Sunday, January 31, 2010

సోషియల్ నెట్ వర్క్ సైట్లు పరిచయమున్నవారు కలుసుకోవటానికి మాత్రమే కాకుండా అపరిచితులకు కూడా ఉపయోగపడాలి.....ఒక భారతీయుడు తన ఆశాను నిజం చేసుకున్నాడు

మీరు ఎప్పుడైనా, ఎవరినైనా చూసేరా? వారిని ప్రశంసించాలనో లేక ప్రస్నించాలనో అనుకున్నారా?....ఎవరైనా అరటి తోక్కును క్రింద పడేసారా, వారిని తిట్టాలనుకున్నారా?...ఎవరైనా ఒక గుడ్డి వారికి సహాయం చేయడం చూసేరా, వారిని ప్రశంసించాలనుకున్నారా?....లేక దేని గురించైనా మీ అభిప్రాయం, వేదన,తెలుపదలచుకున్నారా?

పై ఆశాలు ఉన్నవారి కోసం అమేరికాలోని సాండిగొ నగరములో వున్న సదర్న్ కాలిఫోర్ణియా విశ్వవిధ్యాలయములో, కంప్యూటర్ సైన్స్ చదువులో మాస్టర్స్ డిగ్రీ పుచ్హుకున్న 30 ఏళ్ళ భారతీయుడు శాంసన్ మానిక్ రాజ్ మొదలుపెట్టిన జాలలో జేరండి, మీ ఆశలు నెరవేర్చుకోండి.

"సోషియల్ నెట్ వర్క్ సైట్లు ఎందుకని పరిచయమున్న వారిని కలిపే చోటుగానే ఉండాలి? ఎందుకని స్నేహితుల కోసమే గుంపు చేర్చే చోటుగా ఉండాలి? ఎందుకని అది అపరిచితులను, పరిచితులుగా చేసే చోటవకూడదు? అపరిచితులు దేని గురించైనా చెప్పుకునే చోటవకూడదు? .....ఇప్పుడు పాపులర్ గా ఉన్న సోషియల్ నెట్ వర్క్ సైట్లు స్కూల్,కాలేజ్,ఆఫీస్ మరియూ ఒకరినోకరు తెలిసున్నవారిని కలిపే చోటుగానే ఉన్నయి .....మరి అపరిచితులు ఏం చేస్తారు?" అంటున్నారు ఈయన.

"అపరిచితులు చాలా ముఖ్యమైనవారు. వారి ప్రతి రోజు జీవతంలోనూ ఏదో ఒక విషయము జరుగుతుంది. అది వారిని ప్రేరేపించవచ్హు లేక కలత పరచవచ్హు...అలాంటి విషాయలని వారు ఇతరులతో పంచుకోవటానికి ఒక చోటు కావాలి, ఒక గుంపు కావాలి.....దీనికోసమే నేను ఒక చోటు మొదలుపెట్టేను, దీనిలో ఎవరైనా చేరవచ్హు, దేనిగురించైనా వ్రాయ వచ్హు, వారి మనసులోని మాటని అందరితో పంచుకోవచ్హు, ఎవరినైనా స్నేహితులుగా కలుపుకోవచ్హు...నా అభిమతం, ఆశా, కల ఏమిటంటే అందరినీ అందరితోటి కలపడమే" అని ఆయన తన ఆశను చెప్పేరు.

"పర్సనల్ బ్లాగ్ ఉండవచ్హు (Macro blogging)...కానీ అందులో రాస్తే చాలా కోంతమందే చూస్తారు. కానీ ఈ చోట్లో (Micro blogging) వ్రాస్తే చాలా మంది చూస్తారు" అన్నారు .

స్పాం మరియూ కించ లేక గాయపరిచే వ్రాతలు రాసే వారి గురించి అడిగినప్పుడు "మేము చాలా మెలుకువగా, ఖచ్హితముగా ఉంటాము....అటువంటి వారిని ఏరిపారేస్తాము" అని చెప్పేరు.

ఈ మైక్రో బ్లాగ్గింగ్ వెబ్ సైట్ మోదలుపెట్టి 3 వారాలే అవుతున్నా ప్రజల స్పంధన చాలా ఎక్కువాగా ఉంది........ఒక సారి ఈయన జాల www.blauk.com కు వెల్లి చూసి,ఈయన ప్రయత్నం గురించి మీకు ఏమనిపిస్తోందో తెలియపరచండి.

ఇలా చిన్న, చిన్న ఆశలతో మోదలుపెట్టబడినవే గూగుల్, యాహూ, ఫేస్ బుక్, ఆర్కుట్, ట్విట్టర్ మరియూ ఫ్లిక్కర్. నాకు ఈయన చేసే ప్రయత్నం విజయవంతమవుతుందనిపిస్తోంది.

భారత దేశపు స్థాపనలు అంతర్జాల యుద్ధాన్ని (Cyber warfare) ఆపడానికి సిద్దముగా లేవు.......మెకాఫీ (McAFEE)

భారత దేశం లోని అతి ముఖ్యమైన అభివ్రుద్ది పధకాలూ, రహస్య సమచారాలు, సంస్థలు అంతర్జాల యుద్దములో (Cyber War) నాసన మవటానికి ఎక్కువ అవకాసాలు ఉన్నాయని ప్రపంచ అంతర్జాల బధ్రతను రక్షణ చేస్తున్న మెకాఫీ కంపెనీ మరియూ అమెరికాలోని వాషింగ్టన్ లో ఉన్న తింక్-టాంక్ సెంటర్ ఫర్ స్ట్రేటజిక్ అండ్ ఇంటెర్నేషనల్ స్టడీస్ (Think-Tank Centre for Stretagic and International Studies) వారు తెలిపేరు.

ఇన్ ద క్రాస్ ఫైర్: క్రిటికల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ సైబర్ వార్ ఫేర్ (In the Cross Fire:. Critical Infrastructure in the age of Cyber War) అన్న రిపోర్ట్ ని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్దీక సంఘములో 14 దేశాలకు చెందిన 600 అంతర్జాల రక్షణా సిబ్బంది ఇప్పుడు జరుగుతున్న అంతర్జాల యుద్దం గురించి చేసిన ఆలోచనల తరువాత ఈ విధముగా ప్రకటించేరు.

2009 లో కనుగోనబడ్డ "అరోరా" అనే జాలా చ్హేదన అతి పెద్దదైనదే కాకుండా చాలా అత్యోన్నతమైన జాల యుద్దం. ఈ జాల చ్హేదనాన్ని ప్రపంచములోని అతి ముఖ్యమైన దేశాల రహస్య పధకాలను దాచే కంప్యూటర్లను, సంస్తలని ఉద్దేసించి తయారు చేయబడ్డ యుద్ద క్షిపిని అని మెకాఫీ కంపేనీ అదినేత దవే డివాల్ట్ తెలిపేరు.

భారత దేశం వారు ఈ జాలా క్షిపినిని అడ్డుకోవడంలో తమ్ము తాము తాయారు చేసుకోలేదు. కానీ 64 శాతం మంది, బారత దేశపు జాలా చట్టాలు ఇటువంటి జాలా యుద్దాలని అడ్డుకోనేవిగా లేవు అని తెలిపేరు.......అంతర్జాలా యుద్దాలు చాలా భయంకరమైనవి......కనపడకుండా దేశాభివ్రుద్దికి ఎక్కువ నాశనాన్ని తెస్తాయి.

2007 లో ఒక సారి, 2009 లో ఒక సారి ఈ విషయాన్ని మన దేశానికి తెలియపరిచేరుట. సుమారు 120 దేశాలు జాలా గూడాచారా జాలాలని తయారు చేసే పనిలో ఉన్నారు. కోన్ని దేశాలు ఇటువంటి జాలలని తయారుచేసి యుద్దానికి పూనుకున్నారు. అందులోని జాలే ఈ "అరోరా". కానీ ఏ దేశము లో తయారు చేయబడిందో కనుక్కొవటం కష్టం కనుక దానిని అడ్డుకోనే విధానాన్ని ప్రతి దేశమూ కనుక్కోవాలి.

ఇప్పటి రిపోర్టులను బట్టి ఈ గూడాచార జాలలు తయారు అమేరికాలో 36 శతము, చైనాలో 33 శాతముగా వున్నదట.....బారతదేశములో సుమారు 80 శాతం మంది ప్రస్తుతము ఈ జాలా యుద్దము మూలముగా డిడిఓఎస్ (DDOS…..Distributed Denial of Service Attacks) అనే సందిగ్దమైన పరిస్తితిని ఎదుర్కోంటున్నారు. దీని అర్దం ఏమిటంటే ఈ యుద్దము వలన కోన్ని జాలాలు మరియూ కోన్ని నెట్ వర్క్ లు తెరుచుకోవు లేక పనిచేయవు. అల తెరుచుకోక పోతే అక్కడి పని స్తంభించినట్లే కదా?

బారత దేశమే కాకుండా చైనా కూడా ఈ యుద్దములో నష్ట పోతుందట. ఈ రెండు దేశాలే కాకుండా స్పైన్ మరియూ ఇటాలీ కూడా నష్ట పోతుందట. .....కాని చైనాలోని సంస్తలలో 62 శాతం ఈ యుద్దాన్ని ఎదుర్కునే కట్టుదిట్టాల బద్రతని పెట్టుకుని వున్నారట.........భారత దేశముకూడా ఈ యుద్దాలని ఎదుర్కోనే బద్రతలను చేసుకోవాలని, లేకుంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ యుద్దము మూలముగా ఎక్కువ నష్టపోవాల్సివస్తుందని హెచ్హరించేరు........ లేకపోతే బ్యాంకులు,స్టాక్ మార్కెట్లు, బద్రతా కేంద్రాలూ మరియూ పెద పెద్ద సంస్తలు ఈ యుద్దానికి బలి కావలసినదే.

Saturday, January 30, 2010

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు గురించి పరిశీలించబోయే కమీషన్ రూపులు దిద్దుకుంటోంది

ప్రత్యేక తెలంగాణాను ఎలా ఏర్పాటుచేయాలి అని పరిశీలించబోతున్న కమీషన్ రూపులని పరి పూర్ణంగా ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కోర్ కమిటీ కావలసిన అన్ని ఏర్పాటులను పూర్తిచేసినట్లు తెలిసింది. ఒక విధముగా చెప్పాలంటే ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు రంగం సిద్దమైనట్లే.

ఒకే ఒక్క విషయమే కాంగ్రెస్ కోర్ కమిటీని సంధిగ్ధంలో ఉంచుతోంది. అది ఏమిటంటే ప్రత్యేక తెలంగాణా ఏర్పరిచేటప్పుడు, అది ఆర్ధీకంగా బలపడాలి మరియూ ఆర్ధీకంగా ముందుకుపోవాలి. దీనికి కావలసిన వనరులతో ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయాలి. ఈ విషయాన్ని క్చుణ్ణంగా పరిశోదించగలవారినే కమీషన్ కి ఎన్నుకోవాలనే ప్రయత్నములో కాంగ్రెస్ కోర్ కమిటీ వున్నట్లు చెబుతున్నారు.

ఒక రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జి నిర్వహణలో కమీషన్ ఏర్పాటు అవుతోందని, ఆ కమీషన్ 6 నెలలో తన రిపోర్టును కేంద్రానికి అందిస్తుందని తెలంగాణాకు చెందిని ఎం.పీ లు నమ్ముతున్నారు.

ముంబై మత కలహల గురించిన నిజం తెలుసుకోవటం కొసం నియమించిన రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జి బి.ఎన్. శ్రీ క్రిష్ణ గారు లేకపోతే జడ్జీ ఏ.ఆర్.లక్షమనన్ గారూ గానీ ప్రత్యేక తెలంగాణా గురించి ఏర్పాటు చేసే కమీషన్ కి నిర్వాహాకులుగా వుండవచ్హునని బావిస్తున్నారు. ఈ కమీషన్ లో ముగ్గురు లేక ఐదుగురు మెంబర్లు ఉంటారట. ఈ మెంబర్లలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి క్షుణ్ణంగా తెలిసున్నవారు కూడా ఉంటారట.

ఈ కమీషన్ తెలెంగాణాలో ఉన్న అన్ని రంగాల మనుష్యుల దగ్గరనుండి ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు గురించి అభిప్రాయాలు సేకరిస్తారు.
తెలంగాణాలో 60 శాతం మంది మాత్రమే ప్రత్యేక తెలంగాణా కావాలని కోరుకుంటున్నారట. అందుకని ఈ కమీషన్ తెలంగాణాలోని చిన్న, చిన్న రాజకీయపార్టీల వారిని, పరిశ్రమ అధినేతలని,విధ్యార్ధులని, ఎన్.జి.ఓస్ ని మరియూ జాయింట్ ఆక్షన్ కమిటీ మెంబర్లను కలిసి అభిప్రాయ సేకరణ చేస్తారట.........రాయల సీమ మరియూ కోస్తా ఆంద్రాలలొ రాజాకీయ పార్టీలని, ఎన్నుకున్న కోంత మంది పారిశ్రామక వేత్తలను మరియూ ప్రజా పెద్దలను కలుసుకుని వారి అభిప్రాయాలను కూడా తీసికుంటారుట.

తెలెంగాణా ఆర్ధీఖ పరిస్తితి అంచనాకు ముఖ్యత్వం ఇస్తూ, నదీ జలాల పంపకాలు, సరిహద్దులూ మరియూ హైదరాబద్ హోదా గురించి క్షుణ్ణంగా పరిసీలిస్తారని కాంగ్రెస్ కు చెందిని ముఖ్య కార్యకర్త తెలిపేరు.

"ఆస్ట్రేలియా" ప్రపంచములోనే ఎక్కువ పాపాలు చేస్తున్న దేశం........పరిశోధనలో వెళ్ళడి

భూమండళములో ఎక్కువ పాపాలు చేస్తున్న దేశం "ఆస్ట్రేలియా" అని ఒక పరిశొధనలో తేలిందట.

మొత్తం 7 పాపాలో, అన్ని పాపాలలోనూ మొదటి స్థానం సంపాదించి ఎక్కువ పాపాలు చేస్తున్న దేశముగా "ఆస్ట్రేలియా" ప్రకటించబడింది.

కామవాంఛ, అత్యాశ, అహంకారం, తిండిపోతు తనం, సోమరితనం, ఆగ్రహము మరియూ అసూయ అను 7 పాపాలను లెక్కకట్టి ఈ పరిశొధన చేయబడుతుందట.

ఈ సారి ఈ పరిశొధనలో ఎక్కువ పాపాలు చేస్తున్న దేశముగా "ఆస్ట్రేలియా" మొదటి స్థానం చేపట్టిందని బి.బి.సీ వారి ఫోకస్ పత్రికలో ప్రకటించబడిందని కొరియర్ మైల్ దిన పత్రిక తెలిపింది. బి.బి.సీ వారు ఈ ఫోకస్ పత్రికలో సైన్స్, టెక్నాలజీ మరియూ భవిష్యత్తు గురించి రాస్తారట. అలాంటి పత్రికలో అవమానకరమైన గౌరవం "ఆస్ట్రేలియా" పొందిందని తెలిపేరు.

ఆస్ట్రేలియా వారి పెద్ద బలహీనం "అసూయ" పడటంట. అందుకనే ఆ దేశం ఎక్కువ పాయింట్లతో అమేరికా, కెనడా, ఫిన్లాండ్, మరియూ బ్రిటన్ కన్నా ఎక్కువ స్థానాలు ఎదిగి మొదటి స్థానం సంపాదించిందట.

ఈ పరిశోధనా వ్యాసంలో "మానవులు ప్రక్రుతిగా మంచివారు కారు" అని వాదిస్తూ, ఈ 7 పాపాలలో ప్రతి మనిషీ ఏదో ఒక పాపానికి లోనవుతాడని, అలా ఒక పాపము కంటే ఎక్కువ పాపములను చేసే విధానాన్ని గమనించి ఈ పరిశోధన జరపబడుతోందని తెలియపరిచేరు.

ఈ పాపాలు చేసే దేశాల పట్టీలో తిండిపోతుతనంలో అమేరికా, కామ వాంఛలో దక్షిణ కోరియా, అహంకారం మరియూ సోమరిపోతుతనంలో ఐస్లాండ్, అత్యాశలో మెక్సికో మొదటి స్థానం వహిస్తున్నట్లు పరిశొధనా ప్రకటనలో వెలువడించేరు.

Friday, January 29, 2010

ముంబై నగరం ప్రతి భారతీయుడికీ చెందిందని చెప్పిన ముకేష్ అంబానీపై బాల్ తాకరీ గారు విరుచుకు పడ్డారు

సివ సేనా పార్టీ అధినేత బాల్ తాకారీ గారు రిలయన్స్ కంపనీ అధినేత ముకేష్ అంబానీ గారి పై విరుచుకుపడ్డారు. కారణం, అంబానీ గారు ముంబై నగరం ప్రతి భారాతీయుడికీ చెందినదని చెప్పడమే.

"రిలయన్స్ కంపెనీ మీద అంబానీగారికి ఎంత హక్కు వున్నదో, అంతే హక్కు మరాఠీ ప్రజలకు ముంబై నగరం మీద వున్నది" అని బాల్ తాకరీ గారు తమ పార్టీ పేపరైన "సమానా" లో రాసేరు.

"ముంబై నగరము మరాఠీల రాజధాని, అది ఎప్పటికీ వారి రాజధానిగనే ఉంటుంది, ముంబై మరియూ మరాఠీల జోలికి పోకండి" అని హెచ్హరిస్తూ "పండిట్ అంబానీగారు ముంబై, చెన్నై, డిల్లిలని ప్రతి భారతీయుడికీ సొంతమని చెప్పేరే, మరి ఎందుకు ఆయన అహమదాబాద్, జాం నగర్, మరియూ రాజ్ కోట్ ని చెప్పలేదు" అని బాల్ తాకరీ అడిగేరు.

ముంబై నగరములో టాక్సీ పర్మిట్లు కావాలంటే మరాఠీ భాష ఖచ్హితముగా తెలిసి ఉండాలి అని ఈ మధ్య మహారాష్ట్రా ప్రబుత్వము ప్రకటించింది. ఆ ప్రకటన మీద మాట్లాడుతూ "ఇది దురద్రుష్టమైన విషయం.....మహానగరాలు అందరి భారతీయులకీ చెందినవి" అని రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీగారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకోనమిక్స్ లో జరిగిన ఒక సదస్సులో మహారాష్ట్ర ప్రబుత్వము చేసిన ప్రకటన గురించి ఆయనని అడిగినప్పుడు ఆయన ఇలా స్పంధించేరు.

పోయిన సంవత్సరం నవెంబర్ నెలలో క్రికెట్ వీరులు సచిన్ టెండూల్కర్ మహారాష్ట్రా గురించి చేసిని ఒక మాటకి "మీరు క్రికెట్ ఆట మాత్రం ఆడండి....రాజకీయాలలో తల దూర్చకండి" అని బాల్ తాకరీ గారు సచిన్ టెండూల్కర్ని విమర్షించటం ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాను. "సచిన్ టెండూల్కర్ క్రికెట్ పిచ్ గురించే మాట్లాడాలి.....రాజకీయాల గురించి మాట్లాడకూడదు.....ముంబై నగరానికి ఎవరు రావాలోననే తేల్చే హక్కు మాకు మాత్రమే వుంది......ఆయనకు లేదు" అని బాల్ తాకరీ గారు చెప్పీరు .

మహారాష్ట్ర ప్రబుత్వము టాక్సీ పర్మిట్ల గురించి చేసిన ప్రకటనను కేంద్ర ప్రబుత్వ ఒత్తిడితో వెనక్కు తీసుకుంది. దీనికి బాల్ తాకరీ గారు ఎటువంటి కమెంటూ ఇవ్వలేదు.

ఆంటే కేంద్ర ప్రబుత్వమే అవసరమైన చర్యలు తీసుకోవాలి.

మీకు హిందీ పాటలు వచ్హా? బాగా పాడగలరా? అయితే ఈ పోటీలో పాల్గోని రూ.5,00,000 గెలుచుకోండి.

అమేరికాలో ఉన్న "టాలెంట్ ట్రోవ్" అనే ఒక మీడియా మరియూ వినోదాన్ని అందించే కంపేనీ భారతదేశములొ బాగా పాడగలిగే నైపుణ్యము ఉన్న వారిని వెతికే ప్రయత్నము మోదలుపెట్టింది. దీనికోసం ఆన్ లైన్ పాటలపోటీ ప్రారంభించింది.

"టాలెంట్ ట్రోవ్ బాలీవూడ్ సింగర్ 2010" అన్న పేరుతో ఆన్ లైన్ మూలముగా మొదలుపెట్టబడే ఈ పోటీలో పాటలు పాడాలనుకునే ఆసక్తి గల వ్యక్తులు ఫిబ్రవరి 1 వ తారీకు నుండి 60 రోజులలోపు తమ పేరును టాలెంట్ ట్రోవ్.కాం లో నమోదు చేసుకోవాలి.

మీ పేరూ, మరి ఇతర వీవరాలు రిజిస్టర్ చేసుకున్న తరువాత మీకు నచ్హిన ఒక హిందీ పాటని ఆడియోలో గాని, విడియోలో గాని రికార్డ్ చేసి దానిని ఆ కంపనీ వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలి.

