముందు ఒక పార్టీ ఎం.ఎల్.ఏ తో సోనియా గాంధీని కలిసేరు.......మరి ఏం మాట్లాడుకున్నారో!

Monday, February 1, 2010

బాల్ తాఖరీ గాని, ఆయన కుటుంబ శభ్యులు గాని మరాఠీ వారు కారు, మహారాష్ట్రాకు చెందిన వారు కారు.....సుబ్రమణ్య స్వామి

సివసేనా వారు మరియూ మహారాష్ట్రా నవ నిర్మాణ సేనా వారు గానీ మరాఠీయులమని చెప్పుకోవటానికి విశ్వాసనీయమైన ఆధారంలేదు. ఈ విషయం బాల్ తాఖరీ మరియూ వారి కుటుంబీకులు తెలుసుకోవాలి అని జనతా పార్టీ ప్రెశిడెంట్ సుబ్రమణ్య స్వామి చెప్పేరు.

మహారాష్ట్రం, ముఖ్యముగా ముంబై నగరము "మాకు" అంటే మరాఠీయలకు మత్రమే సొంతమైనది, ఇంకెవరికీ సొంతం కాదు.....ఉత్తర, దక్షిణ భారతీయులకు ఈ నగరాలమీద ఎటువంటి హక్కు లేదని బాల్ తాఖరీ కుటుంబ శభ్యులు చేస్తున్న సర్వాధికార వాదన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటొంది.

మొదట ప్రముఖ క్రికెట్ వీరుడు సచిన్ టెండూల్కర్, తరువాత ప్రముఖ నటుడు అమితాబ్ బచ్హన్, ఆ తరువాత ప్రముఖ పారిశ్రామక వేత్త అనిల్ అంబానీ, బాల్ తాఖరీ చేస్తున్న రాస్ట్రీయ వాదానికి ఎదురు చెప్పేరని వారిని మాటలతో తాఖరీ కుటుంబీకులు బెదిరించేరనే విషయము మీ అందరికీ తెలుసు. ఈ మధ్య ప్రముఖ నటుడు సారుక్ కాన్ ని గూడా అలగే బెదిరించేరు.

ఇప్పుడు బి.జే.పి మరియూ అర్.ఎస్.ఎస్. తాఖరీ కుటుంబీకులు ముంబై నగరం గురించి మాట్లాడే విధానాన్ని ఖండిస్తూ భారతీయతత్వానికి మద్దత్తు ఇచ్హేరు. వీరు సివసేనా మరియూ మహారాష్ట్రా నవ నిర్మాణ సేనాకి అనుభందంగా ఉన్నవారు.....వీరే బాల్ తాఖరీ మహారాష్ట్రం గురుంచి చేస్తున్న సర్వాధికార ప్రకటనలను సహించలేక పోతున్నారు. నిన్న రాజీవ్ గాంధీ తాఖరీ కుటుంబీకులను ఖండించేరు.
ఇలా రాజకీయ రంగులు పులుముకుంటున్న తాఖరీ ప్రకటనలు సుబ్రమణ్య స్వామి ఖండనతో దేశాంతర సమశ్య గా రూపొందుతోందా అనిపిస్తోంది.

ప్రముఖ దిన పత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్హిన ఒక ప్రకటనలో "తాఖరీ కుటుంబీకులు అసలు మహారాష్ట్రాకు చెందిన వారూ కారు, మరాఠీయులూ కారు .....వీరు నాకు మళ్ళే ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు. వీరు మహారాష్ట్రాకు వలస వెళ్ళిన వాళ్ళు.....అలాంటి వీరు మాహారాష్ట్రం వారికి మాత్రమే సొంతమని చెప్పుకోవటం వారి అమాయకత్వాన్ని మరియూ వారు ఏదో ఒకటి చేస్తూ వారి పేరును నిలుపుకునే ప్రయత్నముగా కనబడుతోంది......భారతీయూలందరూ భారత మాత బిడ్డలే, భారత భూమి ఎక్కడిదాకా ఉందో, అక్కడిదాక అది భారతీయులందరికీ సొంతమే. బాష, కుల, మత బేదాలతో పని లేదు”

“అసలు మరాఠీయ బాషలో 70 శాతం సంస్క్రుత పదలే ఉన్నయి. కాబట్టి అది అన్ని బాషలలంటిదే. తమిళ బాషలో కూడా 44 శాతం సంస్క్రుత బాష కలిసుంది. మరాఠీ బాష రాసే విధానంలో దేవంగిరి బాష కలిసుంది, ఇది సంస్క్రుత బాషకు చెందింది. కాబట్టి తాఖరీ వాళ్ళు తమ వెర్రి మాటలను కట్టిబెట్టి, మరాఠీయులం అన్న ధీమాను పక్కకు తోసి భారతీయలమని చెప్పుకుంటూ టెర్రరిస్టులను, తీవ్రవాదులని తరిమికోట్టలి......నా డి.ఎన్.ఏ మరియూ తాఖరీ వాళ్ళ డి.ఏన్.ఏ ఒకటే.....ఇది నేను ఒకసారి హైదరబాద్ వెళ్ళినప్పుడు నా తల వెంట్రుక ని, అక్కడున్న తాఖరీ వారి తల వెంట్రుకని పరిశొదనకి పంపినపుదు తెలిసింది అని ఆయన చెప్పేరు.”

