Thursday, December 31, 2009

ఈ నూతన సంవత్షరములో ఆంధ్ర రాష్ట్ట్రంలో ఎదురుచూడవలసినవి.......మీరు చేయవలసినవి

అందరికీ 2010...నూతన సంవత్స్ ర శుభాకాంక్షలు

ఈ నూతన సంవత్షరములో ఆంధ్ర రాష్ట్ట్రంలో ఎదురుచూడవలసినవి.......మీరు చేయవలసినవి

ఎదురుచూడవలసినవి.

మీ మొబైల్ నెంబరు మార్చుకోకుండా మీ నెట్ వర్క్ మార్చుకునే అవకాశం మార్చ్ నెలలోపు ప్రారంభించాల్సి ఉంది.
3జీ సర్వీసస్ ని బి.ఎస్.ఎన్.ఎల్. ఈ సంవత్షరములో మోదలుపెడతారు.


ప్రపంచ ప్రఖ్యాత సర్వకళా విశ్వ విద్ధ్యాలయాన్ని విశాఖపట్టణంలో ప్రారంభించి ఆ విశ్వ విధ్యాలయాన్ని "క్రోత్త కల్పనలు తెప్పించు విశ్వ విధ్యాలయం" గా అందరికీ తెలుపబడుతుంది.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జార్జియా ఇన్సిట్యుట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నొలొజీ వారు హైదరాబాద్ లో వారి బ్రాంచ్ ని తెరవబోతున్నరు.

తిరుపతి లో ప్రపంచ ప్రఖ్యాతి తెచ్హుకున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తమ మరో బ్రాంచ్ ని తెరవాలనుకోవడం.

విజయవాడ లో అతి వేగముగా వెళ్ళే బస్ సిస్ స్టం అమలు చేయాలనుకోవడం.

విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహ దారిని 4 లైన్ల హైవే గా చేయాలనుకోవడం.

హూండాయ్ కంపేనీ తమ కార్లను మన రాష్ట్రం లోనే తయ్యారు చేయాలనుకోవడం.

టేస్టు క్రికెట్ మాచ్ లని 20 ఏళ్ళ తరువాత హైదరాబాద్ లో మోదలుపెట్టాలనుకోవటం.

మీరు చేయవసినది.

వాతావర్ణ కాలుష్యం టెర్రరిజం కంటే అతి ప్రమాదకరమైనది కాబట్టి, వాతావర్ణ కాలుష్యం ని తగ్గించటానికి మనం చేయవలసిన కొన్ని ముఖ్య మైన పనులు.

నీటిని వ్రుదా చేయకూడదు.........అంటే ఒక నీటి చుక్క కూడా వ్రుదా కాకూడదు.

చేట్లని పెంచడం.

ఫ్లోరోసెంట్ బల్బులనే వాడడం.

ప్లాస్టిక్ బాగ్ లను వాడకుండా ఉండడం.

ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం చేయడం, కార్లలో కూడ నలుగురూ కలసి వెళ్ళడం.

ఇళ్ళలో కరెంటుతో ఉపయోగించే వస్తువులని, వాటి ఉపయోగం అయిన వెంటనే కరెంటు ఆపడం.


రీ సైకెల్డ్ పేపర్‌నే ఉపయోగించడం.

మీ వాహనాల ఇంజెన్లని సిగ్నల్స్ దగ్గర ఆపివేయడం.

Wednesday, December 30, 2009

3 హేచ్-1బి (H-1B) వెబ్ సైట్లని మూసివేయవలసిందిగా అమేరికన్ కోర్టు ఉత్తరవు

3 హేచ్-1బి (H-1B) వెబ్ సైట్లని మూసివేయవలసిందిగా అమేరికన్ కోర్టు ఉత్తరవు

ఐటీగ్రంట్.కాం (ITgrunt.com) , ఎంద్1బి.కాం (Endh1b.com) మరియూ గెస్ట్ వర్కర్ ఫ్రాడ్.కాం (Guestworkerfraud.com ) అనే ఈ మూడు వెబ్ సైట్లని మూసివేయవలసిందిగా నూయ్ జెర్సీ (New Jersey) లోని ఒక కోర్ట్ ఉత్తరవు జారి చేసింది.

కంప్యూటర్ వరల్డ్ పుస్తకంలో ప్రచురించ బడ్డ ఒక వార్తా ప్రకటనలో ఆ కోర్ట్ పై చెప్పబడ్డ 3 వెబ్ సైట్లని నడుపుతున్న గుర్తు తెలియని వ్యక్తుల గురించి కూడా ఎంక్వుయరీ చేసి, వారెవరో తెలుసుకోమని కూడా ఆర్డర్ వేసిందట.

అదే కోర్ట్ వెబ్ సైట్ల పేర్లు నమోదు చేసి, వెబ్ సైట్లని ప్రచురించే గో డాడీ ఇన్ కార్పోరేషన్ (GoDaddy Inc), నేట్ వర్క్ సల్యూషన్స్ (Network Solutions), కాం కాస్ట్ కేబుల్ కం న్య్ నికేషన్స్ (Comcast Cable Communications) మరియు డిస్ కవుంట్ ఎ ఎస్ పి.నెట్ (DiscountASP.Net) కంపేనీలకు పై చేప్పబడిన 3 వెబ్ సైట్లని తమ నెట్ వర్క్ ల నుండి తీసివేయమని కూడా ఆర్డర్ వేసిందట.

ఫేస్ బుక్ (Facebook) ని కూడా వాళ్ళ పేజీలలో నుండి ఐటీగ్రంట్ (ITgrunt.com) పేజీని తీసివేయమందిట.

నూయ్ జెర్సీ లోని అపెక్స్ టెక్నాలజీ గ్రూప్ (Apex Technology Group) పెట్టిన ఒక కోర్ట్ కేసులో , పై చెప్పబడిన 3 వెబ్ సైట్లు హేచ్-1బి (H-1B) వీసా (visa) ప్రొగ్రాం ని వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేయడంతో కోర్టు ఈ ఉత్తర్వులు జారి చేసిందట.

