Tuesday, May 23, 2017

పూర్వీక సంచార గ్రంధాలయాలు.....ఫోటోలు

ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశం గ్రంధాలయము. తెలుగులో గ్రంధాలయాల కొరకు ఉద్యమము నడిపి, దానిని వ్యాప్తి చేసి గ్రంధాలయ పితామహుడు అనే పేరు పొందిన వారు అయ్యంకి వెంకట రమణయ్య. అతని తదనంతరం ఉధ్యమాన్ని ఉధృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.

గ్రంధాలయాలు సమజానికి ఎంతో మేలు చేస్తాయి. గ్రంధాలయాల ద్వారా ఎందరో మేధావులు విజ్ఞానాన్ని సంపాదించి మహోన్నతులయ్యారు. విధ్యార్ధుల్లో దాగి ఉన్న సృజనాతమకత, మేధసుును పెంపొందించుకునేందుకు గ్రంధాలయాలు దోహదపడతాయి.

ఇంటర్నెట్ ఉపయోగం పెరిగిన ఈ రోజుల్లో పుస్తకాలకొరకు ప్రజలు అంతర్జాలంలో అంతర్జాల గ్రంధాలయాలను వెతుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఉచితంగా పుస్తకాలను చదువుకునే పద్దతి పోయి ఇప్పుడు గ్రంధాలయాలను లాభాలకోసం వాడుకుంటున్నారు.

ప్రపంచం అభివ్రుద్ది చెందిన ఈ కాలంలో కన్నా పూర్వం పుస్తకాలను ఒకేచోట చేర్చి సంచార గ్రంధాలయాలను ఏరపరచిన ఆ నాటి వ్యక్తులు ఎప్పటికీ గొప్పవారే.

Monday, May 22, 2017

యు.ఎఫ్.ఒ ఆకారాలలో భవనాలు....ఫోటోలు

గుర్తించబడని ఎగురుతున్న వస్తువును (సాధారణంగా అన్ ఐడెంటిఫైడ్ ఆబెజక్ట్ అంటారు) యు.ఎఫ్.ఒ అని పిలుస్తారు. సంయుక్త రాష్ట్రాల వాయుదళం 1952 లో ఈ పదాన్ని ప్రవేశపెట్టింది. ప్రసిద్ద సంస్క్రుతి తరచుగా యు.ఎఫ్.ఒ ను గ్రహాంతరవాసి రోదసి నౌకకి పర్యాయపదంగా వాడుతోంది. ఈ విషయిం చుట్టూ కల్పితాలు మరియు జానపద కధలు ఉద్భవించాయి. ప్రైవేట్ పైలట్ అయిన కెన్నత్ ఆర్నోల్డ్ 1947 లో ఇచ్చిన నివేదిక నుండి మొదటగా, విస్తారంగా ప్రచారం జరిగిన యు.ఎఫ్.ఒ వీక్షణ తరువాత యు.ఎఫ్.ఒ నివేదికలు చాలా తరచుగా రావటం మొదలయ్యింది మరియు రెిండు ప్రసిద్ద పదాలు అయన "ఫ్లయింగ్ సాసర్" మరియు "ఫ్లయింగ్ డిస్క్"లు ఉద్భవించాయి. అప్పటి నుండి లక్షల మంది ప్రజలు తాము యు.ఎఫ్.ఒ లను చూశామని నివేదించారు. నిజంగా ఇవి ఉన్నాయో, లేవో తెలియదు. కానీ ఇవి ఉన్నట్లు నమ్మే ప్రజలు చాలామంది ఉన్నారు. వీటిని చూశామని చెప్పిన వారిలో కొంత మంది ప్రముఖులు కూడా ఉన్నారు. వారు చూశేమని చెప్పి వాటి ఆకారమును కూడా వివరించారు. దీనితో వీటి మీద ఆశక్తి గల కొందరు ఆ ఆకారాలలో భవనాలు/ ఇళ్ళు కట్టుకున్నారు.

The Flying Saucer House - Chattanooga, Tennessee, USA.
The Circus - Astana, Kazakhstan.
Sanzhi UFO houses - New Taipei City, Taiwan.
Pensacola Beach’s Spaceship House – Florida, USA.
Universum Science Center - Bremen, Germany.
Chemosphere House - Los Angeles, California, USA.
The Buzludzha Monument – Bulgaria.
Niterói Contemporary Art Museum - Rio de Janeiro, Brazil.

Friday, May 19, 2017

పర్యాటక ప్రదేశాలుగా మారిన ఒకప్పటి సముద్రపు కోటలు....ఫోటోలు

మీరు చూడబోయే ఒకప్పటి సముద్రపు కోటలు దేశ బద్రత కోసం కట్టబడినవి. క్రమేపి యుద్దాలు తగ్గిపోవటంతో అవి పర్యాటక ప్రదేశాలుగా మారిపోయినై.

Solent Forts, No Man's Fort, England
Fort Jefferson, Dry Tortugas National Park, Florida
Maunsell Sea Forts, England
Fort Boyard, France
Fort Denison, Australia
Fort Alexander, Russia
Fort Sumter, South Carolina
Murud-Janjira Fort, India
Flakfortet, Denmark
Fort Pampus, Netherlands