భారత దేశములో వెలికి తీయబడని బ్రహ్మాండమైన పాటలు పాడగలిగే నైపుణ్యము గల వారు చాలా మంది ఉన్నారు. కొత్తవారిని పైకి తీసుకు రావాలనే ఉద్దేసం గల మా కంపేనీ, అటువంటి వారికి ప్రపంచ వ్యాప్తముగా ఒక వేదికను ఇవ్వాలని మేము ఈ పోటీని నిర్వహిస్తున్నామని టాలెంట్ ట్రోవ్ ఇన్ కార్పోరషన్ అధినేత జతీందర్ సింగ్ తెలిపేరు.... హిందీ పాటలు పాడుకోవడం భారత దేశీయులకు ఒక దిన చర్యగా వుంటోంది. కాబట్టి ఈ పాటలు పాడేవారిని ప్రతి ఇంటి ముంగిట నిలపాలనేదే మా కోరిక అని ఆయన చెప్పేరు.

"బాలీవూడ్ సింగర్ 2010" పోటీలో రూ.5,00,000 గెలుపోందే వారిని, దీనిలో రిజిస్టర్ చేసుకునే వారు మరియూ ఈ వెబ్ సైట్ కి వచ్హే విసిటర్స్ ఎన్నుకుంటారని ఆయన చెప్పీరు.

ఈ పోటీ గురించిన అన్నీ వివరాలని టాలెంట్ ట్రోవ్.కాం (http://www.talenttrove.com) లో కి ఒక్ సారి తొంగి చూసి తెలుసుకోవలసింది గా కోరుతున్నాను.

Thursday, January 28, 2010

భారతదేశాన్ని కానీ, చైనా ని కానీ మొదటి స్థానం లోకి రానివ్వం.....అమేరికా అధ్యక్షుడు ఒబామా

"అమేరికా అభివ్రుద్ది స్తంభించిపోయింది, ఆగిపోయింది, ఒకేచోట నిలబడిపోయింది. బారతదేశమూ మరియూ చైనా దేశాలు అన్ని రంగాలలోనూ అభివ్రుద్ది చెందుతున్నాయి. త్వరలోనే ఆ రెండు దేశాలు అభివ్రుదీ చెందిన దేశాలతో పోటీపడి, అన్ని రంగాలలోను సూపర్ పవర్ గా మొదటి స్థానాన్ని పొందవచ్హు. ఎప్పుడూ మొదటి స్థానములో వున్న అమేరికా రెండవ స్థానానికి తోయబడుతుంది....అది మనం ఒప్పుకోకూడదు. అమేరికా రెండవ స్థానములో ఉండటం నేను సహించలేను. అమేరికాలో ఎవరూ సహించరు. కనుక మనమందరమూ కలసి ఆగిపోయి వున్న మన దేశ అభివ్రుద్దికి కలిసి పనిచేసి, అభివ్రుద్దిని ముందుకు కదిలించి ఎప్పుడూ మోదటి స్థానములోనే ఉండాలి" అని అమేరికా అధ్యక్షుడు ఒబామా 2010 లో, అమెరికా కాంగ్రెస్ లో తన మొదటి ప్రశంగంలో చెప్పేరు.

మన దేశము చాలా కాలమునుండి ఒకేచోట నిలబడి పోయి వున్నది. దేశ పరిస్థితులు క్చీణమైన స్థితిలో ఉన్నా ఎవరూ ఎటువంటి చర్యా తీసుకోలేదు. ఈ లోపు చైనా, జెర్మనీ మరియూ భారత దేశాలు విపరీతమైన అభివ్రుద్ది పొందుతూ ముందుకు సాగి పోతున్నాయి...ఒక్క రంగంలోనే కాదు గణితం, సైన్స్, దేశాభివ్రుద్ది, పెట్టుబడులు ఇలా అన్ని రంగాలలోనూ ముందుకు వెడుతున్నాయి" అని తన 70 నిమిషముల ప్రశంగంలో చెప్పేరు.

అమేరికాకు మొదటి బ్లాక్-ప్రెసిడెంటుగా పోయిన సంవత్సరము జనవరి 20 న పదవి చేపట్టిన ఒబామా అమేరికన్ సెనేట్ తన అభిప్రాయాలకు పూర్తిగా అగీకరించకపోవడం, తను ప్రవేసపెట్టిన కొత్త పధఖాలని అడ్డుకోవడం చేస్తూండటంతో, వారిని ఉద్దేసించి "నేను అమేరికాకు మంచి అధ్యక్షుడిగా ఒక సారి ఉంటేచాలు, ఏమీ చేయలేని అధ్యక్షుడిగా రెండు సార్లు ఉండదలుచుకోలేదు.....అమేరికా ఎప్పటికీ అనీ రంగాలలోనూ సూపర్ పవర్ గా ఉండాలని, దానికోసం తను చేపట్టిని కార్యక్రమాలకు మద్దత్తు ఇవ్వాలని" కోరేరు.

10 అమేరికన్లలో ఒకరికి ఉద్యోగం లేదు,చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి, చిన్న పట్టణాలూ, గ్రామాలు అభివ్రుద్దిలో బగా దెబ్బతిని వున్నాయి. వీటిని సరిచేయడమే మన తక్షణ కర్తవ్యం. ఆర్ధీక తుఫాన ముగిసింది. ఆర్ధీక పరిస్తితులు మేరుగుపడటం మోదలైనది. కానీ అర్ధీక తుఫాన చేసివెళ్ళిన ద్వంసం మాత్రం అలాగే ఉన్నది. దీనివలన ఎంతోమంది ఆందోళన చెందుతున్నారు....కొంతమంది కోపంగా ఉన్నారు....ఈ పరిస్తితులనుండి బయటపడడానికి పోయిన సంవత్సరం పెద్ద బ్యాంకీలకు ఇచ్హిన ఋణములో 30 బిలియన్ ల డబ్బు తిరిగిరావడంతో దానిని అమేరికా అభివ్రుద్దికే వాడతానని చెప్పేరు.

అందులో మొదటిదిగా 2010 లో నిరుద్యోగ సమస్య తీర్చేవిధముగా చిన్న, చిన్న వ్యాపారస్తులకు పన్ను మినహాయింపు ఇస్తాను. అలాగే చిన్న, చిన్న బ్యాంకులకు అప్పుగా ఇచ్హి, చిన్న వ్యాపారస్తులకూ,వాడుకదారులకూ అప్పు ఇవ్వవలసినదిగా చేస్తాను. మన దేశంలోని పనులను విదేశాలకు ఇస్తున్న వ్యాపార సంస్తలకు పన్ను రాయతీలు రద్దు చేస్తాను .

ఆఫ్ గనిస్తాన్ నుండి 2011 లో మన సైనిక దళాలను తిరిగి వచ్హేటట్లు చేస్తాను. అలాగే ఇరాక్ లో శాంతి బద్రతలు నెలకోల్పి అక్కడి నుండి కూడా మన సైనికదళాలను తిరిగి వచ్హెటట్లు చూస్తాను. సైన్స్, చదువు, రీసెర్చ్లలో అందరినీ కలుపుకోని పని చేస్తాను అని చెబుతూ ఉద్యోగ అవకాశాల కొసం తాని ప్రతిపాదించిన బిల్లు వెంటనే తన టేబుల్ మీదకు రావాలని అదేసించేరు.

బాల్య వివాహాలను కూడా రిజిస్టర్ చేస్తామంటున్నది రాజస్తాన్ ప్రబుత్వం

రాజస్తాన్ ప్రబుత్వం బాల్య వివాహాలను కూడా రిజిస్టర్ చేసేందుకు పూనుకుని ఆ విషయాన్ని ప్రకటించింది...ఈ ప్రకటన అక్కడ పెద్ద చర్చగా మారింది......ఆ రాష్ట్రం లో ఉన్న మహిళా సంఘాలూ, సంఘ సేవకులు దీనికి తమ ఎదిరింపును తెలుపుతూ, బాల్య వివాహాలను రిజిస్టర్ చేస్తామని చెప్పెడం, పరోక్షముగా ప్రబుత్వమే బాల్య వివాహాలను రాష్ట్రం లో ప్రొస్చాహిస్తోందని అంటున్నారు.

బాల్య వివాహాలను రిజిస్టర్ చేసినందువలన, రాష్ట్రములో ఎన్ని బాల్య వివాహాలు జరుగుతున్నాయో తెలుసుకోవటమే కాకుండా, బాల్య వివాహాల వలన, వివాహమైన ఆడపిల్లలకు వారు పెద్ద అయినాక, వాళ్ళకి జరిగే అన్యాయాలనుండి వారిని కాపాడవచ్హునని రాష్ట్ర ప్రబుత్వము చెబుతోంది.

బాల్య వివాహాలు రాజస్తాన్లో ఇప్పటికీ ఎక్కువగానే జరుగుతున్నాయి. 2006 లో ఒక ప్రఖ్యాత టీ.వీ చానల్ వారు 10 ఏళ్ళ అబ్బాయికీ, 8 ఏళ్ళ అమ్మాయికీ పెద్దలందరి సమక్షములో జరిగిన ఒక పెళ్ళిని చూపించి, బాల్య వివాహాలు రాజస్తానులో ఇంకా జరుగుతునే వున్నాయని చూపించేరు.....4 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికీ బాల్యవివాహాలు జరుగుతునే వున్నయి. సుమారు 68 శాతం ఆడపిల్లలకు 18 ఏళ్ళ లోపే వివాహము జరుగుతున్నది. ఈ బాల్య వివాహాలను ఆపలేని ప్రబుత్వం ఇప్పుడు ఈ పెళ్ళిలను రిజిస్టర్ చేయాలని నిర్ణయించుకుంది.

అనీ పెళ్ళిలని రిజిస్టర్ చేస్తాం, అది పెద్దవారి వివాహము కానివ్వండి లేక బాల్య వివాహం కానివ్వండి. బాల్య వివాహాలు జరిగినప్పుడు........ఆ వివాహితులలో భార్యో, భర్తో చనిపోతే, వాల్లకు పుట్టిన పిల్లలు ఏ ఆధారమూ లేకపోతే ఏమవుతారు...ఒక వేల భర్త చనిపోతే భర్త ఆశ్తిలో భార్య ఏ ఆదారముతో ఆశ్తిలో వాటా అడుగుతుంది....వారి వివాహము రిజిస్టర్ అవకపోతే వారికి ఏ అండా లేకుండా పోతుంది. అని రాజస్తాన్ ప్రబుత్వం చెబుతోంది.

కానీ ఈ ఆర్గ్యూమెంటుని మహిళా సంఘాలూ, సంఘ కార్య కర్తలూ ఒప్పుకోవటం లేదు. ఇదే గనుక జరిగితే బాల్య వివాహాలను రద్దు చేస్తున్నట్టు వేసిన చట్టం ఏమవుతుంది? ప్రబుత్వమే ఆ చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది....బాల్య వివాహాలకు పాల్పడుతున్న వారిని ప్రోష్చాహించటం అవుతుంది అంటున్నారు.

ఇది చాలా కష్టమైన సమశ్య.....ఎన్ని చట్టాలు పెట్టినా బాల్య వివాహాలు జరుగుతునే ఉన్నాయి ...వాటిని అడ్డుకోవటం కష్టంగానే ఉన్నది.....ప్రజలలో మార్పు వస్తేనే తప్ప ఈ సమాజిక వ్యతిరేఖ శక్తిని ఆపలేరు.....ఇప్పటికీ అక్కడి ప్రజలు మారలేదంటే....ఎవరు చెప్పేది న్యాయం అవుతుంది?

Wednesday, January 27, 2010

రాహుల్ గాంధీ చేసే పర్యటనలూ, ప్రయత్నాలు, ప్రచారాలు తమిళనాడు,ఉత్తరప్రదేశ్ లలో పార్టీని బలపరుస్తుంది.....కాంగ్రేస్స్ పార్టీ నమ్మకం

తమ యువ నాయకుడు, పార్టీ జెనరల్ సెక్రెటరీలీలలో ఒకరైన రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాలు, ప్రచారాలూ ఖచ్హితముగా తమపార్టీని తమిళనాడు లోనూ, ఉత్తరప్రదెశ్ లోనూ బలపరిచి, 2014 లోపు ఈ రెండు రాష్ట్రాలలోనూ తమ ప్రబుత్వానీ ఏర్పాటు చేయడానికి దాహోదపడుతుందని కాంగ్రేస్ పార్టీ గట్టి నమ్మకముతో వున్నది.

ఉత్తరప్రదెశ్ రాష్టములో త్వరలోనే మార్పు వస్తుంది కాని ధక్షిణాది రాష్ట్రాలలొ ఇంకా ఎంతో పని చేయవలసి వున్నదని అభిప్రాయ పడుతున్నారు.
రాహుల్ గాంధీ ని తమ పార్టీ కి ఒక జెనెరల్ సెకరెటరీగా చేసి, కాంగ్రెస్ ప్రబుత్వము లేని రాష్ట్రాలకు ఎక్కువగా ముఖ్యత్వం ఇచ్హి, అక్కడ ఎక్కువగా పనిచేయవాలసినదిగా అయనను కొరేరు....సుమారు గత 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఉనికినే ప్రజల నుండి దూరంచేసిన ద్రావిడ పార్టీల ను వెనక్కు తోసి మళ్ళీ కాంగ్రెస్ ఉనికిని ప్రజలలొ తేవటానికి మొదటి ప్రయత్ణముగా పోయిన సంవత్సరం రాహూల్ గాంధీ తమిళనాడు వచ్హేరు. ఆయన వచ్హివెళ్ళిన తరువాత తమ పార్టీలో చాలా మంది యువకులూ, మహిలలూ పార్టీలో జేరేరని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.

పోయిన సంవత్సరం రాహూల్ గాంధీ తమిళనాడు వచ్హి నప్పుడు ఆయన చేసిన ప్రశంగం డి.ఎం.కే అధినేతను కోంత కలవర పరిచింది. తమిళనాడు పర్యటనలో ఒక పత్రికా విలేకరి అడిగిన ప్రశ్నకు సమాదానముగా “కేంద్రప్రబుత్వం రాష్త్ర అభివ్రుద్దికి నిధులు పంపించింది.....అవి ఎందుకు ప్రజలకు జేరలేదో మీరు రాష్ట్ర ప్రబుత్వాన్నే అడగాలి” అని చెబుతూ “అందుకనే ఎప్పుడూ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఒకే పార్టీ పరిపాలనలో ఉండాలని” చెప్పేరు. ఆ పర్యటనలో రాహుల్ గాంధీ అలా మాట్లాడటం, ఆయనను కలవకుండా వెళ్ళిపోవటమే డి.ఎం.కే అధినేత కరుణానిధి ని కలవరపరచిన కారణం.

డి.ఎం.కే పార్టీ కి కరుణానిధి తరువాత ( కరుణానిది గారు ఈ సంవత్సరం రిటైర్ అవుతారని చెబుతున్నారు) ఎవరు పార్టీ అధిష్ట్టానాన్ని వహిస్తారు అనే అనుమానం అటు డి.ఎం.కే పార్టీ లోనూ, ఇటు ప్రజలలోనూ ఉండటంతో, కాంగ్రెస్ పార్టీకి ఇది మంచి సమయముగా వుంటుందని అనుకుంటున్నారు.

తమిళనాడు, ఉత్తర ప్రదేస్ కలిపి భారత దేశ ఒటర్ల శాతములో 35 శాతము వహిస్తున్నందున, ఈ రెండు రాష్ట్రాలలో ఎక్కువగా పనిచేయవలసిందని రాహూల్ గాంధీని కోరేరు.

"కులము,మతము,జాతి మరియూ రాష్త్ర రాజకీయ పార్టీల గురించి మాట్లాడ వద్దు" అనే మంత్రముతో కాంగ్రేస్ పార్టీ ఉనికిని ప్రజలలో తీసుకు రావాలని కాంగ్రేస్ పార్టీ యువ నాయకుడు రాహూల్ గాంధీ చెసే ప్రయత్నం విజయవంతమవుతుందా? వారు అనుకునే విధంగా ఈ రెండు రాష్ట్రాలలోను 2014 లోపు కాంగ్రేస్సు ప్రబుత్వం ఏర్పడుతుందా? రాష్ట్రాలలోనూ, కేంద్రములోనూ ఒకే పార్టీ పరిపాలనలో ఉండాలనే కాంగ్రేస్ వాదం గెలుస్తుందా?

"ఫైల్" (Fail) అయిన ఈ విధ్యార్ధి రెండు సంవత్సరాల క్రితమే "పాస్" (Pass) అయ్యేడుట

"ఫైల్" (Fail) అయిన ఈ విధ్యార్ధి రెండు సంవత్సరాల క్రితమే "పాస్" (Pass) అయ్యేడుట

రెండు సార్లు 10 వ తరగతి తప్పిన ఒక విధ్యార్ధి, కుంగిపోయి మూడవసారిగా ఈ సంవత్సరం జరగబోయే 10 వ తరగతి బోర్డ్ పరీక్షలకు కష్టపడి చదువుతున్న సమయములో, నిజానికి అతను మోదటిసారే 10 వ తరగతి పరీక్షలు రాసినప్పుడే పాస్ అయ్యేడనే విషయము తెలుసుకోని ఆశ్చర్యపోయేడు.

రాజేష్ కుమార్ సాహూ అనే ఈ విధ్యార్ధి తల్లితండ్రులు ఒరిస్సా బోర్డ్ ఆఫ్ సెకండర్య్ ఎడ్యూకేషన్ ని మరియూ మాస్ ఎడ్యూకేషన్ డిపార్ట్ మెంట్ వారి మీద కోర్టులో దావా వేయాలని నిర్ణయించుకున్నారు.

గుల్ నగర్ హై స్కూల్ కి చెందిన రాజేష్ కుమార్ సాహూ పేరు 2008 లో పాస్ అయిన వారి లిస్టులో రాలేదు...ఇతను మళ్ళి 2009 లో 10 వ తరగతి పరీక్షలు రాసేడు. కానీ మల్లి తప్పేడు.

చదువులో వెనుకబడిపోతున్నాననుకుంటూ కుంగి పోయిన రాజేష్ కుమార్ సాహూ ఈ సంవత్సరం 2010 న జరగబోయే 10 వ తరగతి బోర్డ్ పరీక్షలకు ఇంకా కష్టపడి చదువుతున్న సమయములో, స్కూల్ కి చెందిన అధికారులు రాజేష్ కుమార్ సాహూ తల్లితండ్రులతో , వాళ్ళ అబ్బాయి 2008 లోనే పాసైనాడని, కానీ 3 వ డివిషనులో పాస్ అయినందువలన మళ్ళి పరీక్షలకు హాజరు కావలసి వచ్హిందని చెప్పేరు.

రాజేష్ తల్లితండ్రులు బోర్డ్ ఇచ్హిన రాజేష్ పాసైన సర్టిఫికెట్టును, మార్క్ షీట్ ని తీసుకున్నారు.

నా కోడుకు అమూల్యమైన రెండేల్లని పోగోట్టుకున్నాడు. నిర్లక్ష్యమైన బోర్డ్ అధికారులూ మరియూ స్కూల్ వారు విధ్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నారు...కనుక వారి మీద కోర్టులో దావా వేయబోతున్నానని రాజెష్ తండ్రి ప్రవాకర్ సాహూ చెప్పేరు.

అవతలి వారి గురించి ఆలోచించకుండా, తమ పనులలో నిర్లక్ష్యతను చూపే అధికారులను కోర్టు మూలముగా శిక్చించవలసినదే.

Tuesday, January 26, 2010

"అవతార్" సినిమా ఎన్నో అవతారాలు ఎత్తుతూ రికార్డులు స్రుస్టిస్తోంది.

"అవతార్" సినిమా ఎన్నో అవతారాలు ఎత్తుతూ రికార్డులు స్రుస్టిస్తోంది.

అవతార్ సినిమా తన మోదటి అవతారం గా ప్రపంచ వ్యాప్తముగా ప్రజల మనస్సుని దోచుకుంది.

ప్రపంచవ్యాప్తముగా కలెక్షనులలో రికార్డు బద్దలకొట్టి, కలెక్షనులలో ప్రపంచవ్యాప్తముగా మొదటి సినిమాగా స్తిరపడి పోయింది.....పోయిన ఆదివారముతో 1.859 బిలియన్ల డాలర్ల కలెక్షన్ సాధించి, అంతకుముందు రికార్డు సాధించిన "టైటానిక్" చిత్రాన్ని వెనక్కు తోసింది...ఇంకా కలెక్షనులు ఇస్తున్న అవతార్ సినిమా బహుశ కలెక్షనులలొ రాబోవు మరె సినీమా అవతార్ ని దాటకపోవచ్హు.

ఈ కలెక్షన్ రికార్డులలో కూడా మొదటి ఆరు వారాలలో ఇంత డబ్బు తెచ్హి పెట్టిన సినిమా అవతారే అవుతుంది......అవతార్ సినిమా ఆస్కార్ అవార్డుల సెలెక్షను కు ఎన్నుకోబడ్డ మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ సినిమాగా మరో రికార్డు.....ఇంతవరకు ఏ సైన్స్ ఫిక్షన్ సినిమా ఆస్కార్ అవార్డులకు ఎన్నుకోబడలేదు.

అవతార్ సినిమా అమేరికా, కెనడా, ఫ్రాన్స్, జెర్మనీ,రష్యా,ఇంగ్లాండ్, చైనా మరియూ ఆస్ట్రేలియా దేశాలలో మహోత్తరమైన ప్రజాధారణ పొందటం మరో రికార్డు.