అపెక్స్ టెక్నాలజీస్ (Apex Technology Group) తో అగ్రీమెంట్ వేసుకుంటే, వేసుకున్నవాళ్ళు చాలా కష్టపడ వలసి వస్తుందని, ఆ కంపేనీకి చెందిన పాత (తీసివేయబడ్డ) అగ్రీమెంట్ ఫారాలని పై చేప్పబడ్డ 3 వెబ్ సైట్లలో చూపుతున్నారని, ఇది చట్ట విరుద్దమని, అలా చూపించే ఆ గుర్తు తెలియని వ్యక్తులని కనుగోన వలసిందిగా అడిగినందువలన , కోర్టు ఆ పాత ఫారాలని చూపిస్తున్న 3 వెబ్ సైట్లని మూసివేస్తు, ఆ గుర్తు తెలియని వ్యక్తులని కనుక్కో వలసిందిగా ఉత్తర్వు జారీచేసినట్లు కంప్యూటర్ వరల్డ్ లో తెలియచేయబడి ఉన్నది.

3 ఇడియట్స్ అఫీసియల్ ట్రైలర్‌ని మరియు ఒక పాట ట్రైలర్‌ని ఇక్కడ చూడండి

3 ఇడియట్స్ అఫీసియల్ ట్రైలర్‌ని మరియు ఒక పాట ట్రైలర్‌ని ఇక్కడ చూడండి

3 ఇడియట్స్ హిందీ సినిమా కలెక్షన్లు రికార్డులని బద్దల కోడుతోందని చెబుతున్నరు. నేను ఇంకా సినిమా చూడ లేదు. ట్రైలర్లు చూస్తుంటే వెంటనే సినిమా చూడాలని అనిపిస్తోంది. చూసిని వాళ్ళు ఆందరూ సినిమా చాలా బాగుందని చెబుతున్నరు. త్వరలోనే చూస్తాను.


ఇది ఈ సినిమా అఫీసియల్ ట్రైలర్లు.Monday, December 28, 2009

"పేరానార్మల్ ఆక్టివిటీ" సినిమా.......చూసిన వాళ్ళను వెంబడిస్తోందట

"పేరానార్మల్ ఆక్టివిటీ" (PARANORMAL ACTIVITY) సినిమా.......చూసిన వాళ్ళను వెంబడిస్తోందట

"పేరానార్మల్ ఆక్టివిటీ" సినిమా చూస్తే ప్రతి ఒక్కరూ భయముతో గడ గడ వణికి పోతారట.....అథి భయం పుట్టించే ఈ సినిమా తీయటానికి కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అయిందట. మొదట ఈ సినిమాని ఆమేరికాలొని చిన్న చిన్న గ్రామాలలోని చిన్న సినిమా హాల్స్ లొ మాత్రమే రిలీజు చేసేరుట. అయితే అక్కడ ఆ సినిమాకు లభించిన విజయం చూసి, ఆ సినిమాని పెద్ధ నగరాలలో సినిమాహాలు ఒక్కటికి 23 లక్ష్ల 50 వేలకి అమ్మేరుట. అక్కడకూడా ఆ సినిమాకి దొరికిన విజయం, ఆ సినిమా ఒక వారంలో కోట్లాది రూపాయలు డబ్బు తెచిపెట్టటం చూసి, 'పేరామౌంట్' సినిమా కంపేనీ వాళ్ళు ఈ సినిమాని అమేరికా దేశం అంతటా రిలీజ్ చేసేరు. ఇప్పుదు ఇంగ్లండ్ మరియు ఇతర దేశాలలో కూడా రిలీజ్ చేసేరు.

ఈ సినిమా చూసిన ప్రతివారు భయపడి తీరవలసిందేనట.అంత భయం పుట్టిస్తుందట ఈ సినిమా. చూసిన వారు చేప్పేరు. “సినిమా చూసిన వారం రోజుల వరకూ తమల్ని కూడా ఎప్పుడూ ఎవరో వెంటాడుతున్నట్లు భయపడ్డామని” చాలా మంది చేప్పేరు.

"ఎక్సార్ సిస్ట్" సినిమా తరువాత ఈ సినిమానే అతి భయం పుట్టించిన సినిమాగా చెబుతున్నారు......ఈ సినిమా చూసేటప్పుడు, చూసే ప్రేక్షకుల భయ కంపితాలని వీడియో తీసేరు ....ఈ వీడియో మీరు ఈ పాటికి చూసే ఉంటారు---చూసి ఉండకపోతే ఇక్కడ చూడండి.

www.youtube.com/watch?v=F_UxLEqd074

ఈ సినిమా ఏదో భయంకర జంతువులు, భయానకపు హత్యలు లేకుండా కళ్ళకు కనపడని ఏదో ఒకటి ఆ సినిమాలోని జంటని వెంటాడుతుంది. అదేమిటో, ఎందుకు ఆ జంట భయపడిందో, ఏం చూసి ఆ జంట భయపడిందో, చివరికి ఏం జరిగిందో, ఎలా ముగిసిందో ఆ సినిమా చూస్తేగాని అర్ధం కాదుట.

మరి ఈ సినిమాని మన దేశంలో ఎప్పుడు రిలీజ్ చేస్తారో (చేసెరో) తెలియదు...కాని ఈ వీడియో చూసిన తరువాత సినిమా చూడాలని ఉన్నది.

మీకు ఎలా ఉందో చెప్పండి.

65 ఏళ్ళ ఈ "మేస్టారు" నిజ జీవిత మేగాస్టర్ మేస్టారు........మీరేమంటారు?

65 ఏళ్ళ ఈ "మేస్టారు" నిజ జీవిత మేగాస్టర్ మేస్టారు........మీరేమంటారు?

