Saturday, December 26, 2009

రాష్ట్ర విభజన మంచిదికాదు

రాష్ట్ర విభజన మంచిదికాదు

పెద్ద ఆశయాలు, లక్ష్యం, వనరులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికార రంగంలో భాగంగా ఉంటేనే అది తెలంగాణాకు, తెలంగాణా ప్రజలకు లాభకరంగా ఉంటుంది. అలా ఉన్న రాష్ట్రంలో భాగంగా ఉంటే పైకి ఎదగవచ్హు, అన్నీ సమకూర్చుకొవచ్హు....అదే చిన్న రాష్ట్రంగా (అంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంగా) ఉంటే వనరులు తక్కువగా ఉండటం వలన అభివ్రుద్దిలో పైకి ఎదగడం కష్టమవుతుంది. మనదేశంలోనే ఉన్న కొన్ని చిన్న రాష్ట్రాలు అభివ్రుద్దిలో వెనుకబడి ఉన్నాయి అనేది అందరూ గ్రహించాలి. కాబట్టి ప్రత్యేక తెలంగాణా కంటే ఇప్పుడు ఉన్నవిధంగా ఆంధ్ర రాష్తంలో భాగంగా తెలంగాణా ఉంటేనే తెలంగాణా ప్రజలకు మంచిది.

"ప్రత్యేక" అన్న ధుష్ట ఆశయంతో రాష్ట్రాన్ని విభజించే తీరాలి అన్న అభిప్రాయాన్ని పట్టుకుంటే, అది కొంత కాలానికి తెలంగాణానే రెండుగా విభజించమనే మరో ఉధ్యమానికి పునాదిగా నిలబడవచ్హు. ఈ విభజనా అభిప్రాయం మెల్ల మెల్లగా భారతదేశంలోని మరి కొన్ని రాష్ట్రాలకు పాకి చివరికి అది మన దేశాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి మనల్ని (భారతదేశస్తులని) బలహీనులుగా చేస్తుంది.

"కలసి వుంటేనే కలదు శుఖం"...దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది అందరికీ తెలిసిందే.

ఇప్పుడు తెలంగాణాలో జరుగుతున్న అల్లర్లు, ఆందోళనలు, విధ్వంశాలు, భారీ నష్టాలు ఎవరిని ఉద్దేసించి జరుగుతున్నయో తెలియడంలేదు కానీ వీటి వలన నష్ట పడేది తెలంగాణా ప్రజలేనని మాత్రం తెలుసు. ఆ ప్రాంతంలోని వారే అధిక నష్టానికి గురి అవుతున్నారు, ఆ ప్రాంతంలోని విధ్యార్ధులే వెనుకబడి పొతారు, పోరాటాలలో ఆ ప్రాంతం వారే ఎక్కువ మంది బలి అవుతారు.

వీటిని ఆపాలి.


ఇటువంటి తరుణంలొ కేంద్ర ప్రభుత్వం రాష్త్ర ప్రభుత్వానికి పూర్తి మద్దత్తు ఇవ్వాలి. రాష్ట్రంలో శాంతియుత వాతావర్ణం ఏర్పడటానికి అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. రాష్ట్ర విభజన మంచిది కాదని తెలంగాణా ప్రజలకు, రాజకీయ నాయకులకు తెలియపరిచేవిదంగా సమాచారం అందజేయలి. ఆంధ్ర రాష్త్రం సమైఖ్యంగా ఉండటానికి తెలంగాణాలో ఖచ్హితమైన నిర్ణయాలని ప్రకటించి, అవి అమలు చేసే విధానాలు, సమయము మీడియా మూలముగా ఖచ్హితంగా చేస్తామని తెలంగాణా ప్రజలకు వాగ్ధానము చేయాలి.

ఈ మార్గము చేదుగా ఉన్నా తెలంగాణా ప్రజలకు ఉపయొగకరంగా ఉంటుంది.

2 comments:

  1. vachaadayya monagadu.. innaallu enta mandi mottukoledu ilaa... nuvvemaina kotha vishyam cheptunnavaa... useless post..

    ReplyDelete
  2. ఆరు సూత్రాల ప్రకారం రాష్ట్రంలో ఆరుజోనులు ఏర్పడ్డాయి.కానీ రెవిన్యూ డిపార్ట్ మెంట్ లాంటి కీలక శాఖలకు పోలీసు శాఖలోలాగా జోనల్ ఆఫీసులు ఏర్పడనందున ప్రతి చిన్నపనికీ హైదరాబాదు వెళ్ళాల్సి వస్తోంది.వాస్తవానికి కోస్తా రాయలసీమలవారే దూరాభారాలతో ప్రయాణ ఖర్చు(అనుత్పాదక ఖర్చు) ఎక్కువగా మోస్తున్నారు.హైకోర్టు గుంటూరునుండి తరలిపోయింది .కనీసం యాభై ఏళ్ళకాలంలో బెంచి కూడా ఏర్పాటు చేయలేదు.విజయవాడ,రాజమండ్రి,,తిరుపతి,నంద్యాల,మంచిర్యాల,భద్రాచలం లాంటి కొత్తజిల్లాలు కూడా ఏర్పడలేదు.రాజధాని నగరానికి తరలించి ఒకేచోట పోగుపెట్టిన అభివృద్ధి కేంద్రాలను ఇప్పటికైనా రాష్ట్రంలోని ఆరు జోన్లకూ తరలించాలి.

    ReplyDelete