3డి లోనే ఈ సినిమాను చూడాలని ప్రజలు భావించటం , రాబోవు కాలంలో 3డి సినిమాల శంఖ్య ను పెంచుతుందని సినిమా ఇండస్ ట్రీ అనుకోవడం మరో రికార్డ్. ఈ సినిమా కలెక్షనులు ఎక్కువగా 3డి టికెట్ల అమ్మకముతోనే వచ్హిందట....ఈ సినిమా తీయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అలాగే ఈ సినిమా తీయడానికి 300 మిల్లియన్ల డాలర్లు ఖర్చు అయ్యింది. స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ లో అతి ఉన్నత మైనది....."నవి" అనే కొత్త భాషని చేర్చింది.......ఉన్నత చిత్రముగా గోల్డన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకుంది........ఆస్కార్ అవార్డ్స్ లో కూడా ఉత్తమ చిత్రముగా అవార్డు అందుకుంటూ, టెక్నికల్ క్యాటగిరీలో చాలా అవార్డులు గెలుచుకుని రికార్దు స్రుస్టిస్తుందని ఎదురు చూస్తున్నారు.

పై ఫొటోలో చూపబడిన కొండలు చైనా లో హ్యూమాన్ నగరములో సదరన్ స్కై కాలం అన్న పేరుతో 1074 మీటర్ల ఎత్తులో పోడుగైన రాళ్ళు ఉన్న కొండని అవతార్ సినిమా రిలీజ్ అయిన తరువాత చైనావారు ఆ కొండకి హల్లేలుజా మౌన్ టైన్స్ అని పేరు మార్చేరు. ఎందుకంటే అలాంటి కొండలని ఎగిరే కొండలుగా ఆ సినిమాలో చూపించేరు. చైనాలో అధికార పూర్వముగా చాలా ప్రసిద్ది తెచ్హుకున్న ఈ సినిమా ఇంతవరకు 100 మిలియన్ డాలర్ల సంపాదించింది.

అనుమానస్పధమైన భూతాలు రాజకీయాలలొ జేరడం భాధగా ఉంది....ప్రధాన మంత్రి ,మరియూ సోనియా గాంధీ

అనుమానస్పధమైన భూతాలు రాజకీయాలలొ జేరడం భాధగా ఉంది....ప్రధాన మంత్రి ,మరియూ సోనియా గాంధీ

సోమవారం నాడు న్యూ డిల్లీలో ఎలక్షన్ కమీషన్ యొక్క డైమండ్ జూబ్లీ వేడుకల వేదిక రాజకీయనాయకులకి తమ చింత ను బయటకు తెలిపే వేదికగా అమరింది.

డబ్బు బలం, కండ బలం లాంటివే కాకుండా డబ్బుతో కోనుక్కోబడే వార్తలు కూడా ఎన్నికలలో చోటు చేసుకోవడము గురించి ఎక్కువ ఆందొలన వ్యక్తం అయ్యింది....ఒక ప్రక్క ఎన్నికల కమీషన్ పనితన్నాన్ని ప్రశంసిస్తూ, మరో ప్రక్క ఎన్నికలలో జరుగుతున్న అవకతవకలను ఎన్నికల సంఘం సరిగ్గా అడ్డుకోవటము లేదనే అభిప్రాయాన్ని వ్యక్తము చేసేరు.

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు మాట్లాడుతూ ప్రజా పరిపాలనను మరింత శుభ్రముగానూ, ఆరొగ్యముగానూ, శక్తివంతముగానూ చేయాలని చెప్పేరు.....ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు లెక్కలేకుండా ఖర్చు పెడుతున్న డబ్బు, ఉచితంగా ఓటర్లకు ఇవ్వబడుతున్న వస్తువులని, డబ్బుని, మధు పానీయాలనీ, విపరీత ప్రచారాలని ఆడ్డుకోటానికి శక్తివంతమైన ప్రయత్నాలు తీసుకోవాలని చెప్పేరు.

ప్రధాన మంత్రి మాట్లాడుతూ అతి ఉత్తమమైన వారు, తేటైన బుద్ది గల వారు రాజకీయాల మీద ఆకర్షన చూపించటం లేదు, మధ్య వర్గానికి చెందిన మేధావులు ఎన్నికలు జరిగే విధానం మీద మక్కువ చూపించటం లేదు. ఇంతే కాకుండా ఎన్నికలలో పోటీ చేసేవారి పూర్వోత్తరాలు బాగుండక పోయినా వారు ఎన్నికలలో గెలవడం ప్రజలలో ఎన్నికల మీద విశ్వాసాన్ని పెంచడం లేదు అని చెప్పేరు.

ఎన్నికల కమీషన్ పనిచేస్తున్న తీరును ప్రశంసిస్తూ, నేరాలు మోపబడ్డ వారిని ఎన్నికలలో పోటీ చేయనివ్వకుండా వుండేందుకు అందరూ ఒకే మాట మీద నిలబడాలని సోనియా గాంధీ గారు అన్నారు ...లోక్ శభ అప్పోసిషన్ లీడర్ సుస్మా స్వరాజ్ మాట్లాడుతూ అదే విషయాన్ని తీవ్రముగా ఆలోచించాలని తమ అభిప్రాయాన్ని తెలిపేరు.

ఇలా రాజకీయ పెద్దలందరూ వెలిబుచ్హిన అభిప్రాయాలని ఎలక్షన్ కమీషన్ తీవ్రంగా తీసుకుని ఎన్నికల ప్రక్రియలో వీరు సూచించిన విధముగా మార్పులని తీసుకువస్తే, మన దేశంలో రాజకీయాలకు, ప్రజలకూ మేలు చేసినట్లు అవుతుంది.

దీనికోసం ఎన్నికల కమీషన్ తీవ్ర స్తాయిలో స్పంధించాలని ఎదురుచూస్తున్నాను.

Monday, January 25, 2010

భారత దేశం లో "జాతీయ భాష" అనేది ఏదీ లేదు......గుజరాత్ హైకోర్ట్

భారత దేశం లో "జాతీయ భాష" అనేది ఏదీ లేదు......గుజరాత్ హైకోర్ట్

భారత దేశములో "జాతీయ భాష" అనేది ఏదైనా ఉన్నదా? లేదు.....అని తెలిపింది గుజరాత్ హైకోర్ట్.

భారత దేశం లో ఎక్కువ మంది హిందీ భాషను జాతీయ భాషాగా చెబుతున్నారు, మాట్లాడుతున్నారు మరియూ దేవంగిరిలో వ్రాయటమూ చేస్తున్నారు , కానీ హిందీ భాషని జాతీయ భాషగా చెప్పబడలేదని చెబుతూ ప్యాక్ చేసి అమ్మే వస్తువలమీద ఖచ్హితముగా హిందీ భాషనే ఉపయోగించాలనే వాదాన్ని ఒప్పుకోలేము అని ఒక పబ్లిక్ ఇంటెరెస్ట్ లిటిగేషన్ ను విచారించిన గుజరాత్ హై కోర్ట్ తెలిపింది.

సురేష్ కచాడియా అనే ఆయన 2009 లో ఒక పబ్లిక్ ఇంటెరెస్ట్ లిటిగేషన్ పిటీషన్ని గుజరాత్ హైకోర్ట్ లో విచారనకు ఇస్తూ, ప్యాకింగ్ చేసి అమ్మే వస్తువులపైన, వస్తువుల వివరాలని హిందీ భాషలో ఖచ్హితముగా ముద్రించాలనే మాండమస్ (ఒక విధమైన వారెంట్) ని రాష్ట్ర మరియూ కేంద్ర ప్రబుత్వాలకి జారీ చేయవలసినదిగా కోరేరు.. హిందీ భాష జాతీయ భాష కాబట్టి, మరియూ హిందీ భాష దేశములోని చాలా మంది చదవగలరని...కనుక ప్యాకెట్లలొ అమ్మే సరకుల మీద హిందీ భాషలో ప్యాకట్టులోని సరకు గురించి, వాటి వివరాలని ముద్రించాలని వాదించేరు. దీనికి ఆధారంగా గుజరాత్ శాశన శభలో జరిగే అన్ని చర్చలూ హిందీలోనే జరుగుతున్నాయని చెప్పేరు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతివాది స్టాండర్డ్ ఆఫ్ వైట్స్ ఆండ్ మెషర్స్ (ప్యాకేజిడ్ కమూడిటీస్) రూల్స్ లో అన్ని ప్యాకెట్ల మీదా ఆంగ్లము లేక హిందీలో గాని వివరాలని ముంద్రించాలనే రూలు వుందని ఎత్తిచూపేరు....అప్పుడు కోర్ట్ వారు "హిందీ జాతీయ భాష అని నిరూపించటానికి, కేంద్ర ప్రబుత్వము జారీచేసిన ప్రకటన ఏదైనా ఉన్నదా" అని అడిగేరు. అలాంటి ఆధారాన్ని చూపించలేకపోవటముతో హిందీ భాషని సర్కారు వ్యవహార సంభందమైన భాషగా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వము తెలిపింది......రాజ్యాంగ నిభంధనలలో కూడా "హిందీ భాషని సర్కారు వ్యవహార సంభంద భాషగానే తెలిపేరు గాని, దేశీయ భాషగా ఎక్కడా పెర్కోనలేదు" అని చెబుతూ,ప్యాకెట్ల మీద హిందీ భాషను దేవంగిరి లిపిలోనూ లేక ఆంగ్ల భాషలో గాని ముద్రించవచ్హునని, ఆంగ్ల భాషలో ముద్రించటం వారి వారి ఇష్టమని ఇదివరకే రూల్స్ ఉన్నాయి కనుక హిందీ భాషలోనే ముద్రించాలనే వారెంటుని ఇవ్వలేమని గుజరాత్ కోర్టు తెలిపింది.

Sunday, January 24, 2010

ఇంగ్లాడులోని హోటల్స్ లోనే ఒక భారతీయ హోటల్ ని "ఆరోగ్యానికి నాణ్యమైన" హోటలుగా బి.బి.సి ఎన్నుకున్నది

ఇంగ్లాడులోని హోటల్స్ లోనే ఒక భారతీయ హోటల్ ని "ఆరోగ్యానికి నాణ్యమైన" హోటలుగా బి.బి.సి ఎన్నుకున్నది

ఒక భారతీయుడు నడుపుతున్న హోటల్ ని, ఇంగ్లాండులోని హోటల్స్ లోనే ఆరోగ్యానికి నైపుణ్యమైన హోటలుగా ప్రపంచ ప్రసిద్ది చెందిన బి.బి.సి ఎన్నుకోవడం ఆ హోటల్ కి ఎనలేని గౌరవం తెచ్హింది.

ఈ హోటలులో తయారు చేయబడుతున్న ఆహార పధార్ధాలలో వెన్నపూస, నెయ్యి, మీగడ కలపకుండా వుండడమే కాకుండా ఫైబర్-రిచ్ (Fibre-rich) గల పధార్ధాలనే ఉపయోగించటమే దీనికి కారణం.

బి.బి.సి వారి ఫుడ్ చేనల్ లో "ఇండాలీ లాంజ్" (Indali Lounge ) అనే ఈ హోటలు ఇంగ్లాండులోనే ఆరొగ్యకరమైన ఆహారపధార్ధాలను అందించే హోటలుగా పేర్కుంటూ, ఈ హోటలులో వేన్నపూస, నెయ్యి, మీగడ కలపకుండా తయారు చేసే రొట్టెలలో పిండి, ఓట్స్ మరియూ బార్లీ ని ఉవయోగిస్తున్నారని, ఇది ఆరొగ్యానికి చాలా మంచిదని తెలిపేరు.

ఇంతే కాకుండా ఆహారంలోని పోషక పధార్ధాలని బద్రముగా ఉంచడంకోసం అన్నం ని కూడా స్లో-కుక్ (Slow-cook) పద్దతిలో తయారు చేస్తున్నారని చేబుతూ, హోటల్ అలంకరణం కూడా బ్రిటీషు వారి హోటల్స్ కి సరిపడే విధముగా ఉంచడాన్ని హర్షించేరు.

ఈ హోటలుకి వచ్హే ప్రముఖులలో భారత కిరికెట్ మేధావి సచిన్ టెండూల్ కర్, ప్రముఖ చలన చిత్ర హీరో, డైరెక్టర్ దేవానంద్ మరియూ మాజీ ఇంగ్లాండ్ ప్రధాని టోనీ బ్లేయర్ ఆయన భార్య ఉన్నారట.

డాక్టర్ల మోటైన అశ్రద్ధ వలన పసిబాలుడి మ్రుతి

డాక్టర్ల మోటైన అశ్రద్ధ వలన పసిబాలుడి మ్రుతి

3 రోజుల పసి బాలుడు ఉదయపూర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల అశ్రద్ధ వలన చనిపోయేడట.

సిసేరియన్ ఆపరేషన్ తో ప్రశవము చేసి తీయబడ్డ ఆ పసిబాలుడి చేయి , ఆపరేషన్ చేసేటప్పుడు కోసుకుపోవటం జరిగిందట.......తమ తప్పు తెలుసుకున్న డాక్టర్లు, ఆ పసిబాలుడి చేతికి కట్టుకట్టి , విషయాన్ని బాలుడి తళ్ళితండ్రులకు తెలపకుండానే, బాలుడిని, బిడ్డల వార్డుకి చేర్చేరుట.

గుడ్డతో చుట్టి తీసుకువచ్హిన తన బిడ్డను చూడటానికి బాలుడి చుట్టూ చుట్టిన గుడ్డను తీసిన తండ్రి, గాయపడ్డ పసిబిడ్డ చేతిని చూసి తట్టుకోలేకపోయేడుట....అక్కడున్న డాక్టర్లు "ఆపరేషన్ చేసేటప్పుడు చేతికి కత్తి తగిలిందని" చెప్పేరుట.

వార్డులో ఉంచిన ఆ పసిబాలుడికి గాయము తగిలిన చోటునుండి రక్తం కారుతునే వుందట...దాని గురుంచి అడిగితే దాని గురించి ఏమీ భాధ పడవలసిన అవసరం లేదని చెప్పేరట.

ఆ పసిబాలుడు 3 వ రోజు చనిపోయేడు.

డాక్టర్ల అశ్రద్ద వలనే తన పిల్లవాడు చనిపోయేడని ఆ తండ్రి ఆసుపత్రి అధిఖారులైన పెద్ద డాక్టర్లకు ఫిర్యాదు చేస్తే ఒక కమిట్టిని ఏర్పాటు చేసి విషయ్యాని తెలుసుకుంటామని చెప్పేరట.

హాస్పిటల్ అధిఖారులలో ఒక డాక్టర్ మాట్లాడుతూ "ఇలాంటివి ఆపరేషన్ చేసి తీసే పిల్లలకు జరుగుతాయని, చనిపోయిన పిల్లవాడు నెలలు నిండకుండానే ( ఏడో నెలలోనే) పుట్టేడని" చెప్పేరు.

పసిబాలునికి ఏర్పడ్డ గాయాన్ని, తల్లితండ్రులకు చెప్పకుండా కప్పి పుచ్హటం, బాలుని చేతి గాయం నుండి నెత్తురు కారుతున్నా పట్టించుకోకపోవటం ఆ డాక్టర్ల నిర్లక్ష్య వైకరిని ఎత్తి చూపిస్తున్నది కాబట్టి ఆ డాక్టర్లను కఠినంగా శిక్చించాలనేది నా అభిప్రాయం.

ఏమంటారు?

Saturday, January 23, 2010

ఆంద్రప్రదేశ్ హై కోర్ట్ తెలిపిన అభిప్రాయాలు హర్షించతగినవి

ఆంద్రప్రదేశ్ హై కోర్ట్ తెలిపిన అభిప్రాయాలు హర్షించతగినవి

మాటి మాటికీ బంద్ లకు, రాస్తారోకోలకి రాజకీయ పార్టీలు పిలుపునివ్వడం ప్రజలను బలవంతముగా తమ ఉద్దేశాలకు ఒత్తిడి చెయటమే అవుతుందని కోపగించుకున్న ఆంద్రప్రదేశ్ హై కోర్ట్, బంద్, రాస్తారోకో పోరాటాల పేరుతో ప్రభుత్వ మరియూ ప్రైవేటు ఆస్తులను నష్ట పరుస్తున్నారని, అలా నష్ట పరిచేవారి ఆస్తులను జప్త్ కి తీసుకురావలసినదిగా రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్హింది.

"ప్రభుత్వ మరియూ ప్రైవేటు ఆస్తులను పోరాటాల పేరుతో నష్ట పరిచే వారి దగ్గరనుండి, ఆ నష్ట్టాన్ని, నష్టానికి పాల్పడ్డ వారి దగ్గరనుండి వసూళ్ళు చేయండి" అని ఆ మధ్య సుప్రీం కోర్ట్ ఇచ్హిన తీర్పును రాష్ట్ర హై కోర్ట్ రాష్ట్ర ప్రబుత్వానికి గుర్తుచేసింది.

రాజకీయ పార్టీలు ప్రజలను శాంతియుత మార్గాలకే తీసుకువెళ్ళలే గాని, ఇలా విధ్వంశక పోరాటాలకు ప్రొస్చాహించకూడదని సలహా ఇచ్హింది. బస్సులని తగల పెట్టడం, ప్రభుత్వ మరియూ ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించడం సంఘానికే ద్రోహము చేసినట్లు అవుతుందని చెప్పింది.
ఒకరిని బెదిరించడము, ఏ ఒక్కరి ఆస్తినైనా ద్వంశం చేయడం, ప్రజలను బలవంతముగా తమ ఉద్దేశాలవైపుకు తీసుకువెళ్ళడం ప్రాజశామ్య విరుద్దం అని చెబుతూ ఇది "తమ మాటకే కట్టుబడి ఉండాలి అనే మనస్తత్వాన్ని" చూపేదవుతుందని తెలిపింది.

ఇప్పుడు జరుగుతున్న ప్రత్యేఖ తెలెంగాణా మరియూ సమైఖ్య ఆంధ్రా పోరాటాలలో బంద్ మరియూ రాస్తా రోకోల పిలుపుకి ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పటం ఆసక్తి వంతమైనదిగా వుంది.

రిలయన్స్ పై జరిగిన విధ్వంసక చర్యలో నిందితుడుగా పేర్కోనబడ్డ యదమాకంటి చిన్న రోసి రెడ్డి పెట్టుకున్న యాంటిసిపేటరీ బైల్ పిటీషన్ విచారిస్తున్న ఆంద్రప్రదెశ్ హై కోర్ట్ పై విధముగా అభిప్రాయము వెలువరించింది.

ఆంద్రప్రదేశ్ హై కోర్ట్ వెలిబుచ్హిన ఈ హర్షనీయమైన అభిప్రాయాలు ప్రజలలో ధైర్యాన్ని, మార్పుని తెస్తుందని భావిస్తున్నాను.

Friday, January 22, 2010

ఈ భారతీయుడు కనుగొన్న సాఫ్ట్ వేర్ (SOFTWARE) అమేరికా పోలీసు శాఖకి అత్యంత ఉపయోగకరంగా ఉందట.

ఈ భారతీయుడు కనుగొన్న సాఫ్ట్ వేర్ (SOFTWARE) అమేరికా పోలీసు శాఖకి అత్యంత ఉపయోగకరంగా ఉందట.

ఒక భారతీయుడు కనుగొన్న సాఫ్ట్ వేర్ మీదే అమెరికా పోలీసు యంత్రాంగమే ఆధారపడి ఉందట....వారి దేశంలో జరుగుతున్న వ్యాపారాలలో, పరిశ్రమలలో, ఆర్ధీక బద్రతా రంగంలో జరుగుతున్న ముఖ్యమైన దోపిడీలలో నకిలీ పత్రాలని స్రుష్టించి జరిపే దోపిడీలే ఎక్కువగా ఉండటం వలన, ఆ నకిలీ పత్రాలను పట్టుకోగలిగే ఈ సాఫ్ట్ వేర్ వారికి అత్యంత ఉపయోగకరముగా ఉందట.

హర్యాణా లోని, కురుక్షేత్రా నగరానికి చెందిన 30 ఏళ్ళ డాక్టర్ గౌరవ్ గుప్తా ఈ సాఫ్ట్ వేర్ ని కనుగొన్నారు....ఈ సాఫ్ట్ వేర్ ని కనుగొన్నందుకు ఈయన 2010 యువ శాత్రవేత్త బిరుదుని, గౌరవాన్ని మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం చెతులతో, కేరళాలోని,తిరువనంతపురం లో జరిగిన 97 వ భారత సైన్స్ కాంగ్రేస్సులో అందుకోన్నారు.

.డాక్టర్ గుప్తా గారు అభివ్రుద్దిచేసిన సాఫ్ట్ వేర్ తో మోసగాళ్ళు ఎన్ని నకిలీ పత్రాలని ముద్రించేరో,దానికి వారు ఎటువంటి పరికరాలు వాడేరో, ఎన్ని డిజిటల్ సంతకాలు చేయగలిగేరో తెలుసుకోవడమే కాకుండా అవి ఏ ఊరిలో తయారు చేయబడ్డయో,ఏ స్కానర్లు వాడేరో కూడా తెలుస్తుందట.