65 ఏళ్ళున్న ఒక మేస్టారు తన 23 వ డిగ్రీ పొందటానికి కళాశాలలోజేరురు....."చదువుకోనుట, దాని మూలముగా నేర్చుకోనుట నా యూక్క జీవిత ప్రక్రియ.”

"నువ్వు చదువుకోవలసినది---నేర్చుకోవలసినది చాలా ఉన్నది---దానికి ఈ జీవితం సరిపోదు" ఈ మాట నా దగ్గిర చదువుకున్న ప్రతి విధ్యార్ధికి నేను చెప్పేవాడిని. …ఈ సిద్ధాంతం తోనే నేను అన్ని డిగ్రీలు తెచ్హుకొగలిగేను అని రాయ్ అనబడే ఈ మేస్టారు చెప్పేరు .

రాయ్ గారు బీహార్ లోని మగద్ యునివర్సిటి లో ప్రొఫెషర్ గా పని చేసి రిటైర్ అయ్యారు....ఈయన 1967 లో మొదటిసారిగా అలహాబాద్ యునివర్సిటీ నుండి పట్టబద్రులు అయ్యారు.

ఉత్తరప్రదేస్ లోని ఘాసిపూర్ కు చెందిన ఈ రిటైర్డ్ ప్రొఫెషర్ తన జీవిత ప్రక్రియను కొనసాగించటం కోసం ఇప్పుడు తన 23 వ ఎం.ఏ (M.A) డిగ్రీ (జ్యొతిష్క శాస్త్రం…Astrology ) కోసం బులంద్‌సహర్ జిల్లా లోని సంపూర్ణానంద్ సంస్క్రుత విశ్వవిధ్యాలయం లో జేరేరు.

ఈయన ఇంతకు ముందే పురాతన చరిత్ర (Ancient History), ప్రస్తుత చరిత్ర (Modern History) , సోసియాలజీ(Sociology), రాజకీయ శాస్త్రము (Political Science), ఆర్ధీక శాస్త్రము (Economics), ఎడ్యుకేషన్ (Education), హిందీ (Hindi), సంస్క్రుతం (Sanskrit), భూగోళ సాస్త్రం (Geography) మరియు మనస్తత్వ శాస్త్రం (Psychology) లలో ఎం.ఏ. (M.A) డిగ్రీలు పొంది యున్నారు. ఇవి కాక ఎడ్యుకేషన్ (Education), ప్రస్తుత చరిత్ర (Modern History), ఫిలోసఫి (philosophy), హిందీ (Hindi), కామర్ష్ (Commerce) లలో డాక్టరేట్ పొందియున్నారు.

రాయ్ గారు తన అదనపు డిగ్రీలను ప్రైవేటుగా చదివి తెచ్హుకున్నారు.

"ఇవి చదవటానికి నాకు నాతో పనిచేసిన ప్రొఫెషర్స్ సహాయపడ్డారు" అని ఆయన తెలుపుతూ.....వీరే కాకుండా "నా భార్య, కూతురూ, నా చదువు కొనసాగించడంలో చాలా సహాయపడ్డారు. ఎలా అంటే నేనే పనిచేయవలసిన ఇంటి పనులని కూడా వారు చేసి, చదువుకోటానికి నాకు సమయం చేకూర్చి నన్ను ప్రోష్హాహించేవారు. వారికి నేను చాలా ఝుణపడి ఉన్నను." అని చెప్పేరు.

రాయ్ గారిని అందరూ "మాస్టర్ సాబ్" అని పిలుస్తారు.

చదువుకోటానికి వయసుతో పని లేదు అని నిరూపించిన ఈ నిజ జీవిత మేగాస్టార్ "మేస్టార్" కి ఇవే నా వందనములు.

Saturday, December 26, 2009

భారత యువతి యౌక్క లక్ష్య సాధన

భారత యువతి యౌక్క లక్ష్య సాధన

మైనస్ 50 డిగ్రీల సెల్షియుస్ ని, భరించరాని చలి గాల్పులని ఎదుర్కొని పూనా కి చెందిన యువతి మిస్. క్రుష్నా పాటిల్ అంటార్టికాలొని విన్ షన్ మాసిఫ్ అనే అతి పెద్ద పర్వత శిఖరాన్ని మంగళవారం (డిసెంబర్-22) నాడు ఎక్కి తన ఆశయాన్ని నెరవేర్చుకోగలిగింది.

వాతావర్ణ పరిస్తితులు బాగుండక పోవడం వలన ఆమె ఈ పర్వతాన్ని ఎక్కే ముందు పర్వత శిఖరానికి 1000 మీటర్ల క్రింద 4 రోజులు ఒక గుడారములో గడప వలసి వచ్హిందట. ఆ తరువాత ఆమె, ఆమె బ్రుందము (అంటార్టిక్ ఎక్స్‌పిడిషన్స్ అండ్ లాజిస్టిక్స్) డిసెంబర్ 22 న పర్వత శిఖరాన్ని చేరుకోగలిగేరుట.

ప్రపంచము లోని అతి పెద్ద పర్వత శిఖరమైన ఎవరెస్టు శిఖరాన్ని మే నెల 21 న, ఆఫ్రికాలొని కిలిమంజిరో (5,895 మీటర్ల ఎత్తు) పర్వాతాన్ని అక్టోబర్ నెలలోను ఎక్కి మన దేశానికి పేరు తెచిపెట్టేరు.

తన లక్ష్య సాధనలో సౌత్ అమేరికా లోని అతి పెద్ద పర్వతం అకంకాసావా (6,961 మీటర్ల ఎత్తు), యూరొప్ లోని ఇడారుస్ పర్వతం (5,642 మీటర్ల ఎత్తు), ఆస్త్రేలియాలోని అతి పెద్ద పర్వతం (2,228 మీటర్ల ఎత్తు) మరియు అలెస్కాలోని మికెన్లే (6,194 మీటర్ల ఎత్తు) పర్వతాలని ఎక్కాలని ఉన్నదని ఆమె చెప్పింది.
ఈమె పూనా యూనివర్ సిటిలో బి.ఎ చదువుతున్నది.