భారత దేశపు ప్రచురణ కర్తలు గూగుల్ మీద కోర్ట్ లో దావా

ఒక భారత దేశపు ప్రచురణ సంస్త మరి కొన్ని భారత దేశపు ప్రచురణ కర్తలతో కలిసి గురువారం నాడు అమెరికా లోని ఒక కోర్టు లో గూగుల్ బుక్ సెటిల్మెంట్స్ మీద రచయతలకు తెలుపకుండా, వారి అనుమతి తీసుకోకుండా లెక్కలేనన్ని పుస్తకములను స్కానింగ్ చేసేరని గూగుల్ మీద ప్రచురణ హక్కుల ఉల్లంఘన క్రింద దావా వేసేరు.

ఇండియన్ రిపోగ్రాఫిక్ రైట్స్ ఆర్గనైషేషన్ ( IRRO….Indian Repographic Rights Organisation) మరియూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్ (Fedaration of Indian Publishers) కలిసి న్యూయార్క్ లోని ఒక కోర్ట్ లో ఈ దావా వేసేరు.
ప్రచురణ కర్తల హక్కులను, తమ హక్కుగా తీసుకోవటమనేది గూగుల్ యోక్క ఏకపాక్చీక గుణాన్ని చూపుతోందని ఐ.ఆర్.ఆర్.ఓ (IRRO) న్యాయవాది సిద్దార్ద్ ఆర్యా గారు ఆరొపించేరు.

ఐ.ఆర్.ఆర్.ఓ ని 2000 సంవత్సరం ప్రచురణ కర్తలు అందరూ కలిసి ప్రచురణ అయిన పుస్తకాన్ని మళ్ళీ ప్రచురించుటకు అనుమతినిచ్హే కార్యాచరణ విభాగముగా ఏర్పరచు కున్నారు. కొత్త కల్పన (New Innovation) అన్న పేరుతో కాపీరైట్లు ఉన్న కోన్ని వేల పుస్తకాలని స్కాన్ చేసింది గూగుల్. రచయతల దగ్గర నుండి ఎటువంటి అనుమతీ ( ఉచితంగా గాని, డబ్బు ఇచ్హి గాని) తీసుకోకుండా పుస్తకాలని స్కాన్ చేసి భారతదేశం లోని పలు భాషలలో అచ్హువేసేరు. ఇది అంతర్జాతీయ ప్రచురణ హక్కుల ఉల్లంఘణ అవుతుందని సిద్దర్ద్ ఆర్యా గారు చెప్పేరు.

గూగుల్ లైబ్రరీ ప్రాజక్ట్ అన్న పేరుతో కొన్ని మిలియన్ల పుస్తకాలని అనుమతి లేకుండా గూగుల్ ప్రచురించింది. దీనికి జిబిఎస్.2 (GBS 2.0) అన్న పేరు పెట్టేరు. గూగుల్ వారి వాదన ఏమిటంటే, వారు (గూగుల్) ప్రచురించిన తరువాత, ఆ పుస్తక రచయత వారి ప్రచురనకు అడ్డు చెప్పక పోతే, ఆ పుస్తక రచయత వారికి హక్కు ఇచ్హినట్లేనట. (అంటే, ప్రతి పుస్తక రచయత, తన పుస్తకము గూగుల్ ప్రచురించిందా లేదా అని ప్రతి రోజూ చూస్తూ ఉండాలి కాబోలు) ఇది స్వాభావికమైన అన్యాయం మరియూ ఇప్పుడున్న చట్టాలకి విరుద్దం.

గూగుల్ చేసిని ఈ పనికి అమేరికా లోని ఆతర్స్ గిల్డ్ (Authors Guild) మరియూ అమేరికా ప్రచురణ కర్తల సంఘం (American Publishers Association) గూగుల్ మీద ప్రచురణ హక్కుల ఉల్లంఘన క్రింద దావా వేసేరు....అయితే, ఈ దావాని కోర్టు విచారణకి తీసుకునేలోపు, గూగుల్ తో రెండు సంఘాలూ ఒక సెటిల్మెంట్ చేసుకున్నాయి.