తను కనుగోన్న సాఫ్ట్ వేర్ గురించి మాట్లాడుతూ, తప్పు చేసేవారికి ప్రింటింగ్ మరియూ స్కానింగ్ మిషన్లలో ఉన్న తేడాలు తెలియవు. ఓక్కొక్క ప్రింటింగ్ మిషనుకీ, స్కానింగ్ మిషనుకీ ఏదో ఒక తేడా వుంటుంది. అయితే ఈ తేడాలు నకిలీగా తయారు చేబడ్డ పత్రాల మీద వున్నా, వాటిని మామూలు కళ్ళతో చూస్తే అవి నకిలీవని ఎవరూ తెలుసుకోలేరు.....నేను కనుగొన్న సాఫ్ట్ వేర్ తో ఏ పత్రానైనా నకిలీదో, కాదో తెలుసుకోవచ్హు అని చెప్పేరు.

గుప్తాగారు కనిబెట్టిన సాఫ్ట్ వేర్, టెక్నాలజీ లోకంలో అత్యున్నమైనదని కేరళా యూనివర్సిటీ లోని బైయో ఇన్ ఫర్మాటిక్స్ (Bio-informatics) అధినేత డాక్టర్ నాయర్ గారు చెప్పేరు. .....2005,2006 లో సైబర్ క్రైం (Ciber Crime) గురించి అమేరికాలోని అట్లాంటా నగరములో జరిగిన శదస్సులోనూ మరియూ 2007 లో అమెరీకాలో జరిగిన డిజిటల్ ఫోరెన్ సిక్ రీసెర్చ్ వర్క్ షాప్ (Digital Forensic Research Workshop) లోనూ మాట్లాడిన ఒకే ఒక్క భారతీయూడు గుప్తా గారు.

ఈయన కనిబెట్టిన సాఫ్ట్ వేర్ తో అమెరికా పోలీసులు, వారి దేశములో జరిగే ఆర్ధీఖ మోసాలని పట్టుకోవటానికి బాగా ఉపయోగపడుతొందట.

ఈ సాఫ్ట్ వేర్ ని మన దేశములో కూడా ఉపయోగిస్తే, నకిలీ పత్రాలని, వాటిని తయారుచేసేవారిని, వాటిని ఉపయోగించుకునేటప్పుడే పట్టుకోవచ్హు ....కదా?

Thursday, January 21, 2010

ఏప్రెల్ ఒకటి విడుదల కాదు నిర్భందం.

ఏప్రెల్ ఒకటి విడుదల కాదు నిర్భందం.

ఏప్రెల్ ఒకటవ తారీఖు నుండి పాన్ (PAN) నెంబర్ లేని డబ్బు లావాదేవిలలో కూడా అందరూ పన్ను కట్టవలసిందే.

పాన్ నెంబర్ లేకుండా లావాదేవీలు చేస్తున్నవారు , పాన్ నెంబరు వున్న వారికంటే ఎక్కువ శాతం పన్ను కట్టవలసి వస్తుంది. డబ్బు లావాదేవీలలో, డబ్బు ఇచ్హేవారే, ఇచ్హే డబ్బుకు పన్ను శాతం డబ్బు మినహాయించుకునే ఇస్తారు. ఇది ఎన్.ఆర్.ఐ లు పంపించే డబ్బుకు, ఆ పంపించే డబ్బు పన్ను అరహతకి లోనైతే, వారికి కూడా వర్తిస్తుంది.

ఈ మేరకు ఇన్కం టాక్స్ యాక్ట్ 1961 (Income Tax Act 1961) కి చేసిన సవరణలో, టాక్స్ డిడెక్షన్ అట్ సోర్స్ (TDS) లో చేసిన మార్పు ఈ సంవత్సరం ఏప్రెల్ 1 వ తారీఖు నుండి అమలుకి వస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సస్ (Central Board of Direct Taxes) వారు తెలిపేరు......ఇలా చేయడము ద్వారా అందరినీ పన్ను చెల్లించే వారి లెక్కలో చేర్చడమే కాకుండా, దేశానికి ఆదాయపు రాబడి ఎక్కువ అవుతుందని తెలియపరిచేరు.

ఏప్రెల్ 1 వ తారీఖు నుండి " మాకు ఆదాయము లేదు, కనుక మమ్ము ఆదాయపు పన్ను నుండి మినహాయించండి" అని దాఖా చేసే ఇన్ కం టాక్స్ ఫారం నెంబర్ 197 ను ఇవ్వాలన్నా, మీకు పాన్ నెంబర్ ఉండాలట....అలా పాన్ నెంబర్ లేకుండా ఆ ఫారం ఇచ్హినా మీరు పన్ను కట్టవలసిందేనట.

ఏప్రెల్ 1 వ తారీఖునుండి డబ్బు లావాదేవిలకు ఖచ్హితముగా పాన్ నెంబర్ కావాలి కనుక మీ దగ్గర పాన్ కార్డు లేకపోతే మార్చి నెల 31 లోపు పాన్ కార్డు తీసుకోండి.....పన్ను మినహాయింపులకూ, తగ్గింపులకూ కూడా ఏప్రెల్ 1 , 2010 నుండి పాన్ కార్డు అవసరమని గుర్తు పెట్టుకోండి.

విధ్యార్ధుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వమే ఆడుకుంటుంటే......!?

విధ్యార్ధుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వమే ఆడుకుంటుంటే......!?

44 విశ్వవిధ్యాలయాల డీమెడ్ హోదాని రద్దుచేయటానికి కేంద్రం కోర్ట్ అనుమతి కోరిన మరుసటి రోజే, ఆ విశ్వవిధ్యాలయాలకు చెందిన విధ్యార్దులు తీవ్ర ఆందొలనకి గురి అయ్యారు. వారి చదువులకు గండి పడిందని కలత చెందేరు. తమిళనాడులో డీమెడ్ హోదాని పోగొట్టుకోబోతున్న 4 విశ్వవిధ్యాలయాలకు చెందిన విధ్యార్ధులు నిరసనలకు,పోరాటాలకు దిగేరు. వీరిని మరియూ మిగిలిన 40 విశ్వవిధ్యాలయాల విధ్యార్ధులను పరామర్సించే విధముగా మన మానవ వనరుల శాఖా మంత్రి కపిల్ సిబల్ గారు ఈ 44 విశ్వవిధ్యాలయాలలో చదువుతున్న విధ్యార్ధులు ఆమోదించబడిన విశ్వవిధ్యాలయాల విధ్యార్ధులుగా చదువు కోనసాగించవచ్హునని చెబుతూ, భవిష్యత్తులో డీమెడ్ విశ్వవిధ్యాలయా విధానాన్నే రద్దు చేస్తామని చెప్పడం, ఎవరికి హెచ్హరిక చేస్తున్నారో అర్ధం కావటంలేదు.

విధ్యాలయాలని విధ్యా సంస్తలుగా నడపడానికి బదులు వాటిని వ్యాపార సంస్తలుగా నడుపుతున్నారని అందరికీ తెలుసు. కాబట్టి డీమెడ్ హోదా విధానాన్ని రద్ధు చేస్తామనడం రానించదగినదే, కానీ ఇలా మధ్యలో హోదలని రద్దు చెయడం సరి కాదు. ఒక కాల నిర్ణయముతో చేస్తే, అప్పుడు విధ్యార్ధులు ఆటువంటి విధ్యాలయాలలో చేరకుండా వుంటారు.

డీమెడ్ విధ్యాలయాలలో బోలెడంత డబ్బు డొనేషన్లుగానూ, ఫీజులుగానూ కట్టేసి డిగ్రీలకోసం చదువులు కొనసాగిస్తున్న సమయములో, ఆ విధ్యాలయ డీమెడ్ హోదాని రద్దు చేస్తున్నామని చెప్పడం విధ్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకోవడమే అవుతుంది.....డీమెడ్ హోదాని ఫలానా సంవత్సరం నుండి రద్దు చేయబోతున్నమని, కాబట్టి విధ్యార్ధులు ఈ విధ్యాలయాలో జేరకండి అని చెప్పటం పద్దతిగా వుంటుంది.

ఈ డీమెడ్ విశ్వవిధ్యాలయాలు చాలా వరకు రాజకీయ నాయకులకు సొంతమైనవి. వీరు కోర్టులనుండి స్ట్యే తెచ్హుకోవడం జరుగుతుంది. ప్రభుత్వానికి, ఈ విశ్వవిధ్యాలయాలాకూ మధ్య కొన్ని చర్చలు జరుగుతాయి. ఈ చర్చలు ఎలా ముగిస్తయో నని విధ్యార్ధులు ఆందొలన చెందుతారు, చదువుల మీద ధ్యాస పెట్టలేరు.....ఎందుకు ఈ పరిస్తితిని ప్రభుత్వం విధ్యార్ధులకు కలిగించటం?....దీనివల్ల వారికి ఎమిటి లాభం?

విశ్వవిధ్యాలయాల దగ్గర ప్రమాణాలు చేయించుకుని వాటికి డీమెడ్ హోదా ఇవ్వడమేమిటో, మరి ఇప్పుడు ఆ విశ్వవిధ్యాలయాలు ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవటం లేదని వాటి డీమెడ్ హోదాని రద్దు చేస్తం అని చెప్పటమేమిటో ప్రభుత్వానికి మాత్రమే తెలుసు....మరి విధ్యార్ధులు బాగా చదువుకుని భవిష్యత్తులో పైకి రావాలని తమలో తాము చెసుకున్న ప్రమాణాలు ఎవరు నెరవేరుస్తారో ?

Monday, January 18, 2010

రెండు రోజులు సెలవు తీసుకుంటున్నను

రెండు రోజులు సెలవు తీసుకుంటున్నను


అందరికీ నమస్కారములు

నేను నా పర్సనల్ పని మీద బయట ఊరు వెలుతున్నందున, నా బ్లాగ్ మూలముగా రేపూ, ఎల్లుండి ( మంగళ, భుధ వారాలు) మీకు విషయములు అందించలేను. గురువారము నాడు తప్పక అందించ గలను.


ధన్యవాధములు

Sunday, January 17, 2010

భారత దేశములో సిసేరిన్ ఆపరేషన్లలో చాలా సిసేరిన్ ఆపరేషన్స్ డబ్బు కోసం చేసినవేనట ...మన దేశము సిగ్గు పడవలసిన విషయము

భారత దేశములో సిసేరిన్ ఆపరేషన్లలో చాలా సిసేరిన్ ఆపరేషన్స్ డబ్బు కోసం చేసినవేనట ...మన దేశము సిగ్గు పడవలసిన విషయము

తల్లులకి గాని లేక పుట్టబోయే బిడ్డకు గాని ప్రమాదమైన పరిస్తితి ఏర్పడుతున్నది అని నిర్ధారణ అయిన తరువతే చేయవలసిన సిసేరిన్ ఆపరేషన్, మమూలుగా సుఖ ప్రసవం అవుతుందని తెలిసినా డబ్బు కోసం అన్నివిధాల ఆరోగ్యముగా వున్న తల్లులకు కూడా మన దేశములో కోంతమంది డాక్టర్లు సిసేరిన్ ఆపరేషన్ అవసరమని చెప్పి, ఆపరేషన్లు చేస్తున్నారని డబుల్యూ.హ్చ్.ఓ ఒక ప్రకటనలో తెలిపింది.
భారత దేశములో ప్రతి 5 ప్రసవాలలో 1 ప్రసవం సిసేరిన్ ఆపరేషన్ మూలముగా జరుగుతోందట. అవసరం లేని ప్రసవాలకు కూడా, సిసేరిన్ ఆపరేషన్ వలన అటు తల్లికి ఇటు పుట్టబోయే బిడ్డకి ఏర్పడు అణారొగ్య కష్టాలని లెక్క చేయకుండా, కేవలం డబ్బుకోసమె సిసేరిన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని డబుల్యూ.హ్చ్.ఓ. (W.H.O) తెలిపింది.

ఆసియా దేశలలో ప్రసవాలు మరియూ పిల్లలని కనబోయే తల్లుల ఆరోగ్య పరిస్తితుల గురించి డబ్ల్యూ.హ్చ్.ఓ జరిపిన ఒక సర్వేలో 2007-2008 కంటే సిసేరిన్ ఆపరేషన్లతో ప్రసవించిన తల్లుల సంక్య 27 శాతం పెరిగిందట. ఇందులో భారత దేశం, చైనా,జపాన్,నేపాల్ మరియూ శ్రీలంక ఉన్నాయట. భారత దేశములో 18 శాతమే పెరిగినా (చైనా 46 శాతముతో మొదటి స్తానములో ఉందట) ఇందులో 5 శాతము నుండి 65 శాతమువరకు డిల్లి, ముంబై ల లోని ప్రైవేటు ఆసుపత్రులలొ జరిగేయట. 1,07,950 ప్రసవాలలో 24,000 ప్రసవాలు గుజరాత్, మధ్య ప్రదేష్, డిల్లి లలో జరిగితే, ఇందులో 15 శాతం సిసేరిన్ ఆపరేషన్లు పెరిగేయని, ఇవన్నీ సిసేరిన్ అవసరం లేకపోయినా డబ్బుకోసం సిసేరిన్ ఆపరేషన్ తో చేయబడ్డ ప్రసవాలేనని డబ్ల్యూ.హ్చ్.ఓ తెలిపింది.

తల్లులకు గానీ,బిడ్డకి గాని ప్రమాదకరమైన పరిస్తితి వుందని తెలిస్తేనే చేయవలసిన సిసేరిన్ ఆపరేషన్, తాము చేసిన సర్వేలో చాలా ప్రైవేటు హాస్పిటల్స్ లో ప్రమాదకరము లేకపోయినా సిసేరిన్ చేసేరని తెలిపింది.

ఈ డబుల్యూ .హ్చ్ .ఓ రిపోర్ట్ మనదేశమునకు అవమానకరం కాదా? వెంటనే మన దేశ మెడికల్ కౌన్సిల్ ఒక కఠిన రూల్ పాస్ చేసి ఈ పరిస్తితిని చక్క దిద్దాలని వేడుకుంటూ, డాక్టర్లనే దేముడిగా నమ్ముకున్న ఏమీ తెలియని సాదారణ ప్రజలని మూసగించే వారి దగ్గరనుండి కాపడవలసిందని కోరుకుంటున్నను.

Saturday, January 16, 2010

నాగు పాము ఈ గుడిలోని శివలింగానికి పూజ చేసిందట!

నాగు పాము ఈ గుడిలోని శివలింగానికి పూజ చేసిందట!

సూర్య గ్రహణం ఆరంభం అవటానికి ముందు.....తమిళనాడు లోని కుంభకోణం నగరానికి 5 కిలోమీటర్ల దూరములో ఉన్న తెపెరుమానళ్ళూర్ అనే గ్రామములోని శ్రీ వేదాంత నాయాకీ సమేత విశ్వనాధస్వామి ఆలయములో ఒక నాగు పాము ఒక బిల్వ పత్రాన్ని నోటితో కరుచుకొని, గుడిలోనికి వెళ్ళి, గర్భ గుడిలోని శివ లింగాన్ని ఎక్కి, తన నోటితో తెచ్హిన బిల్వ పత్రాన్ని ఆ లింగం మీద వేసిందట.

గర్భ గుడిలో వున్న పూజారి పాము లోనికి రావటం చూసి, భయముతో ప్రక్క నున్న గోడకి అతుక్కుపోయేడుట. గుడి బయట దేవుని దర్సనము కోసం వేచియున్న భక్తులు ఇది చూసి అలజడికి లోనైయ్యరట....గోముఖ ద్వారము (అభిషేకము చేసేటప్పుడు నీరు, పాలూ గర్భ గుడిలోనుండి బయటకు పోవు ద్వారము) నుండి లోనికి ప్రవేసించిన ఆ నాగు పాము తిరిగి వెళ్ళటము చూసిన పూజారి మరియూ భక్తులు ఆ పాము ఎటు వెలుతున్నదో చూడటానికి అటు వైపు వెళ్ళేరుట. ఆ పాము గుడి ప్రాంగణములో వున్న బిల్వ పత్ర చెట్టుని ఎక్కి, తన నోట కరుచుకుని తిరిగి రావటం గమనించిన పూజారి, భక్తులు కొంతమంది గుడి అధికారులకు వెంటనే ఈ విషయము తెలియపరిచేరుట.

ఆ పాము రెండవ సారి తెచ్హిన బిల్వ పత్రాన్ని శివలింగం పై ఉంచి తిరిగి వెళ్ళి ఆ చెట్టు ఎక్కి మూడవసారి అదేలాగా చెసిందట. మూడవ సారి బిల్వ పత్రాని శివలింగం మీద వేసిన పాము,కాసేపు శివలింగం ముందు పడగ విప్పి నిలబడిందట......ఇందంతా చూస్తున్న భక్తులు,పూజారి మరియూ గిడి అధికారులూ ఆశ్చర్యపోయి నోట మాట రాక నిలబడిపోయారుట.

అందులో కొంతమంది ధైర్యము తెచ్హుకుని నాగు పాము చెట్టు ఎక్కడము,బిల్వపత్రాన్ని తీసుకురావడం, గుడిలో ప్రవేసించటం గర్భగుడిలో వున్న శివలింగాన్ని ఎక్కటం, పాము బిల్వపత్రాన్ని శివలింగం మీద వేయటం,అక్కడ పడగ విప్పి నిలబడటం ఫోటోలు తీసేరుట.

అక్కడక్కడ ఇలాంటివి జరగటం నేను విన్నను.........మీరు విన్నారా? వినివుంటే మీ బ్లాగు మూలముగా అందరికీ తెలుపండి.

ఏ.ఆర్ రెహమాన్ ఆస్ట్రేలియా వెళ్ళడము వలన మంచి జరుగుతుందా?

ఏ.ఆర్ రెహమాన్ ఆస్ట్రేలియా వెళ్ళడము వలన మంచి జరుగుతుందా?

ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఫెస్టివల్ వేడుకలలో పాల్గోని మ్యూజిక్ ప్రధర్షన ఇవ్వటానికి ఏ.ఆర్. రెహమాన్ ఆస్ట్రేలియా వెళ్ళేరు.

ఆస్ట్రేలియాలో భారతీయులమీద రొజు రొజుకీ దాడులు ఎక్కువ అవుతున్నాయి. భారతదేశం అంతటా అసంత్రుప్తి,ఆందోళన చోటు చేసుకున్నాయి. ఆస్ట్రేలియా ప్రబుత్వము భారతీయులపై జరుగుతున్న దాడులను ఆపలేక పోతున్నారు. కారణం, కొంతమంది ఆస్ట్రేలియాకు చెందిన అధికారులు ఒక ప్రక్క దాడులని ఆపుతామని చెబుతూ, మరో ప్రక్క దాడులను ప్రోస్చాహించే విధముగా మాట్లాడుతున్నారు ( ఇంతకు ముందు నేను రాసిన టపా:...ఆస్ట్రేలియాలో భారతీయులమీద జరుగుతున్న దాడికి....ఆ ప్రబుత్వమే కారణం).

దాడులకు జాతి వివక్షె కారణమని మన ప్రబుత్వం చెబుతున్నది. ఆస్ట్రేలియాకు విధ్యార్దులను వెళ్ళ వద్దని చేబుతోంది.....జాతి వివక్షె దాడులకు కారణంగా ఉండవచ్హునని ఆస్ట్రేలియాలోని ఒక పెద్ద పోలీసు అధికారి చెబుతున్నారు. నిన్న జరిగిన ఒక సంఘటనలో మనదేశానికి చెందిన 3 విధ్యార్ధులను, వారితో వెళ్ళిన మరో ముగ్గురి స్నేహితులన వారు వెళ్ళిన హూటలులోకి వెళ్ళుటకు అనుమతించలేదట. కారణం చెప్పమని అడిగితే, చెప్పమని చెప్పేరట.

దాడులు జాతి వివక్షె వలనే కానివ్వండి లేక మరేదైనా కానివ్వండి, మన నిరసన తెలపటానికి ఒక మంచి సందర్భము దొరికింది. ఆదే ఏ.ఆర్. రెహమాన్ ని వాళ్ళ ఫిస్టివల్లో మ్యూజిక్ ప్రోగ్రాం ఇవ్వడానికి పిలవడం....ప్రపంచ ప్రఖ్యాతలు తెచ్హుకున్న ఏ.ఆర్. రెహమాన్ ఈ పిలుపును "భారతీయులపై జరుగుతున్న దాడులను ఆపటానికి ఆస్ట్రేలియా ప్రబుత్వము తీసుకుంట్టున్న చర్యలు సరిపోవటము లేదని, దాడులు జరుగుతునే ఉన్నాయని...కాబట్టి నిరసనగా తను మ్యూజికల్ ప్రొగ్రాములో పాల్గొనటము లేదని" చెప్పి వుంటే, ఆయన నిరసన, భారతీయులపై ఆస్ట్రేలియాలో జరుగుతున్న దాడుల గురించి ప్రపంచ వ్యాప్తముగా చాటి చెబుతుందని నా భావన.

అయితే ఏ.ఆర్. రెహమాన్ గారు, ఆస్ట్రేలియా ప్రొగ్రాములో పాల్గొనుటవలన....భారతీయులకూ, ఆస్ట్రేలియా వారికి మధ్య స్నేహాన్ని పెంచుతుందని చెప్పేరు.

మరి మీరేమంటారు.