ప్రపంచంలోనే అతి వేగమైన రైలు

ఇప్పుడు చైనాలో ప్రపంచములోనే అతి వేగంగా....అంటే గంటకి 350 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగే రైలు నిన్న చైనాలో మొదటిసారిగా తన ప్రయాణ్ణాన్ని మొదలుపెట్టింది. గువాన్షుహా మరియు వూహాన్ నగరాలని కలిపే ఈ రైలు 1,061 కిలోమీటర్ల దూరాన్ని మూడు గంటలలో పూర్తిచేస్తుంది.

ఫ్రాన్స్ (277 కిలోమీటర్ల వేగం) మరియు జపాన్ (243 కిలొమీటర్ల వేగం) రైల్ల వేగం కంటే ఈ రైలు అతి వేగమైన రైలుగా పేర్కొనబడింది. సీమెన్స్(Siemens) , బంబార్డియర్ (Bombardier), మరియు ఆల్ స్టాం (Alstom) కంపనీలు అందించిన టెక్నొలజీతో ఈ రైలు తయారుచేయబడింది.

రాష్ట్ర విభజన మంచిదికాదు

రాష్ట్ర విభజన మంచిదికాదు

పెద్ద ఆశయాలు, లక్ష్యం, వనరులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికార రంగంలో భాగంగా ఉంటేనే అది తెలంగాణాకు, తెలంగాణా ప్రజలకు లాభకరంగా ఉంటుంది. అలా ఉన్న రాష్ట్రంలో భాగంగా ఉంటే పైకి ఎదగవచ్హు, అన్నీ సమకూర్చుకొవచ్హు....అదే చిన్న రాష్ట్రంగా (అంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంగా) ఉంటే వనరులు తక్కువగా ఉండటం వలన అభివ్రుద్దిలో పైకి ఎదగడం కష్టమవుతుంది. మనదేశంలోనే ఉన్న కొన్ని చిన్న రాష్ట్రాలు అభివ్రుద్దిలో వెనుకబడి ఉన్నాయి అనేది అందరూ గ్రహించాలి. కాబట్టి ప్రత్యేక తెలంగాణా కంటే ఇప్పుడు ఉన్నవిధంగా ఆంధ్ర రాష్తంలో భాగంగా తెలంగాణా ఉంటేనే తెలంగాణా ప్రజలకు మంచిది.

"ప్రత్యేక" అన్న ధుష్ట ఆశయంతో రాష్ట్రాన్ని విభజించే తీరాలి అన్న అభిప్రాయాన్ని పట్టుకుంటే, అది కొంత కాలానికి తెలంగాణానే రెండుగా విభజించమనే మరో ఉధ్యమానికి పునాదిగా నిలబడవచ్హు. ఈ విభజనా అభిప్రాయం మెల్ల మెల్లగా భారతదేశంలోని మరి కొన్ని రాష్ట్రాలకు పాకి చివరికి అది మన దేశాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి మనల్ని (భారతదేశస్తులని) బలహీనులుగా చేస్తుంది.

"కలసి వుంటేనే కలదు శుఖం"...దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది అందరికీ తెలిసిందే.

ఇప్పుడు తెలంగాణాలో జరుగుతున్న అల్లర్లు, ఆందోళనలు, విధ్వంశాలు, భారీ నష్టాలు ఎవరిని ఉద్దేసించి జరుగుతున్నయో తెలియడంలేదు కానీ వీటి వలన నష్ట పడేది తెలంగాణా ప్రజలేనని మాత్రం తెలుసు. ఆ ప్రాంతంలోని వారే అధిక నష్టానికి గురి అవుతున్నారు, ఆ ప్రాంతంలోని విధ్యార్ధులే వెనుకబడి పొతారు, పోరాటాలలో ఆ ప్రాంతం వారే ఎక్కువ మంది బలి అవుతారు.

వీటిని ఆపాలి.


ఇటువంటి తరుణంలొ కేంద్ర ప్రభుత్వం రాష్త్ర ప్రభుత్వానికి పూర్తి మద్దత్తు ఇవ్వాలి. రాష్ట్రంలో శాంతియుత వాతావర్ణం ఏర్పడటానికి అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. రాష్ట్ర విభజన మంచిది కాదని తెలంగాణా ప్రజలకు, రాజకీయ నాయకులకు తెలియపరిచేవిదంగా సమాచారం అందజేయలి. ఆంధ్ర రాష్త్రం సమైఖ్యంగా ఉండటానికి తెలంగాణాలో ఖచ్హితమైన నిర్ణయాలని ప్రకటించి, అవి అమలు చేసే విధానాలు, సమయము మీడియా మూలముగా ఖచ్హితంగా చేస్తామని తెలంగాణా ప్రజలకు వాగ్ధానము చేయాలి.

ఈ మార్గము చేదుగా ఉన్నా తెలంగాణా ప్రజలకు ఉపయొగకరంగా ఉంటుంది.

Thursday, December 24, 2009

"యువత" లారా....2010 వ సంవత్స్ రం మీదే

బ్లాగు మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

"యువత" లారా....2010 వ సంవత్స్ రం మీదే


ప్రపంచములొ మానవత్వాన్ని ఎదుర్కొంటున్న దుష్ట శక్తుల నుండి ప్రపంచమును కాపాడుటకు శక్తి, సామర్ధ్యం, ఆధునికభావాల తో పాటు ప్రయత్నం కావాలని, ఇవన్నీ "యువత" దగ్గర ఉన్నయని, కనుక ప్రపంచములోని "యువత" ను అన్ని ప్రాంగనాలలోను కలుపుకోవాలనీ, ఈ నాటి "యువతే" రెపటి పాలకులని, ప్రపంచ భవిష్యత్తు వారి చేతులలోనే ఉన్నది కాబట్టి, "యువత" ను ఇప్పటి నుండే ఆ దుష్ట శక్తులను ఎదుర్కొనే విదంగా తయారు చేయాలనే భావంతో....2010 ని ప్రపంచ "యువత" సంవత్స్ రం గా యునైటెడ్ నేషన్స్( U.N) వెలువడించింది.

ఈ సంవత్స్ రం లో "యువత" ను సమాజంలో జరిగే ప్రతి ప్రక్రియలోను కలుసుకునేటట్లు చేయాలని యునైటెడ్ నేషన్స్ అధికారి తెలిపేరు.

అన్ని దేశాల ప్రభుత్వాలు, సంఘాలు, సామాజిక సంస్తలు "యువత" ను ఉస్చాహ పరిచి, వారి మేధస్సును సమాజానికి ఉపయోగ పడేలా తీర్చి దిద్ది "యువత" ను సమాజ సలహా చర్చలలో చేర్చుకోవాలని అన్ని దేశాలకు తెలియపరుస్తున్నామని ఆయన తెలిపేరు.

'చర్చలు మరియు పరస్పర అన్యొనతా’ అనే లక్ష్యముతోనే శాంతి, మానవహక్కులు మరియు స్వాతంత్రం పొందవచ్హునని వారికి (యువత) తెలియచెప్పాలని చెప్పేరు.

దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా జూలై 31 నుండి ఆగస్టు 13 వరకు ‘5 వ ప్రపంచ యూత్ కాంగ్రెస్స్’ ని ఇస్తాంబుల్ నగరంలోనూ, ఆగస్టు 24 నుండి 27 వరకు మెక్సికో నగరంలోనూ , మరియు ఆగస్టు 24 నుండి 26 వరకు సింగపూర్‌లో 'యూత్ ఒలింపిక్స్' జరపబోతున్నట్లు కూడా ఆయన తెలిపేరు.

కనుక యువతలారా ఈ ప్రపంచ భవిష్యత్తు మీ చేతుల్లొనే ఉన్నదని గ్రహించి, మీరు మీ మీ సమాజాలలో, అరాచకాలు దుస్ ప్రయూగాలు జరగకుండా శాంతియుతంగా మీ సమాజాన్ని, మీ తొటి ప్రజని కాపడుకుంటూ శాంతియుత వాతావర్ణాని కొసం పాటుపడండి.

మీకు ఎప్పుడూ జయమే కలగాలని ఆశిస్తున్నాను.

Wednesday, December 23, 2009

అమెరికాలొ భారతీయుల ఘణత

అమెరికాలొ భారతీయుల ఘణత

ప్రపంచములోని పలు మూలల నుండి పలు దేశస్తులు అమెరికా వెళ్ళి పనిచేస్తున్నారు.....అలా వెళ్ళిన దేశస్తులలొ భారతీయులు తమ శక్థి సామర్ధ్యాలని చూపించి వారు పని చేస్తున్న సంశ్తలకు లాభాలు చేకూరుస్తూ వారికని ఒక పేరు తెచ్హుకుని , అదే సంశ్తలలొ ప్రధానమైన పదవుల్లొ నియమించబడటం ఒక ఘణతే కదా.

అమెరికాలొ ఎంతోమంది విదేశేయులు పని చేస్తున్నా ఒక్క భారాతీయులే ముందడుగు వేస్తున్నారని ప్రపంచంలొనే పేరుప్రఖ్యాతలు తెచ్హుకున్న అమెరిక్కలొని ఆంగ్ల పత్రిక ఫొర్బెస్ (FORBES) చెప్పడం ఏంతో గర్వంగా ఉన్నది.
దీనికి ముఖ్య కారణం వారి పెద్ద చదువులు, అంగ్ల భాషా నైపుణ్యం మరియు కష్తపడి పనిచేయడమే నని ఆ పత్రిక తెలిపింది. పది సంవష్తరాల క్రితం భారతీయులు మామూలు పదవుల్లొ మాత్రమే ఉండేవారు, కానీ ఈ రొజు వారు వారి పనితన్నాని చూపించి కష్టపడి ప్రధాన పదవులకు ఎదిగేరు. ఇక పెద్ద పదవులకు ఆశించే అమెరికెన్లు కూడా భారతీయులు నడిచిన బాటలో నడవడమే కాకుండా వారికంటే కూడా ఎక్కువ కష్టపడవలసి వస్తుందని ఫొర్బెస్ పత్రిక కో-ఎడీటర్ చెప్పేరు.


అలా కష్టపడి ఉన్నత పదవులలో వున్న ముఖ్యమైన భారతీయులలో అతి ముఖ్యమైనవారు వీరు:
1) శ్రీమతి ఇందిరా నూయీ..........పెప్సిక (PepsiCo)
2)శ్రీ నీల్ కాష్కరి.....టార్ప్ ఫ్య్నానాన్సియల్ ఫండ్ (Tarp Finacial-rescue Fund) (వీరు త్వరలో పింకో (Pimco) లో చేరబోతారట)
3) విక్రం పండిట్.....సిటీగ్రుప్ (Citi Group)
4) ఫ్రాన్సిస్కో డిసొషా....కాగ్నిసెంట్ టెక్నాలజీ సల్యూషన్స్ (Cognizant Technology Solutions)
5) షాంతం నారాయన్....అడోబ్ సిష్టంస్ ((Adobe Systems)
6) సూర్యా మహోపాత్ర.....క్వస్ట్ డయగ్నొస్టిక్స్ (Quest Diagnostics)
7) దినేష్ పలివాల్.....హర్మాన్ ఇంటర్నేషనల్ (Harman International)
8) జై పి. నాగర్ కట్టి.... సిగ్మా-ఆల్ డ్రిచ్. (Sigma-Aldrich)
9) అభిజిత్ తల్వాల్కర్...ఏల్.ఏస్.ఐ. (L.S.I)


వీరే కాక మరెందరో భారతీయులు అమెరికాలొ పనిచేస్తూ అటు అమెరికాకి - ఇటు భారత దేశానికి పేరు ప్రఖ్యాతలు తెస్తున్నారు.