Friday, January 15, 2010

గూగుల్ చేసింది సహించలేము....భారత దేశం ఖండన

గూగుల్ చేసింది సహించలేము....భారత దేశం ఖండన

చైనా నే కాదు, భారత దేశము కూడా గూగుల్ కంపేనీ మీద చాలా కోపముగా వున్నది. కానీ ఇరు దేశాల కోపానికి కారాణాలు వేరు. చైనా దేశ కోపముతో మనకు పని లేదు. అది చైనా, గూగుల్ కంపేనీ చూసుకుంటారు. మన దేశ కోపానికి కారణం అరుణాచల్ రాష్ట్ట్రాన్ని గూగుల్ చైనాలో బాగమని చూపడమే.

"ఈ విషయాన్ని మేము చాలా తీవ్రముగా తీసుకుంటున్నాము . భారత దేశం ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిని చూస్తూ ఊరుకోదు. ...అది గూగుల్ కానివ్వ్వండి లేదా మరే ఇతర పెద్ద కంపేనీ కానివ్వండి....తప్పుడు ప్రచారాన్ని సహించము....మా ఖండనని తెలుపుతూ, సంజాయషీ అడిగేము" అని భారత సమాచార శాఖ మంత్రి సచిన్ పైలెట్ తెలిపేరు.

అరుణాచల్ ప్రదెష్ వివ్వాదాత్మక రాష్ట్రమని ప్రపంచములోని అతి తక్కువ మంది చెబుతున్నారు. ఎందుకంటే ఆ రాష్ట్ట్రాన్ని చైనా తమదని చెప్పటము వలన. కాని ఆ రాష్ట్రము మన దేశములో భాగమని, ప్రజాసామ్యముగా ఎన్నుకోబడ్డ ప్రబుత్వమే ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తోందని గూగుల్ కి తెలియదా?!

గూగుల్ కంపేనీ ఇరు దేశాల వారిని మూర్ఖులుగా భావిస్తొంది. అటు చైనా వారి దేశ పటం లో అరుణాచల్ ప్రదెష్ ని వారి దేశములో భాగముగానూ, ఇటు భారత దేశ పటం లో మన దేశానికి చెందిందిగానూ చూపిస్తున్నారు.

ఇంటెర్ నెట్ వుపయోగించే వారి సంఖ్య చైనాలో అదిఖముగా యున్నది, గూగుల్ వ్యాపారం కోసం ఆ దేశానికి అనుగునంగా నడుచుకున్నారనే అనుకుందాము....మరి మన దేశములో కూడా గూగుల్ కి మంచి వ్యాపారమే జరుగుతోంది కదా, అలాంటప్పుడు మన దేశం గురుంచి పట్టించుకోలేదేం?....కారణం మనం చైనా లాగా కఠినముగా ఉండము.

కాబట్టే చైనా వారి పటం లో అరుణాచల ప్రదేష్ ను వారికి చెందిదిగానూ, భారత దేశ పటంలో మనకి చెందిందిగానూ చూపిస్తూ ,ప్రపంచ పటం లో ఆ రాష్ట్ట్రాన్ని వివాదాత్మక ప్రదేశముగానూ చూపటం ఏ విధముగా న్యాయం. అందులోనూ అరుణాచల ప్రదెష్ లో నివసిస్తున్నవారు మేము భారతీయులమే నని గర్వముగా చెప్పుకోవటమే కాకుండా, మన దేశమే అక్కడ ఎన్నికలను జరపటం, మన రాజకీయ పార్టీలే రాజ్యాంగాన్ని నడపడం గూగుల్ కి తెలియదా?

కాబట్టి ఇది ఖండించ తగ్గ విషయమే ....... గూగుల్ దీనికి ఖచితముగా సమాదానం చెప్పవలసినదే......... ప్రపంచ పటం ఎక్కడ చూపించినా ఆక్కడ అరుణాచల ప్రదేశ్ ని భారత దేశములో భాగము గానే గూగుల్ చూపించాలి.

మీరు ఏమంటారు.

మీరు మీ పిల్లలకు ఆశ గా కొనిచ్హే బొమ్మలు ...వారి ఆరోగ్యానికి హాని చేస్తున్నయేమో గమనించేరా?

మీరు మీ పిల్లలకు ఆశ గా కొనిచ్హే బొమ్మలు ...వారి ఆరోగ్యానికి హాని చేస్తున్నయేమో గమనించేరా?

ఈ సారి మీరు మీ పిల్లలకు బొమ్మలు కొనివ్వాలనుకుంటే ఒకటికి రెండుసార్లు అలోచించి కొనండి. ముఖ్యముగా మీ పిల్లలు 3 ఏళ్ళ లోపు వారైతే అతి జాగ్రత్త పడండి. ఎందుకంటే మన దేశములో అమ్ముడవుతున్న బొమ్మలలో "పాత్ లెట్స్" అనబడే రసాయణము చాలా ఎక్కువగా వున్నదని మన ప్రబుత్వ పరిశోధనా కేంద్రము చెబుతోంది. ఈ రసాయణము వలన అలెర్జీ, ఆస్త్ మా, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయట.

చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ బొమ్మలమీద పిల్లలు "ఆడుకోవటానికి తగినవి" అని రాసియున్న బొమ్మలలో కూడా ఈ రసాయణము ఎక్కువగా వున్నదట. ఈ రసాయణ్ణాన్ని ప్లాస్టిక్ తో కలిపితే, ఆ ప్లాస్టిక్ బొమ్మ అతి మెత్తగానూ, మ్రుధువుగానూ ఉంటుందట......కాబట్టి అతి మెత్తని, మ్రుదువైన ప్లాస్టిక్ బొమ్మలని అసలు కొనకండి.

చైనా లోనూ మరియూ తైవాన్ లోనూ తయారు చేయబడిన బొమ్మలను అసలు కొనకండి. ఎందుకంటే వాటిలోనే ఈ రసాయణం ఎక్కువ శాతం ఉందట..... చైనాలోనూ, తైవాన్ లోను తయారై వస్తున్న బొమ్మలలో ఈ రసాయణం ఎక్కువ పాళ్ళలో వుందని మన ప్రభుత్వానికి ముందే ఒక సారి తెలిసిందట.....మరి అలాంట్టప్పుడు ఆ దేశాలలో తయారై వచ్హే బొమ్మలను మన దేశములో అమ్మకూడదని నిషేధించ వచ్హు కదా? మన పిల్లలని వ్యాపార నిమిత్తం ఎందుకు ఆటవస్తువులుగా చేస్తున్నారు?.....మరి మన ప్రబుత్వము ఎందుకు దీని గురుంచి ఆలోచించటము లేదో ప్రబుత్వాధికారులకే తెలియాలి.

ఏది ఏమైనా మనం మన పిల్ల విషయములో జాగ్రత్త పడితే అది మనకే మంచిది.

Thursday, January 14, 2010

ఈ రోజు సూర్య గ్రహణము వలన ఏర్పడు దోషములకు....ఒక్కోక్క రాసి వారు చేయవలసిన నివారణములు

ఈ రోజు సూర్య గ్రహణము వలన ఏర్పడు దోషములకు....ఒక్కోక్క రాసి వారు చేయవలసిన నివారణములు

మన పూర్వీకులు వేద శాస్త్రములతో రూపోందిచ్హుకున్న రాసి ఫలాలు కోన్ని యుగాలుగా వాడుకలో వున్నాయి ....కొంతమంది ఈ శాస్త్రముల మీద, రాసి ఫలాల మీద, వేదాల మీద నమ్మకం చూపించటము లేదు......కానీ, చాలమంది వీటిని నమ్ముతున్నారు......అలా నమ్ముతున్న వారికోసమే ఈ టపా.

సూర్యుడు శరీరముగాను, చంద్రుడు మనసుగాను (కొందరు సూర్యుడు మనసుగాను, చంద్రుడు శరీరముగానూ), ఈ రెండు కలయికల వలనే మనిషి తన పనులను చేస్తున్నాడని చెప్పబడి ఉన్నది.

మనస్సు చెప్పింది శరీరము చేస్తుంది, శరీరము చేయదలచినది మనసు ఒప్పుకుంటుందని.......ఎప్పుడైనా మనస్సు చెయాలనుకున్నదానికి శరీరమూ, శరీరము చేయాలనుకున్నదానికి మనస్సు అడ్డు పడితే మనిషిలో మార్పులు వస్తాయని, ఈ ఆడ్డము రావడ్డాన్నే గ్రహణముగా పరిగణిస్తున్నారు. అప్పుడు మనిషిలో ఏర్పడే మార్పులని మనిషి సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తాడుట.
అలాగే ఈ రోజు చంద్రుడు, సూర్యునికి అడ్డు వస్తున్నాడు......అందువలనే సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ అడ్డు రావడము వలన మార్పు ఏర్పడుతుంది.....ఆ మార్పు వలన సమస్యలు వస్తాయి.

మన పూర్వీకులు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కోవడానికి కొన్ని యుక్తుల్లున్నాయని తెలుసుకోగలిగేరు. ఆ యుక్తులనే మంత్రాలుగానూ మరియూ జపాలుగానూ చెబుతున్నారు....వాటిని స్తుతిస్తే గ్రహణము వలన ఏర్పడే సమస్యలను తీర్చుకోవచ్హునని నమ్ముతున్నారు.......ఆ నమ్మకము మీదే ఒక్కోక్క రాసి వారికీ ఒక్కోక్క మంత్రం మరియూ విధానమూ చెప్పబడి యున్నది......మీరు కూడా వాటిని స్తుతించి ఈ రోజు ఏర్పడు సూర్య గ్రహణము వలన వచ్హే సమస్యలనుండి బయటపడి సంతొషముగా ఉండండి.

ఈ రోజు ఏర్పడే సూర్యగ్రహణ్ణాన్ని కంకణ సూర్యగ్రహణముగా చెబుతున్నారు. ఈ గ్రహణమువలన మనుష్యులకు డబ్బు సమస్య ఎదురవుతుందని , ఈ సమస్య నుండి బయటపడటానికి ఒక్కోక్క రాసి వారూ ఏమి చేయాలో ఈ విధముగా యున్నది:

మేష రాసి వారు-----ఒక సూర్య యంత్రము కొనుక్కుని, దానికి పూజ చేయండి.

వ్రుషభ రాసి వారు------ఓం సూర్యాయన మహ, అని చెప్పుకోవాలి.

మిధున రాసి వారు-----జపకుసుమ సంకుసుమ కష్య పేయం మహదీయుతవ్,తమ్రిం సర్వ పాపాగ్ణాం ప్రనతోస్మి దివాకరం అని చెప్పుకోవాలి.

కర్కాటక రాసి వారు-----సూర్య కవచ శ్తోత్రాన్ని చదువవలెను.


సింహ రాసి వారు------ మీ పెద్దలను ప్రేమతో చూసుకోనవలెను.

కన్య రాసి వారు------ఆదిత్య హ్రిదయ శ్తోత్రం చదువవలెను.

తులా రాసి వారు-------సూర్యునికి నమస్కారము చేస్తూ గాయిత్రీ మంత్రము జపించవలేను.

వ్రుష్చిక రాసి వారు-----మీ కులదైవాన్ని ప్రార్దించుకోనవలేను.

దనుస్సు రాసి వారు-------గాయత్రీ మంత్రము జపించవలెను.

మకర రాసి వారు-----ఆదిత్య హ్రిదయ శ్తొత్రము చదువవలెను.

కుంభ రాసి వారు-------సూర్యకవచ మంత్రము జపించ వచ్హు లేద కళ్ళు లేని వారికి డబ్బు సహాయము చెయవచ్హును.

మీన రాసి వారు------ఓం ద్రుణి సూర్యయే ఆది వ్యోం అని జపించవలెను.

భారత హాకీ జట్టుకు భారత క్రికెట్ జట్టు వీరులు సహాయం

భారత హాకీ జట్టుకు భారత క్రికెట్ జట్టు వీరులు సహాయం

భారత హాకీ జట్టు వీరులు, తమకు రావలసిన జీతాల బాఖీలు తీర్చేంతవరకు ప్రపంచ కప్పు కోసం చెయవలసిన అభ్యాసములలో పాల్గోనమని చెప్పిన మాట మీకందరికి తెలిసే వుంటుంది.

అభ్యాసములలో పాల్గోనకపొతే వారిని జట్టు నుండి తీసివేస్తామని భారత హాకీ సంఘం బెదిరించింది.

ఈ బెదిరింపుకు హాకీ వీరులు లోంగ లేదు సరి కదా ప్రపంచ కప్పుకోసం జరగబొయే ఆటలకు తాము, తమ ఖర్చుతోనే వెళ్ళి పాల్గొంటామని తెలియపరిచేరు.

ఈ లోపు కొన్ని రాశ్ట్రములు డబ్బు సహాయము చేస్తామని చెప్పడముతో హాకీ వీరులు సంతొషపడి అభ్యాసములకు వెల్తామని తెలిపి, అభ్యాసమునకు వెళ్ళటము జరిగింది.

ఈ రోజు భారత క్రికెట్ జట్టు వీరులు, భారత హాకీ జట్టు వీరులకి కోటి రూపాయలు సహాయముగా ఇస్తామని ప్రకటించేరు....ఇది ప్రశంసించాల్సిన విషయం.... ఒక ఆటకు చెందిన జట్టువారు...మరో ఆటకు చెందిన జట్టుకు సహాయము చేయడం వాళ్ళని చాలా ప్రోస్చాహిస్తుందని నా నమ్మకము.

మీరేమంటారు?

Wednesday, January 13, 2010

గూగుల్ (GOOGLE) చైనా నుండి విరమించుకుంటామని హెచ్హరించింది....చైనా ప్రబుత్వము తన సర్వాధికార వైఖరిని మార్చుకుంటుందా?

గూగుల్ (GOOGLE) చైనా నుండి విరమించుకుంటామని హెచ్హరించింది....చైనా ప్రబుత్వము తన సర్వాధికార వైఖరిని మార్చుకుంటుందా?

2006 లో చైనాలో తమ కార్యాలయాన్ని స్తాపించిన గూగుల్ కంపేనికి, చైనా నుండి సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఆదాయము వస్తోంది. అయినాసరే, ఆదాయాన్ని వదులుకుంటాము కాని మా ఖాతా దార్ల ఏకంతతని, స్వాతంత్ర్యాన్ని వదులుకోలేమని గూగుల్ స్పష్టముగా చెప్పెంది.

చైనా ప్రబుత్వము పెడుతున్న ఆంక్షలని, అడ్డంకులని, తమ వ్యాపారములో జోక్యాన్ని సహిస్తూ వచ్హిన గూగుల్ ....ఈ మధ్య తమ జి మైల్ (GMAIL) అక్కౌంట్లని చేధించి, జీ మైలు వాడుకుంటున్న వారి గురించి తెలుసుకోవటము జరిగిందట. ఈ రహస్య ఇంటెర్ నెట్ గూఢాచార్యతను చైనా ప్రబుత్వమే చేస్తొందో, లేక ఇంకెవరైనా చేస్తున్నారో అన్న సందేహములో పడ్డ గూగుల్, ఎవరు చేసినా దానిని ఆపడానికి చైన ప్రబుత్వము ఎటువంటి చర్యలూ చేపట్టలేదని..ఇక చైనాలో తమ సంశ్తని నడపడము కష్టమని, ఇక చైనా నుండి బైయటకు రావటమే మంచిదని గూగుల్ నిర్ణయించుకుని ..తమ నిర్ణయాన్ని ముందు హెచ్హరికగా తెలియపరచింది.

ఈ నిర్ణయముతో ప్రపంచములోని ఇంటెర్ నెట్ సంశ్తలే కాకుండా ఇతర సంశ్తలు కూడా ఆశ్చర్య పోయేయి. ఎందుకంటే, తమకు జరిగిన అన్యాయము ఇంకో 20 ఇంటెర్ నెట్ సంశ్తలకి కూడ జరిగిందని, ఈ సమాచారన్ని ఆ సంశ్తలకు తెలియజేసేమని గూగుల్ కంపేనీ చెప్పింది. ఈ విషయము తెలుసుకున్న అమేరీకా ప్రభుత్వము, దీనిని ఉపేక్చించరాని విషయముగా పరిగణించి, చైనా ప్రభుత్వము దగ్గరనుండి సంజాయషీ అడిగింది.

చైనా ప్రబుత్వము తమ సర్వాధికార దోరణిని మార్చుకుంటున్నట్లు తెలిపి ప్రపంచ వాణిజ్య సంఘములో జేరడముతో అనీ దేశాలూ చైనాతో వాణిజ్య సంభందములు పెట్టుకుని, ఆ దేశములో పెట్టుబడులు పెట్టడం జరిగింది. వారి (చైనా) వైఖరిని గమనించే 2008 న ఒలింపిక్స్ ఆటలు జరపడానికి ప్రపంచ ఒలింపిక్స్ కమిటీ అంగీకరించింది.

ఐతే , కోన్ని రోజులుగా.....ముఖ్యముగా టిబెట్టు సమశ్య మొదలైనప్పటినుండి చైనా ప్రభుత్వములో మార్పు రావడం మొదలైనది. ఇంటెర్ నెట్లో చైనా చేస్తున్న అనిచివేత ల గురుంచి, మానవ హక్కుల ఉల్లంఘన గురుంచి విరివిగా వ్రాయడముతో, తిరిగి చైనా తమ సర్వాధికార వైఖరిని మొదలుపెట్టింది. ఈ వైఖరి వలనే ఇంటెర్ నెట్ లో ఆంక్చలు పెట్టటము మొదలుపెట్టి, ఇంటెర్ నెట్ లో తమ ప్రభుత్వ వైఖరి గురించి వ్రాసేవారిని వెదకి నిర్బంధించడం మొదలుపెట్టింది.

వాఖ్ స్వాతంత్రము, మానవహక్కుల ఉల్లంఘన విషయములో అమేరీకా, చైనాల మధ్య చాలా రోజులనుండి భేదాలు ఉన్నయి. ఇప్పుడు గూగుల్ నిర్ణయముతో అమేరికా చైనా మీద తమ పిడికిలిని బిగించింది. ...అయితే, చైనాలో అమేరీకా పెట్టుబడులు సుమారు 800 బిలియన్ డాలర్ల దాకా వున్నది.....ఆ పెట్టుబడులు ఎమవుతాయోనన్న ఆందొలన అమేరికాకు వున్నా గూగుల్ కి జరిగిన అన్యాయం మిగతావారికి కూడా జరగవచ్హు నని భవిస్తూ చైనాకు తమ నిరసనని తెలిపింది.

ఇన్ని జరుగుతున్నా చైనా ప్రబుత్వము నోరు మెదపడం లేదు....అయితే నిన్న గూగూల్ తమ అభిప్రాయాన్ని తెలిపినాక కొంచం మార్పు చూపించాలనో ఎమో అంతకు ముందు గూగుల్ ని చూపించవద్దన్న కొన్ని ఫొటోలని గూగుల్ లో చూపించడము జరిగింది.........చైనా చూపించిన ఈ వైఖరికి గూగుల్ సంత్రుప్తి చెందలేదు. ఆంక్షలూ, అడ్డంకులూ, ఇంటెర్ నెట్ స్వాతంత్రము పూర్తిగా ఇస్తేనే మా నిర్ణయాన్ని మార్చుకుంటామని, దీని గురుంచి చైనా ప్రభుత్వముతో మాట్లాడాతామని గూగుల్ తెలిపింది.

ఏం జరగబోతుందోనని అందరూ ఎదురుచూస్తున్నరు.......గూగుల్ లాంటి పెద్ద కంపేనీ తమ దేశాన్ని వదలి వెళ్ళి పోతే, మిగిలిన విదేశీయ సంస్తలు కూడా వెళ్ళిపోతాయని, తిరిగి తమ దేశము చీకటి ప్రపంచములోకి వెళ్ళిపోవలసివస్తుందని, దీని వలన తమ దేశ అభివ్రుద్ది భాదించబడుతుందని చైనాకు తెలుసు. మరి చైనా తమ ప్రబుత్వ వైఖరిని మార్చుకుంటుందా, లేదా అనేది గూగుల్ కంపేనీ విషయముతో బయటి ప్రపంచానికి తెలుస్తుంది.

రాష్ట్ర అభివ్రుద్ది కోసం కేటాయించిన డబ్బును తమిళనాడు ప్రభుత్వం తమ పార్టీ అభివ్రుద్ది ప్రచారాలకు ఉపయోగిస్తొందట.....కరుణానిధికి అవమానం

రాష్ట్ర అభివ్రుద్ది కోసం కేటాయించిన డబ్బును తమిళనాడు ప్రభుత్వం తమ పార్టీ అభివ్రుద్ది ప్రచారాలకు ఉపయోగిస్తొందట.....కరుణానిధికి అవమానం

రాష్ట్ర అభివ్రుద్ది కోసం కేంద్ర ప్రభుత్వం కెటాయించి పంపిన డబ్బును, డీ.ఎం.కే ప్రబుత్వం తమ పార్టీ అభివ్రుద్ది పధకాలకు వినియోగిస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడీటర్ జనరల్ అఫ్ ఇండియా (CAG) ఈ మధ్య సమర్పించిన ఒక రిపోర్టులో తెలిపింది.

ఉచిత కలర్ టీవీలు, ఉచిత గ్యాస్ స్టవ్వులూ, వ్రుధ్యాప్య పెన్షనులూ లాంటివి రాష్ట్ర అభివ్రుద్ది పధకాలలోకి రావని తెలియచేసింది. తమిళనాడులోని 6 గ్రామ అభివ్రుద్ది కేంద్రాలు ఈ ఉచిత పధకాల కొసం ఖర్చు పెట్టిన 120.98 కోట్ల రూపాయలను గ్రామీణాభివ్రుద్ది ఖర్చులుగా రాసిందట. ఇలాంటి కొన్ని పనులను ఎత్తి చూపూతూ, గ్రామీణాభివ్రుద్ధి కోసం కేటాయించిన సొమ్మును ఇంకే పధకాలకూ ఉపయోగించ కూడదని చెప్పిందట.

తమిళనాడు ప్రభుత్వం ఈ మధ్య ముగిసిన రాష్ట్ర శాసన శభ సమావేశములో 21 లక్షల మందికి ఈ సంవత్సరం తమ ప్రభుత్వం ఉచితముగా పక్కా ఇళ్ళు కట్టిస్తామని ప్రకటించింది......పక్కా ఇళ్ళు ఎవరెవరికీ, ఎకడెక్కడి ప్రాంతల వారికి కట్టిస్తామనేది నిర్ణయించకుండానే, ఎవరికి పడితే వారికి కట్టించి ఇవ్వకూడదని కాగ్ (CAG) తెలియపరచింది.

తమిళ నూతన సంవత్సర ప్రారంభాన్నిజనవరి 14 కు మార్చేరు .......తమకే నూతన సంవత్సర శుబాకాంక్చలుగా ఈ రిపోర్ట్ రావడము .....అటు డీ.ఎం.కే కు ఇటు కరుణానిధి గారికి అవమానము కాదా?

Tuesday, January 12, 2010

"హైతీ" లో 200 సంవత్సరాలలో కనీ వినీ ఎరుగని భూకంపం...వీడీయో....వెలాది మంది మరణించి ఉంటారని అంచనా

"హైతీ" లో 200 సంవత్సరాలలో కనీ వినీ ఎరుగని భూకంపం...వీడీయో....వెలాది మంది మరణించి ఉంటారని అంచనా

"హైతీ".......క్యూబా దేశానికి దగ్గర....అమేరికా దేశాములో ఉన్న మియామీ నగరానికి దూరముగా ఉన్న ఈ అతి పేద నగరము నిన్న అతి దారుణమైన భూకంపానికి లోనైంది......అతి పేద నగరమైన హైతీలో వచ్హిన ఈ భూకంపం రిచ్టర్ స్కేల్ లో 7 పైగా రిజిస్టర్ అయినది.

1770 తరువాత, అంటే 200 సంవత్సారల తరువాత ఏర్పడ్డ ఈ అతి దారునమైన భూకంపం హైతీ లో ఉన్న పోర్-ఔ-ప్రిన్స్ అనే పట్టణాన్ని నేల మట్టము చేసినట్టు చెబుతున్నారు......వేలాది మంది మరణించి ఉంటారని మొదటి అంచనా. పడిపోయిన ఇళ్ళ లో నుండి వచ్హిన దుమ్ము ఒక పెద్ద మేగములాగా ఆ ప్రదేసాన్ని కప్పేసిందంటే అది ఎంత నష్టాన్ని ఏర్పరచి ఉంటుందో వూహించుకోవచ్హు.

ఈ దేశములో రాజకీయక వాతావర్ణం బాగుండక పోవటము వలన, ఈ దేశము యూనైటెడ్ నేషన్స్ కి చెందిన పెద్ద సెక్యూరిటీ ఫొర్స్ ఆధీనములో ఉన్నది.....వీరిలో కూడా చాలా మంది కనిపించటము లేదట...చీకటి మయము అయిపోయిన హైతీ నుండి ఎటువంటి సమాచారమూ అందటము లేదట.


బాధితులకు ఏం చెప్పాలో తెలియటము లేదు. ఆ ప్రదేసము అతి త్వరలో మామూలు పరిస్తితికి రావాలని ఆ దేవిడిని ప్రాదిస్తున్నాను.

సంక్రాంతి శుభాకాంక్షలు.....నా ఇతర బ్లాగులు

తెలుగు బ్లాగ్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు "భోగి, కనుమ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు"

మీ కోసం

నా ఇతర బ్లాగులు: http://splendorofyoga.blogspot.com

http://refreshourknowledeagain.blogspot.com

http://inandaroundtheworld.blogspot.com

http://chilkaphoto.blogspot.com

ఇట్లు
చిలకలపూడి సత్యనారాయణ

ఈ ఫలహారసాలకు మాత్రం ఆహార పధార్ధాల ధరల పెరుగుదలతో భాద లేదు....అతి తక్కువ ధరకే భోజనము, టిఫిన్!!

ఈ ఫలహారసాలకు మాత్రం ఆహార పధార్ధాల ధరల పెరుగుదలతో భాద లేదు....అతి తక్కువ ధరకే భోజనము, టిఫిన్!!

భోజనం (వెజిటేరీన్) రూ.12.50, చపాతీ ఒకటికి రూ.1.00............అరే! ఎక్కడ ఇది సాధ్యము అనుకుంటున్నారా?.......పూర్తిగా చదివితే ఎక్కడో మీకే అర్ధం అవుతుంది.

ఆహార పదార్ధాల ధరలు ఆకాశన్ని అంటుతున్నాయి, సాదారణ మానవునికి అందుబాటులో లేవు...అందరికీ తెలిసిన విషయమే ఇది, అందరూ ఈ ధరల పెరుగుదల వలన భాధపడుతున్నారు. దీని గురించి ప్రభుత్వము కూడా గాబరా పడుతోంది. ఈ రోజు పార్లమెంటులో దీని గురించి విశ్త్రుతంగా చర్చలు జరుగుతున్నాయి. ధరలను ఎలా అరికట్టాలో ఫదఖాలు వేస్తున్నారు.

ఆహార పధార్ధాల ధరల పెరుగుదలవలన హోటల్లలోను, కాంటీనులలోను ధరలు పెంచబడుతున్నయి ..తప్పదు మరి. ఎందుకంటే ఇవి నడిపేవారు ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి వస్తోంది.. దేశములో అన్ని హోటల్సులోను, కాంటీనులలోనూ ధరలు పెంచవలసివస్తొంది...కానీ ఇక్కడ...ఈ కాంటీనులో మాత్రం తినుబండారాలకు రేట్లు పెంచకపోవటమే కాకుండా...అతి తక్కువ ధరకే అమ్ముతున్నరు....ఆ కాంటీను ఏదో తెలుసా "పార్లమెంట్ కాంటీన్" (మన పార్లమెంటు కాంటీనులోనే) .....అక్కడ తినుబండారల ధరల పట్టీ చూస్తే మీరు ఆశ్చర్య పోతారు.

భోజనం (వెజిటేరిన్) రూ. 12.50
చపాతి ఒకటికి రూ. 1.00
దోసె ఒకటి రూ. 4.00
భోజనం ( నాన్ వెజిటేరిన్) రూ. 22.00
పెరుగు అన్నం ఒక ప్లేటు రూ. 11.00
వెజిటబుల్ పులావ్ రూ. 8.00
చికెన్ బిరియాని రూ. 34.00
టొమేటో అన్నం రూ. 7.00
టీ రూ. 1.00
ఇలా మరెన్నో అయిటంస్ అతి తక్కువ ధరకే.....ఈ కాంటీనులో భొజనాలు, టిఫిన్లు తినేది ఎవరో తెలుసా ....పార్లమెంటులో ఆహార పధార్ధాల ధరల పెరుగుదల గురించి ఒకరి మీద ఒకరు తప్పులు చెప్పుకుంట్టున్న మన పార్లమెంటు మెంబర్లు. ఇక్కడ తయారు చేయబడే రుచి కరమైన పధార్ధాలను తినే అద్రుశ్టం పార్లమెంట్ శభ్యులకే కాదు, పార్లమెంటులో పనిచేస్తున్న అందరికీ మరియూ పార్లమెంటు జరుగుతున్నప్పుడు వచ్హే అతిధులకి, విలేఖర్లకి కూడా ఉంది. ఇలా అతి తక్కువ ధరకు ఎలా అమ్మగలుగుతున్నారంటే....ఆ కాంటీనుకు రాయతీ ఇవ్వడం వలనే...ఈ రాయతీ డబ్బు ఎక్కడదీ అంటే...పన్నులు కట్టే వారి డబ్బే.

సుమారు 5.3 కోట్లు ఈ సంవత్షారానికి ఈ కాంటీనుకు కేటాయించబడింది. అందులో 3.55 కోట్లు లోఖ్ శభ, 1.77 కోట్లు రాజ్య శభ కడుతోంది.


మరి సాదారన ప్రజలు ఎదురుకొంటున్న ఆహార పధార్ధాల ధరని అరికట్టటానికి ప్రభుత్వం ఎటువంటి నడవడిక తీసుకుంటుందో వేచి చూడాలి.

Monday, January 11, 2010

మంత్రులే చావుబ్రతుక్కుల్లో ఉన్న ఇంకొక మనిషికి చెయూతనివ్వక, ద్రిష్టి బొమ్మలలా నిలబడితే.....వారిని ఎలా దండించాలి?

మంత్రులే చావుబ్రతుక్కుల్లో ఉన్న ఇంకొక మనిషికి చెయూతనివ్వక, ద్రిష్టి బొమ్మలలా నిలబడితే.....వారిని ఎలా దండించాలి?

రెండు రోజుల క్రితం ఒక ప్రఖ్యాత టీవీ చ్యానల్ లో ప్రచారమైన ఒక వీడియో క్లిప్పింగులో , తమిళనాడుకు చెందిన ఇద్దరు మంత్రులు, తమ బందో బస్తుకై వచ్హిన ఒక పోలీస్ ఇన్ స్పెక్టర్ ని కొంతమంది దుండగులు అడ్డగించి, కత్తులతోనూ, బాంబులతోనూ ఆ ఇన్ స్పెక్టర్ పై దాడి చేసి పారిపోయేరు....తీవ్రముగా గాయపడి, చావు బ్రతుకులతో కోట్టు మిట్టు లాడుకుంటూ క్రింద పడిపోయిన ఆ ఇన్ స్పెక్టర్, చేతులు ఊపుతూ తనని కాపడమని ప్రాధేయపడుతుంటే , ఆ ఇద్దరు మంత్రులూ, వారితో వచ్హిన మిగతా బ్రుందం....ఎవరూ ఆ ఇన్ స్పెక్టర్ దగ్గరకు వెళ్ళకుండా చూస్తూ నిలబడడం ఆ వీడీయో క్లిప్పింగ్ ని చూసిన ప్రతి ఒక్కరి మనసుని విల విల లాడించి, కదిలించివేసింది.

ఆ మంత్రులే గనక తీవ్రముగా గాయపడ్డ ఆ ఇన్ స్పెక్టర్ ని వెంటనే తమ కార్లలో పక్కనున్న ఏదో ఒక ఆసుపత్రికి తరలించివుంటే బహుస బ్రతికేవాడేమో .

అల చేయకపోవడం వలన ఆ ఇన్ స్పెక్టర్ వారి కళ్ళ ముందే గిల గిలా కొట్టుకుంటూ చనిపోయేడు......ఈ సంఘఠనని వీడియో క్లిప్పింగులో చూసిన ప్రతి ఒక్కరూ స్పంధించేరు. ఇది భారత దేశానికే అవమానం తెచ్హిందని, భాధ్యత గల మంత్రులూ, వారితో వచ్హిన వారూ, వారికి బందో బస్తుగా వచ్హిన తోటి మనిషి చావు బ్రతుకులతో కొట్టుకుంటుంటే, అతన్ని వెంటనే కాపాడటానికి ప్రయత్నించకుండా అతను గిల గిలా కొట్టుకుని చనిపోవడం ద్రిష్టి బొమ్మలలా చూస్తున్న వీరు మంత్రి పదవులకు తగుదురా? పిరికితనాన్ని చూపిన వారికి ఆ మంత్రి పదవులు ఇంకా ఉంచాలా? అని అడుగుతున్నారు .

తమిళనాడు ప్రభుత్వం ఆ మంత్రుల మీద ఎటువంటి చర్యలూ తీసుకోక పోగా, వారు చేసిన విధనాన్ని వెనకేసుకోస్తోంది. "వారు వెంటనే ఆంబులాన్సికి ఫోను చేసేరు.....ఎందుకంటే ఆంబులాన్సులోనైతే చావు బ్రతుకులలో ఉండేవారికి సహాయపడే పరికరాలు ఉంటాయి" అని చెప్పింది.

వారు ఫోను చేసి, ఆంబులాన్సు ఎప్పుడు వచ్హేది?......చావు బ్రతుకులతో పోరాడుతున్న ఆ ఇన్ స్పెక్టర్ మంచినీళ్ళు అడుగుతుంటే, అతనికి దూరంగా నిలబడి, పై నుంచి మంచినీళ్ళు పోస్తున్న ఆ ద్రుశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరి పిరికితనాన్ని, మానవత్వాన్ని ఎత్తి చూపడం తమిళనాడు ప్రబుత్వం మరచిపోయినట్లు వుంది.

Sunday, January 10, 2010

ప్రణావ్ మిస్త్రీ......"సిక్స త్ సెన్స్" (Sixth Sense) టేక్నాలజీ ని కనుగొన్న భారతీయుడు......తను కొనుగొన్న టెక్నాలాజీ ఎలా పనిచేస్తుందో చెప్పడం ఇక్కడ చూడ

ప్రణావ్ మిస్త్రీ......"సిక్స త్ సెన్స్" (Sixth Sense) టేక్నాలజీ ని కనుగొన్న భారతీయుడు......తను కొనుగొన్న టెక్నాలాజీ ఎలా పనిచేస్తుందో చెప్పడం ఇక్కడ చూడండి, వినండి

"సిక్స త్ సెన్స్" (Sixth Sense) అనే టెక్నాలజీ ని కనుగొని టెక్నాలజీ ప్రపంచాన్నే ఆశ్చర్య పరచిన ఈ భారతీయుడు, తను కనుగొన్న టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో, అది ఎలా ప్రజలకు ఉపయోగ పడుతుందో, తను ఆ టెక్నాలాజీని ఎలా కనుగొన్నాడో ఈ క్రింద వీడియోలో అతను టెక్నాలాజీ ప్రపంచ అదినేతలకు ఇచ్హిన ప్రజన్ టేషన్ (Presentation) లో వినండి.

ఈయన కనుగొన్న టెక్నాలాజీ ని ఒక విప్లవాత్మక టెక్నాలాజీగా అందరూ ఆయన్ని పొగడుతున్నారు..... ఈయన కనిపెట్టిన టెక్నాలాజీని మొబైల్ కంప్యూటర్ గా చెబుతున్నారు.

ఎలాంటి బరువూ చేతిలో తీసుకువెల్లకుండా , ఈయన కనిబెట్టిన చిన్న వస్తువుని ఒక చేతి వేలుకి చిన్న ఉంగరం లాగా పెట్టుకుని, దానిని ఎక్కడ పడితే అక్కడ వాడుకునే విధముగా తయారు చేసేరు. ఒక చిన్న తెల్ల కాయితాన్ని తీసుకుని, చేతి వేలుని అ కాయతం మీద పెడితే ఆ కాయితమే ఒక కంప్యూటర్ స్క్రీన్ గా వాడుకో వచ్హు. అలా దేని మీద వేలు పెట్టినా, ఆ వేలు పెట్టిన వస్తువుని కంప్యూటర్ గా వాడుకోవచ్హు.

నేను ఈ టపాలో రాయడం కంటే ఆయన ఇచ్హిన ప్రజన్ టేషన్ (Presentation) ఈ క్రింది వీడియోలో చూసి తెలుసుకోవచ్హు....అంతే కాకుండా, ఆయన గురించి, ఆయన చేసిన ప్రయత్నాల గురించి మీరు తెలుసుకోడానికి ఇక్కడ ఒక లింకు ఇస్తున్నాను. ఈ లింకు మూలముగా ఆయన గురించి ఇంకా తెలుసుకోండి.

లింకు :http://www.ted.com/talks/lang/eng/pranav_mistry_the_thrilling_potential_of_sixthsense_technology.htmlఈయన భారతీయుడవటం మనమందరమూ గర్వ పడవలసిన విషయము....అందుకేనేమో అమేరీకాలో జరిగిన ఒక సర్వేలో నెక్స్ ట్ బిల్ల్ గేట్స్ (Next Bil Gates) ఎక్కడ నుండి వస్తారు అని అడిగితే ఇండియా నుండి లేదా చైనాలో నుండి వస్తారని చెప్పేరుట.

Saturday, January 9, 2010

ఆస్ట్రేలియాలో భారతీయుల మీద జరుగుతున్న దాడికి....ఆ ప్రభుత్వ వైఖరియే కారణం

ఆస్ట్రేలియాలో భారతీయుల మీద జరుగుతున్న దాడికి....ఆ ప్రభుత్వ వైఖరియే కారణం

ఆస్ట్రేలియాలో భారతీయుల మీద జరుగుతున్న దాడులకు, ఆ దేశ ప్రభుత్వమే కారణంగా కనుబడుతోంది.....ఎందుకంటే ఒక ప్రక్క దాడులను ఖండిస్తూ, దాడిచేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతూ .....మరో ప్రక్క పెద్ద, పెద్ద నగరాలలో ఇలాంటి దాడులు సహజమేనని, ఇలాంటి దాడులని ఏ దేశమూ ఆపలేదని చెపుతున్నది. ఈలాంటి నిర్లక్ష్య మైన ప్రకటనలు పరోక్చముగా దాడులు జరుపుతున్న వారిని ప్రోస్చాహించే విధముగా వున్నయి.

ఆస్ట్రేలియా ప్రభుత్వము చూపుతున్న ఈలాంటి నిర్లక్ష్య వైకరిని మన దేశం కఠినంగా ఖండించాలి.......తగిన విధముగా స్పంధించాలి. లేకపోతే మరిన్ని దాడులు జరుగుతాయి.

శనివారం నాడు 29 సంవత్సరాల జస్ ప్రీత్ సింగ్ అనే భారతీయుడిని కొంతమంది దుండగులు సజీవ దహనం చేయటానికి ప్రయత్నించేరు. ఇప్పుడు ఆ యువకుడు ఆసుపత్రిలో చికిస్చ పోందుతున్నడు......ఈ సంఘటన జరగటానికి వారం రోజుల ముందు, నితిన్ గార్గ్ అనే 21 సంవత్సరాల భారతీయ విధ్యార్ధి ని గుర్తు తెలియని కొంతమంది కత్తితో పొడిచి చంపెసేరు. అతని శవం ఈ రొజు భారతదేసం తీసుకు వస్తున్నారు.

సంఘ విద్రోహ శక్తులు డబ్బు కోసం ఇలా దాడులు చేస్తున్నరిని ఆస్త్రేలియా ప్రభుత్వం చెబుతోంది. డబ్బు కోసమే అయితే ఏ కత్తి చూపించో, తుపాకి చూపించో బెదిరించి డబ్బు తీసుకుని పోవచ్హు కదా?...అల కాకుండా మనిషిని చంపడం, తగలపెట్టడం ఏ కోవకు చెందిందో చెప్పమనండి.

నితిన్ గార్గ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆస్త్రేలియా ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ, వారు భారతీయులకు సరియైన రక్షణ కల్పించటం లేదని వారిని నిలదీసినందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పందించిన తీరే పైన చెప్పబడినవి.
వారు చేసిన ప్రకటనల తరువతే భారతీయులపై మరో దాడి ( అదే సజీవ దహనం చేయటానికి ప్రయత్నిచటం).


2008 లో 17 మంది భారతీయులపై దాడి జరిగితే, 2009 లో సుమారు 100 మంది భారతీయులపైన దాడి జరిగింది......2010 లో మొదటి దాడిగా ఒక భారతీయుడుని తగల పెట్టడం......ఇప్పుడు కూడా భారతదేశం కఠినంగా స్పందించక బోతే, ఆస్త్రేలియా ప్రభుత్వం సరియైన చర్యలు తీసుకోకపోతే ఆస్త్రేలియాలో భారతీయులకు రక్షన లేదు.

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు అనుకున్నదే జరిగితే ....భారత దేశం ఉన్నత శ్తాయికి ఎదుగుతుంది

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు అనుకున్నదే జరిగితే ....భారత దేశం ఉన్నత శ్తాయికి ఎదుగుతుంది"ప్రవసి భారతీయ దివాస్" లో పాల్గోన్న ప్రతినిధులను ఉద్దేసించి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతూ విదేశియాలలో ఉన్న భారతీయులను తిరిగి స్వదేశనికి రమ్మని, వచ్హి రాజ్యాంగములోను మరియూ ప్రజా పనులలోను కలిసి పనిచేయవలసిందిగా వారిని కోరేరు.ఈ కోరికలో చాల అర్ధం వున్నది.......అమెరీకాలో మన దేశానికి చెందిన రాజీవ్ షా నిన్న "అమేరికన్ అంతర్జాతియ పెంపుదల శాఖ" (USAID…..US Agency for International Development) ని నడిపే 16 వ అధిపతిగా పదవీస్వీకారం చేసేరు ( ఈ క్రింద చూపిన ఫొటోలో, ఆయన పదవీస్వీకారం తీసుకుంటున్నప్పుడు హిలారి క్లింటొన్ గారు చప్పట్లు కోడుతున్నారు)....ఆయన దగ్గర ఎంతో నైపుణ్యం ఉండబట్టే అంత పెద్ద పదవికి భారతీయుడైనా ఆయన్ని నియమించుకున్నారు. ఈయనే కకుండా మరికొంతమంది భారతీయులు కూడా అమేరికా రాజ్యాంగ పాలనలో ఉన్నత పదవులు వహిస్తున్నారు. ఇది మనమందరమూ ఎంతో గర్వ పడాల్సిన విషయం. ఇలాంటి వారు మన దేశంలో అతి ఉన్నతమైన మరియూ ముఖ్యమైన పదవులని వహిస్తే మనదేశం ఇంకా పైకి ఎదిగిపోతుంది.....ఇదే మన ప్రధాన మంత్రి ఆశించిన దానిలోని ఉద్దేసం.