వారందరికీ ఇవేనా జొహార్లు.

Tuesday, December 22, 2009

ఈ విషయంలో మాత్రం రాజకీయ నాయకులందరూ ఏకగ్రీవం

ఈ విషయంలో మాత్రం రాజకీయ నాయకులందరూ ఏకగ్రీవం

ఇకమీదట మంత్రులు వారితో పాటు ఎంతమందినైనా (బంధువులను కూడా) విమానంలొ ఎక్కడికైనా (మన దేశంలోనే సుమా) ఉచితంగా తీసుకొనివెళ్ళవచ్హు. ఈ మేరకు రాజ్య శభలో బిల్లు ప్రవేసపెట్టేరు. ఈ బిల్లుని చర్చకు తీసుకొకుండానే రాజ్య శభ శభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ బిల్లు పై తమ ఆమోదం తెలిపేరు. ఈ బిల్లు లోక్ శభలొఈనెల 18 న ఏకగ్రీవంగా అంగీకరించబడింది.

మీరు ఏ విధంగానైన మంత్రులకు బంధువైతే మీరు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపొయినట్లే.

నిన్న బిల్లులొని ముఖ్య అంశములు ఇవి:
1) మంత్రులు వారికి తోడుగా వారి మంత్రిత్వ శాఖలొని అధికారులనే కాక తమ బంధువులని కూడా ఊచితంగా విమానంలో (మన దేశం లొ మాత్రమే) తీసుకుని వెళ్ళవచ్హు.


2) మంత్రులు వారితో పాటు ఎంతమంది అధికారులనైనా మరియు బంధువులనైనా తీసుకుని వెళ్ళవచ్హు.

3) మంత్రి భార్యా మరియు మంత్రి గారి పిల్లలు, ఆయన లేకుండా కూడా ఉచితంగా విమానంలో ప్రయాణం చేయవచ్హు.

ఈ బిల్లు రెండు శభలలోను ఎవరి యెదిరింపు లేకుండా ఆమోదించబడింది.


భారతదేశపు ప్రజల పన్ను రుసుము (టాక్స్ మనీ) ఎలా ఖర్చు చేయబడుతోందో వింటుంటే ........సొమ్ము ఒకరిది, సొకు ఒకరిది అనే సామెత గుర్తుకు వస్తొంది .........కదా!?

Monday, December 21, 2009

"అవతార్" సినిమాలో చూపించిన అన్య గ్రహాలు కొంత కాలంలొ నిజ జీవితం లొ నిజం కావచ్చు ......గణితశాస్త్రవేత్త.


జేమ్ష్ కేమరొన్ నిర్మించిన "అవతార్" సినిమాలో చూపించిన అన్య గ్రహాలు కొంతకాలనికి నిజమయ్యే అవకాశం ఉన్నదని అమెరికా కు చెందిన ప్రముఖ గణిత సాస్త్రవేత్త తెలిపేరు. అ సినిమాలొ చూపించినట్లుగానే కొన్ని అన్య గ్రహాలు భూ మండలాన్ని చుడుతున్నాయని, కొన్నాల్లకు అవి మన నిజ జీవితంలొ కనబడతాయని కేంబ్రిడ్జె లొని గణిత సాస్త్రవేత్త లీసా కల్టేనగర్ తెలిపేరు. ఆయన కనుగొంట్టున్న టెలిస్కొప్తో వీటిని చూడటానికి సాద్ద్య పడుతుందని ఆయన చెప్పేరు. "అవతార్" సినిమాలొ చూపించిన ఆల్ఫా సెంచూరియన్-ఏ అనే నక్షత్రం మా గణితానికి ఎంతో సహకరిస్తుందని ఆయన తెలిపేరు.

మధుమేహ (సుగర్ లేక డియబిటీస్) వ్యాధి కి భారత దేశమే ప్రపంచ రాజధాని......డబుల్యు. హ్చ్. ఓ. (W.H.O)


భారతదేశంలొ 2000 సంవష్ట్టరంలొ సుమారు 32 మిలియన్ల ప్రజలు మధుమేహ వ్యాధితొ భాద పడుతూండేవారు. 2030 నాటికి ఆ శంఖ్య 80 మిలియన్లు గా పెరిగే అవకాసం ఉన్నదని డబుల్యు. హ్చ్. ఓ ప్రచురించిన ఒక ప్రకటనలొ వెలువడించింది. భారతదేశం లొనే మధుమేహ వ్యాధితొ బాధ పడే వారి శంఖ్యలలొ తమిళనాడు మొదటి శ్తానం లొను గుజరాత్ రెందవ శ్తానం లొను వున్నాయని అందులొ పేర్కొనబడి ఉంది. ఈ వ్యాధిని అరికట్టటానికి భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు మొదలుపెట్టింది.

తెలంగాణా విషయంలొ తొందరపడినది కేంద్ర హొం మంత్రి పి. చిదంబరమే నట!.... ప్రధానమంత్రి వెల్లడి.

ప్రత్యేక తెలంగాణా పోరాటంలొ మావొఇస్ట్ లు చొరబడే అవకాసం ఉన్నదని , టి.అర్.ఎస్. అధినేత కె.సి.అర్. నిరాహార ధీక్షలొ మరణీంచే అవకాసం ఉన్నదనే భయంతో కాంగ్రెస్స్ కోర్ కమిట్టి శభ్యులని ప్రత్యేక తెలంగాణా విషయంలొ పి.చిదంబరం ఒత్తిడి చేసేరని ప్రధాని మన్మొహన్ సింగ్ నిన్న తెలిపేరు. ప్రస్తుతం ఆంద్ర రాష్త్రంలొ జరుగుతున్న ఆందొలనలను ఆపే విధంగా ఒక ప్రకటన కేంద్ర ప్రభుత్వం ఒకటి, రెండు రొజులలొ వెలువడిస్తుందని కూడా ఆయన తెలిపేరు.