ఇటువంటి వారిని ఉష్చాహ పరచాలనే మోదటి ప్రయత్నంగా 2014 లో జరుగ బోవు లోక్ సభ ఎన్నికలలో విదేశాలలో నివసిస్తున్న, పనిచేస్తున్న భారతీయులకు ఒటు వేసే హక్కును కలిపించటానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నయని తెలిపేరు.

బయిటి దేశాలలో పని చేస్తున్న భారతీయుల దగ్గరనుండి మనదేశానికి సంవత్సరానికి 50 మిల్లియన్ డాలర్లు విదేశీయ డబ్బు ఆదాయముగా వస్తోందని, ఇది మనకు సంవత్సరములో విదేశీయాల నుంచి వస్తున్న ఆదాయములో 40 శాతం గా వుందని ఆయన తెలిపేరు.ఆలాగే ప్రపంచ ఆర్దీకపరిస్తితి దెబ్బతినడంవలన, పనులు కోల్పోయి మన దేశానికి తిరిగి వచ్హిన భారతీయుల కోసం "రిటర్న్ అండ్ రి సెటిల్ మెంట్ ఫండ్" ( Return & Resettlement Fund) ని ఏర్పాటు చేయటానికి తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని కూడా తెలిపేరు.


పోయిన సంవత్సరములో మలేసియా, ఇంగ్లండ్ మరియూ కోతార్ దేశాలతో భారతీయుల పని ఒప్పందాలు, వారి బాగోగులు గురుంచి మన దేశం ఒప్పందం వేసుకున్నదని చెప్పేరు. ఆయన ఆశించిన విధముగా విదేశీయాలలో వున్న భారతీయులు మన దేశం వచ్హి మన రాజ్యాంగంలో చేరి తమ మేదస్సును, శక్తి సామర్ధ్యాలను ఉపయోగించి భారత దేశ ప్రజలకు మరియూ భారత దేశానికి వెన్నుముకగా వుండాలని ఆసిస్తున్నాను........ ఇలా ఏదో ఒక రోజు బాగా చదువుకున్న వారు మన దేశ రాజ్యాంగములో అంగం వహిస్తారని నమ్ముతూ ఈ సందర్భముగా రాజీవ్ షా గారితో పాటు విదేశాలలో పనిచేస్తున్న అందరి భారతీయులకు ఇవే నా జూహార్లు.

Friday, January 8, 2010

ఐ.టి కంపేనీలలో తిరిగి ఉద్యోగ అవకాశాలు....జీతాల పెరుగుదల

ఐ.టి కంపేనీలలో తిరిగి ఉద్యోగ అవకాశాలు....జీతాల పెరుగుదల

గత ఒకటి, రెండు సంవత్సరాల నుండి ఐ.టీ కంపేనీలలో తగ్గు ముఖం పట్టిన ఉద్యోగ అవకాశాలు, జీతాల పెరుగుదల ఈ సంవత్సరం నుండి మళ్ళీ మోదలవుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా, ప్రపంచ ఆర్ధీఖ పరిస్తితి మెరుగు పడటంతో, అంతకు ముందు ఆగిపోయిన విదేశీయ పనులు మనకి తిరిగి రావటం ప్రారంబం అయ్యింది. అందువలన మన దేశం లోని ముఖ్య ఐ.టీ కంపేనీలు ఈ సంవత్సరం నుండి మళ్ళి కొత్తగా ఉద్యోగస్తులని తీసుకుంటున్నారు. అంతే కాకుండా గత ఒకటి, రెండు సంవత్సరాలుగా ఇప్పుడు పనిలో వున్న వారి పెంచని జీతాలు కూడా కనీసం 8% (ఎనిమిది పర్సెంట్) పెంచుతారని వార్తలు వెలువడినై.

గత రెండు సంవత్సరాలుగా ప్రపంచ ఆర్ధీక పరిస్తితి దెబ్బతినడంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇన్ ఫోసిస్, టి.సి.యస్, విప్రో లాంటి పెద్ద కంపేనీలలోనే జీతాలు పెంచకపోవడం, ఉద్యోగస్తులని తగ్గించుకోవడం మరియూ కొత్త ఉద్యోగస్తులని చేర్చుకోలేకపోవడం జరిగింది.


ఇప్పుడు ఆ పరిస్తితి మారినట్లే.

ఇన్ ఫోసిస్, టి.సి.యస్, విప్రో లాంటి కంపేనీలు కొత్త ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కాకుండా , ఇప్పుడు పనిచేస్తున్నవారికి జీతాలు పెంచే పరిస్తితులు రావడం చాల సంతొషించవలసిన విషయం. ఎక్కువగా అమేరికా దేశ పనులనే నమ్ముకున్న మన ఐ.టీ కంపేనీలు ఇప్పుడు తమ ద్రుష్టిని ప్రపంచములోని అన్ని దేశాలకు మళ్ళించడంతో మన ఐ.టీ కంపేనీల పనులు, లాభాలు, ఎక్కువైనై. వీటిని సుస్తిరంగా ఎర్పరచుకునే ఆలోచనలు గట్టి బడ్డాయి.

అమేరికాలో కూడా మన ఐ.టీ కంపేనీలకు డిమాండు పెరిగింది. అంతకు ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం హ్చ్.1బి వీసాలు మన ఐ.టీ కంపేనీలు పొందేరు.

ఐ.టీ కంపేనీలలో ఉద్యోగ అవకాసాల కోసం ఎదురు చూసేవారికి ఇది ఒక సంతోషకరమైన వార్తగా ఉంటుందని భావిస్తున్నను.

Thursday, January 7, 2010

త్వరలో.....చేతి వేళ్ళు ఊపి టీ.వీ చానెల్స్ మార్చుకునే విధానం

త్వరలో.....చేతి వేళ్ళు ఊపి టీ.వీ చానెల్స్ మార్చుకునే విధానం

చేతి వేళ్ళతో టీ.వీ, కంప్యూటర్, మొబైల్ పోన్లు ముట్టుకుని మనకి కావలసినవి మార్చుకోవటం ఈ మధ్య వచ్హిన సాంకేతిక నిపుణం.......రిమోట్ కంట్రోలర్ల వాడకం పాత రోజుల సాంకేతిక నిపుణంగా మారిపోయింది.

ఇప్పుడు అంటే ఇక రాబోవు కాలంలో చేతి వేళ్ళ ఊపుడుతో టీ.వీ చానల్స్ మార్చుకునే విధానం రాబోతోంది. మీరు మీ చేతి వేళ్ళు ఊపి చానల్స్ మార్చు కోవడమే కాకుండా సౌండ్ పెంచుకోవటం, తగ్గించుకోవటం కూడా చేసుకోవచ్హు......దీనిని 3 డి (3D) అభినయ సాంకేతిక పరికరణంగా ప్రవేసపెట్టబోతున్నారు.

ఈ సాంకేతిక నిపుణంతో తయారు చేయబడు టీ.వీ లని ఈ సంవత్సరము చివరిలో అమేరికా లో ప్రవేస పెడతామని ఈ పరిఙ్ణాణములో నిపుణులైన సాఫ్ట్ కైనెటిక్ సంశ్త వారు తెలియచేసేరు.....ఈ నూతన సాంకేతిక పరికరంతో వెలువడే టెలివిషన్లు మనుష్యులని కొత్త ప్రపంచములోకి తీసుకువెడుతుందని తెలిపేరు.

ఒక 3 డి (3D) కేమేరాని టెలివిషన్ సెట్లలో అమర్చి, టెలివిషన్ సెట్లని తయారుచేసేందుకు మరో రెండు కంపేనీలతో ఒప్పందం వేసుకున్నట్టు తెలియచేసారు.

మనం మన దేశంలో ఈ టెలివిషన్ లని చూడటానికి, కొనుక్కోవడానికి ఇంకొక రెండు సంవత్సరాలు పట్టవచ్హు.

ఒక ప్రక్క టెక్ణాలజీ అభివ్రుద్ది చెందుతోందని సంతోష పడుతున్నా ఈ అభివ్రిద్ది వలన ఎంత మంచి జరుగుతుందో, ఎంత చెడు జరుగుతుందో అనే ఆలోచన శాష్త్రవేత్తలని ఆలోచింప చేస్తోంది.

మనము ఎదుర్కోబోయే 2 ముఖ్య ఆపదలను తెలుసుకోండి.

మనము ఎదుర్కోబోయే 2 ముఖ్య ఆపదలను తెలుసుకోండి.

పెరుగుతున్న సముద్ర నీటి మట్టము భరతదేశానికి పెద్ద ముప్పు తెస్తుంది

రాబోవు సునామీలు, తరచుగా వచ్హే తుఫానలు మరియూ అకస్మాత్తుగా వచ్హే వరదలు లాంటి ప్రక్రుతి వైపరీత్యాలు మానవుల వలన పెరిగిపోయిన వాతావర్ణ కాలుష్యం వలనేనని మనం తెలుసుకోవటానికి సూచనలని చెన్నై ఐ.ఐ.టి లో "వాతావర్ణ కాలుష్యం వలన రాబోవు పరినామాలు మరియూ మంచినీటి కోరత" అనె అంశం మీద జరిగే సమావేశంలో పాల్గోన్న శాస్త్రవేత్తలు తేలిపేరు.

అన్నిటి కంటే ముఖ్యమైన ఆపద సముద్రములో పెరుగుతున్న నీటి మట్టమేనని చెబుతున్నారు. భూమిలో నుండి తీయబడు ఇంధనాన్ని తగ్గించక పోతే రాబోవు 10 సంవత్స రాలలో భూమి మీద ఉష్నోగ్రత ఇప్పుడున్న ఉష్నోగ్రత కంటే 4 డిగ్రీలు (సెలిసీస్ లో) ఎక్కువ అవుతుందని, ఇప్పడికే వాతావర్ణంలో కార్బండ ఆక్సైడు సంవత్స రానికి 2 పిపిఎం చొప్పున పేరుగుతోందని కెనడాకు చెందిన శాస్త్రవేత్త తెలిపేరు.

అమేరికాకు చెందిన శాస్త్రవేత్త మాట్లాడుతూ వాతావర్ణ కాలుష్యం వలన ఉష్నోగ్రత పెరిగి మంచు కొండలని కరిగించి ప్రపంచాన్ని చుట్టూ ఉన్న సముద్రపు నీటి మట్టాన్ని పెంచుతోంది. ముఖ్యముగా భారతదేశం చుట్టూ ఉన్న సముద్రపు నీటి మట్టం అధిఖముగా పెరుగుతోంది, దీనికి కారణం పోలార్ లోని మంచుకొండల కంటే హిమాలయా పర్వతాలలో ఉన్న మంచు కొండలు త్వరగా కరుగుతూండటమే. కనుక భారత దేశపు సముద్ర తీర ప్రాంతాలకు ఎక్కువ ముప్పు వాటిల్లుతుందని, ఆ ముప్పు చాలా విపరీతంగా వుంటుందని చెప్పేరు.

ఎంత మంచు కరుగుతోందో .....ఎంత నీరు పెరుగుతోందో తెలుసుకునే పరికరాలు లేవు కాబట్టి ముప్పు ఎంత విపరీతముగా వుంటుందో అంచనా వేయలేక పోతున్నామని చెప్పేరు.

భారత దేశములో మంచి నీటి వణరులు ఎక్కువగా వున్నాయని, కాని వాటిని మనం సక్రమంగా ఉపయోగించుకోవటం లేదని చెన్నై ఐ.ఐ.టి డైరెక్టర్ తెలిపేరు.

ఈ నక్షత్రము పేలితే....భూమికి చాల ప్రమదామున్నదట

అతి తొందరలో భూమి తుడిచిపెట్టుకుపోయే ప్రమాదము ఉన్నదని అమెరికాలోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదీ ఒక నక్షత్రం మూలముగానట.

భూమికి అతి దగ్గరగా ఉన్న టి.పైక్సిడిక్స్ అనే నక్షత్రం పేలిపోయే అవకాసం వుందట. ఈ పేలుడుని "సూపర్నోవా" అంటారుట. ఇది పేలితే దాని ముక్కలు 20 బిల్లియన్,బిల్లియన్,బిల్లియన్ల మెగా టన్నుల శక్తి కలిగినవిగా వుంటాయట. ఆ పేలుడు వల్ల ఏర్పడే ఉష్ణ రసాయణములు భూమిని కాపాడుతున్న ఒజోన్ పొరను వూడదీసుకుని పోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ట్.పైక్సిడిక్స్ అనే ఈ నక్షత్రం రసాయనాలని పీలుస్తూ పెద్దదవుతోందట. అలా పెద్దదైన నక్షత్రం ఒక బలూను లాగా తయారై పేలిపోతుందట.

ఫిలిడాల్ఫియాలో వున్న విల్లినోవా కలాశాలలోని శాస్త్రవేత్తలు అంతర్ జాతీయ ద్రుశ్య కిరణములను అన్వేషించు ఉపగ్రహము అందించిన సమాచారముతో ఈ విషయాన్ని తెలుసోకోగలిగేరుట.

1890 నుండి ఆ నక్షత్రములో చిన్న చిన్న పేలుళ్ళు ఏర్పడినాయట. ఆ పేలుడులో ఏర్పడ్డ రసాయణాలు ప్రతి 20 సంవష్తారలకు ఒక సారి చిన్న చిన్న శక్తితో వెలువడేవిట.....1967 తరువాత అ నక్షత్రములో పేలుడులు ఆగిపోయినై......అందువలన ఆ నక్షత్రం అతి వేగముగా ఉబ్బుతోందని, ఈ నలబై సంవత్షారాల రసాయిణాన్ని ఒక్క సారిగా ఒక పెద్ద పేలుడుతో వెలువడిస్తుందని భావిస్తూ, అది అతి త్వరలోనే జరగవచునని చెబుతున్నారు.

ఇలా ఫీజులు పెంచుకుంటూ పోతే.....చదువులు కుంటుకుంటూ పోతాయి

ఇలా ఫీజులు పెంచుకుంటూ పోతే.....చదువులు కుంటుకుంటూ పోతాయి

ఒక ప్రక్క భారతీయుల ప్రతిభ విదేశీయాలకు వెల్లిపోతొందని గోల పేడుతూ మరో ప్రక్క అసలు చదువులకే బేరలు పేడుంతుంటే, కావలసినంత ప్రతిభావంతులు ఎలా భయటపడతారు?

ప్రభుత్వ కళాశాలల కంటే, ప్రైవేటు కళాశాలలే ఎక్కువ ఉన్న మన భారత దేశంలో తల్లితండ్రులు తమ పిల్లల చదువుల కొరకు అప్పులపాలవడమో, ఆస్తులు అమ్ముకుని భిక్షగాల్లవడమో జరుగుతోంది. అయినా పరవాలేదులే అనుకుని, డొనేషన్లకు మరియూ ఫీజులకు తల్లితండ్రులు తమల్ని తమే తాకట్టు పెట్టుకుంటున్నారు.


ఇది చాలదని కాబోలు ఇప్పుడు కళాశాల ఫీజులని ఎవరూ ఊహించనంత అధికంగా పెంచదలుచుకున్నారు.

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (All India Council for Technical Education) ఏర్పరచిన జస్టీస్ రంగనాద్ మిస్రా కమిటీ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చుదువుకో దలచుకున్న విధ్యార్ధుల ఫీజుని చెన్నై, ముంబై, డిల్లి మరియూ కలకత్తాలలోని కళాశాళలో నైతే ఒక లక్షా ఇరవైఎనిమిది వేలు గానూ (Rs.1,28,000/-), బెంగలూరు మరియూ హైదరాబద్ కళాశాలల్లో నైతే ఒక లక్షా ఎనిమిది వేలు గాను (Rs.1.08,000/-), టవున్లలో నైతే ఎనభైఎనిమిది వేలు (Rs.88,00) గానూ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఇంకా ప్రభుత్వము పరిసీలించలేదు.

కాని ఖచ్హితంగా ఫీజులు పెంచాలని ప్రైవేటు కళాశాలల అధినేతలు పట్టుబడుతున్నరు.

ఫ్రభుత్వ కమిట్టీయే పెంచమంటోంది కనుక ఫీజులు పేరిగే అవకాసం ఉన్నది. ప్రైవేటు కళాశాలలనే నమ్ముకున్న వారి కలలు తల్లకిందలవుతాయి.

చదువుకోనడం ప్రతి భారతీయిని జన్మ హక్కు అని చేబుతూ ఇలా ఫీజుల పేరిట అడ్డంకులు పెడితే, చదువులు భారం అవుతాయి, ప్రతిభావంతులు తగ్గిపోతారు.

ఇలా అయితే రాబోవు యువత ఏమి సాధిస్తుంది, ప్రభుత్వానికి ఏమి అందిస్తుంది.

Wednesday, January 6, 2010

భారతీయులకు ఇంటెర్ నెట్ లో అశ్లీలీల జాలస్తలముల బంద్.....ఈ బంద్ మంచికోసమే

భారతీయులకు ఇంటెర్ నెట్ లో అశ్లీలీల జాలస్తలముల బంద్.....ఈ బంద్ మంచికోసమే

కామ సూత్రాన్ని ప్రపంచానికి భారత దేశం అందించివుండవచ్హు....కాని అశ్లీలీలతను ఇంటెర్ నెట్ లో విష్లేసించడం మన ఆచారానికి, కట్టుబాట్లకి విరుద్దం. భారత దేశంలో ఇంటెర్ నెట్ ఉపయోగించేవారి సంఖ్య రొజు రోజుకీ పెరుగుతున్న సందర్బములో ఈ బంద్ చర్య చాల ముఖ్యం.

చైనాలో ఈ నెల ఒకటవ తారీఖున అశ్లీలీల వెబ్ సైట్లు చూస్తున్న సుమారు 5000 మందిని చైనా పోలీసులు నిర్భంధంలోకి తీసుకున్నరు....అశ్లీలీల వెబ్ సైట్లు చిన్నారి హ్రుధయాలని చేడిపేస్తున్నాయని, చైనా ప్రభుత్వం తమ దేశంలో అశ్లీలీల వెబ్సైట్లని నిషేధించి, అలాంటి వెబ్ సైట్లని ఎవరూ చూడరాదని, చూపించరాదని ఆదేశం వేసింది. ఈ నిషేదాన్ని, ఆదేశాన్ని "గ్రేట్ ఇంటెర్ నెట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా" గా చెబుతున్నారు. ఈ ఆదేశం మీద ప్రపంచములోని పెద్ద పెద్ద ఇంటెర్ నెట్ వెబ్ సైట్ ప్రచురణ సంస్తలు తమ చైనా విభాగంలోని సెర్చ్ లిస్టులలో అశ్లీలీల వెబ్ సైట్లు దొరకకుండా ఫిల్టర్లు పెట్టి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయినా కొన్ని దొంగ సర్ వర్ల మూలంగా అశ్లీలీల వెబ్ సైట్లని కొంతమంది చూస్తూ ఉండడంతో అలాంటివారిని చైనా పోలీసులు నిర్భందించేరు.

ప్రపంచ వ్యాప్తంగా ఇంటెర్ నెట్ ఉపయోగించే వారి సంఖ్యలో చైనాదే మొదటి స్తానం......ఫేస్ బుక్ మరియూ ట్విట్టర్ లాంటి సొస్సియల్ నెట్ వర్క్ వెబ్ సైట్లని కూడా చైనా నిషేధించింది. వీటివలన కూడా చాలా ప్రమాదం ఉన్నదని వారు భావిస్తున్నారు.

ఈ వార్తని పత్రికలలో చదివిన నేను, మన దేశంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్న సమయములో మరుసటి రోజు పత్రికలలో వచ్హిన వార్త నాకు ఊరట కలిగించింది.

మన దేశం కూడా 2000 సంవత్షరములో అశ్లీలీల వెబ్ సైట్లను నిషేదిస్తూ ఒక బిల్లు ప్రవేస పెట్టిందని, దీనికి అనుగుణంగా పెద్ద, పెద్ద ఇంటెర్ నెట్ ప్రచురిత సంస్థలు భారత దేశంలో కూడా తమ సెర్చ్ లిస్టులలో ఫిల్టర్లు పెట్టేయని గార్డియన్ పత్రిక ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా పోయిన డిసెంబర్ నెల నుండి యాహూ సెర్చ్ లోనూ, ఫ్లికర్ వెబ్ సైట్లోను ఈ మేరకు మార్పులు తెచ్హినట్లు, మైక్రో సాఫ్ట్ వారు తమ బింగ్ సెర్చ్ లిస్టులోను ఫిల్టర్లు పెట్టినట్లు గార్డియన్ పత్రిక ప్రకటించింది.

ఇక పోతే నేరుగా అశ్లీలీల వెబ్ సైట్లను వెలువడించే భారతీయులను చెరపట్టటానికి, అశ్లీలీల వెబ్ సైట్లు చూడటానికి సహాయపడే ఇంటెర్ నెట్ కేఫ్ లను సోధించి, అక్కడ అశ్లీలీల వెబ్ లు చూసేవారిని, ఆ ఇంటెర్ నెట్ కఫె నడిపే వారిని పట్టుకుని సిక్చించటానికి సన్నాహాలు మొదలుపెట్టేరని తెలుస్తోంది.

ఇంకొంచం గట్టి చర్యలు తీసుకుంటే, అది మన దేశానికి, దేశ ప్రజలకు ముఖ్యముగా యువతకు మేలు చేసినట్లు అవుతుంది.....ఏమంటారు?

Tuesday, January 5, 2010

సినిమాలు మనుష్యులని ప్రేరేపిస్తాయ్ అనడానికి 3 ఇడియట్స్ మరో ఉదాహరణ.......అవునా? కాదా?

సినిమాలు మనుష్యులని ప్రేరేపిస్తాయ్ అనడానికి 3 ఇడియట్స్ మరో ఉదాహరణ.......అవునా? కాదా?

3 ఇడియట్స్ సినిమా చూసి ఏడవ తరగతి చదువుతున్న ఒక విధ్యార్ధి తాను చదువులో రానించడంలేదని (4 సబ్జెక్టులలో తప్పినందువలన) స్కూల్ బాత్ రూములోఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడట. 3 ఇడియట్స్ సినిమాలో ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విధ్యార్ధి చదువులో రానించనందువలన ఆత్మహత్య చేసుకునే సన్నివేసం ఉందట. ఈ సినిమాని రెండవసారి చూసి అధే విధంగా ఈ ఏడో తరగతి విధ్యార్ధి కూడా అలాగే ఆత్మహత్య చేసుకున్నాడని, 3 ఇడియట్స్ సినిమాలోని ఆ సన్నివేసం ఈ విధ్యార్ధిని ఆత్మహత్యకు ప్రేరేపించిందని, పోలీసులు మరియూ ఆ విధ్యార్ధి తల్లితండ్రులు చెబుతున్నారు.

ఇంకోక సంఘటనలో మహారాష్ట్రాలోని ఒక మెడికల్ కాలేజీలో కోంతమంది విధ్యార్ధులు రాగ్గింగు చేసి పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సంఘటనకుకూడా 3 ఇడియట్స్ సినిమాలో రాగ్గింగు చేయడాన్ని ఒక ఘనకార్యముగా చూపించినందువలనే జరిగిందని పోలీసుల విచారణలో తెలియవచ్హిందిట. సినిమా చూసి రాగింగులో పట్టుబడ్డ విద్యార్ధులని వారి చదువు పాడవకుండా సిక్చిస్తామని మహారాష్త్ర మెడికల్ బోర్డ్ తెలియపరచింది.

అందరూ చూడదగిన సినిమాగా సర్టిఫై చెయబడ్డ ఈ 3 ఇడియట్స్ సినిమాని తిరిగి సెన్సార్ బోర్డ్ వారు రీ సర్టిఫై చేయాలని చాలామంది భావిస్తున్నారట.

సినిమాలు మనుష్యులను ప్రేరేపింప జేస్తాయనే విషయం అందరికీ తేలుసు. ఇది సినిమాలు తేసేవారికి కూడా తేలుసు. సినిమాలని సర్టిఫై చేసే సెన్సార్ బోర్డ్ కి కూడా తేలుసు. మనకు తెలిసిన కొన్ని సంఘటనలు సినిమాలు ప్రేరేపించినవేనని మన అందరికీ తేలుసు. సినిమాలలో చూపించిన కొన్ని సన్నివేశాలని చూసి, నిజ జీవితంలో కూడా అలాగే చేసినివారు చాలమంది ఉన్నారు.

"మన పిల్లలని మనమే ఒత్తిడికి గురి చేయకూడదు" అనే సందేశాన్న్ని ఎత్తి చూపడానికే ఈ సినిమా చిత్రీకరించబడింది అని అమీర్ ఖాన్ ఒక ప్రకటనలో చేప్పెరు.

సినిమాల ప్రభావం మనుష్యులని ప్రేరేపిస్తాయని ఖచ్హితంగా చెప్పవచు. ఇది అందరికీ తెలిసిందే. సినిమాలు చూసి పిల్లలు చెడిపోతున్నారు అని చెప్పే వారు కో కొల్లల మంది ఉన్నరు.

ఇవన్నీ తేలిసి కూడా, ఏదో సినిమా తీసేము, అది విజయవంతము అయ్యింది, మా సినిమాలోని సన్నివేశాలు ప్రజల మనసులని కదిలించేయి, అంతబాగా ఆ సన్నివేశం చిత్రీకరించేము అని గర్వంగా చెప్పుకోవడం కన్నా ఎటువంటి సన్నివేశాలు చిత్రములో పెట్టాలో సినిమాలు తీసేవారు కొంచం ఆలోచిస్తే ఇలాంటి దుర్ఘటనలు కొంతవరకైనా తగ్గుతాయి. అంతేకాని సినిమాలవల్ల దుర్ఘటనలు, చెడిపోవటాలు జరగవు అని చెప్పడం సబబు కాదు. అలాగే సినిమాలని సర్టిఫై చేస్తున్న సెన్సార్ బోర్డ్, ఒక సినిమాని సర్టిఫై చేసే ముందు ఇంకొంచం జాగర్త చూపించడం ఎంతైనా అవసరం.

సినిమా ప్రకటనలలో ఆ సినిమాకు తగినట్లు హేచ్హరింపులు చేయడం కూడా అంతే అవసరం.

రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకోల్పేందుకు రాజకీయపార్టీలన్నీ సంయుక్త ఒప్పందం

రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకోల్పేందుకు రాజకీయపార్టీలన్నీ సంయుక్త ఒప్పందం

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు గురుంచి చర్చలకు డిల్లికి వెళ్ళిన అఖిల పక్ష నేతలు, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో తమ తమ భావాలను వెల్లడి చేసేరు.

అనుకున్న విధంగానే ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు ఏకీభావం దొరకనందున....చర్చలలో అఖిల పక్ష నేతలు చెప్పిన విషయాలని విన్న హోం మంత్రి, తెలంగాణా ఏర్పాటు గురించి కేంద్రం ఏమి చేయబోతోందో సమవేసంలో అఖిల పక్ష నేతలు చెప్పిన విషయాలని ప్రధాన మంత్రికి తెలిపి, ఆయనతో మాట్లాడిన తరువాతే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చెబుతామని చెప్పేరు.

టి.ఆర్.ఎస్. అధినేత కె.సి.ఆర్. గారు డిల్లీలో ఉండి, హోం మంత్రిని విడిగా కలిసి ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం చేసే ప్రకటన వెలువడిన తరువతే తాను స్పంధిస్తానని చెప్పేరు.

సమావేశంలో అఖిలపక్ష నేతల అభిప్రాయాలు మాత్రమే సేకరించినట్లు తెలిసింది.

అయితే ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలు ఆంద్ర రాష్ట్రములో శాంతి భద్రతలు నెలకోల్పుతామని సంయుక్త ఒప్పందం చేసేరట......ఈ ఒప్పందం రాష్ట్రములో జరుగుతున్న పోరాటములను ఒక ముగింపుకు తీసుకువస్తుందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు.

డిల్లీలో ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు గురించిన చర్చలలో ఏకీభవత్వం దోరకకపోవచ్హు

డిల్లీలో ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు గురించిన చర్చలలో ఏకీభవత్వం దోరకకపోవచ్హు

ఒక ప్రక్క ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు తమ ఆంగీకారం తెలుపుతూ....మరో ప్రక్క "తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు, చాలా శాంతియుతంగా మరియూ ఆంద్ర రాష్త్రంలోని ప్రతి ఒక్కరిని సంత్రుప్తి పరిచేవిదంగా ఉండాలి" అని రాష్త్ర బి.జె.పి అంటోంది.

తెలంగాణా రాష్ట్ర సమితి మరియూ ప్రత్యేక తెలంగాణా కోరుతున్నవారు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆలేశ్యం చేయకుండా తెలంగాణా ని భారత దేశపు 29 వ రాష్ట్రంగా ఏర్పరచాలని పట్టుబడుతోంది.

భారత దేశ భద్రత చూసుకుంట్టున్న కమిటీ "ఇంతవరకు ఏర్పాటు చేసిన చిన్న రాష్ట్రాలు మావోయిస్టులకు, నక్సలైట్లకు మాత్రమే ఎక్కువగా ఉపయోగ పడింది, కాబట్టి ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేసే చర్చలలో ఈ అంశం గురించి గట్టిగా ఆలోచించాలి" అని కేంద్ర ప్రభుత్వానికి తెలియపరిచింది. గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయం గురుంచే భద్రతా అధికారులతో చర్చలు చేసేరుట.

చట్టిస్ గర్, జార్కండులలో మావోయిస్టులు రాష్ట్ర అధికార విభాగంలో ఆధిఖ్యత పొందగలిగేరని, ఆదేలాగా తెలంగాణాలోనూ జరగవచ్హునని, ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే ఒరిస్సా, చట్టిస్ ఘర్, జార్కండ్, మహారాస్ట్రాలోని గడ్ చిరోలి లోని మావోయిస్టులకు తెలంగాణా కేంద్రంగా మారవచ్హునని సలహా ఇచ్హినట్లు తెలుస్తోంది.

దీనికి అనుగునంగా "ప్రత్యేక తెలెంగాణా" ఏర్పాటుకు అందరికంటే ఎక్కువగా పిలుపునిచ్హింది, ప్రత్యేక తెలంగాణా కావాలని ఎక్కువగా కోరుకునేది మేమే నని మావోయిస్టు లీడర్ మల్లొజల కోటేస్వర రావు మీడియాలలో ఇచ్హిని ఇంటర్ వ్యూలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా ఆలోచింప జేస్తున్నట్లు కనబడుతోంది.

కొత్త గవర్నరుగా ఈ.ఎస్.ఎల్ నరసిం హం గారిని నియమించడం కూడా ఈ విషయం గురుంచేనని చెబుతున్నారు.

ప్రజారాజ్యం మరియూ సి.పి.ఎం పార్టీలు నేరుగానే ప్రత్యేక తెలంగాణా కి తమ వ్యతిరేకం తెలియచెప్పెరు. కాంగ్రెస్స్ మరియూ తెలుగు దేసం పార్టీలలొ చాల మంది వ్యతిరేకం వ్యక్త పరిచేరు.


కాబట్టి కేంద్ర ప్రభుత్వం పై వివరాలని చర్చలకు తీసుకుంటూ మరొక మీటింగు ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నారు.

Sunday, January 3, 2010

“మనలో మనమే చర్చించుకుందాం.....విజయాన్ని సాధించుకుందాం”.....అనే నినాదానికి పిలుపునివ్వండి

“మనలో మనమే చర్చించుకుందాం.....విజయాన్ని సాధించుకుందాం”.....అనే నినాదానికి పిలుపునివ్వండి

తెలంగాణా విషయంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తప్పుటడుగు వేసింది!! ఈ నేల 5 వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర రాజకీయనాయకులని చర్చలకు డిల్లి రమ్మని పిలిచి కేంద్ర ప్రభుత్వం రెండో సారి తెలంగాణా విషయంలో తప్పుటడుగు వేసింది.

ఈ పిలుపు విన్న, సమైఖ్య ఆంద్రా కోరుతున్న, రాజకీయ నాయకులు వెంటనే తమ జాయింట్ ఆక్షన్ కమిటీని పిలిచి, చర్చించి రేపు (04/01/10) రాయలశీమ మరియూ కోస్తా ఆంధ్రా బంద్ కి పిలుపుని ఇస్తూ, 05/01/10 న రైల్ రోకో చేస్తామని చెప్పడం ప్రత్యేఖ తెలంగాణా కు తమ మద్దత్తు లేదని చర్చలకు వెళ్ళ కుండానే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం కేంద్ర ప్రబుత్వం మరోసారి తప్పుచేసిందని స్పష్టం చేసింది.

తెలంగాణా విషయంలో కేంద్ర ప్రభుత్వం నిస్సహయస్తితిలో ఉన్నదని మరోసారి నిరూపన అయ్యింది.....ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరో పక్క దోవ పట్టిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు తెలియటం లేదో అర్ధం కావడం లేదు.

ఆంధ్ర రాష్త్రంలోనే, ఒక విభాగం ప్రత్యేక రాష్ట్ట్రం కోరడమనేది, ఆంద్ర రాష్ట్ర ప్రజలే వివాదించి తీర్చుకోవలసిన మఖ్యమైన మరియూ కీలకమైన విషయం కాబట్టి ఇందులో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రజలు, వారి ప్రతినిధులైన రాజకీయ నాయకులే చర్చలు జరుపుకోని తీర్చుకోవాలి గాని ఇందులో మరోకరి మధ్యత్వం గాని జోక్యం గాని పనికిరాదు. అది కేంద్ర ప్రభుత్వమైనా సరే.

సమైఖ్య ఆంద్రా కోరుతున్న జాయంట్ ఆక్షన్ కమిట్టీ మరియూ తెలంగాణా కోరుతున్న జాయంట్ ఆక్షన్ కమిట్టీ లు కలుసుకుని, చర్చలు జరుపుకుని, తీర్మానాలు వేసుకుంటేనే ఈ సమస్యకు ఒక ముగింపు వస్తుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వము వీరి తీర్మానములని గౌరవిస్తుంది. అప్పుడే అటు కేంద్రానికి ఇటు మనకి ప్రజలలో మంచి పేరు లభిస్తుంది.


ఇలా జరిగితేనే అది ఆంధ్ర రాష్ట్ర రాజకీయనాయకులకు, ప్రజలకు మంచిది. అలా కాకుండా విడి, విడి పోరాటాలతో, కేంద్రప్రభుత్వ హామీలతో ఆంద్ర రాష్ట్రంలోనే కాదు ఎ ఇతర రాష్ట్రంలో కూడా ఎవరికీ, ఎప్పటికీ విజయం చేకూరదు.


ఇప్పడికే పోరాటాలు, బంద్ లు, విధ్వంసాలు, ప్రాణ నష్టాలతో మన ప్రజలు విసుగెత్తిపోయున్నారు.. ...మరికొన్ని రోజులు ఇవి కోనసాగితే ప్రజలు వారి నాయకుల మీద పెట్టుకున్న నమ్మకం పోతుంది.

మొట్టమోదటి మెట్టుగా రెండు జాయంట్ ఆక్షన్ కమిట్టీలు పోరాటాలు ఆపి, శాంతియుత వాతావర్ణాన్ని రాష్ట్రంలో నెలకోల్పి, వారి రెండు కమిట్టీల చర్చలకు ఒక తారీఖుని నిర్ణయించుకుని, దాన్ని వేలువడించి ప్రజలలో నమ్మకాన్ని తేప్పించాలి. ఒకటి, రెండు చర్చలతో తేలే విషయం కాదు కనుక రాజకీయనాయకులందరూ సహనం, ఓర్పు వహించి చర్చలు జరుపుకుంటూ వెల్లాలి. దీనికి చాలా టైము పట్ట వచ్హు. కానీ ముగింపు ఖచ్హితంగా దోరుకుతుంది. అంతేగాని కేంద్రప్రభుత్వంతో పెట్టుకుంటే,అసలు ముగింపు కాదు కదా చర్చలే ఒక కొలిక్కి రావు.

మనం కష్టపడి సంపాదించుకున్న రాష్ట్ర మంత్రివర్గాన్ని వదులుకుని, రాష్ట్ర పరిపాలనను కేంద్రానికి వదిలేసి రాష్ట్రపతి పాలనకు దారి ఇవ్వకండి. అలా గనుక జరిగితే ప్రజలు మళ్ళి మిమ్మల్నే నాయకులుగా నమ్మి ఎన్నుకుంటారన్న నమ్మకం లేదు.

కాబట్టి "మనలో మనమే చర్చలు చేసుకుందాము...విజయం సాధించుకుందాము" అనే నినాదానికి పిలుపునివ్వండి, పాటుపడండి, విజయం సాధించండి.

Saturday, January 2, 2010

ఇది కూడా ఒక రకమైన నిరాహార దీక్షే కదా.......మరి దీనిని ఎవరూ పట్టించుకోరేం?

ఇది కూడా ఒక రకమైన నిరాహార దీక్షే కదా.......మరి దీనిని ఎవరూ పట్టించుకోరేం?

ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్ని అంటుకుంటూ, సామణ్య మరియు మధ్యతరగతి కి చెందిన వారి జేబులను కాల్చి వేస్తున్నాయి. అలా కాలిపొతున్న జేబులను ఆర్పడానికి కడుపు నిండా తినలేక సగం కడుపు నింపుకుని జీవించడం ఒక విధమైన నిరాహార దీక్షే కదా?........కాదని అనగలమా?

అయితే ఇది ప్రభుత్వమే ప్రజల మీద రుద్దుతున్న నిరాహార దీక్ష కాబట్టి దీనిని ఎవరూ పట్టించుకోవటం లేదు, దీనికోసం ఎవరూ పోరాటం చేయడం లేదు.

మండిపోతున్న ఆహార పదార్ధాల ధరలు 2009 నుండి 2010 కి ఘన స్వాగతం చెబుతూ మన ప్రజలని భయకంపితులని చేస్తున్నాయి. దీనిని త్వరగా అరికట్టే మార్గం తమ చేతులని దాటి పోయిందని కేంద్ర ప్రభుత్వం చెప్పకుండా చెబుతోంది.

దీని గురించి కేంద్ర ఫైయి నాన్స్ మంత్రి ప్రనాబ్ ముఖర్జీ గారి దగ్గర అడిగితే...."ఇన్ స్టంట్ కాఫీ లాగ, ధరలని అరికట్టే ఇన్ స్టంట్ మార్గములు లేవు" అని చెప్పి చేతులు దులుపుకున్నారు.

గురువారం నాడు ప్రభుత్వం ప్రకటించిన ఒక ప్రకటనలో డిసెంబర్ నెలాఖరులో ఆహార పధార్ధాల ధరలు అంతకు ముందున్న రోజులకంటే 20 శాతం పెరిగిందని, వీటిలో పప్పు పధార్ధాల ధరలు 41 శాతం, ఉల్లిపాయల ధర 40 శాతం పేరిగిందని తెలిపింది. ఇక పోతే కూరగాయల ధర 47 శాతం పెరిగిందని కూడా పేర్కొన్నది.

ఆహార పధార్ధాల ధర పెరుగుదలవలన ఇంటి అద్దెలు కూడా పెరిగి పోయాయి.....నెలకి 22 వేల రూపాయలు జీతం తెచ్హుకునే ఒక అతను, ఇప్పుడున్న ఈ పరిస్తితులకు తన జీతం సరిపోవడం లేదని చెబుతున్నాడు. "మైన్ స్ట్రీట్ అక్రాస్ ది వరల్డ్ 2009 (Main Street Across The World 2009)" అనే ఒక సర్వే రిపోర్టు లో 20 ఏళ్ళలో మొదటిసారిగా ప్రపంచం అన్ని చోట్ల ఇంటి అద్దెలు తగ్గినట్లు పేర్కున్నది. కాని మన దేశం మాత్రం ఈ రిపోర్టుకి వ్యతిరేకంగా ఉన్నది.

ఇక చదువుల జోలికి వస్తే స్కూల్ ఫీజులు---ఐ.ఐ.టీ. ఫీజులకంటే ఎక్కువగా ఉన్నాయని ఇంకొక సర్వే తెలిపింది.

ఒకటేమిటి, పప్పులు, నూనెలూ, కూరగాయలు, పాలు, అద్దెలూ, బియ్యం ధరలు ఒక దానికి ఒకటి పోటీ పడుతూ సాదారణ మరియూ మధ్య తరగతి ప్రజల కడుపులు కొడుతూంటే.....మరి ఇది కూడా ఒక రకమైన నిరాహార దీక్ష కాదా?........ఇష్టమైన పధార్ధాలని కోలతలు వేసుకుని (కోన్నింటిని తినడం మానివేస్తూ) తినడాన్ని ఏమంటారు?

సాదారణ ప్రజల జేబులని కాల్చుకుతినే ధరలను అరికట్టే పధకాల కంటే ప్రభుత్వ ఖజానాలను ఎలా నింపుకోవటం, విదేశీయాల పెట్టుబడులను ఎలా తెచ్హుకోవడం, స్టాక్ మార్కెట్ పోకడల గురుంచే ఎక్కువ ఆలోచనలు చేస్తున్న ఈ ప్రభుత్వం, ఆహార పదార్ధాల ధరలను అరికట్టేందుకు ఎటువంటి ఆలోచన చేయక పోవడం, పధకాలని వేయకపోవడం ఆశ్చర్యముగా ఉన్నది.

ఎంతసేపూ పంటలు సరిగ్గా పండలేదు, ప్రజలకు సరిపోయేంత పంట పండలేదు......మార్చ్ నేల వరకు ఆగండి అని చెబుతున్నారే గాని, ధరలను అరికట్టక పోతే అది మన ఎకానమీనే దెబ్బతీస్తుందని ఎందుకు అనుకోవటం లేదో అర్ధం కావటం లేదు.