Sunday, December 20, 2009

తెలంగాణా విషయంలొ ఎవరు తొందరపడ్డారు?

తెలంగాణా విషయంలొ ఎవరు తొందరపడ్డారు?

కే.సి.ఆర్ గారా? సొనియా గాంధీ గారా? లేక ఆంధ్ర రాష్ట్ట్ర (పార్టీ ల తో పొత్తు లేకుండా)ఎం.ఎల్.ఏ లు మరియూ ఎం.పీ లా?
ఎవరు....ఎవరు తొందరప్పడ్డారు?


ఈ రొజు ఆంధ్ర రాష్ట్ట్రం లొ సాదరణ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు, రాష్ట్ట్రం లొ జరుగుతున్న భారీ నష్టాలకు ఎవరు బాధ్యులు? ఈ ప్రష్నకు ఎవరూ సమదానం చెప్పలేకపొతున్నరు.

కే.సి.ఆర్ గారు చర్చలు జరపకుండానే ఆమరణ నిరాహార ధీక్ష వహించటం కారణమా లేక ఆయన నిరాహార దీక్ష కొనసాగించెటప్పుడు మౌనంగా ఉన్న ఆంధ్ర రాష్ట్ట్ర ఎం.ఎల్.ఎ. లు మరియు ఎం.పీ లు కారణమా?

డిల్లీలొ కాంగ్రెస్స్ కోర్ కమిటీ మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ట్రం లోని రాజకీయ ప్రముఖులు ప్రత్యేక తెలంగాణా రాస్ట్ట్రం కు గాని, కె.సి.ఆర్ అమరణ నిరాహార దీక్షకు గాని ఎదురు చెప్పకపోవడం కారణమా? ఎవరూ ఎదురు చూపలేదని సొనియా గాంధీ గారిని తప్పుపట్టించిన కాంగ్రెస్స్ కొర్ కమిట్టీ కారణమా?

ప్రత్యేక తెలెంగాణా రాష్ట్ట్రానికి ప్రక్రియలు మొదలు పెడతామని డిల్లీ తెలిపిన తరువాత సమైఖ్య ఆంద్రా నే కావాలని రాజకీయ నాయకులు రాజీనామాలు చేయడం, అమరణ నిరాహారధీక్షలు, బంద్ లు నిర్వహించడం ఎవరిని సమాధాన పరచటానికో అర్ధంకావటం లేదు?.

సమైఖ్య ఆంద్రా నా? ప్రత్యేక తెలెంగాణా నా? ఏం జరుగు తుందో తెలియటంలేదు. కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ట్రం లొ జరుగుతున్న ఆందోలనల వల్ల విధ్యార్ధుల చదువులకు ఇబ్బంది కలుగుతున్నది, ఆర్ధీకంగా రాష్ట్ట్రం నష్టబోతోంది, ప్రజలు భయాంద్దొలనతో బ్రతుకుతున్నరు, సాదారణ ప్రజలు, రొజు కూలీలకు వెడుతున్న వారు, పక్క రాష్ట్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్ట్రం కు రాదలచుకున్న వారు, తిరుమలలొ భక్తులు చాలా ఇబ్బందులకు లొనవుతున్నరు.


ఇవన్నీ ఎప్పుడ్డు చక్కదిద్ద్దుకుంటాయి? ....రాష్ట్ట్రం లో శాంతియుత వాతావర్ణానికి ఎవరు ఎవరు పూనుకుంటారు? తెలియటం లేదు? ఎప్పుడు పరిస్తితులు సరిద్దిద్దుకుంటాయ్?

బహుష రాజకీయం అంటే ఇదే కాబొలు?

Saturday, December 19, 2009

వాతావర్ణ కాలుష్యం

వాతావర్ణ కాలుష్యం తగ్గించటానికి ప్రపంచ దేశాలు కొపెన్ హెగన్లొ జరిపిన సదస్సు అంగీకారాలు లేకుండానే ముగిస్తుందని తెలుస్తోంది.

ఇలా జరిగితే ద్వీప కల్ప దేశలకే కాకుండా కోస్తా తీర ప్రదేశాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది.

వాతావర్ణ కాలుష్యానికి ఎటువంటి అంగీకారం తయరుచేసినా అది అభివ్రుద్ది చెందిన దేశాలకు మరియు అభివ్రుద్ది చెందుతున్న దేశాలకు సరిసమముగా వుండాలని భారత దేశం స్పస్టంగా తెలిపింది.

17 రొజులు ఆపకుండా జరిగిన సదస్సులొ ప్రపంచ దేశాల ప్రతినిధులు ఎటువంటి ఏకాభిప్రయానికీ రాలేకపొయరు. డబ్బుగల కొన్ని దేశాలు తమ డబ్బు బలాన్ని ఎరగా చూపించినా వాతావర్ణ కాలుష్యం వలన రాబొవు పరిణామాలను, మన తరువాత రాబొవు వారసులను ద్రుష్టిలో వుంచుకొని అభివ్రుద్దిచెందుతున్న దేశాలు మరియు బీద దేశాలు, అభివ్రుద్దిచెందిన దేశాలు ప్రవేసపెట్టిన ప్రతిపాదనలను తిరస్కరించాయి.

రెండు సంవత్స రాలుగా ఆదుర్దాపడుతున్న అంశంలొ ఇలా జరగడం దురద్రుష్టకరం. దీనికి కారణం డబ్బుగల దేశాలకు, బీద దేశాలకు మధ్య ఒప్పందంలొ చాలా అవకతవకలు వుండటమే.


ఇక అందరూ 2013 లొ జరిగే సదస్సుకోసం ఎదురుచూడవలసిందే. అంతవరకు భూమి ఊష్ణొగ్రతని 2 డిగ్రీలు (సెల్సిస్లొ) తగ్గేట్టట్లు వాతావర్ణ కాలుష్యాన్ని అరికట్టాలని అగ్ర దేశాలు చెప్పటం జరిగింది (కాని ఒప్పందం జరగలేదు).

దీనివల్ల కూడా చాలా దేశాలకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న ఊష్నొగ్రతని కనీసం 3 డిగ్రీలన్నా తగ్గిస్తేనే ఎంతో కొంత లాభం కనబడుతుంది.

Thursday, December 17, 2009

అతి త్వరలొ తెలుగులొ కూడా వెభ్ (ఇంటెర్ నెట్) అడ్రెస్సులు


బారతధేశములొ సుమారు 900 మిలియన్ల జనాభా ఆంగ్లము తెలియనందువల్ల వారి వారి మాత్రు భాశలలొ మాట్లాడటం, చదవటం మరియు వ్రాయడం చేస్తున్నరు. సినిమాలు మరియు టెలివిషన్లు వారి మాత్రు భాశల్లొ వస్తూవుండటం వారికి కొంతవరకు ఉపయోగకరంగా ఉన్నది. కానీ వీరికి ఇంటెర్ నెట్ అందుబాటులొ లేకపోవటం ఒక కొరతగానే ఉండిపొయింది.

ఇంటెర్ నెట్ ప్రపంచములొ బారతధేశపు ప్రజల వెభ్ సైయుట్లు సుమారు 100 మిలియన్ల దాకా ఉన్నాయి. ఇందులొ సుమారు 1000 దాకా వారి వారి మాత్రు భాశలలొ ఉన్నా వాటి పేర్లు మాత్రం ఆంగ్లములొనే ఉన్నాయి. ఇది చాలామందికి కష్టంగానే ఉన్నది.

కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలొని ఆంగ్లము రాని వారు ఇంటెర్ నెట్ ఉపయోగించుట కొరకు హిందీ, తెలుగు మరియు ఇతర 22 బారతధేశ భాశల్లొ ఇంటెర్ నెట్ అడ్రెస్సులు ప్రచురించుటకు ఇంటెర్ నెట్ కార్పొరేషన్ అంగీకరించిం ది.

బహుస ఇంకమీదట వెభ్ పేరు రిజిస్టర్ చెసుకునేవారికి .కాం (.com) బదులు .బారత్ (.bharat) అని ఇస్తారని చెపుతున్నారు.

Tuesday, December 15, 2009

అభివ్రుద్ది చెందిన దేశాలే వాతావరణ కాలుష్యానికి ముఖ్య కారకులు

ఆ దేశాలే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించటానికి ఎక్కువ బాధ్యత, క్రుషి వహించాలి2010 అధిక ఉస్నొగ్రతతొ రికార్డు ష్రుస్టిస్తుందని కొపెన్ హెగన్లొ శాస్త్రవేత్తలు తెలిపేరు.


కాలుష్యానికి కారణమైన వాయువులను అధిఖ సంఖ్యలో వెలువడిస్తున్న 10 ముఖ్యమైన దేశాల పట్టీ .....ఇదిగో (according to per-capita greenhouse gas (GHG) emissions)

1) అమెరికా.............. 19.10 టన్నులు
2) కెనడా............... 17.37 టన్నులు
3) రష్యా................. 11.21 టన్నులు
4) దక్షిణ కొరియా........ 10.09 టన్నులు
5) జెర్మనీ................ 9.71 టన్నులు
6) జేపాన్.................. 9.68 టన్నులు
7) ఇంగ్లాండ్... .............8.60 టన్నులు
8) దక్షిణ ఆఫ్రికా.........7.27 టన్నులు
9) ఫ్రాన్సె...........5.81 టన్నులు
10) చ్యైనా...........4.57 టన్నులు

వాతావర్ణ మార్పులపై కొపెన్ హేగన్లొ జరుగుచున్న సదస్సులొ, అన్ని దేశాలు వాతావర్ణ కాలుష్యాన్ని తగ్గించటానికి తమ తమ లక్ష్యాలను వెల్లడిస్తూ, అందరికీ ఆమొదకరమైన ఒప్పందం తయారుచేయమంటున్నారు.

ఇంతకుముందు చేసిన కయిటొ (KYOTO) ఒప్పందం 2012 తొ ముగియనున్నది.

ఇప్పుడు కొపెన్ హేగన్లొ జరుగుతున్న సదస్సులొ ఈ సదస్సు కొసం ఒక ఒప్పందం తయరు చేయబడింది. ఈ ఒప్పందంలొ 2025 లోపు ప్రతి ఒక్క దేశము ఏంతెంత కాలుష్యాన్ని తగ్గించాలో టూకీగా నిర్నయించబడి ఉన్నది. ఈ ఒప్పందం మీదే అన్ని దేశాలు చర్చిస్తున్నయి.

ఈ ఒప్పందం అభివ్రుద్ది చెందిన దేశాలకు అనుకూలంగా మరియు అభివ్రుద్ది చెందుతున్న దేశాలకు నస్టపరంగా ఉందని ఇండియాతో సహా అనేక అభివ్రుద్ది చెందుతున్న దేశాలు ఈ ఒప్పందాన్ని మార్చాలని పట్టుబడుతున్నరు. వాతావరణ కాలుష్యానికి అభివ్రుద్ది చెందిన దేశాలే కారణం కాబట్టి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అభివ్రుద్ది చెందిన దేశాలే ఏక్కువ పాటుపడాలని వీరు ఒత్తిడి తెస్తున్నారు.

ఏది ఏలా వున్నా కొపెన్ హేగన్ సదస్సు ఈ నెల 18 న పూర్తి అవుతుంది.

ఈ లొపు అన్ని దేశాలు చర్చించుకొని ఒక ఒప్పందం చేసుకుంటే అది ఈ భూమిని కాపాడుతుంది , పెరుగుతున్న ఉష్నొగ్రతని తగ్గిస్తుంది.

ఆ మంచి రొజు కొసం అందరం ఏదురుచూద్దం.